
ఓట్లడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది..
రాష్ర్ట మంత్రి హరీష్‌రావు
వరంగల్‌లో భారీ బైక్ ర్యాలీ
ఖిలా వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందని.. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు ఆ హక్కు లేదని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి జంక్షన్ నుంచి ఫోర్ట్‌రోడ్డు, శంభునిపేట జంక్షన్, ఉర్సుగుట్ట కరీమాబాద్ మీదుగా వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్ వరకు టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో నన్నపనేని నరేందర్‌ను కూర్చోబెట్టుకుని మంత్రి హరీష్‌రావు స్వయంగా వాహనం నడపగా.. మరో వాహనంపై ఎమ్మెల్యే కొండా సురేఖను కూర్చోబెట్టుకుని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వాహనం నడిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 16నెలల పాలనలోనే సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హమీల్లో 98శాతం అమలుచేయగా.. అంతకుముందు రాష్ట్రాన్ని పాలించిన ఏ పార్టీ నేతలు కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బొడకుంట్ల వెంకటేశ్వర్లుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.