‘కేసీఆర్ హయాంలో మత సామరస్యం దెబ్బతిన్నది’ | Uttam Should Say Sorry To Hindu People Says BJP Leader Indrasena Reddy | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ హయాంలో మత సామరస్యం దెబ్బతిన్నది’

Published Fri, Nov 2 2018 2:43 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Should Say Sorry To Hindu People Says BJP Leader Indrasena Reddy - Sakshi

సాక్షి, వరంగల్‌ :  తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు హయాంలో మత సామరస్యం దెబ్బతిందని బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం వరంగల్‌ శివసాయి ఆలయ పూజారిపై జరిగిన దాడిపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘వరంగల్‌లోని శివసాయి ఆలయంలో  దేవళ్ల సత్యనారాయణ శర్మ అనే పూజారి అనేక రోజుల నుంచి పూజలు చేస్తున్నారు. ఆయన్ని ముస్లిం వ్యక్తి విచక్షణ రహితంగా కొట్టాడు. పూజారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లి నిన్న చనిపోయాడు. సకాలంలో స్పందిస్తే తాను బ్రతికే వాడు. రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా దేవాలయాలకు రక్షణ ఉందా?.

దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ మరో ఎనిమిదో నిజాం. ముస్లింలకు అండగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కేవలం బీజేపీకే సాధ్యం. అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. ఓబీసీ వర్గాల పొట్టకొట్టడమే కాంగ్రెస్ వైఖరిలా కనపడుతోంది. అధికారం కోసం నీచరాజకీయం చేయాల్సిన  అవసరం లేదు. సామరస్యత సాధ్యమయ్యేది కేవలం బీజేపీకి మాత్రమే. మన రాష్ట్ర గవర్నర్ అందర్నీ కలుస్తారు. కానీ స్వామిజీలు కలుస్తామంటే కూడా గేటు బయటనుంచే పంపిస్తారు. గవర్నర్ తీరును ఖండిస్తున్నా’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement