
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు ఎస్పీగా ఉన్న డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్‌కి ఏసీబీ, విజయవాడ బదిలీ అయ్యింది.
1989 సంవత్సరంలో ఎస్‌ఐగా కమ్మంలో బాధ్యతలు చేపట్టిన ఎల్.నాగేశ్వరి 36 సంవత్సరాలుగా విధి నిర్వహణలో పదోన్నతులు పొందుతూ 3 నెలల క్రితం అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు.
తన సర్వీసులో తొలిసారి అదనపు ఎస్పీగా జిల్లాలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. అయితే పదవీ విరమణ సమయం జనవరి 31తో పూర్తి కావడంతో ఆమె పదవీ విరమణ పొందనున్నారు. జిల్లాలో రెండు రోజులు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన వారిగా ఆమె నిలిచారు.