
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేన రెడ్డి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తండ్రి లాగా ఆడిన మాట తప్పొద్దని చురకలంటించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించిన కేటీఆర్ వెనక్కు తగ్గొద్దని అన్నారు. ‘తెలంగాణ ఏర్పాటయ్యాక అమెరికా నుంచి ఇక్కడికొచ్చి రాజకీయాలు చేస్తున్నవ్. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ అమెరికా వెళ్లేందుకు సిద్ధంగా ఉండు’ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్, కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ గద్దె దిగక తప్పదని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకుల మాటలపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ‘మీ నాన్న కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. దళితున్ని సీఎం చేస్తానన్నాడు. గిరిజనులకు మూడెకరాల భుమిస్తానన్నాడు. టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తానన్నాడు’ ఒక్క హామీనైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment