promotion
-
జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి
సాక్షి,న్యూఢిల్లీ:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు -
సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!
‘మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)’ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దేశంలోని భక్తులు మాత్రమే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సీఈఓలు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు హాజరవుతారు. ఈ తరుణంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నాయి. దాంతో విభిన్న ప్రచారపంథాను అనుసరిస్తున్నాయి.భారీగా భక్తుల తాకిడి..పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈసారి దాదాపు 40 కోట్ల మంది మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు దీన్ని అవకాశం మలుచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి. అందుకోసం విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి.బ్రాండ్ ప్రచారంకొన్ని కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకునేందుకు దుస్తులు మార్చుకునే గదులు, ఛార్జింగ్ పాయింట్లు, విశ్రాంతి గదులు, సెల్ఫీ జోన్ల(Selfie Zones)ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉదాహరణకు, డాబర్ ఆమ్లా, వాటికా స్నానాల ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశాయి. డాబర్ లాల్ తేల్ ప్రత్యేక శిశు సంరక్షణ గదులను ఏర్పాటు చేసింది.ప్రకటనలకు భారీగా ఖర్చుభక్తులు నివసించే ప్రదేశాలు, షాపింగ్ చేసే ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్స్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్(LED Screens)లు వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో భక్తులకు తమ బ్రాండ్ల విజిబిలిటీ కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. హోర్డింగ్‌లు/ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రదర్శించాలని ఆసక్తి ఉన్నవారు కనీసం రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై 10 సెకన్ల యాడ్ కోసం కనిష్టంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.సాంస్కృతిక సమైక్యతకంపెనీలు తమ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే వ్యూహాల్లో సంప్రదాయం, సంస్కృతిని మిళితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐటీసీ బ్రాండ్ బింగో.. లోకల్ సాంగ్స్‌పై రీల్స్ చేయాలని నిర్ణయించింది. కుకు ఎఫ్ఎం తన ఓటీటీ యాప్ ‘భక్తి’ని లాంచ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇదీ చదవండి: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?సామాజిక బాధ్యతకార్పొరేట్ కంపెనీలకు వచ్చే లాభాల్లో నిబంధనల ప్రకారం ‘కార్పొరేట్ సమాజిక బాధ్యత(CSR)’ కింద కొన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అది ఈ కుంభమేళాలో వెచ్చించనున్నారు. దాంతో కంపెనీలకు పబ్లిసిటీతో పాటు, సీఎస్ఆర్ నిధులు ఖర్చు అవుతాయి. అందులో భాగంగా హెల్ప్ డెస్క్‌లు, పోలీసు బారికేడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అత్యవసర సేవలను అందించడం ద్వారా సంస్థలు ఈ కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిసింది. మహా కుంభమేళా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. వివిధ దేశాల నుంచి సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. అంతర్జాతీయంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలనుకునేవారికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. -
‘ప్రమోట్’కు ఒకటే ప్రమాణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే తరహా ప్రమోషన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం సాంకేతిక విద్య విభాగానికి సూచించింది. ఇంజనీరింగ్‌లో కనీసం 20 క్రెడిట్స్ ఉంటేనే తర్వాతి ఏడాదికి ప్రమోట్ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలో అన్ని వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రెడిట్ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ విధానం ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది. దీంతో కొన్ని వర్సిటీల విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, మహాత్మాగాంధీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కో విధానం వర్సిటీల్లో ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున, ఏడాదికి 40 క్రెడిట్స్ ఉంటాయి. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి మొదటి సంవత్సరంలో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. మిగతా సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం 160 క్రెడిట్ పాయింట్లు ఉంటాయి. 4వ సంవత్సరంలో 160 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్‌ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్‌లో ఐదు థియరీ సబ్జెక్టులు, మూడు ల్యాబ్‌లు ఉంటాయి. విద్యార్థి పాసయ్యే ఒక్కో సబ్జెక్టుకు దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి. విద్యార్థులు ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో చూసుకుని ఆ వర్సిటీని ఎంచుకుంటున్నారు. -
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్‌లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదిగారు. తన పోస్ట్‌లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్‌లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్‌గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్‌ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్‌స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్‌కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్‌లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ సీపీగా, బి.శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ, అభిలాష బిస్త్‌ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్‌గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, టీజీఎఫ్ఎస్ఎల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సర్వీస్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి సరీ్వస్ 2026 ఏప్రిల్ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్ 2027 డిసెంబర్ వరకు, శిఖాగోయల్ సర్వీస్ 2029 మార్చి వరకు ఉంది. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్‌లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్‌పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్‌కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్‌కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
గూగుల్ నాకందుకే ప్రమోషన్ ఇవ్వలేదు: మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు
Google employee: వివక్షపూరితమైన పని సంస్కృతిపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టెక్ దిగ్గజం గూగుల్‌పై ఒక మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోణలు చేశారు. తన శరీర రంగు తెలుపు అయినందుకే గూగుల్ తనకు ప్రమోషన్ తిరస్కరించినట్లు ఆరోపించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మూడు సంవత్సరాలు పనిచేసిన షాన్ మాగైర్.. 2019లో ప్రమోషన్ ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి వైదొలిగారు. "తెల్లవాడిగా ఉన్నందుకు నాకు ప్రమోషన్ రాదన్నారు. ఆ కథేంటో పబ్లిక్‌గా చెప్పమంటారా?" అంటూ మాగైర్ గతేడాది డిసెంబర్లో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. గూగుల్ తన ఏఐ చాట్‌బాట్ జెమిని పనితీరుతో జాతి వివక్ష విమర్శలకు దారితీసిన తర్వాత గూగుల్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాగైర్ తాజాగా వివరించారు. తాను తెల్లగా ఉన్నందుకు ప్రమోషన్ నిరాకరించిన కంపెనీగా గూగుల్‌ని మాగ్యురే పేర్కొన్నాడు. తాను అత్యధిక పనితీరు కనబరుస్తున్న వ్యక్తులలో ఒకడిని అయినప్పటికీ తనను ప్రమోట్ చేయలేనని అతని సూపర్వైజర్ చెప్పినట్లు మాగైర్ పేర్కొన్నాడు. ‘నాకు వేరే కోటా ఉంది.. నేను ఈ విషయం నీకు చెప్పనక్కరలేదు. ఇది తెలిస్తే నన్ను తొలగిస్తారు’ అతని బాస్ స్పష్టంగా చెప్పినట్లు వివరించాడు. అయితే ఈ ఆరోపణలను గూగుల్ ప్రతినిధి ఖండించారు. “వ్యవస్థాపకులు, బోర్డు.. సిబ్బంది విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. షాన్ ప్రతిభావంతుడైన ఇన్వెస్టర్. సెక్వోయాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే గూగుల్ అతని ప్రమోషన్, కెరీర్ పురోగతికి సంబంధించిన జాతి లేదా లింగ బేధాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని ఆ ప్రతినిధి చెప్పారు. మాగైర్ 2016 నుంచి 2019 మధ్య గూగుల్‌లో పని చేశారు. ప్రస్తుతం ఆయన సెక్వోయా క్యాపిటల్‌లో భాగస్వామిగా ఉన్నారు. -
చెట్టంత చేయూత
సాక్షి, అమలాపురం: వయసు మళ్లిన కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) పాత చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకునేందుకు ఆర్ అండ్ ఆర్ (రీ ప్లాంటింగ్ అండ్ రెజువెనేషన్) పథకంలో భాగంగా హెక్టారుకు రూ.53,500 చొప్పున అందించనుంది. ఈ సొమ్ముతో తోటల్లో దిగుబడి తక్కువగా వస్తున్న.. తెగుళ్లు అధికంగా సోకి దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పాతుకునే వీలుంటుంది. కోనసీమలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇప్పుడున్న తోటల్లో మూడో వంతు తోటల వయసు 60 ఏళ్లకు పైబడింది. దేశవాళీ కొబ్బరి చెట్ల వయసు 60నుంచి వందేళ్లు ఉంటోంది. కానీ.. 60 ఏళ్లు దాటిన తరువాత వీటిలో దిగుబడి 40 శాతానికి పడిపోతోంది. అలాగే కొబ్బరి తోటలు సహజ సిద్ధమైన శక్తిని కోల్పోయి తెగుళ్లు, పురుగుల్ని తట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేసుకోవాల్సి ఉంది. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు, హైబ్రీడ్, పొట్టి రకాల చెట్లు వేసేందుకు ఇదే మంచి సమయం. దీనివల్ల దిగుబడి, కొబ్బరి కాయ సైజు పెరిగి ఉత్తరాది మార్కెట్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఇలా.. కొత్త చెట్లను పాతుకునే విషయంలో కోనసీమ రైతులు పూర్తిగా వెనుకబడ్డారు. పాత చెట్లను యథాతథంగా ఉంచి.. పక్కనే కొత్త చెట్లు పాతుతుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి తోటలో చెట్ల సంఖ్య పెరిగి అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటం లేదు. మరోవైపు దిగుబడి సైతం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఆర్ అండ్ ఆర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద హెక్టారుకు 32 చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకోవాల్సి ఉంటుంది. చెట్టు తొలగింపు, ఆ ప్రాంతంలో మందులు వేసి భూమిని బాగు చేయడంతోపాటు కొత్త చెట్టు పాతుకోవాల్సి ఉంటుంది. హెక్టారుకు 32 చెట్లు తొలగింపునకు చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రూ.32 వేలు, ఎరువులు, ఇతర వాటికి రూ.17,500 వినియోగిస్తారు. రూ.4 వేలను మొక్కలు నాటుకునేందుకు ఇస్తారు. చెట్టు పాతిన తరువాత రెండేళ్ల పాటు ఎరువులకు సైతం ఈ నిధులనే వినియోగించాల్సి ఉంటుంది. దిగుబడే కాదు.. కాయ సైజు తగ్గింది గతంలో ఎకరాకు సగటు దిగుబడి ప్రతి దింపులో 1,200 కాయలు వచ్చేవి. ఇప్పుడు 800 మించడం లేదు. ఏడాదికి ఆరు దింపులకు గాను సగటు 4,800 కాయలకు రూ.40,800 వరకూ వస్తుంటే.. దింపు కూలీకే రూ.9,600 వరకూ ఖర్చవుతోంది. తోటలకు పెట్టుబడులు సైతం పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద వయసు చెట్లను తెగుళ్లు, పురుగులు ఆశించి నిలువునా గాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల కొబ్బరి దిగుబడితోపాటు కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. రైతులు కొత్త చెట్లను నాటాల్సిన అవసరం ఏర్పడింది. -
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్‌లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఆక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ. హోం స్పెషల్ సెక్రటరీ జి.విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీజిపీ ఆఫీస్ డీఐజీ మోహనరావు.. సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న ఆకే రవికృష్ణ, జయలక్ష్మి ఉన్నారు. -
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సీజేఐ జస్టిస్ డీ వై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు. ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పని భారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది. -
నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్‌కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్లైన్ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్‌లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
సోషల్ మీడియాలో బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్నారా? అలా చేస్తే శిక్షార్హులు అవుతారు!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్‌ని యాడ్స్ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్ సంస్థల బ్రాండ్స్‌ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు. ఇవి తెలియని ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్‌ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. వ్యూవర్లను, సబ్స్రైబర్లను పొందాలంటే.. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్‌మీడియా ఛానెల్స్‌లో పోస్ట్ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్‌స్రైబర్స్‌కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్‌టైమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా సక్సెస్ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. ►అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. ► సబ్స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్ అన్ని కామెంట్స్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. ► సబ్స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. ► మీ ఛానెల్‌ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్‌మీడియా ఛానెల్లో ప్రమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్ చేయకండి. అది మీ వ్యూవర్స్‌ని పెంచదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్‌పైనే దృష్టి పెట్టండి. ► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్ చేస్తారు. దీనివల్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్ చేయడంలో వారి పూర్తి పాయింట్ అదే కాబట్టి ట్రోల్‌లను విస్మరించకూడదు. ► అన్ని సామాజిక ఛానెల్స్ కంటెంట్‌ను మానిటైజ్ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్బుక్, బ్లాగ్ పోస్ట్‌లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్ ఇన్.. ఇలా దేనికది ఎంచుకోవాలి. ► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్‌మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ► హాష్‌ట్యాగ్‌ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్‌ట్యాగ్‌లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రకటనలు ఎలా చేయాలి? ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్మెంట్ సందేశంలో ఉంచాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింక్‌ల సమూహంతో యాడ్స్‌ను బహిర్గతం చేయకూడదు. వ్యూవర్స్ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్ మెంట్ ఇమేజ్‌పై ఉంచాలి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి. ప్రకటనలు మొత్తం లైవ్‌స్ట్రీమ్‌లో ప్రదర్శించాలి. సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి. తగిన శ్రద్ధ .. ►సెలబ్రిటీలు/ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది. ► ఒక ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తమ బ్రాండ్ దుస్తులను ధరించమని, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్‌ను రూపొందించమని కోరాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్‌ను పోస్ట్ చేస్తే ఆ బ్రాండ్స్‌ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి. ► ఏదైనా మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఫెయిల్ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉచిత ఉత్పత్తుల వల్ల.. వ్యూవర్స్ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్ లేదా హోటల్ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు కంప్యూటర్ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్‌ను అనుసరించే వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు డియర్నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా. తాజా పెంపు డియర్నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) డీఏ పెంపు ఎలా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్నెస్ అలవెన్స్‌ను మంజూరు చేస్తుంది. ( వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్) -
నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీసులు ఇద్దరు నకిలీ టీచర్లను అరెస్టు చేశారు. వీరు నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ టీచర్లిద్దరూ కాన్పూర్‌లోని దేహాత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాదు వీరిద్దరికీ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, హెడ్మాస్టర్లను చేసింది. ఈ విషయం వెల్లడికావడంతో అటు విద్యావిభాగంతో పాటు ఇటు సామాన్యులలోనూ కలకలం చెలరేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2009లో నకిలీ విద్యార్హతల ధృవపత్రాలతో అనిల్ కుమార్, బ్రజేంద్ర కుమార్‌లు టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. దేహాత్ పరిధిలోని ఝీంఝక్లో ఉంటున్న అనిల్ ములాయి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్. అలాగే బ్రజేంద్ర కుమార్ షాహ్పూర్ మోహ్రా ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా ఉన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బర్రా పోలీస్ ఇన్స్పెక్టర్ నూర్య బలిపాండే మీడియాతో మాట్లాడుతూ బర్రాకు చెందిన సందీప్ రాథౌడ్ ఏడాది క్రితం అంటే 2022లో గ్వాలియర్‌లో ఉంటున్న అతని బంధువు రాజీవ్ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేశాడన్నారు. రాజీవ్‌తో పాటు అతని తల్లి, సోదరి కలసి తనకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 34 లక్షలు తీసుకున్నారనని సందీప్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ పనిలో కాన్పూర్‌కు చెందిన రామ్‌శరణ్, అతని దగ్గర పనిచేసే ధర్మేంద్రల హస్తం కూడా ఉన్నదని పేర్కొన్నాడు. వీరంతా తాను టీచర్ అయ్యేందుకు కావలసిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపాడు. అయితే ఇలా దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం చేసేందుకు సందీప్ నిరాకరించాడు. ఫలితంగా తన డబ్బు కూడా తిరిగి రాలేదని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్ నకిలీ ధృవపత్రాలతో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. వారు అనిల్ కుమార్, బ్రజేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా కాన్పూర్‌లోని దెహాత్ పాఠశాలలో టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పోలీసులు వీరికి సంబంధించిన రికార్డులు చెక్ చేయగా, వీరి దగ్గరున్నవి దొంగ సర్టిఫికెట్లని గుర్తించారు. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీసీపీ అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారని, వారు నకిలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పొందారని గుర్తించామని తెలిపారు. అయితే వీరికి ఉద్యోగాలు ఇప్పించిన రాజీవ్ సింగ్ హైకోర్టు నుంచి అరెస్టు వారెంట్‌పై స్టే తెచ్చుకున్నాడన్నారు. ఈ ఉదంతంతో ప్రమేయం ఉన్న రామ్ కశ్యప్‌ను కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసి, జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
నర్సరీ పెట్టు.. కాసులు పట్టు
కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు... మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా.. నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్‌కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నర్సరీల ద్వారా... మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు. వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం.. వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్ఫామ్లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 వందల ఎకరాలు ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి. -
Tamannaah White Corset Top Photos: తమన్నా అందాల విందు.. అస్సలు తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్
-
'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?
'ఆదిపురుష్' థియేటర్లలో రిలీజైంది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ముదులిపేస్తోంది. కొందరికి సినిమా నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. ఇది వాళ్లే చెప్పారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి ఎవరిని కదిపినా, ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' గురించి ఒకటే డిస్కషన్. ఇంత జరుగుతున్నా సరే హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. పూర్తి సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ ఏంటి విషయం? గత కొన్నేళ్లలో సినిమాల విషయంలో విపరీతమైన మార్పులొచ్చాయి. స్టోరీ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు మూవీ టీమ్ సరికొత్తగా ఉండేలా చూసుకుంటోంది. రిలీజ్ దగ్గర పడుతుందంటే చాలు.. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తో హోరెత్తించేస్తుంటారు. హీరోలు ఇందులో కీ రోల్ ప్లే చేస్తారు. తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అక్కడా ఇక్కడా తిరుగుతూ తెగ కష్టపడతారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం ఇలా జరగలేదే అనే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!) ఎందుకంటే 'ఆదిపురుష్' కి తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ ప్రమోషన్స్ చేయలేదు. జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదిరిపోయే రేంజులో నిర్వహించారు. దీనికి రూ.2 కోట్లకు పైగానే ఖర్చయిందని టాక్. ఆరోజు వైట్ అండ్ వైట్ డ్రస్ లో సందడి చేసిన ప్రభాస్.. స్పీచ్ కూడా సింపుల్ గా తేల్చేశాడు. అదే రోజు ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేయగా, దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఆదిపురుష్' గురించి ప్రభాస్ పెట్టిన లాస్ట్ పోస్ట్ అదే. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాస్.. రిలీజ్ ముందు గానీ తర్వాత గానీ ఎలాంటి పోస్ట్, కామెంట్స్ చేయలేదు. ఈ షూటింగ్స్, ప్రమోషన్స్ హడావుడి నుంచి కాస్త రిలీఫ్ తీసుకుని ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో 'సాహో' విడుదల టైంలోనూ ఇలానే చేశాడని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటన్నారు. ఏదేమైనా 'ఆదిపురుష్' విషయంలో ప్రభాస్ సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: మేము తీసింది రామాయణం కాదు. . ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్!) -
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
ఉద్యోగి క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాకే పదోన్నతి
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి పొందాకే పదోన్నతి పొందేందుకు అర్హుడని హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులో కింది కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇచ్చినా, ఆ స్టే ఉత్తర్వులను చూపుతూ పదోన్నతి కోరజాలరని తేల్చిచెప్పింది. ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టినా లేదా క్రిమినల్ కేసు, అభియోగాలు, అభియోగపత్రం దాఖలైనా ఆ ఉద్యోగికి పదోన్నతినివ్వడాన్ని వాయిదా వేయొచ్చని 1991లో ప్రభుత్వం జీవో 66 జారీ చేసిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుపై స్టే విధించినా తనకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఓ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. నకిలీ సర్టిఫికెట్లతో.. కర్నూలుకు చెందిన నాగరాణి 1996లో కారుణ్య నియామకం కింద ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. నియామకపు తేదీ నుంచి మూడేళ్లలో ఇంటర్ పూర్తి చేయాలని అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. ఇంటర్ పూర్తికి తనకు మరో మూడేళ్ల గడువునివ్వాలని ఆమె అభ్యర్థించగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2001లో నాగరాణి బీఏ సర్టిఫికెట్లను సమర్పిస్తూ వీటి ఆధారంగా తన సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. బెటాలియన్ కమాండెంట్ ఆ సర్టిఫికెట్లు నిజమైనవో, కావో తేల్చాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పంపారు. వాటిని పరిశీలించిన వర్సిటీ అధికారులు నకిలీవని తేల్చారు. దీంతో నాగరాణిని సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ కమాండెంట్ ఉత్తర్వులిచ్చారు. శాఖాపరమైన శిక్ష కింద ఏడాది పాటు ఇంక్రిమెంట్‌ను వాయిదా వేశారు. 2002లో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అదే ఏడాది ఆమెకు అభియోగాలకు సంబంధించి మెమోరాండం ఇచ్చారు. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై కర్నూలు నాలుగో టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా 2004లో జూనియర్ అసిస్టెంట్‌గా ఆమె సర్వీసులను క్రమబద్ధీకరించారు. ఇదే సమయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. నాగరాణిని దోషిగా తేలుస్తూ ఆమెకు మూడు నెలల జైలుశిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ఆమె 2008లో కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు ఆమెకు విధించిన జైలుశిక్షను రద్దు చేసింది. తిరిగి సరైన అభియోగం నమోదు చేసి ఆమె వాదనలు విని తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు సూచించింది. దీనిపై నాగరాణి 2009లో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జరుపుతున్న విచారణపై స్టే విధించింది. పదోన్నతినిచ్చేలా ఆదేశాలివ్వండి.. కాగా తనపై కోర్టు కేసు పెండింగ్‌లో ఉందన్న కారణంతో తనకు ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి ఇవ్వడం లేదని, దీనిని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ 2021లో నాగరాణి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. నాగరాణిపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు ఆమె పదోన్నతికి అర్హురాలు కాదని తేల్చిచెప్పారు. చదవండి: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన -
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..
సాక్షి, అమరావతి: మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ స్థాయి) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కళాశాలలు లేనిచోట ‘ప్లస్’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యాబోధన ప్రారంభించింది. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్’ స్కూళ్లలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది. చదవండి: సమస్యలు తీర్చే 'సేవకులం' 7 వేల ఎస్జీటీలు.. 1,752 ఎస్‌ఏలకు అవకాశం 2023–24 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్ ప్లస్‌లో నియమించనున్నారు. ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చి జూనియర్ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు. కాగా, దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. చదవండి: సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన