ఏపీలో 40 మంది డీఎస్పీలకు పదోన్నతులు | Promotions To 40 Dsps In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 40 మంది డీఎస్పీలకు పదోన్నతులు

Published Tue, Aug 31 2021 11:32 PM | Last Updated on Wed, Sep 1 2021 4:30 AM

Promotions To 40 Dsps In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది డీఎస్పీ (సివిల్‌)లకు అదనపు ఎస్పీ (సివిల్‌)లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఈ డీఎస్పీల పదోన్నతుల అంశం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్పీలు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 40 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై కోర్టులో లేదా ట్రిబ్యునల్‌లో ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై తీర్పుకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొన్నారు.

అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన డీఎస్పీలు వీరే..
సి.జయరాంరాజు, ఇ.నాగేంద్రుడు, జి.వెంకటేశ్వరరావు, ఏవీ సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మి, జి.రామకృష్ణ, ఆర్‌.రమణ, ఎ.శ్రీనివాసరావు, లింగాల అజయ్‌ప్రసాద్, ఏవీఆర్‌ పీవీ ప్రసాద్, బి.నాగభూషణరావు, పి.మహేశ్, జి.స్వరూపరాణి, టి.ప్రభాకర్‌ బాబు, జేవీ సంతోష్, నడికొండ వెంకట రామాంజనేయులు, డి.శ్రీ భవానీ హర్ష, డి.సూర్య శ్రావణకుమార్, వీబీ రాజ్‌ కమల్, కె.శ్రావణి, ఎం.చిదానందరెడ్డి, దిలీప్‌ కిరణ్‌ వండ్రు, కె.నాగేశ్వరరావు, అనిల్‌ కుమార్‌ పులపాటి, కె.సుప్రజ, జి.వెంకట రాముడు, హస్మా ఫరీణ్, పి.సౌమ్యలత, బి.విజయభాస్కర్, డి.ప్రసాద్, జె.కులశేఖర్, కె.శ్రీనివాసరావు, పూజిత నీలం, ఎం.స్నేహిత, జె.వెంకట్రావ్, సీహెచ్‌ సౌజన్య, ఏటీవీ రవికుమార్, మహేంద్ర మాతే, ఎ.రాజేంద్ర, బి.శ్రీనివాసరావు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement