
పాకిస్థాన్ లో ఓం పురి..!
ఇస్లామాబాద్ః 'యాక్టర్ ఇన్ లా' అనే పాకిస్థానీ సినిమాలో నటించిన వెటరన్ నటుడు ఓం పురి.. ఆ సినిమా ప్రమోషన్ కోసం పాకిస్థాన్ వెళ్ళారు. లాహోర్ లో ఆయన తన పాకిస్థానీ అభిమానులను కలుసుకోవడంతోపాటు.. తన సినిమా చూడాలంటూ కోరారు. అలాగే ఇతర పాకిస్థానీ నగరాల్లో కూడా ఓం పురి చిత్రం కోసం ప్రచారం చేస్తున్నారు.
ఫహద్ ముస్తాఫా, మెహ్విష్ హయత్ లు 'యాక్టర్ ఇన్ లా' సినిమాలలో ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. వీరు కాకుండా ఓంపురితోబాటు రెహన్ షేక్, తలత్ హుసేన్ కూడా నటిస్తున్నారు. అత్యంత సున్నితమైన నేపథ్యంలో నడిచే ఈ పాకిస్తానీ చిత్రం అక్కడి ప్రజల మనసుల్ని దోచుకుంటుందన్న ఆశాభావాన్ని ఓం పురి వ్యక్తం చేస్తున్నారు. నబీల్ ఖురేషి దర్శకత్వంలో రూపొందిన ఈ ఉర్దూ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలయ్యేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.