బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే..: గుత్తా | Gutta comment about BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే..: గుత్తా

Published Wed, Nov 18 2015 3:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే..: గుత్తా - Sakshi

బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే..: గుత్తా

సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు లాభం చేయడానికే బీజేపీ వ్యవహరిస్తున్నదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు.  గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి ఓటువేస్తే మురిగిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. వరంగల్‌లో పోటీ చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు పాలన విషయాల్లో పొగుడుకుంటూనే ఎవరికివారు ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీలు పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నాయని గుత్తా ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలు వరంగల్‌లో పోటీచేస్తున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement