nallu indrasena reddy
-
నాకు పదవొస్తే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ పదవిలో తనను నియమిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకంత భయాందోళనలకు గురై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదని త్రిపుర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ పక్షాన ఎన్నికల సన్నద్ధతలో కీలకంగా వ్యవహరిస్తున్న తనను మరో రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే సంతోషపడాలే కాని భయంతో ఉన్నారంటే ఇక్కడున్న పరిస్థితులు అర్థమవు తున్నాయన్నారు. ఇప్పటికే బీసీలు బీజేపీ వైపు ఉండగా, రెడ్డిగా తనకు ఈ పదవి ఇవ్వడం వల్ల ఈ సామాజికవర్గం ఓట్లు కూడా బీజేపీకే పడతాయనే భయంతో కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్‌పై వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదన్నారు. తనకు ఈ పదవి లభించడం పట్ల సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఫోన్ చేసి అభినందించడం, వారిలో నూతనోత్సాహం వెల్లివిరియడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అంకితభావంతో పనిచేస్తే బీజేపీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందనడానికి గవర్నర్‌గా తన నియామకం స్పష్టం చేస్తుందన్నారు. నియామకపత్రాలు అందాక ఈ నెల 24న లేదా 26న పదవీబాధ్యతలను స్వీకరించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. సాక్షి: మీ రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు, గుర్తుండిపోయే సందర్భాలు ఏమిటి? ఇంద్రసేనారెడ్డి: 1983 అసెంబ్లీ ఎన్నికల్లో (33 ఏళ్ల వయసులో) నాటి హోంమంత్రి కె.ప్రభాకర్‌రెడ్డిని, 1985 ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావును ఓడించి సంచలనం సృష్టించాను. 1985లో గెలిచాక కొత్త అసెంబ్లీ భవనంలోకి మారాక జరిగిన తొలిరోజు సభలో నేను వేసిన మొట్టమొదటి ప్రశ్న మంత్రులు తమ ఆస్తులను ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరాను. దానిపై అప్పటి సీఎం ఎన్టీరామారావు ఆవేశంగా స్పందిస్తూ...ఒక్క మంత్రులే కాదు, ఎమ్యెల్యేలంతా కూడా ప్రతీ ఏడాది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన బ్యాలెన్స్ షీటు సమర్పించేలా ఆదేశిస్తామన్నారు. దీనినే ఈసీ కూడా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నామినేషన్లు సమర్పణకు ముందు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. దీనికి నా ప్రశ్నే కారణం కావడం గర్వంగా ఉంది. అసెంబ్లీ కమిటీల్లోనూ కీలకపాత్ర పోషించి కొంతమంది ఉన్నతాధికారులు సైతం తమ తప్పులను సరిదిద్దుకునే పరిస్థితిని కల్పించిన సందర్భాలున్నాయి. సాక్షి: బీజేపీలో పలువురు నేతలు ఎమ్మెల్యే అయ్యాక ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రమోషన్ పొందారు? మీకు అది వెలితి అనిపించిందా ? ఇంద్రసేనారెడ్డి: ఎంపీగా వెళితే మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయొచ్చునని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. 1980లోనే బీజేపీ తరఫున నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చవిచూశాను. ఆ తర్వాత పలుమార్లు ఎంపీగా పోటీచేసినా విజయం సాధించలేకపోయాను. 2014లో చివరిసారిగా భువనగిరి నుంచి ఓడిపోయాక ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగాను. అప్పటి నుంచి సంస్థాగతంగా పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాల సమన్వయం తదితర విషయాల్లో నా రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ట్రబుల్ షూటర్‌గా నిలిచాను. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పార్టీపరంగా పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నాను. సాక్షి: మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? ఇంద్రసేనారెడ్డి : 1968, 69 నుంచి ఏబీవీపీలో, అంతకు ముందు విద్యార్థిగా ఆరెస్సెస్‌లో తిరిగాను. 1975 ఎమర్జెన్సీ విధించాక మీసా కింద అరెస్టయి జైలుకు కూడా వెళ్లాను. 1977లో లోక్‌నాయక్ జయప్రకాశ్ ప్రారంభించిన ఉద్యమంలో భాగస్వామి అయ్యాను. జనతాపార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించాను. 1980లో బీజేపీలో చేరి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1983, 1985, 1999లలో మలక్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను. బీజేఎల్పీనేతగా వ్యవహరించా. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నా. ప్రస్తుతం జాతీయకార్యవర్గసభ్యుడిగా కొనసాగుతున్నాను. మొత్తంగా 46 ఏళ్లుగా బీజేపీ, జనతాలతో అనుబంధం ఉంది. సాక్షి: కీలకమైన ఎన్నికల సందర్భంలో గవర్నర్ పదవి రావడంపై ఏమంటారు? ఇంద్రసేనారెడ్డి: ఈ పదవి ఇంకా రెండు, మూడునెలలు ఆలస్యంగా వచ్చి ఉంటే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కృషిలో భాగస్వామినై ఉన్నాను. వివిధ కీలకబాధ్యతలను నిర్వహిస్తూ పార్టీకి ఉపయోగపడుతున్నాను. సాక్షి: రాజ్యాంగబద్ధ పదవిని ఎలా భావిస్తున్నారు ? ఇంద్రసేనారెడ్డి : నా మొత్తం రాజకీయజీవితంలోని అనుభవసారాన్ని అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వెచ్చిస్తాను. రాజ్యాంగ పరిధిలో ఏ మేరకు మరింత మెరుగ్గా పనిచేయగలను, ప్రజల అభ్యున్నతికి ఎలా కృషి చేయగలను అన్నవే నా ముందున్న లక్ష్యాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం అందుకు పనికొస్తుందని విశ్వసిస్తున్నాను. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. ఇంద్రసేనారెడ్డి నియామకంపై సీఈసీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో, రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. వివరాల ప్రకారం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్.. సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్‌గా నియమించడం సరికాదని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. ఇది ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని తెలిపింది. ఈ క్రమంలో గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్.. సీఈసీని కోరింది. ఇదిలా ఉండగా.. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా, ఒడిశా గవర్నర్‌గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియామకమయ్యారు. అలాగే, ఒడిశా గవర్నర్‌గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1956లో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమేకాగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. 2003-07 వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి తరువాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, జార్ఖండ్ బీజేపీ నేత అయిన రఘుబర్ దాస్ 2014-19 మధ్య ఆ రాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేశారు. శిబు సొరెన్ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్ -
ఇంద్రసేనారెడ్డి ఏం చేస్తున్నారు?.. బీజేపీ హైకమాండ్ లైట్ తీసుకుందా?
ఎంత సీనియర్ నాయకుడికైనా కొంతకాలం తర్వాత రాజకీయంగా ముగింపు దశ వస్తుంది. ఒక్కసారి కాలపరిమితి ముగిసిపోతే తిరిగి వెనక్కి రావడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కమలం పార్టీలో ఓ సీనియర్ నేత ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నేతను కాషాయ పార్టీ హైకమాండ్ పట్టించుకోవడంలేదట. గతం ఘనం.. వర్తమానం నిశబ్దం కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ అయినా కమలం పార్టీ అయినా ఎందరో మహా మహులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు నాయకులకు ఎక్స్పైరీ డేట్ త్వరగా వచ్చేస్తుంది. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి అదే పరిస్థితి ఎదురయ్యిందట. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినపుడు అసెంబ్లీలో పార్టీ లీడర్‌గా ఆయన సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్‌నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ నేతను కమలదళం పెద్దలు లైట్ తీసుకుంటున్నారట. పెద్ద పదవుల్లో తోటి వాళ్లు ఇంద్రసేనారెడ్డి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా అవకాశాలు వచ్చాయి. ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ లక్ష్మణ్‌కు.. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా ప్రమోషన్ కల్పించారు. వెంకయ్య నాయుడితో పాటు విద్యార్థి దశ నుంచి ఇంద్రసేనారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో పనిచేశారు. 73 ఏళ్ల వయస్సున్న ఇంద్రసేనారెడ్డికి పార్టీలో ఇక భవిష్యత్ లేదా? అన్న చర్చ సాగుతోంది. ఆయన సీనియారిటీ, అందించిన సేవలకు పార్టీ నుంచి ఎలాంటి గౌరవం లభించదా అనే డిస్కషన్ నడుస్తోంది. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! గుర్తిస్తుందా? పదవులిస్తారా? ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒకరోజు ముందు ఇంద్రసేనారెడ్డికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు. పార్టీలో చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు. అయితే కొత్తగా పార్టీలో చేరేవారికి భరోసా ఇవ్వడం, చేరికల కమిటీ సభ్యులను ఒప్పించడం తన వల్ల కాదని ముక్కుసూటిగా చెప్పేశారాయన. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి మాత్రం నిత్యం టచ్‌లో ఉంటూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అవినీతిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరి భవిష్యత్‌లో ఆయన సేవలను పార్టీ వాడుకుంటుందో ? వదిలేస్తుందో? కాలమే నిర్ణయిస్తుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఇంద్రసేనుడికి గవర్నర్‌గిరీ?
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నల్లు ఇంద్రసేనారెడ్డికి త్వరలోనే గవర్నర్ పదవి దక్కనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హరియాణా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియగానే ఈ నియామకం జరగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఇంద్రసేనారెడ్డి దాదాపు ఐదు దశాబ్దాలపాటు పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పదవిని కట్టబెట్టాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేత, 40 ఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకుని, క్రమశిక్షణతో పనిచేసిన డా.కె.లక్ష్మణ్‌కు యూపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించిన విషయం విదితమే. లోక్‌సభలో తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీకి నలుగురు ఎంపీలున్నా, రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దల సభలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తేందుకు, టీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు, రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మున్నూరుకాపు సామాజికవర్గం మద్దతును కూడగట్టేందుకు దూరదృష్టితోనే ఈ ఎంపిక జరిగిందని తెలుస్తోంది. లోక్‌సభ బరిలో మురళీధర్‌రావు! తెలంగాణకే చెందిన మరో ముఖ్యనేత, ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇన్‌చార్జీగా ఉన్న మురళీధర్‌రావును ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందువల్లే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపని లేదా ఆ అవకాశం లభించని ఇతర సీనియర్ నేతలకు కూడా జాతీయస్థాయిలో వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిసింది. వీరిలో దళితవర్గానికి చెందిన చింతా సాంబమూర్తి ఉన్నట్లు సమాచారం. వాజ్‌పేయి హయాంలో సఫాయి కర్మచారీ కమిషన్ సభ్యుడిగా సాంబమూర్తి పనిచేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీలో జాతీయపార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర నాయకులు సమావేశమైన సందర్భంగా వివిధ విషయాలపై స్పష్టతనిచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
‘బండి’ పాదయాత్ర.. బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలోకి త్వరలో పలు పార్టీల నాయకుల చేరికలుంటాయని పార్టీ సీనియర్ నేత, పార్టీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. వచ్చేనెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ చేరికలుంటాయన్నారు. శనివారం పార్టీ నాయకులు స్వామిగౌడ్, బీవీ మోహన్‌రెడ్డి, విఠల్, కొల్లి మాధవి, ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందువల్లే అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరికకు యత్నిస్తున్నారని తెలిపారు. -
పాఠశాలలపై దేశద్రోహ కేసులు పెడతాం : బీజేపీ నేత
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పాఠశాలలు విద్యార్థులకు నూరిపోస్తోన్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి పాఠశాలలపై దేశద్రోహ కేసులు పెడతామని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి శుక్రవారం వ్యాఖ్యానించారు. సీఏఏపై కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయని, సీఏఏను వ్యతిరేకిస్తున్నానని కేసీఆర్ పత్రికా ముఖంగా చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. మరోవైపు యూనియన్లను రద్దు చేయడం పట్ల కేసీఆర్‌పై మండిపడ్డారు. యూనివర్సిటీలు, జీహెచ్ఎంసీ, అంగన్వాడీ, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లతో కాకుండా కార్మికులతో కేసీఆర్ భేటీ అయ్యారని, ఇదే పద్ధతిలో కేంద్రం ముఖ్యమంత్రితో కాకుండా ఎమ్మెల్యేలతో మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. యూనియన్ల రద్దు కుదరదని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కూడా ఒప్పుకున్నాడని గర్తు చేశారు. కార్మికులపై కేసీఆర్ వ్యతిరేక ధోరణిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. -
‘ఆయన భయపడి డైపర్స్ వేసుకుని తిరుగుతున్నాడు’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఇంద్రసేనా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. డిసెంబర్ ఏడవ తేదీ తర్వాత డైపర్స్ కూడా దొరకవని వ్యంగ్యంగా మాట్లాడారు. బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతా అని సూటిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాక్యానించారు. -
‘కేటీఆర్ ఓడిపోతే... మాట తప్పొద్దు’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేన రెడ్డి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తండ్రి లాగా ఆడిన మాట తప్పొద్దని చురకలంటించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించిన కేటీఆర్ వెనక్కు తగ్గొద్దని అన్నారు. ‘తెలంగాణ ఏర్పాటయ్యాక అమెరికా నుంచి ఇక్కడికొచ్చి రాజకీయాలు చేస్తున్నవ్. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ అమెరికా వెళ్లేందుకు సిద్ధంగా ఉండు’ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్, కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ గద్దె దిగక తప్పదని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నాయకుల మాటలపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ‘మీ నాన్న కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. దళితున్ని సీఎం చేస్తానన్నాడు. గిరిజనులకు మూడెకరాల భుమిస్తానన్నాడు. టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తానన్నాడు’ ఒక్క హామీనైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు. -
శవపేటికలో ఉన్న టీడీపీకి...
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ అరాచక పాలన కారణంగా మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ సీనియర్ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును నాలుగన్నరేళ్లుగా దుబారా చేస్తోందని విమర్శించారు. కలర్ బాగాలేదని కాన్వాయ్ మార్చుకున్న కేసీఆర్ కారణంగా హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టేందుకు కూడా డబ్బులు లేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు బాగుపడాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒకే గూటి పక్షులని ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు. శవపేటికలో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ ఎందుకు జీవం పోస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. అనైతిక పొత్తులతో ఏర్పడిన కూటమిని ప్రజలు అంగీకరించరని ఆయన పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్: నల్లు ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తప్పుడు హామీలతో సీఎం కేసీఆర్ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని బీజీపీ నాయకు డు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉద్యోగులు ప్రశ్నిస్తే వారిని తిట్టి పంపిస్తున్నారని, రైతుబంధు పథకం డబ్బులు రాలేదని అడిగితే అధికారులు దొంగ సాకులు చెప్తున్నారని విమర్శించారు. రైతుబంధు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో వేయాల్సి ఉన్నా ఇప్పటివరకు వేయలేదని, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవా? లేక దివాళా తీసిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రం అని చెప్పే కేసీఆర్ ఎందుకు ఇప్పటివరకు నగ దు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింటింగ్ ప్రెస్‌లో పేరుకుపోయాయని, వారికి ఇచ్చే రూ.63 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్కు 15 సీట్లు కూడా రావడం అనుమానమేనన్నారు. ఆపద్ధర్మ సీఎం అయిన కేసీఆర్ గవర్నర్ దగ్గర రెండు గంటలపాటు ఎందుకు ఉన్నారని, ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. ప్రభు త్వ అధికారులను తీసుకెళ్ళకుండా ఒక్కరే ఎందుకు వెళ్లారని, ఆ విషయాలు చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
‘కేసీఆర్ హయాంలో మత సామరస్యం దెబ్బతిన్నది’
సాక్షి, వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హయాంలో మత సామరస్యం దెబ్బతిందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం వరంగల్ శివసాయి ఆలయ పూజారిపై జరిగిన దాడిపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘వరంగల్‌లోని శివసాయి ఆలయంలో దేవళ్ల సత్యనారాయణ శర్మ అనే పూజారి అనేక రోజుల నుంచి పూజలు చేస్తున్నారు. ఆయన్ని ముస్లిం వ్యక్తి విచక్షణ రహితంగా కొట్టాడు. పూజారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లి నిన్న చనిపోయాడు. సకాలంలో స్పందిస్తే తాను బ్రతికే వాడు. రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా దేవాలయాలకు రక్షణ ఉందా?. దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ మరో ఎనిమిదో నిజాం. ముస్లింలకు అండగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కేవలం బీజేపీకే సాధ్యం. అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. ఓబీసీ వర్గాల పొట్టకొట్టడమే కాంగ్రెస్ వైఖరిలా కనపడుతోంది. అధికారం కోసం నీచరాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సామరస్యత సాధ్యమయ్యేది కేవలం బీజేపీకి మాత్రమే. మన రాష్ట్ర గవర్నర్ అందర్నీ కలుస్తారు. కానీ స్వామిజీలు కలుస్తామంటే కూడా గేటు బయటనుంచే పంపిస్తారు. గవర్నర్ తీరును ఖండిస్తున్నా’’ అని అన్నారు. -
సీఎం అయితే కేసులు పెట్టకూడదా?
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మీద బీజేపీ తెలంగాణ అగ్రనేత నల్లు ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలను వాడుకోవడంలో, సమస్యలను పక్కదోవ పట్టించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు ఇప్పుడే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని, మోదీ సర్కారు నుంచి బయటికి వస్తే కక్షతో నోటీసులు ఇచ్చారని మాట్లాడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శమని ధ్వజమెత్తారు. ఏపీలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు మోదీ మీద నెపం నెడుతున్నారని మండిపడ్డారు. బాబుపై 17 కేసులు ఉన్నాయని, నాట్ బిఫోర్ మీ అనే పదం వాడి కేసు కొట్టేయించుకున్నాడని ఆరోపించారు. న్యాయవ్యవస్థలను వాడుకోవడంలో బాబు మించినోడు లేరని వ్యాఖ్యానించారు. బాబ్లీ కేసులో ఇదివరకే 37 సార్లు నాన్‌బెయిలబుల్ వారంట్లు ఇచ్చారని, ఇది 38వ నాన్‌బెయిలబుల్ వారంట్ అని వెల్లడించారు. గతంలో 37 సార్లు నాన్ బెయిలబుల్ వారంట్లు తీసుకోకుండా రకరకాల పద్ధతుల్లో ఆపుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ, మోదీలను తిట్టడం కోసం దీన్ని వాడుకుంటున్నాడని చెప్పారు. బాబు ఏపీ సీఎం అయ్యాక, కక్షతో ఏపీలో మా నాయకులు, కార్యకర్తల మీద ఎలా కేసులు పెట్టించారో మాకు తెలుసునని అన్నారు. ఉద్యమాల్లో, నిరసన కార్యక్రమాల్లో కేసులు వెయ్యడం సహజమని, దాన్ని రాజకీయాలకోసం వాడుకోవడం తగదన్నారు. సీఎం అయితే కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలోనే ఉమాభారతితో సహా అనేక మంది సీఎంల మీద కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ, ఇంకా ఉంది అని చెప్పుకోవడం కోసమే ఇదంతా డ్రామా ఆడుతున్నారని చెప్పారు. కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీని తిట్టడమే నీ(చంద్రబాబు) రాజకీయానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఏపీ ఇంటెలిజెన్స్‌ను వాడుకుని చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణాకు అనుకూలం అని ఆయనే అంటాడు..వ్యతిరేకం అని ఆయనే అంటాడు..తెలంగాణాకు, చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. -
రెండువారాల్లో భూ సర్వే అసాధ్యం
బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: రెండువారాల్లో రాష్ట్రంలోని భూములను సర్వే చేయడం సాధ్యంకాదని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తుగ్లక్‌ను మించిపోయిందన్నారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికీ రిజిస్ట్రార్లు లేరని, అలాగే ఏ ఒక్క శాఖకూ పూర్తిస్థాయి అధికారులు, సిబ్బందిలేరని అన్నారు. ముఖ్యమంత్రి మూడేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూనే ఉన్నారని విమర్శించారు. భూములపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకోమాట మాట్లాడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలను శత్రువుల్లా చూస్తూ, ఏకపక్షంగా వ్యవహరించడం మంచిదికాదని హెచ్చరించారు. సచివాలయానికి రాకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని ధ్వజమెత్తారు. -
కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారు
మధిర : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దహస్థుడని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. దీన్‌దయాళ్ జన్మ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా మధిర దళితకాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్ధాయిలో ఎంతవరకు చేరుతున్నాయో పరిశీలించడం, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించి సమావేశపర్చడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీకి, దేశంలో పర్యటిస్తున్న అమిత్‌షాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేసీఆర్ సోయితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఆదరణను తగ్గించేందుకు సర్వేపేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అటువంటి కుట్రలు, కుతంత్రాలు కేంద్రంముందు సాగవన్నారు. టీఆర్ఎస్కు నిజంగా 111 స్ధానాలు వస్తాయనుకుంటే, దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. సీట్లు రావని తెలిసి తప్పుడు సర్వే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కరెన్సీనోట్ల రద్దు సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదని.. ఆయనను అభినందించలేదా అని ప్రశ్నించారు. మెదడులేనివారే ఇటువంటి విమర్శలు చేస్తుంటారని తెలిపారు. రోడ్ల మంజూరులో నితిన్ గట్కారీకి ధన్యవాదాలు చెప్పలేదా అని ప్రశ్నించారు. మూడు ఒక్కట్లు సీట్లు రావడమంటే పంగనామాలని, తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆ పంగనామాలే పెడతారని ఎద్దేవా చేశారు. దళితులకు సీఎం పదవి ఇచ్చావని ఓటేయ్యాలా, కెజీటు పీజీ విద్య అమలు చేశావని ఓటేయ్యాలా, బీసీల రిజర్వేషన్‌ను తగ్గించి ముస్లింలకు కేటాయించినందుకు ఓటేయ్యాలా, రైతుల పంటలను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులను మూసివేసినందుకు ఓటేయ్యాలా, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయలేదని ఓటేయ్యాలా, నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పినందుకు ఓటేయ్యాలా అని ప్రశ్నించారు. అనంతరం దళిత కాలనీలో ఇంటింటికి పర్యటించి కేంద్ర అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం దళితులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజెపీ జిల్లా ఇంచార్జ్ యాదగిరి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, నాయకులు బాడిశ అర్జునరావు, పాపట్ల రమేష్, భవనం మధుసూదన్‌రెడ్డి, రామిశెట్టి నాగేశ్వరరావు, దుర్గారావు, రామయోగేశ్వరరావు, మహంకాళి శ్రీనివాసరావు, డీవీఎన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్ విమర్శల వెనుక కేసీఆర్: ఇంద్రసేన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మంత్రి హరీశ్‌రావు విమర్శల వెనుక సీఎం కేసీఆర్ ప్రమేయముందని బీజేపీనేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రం క్విం టాల్ మిర్చికి రూ.5వేల చొప్పున మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రకటించడం జోక్ అని, ఇది రైతులకు శఠగోపం పెట్ట డమేనని హరీశ్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర మంత్రిగా కేంద్రాన్ని విమర్శించదలుచుకుంటే, హరీశ్‌రావు సెక్రటేరియట్ నుంచి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఉండేవారన్నారు. టీఆర్ఎస్ కార్యాల యం నుంచి ఈ విమర్శలు చేయడమంటే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని బద్నామ్ చేయడం తప్ప మరొకటి కాదని గురవారం ఆయన ఇక్కడ అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కృషి వల్లనే రూ.5 వేల ధర వచ్చిందని టీఆర్ఎస్కు సంబంధించిన పత్రిక లో ప్రకటించి మరోవైపు దానిని తప్పుబట్టడంలో అర్థం లేదన్నారు. -
మంత్రుల కార్యక్రమాల్లో నిరసనలు
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆయా సమ స్యలపై నిరసన తెలిపేందుకు ధర్నా చౌక్ లేనందువల్ల రాష్ట్ర మంత్రులు పాల్గొనే కార్యక్రమాల సందర్భంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని నిర్ణయించినట్లు బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం తెలిపారు. కొన్నేళ్లుగా ప్రజా సమస్యలు, ఆయా అంశాల పై నిరసనలు తెలిపేందుకు ఉద్దేశించిన ధర్నాచౌక్‌ను ఎత్తేయాలని కేసీఆర్ నిర్ణయిం చిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తాన్ని ధర్నా చౌక్‌గా మార్చాలని పార్టీ నాయకులు, కార్య కర్తలకు, ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, మహిళా సంఘాల కు ఆయన విజ్ఞప్తి చేశారు. హామీలను నెరవే ర్చడంలో విఫలమైన సీఎం, వీటిపై నిరస నలను భరించలేక అణచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. మంగళ వారం పార్టీ నాయకులు జి.మనోహర్‌రెడ్డి, సుధాకరశర్మలతో కలసి ఆయన విలేకరుల తో మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపితే కేసీఆర్‌కు తన తప్పు తెలిసి వస్తుందని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి... తమకు ఉప ఎన్నికలంటే భయం లేదని, గతంలో ఉప ఎన్నికల తోనే టీఆర్ఎస్ సత్తా చాటిందని చెబుతు న్న సీఎం కేసీఆర్ ఇతర పార్టీల్లోంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనా మా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఇంద్రసేనారెడ్డి సవాల్ విసిరారు. మూడేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాక ప్రజల్లో తీవ్ర అసం తృప్తి పెరుగుతోందని, దానిని కప్పిపుచ్చు కునేందుకే రెండు విడతలుగా సర్వే ఫలితాల ను విడుదల చేసి 106 సీట్లు గెలుస్తామంటూ పార్టీ నాయకులు కేడర్‌లో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నార న్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పతనం అవుతుం డడంతో దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు బీసీలు, ఎంబీ సీలకు వరాలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. -
సిట్ అదుపులో ‘జైషే’ ఉగ్రవాది రెహ్మాన్
బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర కేసులో వాంటెడ్ సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్‌ను సీసీఎస్ అధీనంలోని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న రెహ్మాన్ తిరిగి వచ్చి పోలీసులకు చిక్కాడు. ఇతడిని విచారిస్తున్న పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దుబాయ్ నుంచే కుట్ర... పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో పని చేస్తున్న జైషే మహ్మద్‌కు మౌలానా మసూద్ అజహర్ నేతృత్వం వహిస్తున్నాడు. సైదాబాద్‌లోని కూర్మగూడ కి చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, ఇతడి సమీప బంధువు జకీ ఉర్ రెహ్మాన్‌లతో పాటు మూసారాంబాగ్‌కు చెందిన షాహెద్ అలియాస్ బిలాల్ తదితరులు ఉగ్రవాదబాట పట్టిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దుబాయ్ చేరారు. లష్కరే తొయిబా ద్వారా జైషే మహ్మద్‌లో చేరారు. దుబాయ్ నుంచే నగరంలో ఉన్న బీజేపీ నేతలు నల్లు ఇంద్ర సేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరుల్ని హత్య చేయ డానికి 2004లో కుట్ర పన్నారు. ఇందుకు నగరానికి చెందిన నలుగురు, సిద్దిపేటకు చెందిన మరొకరిని రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో నిందితులు జునైద్, రహీమ్, జాహెద్, ఖదీర్, షకీల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, చార్జిషీట్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు చిక్కిన జకీ రెహ్మాన్ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారా లు సేకరించడంలో పోలీసులు విఫలం కావడం తో ఐదుగురిపై ఉన్న అభియోగాలను కొన్నేళ్ల క్రితం కోర్టు కొట్టేసింది. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ, జకీ ఉర్ రెహ్మాన్, షాహెద్ అప్పట్లో బంగ్లాదేశ్, రియాద్, జెడ్డాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కరాచీలో షాహెద్ చనిపోగా... షర్హాతుల్లా ఘోరీ ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నాడు. రియాద్‌లో ఉన్న జకీ సమాచారం సేకరించిన నిఘా వర్గాలు... అక్కడి ఏజెన్సీల సాయంతో గురువారం డిపోర్టేషన్‌పై దుబాయ్ నుంచి ఢిల్లీకి తరలించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి నగరానికి తీసుకొచ్చారు. -
ప్రజల మద్దతుతో బంద్ విఫలం: నల్లు
సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు తలపెట్టిన బంద్‌ను ప్రజలు తిరస్కరించారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై విశ్వాసంతో ప్రజలు దానిని విఫలం చేశారన్నారు. సోమవారం పార్టీ నాయకులు గోలి మధుసూదనరెడ్డి, సుధాకరశర్మ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుపై దుష్ర్పచారం చేస్తూ రెచ్చగొట్టేందుకు వివిధ ప్రతిపక్షపార్టీలు ప్రయత్నించినా ప్రజలు ప్రధాని మోదీకే మద్దతు తెలిపారన్నారు. మోదీ నిర్ణయంతో నల్లధనం బయటకు రావడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మరిన్ని నిధులు అంది, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగితే తమకు నూకలు చెల్లుతాయనే భయం ప్రతిపక్షాలకు పట్టుకుందన్నారు. నక్సలైట్ల డంప్‌లలో ఉన్న సుమారు రూ.60 వేల కోట్లు మురిగిపోరుునట్లేనన్నారు. ఈ విధంగా ఈ గ్రూపుల కార్యకలాపాలు కూడా తగ్గిపోరుు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. -
కొన్ని కుటుంబాలకే పరిహారం
అమరవీరుల ఆత్మక్షోభ కేసీఆర్‌ను వదలదు రాష్ట్ర వినాశనానికి రావణాసురుడై బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి వినాయక్‌నగర్ : (నిజామాబాద్) : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్నవారికి అసెంబ్లీ సాక్షిగా సంతాపం ప్రకటించిన కేసీఆర్ కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అమర వీరుల ఆత్మక్షోభ కేసీఆర్‌ను వదలదన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మా ట్లాడారు. 1200 మంది తెలంగాణ అమరవీరులను గుర్తించామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ 450 మందికి మాత్రమే అమరులయ్యారని మాట్లాడడం విచారకరమన్నారు. ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం అమరుల అంత్యక్రియలలో పాల్గొనడంతోపాటు మృతుల కుటుంబాలను పరామర్శించారని గుర్తుచేశారు. ఉద్యమానికి క్షేత్ర స్థాయి నుంచి ఊపు అందించిన కోదండరాం మృతుల కుటుంబాలకు న్యాయం చేసే దిశగా పూర్తి బాధ్యతలను తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరెంటు, నీరు, అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు పూర్తి న్యాయం చేయలేక కేసీఆర్ అనవసరపు విషయాలపై అందరి దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీని ఆగౌరవపరుస్తున్నారన్నారు. గోదావరిలో నాలుగు కర్రలు పెడితే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ వస్తుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా కరెంటు తేవడంలో విఫలమయ్యారన్నారు. పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారన్నారు. చాలా విషయాలలో కోర్టు తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలను ఏమి చేయాలని అనుకుంటున్నారని ఆయన ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వినాశనానికే రావణసుడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. సమావేశంలో రాష్ర్ట నాయకులు లోక భూపతిరెడ్డి, రోషన్‌లాల్ బోరా తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పాకులాట
రాజాపేట, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి వేలమంది విద్యార్థులు అమరులైనా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓట్లు, సీట్ల కోసం పాకులాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజాపేట మం డల కేంద్రంలో శనివారం బీజేవైఎం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలేరు యవచైతన్యం బహిరంగసభలో ఆయన ప్రసగించారు. దేశంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి *10లక్షల వేల కోట్ల దోపిడీ చేసిందని విమర్శించారు. అసమర్థ పాలనతో దేశంలో ఎందరో నేతకార్మికులు అకలి చావులు చేసుకున్నారని, మరెందరో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యలతో ప్రజలు విసిగివేసారిపోయారని అన్నారు. కేవ లం తమ పార్టీ అగ్ర నేత నరేంద్ర మోడీతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని అన్నారు. నేటి యువత దేశ మార్పును కోరుకుంటోందని, మోడీనే ప్రధానిని చేయాలని అత్యధికులు కంకణం కట్టుకున్నారని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి మా ట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆలేరు ప్రాంతం తాగు, సాగునీటికి నోచుకోలేదని అన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోత విధించడం వల్లే మూతపడి కార్మికులు వలసబాట పట్టారని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం, శ్రీకాకులం జిల్లాల కన్నా ఆలేరు నియోజకవర్గం అన్నరంగాల్లో వెనుకబాటుకు గురైందని అన్నారు. తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ కాలయాపన చేసిన మోడీ ప్రభుత్వంలో తెలంగాణ ఇస్తామని హామీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జ్ ప్రేంరాజ్, నాయకులు దాసరి మల్లేశం, తొడిమె రవీందర్, కావేటి సిద్ధిలింగం, దూది పాల విజయ్‌పాల్‌రెడ్డి, నిర్మలాదేవి, శో భారాణి, ఊట్కూరి అశోక్‌గౌడ్, బిల్లకుదురు బాలయ్య, దాచపల్లి రాజు, బెడిదె నర్సింహులు, కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, కాయితి బాల్‌రెడ్డి, అశోక్ తేజ, మేడిశెట్టి నరేందర్, లక్ష్మణ్, వెంకన్న, వినోద్, శ్యా మ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుగోడు పట్టని కిరణ్ సర్కారు: ఇంద్రసేనారెడ్డి
కరీంనగర్: భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. రెండు మూడు నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు నష్టం కలిగించే కోతుల బెడద నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమే సంబరాలు జరుపుకుంటోందని విమర్శించారు. వందలాది మంది ఆత్మ బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని మరిచి సంబరాలు చేసుకోవడం విడ్డూరమన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను నమ్మకం కల్గించే విధంగా లేవని పేర్కొన్నారు. -
నారాయణకు భాష నేర్పండి: ఇంద్రసేనారెడ్డి
గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్రమోడీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అవాకులు, చెవాకులు పేలడం మానాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సలహా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనం నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీని కల్లుతాగిన కోతి అనడం ఏం సంస్కారమని ప్రశ్నించారు. నారాయణ నోరును సీపీఐ కార్యకర్తలు అదుపులో ఉంచాలని, అందుకు అవసరమైతే ఒక ట్యూటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. సీపీఐ కార్యకర్తలు ఆయన నోటిని శుద్ధి చేయకపోతే తమ పార్టీ కార్యకర్తలే ఫినాయిల్‌తో శుభ్రం చేస్తారని ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా నారాయణ అనేక సందర్భాలలో నోరు జారి క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. కమ్యూనిస్టులంటే నచ్చనివారు సైతం ఆ పార్టీనేతల హుందాతనాన్ని, నైతికతను ప్రశంసిస్తుంటారని, నారాయణ మాత్రం అటువంటి వారి పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు.