Movie Artist
-
వేణుమాధవ్‌తో ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? అబ్బో రచ్చ లేపే కమెడియన్! (ఫోటోలు)
-
తిరుమల స్వామివారి సేవలో సినీతారలు (ఫోటోలు)
-
Nitanshi Goel: 16 ఏళ్ల ఈ అమ్మాయి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో..
నితాంశీ గోయల్.. 16 ఏళ్ల ఈ అమ్మాయి ‘లాపతా లేడీస్’లో ఫూల్ కుమారీగా అమాయకత్వాన్ని ఒలకబోసి విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. స్క్రీన్‌కి నితాంశీ కొత్తేం కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర, వెండితెర ప్రేక్షకాభిమానులకు సుపరిచితురాలు! ఈ యంగెస్ట్ యాక్ట్రెస్‌కి సోషల్ మీడియాలో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు.నోయిడాలో పుట్టి పెరిగింది. తల్లి.. రాశి గోయల్, గృహిణి. తండ్రి నితిన్ గోయల్, యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి.చిన్నప్పుడే కరాటే కూడా నేర్చుకుంది. ‘మోహినీ ఆట్టమ్’లోనూ శిక్షణ పొందింది. శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకుంది. పియానో కూడా వాయిస్తుంది.చైల్డ్ మోడల్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పేరుమోసిన ఎన్నో బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసింది. ఇటు ప్రింట్, అటు టీవీ యాడ్స్‌లో నటించింది.ఇండియన్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ మొదలు పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. 2015లో ‘మిస్ పాంటలూన్స్ జూనియర్ ఫ్యాషన్ ఐకాన్’ టైటిల్‌ని గెలుచుకుంది.తన పేరుతోనే ఓ యూట్యూబ్ చానెల్ని కూడా స్టార్ట్ చేసింది. 2022లో యునైటెడ్ బిజినెస్ జర్నల్ ‘ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్–30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘వికీ డోనర్’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ‘ఎమ్.ఎస్. ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘ఇందూ సర్కార్’, ‘హుడ్దంగ్’.. తాజాగా ‘లాపతా లేడీస్’ సినిమాల్లో నటించింది.‘మన్ మే విశ్వాస్ హై’తో బుల్లితెర ప్రవేశం చేసింది. అందులో శబ్రీగా ఆమె చూపిన అభినయం.. టీవీ ఇండస్ట్రీలో నితాంశీ ఉనికిని చాటింది. ‘నాగార్జున : ఏక్ యోధా’, ‘ఇష్క్బాజ్’, ‘పేశ్వా బాజీరావు’ లాంటి సీరియల్స్‌లో చక్కటి అవకాశాలను తెచ్చిపెట్టింది.నితాంశీ చురుకుదనం, ప్రతిభ ఆమెను వెబ్స్క్రీన్కీ పరిచయం చేశాయి ‘లవ్ స్లీప్ రిపీట్’ అనే వెబ్ సిరీస్‌తో. తర్వాత ‘ఇన్సైడ్ ఎడ్జ్’లోనూ నటించింది. అంతేకాదు ‘మేరే సప్నే’, ‘నఖ్రా’, ‘హమ్ మిలే థే జాహా’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నితాంశీ మెరిసింది."ప్రియంకా చోప్రా అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలు చూస్తూ.. ఆమె యాక్టింగ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తూ పెరిగాను. అందుకే ఆమే నాకు ఇన్స్పిరేషన్!" – నితాంశీ గోయల్ -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
డీ గ్లామర్‌కి సై అంటున్న స్టార్ హీరోయిన్లు
డీ గ్లామరస్ క్యారెక్టర్లంటే కొంచెం రిస్క్. అయితే ఆర్టిస్ట్‌గా మంచి పేరు వస్తుంది. అందుకే ఆ తరహా క్యారెక్టర్లకు చాన్స్ వచ్చినప్పుడు గ్లామర్ గురించి ఆలోచించకుండా డీ గ్లామరస్ క్యారెక్టర్లకు సై అంటారు. ఆ పాత్రల్లో గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కథానాయికల గురించి తెలుసుకుందాం. స్వాగతం బంగారం తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘తంగమ్’గా తయారయ్యారు హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్ర పేరు తంగమ్ (బంగారం) . దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ మురికివాడ బస్తీలో జీవనం సాగించే తంగమ్ అనే యువతి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని తెలిసింది. కథ రీత్యా జాన్వీ కపూర్ కొన్ని సీన్స్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తారు. తెలుగులో చేస్తున్న తొలి సినిమాతో జాన్వీ ఇలాంటి ఓ డీ–గ్లామరస్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆమె పాత్రలో ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేషధారణ, తెలుగు భాష ఉచ్ఛరణ వంటి అంశాల్లో స్పష్టత ఉండేలా జాన్వీ ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిరిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం అక్టోబరు 10న రిలీజ్ కానుంది. ‘కల్కి’ కోసం... బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించారు. ఈ బ్యూటీ హీరోయిన్గా కెరీర్నుప్రాంరంభించింది తెలుగు చిత్రం ‘లోఫర్’తోనే. 2015లో విడుదలైన ‘లోఫర్’ తర్వాత బాలీవుడ్లో దిశా ఫుల్ బిజీ అయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దిశా పటానీ తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సైన్ చేశారు. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా కొన్ని సీన్స్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఫిక్షనల్ ఫ్యూచరిస్ట్ సైంటిఫిక్ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ‘కల్కి 2898ఏడీ’ మే 9న విడుదల కానుంది. సరికొత్త మేకోవర్ ‘తంగలాన్’ సినిమా కోసం కొత్త మేకోవర్‌లోకి మారిపోయారు హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతి. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో ఆదివాసీ తెగ అమ్మాయిలుగా కనిపిస్తారట మాళవిక, పార్వతి. ‘‘తంగలాన్’ సినిమాలో నా పాత్ర చాలా బలమైనది. ఈ పాత్ర చేయడం నాకు సవాల్‌గా అనిపించింది’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో మాళవిక పాత్రకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. 18వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ‘రాయన్’లో... వరలక్ష్మీ, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి... ఫుల్ డీ గ్లామరస్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ ముగ్గురూ ఈ చాలెంజ్‌ను తీసుకున్నది ‘రాయన్’ చిత్రం కోసం. హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ప్రకాశ్‌రాజ్, సెల్వారాఘవన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘రాయన్’. కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్లందరూ డీ గ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కిన ‘రాయన్’ని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇలా డీ గ్లామరస్ సవాల్ తీసుకున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. -
దీనస్థితిలో తెలుగు సీనియర్ నటుడు.. మరో నటుడు ఆర్థిక సాయం
ప్రముఖ సినీ నటుడు, 'మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. మంచానికే పరిమితమైన పావలా శ్యామలకు కొన్నిరోజుల క్రితం ఆర్థిక సాయం చేసిన ఈయన.. ప్రమాదానికి గురై ఆందోళనకరమైన పరిస్థితుల్లో హస్పిటల్లో చేరిన తెలుగు సీనియర్ నటుడు డీ. వీరభద్రయ్యకు రూ. 25,000 చెక్ అందజేశారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) వీరభద్రయ్యకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేందుకుగానూ కాదంబరి కిరణ్ ఈ సాయం చేశారు. అలానే వీరభద్రయ్య కుటుంబ సభ్యులని ఓదార్చుతూ, వారిలో కాస్త ధైర్యం నింపారు. ఇకపోతే కాదంబరి కిరణ్.. గత కొన్నేళ్లుగా 'మనం సైతం' ఫౌండేషన్ తరఫున ఇండస్ట్రీలోని పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఈయన్ని ప్రశంసిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
దీపావళికి ఈ పాటలు ఎంతో ప్రత్యేకం
దీపావళి.. తెలుగు వారి ముంగిట ఎంతో వెలుగులతో జరిగే పండుగ. నేడు ప్రతి ఇంటి ముందు కాంతులు వెదజల్లుతూ ఆకాశంలోకి రివ్వున వెళ్లే తారా జువ్వలతో పాటు చిచ్చుబుడ్లు వెలుగుల ముందు అందరూ ఆనందంగా గడుపుతారు. ప్రతి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా ఇవన్నీ నిలుస్తాయి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. అందుకే సినిమాల్లో కూడా దీపావళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగ సందర్భంగా కొన్ని పాటలు మీకోసం.. అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించిన విచిత్రబంధం సినిమాలో “చీకటి వెలుగుల రంగేళి..” అంటూ సాగే దీపావళి పాట ఆ రోజుల్లో పెద్ద హిట్ అయింది. 1972లో ఏయన్నార్ నటించిన సినిమాల్లో నవలా చిత్రం ‘విచిత్రబంధం’ ఘనవిజయం సాధించింది. మామగారు 1991లో ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున జంటగా నటించారు. ఇందులోని దిపావళి పండుగ సాంగ్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షాసేథ్, ప్రభాస్ మధ్య దీపావళీ సాంగ్ బాగా పాపులర్ అయింది. 1950 లో విడుదలైన షావుకారు తెలుగు సినిమా డ్రామా ఎంటర్టైనర్గా నిలిచింది. ఇందులో నటించిన వారు షావుకరు జానకి, గోవింద రాజుల సుబ్బ రావు, నందమురి తారక రామారావు. నిర్మాతగా బి నాగిరెడ్డి కాగా ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటసాల స్వరాలు సమకూర్చారు. -
చౌద్వీ కా చాంద్ హో
‘చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో’... ఈ చందమామ తెలుగు నేల మీదే ఉదయించింది. ‘ఏరువాక సాగారోరన్నో చిన్నన్న’... తప్పెట దరువుకు ఆ పాదాలు ఈ నేల మీదే చిందేశాయి. ‘మారాయ్.. మారాయ్... మారాయ్..రోజులు మారాయ్’... తెలుగువారి పుణ్యాన ఒక మహత్తు జరిగి వహిదా రెహమాన్ రోజులే మారిపొయాయి.భారతీయ వెండితెర సౌందర్యమేమారిపొయింది. తనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారని తెలిశాక ఆ మురిపమైన నటి అనుకునే మాట ఒకటే– ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై.. విశాఖపట్నంలో ఈపాటికి సంబరాలు జరగాలి.తమ ఊరి నటికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినందుకు.ఆ సంగతి వారికి తెలుసో లేదో. తెలుగు వారికి వహిదా రెహమాన్ తమ నటి అని తెలుసో లేదో.వహిదా రెహమాన్‌కు పదీ పదకొండేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి రెహమాన్‌కు మునిసిపల్ కమిషనర్‌గా విశాఖ ట్రాన్స్ఫర్ అయ్యింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉద్యోగి అయిన రెహమాన్ తమిళనాడు, ఆంధ్రాల్లో పని చేసిన దక్కన్ ముస్లిం. ఆమె తల్లిది ఉత్తరాంధ్ర కావచ్చు. ఆమె మేనమామ డాక్టర్ ఫిరోజ్ అలీ గంజాంలో పేరు మోసిన డాక్టరు, సామాజిక కార్యకర్త. సినిమా నటిగా అవకాశం పొందే వరకు అంటే తన 17వ ఏట వరకూ వహిదా రెహమాన్ తొలిప్రాయపు రోజులు విశాఖలోనే గడిచాయి. అక్కడి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకుంది. అది కాదు– ఆమె జీవితాన్ని మార్చిన ఘటన అక్కడే జరిగింది. అదీ– నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజ గోపాలాచారి విశాఖ రావడం. ఆ సందర్భంగా వహిదా రెహమాన్ నాట్య ప్రదర్శన ఇవ్వడం. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏవో ఒక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. నాటి వాల్తేరు కలెక్టర్ తన సహోద్యోగైన రెహమాన్‌ను ‘నీ కుమార్తెలు భరతనాట్యం చేస్తారు కదా. వారి ప్రదర్శన ఏర్పాటు చేద్దాం’ అని కోరాడు. అందుకు రెహమాన్ అంగీకరించాడు. అప్పటికే వహిదా, ఆమె సోదరి సయిదా భరతనాట్యం నేర్చుకున్నారు. మొత్తం నలుగురు కూతుళ్లలో అందరి కంటే చిన్నది వహిదా. భరతనాట్యం నేర్చుకోవాలని పట్టుపట్టి నేర్చుకుంది. అయితే గురువు ఆమెకు అంత సులువుగా నేర్పలేదు. ‘ముసల్మానులు ఈ విద్య నేర్చుకోగలరా? ΄రాణిక సందర్భాలను అభినయించగలరా?’ అని సందేహం వ్యక్తం చేశాడు. అయినా వహిదా పట్టు విడువలేదు. మరోవైపు ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటని అయినవారి ఎత్తి పొడుపులు. ‘కళకు మతం లేదు’ అని తేల్చిన రెహమాన్ కుమార్తెలను భరత నాట్యానికి ప్రోత్సహించాడు. కాని గురువు వినడే. చివరకు వహిదా మొండిపట్టు చూసి ‘నీ జాతకం పట్టుకురా’ అన్నాడు. ముస్లింలలో జాతకాలు ఉండవని తెలిశాక, పుట్టిన రోజు... సమయం తెలుసుకుని ఆ గురువే జాతకం రాసి ఆశ్చర్యపొయాడు. ‘ఈ అమ్మాయి నా చివరి గొప్ప శిష్యురాలు అవుతుంది’ అని ఆ జాతకంతో తేల్చి పాఠాలు నేర్పించాడు. అనుకున్నట్టుగానే జరిగింది. సి.రాజగోపాలాచారి సమక్షంలో వేదిక మీద వహిదా, సయిదాలు అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసేసరికి శాస్త్రాలు ఎరిగిన అంతటి రాజగోపాలాచారి కూడా తబ్బిబ్బయ్యి మెచ్చుకున్నాడు. ఆ వార్త మరుసటి రోజు అన్ని ముఖ్యమైన పేపర్లలో మొదటి పేజీల్లో వచ్చింది. వహిదా రెహమాన్ అనే పేరు కళా జగత్తుకు తెలిసింది. సినిమా జగత్తుకు కూడా. వహిదా రెహమాన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి జబ్బు చేసి మరణించాడు. అతని సమాధి విశాఖలోనే ఉంది. ఇటీవలే వహిదా ఆ సమాధిని దర్శించింది కూడా. తండ్రి జీవించి ఉండగా సినిమా అవకాశాలు వస్తే ‘చిన్నపిల్ల... సినిమాలేమిటి’ అని సున్నితంగా తిరస్కరించాడు కాని వహిదాకు 16 ఏళ్లు వచ్చేసరికి, అప్పటికే ఆమె నాట్యకళకారిణిగా కొనసాగుతూ ఉండటంతో సినిమా అవకాశాలు వస్తూనే ఉండేవి. భర్త అండలేని తల్లి భయంతో వాటిని తిరగ్గొట్టేది. అయితే వహిదాను సినిమా తెరకు పరిచయం చేసే అవకాశం తెలుగువారి ఖాతాలో ఉంటే ఆ విధిని ఎవరు కాదనగలరు? బాంబేలో ఎల్వీ ప్రసాద్‌తో పాటు సినిమా కళను ఆకళింపు చేసుకున్న నిర్మాత సి.వి.ఆర్. ప్రసాద్ మద్రాసు వచ్చి ‘రోజులు మారాయి’ సినిమా తీయదల్చుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. అయితే సినిమా అంతా పూర్తయ్యే సమయానికి ఇందులో ఒక సంబరాల పాట ఉండాలి... పల్లెతనపు చిందు ఉండాలి అనిపించిందతనికి. దానికి మంచి డాన్సర్ కావాలంటే వహిదా రెహమాన్ పేరు తెలిసింది. అదృష్టవశాత్తు అంతకు ముందే రెహమాన్‌తో ప్రసాద్‌కు పూర్వ పరిచయం ఉంది. ‘మీవారు నాకు తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషిని. మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేజ్ మీద చేసే డాన్సు కెమెరా ముందు చేయడమే’ అని వహిదా తల్లిని ఒప్పించాడు. ‘రోజులు మారాయి’లో ‘ఐటమ్ సాంగ్’. కొసరాజు రాశాడు. మాస్టర్ వేణు బాణి కట్టాడు. జిక్కి పాడింది. విశాఖ నుంచి మద్రాసు వెళ్లిన వహిదా రెహమాన్ అద్భుతంగా డాన్స్ చేసింది. దేహంతో పాటు హావభావాలను కూడా కదిలించింది. మెరుపు వలే మెరిసింది. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’... సూపర్‌డూపర్ హిట్. ప్రేక్షకులు చిల్లర ఎగరేసిన పాట అది. సినిమా అయిపొయాక ఆపరేటర్ చొక్కా పట్టుకుని మళ్లీ ఆ పాట వేయించుకువారు. గువ్వలాంటి ఆ అమ్మాయి ఎవరు? వహిదా రెహమాన్! ఇంటింటి పేరయ్యింది. నటి సావిత్రి అదృష్టం బాగుంది. వహిదా రెహమాన్ తెలుగు నుంచి పొటీలో తప్పుకుని హిందీలో వెళ్లింది. లేకుంటే ఒకవైపు సావిత్రి, మరోవైపు వహిదా రెహమాన్ తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపుతుంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మనం తన్నుకు చచ్చుండేవాళ్లం. 1955 జనవరిలో ‘మిస్సమ్మ’ విడుదలైంది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ‘రోజులు మారాయి’. ‘మిస్సమ్మ’ సూపర్ హిట్. ‘రోజులు మారాయి’ కూడా. ‘మిస్సమ్మ’ హైదరాబాద్‌లో నెలల తరబడి ఆడుతూనే ఉంటే ఒక డిస్ట్రిబ్యూటరు దాని హిందీ రీమేక్ కోసం దర్శకుడు గురుదత్‌ని బొంబాయి నుంచి హైదరాబాద్‌కు పిలిపించాడు– సినిమా చూడటానికి. మిస్సమ్మ గురుదత్‌కు నచ్చలేదు. కాని వహిదా రెహమాన్‌ను అదే సమయంలో రోజులు మారాయి ప్రమోషన్ కోసం మద్రాసు నుంచి పిలిపిస్తే ఆమె కారు చుట్టూ మూగిన జనాన్ని చూసి ఆశ్చర్యపొయాడు. ‘ఎవరు ఈ అమ్మాయి’ అని అడిగితే ‘వహిదా రెహమాన్’ అని చె΄్పారు. గురుదత్ ఆమెను అదే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో కలిశాడు. ‘ఉర్దూ తెలుసా’ అని మాత్రమే అడిగాడు. ‘తెలుసు’ అంది వహిదా. మూడు నెలల తర్వాత బొంబాయి నుంచి పిలుపొచ్చింది. వెళితే రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ గురుదత్ బేనర్లో. నెలకు జీతం– 2,500 రూపాయలు. మొదటి సినిమా ‘సి.ఐ.డి’. ‘హీరో ఎవరండీ’ అడిగింది వహిదా రెహమాన్. గురుదత్ జవాబు– దేవ్ ఆనంద్. ‘కహి పే నిగాహె కహిపే నిషానా’... ‘సి.ఐ.డి’ సినిమాలో కొంచెం వేంప్ తరహా వేషం. చిన్న వేషం. కాని ఒక్కపాటతో మొత్తం పేరు కొట్టుకెళ్లింది వహిదా. సి.ఐ.డిలో అసలు హీరోయిన్ షకీలా. ఆమె తుడుచుకునిపొయి వహిదా నిలబడింది. కొద్దిగా మెల్ల కన్ను, లాగేసే చూపు, ఈడ్చేసే నవ్వు... ఈ అమ్మాయిని తీర్చిదిద్దవచ్చు అనుకున్నాడు గురుదత్. వెంటనే ‘ప్యాసా’లో లీడ్ రోల్ ఇచ్చాడు. గురుదత్ ఆమెలోని నటిని చాలా సమర్థంగా తీర్చిదిద్దాడు. తనలాగే అధిక ప్రసంగం చేయకుండా గాఢమైన భావాలను ఎలా పలికించవచ్చో నేర్పించాడు. ప్యాసా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత గురుతద్, వహిదా కలిసి ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్వీ కా చాంద్‘, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ సినిమాలలో నటించారు. గురుదత్ ఆగిపొయాడు. వహిదా సాగిపొయింది. సునిల్దత్తో చేసిన ‘ముఝే జీనే దో’, బిశ్వజిత్‌తో ‘బీస్ సాల్ బాద్’ పెద్ద హిట్స్. దిలీప్ కుమార్‌తో ‘దిల్ దియా దర్ద్ లియా’, ‘ఆద్మీ’, ‘రామ్ ఔర్ శ్యామ్’ చేసింది వహిదా. కాని దేవ్ ఆనంద్ మరోసారి ఆమెకు సవాలు విసిరే పాత్రను ఇచ్చాడు ‘గైడ్’లో. ఆర్.కె.నారాయణ్ రాసిన ఈ ప్రఖ్యాత నవలను హాలీవుడ్ వెర్షన్‌గా, బాలీవుడ్ వెర్షన్‌గా తీయాలనుకున్నప్పుడు హిందీ వెర్షన్‌కు చేతన్ ఆనంద్ దర్శకుడు. కాని చేతన్‌కు వహిదా ఇష్టం లేదు. దేవ్ ఆనంద్‌కు వహిదాను తీయడం ఇష్టం లేదు. చేతన్‌ను తీసి విజయ్ ఆనంద్‌ను దర్శకుడిగా పెట్టాడు. విజయ్ ఆనంద్ ‘గైడ్’లో క్లాసిక్‌గా తీర్చిదిద్దాడు. నిజానికి ఆనాటి హీరోయిన్లు ఎంపిక చేసుకునే విలువలున్న పాత్ర లాంటిది కాదు ‘రోజీ’. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపొయే పాత్ర అది. శ్రేయోభిలాషులు చేయొద్దన్నారు. వహిదా రెహమాన్ చేసింది. ఆమెలోని నాట్యాన్ని, నటనను, అభినయ గాఢతను అంత గొప్పగా పట్టి ఇచ్చిన సినిమా మరొకటి లేదు. ‘పత్థర్ కె సనమ్’, ‘నీల్ కమల్’ వంటి హిట్స్ చూసిన వహిదా ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. రాజ్ కపూర్‌తో ‘తీస్రి కసమ్’, సునిల్దత్తో ‘రేష్మా ఔర్ షేరా’, రాజేష్ ఖన్నాతో ‘ఖామోషీ’, అమితాబ్ బచ్చన్‌తో ‘కభి కభి’... ఆమెను మెల్లగా హీరోయిన్ దశ నుంచి తప్పించాయి. వీటి నడుమ అక్కినేనితో ‘బంగారు కలలు’లో తెలుగువారిని పలుకరించింది. వహిదా రెహమాన్ హిందీ సినిమా రంగంలో సాధించిన స్థానం, ఏర్పరుచుకున్న గౌరవం, పొందిన సత్కారాలు, గెలుచుకున్న అభిమానులు తక్కువ కాదు. హుందాగా ఉంటూ, అదే సౌందర్యంతో ఆమె ఆ తర్వాతి రోజుల్లో కూడా అడపా దడపా నటిస్తూనే వచ్చింది. ఆమె నవ్వుకు ఫిదా అయ్యే ప్రేక్షకులను కనికరిస్తూనే ఉంది.గొప్ప ప్రయాణం ఆమెది. ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని గాయాలు. నాటి రోజులు మళ్లీ రావు. ఈ ఉత్సవ సమయంలో ముసురుకునేది సువర్ణ తలపొతలే. వక్త్ నే కియా క్యా హసీ సితమ్ తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్ జీవితాలను కాల్చిన ప్రేమ వహిదా రెహమాన్, గురుదత్‌ల మధ్య బంధం, అనుబంధం, సంబంధం గురుదత్ జీవితంలో సంక్షోభం తెచ్చింది. వహిదాను హిందీ పరిశ్రమకు పరిచయం చేసిన గురుదత్ ఆమె పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. వహిదా కూడా గురుదత్ రెక్కల చాటునే ఉండటానికి ఇష్టపడేది. అయితే ఇదంతా గురుదత్ భార్య, ప్రఖ్యాత గాయని గీతా దత్‌ను చాలా గట్టి దెబ్బ తీసింది. గురుదత్, గీతాదత్‌ల మధ్య వహిదా ప్రమేయం వల్ల చాలా ఎడం వచ్చింది. గురుదత్, గీతాదత్లు ఇద్దరూ తాగుడుకు బానిసయ్యారు. అప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న గురుదత్ ఆత్మహత్య చేసుకు మరణించాడన్నది ఒక కథనం. నిద్రమాత్రలు ఎక్కువై మరణించాడని మరో కథనం. ఏమైనా అతని జీవితం అర్థంతరంగా ముగిసింది. ఆ తర్వాత గీతాదత్ కూడా నానా బాధలు పడుతూ తాగుడుకు బానిసై మరణించింది. వహిదా ఒకనాటి నటుడు కమల్జిత్ను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు. బెంగళూరులో చాలా కాలం ఉన్నాక భర్త మరణం తర్వాత ముంబై వచ్చి నివసిస్తోంది. వహిదా రెహమాన్ హిట్స్ 1. భవరా బడా నాదాన్ హై – సాహిబ్ బీబీ ఔర్ గులామ్ 2. జానే క్యా తూనే కహి – ప్యాసా 3. కహీ దీప్ జలే కహి దిల్ – బీస్ సాల్ బాద్ 4. సాంర్nు ఢలీ దిల్ కి లగీ – కాలా బజార్ 5. ఏ నయన్ డరే డరే – కొహ్రా 6. గాతా రహే మేరా దిల్ – గైడ్ 7. మెహబూబ్ మేరె మెహబూబ్ మేరె – పత్థర్ కె సనమ్ 8. తుమ్ పుకార్ లో తుమ్హారా ఇంతెజార్ హై – ఖామోషీ 9. రంగీలారే తేరె రంగ్ మే – ప్రేమ్ పూజారి 10. జాదుగర్ తెరె నైనా – మన్ మందిర్ పేరు మార్చుకోని నటి ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో నటీనటులు కొత్త తరహా పేర్లు పెట్టుకునేవారు. యూసఫ్‌ఖాన్ దిలీప్ కుమార్ అయ్యాడు. మెహజబీన్ మీనా కుమారి అయ్యింది. అలాగే వహిదా రెహమాన్‌ని కూడా పేరు మార్చుకోమని గురుదత్ సూచించాడు. గురుదత్ అసిస్టెంట్లు కూడా పేరు మార్పుకోసం పట్టుబట్టారు. వహిదా రెహమాన్ పేరులో గ్లామర్ లేదని, మధుబాల లాగా ఏదో ఒక బాల వచ్చేలాగా పెట్టుకోమని కోరారు. అయితే ‘మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు నేను మార్చుకోను. దానితోనే కొనసాగుతాను. మీకిష్టమైతే తీసుకోండి, లేకుంటే మానుకోండి’ అని వహిదా రెహమాన్ హఠం చేసింది. చివరకు అందరూ దిగిరాక తప్పలేదు. వహిదా రెహమాన్ తన పేరుతోనే ఖ్యాతి గడించింది. వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగంలో విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 2021 సంవత్సరానికి సుప్రసిద్ధ నటి వహిదా రెహమాన్ (85)ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ మంగళవారం ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వార్త విన్న వెంటనే వహిదా రెహమాన్ ‘దేవ్ ఆనంద్ శతజయంతి నాడు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ అవార్డు ఆయనకు అందాలి. నాకు అందింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటిలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రసేజ్జిత్ చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు. వహిదా రెహమాన్‌ను ఇది వరకే పద్మశ్రీ, పద్మభూషణ్ వరించాయి. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేతో తనకు రెట్టింపు సంబరం కలుగుతున్నదని ఆమె అన్నారు. కాగా వహిదాకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్రధాని మోడి హర్షం వెలిబుచ్చారు. సినిమా రంగంపై ఆమె ముద్ర చెరగనిది అని కొనియాడారు. హైదరాబాద్, విశాఖ, చెన్నైలతో అనుబంధం కలిగిన వహిదా రెహమాన్ తెలుగు సినిమా ‘రోజులు మారాయి’తో సినిమా రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఆగ్రతారగా వెలుగొందారు. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా ఆమెను పరిగణిస్తారు. వహిదా రెహమాన్ అక్కినేని సరసన ‘బంగారు కలలు’ సినిమాలో నటించారు. ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’ హిట్ సాంగ్ ఆమెపై చిత్రీకరించినదే. -
డబ్బు కోసం చేసేవాడిని కాదు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం
-
Anushka Malhotra: చిరంజీవి డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా? (ఫోటోలు)
-
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?
అంకుశం రామిరెడ్డి 1990 కాలం నాటి సినిమాలతో పరిచయం ఉన్న వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన వాయల్పాడు నుంచి సినీ పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేకుండానే ఆయన ప్రస్థానం మొదలైంది. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన పేరును అంకుశం రామిరెడ్డిగా మార్చుకున్నారు. అతని విలనిజం ఏ రేంజ్లో ఉంటుందంటే ‘అంకుశం’ సినిమా చూస్తే చాలు చెబుతుంది. ఆ సినిమాలో స్పాట్ పెడుతా అనే ఒకే ఒక డైలాగ్‌తో ప్రేక్షకుల మదిలో భయాన్ని నింపాడు. అంత భయానకమైన ఆన్ స్క్రీన్ వ్యక్తి రామి రెడ్డి. భారత దేశంలోని అన్ని భాషల్లో ఆయన నటించారు. బాలీవుడ్లో అమ్రిష్ పూరి, అమ్జాద్ ఖాన్, డానీ డెంజోంగ్పా, గుల్షన్ గ్రోవర్, ప్రేమ్ చోప్రా లాంటి విలన్లకు ఏ మాత్రం తీసిపోడు. అలాంటి అరుదైన నటుడి జీవితం సగంలోనే ముగిసిపోయింది. ఆయన చివరి రోజుల్లో అనుభవించిన అనారోగ్య సమస్యలు మరింత బాధాకరం. రామి రెడ్డి తొలిరోజులు జనవరి 1, 1959న జన్మించిన రామిరెడ్డి. తన కెరియర్ ప్రారంభంలో సినిమా వైపు మొగ్గు చూపలేదు. అతను జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. అందుకే హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ మీడియా (జర్నలిజం)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించారు. అందులో ఆయన సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకునేవారు. అలా అతని జీవితం కొనసాగింది. సినిమాల్లో రామిరెడ్డికి బిగ్ బ్రేక్ ఒకరోజు ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రామిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో రామి రెడ్డి టాలెంట్‌ను చూసిన ఆయన ముగ్ధుడయ్యాడు. తనలో సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయిని గుర్తించి తన రాబోయే చిత్రంలో రామి రెడ్డికి విలన్ పాత్ర అందించాడు. అందుకు రామి రెడ్డి కూడా అంగీకరించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే 1990లో వచ్చిన అంకుశం. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అదే ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇదే అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. ఇందులో కూడా అతను తన పాత్రను తిరిగి పోషించాడు. అక్కడ కూడా ప్రతిబంద్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో చిరు కంటే రామి రెడ్డి నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. దీంతో అక్కడ ఆయనకు భారీగానే అవకాశాలు వచ్చాయి. రామి రెడ్డి- 90లలో బాలీవుడ్‌కి ఇష్టమైన విలన్ ప్రతిబంధ్ తర్వాత, రామి రెడ్డి వివిధ భాషలలో పనిచేశాడు. కానీ అతను బాలీవుడ్లో కూడా తన పాపులారిటీని కొనసాగించాడు. గుండా (1998), ఖుద్దార్ (1994), శపత్ (1997), వక్త్ హుమారా హై (1994) వంటి చిత్రాలలో అతని నటనకు హీంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి-నటించిన వక్త్ హుమారా హైలోని కల్నల్ చికారా పాత్ర కల్ట్ హోదాను పొందింది. రామి రెడ్డి తన కెరీర్లో పలు భాషల్లో 250కి పైగా సినిమాలు చేశారు. 90వ దశకంలో, రామి రెడ్డి బాలీవుడ్లో పాపులర్ ఫేస్‌గా మారారు. అతని ఆకట్టుకునే ఫిల్మోగ్రఫీలో ఆందోళన్ (1995), దిల్వాలే (1994), అంగ్రాక్షక్ (1995), ఎలాన్ (1994) వంటి ప్రముఖ చలనచిత్రాలు ఉన్నాయి. రామి రెడ్డి ఎలా చనిపోయారంటే తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని రామిరెడ్డి ఆకాంక్షించారు. కానీ దురదృష్టవశాత్తు, 2010లో రామి రెడ్డి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అతను కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించి అతనికి తెలిపారు. క్యాన్సర్ ప్రభావం మూత్రపిండాలపై చూపడంతో మరింత ఇబ్బందులకు గురయ్యాడు. రోజురోజుకు అతని ఆరోగ్యం మరింత దిగజారింది. అతని చివరి రోజుల్లో అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ధైర్యంగా తన సంకల్ప శక్తితో క్యాన్సర్‌తో పోరాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఏప్రిల్ 14, 2011 న హైదరాబాద్‌లో రామి రెడ్డి (52) మరణించారు. మరోక భాదకరమైన విషయం ఏమిటంటే కొద్దిరోజుల్లో చనిపోతున్నావని డాక్టర్ల నుంచి ముందే ఆయనకు సమాచారం అందింది. దాంతో అయన మరింత కుంగిపోయాడు. ఒకవైపు భార్య,పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో నిత్యం నరకం అనుభవించారని ఆయన సన్నిహితులు ఇప్పటికి కూడా చెబుతుంటారు. అతనికి భార్యతో పాటు, ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రామిరెడ్డి అనే పేరుతో ఒక స్వీట్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని సమచారం. -
సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..
ఇంటర్వ్యూ పేరుతో 24 ఏళ్ల భోజ్‌పురి సినీ నటిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆమెకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్నేహితుడు అయ్యాడని తెలుస్తోంది. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అక్కడ ఆమె తన వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుందని కూడా చెప్పారు. పోలీసులతో ఆమె ఇలా చెప్పింది. (ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రోమాన్స్) 'కొన్ని రోజుల క్రితం నాకు భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని ఇన్స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జూన్ 29న, అతను ఇంటర్వ్యూ పేరుతో గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హోటల్‌కి నన్ను పిలిచాడు. నేను హోటల్‌కు చేరుకున్నప్పుడు, మహేష్ నన్ను తీసుకెళ్లిన గదిని ఇప్పటికే బుక్ చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను మద్యం తాగడం ప్రారంభించాడు. దీంతో నేను నేను బయల్దేరుతానని వెళ్లిపోతుండగా.. అతను నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు.' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అత్యాచార విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆ నటి తెలిపింది. ఆ ఘటన తర్వాత అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్ చేసి, తన ప్రైవేట్ వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించారని ఆమె చెప్పింది. దీంతో గురుగ్రామ్‌లోని చకర్పూర్ ప్రాంతంలో నివసించే మహేష్ పాండేపై పోలీసులు కేస్ నమోదు చేశారు. (ఇదీ చదవండి: చిరంజీవి, విజయ్ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న) -
హాట్ లుక్‌లో కేతిక శర్మ , ఫంక్షన్లో కీర్తి సురేష్, సెల్ఫీతో పూజా
► హాట్ లుక్‌లో 'రొమాంటిక్' సినిమా హీరోయిన్ కేతిక శర్మ ► కారులో బ్యూటిఫుల్ లుక్‌లో ఫోటో షేర్ చేసిన పూజా హెగ్డే ► తమిళ్ సినిమా 'మామన్నన్' ఆడియో వేడుకలో కీర్తి సురేష్ ► గ్లామ్ అండ్ గ్రేస్ అంటూ అదిరిపోయే లుక్‌లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ► సెర్బియాలో కాలుమీదు కాలు వేసుకుని కూర్చున్న సమంత ► జీవితంలో కొన్ని రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాలి..కాఫీతో ఈ పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటున్న రశ్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరిన నటుడు
భువనేశ్వర్: ఒడియా చలనచిత్ర నటుడు బాబూసాన్ మహంతి శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో అనారోగ్యానికి గురై శుక్రవారం అసుపత్రిలో చేరారు. భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. బాబూ సాన్ ఆరోగ్యం క్రమంగా కోలుకోవడంతో ఆయన భార్య తృప్తి సత్పతి ఆసుపత్రికి చేరుకొని నటుడిని ఇంటికి తీసుకెళ్లింది. అయితే గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల కారణంగా బాబూషాన్, తృప్తి విడివిడిగా నివసిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆసుపత్రికి వచ్చి తన భర్తను అత్తవారింటికి తీసుకెళ్లింది. కాగా ధామన్ చిత్రం షూటింగ్ పురస్కరించుకుని బాబూసాన్ లడక్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక పోవడంతో ఆక్సిజన్ స్థాయి దిగజారి, అస్వస్థతకు గురయ్యారు. -
‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సినీ తారల పారితోషికాల లిస్ట్ బట్టబయలైంది. టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ఇచ్చిన భారీ పారితోషికాలపై ఈడీ నోటీసులు సిద్ధం చేస్తోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు. మల్లికా షెరావత్కు రూ.కోటి, అమిషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, డింపుల్ హయతీకి రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషికాలను చీకోటి ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. చీకోటికి మంత్రులు, ఎమ్మెల్యేలు డీసీసీబి ఛైర్మన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. చికోటితో విఐపీల లింకులు బయటపడుతున్నాయి. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ కీలక ఆధారాలు సేకరిస్తోంది. ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల వివరాలు, చెల్లింపులు ఉన్నట్లు సమాచారం. చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చీకోటి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్న చీకోటి.. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ దేశాలను క్యాసినో అడ్డాలుగా మార్చుకున్నాడు. కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్ల తరలిస్తూ.. ఒక్కో విమానానికి లక్షల రూపాయలు చెల్లింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో హోటల్‌కు లక్షలు చెల్లించి ఈవెంట్స్ నిర్వహణకు కస్టమర్ల నుంచి 5లక్షలు ఎంట్రీ ఫీజు ప్రవీణ్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వెండితెరపై ‘రచ్చ’.. ఒకే ఒక్క ఛాన్స్.. అదే అతన్ని హీరోగా మార్చేసింది..
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఒక్క ఛాన్స్.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే యువత జపించే మంత్రమిది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఈ రంగంలో రాణించడం కష్టం. తెరమీద మెరవాలంటే కటౌట్ అదిరిపోవాలి. అయితే లక్ష్య సాధనతో శ్రమిస్తే అదృష్టం వెన్నంటే వస్తుందని నిరూపించాడు గుంతకల్లుకు చెందిన పాడి శ్రీధరన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పడిన శ్రమ చివరకు అతన్ని హీరోగా మార్చేసింది. ఎస్‌డీవీ క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేష్ దర్శకత్వం వహించిన ‘రచ్చ రచ్చ’ సినిమాలో శ్రీధరన్, మాధురి జంటగా నటించారు. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి కుటుంబ నేపథ్యం... గుంతకల్లు లోని హెచ్పీసీ డిపో ప్రాంతానికి చెందిన పాడి వెంకటేశులు, పాడి లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పాడి శ్రీధరన్ 1990లో జన్మించారు. అనారోగ్యం కారణంగా 1996లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి శ్రీధరన్ బరువు బాధ్యతలన్నీ అన్న కిరణ్బాబునే చూసుకునేవారు. శ్రీధరన్‌కు అన్నతో పాటు ముగ్గురు అక్కలూ ఉన్నారు. గుంతకల్లులోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి వరకు, ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, శ్రీశంకరానందలో డిగ్రీ, హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశారు. అన్నావదినలే తల్లిదండ్రులు లేని లోటును తీర్చి బాగా చదివించారు. సినిమాలంటే మక్కువ.. శ్రీధరన్ తండ్రి వెంకటేశులు ప్రముఖ రంగస్థల నటుడు. తండ్రి స్ఫూర్తితో తానూ నటుడిగా రాణించాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎంసీఏ పూర్తి చేశాక సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తానంటూ సినీ పరిశ్రమలోని దర్శకుల చుట్టూ తిరిగారు. 2014లో తొలిసారిగా ‘డెవిల్స్ బుక్’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం లయన్, డిక్టేటర్, జిల్, చుట్టాలబ్బాయి తదితర సినిమాల్లో సైడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 2021లో ఓటీటీ ద్వారా ప్రదర్శింపబడిన ‘మరణ శ్వాస’ సినిమాలో హీరోగా అరంగ్రేటం చేశారు. సెలబ్రెటీగా ఎదగాలన్నదే నా లక్ష్యం.. సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. రంగస్థల నటుడిగా మా నాన్న చాలా నాటికల్లో నటించారు. 2014లో మొట్టమొదటి సారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. వెండితెరపై వెలగాలన్న నా కలను నిజం చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నటనలో నా ప్రతిభను గుర్తించిన ఎస్‌డీవీ క్రియేషన్స్ వారు రచ్చ రచ్చ సినిమా ద్వారా హీరోగా అవకాశమిచ్చారు. నిర్మాతలు... దర్శకుల సహకారం, ప్రేక్షక దేవుళ్ల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మంచి సినిమాల్లో నటించి ఒక సెలబ్రెటీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నా. – పాడి శ్రీధరన్, సినీ హీరో -
Vizag: సినిమా సిటీ.. తీరంలో తారల సందడి
కొమ్మాది (భీమిలి): విశాఖలో సినిమా షూటింగ్ సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు కూడా విశాఖ చేరుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తరువాత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది. 1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి ఇలా భిన్నమైన ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియో చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్, లేటెస్ట్ హిట్ అఖండ వరకూ సింహాచలం కేంద్రంగానే షూటింగ్‌లు జరుపుకున్నాయి. ఓటీటీలో అలరిస్తున్న పరంపర చిత్రం మొత్తం విశాఖలోనే చిత్రీకరించారు. ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు ఎన్నో ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. బీచ్‌ను ఆనుకునే ఉన్న రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిశా, బెంగాలీ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. కోవిడ్ అనంతరం ఇప్పుడు విశాఖలో సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. సాగర్‌నగర్‌లో రాజేంద్రప్రసాద్ తీరంలో తారల సందడి ప్రస్తుతం తీర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్లలో తారలు సందడి చేస్తున్నారు. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, బెల్లంకొండ శ్రీనివాస్, కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర వంటి తారలతో పాటు నూతన నటీనటులు జ్ఞానేశ్వరి, విజయ్ వంటి నటులు ఎంతమందో ప్రస్తుతం ఇక్కడ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో పాటు ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సినిమా ప్రమోషన్లో భాగంగా ఎందరో నటీనటులు నగరంలో సందడి చేస్తున్నారు. షూటింగ్‌లకు అనువైన ప్రాంతం భీమిలి సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం భీమిలి. అప్పట్లోనే తెలుగు సినిమా షూటింగులకు బీజం పడింది. 1962లో అక్కినేని, కృష్ణ కుమారి నటించిన కులగోత్రాలు సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కొండపై ఈ సినిమాలో పెళ్ళి దృశ్యాన్ని తెరకెక్కించారు. 1972లో విశాఖ నుంచి భీమిలి మధ్య బీచ్ రోడ్డు నిర్మించటంతో భీమిలి అందాలు అప్పటి నుంచి ఇప్పటివరకు వెండి తెరపై కనువిందు చేస్తున్నాయి. అంతే కాదు విశాఖ అందాలకు ముగ్ధుడైన జం«ధ్యాల పదికి పైగా సినిమాలను ఇక్కడే నిర్మించారు. 1978లో ప్రఖ్యాతి దర్శకుడు కె.బాలచందర్ భీమిలిలో పలు చిత్రాలను చిత్రీకరించారు. అప్పటి నుంచి మద్రాసు, హైదరాబాద్ తరువాత షూటింగులకు అనుకూలమైన ప్రాంతంగా విశాఖ–భీమిలి గుర్తింపు పొందింది. అంతులేనికథ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, నాలుగు స్తంభాలాట, ఆరాధన, అభిలాష, కోకిలమ్మ, నిప్పురవ్వ వంటి సినిమాలు హిట్ కావడంతో విశాఖలో షూటింగ్ చేస్తే సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతుందన్న సెంట్మెంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. విశాఖ తీరంలో షూటింగ్ జరిపితే కచ్చితంగా హిట్ అన్న సెంట్మెంట్ బలంగా ఉండడంతో దర్శక నిర్మాతలు భీమిలికి క్యూ కడుతున్నారు. భీమిలి బీచ్ నుంచి యారాడ బీచ్ వరకు నిత్యం ఎన్నో షూటింగ్‌లు ప్రస్తుతం జరుపుకుంటున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్‌లలో చిత్రీకరణలు ఎక్కువ కొనసాగుతున్నాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకూ.. ప్రస్తుతం ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సినిమా షూటింగ్ సందడి కనపడుతోంది. షార్ట్ ఫిల్మ్‌ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలవరకు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఫొటో షూట్లు, వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిల్మ్స్,వెబ్ సిరీస్ , టివి సీరియల్స్, డాక్యుమెంటరీల చిత్రీకరణతో నిత్యం ఈ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. -
బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!
మైత్రేయి రామకృష్ణన్... కెనడాలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. నెట్‌ఫ్లిక్స్ టీన్ కామెడీ సిరీస్ ‘నెవర్ హ్యావ్ ఐ ఎవర్’లో లీడ్‌రోల్ కోసం పదిహేను వేలమంది పోటీ పడ్డారు, అందులో నుంచి మైత్రేయిని ఎంపిక చేశారు. ‘దేవి విశ్వకుమార్’ పాత్ర ఆమెకు మాంచి పేరు తీసుకువచ్చింది. హాలివుడ్ సినిమాలకు దారి చూపించింది. (చదవండి: సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి) అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘టర్నింగ్ రెడ్’లో నటించింది. ఈ సినిమా విడుదలైతే... హాలివుడ్లో అవకాశాల జోరు పెరుగుతుంది. ‘బ్రేక్ ఔట్ యాక్టర్’గా ‘టైమ్–100’ ఇన్ఫ్లూయెన్షల్ పీపుల్–2021 జాబితాలో మైత్రేయి పేరు చోటుచేసుకుంది. బాలీవుడ్‌లోనూ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. (చదవండి: ‘రాధేశ్యామ్’ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్, ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి..) -
వెండి తెరపైకి అమలాపురం కుర్రాడు
అమలాపురం: చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ రంగమంటే అతనికి ప్రాణం.. యాక్టింగ్ అంటే ఇష్టం.. ఈ రెండింటిలో స్థిరపడాలన్నదే లక్ష్యం.. అందుకే బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం కోసం చూడకుండా తన టాలెంట్‌తో నచ్చిన రంగాల్లో ప్రతిభ చాటాలని అమలాపురానికి చెందిన మేడిద నాగేంద్ర అడుగులు వేస్తున్నారు. మోడలింగ్‌లో తన కలలు సాకారం చేసుకుంటున్నారు. ఆ రంగంలో వేసిన అడుగులు విజయవంతమై అతనిని విజేతను చేయడమే కాకుండా అవార్డు వరించింది. ఇక సినిమా రంగంలో తొలి అడుగు ఇటీవలే పడింది. హీరోగా ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నటిస్తున్నారు. కళాశాల విద్య నుంచే నాగేంద్ర మోడలింగ్, సినీ రంగాలపై దృష్టి పెట్టారు. కళాశాలలో ఏ వేడుక జరిగినా అతని డ్యాన్స్‌తో అదరగొట్టేవారు. కొడుకు తాను ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న తీరును చూసి తల్లిదండ్రులూ స్వాగతిస్తున్నారు. చిన్న చిన్నగా ఎదుగుతూ.. మోడలింగ్‌లో చిన్న చిన్న షోలకు వెళ్లి నాగేంద్ర ర్యాంప్‌పై వాక్ చేసేవారు. 2020 జనవరిలో హైదరాబాద్‌లో టాలింటికా సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ పోటీల్లో తన అదిరేటి డ్రస్‌తో సౌత్ ఇండియా టాప్ మోడల్‌గా నిలిచారు. ఈ సంస్థ ఎంపిక చేసిన టాప్ 10 విజేతల్లో ఒకరిగా తొలి విజయం నమోదు చేసుకున్నారు. గత అక్టోబర్‌లో గోవాలో జరిగిన జాతీయ ఫ్యాషన్ మోడలింగ్‌లో మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలకు ఆంధ్ర రాష్ట్రం తరఫున హాజరయ్యారు. అక్కడ విజేత కాకపోయినా మోడలింగ్‌లో అదీ జాతీయ పోటీల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా... అంతా అభినందిస్తున్నారు. నాగేంద్ర ప్రతిభను గుర్తించి హైదరాబాద్ బిజినెస్ మింట్ సంస్థ ఈ నెల 27న నిర్వహించిన నేషన్ వైడ్ అవార్డ్స్–2021 వేదికపై ఇన్స్పైరింగ్ ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానం చేసింది. సినీ హీరో కావాలన్న ఆకాంక్షతో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ యాక్షన్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా సంస్థలో శిక్షణ, మెళకువలు నేర్చుకున్నారు. దీంతో లోలుగు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో హీరోగా నటించే దక్కింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కథాంశంతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్నం, లంపసింగ్ ప్రాంతాల్లో జరుగుతోంది. ‘మాలి’ అనే చిత్రంలో నెగెటివ్ పాత్రను పోషిస్తున్నారు. అమలాపురం వైఎస్సార్ సీపీ నాయకుడు మేడిద రమేష్‌బాబు కుమారుడు నాగేంద్ర. ప్రతిభ, శ్రమనే నమ్ముకున్నా.. నేను ఎంచుకున్న మోడలింగ్, సినిమా రంగాల్లో రాణించగలననే నమ్మకం ఉంది. నాకు ఎవరి సిఫార్సులూ లేవు. నా వెనుక ఆ రెండు రంగాలకు సంబంధించి పెద్దలూ లేరు. కేవలం నా ప్రతిభ, క్రమశిక్షణ, శ్రమనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. దీనిని ఓ చాలెంజ్‌గా తీసుకుని ముందడుగు వేస్తున్నా. – మేడిద నాగేంద్ర, మోడల్, సినీ నటుడు, అమలాపురం -
Sakshi Special Edition: ఓటమితో గెలుపే చెప్పెను..
-
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ అందాల యాంకర్, నటి అనుశ్రీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో శాండల్‌వుడ్ డ్రగ్స్ రాకెట్ బయటపడగా, అప్పట్లో ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ముఖ్య సమాచారాన్ని చార్జిషీట్లో ప్రస్తావించారు. అనుశ్రీ డ్రగ్స్‌ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్ అమన్ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో నృత్య సాధన చేస్తున్న సమయంలో డ్రగ్స్ సేవిస్తే ఖుషీగా డ్యాన్స్ చేయవచ్చని తోటివారితో చెప్పేది. అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. నేను అలా చెప్పలేదే: అమన్‌శెట్టి.. అనుశ్రీ డ్రగ్స్ తీసుకొంటుందని తాను పోలీసుల విచారణలో చెప్పలేదని తాజాగా కిశోర్ అమన్‌శెట్టి ప్రకటించాడు. ఆయన మంగళూరులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమెతో నాకు పరిచయం లేదు, 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్ షోలో కలిశాను. తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా కలవలేదన్నారు. చార్జీషీట్లో పొందుపరిచిన ఆరోపణలను ఖండించారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదన్నారు. మత్తు పార్టీలు ఆగలేదు: ఇంద్రజిత్.. డ్రగ్స్ కేసులో నిందితుల మూత్రం, రక్తం పరీక్షిస్తే చాలదు. తల వెంట్రుకలను కూడా పరీక్షించాలని నిర్మాత, పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ డిమాండ్ చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలున్నవారందరూ మళ్లీ డ్రగ్స్ పార్టీలకు వెళ్తున్నారు. డ్రగ్స్ కేసు కర్ణాటకలో పెద్ద కుంభకోణం. అన్ని రంగాల ప్రముఖులు ఈ దందాలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అని ఆయన ఆరోపించారు. విశ్రాంత ఐపీఎస్ జోక్యం: సంబరగి.. ఒక రిటైర్డు ఐపీస్ అధికారి ప్రభావంతో డ్రగ్స్ కేసు దారి తప్పినట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగి బెంగళూరులో ఆరోపించారు. తరుణ్ అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు, చార్జీషీట్లో అతని పేరును ఎందుకు పేర్కొనలేదు? అని ప్రశ్నించారు. బెంగళూరుకంటే మంగళూరులో డ్రగ్స్ మాత్రలు ఎక్కువగా దొరుకుతాయని కిశోర్ అమన్‌శెట్టి చెప్పాడన్నారు. అనుశ్రీ ఏమన్నారంటే.. తను ఏ తప్పు చేయలేదంటూ అనుశ్రీ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను బెంగళూరుకు 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చి చేరుకున్నా. సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్లో ఉన్నాను. ఆ తర్వాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను, కనుకనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అయితే డ్రగ్స్ కేసులో విచారించడం బాధకు గురి చేసింది అన్నారు. ఇవీ చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! నానిలోనాకు బాగా నచ్చిన విషయం అదే : రీతూ వర్మ -
ఉపాధి లేదు.. ఆదుకోండి : సినీ నటుడు
తిరువళ్లూరు: కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగం లేకపోవడంతో కుటుంబంతోపాటు పస్తులుండాల్సిన పరిస్తితి ఏర్పడిందని తమను ఆదుకోవాలని హాస్యనటుడు ఇళంభారతి బుధవారం కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆవడి సమీపంలోని పాండేశ్వరం గ్రామానికి చెందిన ఇళంభారతి(35). ఇతను సినిమాల్లో ప్రముఖులతో కలిసి నటించాడు. అయితే కరోనా కారణంగా సినిమా, సీరియల్ అవకాశాలు కోల్పోవడంతో జీవనం కష్టంగా మారిందని వాపోయి ఇళంభారతి బుధవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు. -
'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' ఫేం రూప కొడువాయర్ నేచురల్ ఫోటోలు
-
ప్రముఖ నటుడు కన్నుమూత
-
ప్రముఖ నటుడు కన్నుమూత
కోల్‌కతా : బెంగాల్ ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఛటర్జీ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా, ఛటర్జీ అక్టోబర్ 6న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత కరోనా నెగెటివ్ అని తేలడంతో తన నివాసానికి వెళ్లారు. మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 14న ఆస్పత్రికి తరలించారు. సౌమిత్ర ఛటర్జీని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. బెంగాలి తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్రి చటర్జీ .. సత్యజిత్‌రాయ్ సినిమా ‘అపుర్ సంసార్’తో తన కెరియర్ ప్రారంభించారు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ చిత్ర సీమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 2012లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. -
వారికి హీరో సూర్య భారీ విరాళం
సాక్షి, చెన్నై: కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినిమా ఆర్టిస్టులకు హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు. కరోనా కాలంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు 5 కోట్ల రూపాయలను శనివారం విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్ మీడియాలో ఆకాశమే హద్దురా సినిమాను విక్రయించామన్నారు. దీనిని అభిమానులతో సహా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య అన్నారు. (చదవండి: బాలీవుడ్‌కు సూర్య చిత్రం?) కాగా ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాను ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంకు విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్‌ను కమల్ హాసన్ నటించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ లోని ఆకాశమే నీ హద్దురా పాట నుంచి తీసుకున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ప్రముఖ పాత్రలో నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో అపర్ణ.. జాకీష్రాఫ్, పరేష్ రావల్ నటించిన విషయం తెలిసిందే. (చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు) -
ఎందుకీ ఆత్మహత్యలు
గూడు కట్టుకున్న దిగులు మాటలతోనే బద్దలవుతుంది.. మనసు తేలికపడుతుంది బతుకు మీద నమ్మకం కలుగుతుంది.. జీవిక పట్ల ఆశ మొదలవుతుంది.. ఇప్పుడు ఈ ప్రపంచానికి కావల్సింది ఆ దిగులు దిబ్బను పగలకొట్టే మాటల డైనమైట్ .. యెస్.. మౌనంతో ముడుచుకుపోయిన మనసును పెకల్చే ఆ డైనమైటే డైలాగ్ ... మనుషుల మధ్య స్నేహాన్ని.. సంబంధాల మధ్య అనుబంధాలను పెంచే డైలాగ్ ఉండాలి.. డైలాగ్‌లేని డార్క్‌నెస్‌లో ముందుగా కూరుకుపొయ్యేది గ్లామర్ వరల్డే... ఆ దుష్ప్రభావమే సినిమా సెలెబ్రిటీల సూసైడ్స్.. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(14జూన్, 2020) కలవరపెట్టింది. బయటకు కనిపించే కారణాల వరకు అవకాశాల్లేకుండా లేడు. చేతిలో రెండు సినిమాలున్నాయట. ఇప్పటి వరకు చేసినవీ పేరునే కాదు డబ్బునూ ఆర్జించినవే. మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి ఒంటరితనం, డిప్రెషన్ అని అంచనావేస్తున్నారు. డిప్రెషన్‌కు సినిమా తారలు కొత్తకాదు.. సినిమా తారలకూ డిప్రెషన్ పాత కంపానియనే. హీరో, హీరోయిన్లుగా కాక నటీనటులుగా నిలిచిపోయిన అనాటి కళాకారులు చాలా మందికి తర్వాత కాలంలో వేషాలు కరువై డిప్రెషన్ ఫ్రెండ్ అయింది. వెండితెర వెలుగుల నీడగా మారిన వాళ్లను ఆర్థిక కష్టాలూ ఆటోగ్రాఫ్ అడిగాయి. డీలా పడిపోలేదు. మనసు విప్పి మాట్లాడారు. తాము అనుభవిస్తున్న క్షోభను తోటివారితో పంచుకున్నారు. మాట సాయం, నైతిక స్థైర్యం పొందగలిగారు. గెలుపు, ఓటములు కాదు బతకడం ముఖ్యం అని ముందుకు సాగారు. సంపాదించిన కీర్తిని కాదు బతకాలన్న కాంక్షను సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు టీవీ లేదు.. ప్రైవేట్ చానల్స్ ఊహే అందలేదు. గ్రీన్ రూమ్ తప్ప ఇంకో చోటులో ఇమడలేరు. షూటింగ్ స్పాట్ కాకుండా మరో ప్రపంచం తెలియదు. అంటే ఇంకో ఉపాధి ఊసే లేకపోయినా.. రాకపోయినా బతికారు. ప్రాణం పెట్టుకున్న అభిరుచి జీవిత కాలం భరోసా ఇవ్వకపోయినా దాన్ని వృత్తిగా ఆస్వాదించిన క్షణాలనే నెమరువేసుకుంటూ స్నేహితులను పెంచుకుంటూ జీవించారు. ఈరోజుకీ వాళ్లను తలుచుకుంటోంది కేవలం వాళ్లలోని ప్రతిభతోనే కాదు సమస్యల్లో వాళ్లు ప్రదర్శించిన ధైర్యానిక్కూడా. ఈ స్ఫూర్తే కదా అభిమానులకు కావాల్సింది! ఈ హీరోయిజానికే కదా ఫేవరెట్స్ పెరగాల్సింది. పరిమితి చెదిరి పరిధి పెరిగింది.. ఇదివరకటితో పోలిస్తే అవకాశాలు మెండు. రెమ్యునరేషనూ సంతృప్తికరంగానే ఉంటోంది. ఫాలోయింగ్ ఉన్నప్పుడే లైఫ్‌ను సెటిల్ చేసుకోవాలనే ఎరుకా హెచ్చింది. ఈ సంపాదనను మరో రంగంలో మదుపుగా పెట్టాలనే ఆలోచనా వచ్చింది. పాతతరం నటీనటుల్లా ఎముకలేని దానాలతో కష్టార్జితాన్ని కరిగించుకోవట్లేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రం చేయి అందివ్వడానికి వెనకంజ వేయడంలేదు. ఇంతగా ప్లాన్ చేసుకున్న ఈ షెడ్యూల్లో హఠాత్తుగా ఆత్మహత్యలెందుకు ప్లేస్ అవుతున్నాయి? నటనా తృష్ణకు ఈ రోజు సినిమా ఒక్కటే మాధ్యమంగా లేదు. థియేటర్ ఒక్కటే ప్రామాణికంగా కనిపించడం లేదు. ప్రైవేట్ చానెల్స్ వస్తూవస్తూనే సీరియళ్లు, రియాలిటీ షోలతో చాన్స్‌లు చూపించాయి. మాధురి దీక్షిత్, శిల్పా శెట్టి, సొనాలి బెంద్రె, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్, జావేద్ జఫ్రీ, అనుపమ్ ఖేర్ (సమ్‌థింగ్ సే టు అనుపమ్ అంకుల్), కిరణ్ ఖేర్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, అనురాగ్ బసు, అను మాలిక్ వంటి దర్శకులు, సంగీత దర్శకులూ ఈ స్పేస్‌ను ఉపయోగించుకుంటున్నారు. ప్రేక్షకులు తమను మరిచిపోకుండా చూసుకుంటున్నారు. అంతెందుకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తో అమితాబ్‌ను ‘బిగ్ బి’గా నిలబెట్టింది ఈ స్మాల్ స్క్రీనే కదా. సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్‌లు ‘బిగ్ బాస్’ను నిర్వహించారు. ఆ ప్రేరణతో దక్షిణాది భాషల్లోనూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ .. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని ఆడించారు. ‘బిగ్‌బాస్’నూ నడిపించారు. ఇప్పుడు ప్రతి చానెల్లోని దాదాపు అన్ని రియాలిటీ షోలకు సినిమా తారలే యాంకర్లు. ప్రేక్ష మోహతా క్రైమ్ పెట్రోల్ (క్రైమ్ సీరియల్) యాక్టర్. వయసు 26 ఏళ్లు. ఇండోర్‌లోని తన ఇంట్లో మొన్న (2020) మే, 26న ఉరితో జీవితాన్ని అంతం చేసుకుంది. కెరీర్‌కు సంబంధిం చిన ఆందోళన, నిరాశ, వ్యాకులతతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్లో రాసింది. కుశల్ పంజాబీ మోడల్, సినిమా, టీవీ నటుడు. 2019, డిసెంబర్ 26న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం.. డిప్రెషనే. నితిన్ కపూర్ తెలుగు సినిమాల నిర్మాత. 2017, మార్చి 14న పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. అతనూ మానసిక అనారోగ్యంతో బాధపడ్డట్టు సమాచారం. ప్రత్యూష బెనర్జీ ‘బాలికా వధు’ సీరియల్లో ఆనంది పాత్రతో ప్రాచుర్యం పొందిన నటి. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ కూడా. 2016, ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష రాయుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ పొందిన తెలుగు నటి. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ అయ్యే సమయంలో 2002, ఫిబ్రవరి 2న ఆత్మహత్యతో జీవితానికే ముగింపు చెప్పుకుంది. కారణం ప్రేమ వ్యవహారమే. రంగనాథ్ ఒకప్పటి తెలుగు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో నటించిన రంగనాథ్ 2015, డిసెంబర్ 19న బలవన్మరణంతో ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఉదయ్ కిరణ్ ‘చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ తో ఫేవరేట్ యాక్టర్‌గా మారాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్‌కు లోనై 2014, జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఫటాఫట్ జయలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ నటి. అంతులేని కథలో ఆమె పోషించిన పాత్ర ఊతపదం ఫటాఫట్. దాంతో ఆమె స్క్రీన్ నేమ్ ‘ఫటాఫట్ జయలక్ష్మి’ అయింది. లవ్ ఫెయిల్యూర్‌తో మనస్తాపం చెంది 1980లో ఆత్మహత్య చేసుకుంది. గురుదత్ వసంత్ కుమార్ శివశంకర్ పడుకోణే తెర మీద గురుదత్ టైటిల్ కార్డ్‌తో కనిపించాడు.. అలరించాడు. ప్యాసా, కాగజ్ కె ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, చౌద్వీ కా చాంద్ సినిమాలు ఇప్పటికీ గురుదత్ను సజీవంగా నిలుపుతున్నాయి. 1964, అక్టోబర్ 10న ఆల్కహాల్లో నిద్రమాత్రలు కలుపుకొని శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. కునాల్ సింగ్ ‘ప్రేమికుల రోజు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా హీరోనే కునాల్ సింగ్. 2008, ఫిబ్రవరి 7న ఉరివేసుకొని చనిపోయాడు. అంతకు కొన్ని నెలల ముందు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడట మణికట్టు కొసుకొని. జియా ఖాన్ రామ్‌గోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆమిర్ ఖాన్ ‘గజినీ’లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2013, జూన్ 3న సూసైడ్ చేసుకుంది. కారణం.. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ (‘హీరో’ ఫేమ్)తో ప్రేమ.. వైఫల్యం. సిల్క్ స్మిత తెలియనది ఎవరికి? వందల సినిమాల్లో నటించి అప్పటి యువతకు ఆరాధ్య దేవతగా నిలిచింది. 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని సినిమా అభిమానులందరినీ షాక్‌కు గురిచేసింది. మోనల్ నావల్ తమిళ సినిమాల్లో నటించిన మోనల్... ఫేమస్ హీరోయిన్ సిమ్రన్‌కు చెల్లెలు. 2002లో చెన్నైలోని తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. అక్కడ కూడా మానసిక నిర్బలత్వానికి ఏ వుడ్ అయినా ఒకటే. సైకియాట్రీకన్సల్టేషన్ పట్ల సంకోచాలేమీ లేని పాశ్చాత్య సమాజంలోని నటులు కూడా ఆత్మహత్య అనే బలహీన క్షణాన్ని కౌగిలించుకున్నారు. హాలీవుడ్ ప్రసిద్ధులు రాస్ అలెగ్జాండర్, మార్లిన్ మాన్రో, స్టాన్లీ ఆడమ్స్, ఎలిజబెత్ హార్ట్మన్, బ్రాడ్ డేవిస్, రిచర్డ్ ఫ్రాన్స్ వర్త్, రాబిన్ విలియమ్స్, బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ లూసీ గార్డన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సూసైడ్స్ లిస్ట్ కూడా పెదద్దే. నటనకే కాదు గొంతు అరువివ్వడానికీ అవకాశాలున్న కాలం ఇది. యానిమేషన్ పిక్చర్స్‌కి కూడా ఫీచర్ ఫిల్మ్స్కున్నంత డిమాండ్ ఉంటోంది. అన్ని భాషల్లోకి అనువాదం అవుతున్న ఈ సినిమాలకు ఆయా భాషల్లోని స్టార్స్ తమ గొంతును అరువిస్తున్నారు. స్వరంతో నటించే ఈ జాబ్ కూడా సంతృప్తినిచ్చేదే.. ఖ్యాతినార్జించి పెట్టేదే. షార్ట్ఫిల్మ్స్కూ కాల్షీట్లు యూట్యూబ్ చానెల్స్ తమ ఉనికితో మరిన్ని ఆపర్చునిటీస్ను పెంచాయి. క్రియేటివిటీనే పెటుబడిగా మార్చాయి. షార్ట్ ఫిల్మ్స్‌కు మెయిన్ స్ట్రీమ్ సినిమా స్టేటస్‌ను తెచ్చాయి. సోషల్ మీడియా దానికి పబ్లిసిటీ పార్ట్నర్ అయింది. ఔత్సాహిక టెక్నీషియన్లు, యాక్టర్లకు బిగ్ స్క్రీన్ ఎంట్రీ టికెట్‌గా, అలాగే బిగ్ స్క్రీన్ టెక్నీషియన్లు, యాక్టర్లకు ఫాలోయింగ్ పెంచే ప్లాట్‌ఫామ్‌గా స్పేస్ తీసుకున్నాయీ యూ ట్యూబ్ చానళ్లు. అనురాగ్ కశ్యప్ వంటి డైరెక్టర్లు, నసీరుద్దీన్ షా, దీప్తి నావల్, నందితా దాస్, కాజోల్ వంటి తారలు యూట్యూబ్ చానెల్ షార్ట్ ఫిల్మ్స్ కోసం కాల్షీట్లు అడ్జస్ట్ చేసినవారే. ఎవర్ ది టాప్ ఈ అవకాశాల పందిరి ఇలా ఉండగానే ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదిక తయారైంది. టీవీలు, యూట్యూబ్‌లతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అనే మాట వైరల్ అవుతూండగానే యాప్‌ల రూపంలో స్మార్ట్ టీవీల్లోకి దూరిపోయింది. సినిమాతో పోటీ పడే బడ్జెట్.. దానికి మించిన సాంకేతిక విలువలు.. ఫీచర్ ఫిల్మ్ యాక్టర్లూ టచప్ చేసుకునేలా చూశాయి. మూవీస్‌కు స్ట్రీమింగ్ పార్టనర్స్‌గా ఉంటూనే ఒరిజనల్స్‌ను రిలీజ్ చేశాయి. వెబ్ సిరీస్‌తో టీవీ సీరియళ్లు తమ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను తరచి చూసుకోవాల్సిన పరిస్థితి. సృజన, ప్రతిభకు ఆకాశం దాటిపో యింది హద్దు. లైమ్‌లైట్‌లో ఉన్న సినిమా నటీనటులు వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజనల్స్ కోసం డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. దీనికి హాలీవుడ్ కూడా డై హార్డ్ ఫ్యాన్. మన దగ్గరా అన్ని భాషల ఫిల్మ్ వుడ్స్‌కు ఓటీటీ నుంచి ఇన్విటేషన్ ఉంది. వరల్డ్ సినిమాకు ఇంటినే స్క్రీనింగ్ థియేటర్‌గా చేసింది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్‌లు దీనికోసం సినిమాలు తీశారు. సిరీస్‌లూ నిర్మించారు. సైఫ్అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, మనీషా కోయిరాలా, వివేక్ ఒబెరాయ్, రీచా ఛద్దా, వికీ కౌశల్, భూమి ఫడ్నేకర్, కియారా అద్వాణి, సుప్రియా పాఠక్, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, రమ్యకృష్ణ వంటి సుప్రసిద్ధులంతా ఓటీటీలో నటించారు. కరోనా వల్ల థియేటర్లో రిలీజ్ కాని షూజిత్ సర్కార్ సినిమా ‘గులాబో సితాబో’ కూడా అమెజాన్‌లో విడుదలైంది. అజయ్ దేవ్గన్ కూడా ఈ వెబ్ చానెల్స్ కోసం సినిమా నిర్మిస్తున్నాడు. అందులో కాజల్, షబానా ఆజ్మీ నటిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నెట్‌ఫ్లిక్స్ కోసం ధర్మ ప్రొడక్షన్స్ తీసిన ‘డ్రై వ్’ అనే చిత్రంలో నటించాడు. ‘బాలాజీ’ (బాలాజీ టెలిఫిలిమ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకుంది ‘బాలజీ ఆల్ట్’ పేరుతో. తెలుగు చిత్రసీమా ఓటీటీ తెర మీద కనిపిస్తోంది. నందిని రెడ్డి, జగపతి బాబు వంటి దర్శక, నటుల కంట్రిబ్యూషన్ మొదలైపోయింది. తెలుగు భాష తరపునా ‘ఆహా’ అనే స్క్రీన్ లాంచ్ అయింది. కరోనాతో కలిసొచ్చిన కాలం.. ఫిల్మ్ దునియాలో ఓటీటీ ఒక విప్లవమే. సెన్సార్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల తలనొప్పుల్లేకుండా ఓటీటీలో ప్లే చేసుకోవచ్చు. పైగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్లు సిరీస్, సినిమాలు నిర్మించడానికీ సిద్ధంగా ఉన్నాయి భారతీయ ప్రధాన భాషల్లో... కథ నచ్చితే. దీంతో త్వరలోనే ప్రధాన స్రవంతి సినిమా స్కోప్ తగ్గుతుందనే అంచనాలు మొదలయ్యాయి. కరోనా ఆ ‘త్వరలో’ అనే భవిష్యత్తును వర్తమానం చేసేసింది. సమూహాలు.. సమూహ ప్రదేశాలు నిషేధించింది. షూటింగ్స్ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు థియేటర్లకు వెళ్లే సీన్ లేదు. అనివార్యంగా ఓటీటీయే కనిపించింది. ‘గులాబో సితాబో’ బోణీ చేసింది. అలా ఓటీటీకి కాలం కలిసొచ్చింది. ఆశావాదం ‘ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తప్పకుండా తెరిచే ఉంటుంది..’ అనే మాటను వింటూనే ఉంటాం. కరోనాతో సినిమాలు ఆగిపోతే... ఒటీటీ ఓపెన్ అయింది. దాని పట్ల ప్రేక్షకులకున్న క్రేజ్ కూడా అర్థమైంది. షూటింగ్‌లు ఆగిపోవడం తాత్కాలికమే (ఈ వ్యాసం రాస్తున్న సమయానికి వీటికీ గ్రీన్‌సిగ్నల్ వచ్చింది). ఇది మనకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. కాబట్టి పరిష్కారమూ అంతే వేగంగా దొరుకుతుంది. ఎటొచ్చి కొంత సంయమనం.. కాస్తంత సహనం అవసరం. కాని ఇప్పుడంతా ఇన్స్టంట్ టైమ్.. వేచి చూసేంత ఓపిక లేదు. క్షణాల్లో ఫలితాలు కావాలి. లేకపోతే భయం.. ఆందోళన.. అభద్రత. దాన్నుంచే ఒత్తిడి.. వ్యాకులత. కుటుంబంతో గడిపితే ఉపశమనం కలుగుతుంది. సన్నిహితులతో చెప్పుకుంటే బరువు దిగుతుంది. ఆ షేరింగే మిస్ అయింది చాలా మంది సెలబ్రిటీల ఆత్మహత్యల కేసుల్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సహా. కరోనాతో దారి మూసుకుపోయిందన్న దిగులా? ప్రత్యామ్నాయ వేదిక అనే మరో దారి తెరిచే ఉంది.. దాని కోసం నటించిన అనుభవమూ ఉందన్న ధీమాను పట్టుకోలేని నిస్సహాయతా? అమ్మానాన్న, తోబుట్టువుల ముందు బయటపడితే వాళ్లు టెన్షన్ పడతారేమోనన్న బాధా? ఆ మానసిక సంఘర్షణను స్నేహితులతో చెప్పుకొనీ గుండె నిండా ఊపిరి పీల్చుకోవచ్చు.. ఓస్ ఇంతేనా ఈ పటాటోపం అని పలుచన చేస్తారనే బెరుకా? అయినవాళ్ల దగ్గర ఇన్ని సంకోచాలెందుకు? మనసులో ఉన్నది చెప్పుకోవడానికి తటపటాయిస్తున్నామంటే ఆ చనువు, చొరవ మిస్ అయినట్టే. అంటే అవతలి వాళ్లను మనవాళ్లుగా చూడట్లేదనో.. మనవాళ్లనుకున్నవాళ్లు మనల్ని కేవలం విజేతలుగా మాత్రమే పరిగణిస్తున్నట్టో! ఆ అంతరమే మాటకు, చెవికీ వర్తించి మనసు ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇన్సెక్యూరిటీ, యాంగై్జటీ తనను ఆక్యుపై చేస్తున్నా గాంభీర్యం ప్రదర్శించమని పోరుతుంది మెదడు. ఆర్జించిన పేరుప్రఖ్యాతుల మాయ ఇది. అందుకే ఆత్మీయులే ఈ స్పృహతో మెదలాలి. గ్లామర్ మేకప్ కింద తడి చారికలుంటాయి. వాటిని గమనించాలి.. మాటలతో ఆ మనసును కదిలించాలి.. చెవి ఒగ్గాలి. నెమ్మదిగా గూడు కట్టుకున్న దిగులు మాటలుగా కరగడం మొదలుపెడుతుంది. కన్నీళ్లుగా ఉబికి వస్తుంది. దుఃఖంతో బహిర్గతమవుతుంది. ఆ భావోద్వేగమంతా పోయి ఖాళీ అయిన గుండె ధైర్యంతో కొట్టుకోవడం మొదలుపెడుతుంది. నిర్భయంగా ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతుంది నడక. జీవితానికి హ్యాపీ కంటిన్యుయేషనే... తర్వాత అవాంతరాలు ఉండవని కాదు.. లెక్కలోకి రావు అని. ఆత్మహత్యల జాబితా తగ్గుతుందీ అని. డిప్రెషన్ అంతు చూసిన తారలు తాను డిప్రెషన్లోకి వెళ్లానని.. సైకియాట్రిస్ట్, ఫ్యామిలీ సపోర్ట్‌తో బయటపడ్డానని మీడియా ముందు రివీల్ చేసి బాలీవుడ్లో స్టార్ డిప్రెషన్‌ను బయటపెట్టింది దీపికా పడుకోణ్. మానసిక అనారోగ్యం గురించి మాట్లాడితే పోయేదేమీ లేదు వ్యాకులత తప్ప అనే స్థైర్యాన్నీ తోటి సెలబ్రిటీలకు పంచింది. దీనిమీద అవగాహన కలిగించడానికి తన చెల్లి అనిషా పడుకోణ్‌తో కలిసి ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, అలియా భట్ వంటి తారలూ తాము డ్రిపెషన్‌ను ఎదుర్కొన్నామని, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో దాన్నుంచి రిలీవ్ అయ్యామనీ చెప్పారు. దృష్టికి రాని ఇలాంటి సెలబ్రిటీలు ఇంకెందరో ధైర్యమివ్వడానికి! – సరస్వతి రమ -
సినీ కార్మికులకు మంత్రి తలసాని చేయూత
-
సినీ కార్మికులకు ఆసరా సీసీసీ
లక్డీకాపూల్: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులకు సీసీసీ వెన్నుదన్నుగా నిలిచింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న అసంఘటిత కార్మికుల విషయంలో ప్రముఖ నటుడు చిరంజీవి తీవ్రంగా స్పందించారు. కోటి రూపాయలు విరాళం ప్రకటించడంతో పాటు తోటి నటీనటులకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ కరోనా క్రైసెస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసింది. మీ కోసం అంటూ సీసీసీ జీవనోపాధిని కోల్పోయిన సినీ కార్మికులకు ఆసరాగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం కార్మికులకే కాకుండా ఎంతో మంది నటీనటులకు సైతం సీసీసీ ఆసరాగా నిలిచింది. ఇందుకు సుమారుగా సీసీసీకి రూ.6.80 కోట్ల మేర విరాళాలు సమకూరాయి. నాగార్జున, వెంకటేష్, సురేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి ఎంతో మంది నటీనటులు ఆర్థిక సాయం అందించారు. ఇంకా అందిస్తున్నారు. దీంతో పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ఈ విధంగా చిత్రపరిశ్రమకు చెందిన 12 వేల మంది కార్మికులకు సీసీసీ ఆసరాగా నిలిచింది. దర్శక నిర్మాతలదే నిర్వాహణ.. సీసీసీ లక్ష్యాలు సక్రమంగా అమలయ్యే విధంగా దర్శకులు, నిర్మాతలు ఎన్.శంకర్, తమ్మారెడ్డి, సి.కళ్యాణ్, బెనర్జీ, దాములు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ప్రతి కార్మికుడికి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఏప్రిల్ మాసానికి సంబంధించి అందజేశారు. ఈ నెలకి కూడా ఆయా కార్మికులందరికీ సరుకులు అందిస్తున్నారు. సినీ పరిశ్రమలకు చెందిన గుర్తింపు కార్డు ఆధారంగా ఈ సాయాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలోని సినీ కార్మికులతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విశాఖపట్నంలోని కార్మికులకు, చెన్నైలోని తెలుగు పరిశ్రమకు చెందిన కార్మికులతో పాటుగా మా అసోసియేషన్‌కి చెందిన పలువురు సినీ నటులు, సాంకేతిక నిపుణులకు సైతం సీసీసీ చేయూతనిస్తోంది. సాయాన్ని సినీ కార్మికులకు నేరుగా మెహర్‌బాబా చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేస్తున్నారు. సీనియర్ నటులకు సైతం.. పరిశ్రమలోని కొంతమంది సీనియర్ నటులకు కూడా సీసీసీ ఆసరాగా నిలిచింది. రెండు నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సినీ రంగానికి చెందిన కార్మికులు, అవకాశాలు లేక జీవనోపాధిని కోల్పోయిన ఎంతో మంది నటులకు లాక్డౌన్ వేళ సాయం అందిస్తున్నాం. మొత్తం మీద 12,500మందికి సాయం చేస్తున్నాం. ఈ చేయూత కరోనా నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులకే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఏర్పడే ఇలాంటి విపత్తు సమయంలో కూడా కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీసీసీ ఉంది. రెండు మూడు రోజుల్లో కమిటీ సమావేశం కాబోతుంది. ఆ సమయంలో సీసీసీ భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తాం.– ఎన్.శంకర్, నిర్వాహకులు, సీసీసీ, ప్రముఖ సినీ దర్శకులు బాగా చేస్తున్నారు.. కష్టకాలంలో సినీ పెద్దలు, యూనియన్లు ముందుకు వచ్చి ఆదుకోవడం చాలా బాగుంది. తెలుగు సినీ పరిశ్రమలలో ఇటీవల కాలంలో ఆసరా దొరుకుతోంది. ముఖ్యంగా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి సీసీసీ బియ్యం, సరుకులు ఇచ్చి ఆదుకుంటోంది. అమితాబచ్చన్ కూడా దాదాపుగా లక్ష మందికి రూ.1500ల విలువైన బిగ్ బజార్ కూపన్లు ఇచ్చారు. ఇందుకు ఆయనొక్కడే రూ.15 కోట్లు వెచ్చించడం గొప్ప విషయం. బీహార్ రైతులందరికీ బ్యాంక్ రుణాలను చెల్లించారు. 1220మంది రైతుల రుణాలను ఆయనే చెల్లించారు. షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లోనే పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నా. – రావి కొండలరావు, ప్రముఖ హాస్య నటుడు భలే సాయపడుతోంది.. కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని సీసీసీ భలేగా సాయపడుతోంది. షూటింగ్‌లు లేక పరిశ్రమలోని ఎంతో మందికి చేయి ఆడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను నేరుగా ఇంటి వద్దకే పంపించడం గొప్ప విషయంం. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో సాయం పొందేవాళ్లు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. అలాంటిది సీసీసీ మాత్రం రెండవ కంటి వారికి తెలియకుండా ప్రతి సభ్యుడి ఇంటికి సరుకులను పంపించి ఎంతో మంది కుటుంబాలకు అన్నం పెడుతోంది. – చలపతిరాజు, మాజీ అధ్యక్షుడు డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్నారు.. సినీ డ్రైవర్లది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. లాక్‌డౌన్‌తో డ్రైవర్లంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నటుడు చిరంజీవి పెద్ద మనస్సు చేసుకుని కార్మికులను హక్కున చేర్చుకోవడం పట్ల కృతజ్ఞతలు. సీసీసీతో పాటుగా అమితాబచ్చన్ వంటి ప్రముఖులు సైతం ముందులకు వచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీరంతా నిలబడంతో డ్రైవర్లలో ధైర్యాన్ని నింపింది. దాంతో పాటు మా డ్రైవర్ల అసోసియేషన తరఫున డ్రైవర్లకు రూ.10వేల చొప్పున 800 మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందించాం. వీరితోపాటుగా ఏపీలోని మరో 75 మందికి కూడా ఈ సహాయాన్ని అందజేశాం– లడ్డూ బాషా, ప్రధాన కార్యదర్శి, సినీ డ్రైవర్స్ యూనియన్ -
పదవ తరగతిలో పెళ్లి.. ప్రధాన మంత్రి పాత్ర
డాక్టర్ కావాలనుకొని యాక్టరయ్యానని చాలా మంది నటీనటులు చెప్పుకుంటారు. కానీ లాయర్ కావాలని కలలుగన్న ఆమె మాత్రం లాయర్‌తో పాటు యాక్టర్‌గా తన సృజనను చాటుకోవాలని గట్టి తలంపుతో వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఒకవైపు హైకోర్టు న్యాయవాదిగా.. ఇంకోవైపు వెండితెరపై తన అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ఆమె పేరు జయశ్రీ రాచకొండ. నాని నిర్మించిన ‘అ’, చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన మల్లేశం, బుర్రకథ, సీత ఆన్ ది రోడ్ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన అరుదైన పాత్రల్లోనూ మంచి పేరు సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు ‘లాయర్ టరŠడ్న్ సినీ ఆర్టిస్ట్’ జయశ్రీ రాచకొండ. బంజారాహిల్స్: ఆమె తాజాగా నటించిన ‘చదరంగం జీ–5’ వెబ్ సిరీస్ విశేష ఆదరణ పొందుతూ అందరి దృష్టిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన వసుంధర అనే ఓ పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ ప్రధాన మంత్రి పాత్ర పోషణకు ఆమె అందుకుంటున్న ప్రశంసలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రధానమంత్రిగా పేరుగాంచిన ఐరన్ లేడీ ఇందిరాగాంధీ వంటి పవర్ఫుల్ లీడర్పాత్రను పోషించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొంటున్నారు. విజయావకాశాలు మెండుగాఉన్న చిత్రాల్లో.. ప్రస్తుతం తాను ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న వాళ్లిద్దరి మధ్య, విటల్‌వాడీ చిత్రాలతో పాటు పాయల్ రాజ్‌పుత్‌తో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ విజయావకాశాలు మెండుగా ఉన్న చిత్రాలని, తనకు మంచి పేరు తీసుకొస్తాయని తెలిపారు. నా తల్లే మార్గదర్శి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో సంకల్ప బలంతో ముందుకు సాగి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలనే తలంపుగా పెట్టుకున్నట్లుగా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మన కళ్లముందు తిరిగే వ్యక్తుల నుంచి ప్రేరణ పొందాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టెక్నికల్ క్యాంపస్ అటానమస్ కాలేజీ విద్యార్థినులతో నిర్వహించిన మహిళా సాధికార సదస్సులో ఆమె సూచించారు. ముని మనవరాల్ని సాకుతూ ఆరు పదులకు చేరువలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తన తల్లి తనకు మార్గదర్శి అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. జయశ్రీ రాచకొండను సత్కరిస్తున్న సీఎంఆర్ టెక్నికల్ సంస్థ ప్రతినిధులు చిన్నప్పుడే పెళ్లి.. మాది కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం అల్వాల్‌లో నివాసం. ఉన్నతాభ్యాసం హైదరాబాద్‌లోనే.. రామగుండం ఎఫ్‌సీఐ స్కూల్లో చదువుతున్న సమయంలోనే పదవ తరగతిలో పెళ్లైంది. ఆ తర్వాత ఏడాదికే పాప పుట్టింది. బాగా చదవాలనుకున్నా అప్పటికే బాధ్యతలు పెరిగిపోయాయి. నా భర్త జి.వేణుమాధవరావు పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్నారు. తండ్రి నర్సింగరావు అకౌంట్స్ ఆఫీసర్. తల్లి విజయలక్ష్మి గృహిణి. నాకిప్పుడు మనవరాలు కూడా ఉంది. నేను చదవాలనుకున్న కోర్సులను పెళ్లి పిల్లల తర్వాత నెరవేర్చుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చేసి ఉస్మానియా లా కళాశాలలో మెరిట్లో ఎల్ఎల్బీ సీటు సాధించాను. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ప్రతి రెండేళ్లకోసారి ఎఫ్సీఏ స్కూల్ రీజెనరేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంటాను. 2016లో ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు నా సహచర విద్యార్థి మాట్లాడుతున్నప్పుడు నా హావభావాలు గమనించి తన సినిమాలో యాక్ట్ చేస్తావా అంటూ ప్రశ్నించాడు. మొదట అంగీకరించలేదు. తర్వాత మాత్రం తప్పనిసరిగా నటించాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఒకటి తర్వాత ఒకటి సినిమా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ప్రయత్నిస్తే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి కదా అని చాలా మంది అంటున్నా ఇప్పుడున్న సినిమాలు సరిపోతాయని అనుకుంటున్నాను. ఇప్పటికే మంచిమంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. -
వృత్తి గ్లాస్ ఫిట్టర్.. ప్రవృత్తి సినిమా ఫైటర్!
సాక్షి, కల్లూరు: నటనపై ఆసక్తి ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనేందుకు ఈ యువకుడే నిదర్శనం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిత్రపరిశ్రమలో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కల్లూరుకు చెందిన ఈస్యం రాజేష్ గౌడ్ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువులో రాణించలేక పోవడంతో కర్నూలు ఆటోనగర్‌లోని గాస్ల్ ఫిట్టింగ్ షాపులో ఫిట్టర్‌గా పని చేసేందుకు 1995లో చేరాడు. వృత్తిలో మెలకువలు నేర్చుకునేందుకు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లి శిక్షణ పొందాడు. అనంతరం 2004లో వాణిజ్య నగర్లో గ్లాస్ ఫిట్టింగ్ షాపును ప్రారంభించాడు. 15 ఏళ్లుగా వివిధ వాహనాలకు, ఇళ్లకు, దుకాణాలకు గ్లాస్ ఫిట్టింగ్ పనులు చేస్తున్నాడు. ఇతనికి భార్య సమతతోపాటు శశినిల్గౌడ్, హర్షవర్దన్ గౌడ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. 2005లో తొలిసారిగా స్నేహితుల సహకారంతో షార్ట్ ఫిల్మ్ ‘చీరల మోజు’లో నటించాడు. నటనలో మొదట షార్ట్‌ఫిల్మ్ వద్ద పడిన అడుగు నిదా నంగా వెండితెరకు పరిచయం చేసింది. ప్రస్తు తం ప్రధాన విలన్ పాత్రకు కూడా అవకాశాలు వస్తున్నాయి. షార్ట్‌ఫిల్మ్ టు వెండితెర నటనపై ఆసక్తి ఉన్న రాజేష్ అంచలంచెలుగా ఎదుగుతూ షార్ట్ ఫిల్మ్ నుంచి వెండితెర వరకు దూసుకువెళ్తున్నాడు. ఇతను మొదటగా 17 నిమిషాలు నిడివిగల ‘చీరల మోజు’ షార్ట్ ఫిల్మ్‌తో నటన ప్రారంభమైంది. ఆ తర్వాత నయన, యువర్ మై ఎమ్మెల్యే, కామన్ మ్యాన్ తదితర షార్ట్ ఫిల్మ్‌ల్లో రాజేష్ నటించాడు. నయనలో రౌడీగా, కామన్ మ్యాన్‌లో సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. దీంతో కర్నూలు నగరానికి చెందిన ఫిల్మ్ కో–ఆర్టినేటర్ నరసింహులు ద్వారా ‘కమల్’ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో బిహార్ గ్యాంగ్ లీడర పాత్రను పోషించాడు. ఆ తరువాత ఇటీవల విడుదలైన ‘నేను లేను’ సినిమాలో విహారయాత్రకు వచ్చిన హీరో, హీరోయిన్లను బెదిరించి దోచుకోవడం, వారిని దెబ్బకొట్టేæ విలన్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ తమ్ముడు వర్మ హీరోగా తీస్తున్న బుల్లెట్ సినిమాలో, కోడుమూరుకు చెందిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. తెనాలి రామకృష్ణ సినిమాలో బిహారీ గ్యాంగ్ లీడర్‌గా రాజేష్ ఉంటాడు. అలాగే పలు ప్రముఖ దర్శకులు నిర్మిస్తున్న చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్లు చెబుతున్నా డు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన నటతో వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నట్లు రాజేష్ చెబుతున్నాడు. -
సినిమా పోస్టర్ నిజమై నటుడు మృతి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినిమా ప్రచారం కోసం వీధుల్లో వేసిన చావు పోస్టర్ నిజమై పోస్టర్లో ఉన్న వర్ధమాన నటుడు నిజంగానే మరణించిన చిత్రమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తూత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన ఆర్ఎస్ గోపాల్ (52) అనే వ్యక్తి వంటపని, శుభ, అశుభ కార్యక్రమాలకు షామియానా, సామాన్లు సరఫరా చేసే వృత్తులు నిర్వహిస్తుంటాడు. ‘గరిట నుంచి గజరాజు వరకు అన్నీ దొరకును’ అనే చిత్రమైన నినాదంతో బోర్డు ఏర్పాటు చేయడం, మనిషి రూపురేఖలు కూడా బాగుండడంతో సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల అతడు ఒక సినిమాలో విలన్‌గా నటించగా, ఆ సినిమాలో అతను చనిపోవడం, ‘కన్నీటి అంజలి’ అంటూ వీధుల్లో పోస్టర్లు వెలియడం లాంటి దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలను గోపాల్ వాట్సాప్ ద్వారా సరదాగా బంధుమిత్రులకు పంపాడు. ఆవేదన చెందిన వారంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పూలమాలలు తీసుకుని అతని ఇంటికి చేరుకోగా గోపాల్ హాయిగా కుర్చీ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఉన్నాడు. అవన్నీ తన కొత్త సినిమా కోసం చిత్రించిన దృశ్యాలని వారికి వివరించి, తన ఇంటి గోడకు అతికించి ఉన్న ‘కన్నీటి అంజలి’ పోస్టర్లను వారి ముందే చించుతూ ఫోజిచ్చి పంపివేశాడు. వారం రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, గోపాల్ మరణించినట్లు శనివారం నాడు మరలా ఊరంతా పోస్టర్లు వెలియడంతో ఇది కూడా సినిమా ప్రచారమేనని అందరూ భావించారు. అయితే కొందరు అనుమానంతో వారింటికి ఫోన్ చేయగా అనారోగ్య కారణాల వల్ల గోపాల్ మృతి చెందినట్లు బంధువులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. తన చావు పోస్టర్లను తానే ప్రచారం చేసుకున్న వారం రోజులకు గోపాల్ నిజంగానే మరణించిన ఆశ్చర్యకరమైన ఘటన తమిళనాడులో చర్చనీయాంశమైంది. -
ఇదే నిజమైన నేను: సమీరా రెడ్డి
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. గతంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సమీర ఫోటోషూట్లతో హల్చల్ చేస్తున్నారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సమీరా. ఈ వీడియోలో సమీరా మేకప్ లేకుండా అల్లరి చేస్తూ కనిపించారు. వీడియోతో పాటు ‘ఇదే నిజమైన నేను..’ అనే కామెంట్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేయడం వెనుక తన ఆలోచనను ఏంటో కూడా చెప్పుకొచ్చారు సమీరా. ‘ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల నాపై వివర్శలు వస్తాయని నాకు తెలుసు, వాటికి నేను బయపడను. కేవలం నేను మేకప్ లేకుండా ఎలా కన్పిస్తున్నానో చూపించడానికే ఈ పోస్టు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. గతంలో మొదటి గర్భధారణ సమయంలో శరీరాకృతికి సంబధించి సమస్యలు ఎదుర్కొన్న సమీరా అప్పటి ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను ఎంతో ధృడంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ తమలోని లోపాలను తెలుసుకొని సరిదిద్దుకోవాలని, నిరంతరం మనల్ని మనం గౌరవించుకోవాలని సూచించారు. సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లోనే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. View this post on Instagram This is the real me! Almost ready to pop! I know I’ll bounce back and im not afraid of being judged 🙌🏼. I wanted to share how I looked without make up & my morning face 😱 and how it’s important for me to celebrate it ! #imperfectlyperfect Thank you @namratasoni you’ve been amazing . . 🎥 the very talented @varadsugaonkar ⚡️. . #video #positivevibes #socialforgood #positivebodyimage #preggo #pregnant #pregnancy #9monthspregnant #almostthere #naturalmakeup #natural #acceptance #positivity #selflove #makeupfree #momtobe #momtobeagain #bump #bumpstyle #maternityshoot #maternityphotography #feelgood #bodypositive #loveyourself A post shared by Sameera Reddy (@reddysameera) on Jul 10, 2019 at 1:10am PDT -
అలరించిన ‘మల్లేశం’ యూనిట్
ఖమ్మంమయూరిసెంటర్: చేనేత కార్మికురాలైన తల్లి కష్టాలను చూసి చలించి, ఆ కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో ఆసుయంత్రం కనుగొని జాతీయ గుర్తింపు పొంది, పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం నగరంలోని సాయిరాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించారు. సినీ డైరెక్టర్ రాజు, కథానాయిక అనన్య, హీరో తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించిందని, చింతకింద మల్లేశం జీవిత కథ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఖమ్మం నగర పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు, పద్మశాలీ సంఘ కుటుంబ సభ్యులకు ఉచితంగా సినిమా టికెట్లను అందజేశారు. సినిమా విజయంతం కావడాన్ని హర్షిస్తూ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం చిత్ర బృందాన్ని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ తరుపున సినీ, బుల్లితెర నటుల ఎన్నికల ప్రచారం
-
మూవీ మ్యాటర్స్
-
భార్యకు ఇంట్లోనే ప్రసవం చేయించిన సినీ కళాకారుడు
చెన్నై, తిరువొత్తియూరు: చెన్నై సినీ కళాకారుడు తన భార్యకు సుఖ ప్రసవం కోసం ప్రయత్నించి గర్భిణి అయినప్పటి నుంచి ఆస్పత్రికి వెళ్లకనే ఇంట్లోనే ప్రసవం చేయించిన సంఘటన తెన్కాశి సమీపంలో సంచలనం కలిగించింది. ఇటీవలి కాలంలో యూట్యూబ్ చూసి ఇంట్లో ప్రసవం చేసిన యువతి, చెన్నై సమీపంలో నర్సుకు ఇంట్లో ప్రసవం చేసిన సంఘటనలు జరిగాయి. కానీ అవి వికటించి ఇంట్లో ప్రసవం చేసిన బాలింతలు మృతిచెందారు. ఈ క్రమంలో ఇంట్లో గర్భిణులకు ప్రసవం చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తెన్‌కాశిలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. తెన్కాశి సమీపం ఇడైకాల్ ప్రాంతానికి చెందిన రమేష్ (31) అతనికి జయలక్ష్మి (22) అనే యువతితో వివాహమైంది. రమేష్ చెన్నైలో సినీ పరిశ్రమలో కళాకారుడుగా ఉన్నారు. ఈ క్రమంలో అతను జయలక్ష్మి గర్భిణి అయినప్పటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లక నాటు మందులు, యోగా శిక్షణను ఇచ్చినట్టు తెలిసింది. నిండుగర్భిణి అయిన జయలక్ష్మిని ప్రసవం కోసం రమేష్ 10 రోజుల ముందు చెన్నై నుంచి తెన్కాశి సమీపం ఇడైకాల్లో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జయలక్ష్మి సుఖ ప్రసవంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీని గురించి సమాచారం తెలుసుకున్న ఇడైకాల్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి నర్సులు రమేష్‌తో శిశువు బొడ్డు పేగు కత్తిరించాలని కోరారు. దీనికి రమేష్ తిరస్కరించాడు. దీంతో శంకరన్ కోవిల్ జిల్లా మెటర్నిటీ ఆసుపత్రి ప్రధాన వైద్య అధికారి గోమతి, ఇడైకాల్ పోలీసులు అక్కడికి చేరుకుని రమేష్‌తో మాట్లాడారు. దీంతో ఆసుపత్రి చికిత్సకు రమేష్ సమ్మతించడంతో జయలక్ష్మిని శిశువును ప్రైవేటు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీని తరువాత తల్లి నుంచి శిశువుకు బొడ్డు తీగ కోసి చికిత్స అందిస్తున్నారు. -
అమ్మ పెట్టకపోతే పిన్ని ఇంటికి వెళ్లాలి!
‘అమ్మ పెట్టకపోతే పిన్ని ఇంటికి వెళ్లమని’ సామెత. తల్లి వంట గదిలో పొయ్యి వెలిగించకపోతే పినతల్లి ఇంటికైనా వెళ్లి కడుపు నింపుకోవాలి కదా. ఇక్కడ తల్లి పెద్ద తెర అయితే పినతల్లి బుల్లి తెర. ఒకప్పుడు టీవీలో పని చేయడం తక్కువగా చూడబడేది. టీవీని ద్వితీయశ్రేణి మీడియాగా భావించబడేది. ఇవాళ టీవీ దాదాపు సినిమాకు పార్లల్ మీడియాగా ఉంది. కోట్లాది ఇళ్లలో టీవీని ఆన్ చేయకుండా రోజు గడవదు. పాపులర్ సీరియల్స్, గేమ్ షోస్, టాక్ షోస్, డాన్స్ షోస్... ఇవన్నీ లాభదాయకమైన షోస్‌గా కాసులు కురిపిస్తున్నాయి కూడా. ఇంకా చెప్పాలంటే గతంలో సినిమా రంగంలో అవకాశాలు తగ్గినవారు టీవీ రంగంలో ఉపాధి పొందేవారు. కానీ ఇప్పుడు సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ రాణించాలని చూస్తున్నారు. పై సామెతను తిరగేస్తే అమ్మ దగ్గర రెండు ముద్దలు పిన్ని దగ్గర రెండు ముద్దలు సొమ్ము చేసుకుందామని చూస్తున్నారు.బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్... వీరందరూ టీవీ షోలు చేసినవారే. కుంగిపోయి ఉన్న తన కెరీర్‌ను అమితాబ్ బచ్చన్ టీవీలోని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ద్వారానే పునరుద్ధరించుకున్నాడు. ఆమిర్ చేసిన ‘సత్యమేవ జయతే’ షో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో ద్వారా కొనసాగుతూనే ఉన్నాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జగపతిబాబు, జయప్రద షోలు చేశారు. ఎప్పుడూ మాట్లాడని దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తన పేరు మీద తయారైన షోలలో పాల్గొన్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్‌బాబు(మనో), సునీత... తదితరులు సంగీతానికి సంబంధించిన షోలు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నా బుల్లి తెర మీద షోను సక్సెస్ చేసుకున్న మరో నటుడు ఆలీ. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరం కూడా కొంతమంది సినిమా పర్సనాల్టీలను టీవీకి పరిచయం చేసింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేలా చేసింది. వారి వివరాలు.... నా..నీ టీవీలో చూసేయండి వరుస విజయాలతో కెరీర్లో దూసుకెళ్తున్న హీరో నాని ఈ ఏడాది టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. సూపర్ హిట్ షో ‘బిగ్ బాస్’ ద్వారా ఇంటింటా బొమ్మ కట్టారు. నిజానికి బిగ్‌బాస్ సీజన్ వన్ హోస్ట్‌గా ఎన్.టి.ఆర్ మార్కులు కొట్టేశారు. కానీ ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్ బిజీతో బిగ్‌బాస్ సెకండ్ సీజన్‌కు వ్యాఖ్యాతగా చేయడం కుదరకపోవడంతో ఆయన ప్లేస్‌లోకి నాని వచ్చారు. తనదైన స్టైల్లో ఆయన షోని మోశారు. మొదట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపించినా ఎపిసోడ్స్ ముందుకు వెళ్లే కొద్దీ అందర్నీ ‘నా నీ’ టీవీలకు కట్టిపడేశారు నాని. అయితే థర్డ్ సీజన్‌కు యాంకర్‌గా కొనసాగబోనని సెకండ్ సీజన్ ఫైనల్ రోజే అనౌన్స్ చేశాడాయన. ప్రస్తుతానికైతే ఖాళీ లేదు... భవిష్యత్తులో ప్రేక్షకులను అలరించే కార్యక్రమాలు ఎప్పుడు తన దారిలో వచ్చినా టీవీలో మెరవడానికి రెడీ అన్నాడాయన. నవ్వుతారు దశాబ్దాలుగా వెండి తెర మీద నవ్వులు పూయిస్తున్నారు బ్రహ్మానందం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే హాస్య గ్రం«థులకు పని పెరుగుతుంది. ఇప్పుడు తొలిసారి బుల్లితెర మీద కూడా కామెడీ షో ద్వారానే ఎంట్రీ ఇచ్చారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘ది గ్రేట్ ఇండియా లాఫ్టర్ చాలెంజ్’ పేరుతో స్టాండప్ కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారాయన. ఏదైనా టాపిక్ ఎంచుకొని దాంతో హాస్యం పుట్టించగలగడమే స్టాండప్ కామెడీ. మిమిక్రీ కళకు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. హాస్యానికి సంబంధించిన షో కాబట్టి వెంటనే చేయాలనిపించింది అని ఈ షో గురించి పేర్కొన్నారు బ్రహ్మానందం. వినోదంతో పాటు విరాళమూ నటుడిగా, నిర్మాతగా, తమిళ నటుల సంఘానికి ప్రెసిడెంట్‌గా పూర్తి బిజీగా ఉన్నప్పటికీ టెలివిజన్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అన్నారు విశాల్. అయితే విశాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నది కేవలం టాక్ షో మాత్రమే కాదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే చారిటీ షో కూడా . ‘నామ్ ఒరువర్’ అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం తెలుగులో మంచు లక్ష్మి చేస్తోన్న ‘మేము సైతం’ స్టైల్లోనే సాగుతోంది. సెలిబ్రిటీలతో కొంచెం సేపు చిట్‌చాట్ చేయించి కష్టాల్లో ఉన్న వాళ్ల కోసం చారిటీగా ఏదైనా కార్యక్రమం చేసి ఫండ్స్ సేకరిస్తారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా కొంచెం సామాజిక స్పృహ ఉన్న షోతో ఎంట్రీ బావుంటుందని ఈ షో ద్వారా ఎంట్రీ ఇస్తున్నానని విశాల్ పేర్కొన్నారు. స్వప్న సుందరి కోసం... ‘స్వప్న సుందరి’ అనే రియాలిటీ షో ద్వారా హోస్ట్‌గా మారారు తమిళ నటుడు ప్రసన్న. ఈయన నటి స్నేహ భర్త. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’లో విలన్‌గా నటించారు. అమెరికన్ హిట్ షో ‘నెక్ట్స్ టాప్ మోడల్’ కాన్సెప్ట్‌తో ఈ స్వప్న సుందరి షోను రూపొందించారు. తమిళనాడు నెక్ట్స్ ‘సూపర్ మోడల్’ ఎవరు? అనేది ఈ షో కాన్సెప్ట్. కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచిన విజేతను స్వప్న సుందరిగా ప్రకటిస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెలలోనే స్టార్ట్ అయింది. ప్రశ్నించడం ఆపేద్దాం విశాల్ బాటలోనే వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా సామాజిక కోణం ఉన్న షో ద్వారానే టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఉన్నై అరిందాల్’ అనే షో ద్వారా సొసైటీలో ఉన్న సమస్యలను డిస్కస్ చేయదలిచారు. అలాగే ప్రేక్షకులు తమని తాము ప్రశ్నించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతోందని పేర్కొన్నారామె. ఎవరెవరు ఏమేం చేశారు? అని ప్రశ్నించడం ఆపేద్దాం. మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. జయ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. సినిమాల పరంగానూ ఈ ఏడాది వరలక్ష్మీ డైరీ ప్రతి పేజ్ మంచి సక్సెస్‌ను రాసిపెట్టుకుంది. ఆల్రెడీ నాలుగు రిలీజ్లు ఉన్న ఈ తార ఇప్పుడు ఇంకో రెండు రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. మా ఇంటి అల్లుడు ఆర్య.. తమిళంలో రొమాంటిక్ హీరో. అదే కాన్సెప్ట్‌తో ‘ఎంగ వీట్టు మాప్పిళ్లై’ (మా ఇంటి అల్లుడు) అనే షో రూపొందించారు. ఆర్య పెళ్లి కొడుకుగా అతని పరిణయం కోసం కొందరు కంటెస్టంట్స్ పాల్గొని, ఫైనల్ రౌండ్ వరకూ నిలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడు అన్నది ఈ షో కాన్సెప్ట్. ప్రస్తుతం తెలుగులో వస్తున్న ‘ప్రదీప్ పెళ్లి చూపులు’ తరహాలోనే ఈ కార్యక్రమం ఉంది. కానీ విశేషమేంటంటే షో ఆఖర్లో షో ఫైనలిస్ట్‌ని పెళ్లి చేసుకోబోవడం లేదని ఆర్య షాక్ కూడా ఇచ్చారు. సింగర్‌గా, నటిగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఇప్పటికే బాక్స్‌లకు టిక్ పెట్టారు శ్రుతీహాసన్. ఇప్పుడు టెలివిజన్ హోస్ట్ అన్న బాక్స్‌కు కూడా టిక్ పెట్టడానికి రెడీ అయ్యారు. తండ్రి కమల్‌హాసన్ బాటలోనే టీవీ ఆడియన్స్‌ను అలరించడానికి సన్నద్ధమయ్యారు ఈ నటి. సన్ టీవీలో ప్రసారం కాబోయే ‘హలో సాగో’ అనే షోకు హోస్ట్‌గా కనిపిస్తారు. ఈ విషయాన్ని ఇటీవలే తెలిపారు శ్రుతీ. కొత్త సినిమాలేవీ సైన్ చేయని శ్రుతీ ప్రస్తుతం మ్యూజిక్ కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఈ షో ఎలా ఉంటుందో అన్న డీటైల్స్ మాత్రం తెలియాల్సి ఉంది. హీరోయిన్లు సైతం చిన్న తెర మీద పెద్ద హీరోలతో పాటు పెద్ద హీరోయిన్లు కూడా తమ ప్రతిభ చాటుతున్నారు. జయసుధ, మంచు లక్ష్మీ, జీవిత, సుమలత, రోజా, ఆమని, రంభ, స్నేహ వంటి తారలు చిన్ని తెరకు ప్రాధాన్యం ఇచ్చి కొత్త అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇంటింటి తగాదాలు తీర్చే పనిలో జీవిత, సుమలత, రోజా చూపించిన సహనం, ఓర్పు, అనుభవం ప్రేక్షకులకు నచ్చింది. ఇక సామాజిక బాధ్యతతో ‘మేము సైతం’ కార్యక్రమం చేసి బాధితులను ఆదుకున్నారు మంచు లక్ష్మీ. కొన్ని షోలకు హోస్టులుగా సదా, ప్రియమణి, ఖుష్బూ పని చేశారు. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
కాంచనవనం
ఆకాశ వీధి నుంచి ప్రయాణం మొదలుపెట్టారామె. సినీపథంలో పరుగులు తీశారు. వాటిని దాటుకుని ఆమె తపోవనం చేరారు. అక్కడే తన దేవుడ్ని, తనని తెలుసుకున్నారు. ఆ వనమే కాంచనవనం. సన్మాన వేడుక కోసం హైదరాబాద్ వచ్చారు. అవార్డులూ రివార్డులు మీకు కొత్త కాదు.. కాంచన: 46 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ఈ సన్మానాలు, సత్కారాలు. కొత్త కాకపోయినా హ్యాపీ. స్వాతంత్య్రం రాకముందు (1939) ఆగస్ట్ 16న పుట్టారు. మొన్న బర్త్‌డేని ఎలా జరుపుకున్నారు? పదేళ్లుగా పుట్టినరోజు వేడుకలు లేవు. అసలు గుర్తుండేది కాదు. ఇప్పుడంటే వాట్సాప్ వచ్చింది కాబట్టి, ఎవరి పుట్టినరోజైనా ఇట్టే తెలిసిపోతోంది. అప్పట్లో అవి లేవు కదా. అందుకని గుర్తుపెట్టుకుని విషెస్ చెప్పేవాళ్లు తక్కువ ఉండేవాళ్లు. పుట్టిన రోజు ప్రత్యేకత ఏమీ లేదు. రోజూలానే పూజా పునస్కారాలు చేసుకుని, కాలక్షేపం చేశాను. చాలా ఏళ్ల తర్వాత ‘అర్జున్ రెడ్డి’లో మోడ్రన్ నానమ్మ పాత్రలో కనిపించడం ఆనాటి మీ అభిమానులకు ఓ ఆనందం. నేటి తరానికీ దగ్గరయ్యారు. ఇన్నేళ్లుగా ఎందుకు నటించలేదు? సరిగ్గా గుర్తు లేదు కానీ 1983లోనో 84లోనో ఇండస్ట్రీ వదిలేశా. సినిమా ప్రపంచానికి దూరంగా మరో లోకంలోకి వెళ్లాను. అందుకని సినిమాలు చేయడం కష్టం అనిపించింది. చాలామంది అడిగినా ఫోకస్ పెట్టడం ఈజీ కాదనిపించింది. ఓపిక కూడా పోయింది. ఇలాంటి పరిస్థితిలో సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ నన్ను చూడ్డానికి వచ్చేవాళ్లు. మాట్లాడేవాళ్లు. వెళ్లేవాళ్లు. ‘మా సినిమాలో నానమ్మగా చేయాలి’ అన్నారు. కథ బాగుంది. ఇద్దరూ ఉత్సాహంగా కనిపించారు. సరే అన్నా. సినిమాలు సడెన్‌గా ఎందుకు మానేశారు? ఎందుకంటే నాకు ఏం లేకుండా చేశారు. మా దాయాదులే చేశారు. మా పిన్నమ్మ వాళ్ల పిల్లలు. అంత అవసరం వాళ్లకు ఏం ఉంది? వాళ్లు చాలా గొప్పవాళ్లు. మేం సామాన్యులం అని. మేం గొప్పవాళ్లం అవ్వకూడదనేమో. వాళ్లు జమీందారీలు, మేం మామూలు వాళ్లం అని ఫీల్ అయ్యేవాళ్లు. సొంత అమ్మ చెల్లెలిగారి పిల్లలు. మీకు అవకాశాలు రాకపోవడానికి వాళ్లెలా కారణం అయ్యారు? మా పిన్నమ్మ కొడుకుతో ఇక్కడి (సినిమా ఇండస్ట్రీ) వాళ్లు టచ్‌లో ఉండేవాళ్లు. తను తప్పుదారి పట్టించడంతో అలా జరిగింది. మీరు సైలెంట్‌గా ఉన్నారా? మాటలు వేరు.. చేతలు వేరుగా. చాలా మంది అడిగారు.. ఇదే ప్రశ్న. మేం ఏమీ చేయలేం అనేదాన్ని. అయినా 45 ఏళ్ల తర్వాత ‘అర్జున్ రెడ్డి’ లాంటి హిట్ సినిమా చేయగలిగానంటే అది ఆనందమే కదా. గతాన్ని తలచుకోవడం వేస్ట్. మరో లోకం అన్నారు. అంటే.. ఆధ్యాత్మిక బాట అనుకోవచ్చా? గ్లామర్ ప్రపంచంలో పాపులారిటీని చూశాక ఈ బాటలో వెళ్లడం అంత ఈజీ అంటారా? చాలా కష్టం. అయితే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అది మనలో ముందే రాసి ఉంటుంది. రాయిని చూసినప్పుడు జస్ట్ రాయిలా కనిపిస్తుంది. శిల్పి ఏదైనా చెక్కితే అందులో దాగున్నది బయటికి వస్తుంది. అలాగే మనలో కూడా దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ దైవత్వాన్ని చూడటం అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మిక బాటలో వెళ్లడం చాలా సులువు. ఆధ్యాత్మిక బాట త్యాగాలను కోరుతుంది కదా? ఆ త్యాగాలు చేయడానికి మనిషి సిద్ధమైపోతాడు. ఎందుకంటే నీ అంతట నువ్వు ఈ రూట్‌ని సెలెక్ట్ చేసుకోలేవు. దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వీళ్లైతే నాకు బావుంటారు అని పవర్ స్వయంగా సెలెక్ట్ చేసుకుంటుంది. వివేకానందుడిని సెలెక్ట్ చేసుకున్నట్టు. రామకృష్ణ పరమహంస నుంచి వివేకానంద వరకూ.. చాలామందిని ఎంచుకుంది. ఆది శంకర కూడా చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకుంటాను అన్నాడు. వెళ్లిపోయాడు. అది విధి. భక్తి చిన్నప్పుడే మీకు అలవడిందా? అలవాటు కాదు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇది మన ఇళ్లల్లో ఆచారం. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పూజలు ముగించాకే మిగతా పనుల్లోకి వెళ్తాం కదా. ఆ అలవాటు జీవితాంతం కొనసాగుతుంది. కొందరు పాటించకపోవచ్చు. ఒక రాయికి దండం పెట్టుకుంటే అదే చిన్న గుడిలా అనిపిస్తుంది. నీ మనసు లగ్నం చేసి చూస్తే ప్రతి దాంట్లోకి పవర్ వస్తుంది. ఆ పవర్ నీకు సహాయం చేస్తుంది. నాకు సహాయంగానే ఉంది. ఇక్కడ ‘పవర్’ అంటే దేవుడు. మరి ఆ పవర్ మీ తల్లిదండ్రుల విషయంలో మిమ్మల్ని తక్కువగా చూడటం జరిగింది కదా. ఆస్తి విషయంలో మీ కన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేశారు? వాళ్ల కోసమే నా సుఖ సౌఖ్యాలు త్యాగం చేసుకున్నాను. మామూలుగా పిల్లల కోసం పెద్ద వాళ్లు బతకడం చూస్తుంటాం. కానీ నాలాంటివాళ్లు తల్లిదండ్రుల కోసం ఉంటారు. నేను అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాను. ఆ మర్నాడు గోకులాష్టమి. నాకు నరసింహస్వామి కనిపించాడు. భూగర్భం నుంచి నల్లటి మబ్బుల వరకూ మొత్తం ఆయనే నిండిపోయినట్లుగా అనిపించింది. ‘నీకు నేను ఉన్నాను’ అని అభయం దొరికిందనడానికి ఆ దృశ్యం నిదర్శనం. ఆ దృశ్యంలో ‘నువ్వు ప్రహ్లాదుడివి.. నేను నరసింహ స్వామిని’ అన్నాడు. అంతేగా.. ప్రహ్లాదుడి పట్ల తండ్రి నిర్దయగా ఉంటే నరసింహ స్వామి రక్షణగా ఉన్నాడు కదా. నాకు ఆ దేవుడు సహాయంగా ఉన్నాడు. అందుకే మా ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా ఆ ప్రభావం నా వృత్తి మీద పడలేదు. ఆస్తుల విషయాల్లో తలమునకలై ఉండేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎలా డైలాగ్ చెప్పగలుగుతున్నావు? ఎలా నటించగలుగుతున్నావు? అని షూటింగ్ లొకేషన్లో అడిగేవాళ్లు. ‘ఎక్కడి గడి అక్కడే వదిలేయాలి’ అనేదాన్ని. అప్పట్లో మీ పర్సనల్ లైఫ్‌లో మీరు ఎదుర్కొన్న సమస్యలు అందరికీ తెలుసా? వాణిశ్రీ, నేను చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునేవాళ్లం. తనకేదైనా సమస్య అంటే నేను తోడుగా.. నాకేదైనా అంటే తను తోడుగా ఉండేది. ఈ ప్రపంచంలో మనకు హాని చేయని వ్యక్తులు, మన గురించి నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తులు అమ్మానాన్న మాత్రమే అని నమ్మకం. మీ జీవితంలో ఆ నమ్మకం లేకపోవడం బాధాకరం. భగవంతుడు ఎంత బాగా చూసుకుంటున్నాడు? ఈ వయసులో నేను నీతో ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నానో గమనించావా? నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నాను. నా గొంతులో బలం తగ్గినట్లు అనిపించిందా? నాకు కాన్ఫిడెన్స్ లేనట్లు నీకు అనిపించిందా? అప్పట్లో నాతో కలసి నటించిన నా తోటి నటీనటులు చాలామంది ఇప్పుడు లేరు. రామారావుగారు వెళ్లిపోయారు. నాగేశ్వరరావుగారు వెళ్లిపోయారు. భగవంతుడు నన్నింకా ఇక్కడే ఉంచాడు.. ఆయనకు సేవ చేసుకోవడానికి. నేనెంతో ఇష్టపడే దేవుడికి రోజూ సేవ చేసుకోగలుగుతున్నా. దేవుడికి మించిన అండ ఏం ఉంటుంది? ఏం జరిగినా దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వెళుతున్నారు. కానీ జీవితంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఓ జీవిత భాగస్వామి ఉండాలంటారు. మీకు అనిపించలేదా? అనిపించింది. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ బంధం ఒక బెడద కింద అవుతుందని కూడా అనిపించింది. ఆ రోజుల్లో చాలామంది చచ్చీ చెడీ కలిసి ఉండేవారు. తర్వాత తరానికి వచ్చేసరికి ‘లివ్ అండ్ లిట్ లెవ్’ అంటున్నారు. మనం ఆనందంగా ఉండాలి.. ఆనందంగా ఉండనివ్వాలి. అది ఫర్వాలేదు. అయితే మనం ఇబ్బంది పడి, వాళ్లను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే.. అప్పుడు జీవితం బాగుంటుందా? ‘ఛీ ఇంతేనా?’ అనిపిస్తుంది కదా. ఈ ఆలోచనలే నాకు పెళ్లి మీద మనసు లేకుండా చేశాయి. ప్రస్తుతం డివైనిటీ (దైవత్వం) విషయంలో విదేశీయులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్లు భగవద్గీత చదువుతున్నారు. మనకు సంబంధించిన కళలను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వాళ్లకు తెలిసినంతగా మనవాళ్లకు తెలుసా? అని నా అభిప్రాయం. జనరల్‌గా మన ఆచారాలంటే ఉదయాన్నే నిద్ర లేవడం, కళలు (డ్యాన్స్‌లాంటివి) నేర్చుకోవడం... అలా ఉంటుంది. కానీ అవన్నీ మన కంటే వాళ్లు ఎక్కువగా పాటిస్తున్నారు. మరి.. మీ అమ్మానాన్నగారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా? వాళ్లు ఎప్పుడూ ఆస్తిపాస్తుల గోలలో ఉండేవాళ్లు. ఇక ఈ విషయం గురించి పట్టించుకునే తీరిక ఎక్కడ ఉంటుంది? కో–స్టార్స్‌లో మీకు ఆప్తులు ఉన్నారని చెప్పారు. వాళ్లెవరూ మీకు సలహా ఇవ్వలేదా? ఇచ్చేవాళ్లు. అయితే భగవంతుడికి ముందే తెలుసు. నాది ఆధ్యాత్మిక బాట అని. అందుకే అలా జీవిత భాగస్వామి లేకుండా మిగిల్చాడేమో. ‘భక్త తుకారం’ (1973) సినిమా చేసినప్పుడు నేను భక్తి మార్గంలో నడవడానికి ఆ సినిమా నాంది అవుతుందని ఊహించలేదు. కానీ ఆ సినిమా నాంది అయింది. ‘ఏమండీ మీ బతుకు భక్త తుకారాం అయిపోయింది’ అనేవాళ్లు. ఈ జన్మలో దక్కనిది వచ్చే జన్మలో అయినా దక్కాలనుకుంటాం. మళ్లీ జన్మంటూ ఉంటే మంచి తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారా? లేదు. నేను స్వామితోనే ఉండాలనుకుంటున్నాను. ఇంకో జన్మ అక్కర్లేదు. పూర్తిగా అన్నీ చేసేసి వెళ్లిపోతాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ జన్మ తాలూకు కర్మని పూర్తి చేస్తాను. అలా చేసే బలాన్ని, హెల్త్‌ని భగవంతుడు నాకు ఇచ్చాడనుకుంటున్నాను. ఎయిర్ హోస్టెస్ నుంచి హీరోయిన్ అయ్యారు. హీరోయిన్గా ఫస్ట్ సినిమా ‘కాదలిక్క నేరమిల్లై’ (1964–తమిళ్) సూపర్ డూపర్ హిట్. ఆ అవకాశం గురించి? డైరెక్టర్ సీవీ శ్రీధర్ ఫ్లైట్‌లో ప్రయాణించినప్పుడు నన్ను చూశారు. అప్పుడు ఆయన ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమా ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్గా నన్ను అడిగితే చేశాను. నా అసలు పేరు వసుంధరా దేవి. అప్పటికే ఆ పేరుతో ఓ నటి (ప్రముఖ నటి వైజయంతి మాల తల్లి వసుంధరా దేవి) ఉండటంతో నా పేరుని కాంచనగా మార్చారు. ఫస్ట్ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండాపోయింది. ఇంకో జన్మ ఉండటం, ఉండకపోవడం అనేది దేవుడి లీల అంటారు. మరో జన్మ ఉండకపోవడానికి మానవులు ఏదైనా చేసే ఆస్కారం ఉందా? ఏమీ చేయక్ల్కర్లేదు. భగవంతుడికి మనల్ని మనం పూర్తిగా అర్పించుకోవడమే. ఎవ్వరికీ అర్పించుకోవద్దు. చేసేవాళ్లు చేస్తుంటారు, పెట్టేవాళ్లు పెడుతుంటారు. మనకు రావల్సింది మనకు వస్తుంది. చెబితే తెలుసుకునేది కాదు. అనుభవించాల్సిందే. హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ‘మసక మసక చీకటిలో’ వంటి సాంగ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి ఐటమ్ సాంగ్స్ అవుతాయని ఊహించారా? లేదు. వాస్తవానికి ఆ పాట కథలో భాగంగా ఉంటుంది. కావాలని అతికించిన పాటలా ఉండదు. ఒక ఆర్గనైజేషన్ (సినిమా) కోసం మనం వర్క్ చేస్తున్నప్పుడు సక్సెస్ కోసమే పని చేస్తాం. వర్క్ ఈజ్ గాడ్. ఎంటర్ అయ్యాక వచ్చింది చేయాలి. అలా అనుకునే ఆ పాట చేశాను. తమిళ అమ్మాయి అయినా తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? పుట్టింది తమిళనాడులో. సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో. మా కుటుంబం ఆంధ్ర ప్రదేశ్‌లో. మూలం తెలుగు. అయినా నన్ను కాచుకున్నది తమిళనాడు. మీనాక్షి అమ్మవారంటే ఇష్టం. నేను ఎయిర్ హోస్టెస్‌గా ఉన్నప్పుడు ఫ్లైట్‌లో రష్ తక్కువ ఉన్నప్పుడు గోపురాలు ఏవైనా వస్తే, మా æపైలట్స్ పిలిచేవాళ్లు. ఎంత వీలుంటే అంత దగ్గరిగా చూసేవాళ్లం. నాలో భక్తి పెరగడానికి అది కూడా ఓ కారణం ఏమో? విగ్రహారాధన గురించి చెబుతారా? మానవుడికి ఓ రూపం ఉంది కాబట్టి, దేవుడికి రూపం ఇచ్చి, పూజలు చేస్తున్నారు. విగ్రహారాధన సులువు అని. కానీ స్వామి పేరు చెప్పకుండా, ఎదుట విగ్రహం లేకుండా ‘అయ్యా.. అమ్మా’ అని పూజ చేసుకున్నా ఫర్వాలేదు. వాళ్లు కూడా దేవుళ్లే. తల్లిదండ్రులను సవాల్ చేసి, కోర్టుకి వెళ్లి మీ ఆస్తి దక్కించుకుని, మొత్తం దేవాలయానికి రాసేశారు. ఎందుకలా? అది మా చెల్లెలికి రావాల్సిన ఆస్తి. తిరుపతికి రాసేయాలని తను అనుకుంది. అనుకున్నట్లే చేశాం. జీవితంలో ఎత్తు పల్లాలు ఎన్నో చూశా. అన్నీ ఉండి లేనిదాన్ని అనిపించుకున్నా. 1983లో దాయాదులు అస్తి లేకుండా చేశారు. అయినా దైవ కృప, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ నిలదొక్కుకున్నా. చెన్నైలో కలియుగ దైవం వేంకటేశ్వరుడికి రూ. 80 కోట్ల విలువ చేసే స్థలం ఇవ్వటం ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. నా మదిలో ఎప్పుడూ వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటాను. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు దయనీయ స్థితిలో ఉన్నారన్నది చాలామంది ఊహ... నన్ను మా చెల్లెలు, మరిదిగారు బాగా చూసుకుంటున్నారు. ఒక మనిషికి డబ్బు, హోదా అన్నింటికంటే చూసుకోవడానికి మనుషులు ఉండటం పెద్ద అండ. మనతో పాటు నిలబడగలిగే వాళ్లు ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? మా చెల్లెలు, మరిది వాళ్లంతా నాకు అండగా ఉన్నారు. చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేను. చాలా బాగున్నాను. ఫైనల్లీ ప్రస్తుతం మీ జీవన శైలి ఎలా ఉంది? ఉదయాన్నే మూడున్నరకు మెలుకొవ వస్తుంది. పనులేం చేయను. పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను. ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. భగవంతుడి ధ్యానంలోనే ఉంటాను. – డి.జి. భవాని -
సినీ నటితో సహజీవనం చేసి ముఖం చాటేశాడు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన వ్యక్తి ముఖం చాటేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణానగర్ బీ బ్లాక్‌లో ఉంటున్న నండూరి ఝాన్సీరాణి అలియాస్ మోనాలిసా సినీ నటి. ఇటీవల ఆమెకు వైజాగ్‌కు చెందిన చైతన్య అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కృష్ణానగర్‌లోనే సహజీవనం చేస్తున్నారు. బాధితురాలి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గదిలోనే దేవుడి ఫొటో ముందు మంగళసూత్రం కట్టాడు. అయితే తనను బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకోవాలని ఆమె నిలదీయగా నిరాకరించాడు. గత వారం రోజులుగా అతడి జాడలేకపోగా ఈ నెల13న ఇంటికి వచ్చిన చైతన్య బంధువులు ఆమెను బెదిరించారు. పలుమార్లు చైతన్యకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నీవు పెంచిన హృదయమే...
అన్నపూర్ణ వారి డా. చక్రవర్తి చిత్రంలో నేను నటించిన సుధ పాత్ర నా జీవితంలో మరచిపోలేను. ఆ పాత్ర మీదే చిత్రమంతా నడుస్తుంది. నా పాత్ర ముగిసిన తరవాత ఆ పాత్రకు కొనసాగింపుగా సావిత్రి పాత్ర వస్తుంది. అప్పటికే సావిత్రి పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎల్. వి. ప్రసాద్ గారి ‘ఇల్లాలు’ సినిమా తరవాత నేను చేసిన చిత్రం డా. చక్రవర్తి. అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని అపురూపంగా చూపారు ఈ చిత్రంలో. ఎన్టిఆర్, సావిత్రి నటించిన ‘రక్త సంబంధం’ చిత్రం తరవాత అన్నచెల్లెళ్ల అనుబంధానికి ఈ చిత్రాన్నే ప్రముఖంగా చెప్పుకుంటారు. ‘గీతాంజలీ! నువ్వు అమాయకంగా ఉంటావు, పాత్రలో నటించకు, ఆ అమాయకత్వం కనిపించేలా జీవించు’ అన్నారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుగారు. చదువు పూర్తి చేసుకుని, ఊరి నుంచి వచ్చిన అన్నయ్య (ఏఎన్ఆర్) తన చెల్లెలిని ఒక పాట పాడమని కోరతాడు. అప్పుడు వీణ మీటుతూ ‘పాడమని నన్నడగవలెనా/ పరవశించి పాడనా/ నేనే పరవశించి పాడనా/ నీవు పెంచిన హృదయమే/ ఇది నీవు నేర్పిన గానమే/ నీకు గాక ఎవరి కొరకు/ నీవు వింటే చాలు నాకు’ అంటూ అన్నయ్య వింటే చాలు అని పాడుతుంది సుధ పాత్ర. ఆ మాటలకే అన్నయ్య మురిసిపోతాడు. ఈ పాట అంతా వీణ వాయిస్తూ పాడాలి. నాకు వీణ వాయించడం రాదు. పాటకు అనుగుణంగా వీణ మీటకపోతే, వీణ తెలిసిన వారు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని పాటలోని ఏ వాక్యాలకు ఎక్కడ ఎలా మీటాలో, స్వరస్థానాలు ఎక్కడెక్కడ వస్తాయో అంతా ముందుగానే నేర్పారు. వారు చెప్పినది చెప్పినట్లుగా చేశాను. అందువల్ల అచ్చంగా నేను వాయించినట్లుగా ఉంటుంది సినిమాలో. ఆదుర్తి, షావుకారు జానకి, దుక్కిపాటి, అక్కినేని వంటి హేమాహేమీల సమక్షంలో నటించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘‘చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై/ ఆ పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై’ అంటూ అన్నయ్య మీద అనురాగం ప్రతిబింబించేలా రచించారు ఆత్రేయ. ఏఎన్ఆర్ చెల్లెలిగా నటిస్తానని ఎన్నడూ అనుకోలేదు. పాట చివరలో వీణ వాయిస్తూ పడిపోయి, మళ్లీ లేచి ‘‘ఈ వీణ మోగక ఆగినా/ నే పాడజాలకపోయినా/ నీ మనసులో ఈనాడు నిండిన/ రాగమటులే ఉండనీ, అనురాగమటులే ఉండనీ’ అంటూ పాడిన ఆ సందర్భం నేటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ పాటను మూడు రోజుల పాటు సారథి స్టూడియోలో తీశారు. పాట పూర్తయ్యాక, దుక్కిపాటి చాలా ఆనందించారు. ఆయనకు పెద్దగా నవ్వే అలవాటు లేదు. కాని నన్ను చూసినప్పుడల్లా చిన్నగా, ఆప్యాయంగా పలకరింపుగా నవ్వేవారు. అన్నపూర్ణ సంస్థ మీద నాకు అపారమైన గౌరవం. ఈ చిత్రంలో భర్తగా నటించిన వ్యక్తి (పేరు గుర్తు లేదు) సారథి స్టూడియోలో ఉండేవారు. అక్కడ షూటింగ్ జరిగే సినిమాలలో ప్రత్యేక పాత్రలు మాత్రమే వేసేవారు. డా.చక్రవర్తి సినిమాలో ఆయన నా భర్తగా నటించారు. ఈ చిత్రంలో డైలాగులు కె. విశ్వనాథ్‌గారు నేర్పడం వల్ల, చాలా బాగా చెప్పగలిగాను. సుధ పాత్రకు నేను చూపిన నటన చూసి సావిత్రిగారు నన్ను మెచ్చుకున్నారు. సుధ పాత్రకు నేను న్యాయం చేయకపోతే, ఆ పాత్రకు కొనసాగింపుగా వచ్చే సావిత్రిగారి మాధవి పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుంది. అందరి ఆశీర్వాదంతో ఈ పాట చిరస్థాయిగా నిలబడింది. ఈ ప్రభావంతో ఏఎన్ఆర్కి చెల్లెలిగా పదిహేను సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తాను. -గీతాంజలి ,సినీ నటి -
బిగ్‌బాస్ : సునయన ఎలిమినేషన్ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-2 మరింత రసవత్తరంగా మారింది. గతవారం కాస్త చప్పగా సాగిన ఈ రియాల్టీ షో మళ్లీ వేడెక్కింది. బాగ్‌బాస్ సూపర్ టాస్క్‌తో గేమ్‌ను రక్తికట్టించాడు. భావోద్వేగాలతో సాగే ఈ గేమ్‌ను ఆ దిశగా నడిపించాడు. ఇంటి సభ్యుల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను బయటకు తీశాడు. ఇలా మంగళవారం ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులను రెండు జట్లుగా వీడదీసిన బిగ్‌బాస్.. టెలికాలర్స్ Vs పబ్లిక్ కాలర్స్ అనే టాస్క్‌ను ఇచ్చాడు. బిగ్‌బాస్ టెలికాలర్స్ జట్టులో కౌశల్, సామ్రాట్, నూతన నాయుడు, అమిత్, శ్యామల, దీప్తిలు ఉండగా.. గీతా మాధురి, తనీశ్, దీప్తీ సునయన, గణేశ్, రోల్‌రైడా, పూజా రాంచంద్రన్‌లు పబ్లిక్ కాలర్స్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్ టెలికాలర్స్‌ను విసుగెత్తించి కాల్ కట్ చేసేలే చేస్తే పబ్లిక్ కాలర్స్‌కు ఓ పాయింట్ లభిస్తోంది. దీనికోసం వారు ఏదైనా మాట్లడొచ్చు. ముగ్గురు టెలికాలర్స్ షిఫ్ట్ బజర్ మోగేంత వరకు ఏమైనా అక్కడి నుంచి లేవకూడదు. ఈ బజర్ మోగేలోపు పబ్లిక్ కాలర్స్ షిప్ట్‌లో ఉన్న ముగ్గురికి కాల్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ కౌశలే టార్గెట్.. ఈ టాస్క్‌లో ఎప్పటిలానే మళ్లీ కౌశలే టార్గెట్ అయ్యాడు. ఇంటి సభ్యులు మరోసారి సూటి పోటి మాటలతో దాడి చేశారు. ఎంత పర్సనల్‌గా దాడి చేసినా కౌశల్ మాత్రం అదే రితీలో బదులిచ్చాడు. ఇప్పటి వరకు కొంత స్నేహంగా ఉన్న గీతా-కౌశల్‌ల మధ్య ఉన్న మనస్పర్థలు ఈ టాస్క్ ద్వారా బయటపడ్డాయి. తొలుత కాల్ చేసిన గీతా మాధురి ఈ వారం నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. అతన్ని విసిగించసాగింది. అబద్దాలు ఆడుతున్నావని, గేమ్ కోసం ఏమైనా చేస్తావా? అని ఘాటుగా ప్రశ్నించింది. ఇక టాస్క్‌కు ముందు కొంత ఎమోషన్ అయిన గీతా ఇంటి సభ్యుల అందరి దగ్గరకు వచ్చి టాస్క్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసింది. తీరా ఆమె కౌశల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తనీశ్ Vs శ్యామల సెకండ్ కాల్ చేసిన తనీశ్ సైతం శ్యామలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె రీఎంట్రీని సహించని అతను పలుసంధర్భాల్లో ఆవిషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిదే. గత టాస్క్‌లో దీప్తి సునయన వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశాడు. ఎలిమినేషన్‌కు గురించి ఆమెకు ఆగ్రహం తెప్పించేలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె ఓపికగా సమాధానం చెప్పింది. దీంతో తనీష్ ఏం చేయలేక ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత రోల్‌రైడా సేఫ్‌గా స్మార్ట్ గేమ్ ఆడాడు. ఎవరిని మాటలతో నొప్పించకూడదనుకున్న రైడా.. సామ్రాట్‌కు కాల్ చేసి కౌశలా? అని అడిగాడు. దానికి రైడా ఫోన్ పెట్టేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి సామ్రాట్‌ను బోల్తా కొట్టించాడు. ఇది గ్రహించని సామ్రాట్ ఫోన్ పెట్టేసి పప్పులో కాలేసాడు. దీంతో పబ్లిక్ కాలర్స్‌కు ఓ పాయింట్ లభించింది. కౌశల్.. జనాలు తూ.. దీప్తి సునయన సైతం మళ్లీ కౌశల్‌కే కాల్ చేసింది. షో ఆరంభం నుంచే అతనంటే గిట్టని సునయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. కౌశల్ ఫోన్ ఎత్తగానే అసభ్య పదజాలంతో మొదలు పెట్టింది. దీనికి స్టన్ అయిన కౌశల్ తేరుకోని అదే రీతిలో బదులిచ్చాడు. ఒక దశలో వీరి సంభాషణ హద్దులు దాటింది. ముఖ్యంగా సునయన కౌశల్‌ను కించపరిచేలా మాట్లాడుతూ అతని సహనాన్ని పరీక్షించింది. ‘అసలు నువ్వు హౌస్‌లోకి ఎందుకొచ్చావ్.. షోను 24 గంటలు జనాలు చూస్తే తూ అంటారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె మాటలకు దగ్గట్టే జవాబిచ్చాడు. పాటలు పాడమని, స్టోరీలు చెప్పమని విసగించడంతో కౌశల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. ఓ దశలో హద్దులు దాటి ప్రవర్తించాడు. బయటి వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ ఆమె మాటల దాడికి కౌంటర్ ఇచ్చాడు. స్టోరీలు చెప్పమంటే హౌస్‌లో ఆమె ప్రేమాయణం చెప్పాడు. పాట పాడమంటే ఆమెకు సంబంధించే పాడాడు. దీంతో సునయన కన్నీటి పర్యంతమైంది. దాదాపు కొన్ని గంటల పాటు సునయన విసిగించింది. కనీసం వాష్ రూం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీం సభ్యుల సాయంతో కౌశల్ అక్కడే కానిచ్చాడు. ఇక గణేశ్ కూడా కౌశల్‌నే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సునయనపై ట్రోలింగ్.. సునయన మాటలు, కౌశల్‌తో వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఆమెను టార్గెట్ చేసింది. దాదాపు బిగ్‌బాస్ హౌస్‌ను తమ ఆదీనంలో తీసుకున్న కౌశల్ ఆర్మీ.. ప్రతివారం ఒకరిని టార్గెట్ చేస్తూ బయటకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కౌశల్ పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరీటీ, భానుశ్రీ, తేజస్వీ, బాబుగోగినేనిలు బయటకు వెళ్లేలా చేశారు. ఇన్ని రోజులు నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్న దీప్తి సునయన ఈ వారం నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎన్నో రోజులుగా చూస్తున్న వారు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఈ సారి సునయన నిష్క్రమణ దారితీయనున్నాయా? అంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే అది బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు! చదవండి: అసలు ఎలిమినేషన్ మజా ఈ వారమే! -
బిగ్‌బాస్: తనీష్ నువ్వెలా బెస్ట్ ప్లేయర్?
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్-1 కన్నా హౌజ్ మేట్స్ గొడవలు, సోషల్ మీడియా ట్రోల్స్‌తో ఈ సీజన్ వేడెక్కింది. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై ఆరాతీశాడు. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల ప్రవర్తనపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశాడు. చెప్పిందే చెప్పి తనకే బోర్ వస్తుందని, హౌస్ మేట్స్ మాత్రం మారడం లేదన్నాడు. కాస్త సీరియస్‌గానే సాగిన ఈ ఎపిసోడ్లో ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరికింది. రజనీకాంత్ ‘నరసింహా’ సినిమా స్టోరీని పిట్టకథగా చెబుతూ షోను ప్రారంభించిన న్యాచురల్ స్టార్.. డబ్బు ఏమైనా చేస్తుందని, దానితో జాగ్రత్త ఉండాలని, హౌస్‌లో కూడా ఇదే నిరూపితమైందని తెలిపాడు. శుక్రవారం హౌస్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర ఘటనలను నాని చూపించాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌తో నెలకొన్న బంధం గురించి సరదాగా ముచ్చటించారు. ఇక కౌశల్ కొందరి ఇంటిసభ్యులను ఇమిటేట్ చేస్తుండగా నూతన్ నాయుడు వారి పేర్లు చెప్పాడు. నామినేషన్లో ఉన్న కారణంగా ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ.. తన దగ్గరకు వచ్చిన దీప్తిపై నూతన్ నాయుడు ఫైర్ అయ్యాడు. (చదవండి: బిగ్‌బాస్-2.. అదే అసలు సమస్య!) తనీష్‌కు క్లాస్... తొలుత నామినేషన్లో ఉన్న ఒక్కక్కరితో నాని ముచ్చటించారు. ముఖ్యంగా తనీష్‌కు గట్టిగానే క్లాస్ పీకాడు. టాస్క్‌లో దీప్తి సునయన కోసం తప్పుకోవడం ఏమిటని మందలించాడు. దీనికి తనీష్ కాలునొప్పితో అలా చేశానని, సునయన కోసం కాదని ఎదో సాకు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నాని కన్విన్స్ కాలేదు. ఇక ఏ టాస్క్‌లో పాల్గొని నువ్వు బెస్ట్ ప్లేయర్ ఎలా అయ్యావని ప్రశ్నించాడు. కబడ్డీ టాస్క్, క్రైయింగ్ టాస్క్, బాక్స్ టాస్క్‌ల్లో పాల్గొనలేదు మరీ ఎలా బెస్ట్ పర్ఫార్మర్ అయ్యావు అని నిలదీశాడు. ఈ ప్రశ్నకు తనీష్, అతని మద్దతుదారులకు దిమ్మతిరిగింది. సమాధానం చెప్పడంలో తనీష్ తడబడ్డాడు. ఇక కౌశల్ కాయిన్స్ తీసుకెళ్లడం వ్యతిరేకించిన తనీష్ పూజా విసిరిన కాయిన్స్ ఎలా తీసుకుంటావని ప్రశ్నించాడు. ఎదో ఒకవైపు ఉండాలి అని మందలించాడు. గణేష్ మళ్లీ హౌస్‌లో కనబడటం లేదని, సమోసాలు, వర్షం అంటూ ఎదో చెప్పాడు. అయినా వేడివేడి వర్షం ఏంటీరా నాయనా అని ప్రశ్నించాడు. దీంతో నవ్వులు పూసాయి. బాబు డబుల్ గేమ్.. బాబుగోగినేని నుంచి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని, ప్రతీసారి ఇదే చెబుతున్నాని, కానీ తను మాత్రం లైట్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక కాయిన్స్ టాస్క్‌లో కౌశల్ కాయిన్స్ ఎత్తుకెళ్లడాన్ని మహిళా కంటెస్టెంట్స్ వద్ద తప్పుబట్టడం, మళ్లీ కౌశల్ వద్ద సమర్ధించడం ఎంటని ప్రశ్నించాడు. దీనికి బాబు తనదైన సమాధానంతో నాని ట్రాప్‌లో పడే ప్రయత్నం చేశాడు. కానీ నాని వీడియో క్లిప్ ప్లే చేసి బాబు డబుల్ గేమ్‌ను బయటపెట్టాడు. దీనికి బాబుగోగినేని సైతం తన తప్పును అంగీకరించాడు. ఎలాగోలా బతికే చేపలు.. హౌస్‌లో అమిత్, రోల్‌రైడాలు ఎలాగోలా బతికే చేపలని నాని కామెంట్ చేశాడు. వీరు మంచితనం అనే ముసుగులో గేమ్ ఆడుతున్నారని, ఇంకా అది పనిచేయదని సూచించాడు. అమిత్ డబుల్ గేమ్‌ను సైతం వీడియో క్లిప్‌తో బట్టబయలు చేశాడు. కౌశల్‌తో కాయిన్స్ తీయడాన్ని సమర్ధించడం.. మళ్లీ ఆ విషయమే తనే తీయాలని రోల్రైడాతో చర్చించడం.. చివర్లో ఎవరికి చెప్పావని కౌశల్‌ను ప్రశ్నించడం ఏమిటని నాని నిలదీశాడు. ఏదో ఒకనిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నాడు. ఆ విషయంలో నచ్చావ్ కౌశల్.. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా దీప్తి సునయన సంచాలకులుగా వ్యవహిరంచడం ఏమిటని నాని ప్రశ్నించాడు. తనీష్‌కు క్లోజ్‌గా ఉండే తను న్యాయంగా ఉన్నా అలా అనిపించడం లేదన్నాడు. దీనికి సునయన ఎప్పుడు చేయలేదు కదా అని చేశా.. నిజాయితీగానే చెప్పా అని సమాధానమిచ్చింది. దీనికి ఎలిమినేష్న్ ఎప్పుడు కాలేదు కదా అని అయితావా ఏంటీ అని పంచ్ ఇచ్చాడు. ఇదే ఎవరి గొయ్యి వారు తవ్వుకోవడం అని బదులిచ్చాడు. ఈ టాస్క్ వ్యవహారంలో కౌశల్ ఓ స్టాండ్ తీసుకోని తన అభిప్రాయాన్ని వెల్లడించడం నచ్చిందని నాని మెచ్చుకున్నాడు. అయితే ఆ టాస్క్‌లో నేనైతే ఇలా చేశావాడినని, తోసేవాడినని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. దానికి నేనైతే ఇలా ఆడేవాడినని మాత్రమే చెప్పానని కౌశల్ బదులిచ్చాడు. ఇక కాయిన్స్ టాస్క్ మొత్తం మార్చేశావని, అయితే ఆ పని మీ జట్టు సభ్యులకు చెప్పి చేస్తే బాగుండేదని నాని అభిప్రాయపడ్డాడు. ఇక సామ్రాట్ బాగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. గీతాగారు మీరు ఇన్ఫ్లూయెన్స్.. గత వారం నుంచి ఓ ఇంటి సభ్యుడితో ఓ లక్కీ అభిమాని ఫోన్ మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా వరంగల్ నుంచి గీతామాధురి అభిమాని మాట్లాడారారు. ముందుగా నాని న్యాచురల్‌గా హోస్ట్ చేస్తున్నాడని కితాబిచ్చి.. గీతా మాధురితో మాట్లాడారు. ‘ తొలి రోజుల్లోని మీ ప్రవర్తనకు ఇప్పటికి తేడా వచ్చిందని, మీరు దీప్తి, శ్యామల మాటలకు ప్రభావం అవుతున్నారని ప్రశ్నించారు. మీరు మీలానే ఉండాలని సూచించారు’. దీనికి గీతా సైతం అలానే ఉండటానికి ప్రయత్నిస్తానని సమాధానిమచ్చింది. చివర్లో కౌశల్ నాని టాస్క్‌ల్లో హౌజ్ మేట్స్ నిజాయితీగా బెస్ట్ పర్ఫార్మర్ పేరు చెప్పడం లేదన్నాడు. దీనికి వారు నిజాయితీగా లేకుంటే ప్రేక్షకులున్నారు. నీకు ప్రేక్షకులు కావాలా కంటెస్టెంట్స్ కావాలా అని ప్రశ్నించాడు. దీనికి కౌశల్ ప్రేక్షకులేనని సమాధానమిచ్చాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న గీతా మాధురి, శ్యామల ప్రొటెక్ట్ అయ్యారని నాని తెలిపాడు. మిగిలిన తనీష్, బాబుగోగినేని, గణేష్, దీప్తిల్లో ఎవరూ ప్రొటెక్ట్ అవుతారు? ఎవరూ ఎలిమినేట్ అవుతారో తెలియాంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. -
బిగ్‌బాస్ హౌస్‌లో లోకనాయకుడు!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. గురువారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులు రచ్ఛరంభోలా చేశారు. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా జరిగిన డీజే టాస్క్‌లో చిందేసారు. అత్యంత ఆహ్లాదకరంగా.. ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్‌లో ఇది ఓ బెస్ట్ ఎపిసోడ్‌గా చెప్పొచ్చు. హౌస్‌లోకి నూతన నాయుడు, శ్యామల సైతం రీఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో హౌస్ మేట్స్ రెట్టించిన ఉత్సాహం ప్రదర్శించారు. కెప్టెన్ పోటీదారులైన పూజా రామచంద్రన్, సామ్రాట్, రోల్‌రైడాలు డీజేలుగా వ్యవహరించగా.. వారికి మద్దతుగా ఇంటి సభ్యులు వారి ముందు డ్యాన్స్ చేశారు. సరిసమానంగా సామ్రాట్, పూజా డీజేల మందు ఇంటి సభ్యులు డ్యాన్స్ చేయగా టై అయింది. మళ్లీ బిగ్‌బాస్ మరో సాంగ్ ప్లే చేయడంతో మేజారిటీ సభ్యులు పూజాకు మద్దతివ్వడంతో ఆమె తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి సభ్యులు చిందేశారు. ముఖ్యంగా దీప్తి సునయన, శ్యామల, గీతా మాధురి, గణేశ్‌లు అదరగొట్టారు.. ఆఖరికి బాబుగోగినేని సైతం డ్యాన్స్ చేశాడు. ఇక ఎపిసోడ్ చివర్లో హౌస్‌లోకి లోక నాయకుడు.. భారతీయుడు వస్తున్నాడని హోస్ట్ నాని హౌస్ మేట్స్‌కు తెలియజేస్తున్న ఓ ప్రోమోను చూపించారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన ఇంటి సభ్యులు తమ అభిమాన హీరోను చూసి పులకించిపోయారు. కాళ్ల మీద పడుతూ తమ అభిమానం చాటుకుంటూ ఘనస్వాగతం పలికారు. అయితే ఇది ఈ ఎపిసోడ్లో ప్రసారం కానుంది. ఇక విశ్వరూపం 2 ఆడియో రిలీజ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన కమలహాసన్.. ఆ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఈ లోకనాయకుడు బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమలహాసన్ హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ హోస్ట్‌గా.. అగ్ర హీరోగా కమల్ ఇంటిసభ్యులతో ఎలా గడుపుతారో చూడాలి మరి! చదవండి: నేషనలిజానికి అర్థం నాకు తెలుసు: కమల్ -
వైఎస్ జగన్ మాటిస్తే తప్పే మనిషి కాదు
-
జగన్ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకం
-
బిగ్‌బాస్ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా చేస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 హౌస్ నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తేజస్వీ మడివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో కంటెస్టెంట్లు ఏం చేస్తారన్నది కేవలం గంటసమయం చూపిస్తారని, అందులో తన గురించి చూపించింది నిజాలు కాదని ఆరోపించారు. అది చూసిన అభిమానులు తాను తప్పు చేసినట్లుగా భావించమే తన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమన్నారు. కేవలం తాను అరిచిన విషయాలే బిగ్‌బాస్‌లో చూపించారని, ఎన్నోసార్లు కౌశల్‌కు సారీ చెప్పినా ఎందుకు చూపించలేదో అర్థం కావడం లేదన్నారు. అసలు కౌశల్‌తో తాను గొడవ పడలేదని, కౌశల్ వేరు అమ్మాయిపై చెయ్యి వేస్తే తాను అడిగానని, అందుకే కౌశల్ ఆర్మీ తనను టార్గెట్ చేసిందన్నారు. ఈ మేరకు నటి తేజస్వి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నన్ను మిస్ జడ్జ్ చేశారు నా లైఫ్‌లోనే బిగ్‌బాస్ హౌస్ లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోలేదు. బిగ్‌బాస్ ఇంటికి హ్యాపీగా వెళ్లాను. తొలుత ఇంట్లో ఎవరూ నచ్చలేరు. కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. తనీష్, సామ్రాట్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. నిన్న బయటకు వచ్చే వరకు చాలా ఎంజాయ్ చేశా. బయటకు వచ్చి చూస్తే నాకు కౌశల్ ఆర్మీ హేటింగ్ గురించి తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో 24 గంటలు ఉంటే.. కేవలం మీరు గంట చూసి నాపై నిర్ణయాన్ని తీసుకోకూడదు. మొత్తం 24 గంటలు చూస్తే మీకు తెలుస్తుంది. ఏదైనా జరిగితే నేను కౌశల్ మీద అరిచి ఉంటాను. కానీ ముందు జరిగినది బిగ్‌బాస్ వాళ్లు చూపించలేదు. తలాలోకా లేనివి టీవీల్లో చూసి కౌశల్ ఆర్మీ నాపై విరుచుకు పడుతోంది. కౌశల్ ఆర్మీ ఒకవేళ 24 గంటలు హౌస్ లోపల ఉంటే మీరే అతడిని చంపి బటయకు తీసుకొస్తారు. నాకు సపోర్టు చేసిన హౌస్‌లోని లేడీస్ అందరికీ థ్యాంక్స్. 24 గంటలు ప్రసారం చేస్తే.. కౌశల్ ఆర్మీ వల్ల నాకు మంచే జరిగింది. వారి కోపం వల్ల వేరే వైపు నుంచి నాకు మద్దతు లభిస్తోంది. మీ కౌశల్ అన్నను ఎవ్వరూ ఏం అనలేదు. మీ అన్న అందరూ నిద్రపోయాక లేచి మొత్తం ఫుడ్ తినేస్తాడు. హౌస్ నుంచి బయటకొచ్చాక చూస్తే గీతా అక్క, దీప్తి, రోల్‌రైడా.. ఇలా అందరు లోపల నేను ఉన్నప్పుడు ఉన్నట్లు బయటకు వచ్చాక వాళ్లు అలా లేరు. 24 గంటలు షో ప్రసారం చేస్తే కౌశల్ ఏం చేస్తున్నాడో అందరికీ తెలుస్తుంది. బూతులు మాట్లాడుతున్నారు.. ఎందుకండీ. నేను ఒక్క బూతు మాట అన్నందుకు మీరు వంద అంటున్నారు. అలా అయితే మీకు నాకు తేడా ఏంటీ. హౌస్‌లోకి మళ్లీ పంపించండి.. ప్లీజ్! నేనేంటో మీకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నాకు ప్రేమను ఇస్తే.. నేనేం చేయగలనో మీకు తెలియాలంటే నాకు మరో అవకాశం ఇవ్వండి. నన్ను మళ్లీ చూడాలనుకుంటే నాకు ఓటింగ్ చేయండి. కేవలం షోలో చూపించింది చూసి ఏమాత్రం ఆలోచించకుండా ఓట్లు వేయడం వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను. మీరు ఇప్పుడైనా విశ్లేషించుకోండి. అక్కా, చెల్లి, ఫ్రెండ్ ఇలా ఏమనుకున్నా సరే.. నాకు ఓటింగ్ చేయండి. నేను పైకి రావాలన్నా, ఏం సాధించాలన్నా అభిమానుల మద్దతు తప్పకుండా కావాలి. ఈరోజు రాత్రి షో చూడండీ. ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ అయినా మళ్లీ ఎంట్రీ ఇవ్వొచ్చు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి : నెటిజన్ల ట్రోలింగ్ తనకు మరో అవకాశం ఇవ్వాలని తేజస్వీ కోరగా.. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నీ మనసు గెలిచింది సామ్రాట్, తనీష్.. కానీ కౌశల్‌కు ఆర్మీ ఉంది’, ‘మీ యాటిట్యూడ్ మాకు నచ్చదు. కౌశల్‌ని చాలా బాధపెట్టారు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు’, ‘మేడం.. మీ బూతులు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాయి. మీరు లేనిలోటు తెలుస్తోంది. మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలి’, ‘అక్కా.. ఎందుకక్కా మాపై కక్ష .. మళ్లీ బిగ్ బాస్ కి వెళ్లకు.. మమ్మల్ని హ్యాపీగా బిగ్ బాస్ ని చూడనివ్వు అక్క..’, అని, ‘ఇప్పుడు హౌస్ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు హౌస్‌లో ఉంటే మేం కుటుంబం మొత్తం కలిసి ఇన్ని రోజులు షో చూడలేకపోయాం’, అంటూ నెటిజన్లు తేజస్వీనిని ట్రోల్ చేశారు. తేజస్వీ వీడియోకు వచ్చిన కామెంట్లు స్క్రీన్‌షాట్ -
బిగ్‌బాస్: తేజస్వీ ఔట్
సాక్షి, హైదరాబాద్ : అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్ హౌస్ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్ అయింది. అదేంటీ ఎపిసోడ్ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్ ఒక రోజు ముందు షూటింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి తేజస్వీయే ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించినదే.. ఓ టాస్క్‌లో కౌశల్‌తో ప్రవర్తించిన తీరు.. ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురాగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఈ దెబ్బతోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భాను శ్రీ గతవారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌మెట్స్‌కు క్లారిటీ ఇచ్చింది. కౌశల్ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, ఇప్పుడు తనువంతు వచ్చిందని, హౌస్ నుంచి నిష్క్రమించడానికి లక్ష కారణాలున్నాయని పేర్కొంది. ఈ విషయం శనివారం ఎపిసోడ్లో కనిపించింది. ప్రస్తుతం తేజస్వీ ఎలిమినేట్ అయిన విషయం సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె బయటకు వచ్చిన అనంతరం అభిమానులు దిగిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. తేజస్వీ ప్రేమలో పడ్డా.. ఇక అర్థరాత్రి లైట్స్ ఆఫ్ అయినా పడుకోకుండా ఎలిమినేషన్ జాబితాలో ఉన్న రోల్‌రైడా దీప్తి, తనీష్‌లు, సామ్రాట్, తేజస్వీలు హౌస్‌లోకి ఎందుకు వచ్చామో ఒక్కొకరు తెలిపారు. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. 100 రోజుల్లో 50 లక్షలు గెలుచుకోవచ్చని, సినిమాలు చేసిన ఇంత సంపాదించలేనని అందుకే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు పేర్కొంది. నిజానికి తాను ఎవరిని ప్రభావితం చేయలేదని, సామ్రాట్‌ను అనుసరించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఈ చర్చ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు బిగ్‌బాస్ హౌస్‌కు రావాలని లేదు. నా జీవితంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేనేంటో నిరూపించుకోవడానికి వచ్చా. ఇక్కడికి వచ్చాక నాకు తేజస్వీ నుంచి స్వచ్చమైన ప్రేమ దొరికింది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వీరి బంధం బయట కూడా కొనసాగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఆకట్టుకున్న నాని.. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని తనదైన శైలితో అలరించాడు. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అందరి నటనను సమీక్షించాడు. ఇక ఈ వారంలో హైలైట్‌గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడాడు. అమిత్‌కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్, గణేష్ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్ ఏడ్వడం.. దీప్తి, గణేష్‌లు నామినేషన్ గురించి చేసిన హంగామా.. నందిని, కౌశల్ మధ్య జరిగిన సంభాషణలపై చర్చించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తనీష్‌కు అభినందనలు తెలిపాడు. ఎలిమినేషన్ జాబితాలో ఉన్న రోల్‌రైడా, దీప్తీ, తనీష్‌లను ప్రోటెక్ట్ అయ్యారని చెప్పి.. బిగ్‌బాస్ ప్రేమజంటలో ఒకరు నిష్క్రమించక తప్పదు అని పేర్కొన్నాడు. అయితే ఈ సస్పెన్స్‌తో రేటింగ్స్ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్ వ్యూహానికి గట్టి దెబ్బ తగిలింది. తొలి వారం సంజన ఎలిమినేషన్ తప్ప అన్నీ వారాలు ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం ముందే తెలిసిపోయింది. బయటకు వచ్చిన అనంతరం తేజస్వీతో ఓ అభిమాని సెల్ఫీ.. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా యాంకర్ ప్రదీప్
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వ్యాఖ్యాత నేచురల్ స్టార్ నాని శని, ఆది వారాల్లో చెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాని ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అన్నది నిజమే అనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త సెలబ్రిటీల ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ హౌస్‌కి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ హెబ్బా పాటేల్ వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్‌బాస్ హౌస్‌కి లగేజ్‌తో సహా దిగిన ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్‌ను చూసిన కంటెస్టెంట్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రదీప్ రాగానే అందరూ హత్తుకుని అతనికి ఆహ్వానం పలికారు. ప్రదీప్ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే.. వారం రోజుల్లో పంపించేస్తాం అని ఆటపట్టించగా.. రాగానే మొదలు పెట్టారా అని ప్రదీప్ సమాధానం ఇచ్చారు. మీ వాడిని మీలో ఒడిని కాబట్టి మీలాగ ఇక్కడికి ఖాళీ చేతులతో రాదలచుకోలేదని చెప్పి, ఒక్కొక్కరి గురించి చెబుతుండగా.. కంటెస్టెంట్లు అందరూ కంటతడి పెట్టుకున్నారు. పోను పోను నేను పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు. అయితే 16 మందితో మొదలైన బిగ్ బాస్ షో ను ఇప్పటికే ఐదు మంది (సంజన, నూతన్ నాయుడు, కిరిటీ, శ్యామల, భానుశ్రీ) హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ప్రదీప్ హౌజ్‌లో ఎన్ని రోజులు ఉంటారో వేచిచూడాల్సిందే. అయితే ఆయన గెస్ట్‌గా మాత్రమే హౌజ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. . @impradeepmachi makes a Grand Entry to the Bigg House 😉#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/mXZVXMnjCl — STAR MAA (@StarMaa) July 19, 2018 -
బిగ్‌బాస్ ఎంట్రీపై హీరోయిన్ క్లారిటీ
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. హోస్ట్ నాని శని, ఆది వారాల్లో బెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అనేలా ఉంది హౌస్‌లో పరిస్థితి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి ఈసారి ప్రముఖ హీరోయిన్, కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హెబ్బా స్పందించారు. దీనిపై ఆమె ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడారు. తను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన లేదని.. తనను దీనిపై ఎవరు సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నానని హెబ్బా తెలిపారు. ఇక బిగ్‌బాస్ హౌస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్ అయ్యారు. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కామన్‌మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
బిగ్‌బాస్ : వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఏమైనా జరుగొచ్చు అన్న ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టే సోమవారం ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగా.. మరికొంత నిరుత్సాహంగా సాగింది. కామన్‌మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ చిన్నపిల్లాడిలా బాధపడ్డాడు. ‘నేను వెళ్తా.. ఇలా అయితే ఈ హౌజ్ నాకు అవసరం లేదు.. నన్ను ఎలిమినేట్ చేసేయండి.. కొట్టించుకోవడానికి రాలేదు’ అంటూ బోరుమన్నాడు. ఇంతకీ జరిగిందేమిటంటే.. వారం ప్రారంభ ఎపిసోడ్ కావడంతో బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టాడు. తొలుత కంటెస్టెంట్స్‌ను హౌస్‌లో ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదో ఆ ఒకరి పేరును ఏకాభిప్రాయంగా సూచించాలని ఆదేశించాడు. దీనికి హౌస్ మేట్స్ వారిలో వారు చర్చించుకోని ఓటింగ్ నిర్వహించి అమిత్ పేరును సూచించారు. అయితే ఇక్కడ అమిత్ పేరును తొలుత గణేశే ప్రస్తవించాడు. దీంతో బిగ్‌బాస్, అమిత్ ఇప్పటి నుంచి హౌస్‌లో అదృశ్యవాసి అని అతనితో ఎవరు మాట్లాడవద్దని ఆదేశించాడు. అమిత్ ఎలిమినేషన్‌కు డైరెక్ట్‌గా నామినేట్ అయినట్లు కూడా తెలిపాడు. ఇక్కడ అతనికి బిగ్‌బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే ఎలిమినేషన్ నుంచి తప్పిస్తానన్నాడు. బేడీలు..నామినేషన్లు.. కంటెస్టెంట్స్‌లను వారికి ఇష్టమైనవారితో జోడీలుగా విడిపోమ్మని బిగ్‌బాస్ సూచించాడు. దీనికి హౌస్ మేట్స్ గణేశ్-దీప్తి, తనీష్-దీప్తి సునయన, నందిని రాయ్-తేజస్వీ, కౌశల్-సామ్రాట్, బాబు గోగినేని-రోల్ రైడాలుగా విడిపోయారు. బజర్లు మోగగానే జంటగా ఉన్న ఇద్దరు చర్చించుకోని ఒకరు విడుదలవ్వాలని, ఇలా విడుదల అయిన వారు సేఫ్ అయినట్లు మిగిలినవారు డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయినట్లు అని పేర్కొన్నాడు. అయితే విడుదల చేసే ముందు కారణం తెలపాలని కూడా చెప్పాడు. అమిత్‌కు ఇచ్చిన ఆ టాస్క్ ఏమిటంటే.. 1. ఏదైన వంటను చెడగొట్టాలి. 2. ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డు కొట్టాలి 3. దీప్తి సునయనను ఏడిపించాలి. 4. ఓ కంటెస్టెంట్ ప్యాంట్, షర్ట్, షూస్ స్విమ్మింగ్‌పూల్‌లో వేయాలి. 5. ఓ హౌస్‌మేట్‌ను డైనింగ్ టేబుల్‌పై డ్యాన్స్ చేసేలా చేయాలి. ఇవన్నీ ఎవరికి తెలియకుండా.. కంటపడకుండా బజర్స్ మోగడం పూర్తి అయ్యేలోపు చేయాలి. అయితే ఇందులో అమిత్ నాలుగు పనులను విజయవంతంగా పూర్తి చేశాడు. గీతా మాధురి ఏదో జ్యూస్ చేస్తుండగా ఎవరికీ తెలియకుండా దానిలో ఉప్పు వేసి చెడగొట్టాడు. ఈ జ్యూస్‌లో ఉప్పు ఎక్కువైందనీ బాబు గోగినేని తెలిపినా తనే కావాలని వేసినా అని గీతా చెప్పడం ఇక్కడ విశేషం. తనీష్, టీషర్టు, ప్యాంట్ స్విమ్మింగ్ పూల్‌లో వేయడం, దీప్తి సునయను ఏడిపించే ప్రయత్నం, గణేశ్‌పై గుడ్డు కొట్టడం వంటి పనులను అమిత్ పూర్తి చేశాడు. ఓవైపు నామినేట్ ఎవరు కావాలని జుట్టు పీక్కుంటున్న గణేశ్-దీప్తిల వద్దకు వచ్చిన అమిత్.. ఆకస్మాత్తుగా గుడ్డుతో గణేశ్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ‘నా పేరే తొలుత నీవే చెప్పావు. నా కోపం చూడవద్దన్నా కానీ చూశావు’ అంటూ నటిస్తూ బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో హౌస్ మేట్స్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గణేశ్ అయితే బిత్తర పోయాడు. అప్పటికి దీప్తి ఏదైనా సిక్రెట్ టాస్క్ అయి ఉండవచ్చని కూడా గణేశ్‌కు సర్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ గణేశ్ మాత్రం బాత్రూంలోకి వెళ్లి మరీ గట్టిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అందరితో బాగుండే అమిత్ ఇలా చేయడం ఏమిటీ.. టాస్క్ అయితే మాత్రం ఇలా ఓ వ్యక్తిపై దాడి చేయడం అవసరమా అని హౌస్ మేట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గణేశ్ చిన్నపిల్లాడిలా మరింత ఏడ్వసాగాడు. మరో వైపు కెమెరాల ముందుకొచ్చి అమిత్ కంటతడి పెట్టుకున్నాడు. వీళ్లంతా నన్ను అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు టాస్క్ ఓడిపోయినా పర్వాలేదని, గణేశ్ దగ్గరకు వెళ్లి హౌస్మేట్స్ అందరికి ఉన్న విషయం చెప్పాడు. నామినేట్ అయింది.. ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్ అయ్యారు. సామ్రాట్, కౌశల్‌ను సేవ్ చేయగా.. తేజస్వీ,..నందును, రోల్‌రైడా.. బాబుగోగినేనిని, తనీష్.. దీప్తి సునయనలను కాపాడారు. ఇక సీక్రెట్ టాస్క్‌లో ఎక్కువ పనులు అమిత్ పూర్తి చేయడంతో నామినేషన్ తప్పించుకున్నాడని బిగ్‌బాస్ అనౌన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పనులు పూర్తి చేసినా అతను టాస్క్ గురించి చెప్పేశాడని, అయినా బిగ్‌బాస్ విజయవంతమయ్యాడని ప్రకటించడం ఏమిటని, ఈ విషయంలో బిగ్‌బాస్ ఘోరంగా విఫలమయ్యాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కామన్ మ్యాన్ అన్న విషయంతో గణేశ్‌కు మద్దతినిస్తుంటే అతనేమో చిన్న పిల్లాడిలా ఏడ్వడం ఏమిటని, ఇవన్నీ బిగ్‌బాస్‌లో ఉంటాయనే విషయం తెలియదా అని మండిపడుతున్నారు. ఇంకొందరమే గుడ్లతో దాడిచేయడం ఏమిటని పాపం గణేశ్ అంటూ.. అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఇలా అమిత్ సీక్రెట్ టాస్క్.. నామినేషన్ ప్రక్రియ కొంత ఆసక్తికరంగా ఉండగా.. గణేశ్ సిల్లీగా ఎడ్వడం, బిగ్‌బాస్ టాస్క్ ప్లాన్ గాడితప్పడం నిరుత్సాహ పరిచింది. చదవండి: టార్గెట్ దీప్తీ.. గణేశ్ అత్యుత్సాహం! -
బిగ్‌బాస్ : కౌశల్‌పై మరో కుట్ర జరుగుతోందా...?
సాక్షి, హైదరాబాద్ : భావోద్వేగాలతో ఆడే ఓ ఆట బిగ్‌బాస్ రియాల్టీ షో.. అయితే గురువారం ఎపిసోడ్లో ఆ ఆటను బిగ్‌బాస్ మరింత రక్తికట్టించాడు. ఎంతలా అంటే ఆటలో కూడా వ్యక్తిగత దూషణలకు దిగేంత. మరో వ్యక్తిపై నిందలు మోపెంత. ‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. టాస్క్‌లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. తొలి నుంచి కౌశల్ అంటే గిట్టని తేజస్వీ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ‘వాడి బుద్ధే అంతా’ అంటూ విరుచుకుపడింది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న గీతామాధురి వెంటనే స్పందిస్తూ.. ‘ఆ ఆరోపణలు అవాస్తవం.. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయకండి’ అంటూ సొంత టీమ్ సభ్యులైన భాను, తేజస్వీలను హెచ్చరించింది. దీంతో కౌశల్ ఊపిరి పీల్చుకున్నాడు. కిరీటి చేసిన తప్పే భాను.. ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితమై.. కౌశల్‌పై కొంచెం ఓవర్‌గా రియాక్టై కిరీటి దామరాజు చేతులు కాల్చుకున్నాడు. నిజానికి కౌశల్‌పై అప్పటివరకు ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ ఒక్క సంఘటన కిరీటిని విలన్ చేయగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఎంతలా అంటే సోషల్ మీడియాలో ప్రేక్షకులే కౌశల్ ఆర్మీ అనే ఓ ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసేంతా. ఈ ఘటననంతరమే ప్రేక్షకులు తేజస్వీ Vs కౌశల్‌గా విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అదే తప్పును భానుశ్రీ కూడా చేసిందని అభిప్రాయడుతున్నారు ప్రేక్షకులు. వాస్తవానికి హౌస్‌లో నిర్మాహమోటంగా మాట్లాడే వ్యక్తి అంటే అది భానునే. హోస్ట్ నాని సైతం ఈ విషయాన్ని తెలిపాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్లో ఉండటంతో ఆమె ఎదో ఒకటి చేసి.. ప్రేక్షకులను ఆకర్షించాలనే ప్రయత్నం చేసింది. దీనికి ఇతర కంటెస్టెంట్లు సైతం సహకరించారు. తొలుత ఓ ఎమోషన్ డ్రామా ప్లే చేసి దీప్తి సునయన, తనీష్‌లను ఫూల్స్ చేసింది. దీంతో వారు చాలా హర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన ఎపిసోడ్లో ప్రేక్షకుల సానుభూతి పొందాలనే కౌశల్‌పై భాను తీవ్ర ఆరోపణలు చేసిందని, కానీ ఆమె ప్రయత్నం విఫలమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క ఘటన.. భానుపై ఉన్న అభిమానాన్ని తుడిచివేసిందని కొందరు ఘాటుగానే కామెంట్ చేయగా.. ఆటకోసం ఒకరిపై బట్టకాల్చేయడం ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. ఈ సారి భాను ఎలిమినేషన్ పక్కా అని జోస్యం చెబుతున్నారు. తేజస్వీపై నెటిజన్ల ఫైర్! ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేక.. ఇతరులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. ముఖ్యంగా కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్న తేజస్వీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను చూడలేకపోతున్నామని, దయచేసి ఎలిమినేట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ తేజస్వీనిని వెనుకెసుకొచ్చేవాళ్లు కూడా ఉన్నారు. తను ఎమోషన్‌ను అదుపుచేసుకోలేనని తేజస్వీయే ఒప్పుకుంది. అయితే ఆమె హౌస్ మేట్స్‌ను ప్రభావితం చేస్తోందన్నది మాత్రం వాస్తవం. గత వారం ఎలిమినేషన్లో దీప్తిని నామినేట్ చేసేలా బాబు గోగినేనినే ఆమె ప్రభావితం చేసింది. ఈ విషయంలో ఆయన నాని ముందు అడ్డంగా బుక్కయ్యాడు. ఇక తొలి వారంలో ఓ గ్రూప్‌ను మెయిటెన్ చేసి.. నానితో చివాట్లు కూడా తిన్నది. అయితే ఈమె ప్రభావంతోనే తనీష్, సామ్రాట్, కిరీటిలు కౌశల్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ సందర్భంలో తనీష్, బాబు గోగినేనితో మాట్లాడుతూ.. తేజస్వీ తన మాటలతో అందరిని ప్రభావితం చేస్తుందని తెలిపాడు. అయితే తేజస్వీకి కౌశల్‌తో పాటు గీతా మాధురి అంటే కూడా గిట్టదనే విషయం సుస్పష్టం. అయితే వీరద్దరిపైకి తనీష్‌ను ఉసిగోల్పింది కూడా తేజునేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ‘మంచి-చెడు’ టాస్క్‌లో ఈ విషయం స్పష్టమైందని వివరణ ఇస్తున్నారు. ఈ టాస్క్‌లో చెడు టీమే విజయం సాధించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్‌లో వరెస్ట్ పర్ఫార్మర్ ఒకరిని సూచించి.. వారిని జైలుకు తరలించాలని కెప్టెన్ కౌశల్‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనికి కౌశల్ భాను పేరు సూచిస్తూ.. కొన్ని విషయాల్లో ఆమె ప్రవర్తన నచ్చలేదని పేర్కొన్నాడు. -
సోనియా గాంధీతో కమల్ భేటీ
-
దీప్తి సునయనపై ట్రోలింగ్..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ సీజన్2 అలరిస్తోంది. కంటెస్టెంట్స్ తమ గేమ్‌ప్లాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ హలీం, స్వీట్లు పంపించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తొలి వారం పూర్తైంది. తొలి ఎలిమినేషన్‌కు కూడా టైం దగ్గర పడింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాని మళ్లీ వచ్చేశారు. కంటెస్టెంట్స్‌ను టీవీ ద్వారా పలకరించారు. ఒక్కొక్కరి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ (విమర్శించడం)పై స్పందించారు. బిగ్‌బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమిత్ ఫ్యాన్స్ క్లబ్, దీప్తి సునయన ఆర్మీ అంటూ అభిమానులు సోషల్ మీడియా పేజీలు సృష్టించారని చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో విమర్శించడం, బురద చల్లడం చాలా పెద్ద సమస్యగా తయారైందన్నారు. సరదా కోసం చేస్తే తప్పు లేదని, కానీ అదేపనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గుర్తింపు కోసం వ్యక్తిగత విషయాల మీద దుష్ప్రచారం చేసే విధంగా వ్యక్తులు తయారయ్యారని పేర్కొన్నారు. ట్రోలింగ్ తప్పు కాదని, కానీ ఏదీ శ్రుతి మించకూడదని హితవు పలికారు. ఇరవై ఏళ్ల వయసులో సునయన డబ్ష్మాస్లు, షార్ట్‌ఫిల్మ్స్ చేసుకుంటూ, అందరికీ తెలిసే స్థాయికి వచ్చారంటూ ప్రశంసించారు. తాను ఇరవై ఏళ్ల వయసులో ఫిలింనగర్ రోడ్ల మీద తిరిగానంటూ నాని గుర్తు చేసుకున్నారు. ఎలిమినేషన్ ఓటింగ్‌లో దీప్తి సునయనకు చాలా మంది మద్దతుగా నిలిచారని, భారీగా వచ్చిన ఓట్లతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఎందుకు ఏడ్చారని అడగ్గా, కుటుంబ సభ్యులు గుర్తుకు రావడంతో ఏడ్చానని సమాధానం ఇచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు, సభ్యుల మధ్య గొడవలను ప్రస్తావించారు. -
అందం, అభినయాల ఆల్‌రౌండర్!
శ్రీనగర్‌కాలనీ : కళా వినీలాకాశంలో కౌముది వెలుగు తళుకులీనుతోంది. అందం, అభినయాల కలబోతతో నటనా కౌశలం ద్విగుణీకృతమవుతోంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్రతో దూసుకుపోతోంది. కర్ణాటక సంగీతంలోనే కాకుండాగాయనిగా, యాంకర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంతో మంది మన్ననలు పొంది ప్రస్తుతం యాక్టర్‌గా రాణిస్తోంది కౌముది నేమాని. భరత్ అనే నేను, ఉన్నది ఒక్కటే జిందగీ, నేలటికెట్ తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. హైదరాబాద్ ఎంతో కంఫర్ట్‌తో పాటు చాలా ఫ్రీడం ఉన్న సిటీ అని ఆమె చెబుతోంది. తెలుగులో మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలన్నది తన చిరకాల ఆకాంక్ష అని, సిటీతో తనకున్న అనుబంధం, తన జర్నీపై ఆమె వివరించిందిలా.. మాది విజయనగరం. చిన్నప్పుడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. నేను ఎనిమిదో తరగతిలో ఉండగా హైదరాబాద్ వచ్చాం. ఇక్కడే ఇంటర్, విల్లామేరి కాలేజ్‌లో మాస్‌కమ్యూనికేషన్స్ జర్నలిజం చేశాను. సంగీతంలో రామాచారి మాస్టర్ వద్ద లైట్ మ్యూజిక్, శేషులత, లక్ష్మీ, డీవీ మోహనకృష్ణ మాస్టర్స్ వద్ద కర్ణాటక మ్యూజిక్‌లో ప్రావీణ్యం పొందాను. ప్రస్తుతం ఇన్ఫినిటమ్ అనే సంస్థలో ఫిలిం అండ్ మీడియా డెవలపర్‌గా పనిచేస్తున్నాను. ఎస్వీబీసీలో ఛానల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ప్రఖ్యాత తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నడుస్తున్న టీటీడీ ఎస్వీబీసీ ఛానల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. దైవభక్తితో చేసిన ఈ ప్రోగ్రాం నేను మరువలేనిది. ఆ తర్వాత లైవ్ మ్యూజిక్‌లో సింగర్‌గా చేశాను. టీవీ ప్రోగ్రామ్స్ కాకుండా ప్రైవేట్ లైవ్ మ్యూజిక్‌లో ప్రదర్శనలను ఇచ్చాను. ఇంటర్వ్యూలు.. ప్రమోషన్స్ జర్నలిజం చేసిన అనుభవం యాంకరింగ్ చేయడానికి తోడ్పడింది. ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో యాంకరింగ్ చేశాను. నాగార్జున, రవితేజ, నాని, రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిధరమ్‌తేజ్, రానా, రామ్‌లాంటి స్టార్ హీరోల ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడప్పుడే ఫేస్బుక్లో ప్రేక్షకులతో లైవ్‌లో మాట్లాడే ప్రోగ్రాం వైరల్‌గా మారింది. అలా ఘాజీ చిత్రానికి రానాతో ఫేస్బుక్లో లైవ్ చేశాం. ఐఫా అవార్డ్స్ తెలుగు వర్షన్లో పనిచేశాను. తొలి చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రారండోయ్ వేడుకచూద్దాం చిత్రంలో రకుల్‌కు రూమ్మేట్గా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత టచ్‌చేసిచూడు, భరత్ అనే నేను, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలు చేశాను. రీసెంట్గా వచ్చిన నేలటికెట్ చిత్రంలో రవితేజ సిస్టర్‌గా ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. గోపీచంద్ చిత్రం పంతం చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించాను. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ చిత్రాల్లో మంచి పాత్రలతో పాటు హీరోయిన్గా కూడా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలనుంది.. తెలుగులో మ్యూజిక్ అల్బమ్స్ చేయాలన్నదే నా ఆకాంక్ష. నా పరిధిలో ఇప్పుడున్న సాంకేతికతను దృష్టితో ఉంచుకొని సంగీతప్రియుల ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని మంచి వీడియో మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలని కోరిక. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. నేటి యువత అంకితభావానికి ప్రాధాన్యతను ఇస్తూ తాము ఎంచుకున్న రంగంలో కొంగొత్త ఆలోచనలతో పనిచేస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. -
నాని కాపురంలో నిప్పులే!
హైదరాబాద్: గతంలో గతితప్పిన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పిన నటి శ్రీరెడ్డి మరోమారు అదే తీరును ప్రదర్శించారు. నటుడు, బిగ్‌బాస్-2 హోస్ట్ నానిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సదరు రియాలిటీ షోలో తన ఎంట్రీపై స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన కామెంట్లు చేయడం పబ్లిసిటీలో భాగమేననే అభిప్రాయం వెల్లడవుతున్నది. మేమిద్దరం కలిస్తే డర్టీ పిక్చరే: ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు. ఎందుకిలా?: మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 2 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కొద్ది రోజులుగా బిగ్ బాస్ 2లో శ్రీ రెడ్డి పాల్గొంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను బిగ్ బాస్ నిర్వాహకులు గానీ శ్రీరెడ్డి గానీ ధృవీకరించలేదు. కొంతకాలంగా నానిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి, బిగ్‌బాస్ ప్రసార సమయంలోనే బాంబ్ పేల్చే అవకాశముందని భావిస్తున్నారు ప్రేక్షకులు. -
జగన్ అంటే చంద్రబాబుకు భయం ఎందుకు ?
-
ఫిట్నెస్ ఛాలెంజ్: వాహ్.. నాగ్
ప్రస్తుతం దేశం మొత్తం ఫిట్నెస్ ఛాలెంజ్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు... అంతా ఒకరికొకరు సవాళ్లు విసిరుకుంటూ వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా క్యూ కట్టేశారు. స్టార్ హీరో ఎన్టీఆర్.. చెర్రీ, మహేష్, కొరటాల శివ, రాజమౌళి, కళ్యాణ్ రామ్ తదితరులకు ఛాలెంజ్ విసరటం చూశాం. ఇప్పుడు సీనియర్ హీరో నాగ్ వంతు వచ్చింది. తనయుడు అఖిల్ విసిరిన ఛాలెంజ్‌కు నాగార్జున అక్కినేని స్పందించారు. ఈ ఉదయం జిమ్‌లో చేసిన ఎక్సర్సైజ్లకు వీడియో ఒకదానిని పోస్ట్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించిన వర్కవుట్ల కోసం బాగానే కష్టపడ్డాడు. ఇవన్నీ చూస్తుంటే 58 ఏళ్ల వయసులోనూ నాగ్ ఫిట్‌గా ఉండటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అన్నట్లు ఇంతకీ నాగ్ ఎవరికి ఛాలెంజ్ విసిరాడో తెలుసా? నేచురల్ స్టార్ నాని, హీరో కార్తీ, శిల్పారెడ్డిలకు. ఆ వీడియో చూసిన అభిమానులంతా ‘వాహ్ నాగ్’ అంటున్నారు. మరోవైపు వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన నటించిన ఆఫీసర్ చిత్రం నేడు విడుదల కాగా, నానితో చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇవికాకుండా కోలీవుడ్ హీరో ధనుష్ డైరెక్షన్లో ఓ చిత్రం ఉండబోతున్నట్లు నాగ్ ప్రకటించాడు కూడా. Here we go @AkhilAkkineni8 my reply for #HumFitToIndiaFit challenge..I challenge @NameisNani @Karthi_Offl @shilpareddy217 to post there fitness videos. 👉My exercise regime today lower body heavy for strength and upper body light for recovery👍 pic.twitter.com/nsgmym0M4n — Nagarjuna Akkineni (@iamnagarjuna) 1 June 2018 -
ఫిట్నెస్ ఛాలెంజ్‌లో హీరో నాగ్
-
ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న సినీ నటుడు పృధ్వీ
-
బిగ్‌బాస్ 2.. ఇంకొంచెం మసాలా కన్ఫామ్!
తెలుగు బిగ్‌బాస్ సెలబ్రిటీ షో రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారింగా ఓ పోస్టర్‌తో కన్ఫామ్ చేశారు నాని. బిగ్‌బాస్ 2లోగోతో పాటు నాని లుక్‌ను ఇందులో చూడవచ్చు. ‘బాబాయ్.. ఈసారి ఇంకొంచం మసాలా.. బిగ్బాస్తెలుగు2’ అని నాని ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది. నాని ట్వీట్‌పై స్టార్ మా స్పందిస్తూ.. ‘స్టార్ మా నానికి ఆహ్వానం పలుకుతోంది. వ్యాఖ్యాతగా నాని సక్సెస్ అవ్వాలని అకాంక్షిస్తూ’ నాని ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్చేస్తున్నారు నిర్వాహకులు. ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తొలి సీజన్ 70 రోజులు నిర్వహించగా, బిగ్‌బాస్-2 100 రోజులపాటు జరగనుంది. జూన్ 10 నుంచి రెండో సీజన్ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించనున్నారు. ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా చేయనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. Babai .. Eesari Inkkoncham Masala 😉#BiggBossTelugu2 👁 pic.twitter.com/RJuTT2O9pZ — Nani (@NameisNani) 18 May 2018 -
పెళ్లి వయసు
యాంకర్ నుంచి హీరోగా మారారు తమిళ నటుడు శివ కార్తికేయన్. ముందు కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోగా.. ఇలా అంచలంచెలుగా ఎదిగారు. ఇలా తనలోని కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారాయన. ‘మాన్ కరాటే’తో సింగర్‌గా కూడా మారారు. ఇప్పుడు పాటల రచయితగా కలం పట్టారు. నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ సినిమా కోసం ఓ పాట రాశారు శివ కార్తికేయన్. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ‘కల్యాణ వయసు....’ అంటూ సాగే ఈ పాట మే 17న రిలీజ్ కానుంది. అన్నట్లు... ‘పెళ్లి వయసు’ అని పాట రాసిన శివ కార్తికేయన్‌కి పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది. -
నటుడు బాలాజీపై చీటింగ్ కేసు నమోదు
బంజారాహిల్స్: సినీ, బుల్లితెర నటుడు బాలాజీపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. తన నుంచి బలవంతంగా కిడ్నీ సేకరించి బాలాజీ భార్యకు అమర్చారని, ఇందుకోసం తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మోసం చేశారంటూ యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌కు చెందిన పెల్లూరి భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు బాలాజీపై ఐపీసీ సెక్షన్ 420, 506, సెక్షన్ 19 ఆఫ్ ది ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994 కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రోడ్ నెం.9లో నివసించే బాలాజీ తన భార్య కృష్ణవేణికి 2016 ఆగస్టు 26న తనను మభ్యపెట్టి విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తన కిడ్నీ తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తాను కిడ్నీ ఇస్తున్న సందర్భంలో సినిమాలు, టీవీల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఒక ఇల్లు కూడా కొనిస్తామని చెప్పారని ప్రతి నెలా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ ఖర్చుల కోసం రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారన్నారు. అయితే ఇందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని భాగ్యలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ సలహా అనంతరం అన్ని ధృవపత్రాలు సేకరించి బాలాజీపై కేసు నమోదు చేశామని అయితే కిడ్నీ అమరిక విజయవాడలో జరిగింది కాబట్టి కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు సీఐ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన సినీ నటుడు
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్అండ్ డ్రైవ్ చేస్తూ సినీ నటుడు కిరీటి దామరాజు పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌లో శనివారం అర్దరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ అతను పట్టుబడ్డారు. అర్థరాత్రి సమయంలో మద్యం సేవించి కారు నడుపుకుంటూ అటువైపుగా వచ్చిన అతను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొత్తం 110 మంది మందుబాబులు పట్టుబడ్డారు. కేసులు నమోదు చేసి 80 కార్లు, 30 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మెహబూబా ట్రైలర్ చూసిన వెంటనే షాకయ్యా
-
షార్ట్ ఫిలిం హీరోపై క్రిమినల్ కేసు
సాక్షి, బంజారాహిల్స్ : షార్ట్‌ఫిలింలో హీరోయిన్గా నటిస్తున్న తన కుమార్తెను ప్రేమపేరుతో మోసం చేసి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు షార్ట్‌ఫిలిం హీరో, నిర్మాతపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన మహిళ దాండియా కొరియోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, ఆమె కుమార్తె(14) షార్ట్‌ఫిలిమ్స్‌లో హీరోయిన్గా నటిస్తోంది. తిరుపతికి చెందిన కస్తూరి ఆనంద వర ప్రసాద్ అనే వ్యక్తి తన స్వీయ నిర్వహణలో తీస్తున్న షార్ట్‌ఫిలింలో నటించేందుకు ఆమెను హీరోయిన్గా బుక్ చేశాడు. కొద్ది రోజులకు వారు ప్రేమించుకుంటున్నట్లు గుర్తించిన యువతి తల్లి ఆనంద్ వివనాలపై ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది. దీనిపై ఆమె ఆనంద్‌ను నిలదీయగా తనకు పెళ్లి కాలేదని బుకాయించాడు. ఈ నేపథ్యంలో గత మార్చి 22న తాను ఇంట్లో లేని సమయంలో తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా సినిమాలు నేను చూడనంటోన్న నటుడు
రాయవరం (మండపేట) : సినీ రంగంలో విలన్‌గా జీవితాన్ని ప్రారంభించి.. అనంతరం కమెడియన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా సత్తా నిరూపించుకున్న ఘనత ప్రముఖ నటుడు జీవాకే దక్కుతుంది. సుదీర్ఘ కాలంగా నటుడిగా కొనసాగుతున్న ఆయన ఊపిరి ఉన్నంత వరకూ నటుడిగానే కొనసాగుతానని అంటున్నారు. తన దృష్టిలో దర్శక, నిర్మాతలే అసలైన హీరోలంటున్న జీవా మంగళవారం రాయవరం సాయితేజా విద్యానికేతన్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చాను. పేపరులో వచ్చిన ప్రకటన చూసి, నా స్నేహితులు ఫొటోలు పంపించారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఎంపిక చేసి, ‘తొలికోడి కూసింది’ సినిమాలో తొలి అవకాశం కల్పించారు. ఆ సినిమా షూటింగ్ జిల్లాలోని దోసకాయలపల్లిలో జరిగింది. అలా జిల్లాతో అనుబంధం ఏర్పడింది. నన్ను గుర్తించి, ప్రోత్సహించిన దర్శకుడు బాలచందర్‌పై ఉన్న గౌరవంతో ఆయన పేరును నా రెండో కుమారుడికి పెట్టుకున్నాను. అతడు కూడా దర్శకత్వ శాఖలోనే పని చేస్తూ సినిమా తీసే సన్నాహాల్లో ఉన్నాడు. అప్పటివరకూ విలన్‌గా నటిస్తున్న నన్ను కమెడియన్‌గా మార్చింది ప్రముఖ దర్శకుడు వంశీనే. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో తొలిసారిగా కమెడియన్ పాత్ర చేశాను. అది హిట్టవడంతో అక్కడి నుంచి కమెడియన్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాను. క్యారెక్టర్ ఆర్డిస్టుగా కూడా రాణిస్తున్నాను. ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు వెయ్యి వరకూ చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాల్లో కొన్ని పాత్రలు నాకు పేరు తెచ్చి పెట్టాయి. ‘భరత్ అనే నేను’ సినిమాలో విద్యాశాఖ మంత్రి పాత్రకు మంచి పేరు వచ్చింది.∙ఎవ్వరైనా, ఏ వృత్తిలోనైనా పరిపూర్ణత సాధించడానికి జీవితకాలం చాలదు. నటుడికి తృప్తి ఉండదు. అవకాశం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాను. చిన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు సినిమాలు అధికంగా చూసేవాడిని. నేను నటించిన సినిమాలు మాత్రం చూడను. ‘గులాబి’ సినిమా మాత్రమే నా భార్యతో కలిసి చూశాను. అదే తొలి, చివరి సినిమా. నటించడమే తెలుసు కానీ, నటించిన సినిమాలు మాత్రం చూసే అలవాటు లేదు. -
మాపై నీచ రాజకీయాలు
తాడేపల్లిగూడెం : తమపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని సినీ నటుడు, నిర్మాత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’సినిమా ఆడియో వేడుక ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మిలటరీ మాధవరంలో ఆదివారం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్ సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్లో ఉండి, కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం ముందుకు వెళుతున్నాడు. ఈ సందర్భంలో ఇది మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలీదు. మెగా అభిమానులందరికీ ఓ మాట చెప్తున్నా. మాపై ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే.. మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఎవరూ ఏం అనరు. కల్యాణ్బాబులాంటోడు అన్ని అడ్డంకులు తొలగించుకుని మీ ముందుకు వచ్చాడు. అలాంటోడు రాకూడదు వీళ్లకి. అలాంటోడు వస్తే వీళ్ల వేషాలు సాగవు. మీ అందరి బాగు కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం తనకున్న భవిష్యత్‌ను వదులుకుని మీ ముందుకు వస్తున్నాడు. తను రాకూడదని కోరుకునే వ్యక్తులు, పార్టీలు కల్యాణ్‌ను ఏమీ చేయలేక, తన కుటుంబాన్ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లందరికీ దుమ్ముదులిపేలా రాబోతున్నాడు పవన్‌కల్యాణ్. అతను ఒక్కడే అనుకోకండి.. వెనకాల చాలా మంది పవన్‌కల్యాణ్‌లు ఉన్నారు. అడ్డగోలుగా స్కామలు చేయాలనో, డబ్బులు సంపాదించుకోవాలనో రావడం లేదు. దేవుడు అభిమానుల రూపంలో ఇచ్చాడు మాకు చాలా. నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకొస్తున్నాం. ఎలా చేయాలో మాకు తెలుసు. ఒకసారి కుదర్లేదు. ఈ సారి కుదిరి తీరుతుంది. ఒక్కొక్కడికి ఉంటది.. థ్యాంక్స్’అన్నారు. పవన్‌పై వ్యక్తిగత దాడి తప్పు హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘కోట్ల రూపాయలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్‌గారిపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం చిరంజీవిగారినీ చాలా మాటలు అన్నారు. ఈ చెవి అలవాటు పడిపోయింది. ఈ మనసు గట్టిపడిపోయింది. వపన్కల్యాణ్గారిని మొన్న చాలా పర్సనల్‌గా మాట్లాడారు.. నాకు నచ్చలేదు. చాలా చాలా చాలా తప్పు. మాట్లాడిన వాళ్లది తప్పు. మాట్లాడనిచ్చినోళ్లది తప్పు. ఇలా మాట్లాడారు అని లక్షల మందికి చూపించడం అంతకంటే పెద్ద తప్పు’అని అన్నారు. -
లైంగిక ఆరోపణలు: గాయనికి హీరో నోటీసులు
ఇస్లామాబాద్ : పాక్ యువ నటుడు అలీ జఫర్‌పై గాయని మీషా షఫీ(36) సంచలన ఆరోపణలకు దిగింది. అలీ తనని లైంగికంగా వేధించాడంటూ గురువారం ఆమె తన ట్వీటర్లో ఓ పోస్టు చేయగా.. అది దుమారం రేపింది. ఇప్పటికైనా తాను మౌనం వీడకపోతే అర్థం లేదని.. మీటూ క్యాంపెయిన్ ఉవ్వెత్తున్న సాగుతున్న తరుణంలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి కూడా స్పందిస్తున్నానని ఆమె ఆ పోస్టులో పేర్కొంది. ఇద్దరు పిల్లల తల్లి అని కూడా చూడకుండా జఫర్ తనను తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడని.. రేపు మరో అమ్మాయికి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయం బయటపెడుతున్నానని ఆమె తన ట్వీటర్లో ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి అలీ జఫర్ ఘాటుగా బదులిచ్చాడు. మీటూ ఉద్యమానికి నేను మద్ధతు ఇస్తాను. నేనూ ఓ పాపకు తండ్రినే. నా గురించి నా మిత్రులకు, బంధువులకు బాగా తెలుసు. అలాంటిది నాపై ఇలాంటి విమర్శలు రావటం తట్టుకోలేకపోతున్నా. దాచటానికి ఏం లేదు. మౌనంగా ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమైపోతున్నా అని అలీ జఫర్ తన ట్వీటర్లో ఓ పోస్టు చేశారు. మీషాకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 37 ఏళ్ల అలీ జఫర్ లాలీవుడ్(పాక్ సినీ ఇండస్ట్రీ)లో అర డజనుకుపైగా చిత్రాల్లో నటించగా.. బాలీవుడ్లో తెరె బిన్ లాడెన్, మేరీ బ్రదర్ కీ దుల్హన్, డియర్ జిందగీ తదితర చిత్రాలతో భారతీయ ప్రేక్షకులకూ సుపరిచితుడు. Sharing this because I believe that by speaking out about my own experience of sexual harassment, I will break the culture of silence that permeates through our society. It is not easy to speak out.. but it is harder to stay silent. My conscience will not allow it anymore #MeToo pic.twitter.com/iwex7e1NLZ — Meesha Shafi (@itsmeeshashafi) 19 April 2018 pic.twitter.com/j1C34onEXC — Ali Zafar (@AliZafarsays) 19 April 2018 -
అవసరమైతే గుండుతోనైనా నటిస్తా
గుంటూరు: ప్రముఖ నటుడు జగపతిబాబు తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనపై స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు ఉంటుంది.. సరైన సమయంలో పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని జగపతి బాబు వెల్లడించారు. అంతేకాదు అవసరమైతే సినిమాలో గుండుతోనైనా నటిస్తానని ఆయన అన్నారు. గతంలో కొందరు రాజకీయాల్లోకి రావాలని పిలిచారు.. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వారికి చెప్పినట్లు జగపతి బాబు తెలిపారు. జగపతిబాబును చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. -
రియల్ ఏజెంట్‌పై నటుడు జగ్గేశ్ దాడి
యశవంతపుర: మల్లేశ్వరంలో నటుడు జగ్గే శ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో వి వాదంగా మారింది. వివరాలు... మల్లేశ్వరం 8వ క్రాస్‌లో వరసకు బావైన మండల మాదేగౌడ కాయకూరల వ్యా పారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో రియల్ ఏజెంట్ రవికుమార్ అంగడి వద్ద వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని మాదేగౌడతో అప్పుడప్పుడు ఘర్షణ పడేవారు. ఈ విషయం మాదేగౌడ నటుడు జగ్గేశ్ దృష్టికి తీసుకురావటంతో స్థానిక కార్పోరేటర్ మంజణ్ణను కారులో తీసుకుని వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా జగ్గేశ్ రవికుమార్‌పై రోల్‌కాల్‌కు వచ్చావంటూ దాడికి పాల్పడిన్నట్లు వైరల్ అయింది. తను దాడి చేయలేదని బావ మాదేగౌడ వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయాటనికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తలకు పట్టుకుని పోలీసులకు అప్పగించిన్నట్లు జగ్గేశ్ వివరించారు. ఏవరో విడియో రికార్డు చేసి తనపై లేనిపోని అరోపణలు చేస్తున్నట్లు జగ్గేశ్ పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
'కృష్ణార్జున యుద్ధం' ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఇది యాక్షన్ కాదు.. డబుల్ యాక్షన్
నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ క్లబ్ దాటేసి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లోని కృష్ణ, రాక్ స్టార్ అర్జున్ జయప్రకాశ్ రెండు పాత్రల్లో నాని కనిపించబోతున్నాడు. ముఖ్యంగా కృష్ణ అండ్ బ్యాచ్ చేసే సందడి ఫన్నీగా అనిపిస్తోంది. వాళ్ల మధ్య డైలాగులు పేలిపోయాయి. ఆపై ట్రైలర్ సీరియస్ మోడ్‌లో సాగింది. తమ ప్రేమ కోసం ఈ ఇద్దరు యుద్ధం చేయటం.. చివరకు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడటం.. ‘యాక్షన్ కాదు.. డబుల్ యాక్షన్’... అన్న డైలాగ్‌తో ట్రైలర్ ముగించేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుదల కాబోతోంది. -
సూర్య కీలక నిర్ణయం.. వాళ్లకు చిక్కులే!
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరోలు, సూర్య, విశాల్, కార్తీలు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిర్మాతలపై భారాన్ని తగ్గిస్తూ.. తమ వ్యక్తిగత సిబ్బందులకు తామే జీతాలు చెల్లించేందుకు వాళ్లు సిద్ధమైపోయారు. సాధారణంగా కోలీవుడ్‌లో ఆర్టిస్టుల మేకప్‌మెన్, డిజైనర్లు ఇతరత్రా వ్యక్తిగత సిబ్బందికి నిర్మాతలే ఇంత కాలం జీతాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. కొందరు స్టార్లైతే ఏకంగా బౌన్సర్ల జీతభత్యాలను కూడా నిర్మాతల ఖాతాల్లోనే వేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ సమస్యలపై ఈ మధ్యనే తమిళ నిర్మాతల మండలి చర్చించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలపై భారం తగ్గించేందుకు తన సిబ్బందికి తానే జీతం చెల్లిస్తానని సూర్య ముందుకు వచ్చారు. ఆ వెంటనే సూర్య సోదరుడు-హీరో కార్తీ, నడిగర్ సంఘం కార్యదర్శి, హీరో విశాల్ కూడా సూర్య బాటలో పయనిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సొంత బ్యానర్లోనే ఎక్కువ చిత్రాలు చేసే ఈ హీరోలకు ఈ నిర్ణయం పెద్ద సమస్యకాకపోవచ్చని... ఇతర నటీనటులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కోలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. -
హీరో స్వయంవరం.. సెన్సార్‌బోర్డుకు నోటీసులు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ ఓ రియాల్టీ షో కోర్టు మెట్లెక్కింది. నటుడు ఆర్య స్వయంవరం పేరిట ఈ షోను నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలను ఎంపిక చేసి ఇందులో గెలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడంటూ ఈ షోను నిర్వహిస్తున్నారు. అయితే దీనిని నిలిపివేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. షో నిర్వాహకులతోపాటు సెన్సార్‌బోర్డుకు కోర్టు నోటీసులు దాఖలు చేసింది. ‘ఎంగ వీటు మాపిల్లై’ పేరిట ఆర్య తన స్వయంవరం షోను ప్రకటించాడు. కలర్స్ తమిళ్ ఛానెల్లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. నటి సంగీత ఈ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ షో మహిళల గౌరవానికి దెబ్బతీసేలా ఉంటోందని.. పైగా కంటెస్టెంట్లను కించపరిచేలా షోలో పనులు చేయిస్తున్నారంటూ జానకిఅమ్మల్ అనే ఉద్యమకారిణి ఆరోపణలకు దిగారు. ఈ మేరకు షోను నిలుపుదల చేయాలంటూ ఆమె సెన్సార్ బోర్డు, కేంద్ర సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన మధురై బెంచ్.. షో నిర్వాహకులకు, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శితోపాటు, ఈ షోకు అసలు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు నోటీసులు దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 18కు వాయిదా వేసింది. అయితే అప్పటిదాకా షో నిర్వాహణను నిలుపుదల చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. -
బిగ్‌బాస్-2.. హోస్ట్ దొరికాడు
సాక్షి, సినిమా : బుల్లితెర షో బిగ్ బాస్ మొదటి షో సక్సెస్ కావటంతో 2 సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ దఫా సీజన్‌కు హోస్ట్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ మధ్య మరికొందరు స్టార్ల పేర్లు తెరపైకి రాగా.. తాజాగా ఎన్టీఆర్ ఈ షో నుంచి దాదాపు అవుట్ అన్నది కన్ఫర్మ్ చేస్తూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం త్రివిక్రమ్ సినిమా త్వరలో మొదలు కావటమే. దీంతో నిర్వాహకులకు ఎన్టీఆర్ సారీ చెప్పేశాడని.. నేచురల్ స్టార్ నానిని సదరు ఛానెల్ సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కృష్టార్జున యుద్ధం తర్వాత నాని నాగ్‌తో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికే అవకాశం ఉండటంతో షో నిర్వహణకు వీలుంటుందని నాని కూడా భావిస్తున్నాడంట. దీంతో సెకండ్ సీజన్‌కు నాని దాదాపు ఖరారు అయినట్లేనని ఆ కథనాల సారాంశం. అయితే ఈ వార్తపై ఛానెల్ నుంచిగానీ, నాని తరపు నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. -
సల్మాన్‌ఖాన్ నా భర్త అంటూ యువతి హల్ చల్
సాక్షి, ముంబై : బాలీవుడ్ కండలవీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రొమేనియా మోడల్ లులియా వాంటూర్‌తో సల్మాన్ పెళ్లి వార్తల హంగామా ఇంకా చల్లారకముందే ఓ యువతి చేసిన హడావుడి తాజాగా వెలుగు చూసింది. తమ అభిమాన హీరోను చూడాలని, ఫోటో దిగాలని ఫ్యాన్స్ అందరూ ఆరాటపడతారు. కానీ, ఈ అభిమాని ఏకంగా సల్మాన్ తన జీవిత భాగస్వామినంటూ గలాటా సృష్టించిందని ‘సియాసత్ డైలీ’ రిపోర్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సెక్యూరిటీ కళ్లుగప్పి సల్మాన్ ఇంటి టెర్రస్‌పైకి వెళ్లిన ఓ యువతి ‘సల్మాన్ నా భర్త’ అంటూ నినాదాలు చేసింది. అక్కడితో ఆగకుండా.. ఎవరైనా తనను కిందకు దించాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని బెదిరించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆమెను కిందికి దించి, చేతిలో ఉన్న ఇనుపచువ్వను స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరిగినా అక్కడికి పోలీసులు రాలేదట. కాగా ప్రస్తుతం సల్మాన్ రేస్-3 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
బాలీవుడ్ నటుడు కన్నుమూత
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ స్టార్హీరోలతో కలిసి పలు కీలక పాత్రల్లో నటించిన నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్ ప్రారంభించారు. టెలివిజన్ నటుడుగా కూడా ప్రఖ్యాతి గాంచారు. అలా 2002లో ఫంటూష్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హదర్, రాయీస్, మొహంజోదారో లాంటి ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మూవీ ‘కాబిల్’లో నరేంద్ర ఝా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. టాలీవుడ్లో యమదొంగ, లెజెండ్, ఛత్రపతి సినిమాల్లో నటించారు. కాగా సల్మాన్‌ఖాన్ హీరోగా బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ రేస్-3 నరేంద్ర ఆఖరి చిత్రం. నరేంద్ర ఝా ఆకస్మిక మృతి పట్ల ...ఇండస్ట్రీ నటీనటులు, దర్శక నిర్మాతలు సహా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
మీటూ ధాటికి నటుడి ఆత్మహత్య
సియోల్ : మగ-ఆడా తేడా లేకుండా లైంగిక వేధింపుల పరంపరంను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆయుధంగా మారింది మీటూ(#MeToo) ఉద్యమం. అయితే అదే ఇప్పుడు ఓ నటుడి ప్రాణాలు తీసింది. దక్షిణ కొరియా ప్రముఖ నటుడు జో మిన్-కి గురువారం రాత్రి తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. 52 ఏళ్ల జో మిన్ 200కి పైగా చిత్రాల్లో, పలు బుల్లి తెర కార్యక్రమాల్లో నటించారు. గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 8 మంది యువతులు ఆయన తమను వేధించారంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో దక్షిణ కొరియాలో మీటూ ఉద్యమం మొదలైంది. పురుషాధిక్య దేశమైన దక్షిణ కొరియాలో మీటూ ఉవ్వెత్తున్న సాగటానికి జో మిన్ కారణమంటూ విమర్శలు వినిపించాయి. దీంతో మీడియా ముందుకు వచ్చిన ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అయితే తనపై ఆరోపణలు చేసే వారు బండారం త్వరలోనే బయటపెడతానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినప్పటికీ ఆ ఉద్యమం ఆగలేదు. ఇంతలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు చెబుతుండగా, అధికారులు మాత్రం అది సూసైడ్ అని తేల్చేశారు. -
శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ
విజయవాడ: కమెడియన్ శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో విష్ణువర్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సినీ నటుడు శివాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రచారం కోసమే శివాజీ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది తమ స్వార్థం కోసం దేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని..అలాగే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ నాయకులకు ఇచ్చిన నిధులపై అనుమానం ఉంటే సమాధానం చెబుతామని తెలిపారు. కొంతమంది మేధావులు హైదరాబాద్‌లో ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రాయలసీమ బీజేపీ ముఖ్య నాయకులంతా కర్నూలులో సమావేశమవుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రేపు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. -
ఆర్యతో పెళ్లికి 70 వేల దరఖాస్తులు
పెరంబూరు(చెన్నై): తమిళ నటుడు ఆర్య ఇటీవల వధువు కావలెను అని ఇంటర్నెట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఏకంగా 70 వేల మంది యువతులు దరఖాస్తులు చేసుకుంటే, వారిలో ఆరు వేల మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరిని షార్ట్‌లిస్ట్ చేసి 18 మందిని ఎంపిక చేశారు. వయాకామ్ 18 అనే పారిశ్రామిక సంస్థ తమిళనాడులో కలర్స్ తమిళ్ ఎంటర్టైన్మెంట్ చానల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చానల్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖరన్ విలేకరులతో మాట్లాడుతూ.. గేమ్ షో లాంటి మంచి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో ‘ఇంగవీట్లు మాప్పిళ్లై’ అనే స్వయంవరం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరుడిగా పాల్గొనాలని కోరగా, ఆర్య సమ్మతించారని తెలిపారు. -
నాని గట్స్‌కు హ్యాట్సాఫ్
సాక్షి, సినిమా : హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని.. అ! చిత్రంతో నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. టీజర్, ట్రైలర్, ప్రోమోలు, ప్రమోషన్లతో బాగానే హైప్ తీసుకొచ్చిన నాని.. ఇప్పుడు మౌత్ టాక్‌పై కూడా దృష్టిసారించాడు. అందుకే సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు ఇక్కడ ప్రత్యేక షో వేయించి వారితో అభిప్రాయాలను చెప్పిస్తున్నాడు. వెన్నెల కిషోర్, అనుపమ పరమేశ్వరన్, అడివి శేష్, దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, నటుడు శశాంక్, డిజైనర్ నీరజ్ కోన, రాహుల్ రవీంద్రన్ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని వీక్షించి తమ ట్విటర్లో ట్వీట్లు చేశారు. ‘అ చిత్రం కొత్త తరహా కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుందని, దర్శకుడు ప్రశాంత్ టేకింగ్ కొత్తగా.. ఆకట్టుకునేలా ఉందని, ముగింపు ఓ కవిత్వంలా ఆహ్లాదంగా అనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా నిర్మాతగా ఇలాంటి చిత్రం నిర్మించాలంటే చాలా గట్స్ ఉండాలంటూ ప్రతీ ఒక్కరూ నానిని ప్రశంసిస్తున్నారు. కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల, ఇషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. మరి ఈ చిత్రం నానికి నిర్మాతగా సక్సెస్ అందిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగితే చాలూ. #Awe creates a new genre of film making. It is a seamless blending of all genres..a film that encompasses the best aspects of each genre without being limited. No wonder @NameisNani bhayya backed this one😌🙏🏼 and @prasanthvarma gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/x4M2tPtBbV — vennela kishore (@vennelakishore) 14 February 2018 Thanks & kudos to @NameisNani & @PrashantiTipirn for backing #Awe A true blue concept film with a poetic finish! — Adivi Sesh (@AdiviSesh) 14 February 2018 Watched a superb & out of the box movie #awe. @NameisNani proved to be an intelligent as a producer also. Needs lot of guts to produce this kind of intelligent THIKKA cinema 😃👏👏👏. Kudos to the director @prasanthvarma and his team for the brilliant technical work! Cheers guys! — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) 14 February 2018 Awe : a feeling of reverential respect mixed with fear or wonder.😲🤯 Last night I experienced the same when I was watching #AWE .. truly inspiring... a new approach to cinema with good values.. @NameisNani @PrashantiTipirn @prasanthvarma good work 👌🏻👌🏻 — Anupama Parameswaran (@anupamahere) 15 February 2018 #AWEstruck What a crazy film 🤘🏻 Kudos to @NameisNani n @PrashantiTipirn for backing @prasanthvarma n his unique story #AWE Good luck guys..Wishing Huge Success 👍🏻👍🏻 Great job by entire cast n crew 👌🏻👌🏻 This is real Hatke — Shashank (@ActorShashank) 14 February 2018 #Awe pushes boundaries .. in every possible direction! One has to appreciate the amazing passion this team had to believe in something like this and make it come to life. @NameisNani Wishing u and ur team an amazing run starting Feb 16th ❤️👍🏻😊 — Neerajaa Kona (@NeerajaKona) 14 February 2018 -
కమెడియన్‌కు తప్పిన పెను ప్రమాదం
మండ్య: కన్నడ హాస్య నటుడు మండ్య రమేశ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో రమేశ్ ప్రాణాపాయం నుంచి సురక్షింతంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బెంగళూరు నగరంలో ఓ కన్నడ ఛానల్లో కార్యక్రమ చిత్రీకరణ షూటింగ్‌ను ముగించుకొని మైసూరుకు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో జిల్లాలోని శ్రీరంగపట్టణ సమీపానికి చేరుకోగానే ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం, లోపలి భాగం ధ్వంసం కాగా, కారును నడుపుతున్న మండ్య రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీరంగపట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు బాధ్యతల స్వీకరణ
సాక్షి, ఫిల్మ్‌నగర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా నటుడు మోహన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మరో నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ దైవసన్నిధానం 18 దేవుళ్ల సముదాయం అని చెప్పారు. ఈ దైవసన్నిధానానికి ఆద్యుడు వి.బి. రాజేంద్రప్రసాద్ అని, అప్పటి మూలధనంతో సన్నిధానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సన్నిధానానికి రూ.3 కోట్ల 70 లక్షల విరాళాలు వచ్చాయని వివరించారు. ఈ దైవభక్తిలో పాలుపంచుకుంటానని మోహన్‌బాబు కోరారన్నారు. నూతన పాలకవర్గాన్ని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చిరంజీవి, తాను చిలుకా గోరింకల్లా గొడవపడుతుంటామన్నారు. ఇప్పటికి రెండు కమిటీలు సన్నిధానాన్ని దిగ్విజయంగా నిర్వహించాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మోహన్‌బాబు చైర్మన్‌గా రావడం ఆనందంగా ఉందని, ఆయనకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, స్వరూపానందేంద్రస్వామి, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్ తదితరులు హాజరయ్యారు. -
హీరోయిన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు..
సాక్షి, బొమ్మనహళ్లి: సినిమాలో నటించిన హీరోతో నీకు సంబంధం ఉందంటూ అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్న సహాయ నటుడిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బొమ్మనహళ్లి నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నటుడు రాజశేఖర్ ఐస్ మహల్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటించిన ఓ హీరో యిన్‌ను రాజశేఖర్ అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడు. దీంతో ఆమె అతని వేధింపులు భరించలేక మాగడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. -
హెల్మెట్ ధరించండి: నటుడు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం గా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే పరిసరాల పరిశుభ్రతతో నగరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నెంబర్ వన్ చేయాలని నగర ప్రజలకు ప్రముఖ సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. గురువారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్‌రోడ్, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్ చేరుకుంది. ఈ ర్యాలీలో మేయర్ రజనీ శేషసాయి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు పాల్గొన్నారు. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆలీ మాట్లాడుతూ.. అందరూ శుభ్రత పాటించాలన్నారు. ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా వేస్తారన్నారు. ప్రతీ ఒక్కరూ తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. మేయర్ రజనీశేషసాయి మాట్లాడుతూ.. స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు. హెల్మెట్ ధరించండి : ఆలీ ‘తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి. అయితే మోటారుసైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలకు ఆస్కారమివ్వకండి. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి’ అని సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి నిమిషం చాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల్లో ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు హైస్పీడ్ మోటారు సైకిళ్లు కొనిచ్చి, ప్రమాదాలు కొని తెస్తున్నారన్నారు. కమిషనర్‌ను ఆకాశానికెత్తిన ఆలీ స్వచ్ఛ సర్వేక్షణ్ సభలో సినీ నటుడు ఆలీ ఎక్కువ సమయం కమిషనర్ విజయరామరాజును పొగిడేందుకే కేటాయించారు. పాలక మండలి ప్రస్తావన తేకుండా నగరంలో అభివృద్ధి అంతా కమిషనర్ ఒక్కరే చేసినట్లు చెప్పుకొచ్చారు. కమిషనర్‌ను సినీ హీరోలు మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్‌లతో పోల్చి మాట్లాడారు. ఆలీ మాట్లాడిన సమయంలో సగం పైగా కమిషనర్‌ను పొగిడేందుకే వెచ్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్: జీవీ
సాక్షి, విజయవాడ: వంగవీటి రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు టెలీ సీరియల్ నిర్మించనున్నట్లు సినీ నటుడు జి.వి.సుధాకర్‌నాయుడు ప్రకటించారు. ప్రజల గుండెల్లో ఉన్న ఆయన గురించే ఈ సీరియల్ ఉంటుందన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్కులో గల ఆయన విగ్రహానికి జీవీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీరియల్లో అన్నీ వాస్తవాలే ఉంటాయన్నారు. ఇందుకు దేవినేని అనుమతి అవసరం లేదని, అభ్యంతరాలు చెబితే వారిని కూడా కలుస్తానని చెప్పారు. వర్మ తనకున్న మేథాశక్తి మేరకే వంగవీటి సినిమా తీశారని, అందులో కొన్ని తీశారు.. కొన్ని దాచారని అన్నారు. వర్మ దగ్గర మరో సినిమా ఉందంటూ అది ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవాలు కటువుగా ఉంటాయి.. అందరి పేర్లు పెట్టే సీరియల్ చేస్తాను.. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని వ్యాఖ్యానించారు. దాసరి నారాయణరావు నా గురువు.. వంగవీటి రంగాపై సినిమా తీయాలని ఆయన చివరి దశలో నన్ను కోరారని చెప్పారు. రంగా చరిత్ర మొత్తం ఆరున్నర గంటలపాటు చిత్రీకరించాల్సి ఉందని, అందుకే సినిమాగా కాక టెలీ సీరియల్‌గా తీస్తున్నామని, 150 ఎపిసోడ్ల వరకు ఉంటుందని జీవీ వివరించారు. -
ప్రారంభమైన ‘టాటా సేవా డేస్’ 2017
హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో ‘టాటా సేవా డేస్ 2017’ వేడుకలు గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు టాటాను నెలకొల్పామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ‘సేవా డేస్’ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగుల పంపిణీ, దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇదీ షెడ్యూల్ ఈ నెల 15న కర్నూలు జిల్లా సున్నిపెంట, 16న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, 19న రంగారెడ్డి జిల్లా జుక్కల్, నల్లగొండ జిల్లా ఆత్మకూరు గ్రామాల్లో, 20న వరంగల్, 21న నిజామాబాద్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 23న టాటాతో పాటుగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్, మధ్యాహ్నం శిల్పకళా వేదికలో కవి సమ్మేళనం ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సినీ నటుడు కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వయిజరీ బోర్డు సభ్యుడు మోహన్ పట్లోల, కార్యక్రమ సమన్వయకర్త వంశీరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ ఎక్కా, సంయుక్త కోశాధికారి జ్యోతిరెడ్డి, సమన్వయకర్త ద్వారక్‌నాథ్ రెడ్డి, జి.బి.కె.రెడ్డి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సిగ్గులేని రాజకీయాలు.. ప్రకాష్ రాజ్ ఫైర్
సాక్షి, చెన్నై : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించారు. ఈసారి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డేపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని హెగ్డే ఈ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వాటిని ఖండిస్తూ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. నేషనలిజం, హిందుత్వం ఒక్కటేనని చెబుతున్న మంత్రిగారు ఆమాటకు అర్థం కూడా వివరిస్తే బాగుంటుందని తొలుత ప్రకాశ్ రాజ్ మొదట ఓ ట్వీట్ చేశారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఈయనగారు భావిస్తున్నారేమోనంటూ అనంతకుమార్ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. ఆపైనే అసలు విమర్శలతో ఓ పోస్టును ప్రకాశ్ ఉంచారు. ‘‘ ఆ రెండూ ఒకటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకు? అంబేద్కర్, అబ్దుల్ కలాం, రెహమాన్, కుష్వంత్ సింగ్, అమృత ప్రీతమ్, డాక్టర్ కురియన్ వీరంతా ఎవరు?. నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? సెక్యులర్ దేశం మనందరిది. ఈ సిగ్గులేని రాజకీయాలతో మీకు ఒరిగేది ఏంటి? అంటూ ప్రకాష్ రాజ్ అనంతకుమార్‌పై మండిపడ్డారు. కాగా, 52 ఏళ్ల ప్రకాష్ రాజ్ ఇంతకు ముందు గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చురకలు అంటించిన విషయం తెలిసిందే. Should we Indians ..Let this gentleman ..fool us ..distort and hijack.. our HINDUTVA .. ..our WAY OF LIFE... #justasking pic.twitter.com/klJ4GM28xG — Prakash Raj (@prakashraaj) December 7, 2017 This minister says ..”Islam should be wiped out in this world” ..so when he talks of HINDUTVA does he mean it’s a way of life...#justasking pic.twitter.com/UtgZyat6Dz — Prakash Raj (@prakashraaj) December 7, 2017 Mr..minister what do you mean when you say “nationalism and hindutva”are one and mean the same ...#justasking pic.twitter.com/jsrlBJIomR — Prakash Raj (@prakashraaj) December 7, 2017 -
ట్విట్టర్లో తాడోపేడో
మైసూరు ఫైర్‌బ్రాండ్ ప్రతాపసింహా మరోసారి ట్విట్టర్వార్కు తెరతీశారు. గతంలో డీఐజీ రూప, ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌లతో ఆయన ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలతో తలపడడం తెలిసిందే. మైసూరు జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్తో హనుమజ్జయంతి ఘటనలపై తనదైన ట్వీట్లు చేయగా, ఎస్పీ కూడా దీటుగా బదులిచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైసూరు: జిల్లాలోని హుణుసూరులో ఆదివారం హనుమజ్జయంతి ఊరేగింపులో చోటు చేసుకున్న పరిణామాలపై ఎంపీ ప్రతాపసింహా, జిల్లా ఎస్పీ రవి డీ.చెన్నణ్ణవర్ల మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం మొదలైంది. ‘పాలించే వారి ఆజ్ఞలు మీరడం సాధ్యం కావట్లేదు కదా’ అంటూ ట్విటర్లో ఎంపీ ప్రతాపసింహా ఎస్పీ రవి డీ.చెన్నణ్ణవర్పై మొదటగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ‘నిజాయితీ కల అధికారి అనే ముసుగు తీసేసి అధికార పార్టీ బంటునని ఒప్పుకోండి. దత్త జయంతికి అన్ని ఏర్పాట్లు చేసిన చిక్కమగళూరు ఎస్పీ అణ్ణామలైని, ప్రభుత్వాన్నే ఎదిరించిన డీఐజీ రూపాను, మెడికల్ సీట్ల బ్లాకింగ్ బాగోతాన్ని బట్టబయలు చేసిన ఐఏఎస్ రశ్మిను చూసి నేర్చుకోండి, ఇకనైనా మాటలు చాలించండి’ అంటూ ఎంపీ సింహా ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించారు. తమకు తమ రాజకీయ భవిష్యత్తు కంటే తమ మతం సంప్రదాయాలను రక్షించుకోవడమే ముఖ్యమని స్పష్టంచేశారు. రాజ్యాంగ రక్షణే మా విధి: ఎస్పీ ట్వీట్ ఎంపీ ట్వీట్లపై ఎస్పీ రవి చెన్నణ్ణవర్ కూడా తమదైన శైలిలోనే బదులిచ్చారు.‘మేము ఎవరికీ అనుకూలం కాదు, ఎవరికీ వ్యతిరేకులం కాదు, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నాం. మాకు రాజ్యాంగ రక్షణ ముఖ్యం, భారతదేశమే మా మతం. ఎస్పీ అణ్ణామలై నుంచే కాదు కానిస్టేబుల్‌ను చూసి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో బదులిచ్చారు. సాంకేతికతను, సామాజిక మాధ్యమాలను వివేకంతో వినియోగించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో శాంతి భధ్రతలకు ముప్పు వాటిల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కార్యకర్తల్లో మిమ్మల్ని అనుసరించే, అభిమానించే యువకులు మీ వ్యాఖ్యల ద్వారా మరింత ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఇంతకాలం మాట్లాడనందుకు సిగ్గుగా ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయం గురించి ఆమె మాట్లాడింది. భావప్రకటనా స్వేచ్ఛ కోసం ఆమె పోరాడింది. తాను జీవించి ఉండటం కోసం కూడా తాను మాట్లాడింది. రాసింది. ఆమె, నేను కలసి పెరిగాం. గౌరీగా ఎదుగుతున్నప్పుడు కంటే మరణం తరువాతే మేం ఆమె నుంచి నేర్చుకుంటున్నాం’అని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. గౌరీ లంకేశ్ రచనల సంకలనం తెలుగు అనువాదం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని తనని అంతా ప్రశ్నిస్తున్నారని, నిజానికి ఇంతకాలం మాట్లాడనందుకు తాను సిగ్గుపడుతున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. గొంతు లేని వారికి తాను బలమైన గొంతుకైనం దుకు గౌరీ హత్య జరిగిందన్నారు. అయితే ఇదే మొదటిది కూడా కాదని గోవింద్ పన్సారే, కల్బుర్గి, దబోల్కర్‌ల వరుసలో గౌరీ లంకేశ్ కూడా హత్యకు గురైందన్నారు. ఇదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నా పదేళ్ల కూతురు సైతం నా క్షేమం గురించి భయపడింది. నా తల్లి దేవుడి ముందు మోకరిల్లింది.. నాకేమీ కాకూడదని.. ఇలా ఎందుకు జరుగుతోంది. ఎందుకీ హత్యలు.. నిశ్శబ్దాన్ని వీడి ప్రశ్నించాలని ప్రకాశ్ రాజ్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. నిశ్శబ్దం సమాజానికి పట్టిన పెద్ద జబ్బు నిశ్శబ్దం ఈ సమాజానికి పట్టిన పెద్దజబ్బు అని.. దాన్ని వదలించుకుని ప్రతిఒక్కరూ మార్పుకి నాంది పలకాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. గొంతులు పెగల్చుకుని అణగారిన వర్గాల, అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన మాట్లాడాలని అన్నారు. ‘కొన్ని గొంతులను మూయించి వాళ్లన్నీ సాధించామనుకొంటే పొరపాటు, భిన్నాభిప్రాయాలుంటే చర్చించాలి. కానీ చంపడాన్ని సహించకూడదు. ఇక మాట్లాడాల్సిన సందర్భమిదే. గౌరీ ఒంటరిగా పోరాడింది. ఇప్పుడందరం ఎవరికి వారుగా, కలసికట్టుగా, ఎక్కడైనా, సందర్భమేదైనా మాట్లాడాలి’ అని ప్రకాశ్ రాజ్ గద్గద స్వరంతో అన్నారు. ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ నగరంలోని లామకాన్‌లో గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని గౌరీ సోదరి కవితా లంకేశ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, సంపాదకుడు చందన్ గౌడ, ప్రొఫెసర్ సుశీతారూ, సీనియర్ పాత్రికేయురాలు వసంతలక్ష్మి ఆవిష్కరించారు. చందన్‌గౌడ సంపాదకత్వంలో వచ్చిన గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ సత్యాన్ని మరుగుపర్చడం కోసం ముసుగు హత్యలు జరుగుతుంటే మౌనంగా ఉండటం సమాజానికి చేటు చేస్తుందన్నారు. మతం అనేది జీవన విధానమని, హింస మతం లక్షణం కాదని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ చందన్ గౌడ మాట్లాడుతూ భయంలేని సమాజం కోసం గౌరీ లంకేశ్ తుది శ్వాస వరకు పోరాడారని అన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, కృష్ణవంశీ మాట్లాడారు. -
‘ అశ్లీల చిత్రాలపై నోరు మెదపని వాళ్లు.. ఆ చిత్రంపై..’
‘పద్మావతి’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వివాదాలు, విమర్శలు అధికమవుతున్నాయి. పద్మావతి చిత్రం విడుదల చేస్తే దాడులు చేస్తామంటూ రాజ్‌పుత్ కర్ణిక సేన కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే ముక్కు కోస్తామని కొందరు అంటే.. ఆమెను చంపితే రూ. 5 కోట్లు ఇస్తామని మరో సంస్థ ప్రకటించింది. రాజ్‌పుత్ కర్ణిక సేన కార్యకర్తలు చేసిన హెచ్చరికలు, ఆందోళనలపై బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ తన ట్విట్టర్లో తీవ్రంగా ఖండించారు. ‘కొద్ది రోజులుగా కళాకారులపై దాడులకు పాల్పడతామని.. హెచ్చరికలు చేస్తుండటం ఆందోళనకర పరిణామని అని అన్నారు. అనేక భాష్లలో విశృంఖలంగా నిర్మితమవుతున్న అశ్లీల చిత్రాల గురించి నోరు మెదపని వాళ్లు.. చారిత్రతాత్మక, సందేశాత్మక చిత్రాలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు సమంజసమని’ ఆయన ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని సంజలీలా భన్సాలీ రూపొందిస్తున్నారు. పద్మావతి చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో కర్ణిసేన ప్రతిస్పందిస్తోంది. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సంస్థ తేల్చి చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కర్ణిసేన ఆరోపించింది. సినిమా విడుదల ఆపకపోతే దీపిక ముక్కు కత్తిరిస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. థియేటర్లను ధ్వంసం చేస్తామని స్పష్టం చేసింది. మరికొందరు మాత్రం దీపికను చంపితే రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. -
అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా..!
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నంది అవార్డుల జాబితా అంత ఇదీగా లేదని, అవార్డుల జ్యూరీలో సీనియర్ నటుడు గిరిబాబు ఉన్నా.. ఎందుకలా జరిగిందో తెలియడం లేదని ఆయన అన్నారు. నంది అవార్డుల విషయంలో 'సాక్షి' టీవీతో ఆయన మాట్లాడారు. 'లౌక్యం' సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడు అవార్డు తనకు వస్తుందని అనుకున్నామని, కానీ రాలేదని అన్నారు. 'అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా అని అన్నారేమో కమిటీ వాళ్లు అని సరిపెట్టుకున్నాన'ని చెప్పారు. ఏ సంవత్సరం అవార్డులు ఆ సంవత్సరం ఇస్తే ఆ సినిమా సత్తా ఏంటో తెలుస్తుందని, గ్యాప్ ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్నట్టు గుర్తుచేశారు. మీ యాక్టింగ్ బాగుంటుంది, మాకు నచ్చింది.. అవార్డులది ఏముందని ప్రేక్షకులు తనతో అంటూ ఉంటారని, మంచి నటులకు ఎందుకు అవార్డులు రావడం లేదన్న భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
హీరోపై దావా: కాపురంలో ఫోన్ నెంబర్ చిచ్చు.. !
ఢాకా : ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన రాజా ది గ్రేట్ మూవీలో వాడిన ఓ ఫోన్ నెంబర్ కారణంగా విశాఖ జిల్లావాసి ఎన్ని తిప్పలు పడ్డారో తెలిసిందే. రవితేజతో మాట్లాడాలంటూ తన ఫోన్ నెంబర్ కు రోజు వందల ఫోన్ కాల్స్ రావడంతో బాధిత వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. తాజాగా ఓ ధాలీవుడ్ (బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీ) మూవీ కారణంగా తన భార్యతో విడాకుల వరకు వెళ్లాల్సి వచ్చిందంటూ ఓ ఆటో డ్రైవర్ మూవీపై ఏకంగా 60,975 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు 40 లక్షలు) దావా వేశాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 'రాజ్ నీతి' మూవీలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు షాకిబ్ ఖాన్. అయితే మూవీ సీన్లో భాగంగా ఓసారి హీరో షాకిబ్ తన గర్ల్ ఫ్రెండ్ కు ఓ నెంబర్ ఇస్తాడు. ఇక మూవీ విడుదలైనప్పటినుంచీ తనకు మనశ్శాంతి కరువైందంటున్నాడు బంగ్లాదేశ్ ఆటో డ్రైవర్ ఇజాజుల్ మియా. తన ఫోన్ నెంబర్ ను రాజ్ నీతిలో హీరో షాకిబ్ చెప్పగా, అది చూసిన షాకిబ్ మహిళా అభిమానులు కాల్ చేసి లవ్ ప్రపోజ్ చేస్తున్నారని చెప్పాడు. హల్లో షాకిబ్.. ఓ రెండు నిమిషాలు మాట్లాడాలంటూ యువతులు ఫోన్ చేస్తుండటాన్ని గమనించిన తన భార్య మోసగాడిగా భావిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిరోజు వందకు పైగా కాల్స్ రావడంతో భార్య కు ఓపిక నశించి, తనపై నమ్మకాన్ని కోల్పోయి.. చివరికి తనకు విడాకులు ఇవ్వాలని కోరినట్లు చెప్పాడు. తనకు కొద్దికాలం కిందటే వివాహం అయిందని, ఓ పాప ఉందన్నాడు. కానీ ఇతర మహిళలు, యువతులతో తనకు సంబంధం ఉందని భార్య అనుమానిస్తుందని, అందుకు మూవీలో తన ఫోన్ ఫోన్ నెంబర్ వాడకమే కారణమంటున్నాడు. ఫోన్ నెంబర్ లోకేషన్ గుర్తించిన ఓ యువతి 500 కిలోమీటర్ల నుంచి షాకిబ్ ఖాన్ అనుకుని తనను కలవడానికి వచ్చినట్లు తెలిపాడు. ఈ తతంగానికి కారణమైన ఆ సినిమా నటుడు, నిర్మాత షాకిబ్ పై తన క్లయింట్ 50 లక్షల టాకాలు (భారత కరెన్సీలో దాదాపు 40 లక్షలు) నష్టపరిహారం కోరుతూ దావా వేసినట్లు లాయర్ మాజిద్ తెలిపారు. జిల్లా కోర్టు జడ్జి విచారణ చేపట్టాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. -
నటుడు మాధవన్.. ఇది ఊహించనిదే!
సాక్షి, సినిమా : నటుడు మాధవన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కెనడా ప్రభుత్వం తమ పార్లమెంట్‌ను సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించింది. ఇంకేం ఊహించని ఆ పిలుపునకు స్పందించిన మాధవన్ రయ్ మంటూ అక్కడ వాలిపోయాడు. ఒట్టావాలో మన నటుడికి ఘన స్వాగతమే లభించింది. ఇండో-కెనెడియన్ మంత్రులైన బర్దిష్ చగ్గెర్, నవదీప్ బెయిన్స్ మాధవన్‌కు దగ్గరుండి ఆయన్ని పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని భారత హై కమిషనర్ వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. లైబ్రరీ హాల్, సెనేట్ ఇలా మొత్తం పార్లమెంట్‌ను చక్కర్లు కొట్టిన మాధవన్ అక్కడి ప్రముఖులతో సరదాగా ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేశాడు. అందులో ఏకంగా హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ చెయిర్లో కూర్చున్న మాధవన్ ఫోటో మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. మాధవన్‌కు ఇచ్చిన ఆతిథ్యం గురించి కెనెడా మంత్రి షాంపైన్ ఎప్పటికప్పుడు విశేషాలు అందించగా.. అందుకు మాధవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో షాంపైన్ నేతృత్వంలోని ఓ బృందం వాణిజ్య ఒప్పందాల కోసం ముంబై రానుంది. ఈ నేపథ్యంలో వారిని మరోసారి కలుస్తానని మాధవన్ చెప్పారు. అన్నట్లు ఈ సీనియర్ నటుడు నాగ చైతన్య సవ్యసాచితో టాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య చెప్పకున్నాం. On the Speakers Chair at the Canadian Parliament house- Ottawa . Thank you for the Honour and the experience Sir @gary_srp . A post shared by R. Madhavan (@actormaddy) on Oct 27, 2017 at 2:55am PDT -
కిషోర్ దా
-
తండ్రి కొడుకుల మిస్టర్ చంద్రమౌళి
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్‌కార్తీక్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. క్రియేటీవ్ ఎంటర్టెయినర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ధనుంజయన్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మరిందరు ప్రముఖ నటీనటులు చేరుతున్నారు. ఈ క్రేజీ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం నటి రెజీనాను వరించింది. కాగా మరో ప్రధాన పాత్రలో నటి వరలక్ష్మీశర™Œత్‌కుమార్ నటించనున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను ఖరారు చేశారు. మిస్టర్ చంద్రమౌళి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు తిరు వెల్లడించారు. ఆయన వివరిస్తూ కార్తీక్, గౌతమ్‌కార్తీక్ కలిసి నటించనున్నారనగానే ఈ చిత్రానికి పరిశ్రమ వర్గాల్లో మంచి క్రేజ్ సంతరించుకుందన్నారు. తాజాగా రెజీనా, వరలక్ష్మీశరత్‌కుమార్, ముఖ్యంగా దర్శకులు మహేం ద్రన్, అగస్థియన్లు నటిస్తుండడంతో చిత్రానికి మరింత హైప్ వచ్చిందన్నారు. అంతే కాదు ఈ మిస్టర్ చంద్రమౌళి చిత్రంపై ఒక దర్శకుడిగా తన బాధ్యత పెరింగిందన్నారు. -
రచయిత, నటుడు హరనాథరావు కన్నుమూత
ప్రముఖ సినీ, నాటక రచయిత, నటుడు ఎంవీయస్ హరనాథరావు (69) ఇక లేరు. గుండెపోటు రావడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ, సోమవారం తుదిశ్వాస విడిచారు. రంగాచార్యులు, సత్యవతీదేవి దంపతులకు 27 జూలై 1948లో హరనాథరావు జన్మించారు. గుంటూరులో చదువుకుంటున్నప్పుడే నాటకాలపై ఉన్న ఆసక్తితో ‘రక్తబలి, జగన్నాథ రథచక్రాలు’ వంటి వాటిలో నటించారాయన. నటునిగా ప్రస్థానం సాగిస్తూనే ఆయన నీలగిరి కాïఫీ, హిమగిరి కాఫీ పొడి విక్రయ షాపులను నిర్వహించారు. నటించడమే కాదు.. పలు నాటకాలు రచించారు. ‘జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, కన్యావరశుల్కం, అడవిలో అక్షరాలు, యక్షగానం, రెడ్‌లైట్ ఏరియా వంటి పలు నాటకాలను రచించారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణకు ఇంటర్లో హరనాథరావు సీనియర్. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. టి. కృష్ణ ద్వారానే తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హరనాథరావు ‘ప్రతిఘటన, భారతనారి, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సుమారు 150 సినిమాలకు రచయితగా పనిచేశారు. ‘స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు’ సినిమాలకు కథ, మాటలు అందించిన ఆయన్ను అవార్డులు వరించాయి. ఆ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి, మెప్పించారాయన. ‘ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం’ సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాలు అందుకున్నారు. స్వతహాగా హరనాథరావు అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అది ఆయన సంభాషణల్లో స్పష్టంగా కనిపించేది. పదునైన సంభాషణలు రాయడంలో దిట్ట. సమాజాన్ని ఆలోచింపజేసే డైలాగులు రాయడంలో సిద్ధహస్తులు. రచయిత మరుధూరి రాజా ఆయన తమ్ముడు. హరనాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలూ ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
నేరాన్ని అంగీకరించిన యువ నటుడు
సాక్షి, చెన్నై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ యువ నటుడు జై నేరాన్ని అంగీకరించాడు. అతడు నేరాన్ని అంగీకరించినందుకుగానూ సైదాపేట కోర్టు శనివారం రూ.5,200 జరిమానా విధించింది. అంతేకాకుండా జై ఆరు నెలల పాటు వాహనం నడపరాదని న్యాయస్థానం ఆదేశించింది. కాగా జై గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొన్నాడు. దీనిపై ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో గురువారం విచారణకు రాగా, అతడు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నిన్న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
హీరో అరెస్టుకు ఆదేశాలు
-
బాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్(67) కన్నుమూశారు. స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురై 20 రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అమెరికా సంతతికి చెందిన టామ్ ఆల్టర్ ఇండియా షోబిజ్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న టామ్ఆల్టర్ పలు బాలీవుడ్ చిత్రాల్లో, టీవీ సిరీస్ ప్రోగ్రామ్‌లో నటించారు. ఆషికీ, రామ్ తేరీ గంగా మైలీ చిత్రాలతోపాటూ పాపులర్ శక్తి మాన్ సీరియల్లలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టామ్ చివరగా ఇమ్రాన్‌ఖాన్ దర్శకత్వం వహించిన ‘సర్గోశియాన్’ చిత్రంలో నటించారు. -
కమల్ నటనకు గుడ్‌బై చెప్తారా?
సాక్షి, చెన్నై: విశ్వనటుడిని ఇకపై వెండి తెర పై చూడలేమా? అవుననే అనిపిస్తోంది ఆయన మాటలు చూస్తుంటే. కమల్ ఇటీవల రాజకీయాలకు దగ్గరవుతున్న విషయం తెలిసిందే. అవినీతిని ఎత్తిచూపుతున్న కమల్ రాజకీయవాదుల్లో ముఖ్యంగా పాలక పార్టీ నేతల్లో అలజడి పుట్టిస్తున్నారు. ఇక తన రాజకీయరంగప్రవేశం తథ్యం అని ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పూర్తిగా రాజకీయరంగప్రవేశం చేసిన తరువాత నటనకు స్వస్తి చెబుతానని, పూర్తి కాలాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పేర్కొన్నారు. మీ సినిమాల్లోని ఏ పాత్రను రాజకీయజీవితానికి స్ఫూర్తిగా తీసుకుంటారన్న ప్రశ్నకు ఉన్నాల్ ముడియుం తంబి ( తెలుగులో రుద్రవీణ) చిత్రంలో ప్రజలకు అండగా నిలిచి, అవినీతిపై పోరాడిన ఉదయమూర్తి పాత్రలాగా తన రాజకీయ జీవితం ఉంటుందని తెలిపారు. -
'నా భార్య నా సినిమాలు చూడదు'
విలక్షణ నటుడు సత్యప్రకాష్ బ్యాంకు ఉద్యోగం నుంచి సినిమా ప్రపంచానికి.. సాక్షి, కేకే.నగర్: ఆయన కనపడితే చాలు మహిళలు తిట్ల వర్షం కురిపిస్తారు. పిల్లలైతే భయపడి కళ్లు మూసుకుంటారు. క్రూరమైన వికృత చేష్టలతో అరివీర భయంకరుడుగా అందరినీ భయపెడుతుంటాడు. ఇంతకూ ఇది నిజజీవితంలో కాదు వెండితెరపై మాత్రమే. అతనే ప్రేక్షకులను భయపెట్టే నటుడు సత్యప్రకాష్. తెరపై మా చెడ్డ విలన్... నిజ జీవితంలో మా మంచి అన్నయ్య లాంటి వాడు. చాలా మృదుస్వభావి. ఎవరినీ బాధపెట్టడం కానీ, కన్న పిల్లలపై ఇంత వరకు చెయ్యి చేసుకోవడం కానీ, తిట్టడం కాని చేయలేదని అన్నారు. సినీ ప్రపంచంలో వెండి తెరపై కత్తులతో పొడవడం, పైశాచికంగా గొంతు కోయ డం చేసే ఈయన నిజజీవితంలో చీమకు కూడా కీడు తలపెట్టనని అంటున్నారు. సినీ ప్రపంచంలో తనకొక ప్రత్యేక స్థానం, గుర్తింపు రావడానికి కారణం సద్గురు బాబానే అంటున్నారు సత్యప్రకాష్. మా ఊరు, మన ఊరు శీర్షికలో ఆయన తన ఊరి కబుర్లను, చిన్ననాటి చిలిపి చేష్టలను సాక్షి పాఠకులతో ఈ విధంగా పంచుకున్నారు. 'మా అమ్మమ్మ ఊరు విజయనగరం. నాన్నమ్మ వాళ్లది శ్రీకాకుళం. నాన్న నటరాజ్. అమ్మ రత్నం పక్కా గృహిణి. నాకొక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నాన్న ఒడిశా రూర్కేలాలోని స్టీల్ ప్లాట్‌లో ఉన్నతాధికారిగా పని చేశారు. అదే ప్లాంట్‌లో సుమారు 50 మందికి పైగా స్నేహితులను, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించి కంపెనీ తరఫున క్వార్టర్స్ ఇచ్చి తన దగ్గరకు పిలిపించుకున్నారు. అంతేకాదు రూర్కేలాలో 50 మంది తెలుగు కుటుంబాలతో తెలుగు అసోసియేషన్ ను ప్రారంభించారు. నేను పుట్టిన రెండో నెలలోనే రూర్కేలాకు వెళ్లిపోయాను. పెరిగింది, ఎంబీఏ చేసి అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగం చేసింది అంతా అక్కడే. రూర్కేలా టూ చెన్నై: స్థిరమైన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా వేషాల కోసం రూర్కేలా నుంచి చెన్నైకి చేరుకున్నాను. చెన్నైలోని సెంట్రల్ స్టేషన్ లో వెయిటింగ్ రూమ్‌లో ఆరు నెలలు తలదాచుకున్నాను. పగలంతా తిరగడం రాత్రి అక్కడకు చేరుకోవడం. ఆ తర్వాత సినిమా యూనిట్ అంతా టీనగర్లో ఉం డడంతో వెస్ట్ మాంబళంలోని నాలుగు అంతస్తుల ఇంటిపైన ఒక గుడిసెలో వంద రూపాయల అద్దెలో ఆరేళ్లు గడిపాను. ఆ ఇంట్లో ప్రతి అవసరానికి గ్రౌండ్‌ఫ్లోర్‌కు రావాల్సిందే. అప్పట్లో నాకొక డొక్కు బైక్ ఉండేది. పెట్రోలు పోయడానికి డబ్బుల్లేక దానిపై కూర్చుని నడిపిన దాని కంటే దాన్ని తోసుకుంటూ నడిచిన రోజులే నాకు గుర్తున్నా యి. నాకు అమ్మ, నాన్న పూర్తి సహకారం అందించారు. అప్పటి మద్రాసులో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే మేనమామ కూతురు హేమతో వివాహం జరిగింది. ఆమెను జంషెడ్‌పూర్‌లోని పుట్టింటిలో ఉంచి ఆరేళ్లు కాళ్లు అరిగేటట్లు ప్రతి సినిమా ఆఫీసు ఎక్కడం, దిగడంతో విరక్తి పుట్టింది. ఇక నాకు ఈ సినిమాలో నటించే అదృష్టం లేదని నిరాశ చెందాను. ఫ్రెండ్ సలహాతో 1995లో షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని వచ్చాను. వచ్చిన వెంటనే ప్రముఖ దర్శకుడు నిర్మాత విజయబాపినీడు నన్ను పిలిచి మెగాస్టార్ చిరంజీవి బిగ్‌బాస్ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. మెగాస్టార్ నన్ను ఎంతో ప్రోత్సహించి నటనలో మెళకువలు నేర్పించారు. ఆ తర్వాత సాయికుమార్ హీరోగా పోలీసు స్టోరీలో నేను చేసిన విలన్ పాత్ర ఒక్కసారిగా నన్ను ఫీల్డులో ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాత్రికి రాత్రే తిరుగులేని విలన్ అయ్యాను. ఆ తర్వాత అగ్ని ఐపీఎస్‌లో కూడా సాయికుమార్‌తో విలన్ పాత్రలో నటించాను. వరుస సినిమాలు వి జయాలతో వడపళని సాలిగ్రామంలో సొంత ఇల్లు, కారు కొనుక్కున్నాను. బాలకృష్ణతో నటించి న సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్టయ్యిం ది. సినిమా షూటింగ్‌కు ముందు బాలకృష్ణ నన్ను పిలిపించి సెట్లో అందరి ముందు ఆప్యాయం గా ఆలింగనం చేసుకుని విలన్ పాత్రలో నువ్వు జీవిస్తున్నావు అని పొగడడం నాకు ఆనంద బాష్పాలు తెప్పించింది. తెరపై చిరంజీవి, బాలకృష్ణలకు విజిల్ వేస్తూ, చప్పట్లు కొడ్తూ రెండు కళ్లు అనుకున్న అభిమాన హీరోలతో విలన్ గా నటిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. కన్నడ, తెలుగు, తమిళం, ఒరియా, మలయాళం, భోజ్‌పురి, బెంగాళి, రెండు హాలీవుడ్ సినిమాలతో కలిపి 400లకు పైగా సినిమాల్లో నటించాను. అన్నిట్లో 90 శాతం అతిక్రూరమైన విలన్ పాత్రలే. నాకు తెలుగులో కంటే కన్నడంలోనే ఎక్కువ అవార్డులు వచ్చాయి. లింగ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్ నాకు ప్రాణస్నేహితుడు. అతను నా కుమారుడు నటరాజ్‌కు 'మనసు మల్లిగై' అనే కన్నడ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మూడో సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. నా కుమార్తె రామచంద్ర మెడికల్ కాలేజీలో బయోమెడికల్ చేస్తోంది. నేను ఇన్ని సినిమాల్లో నటించినా నా భార్య ఒక్క సినిమా కూడా చూడలేదంటే ఎవరూ నమ్మరు. నాకంత ఇంట్రెస్ట్ లేదు అంటుంది. అయితే నా అభివృద్ధికి ఆమె పూర్తి సహకారం అందించింది. ఊరులో సెలబ్రిటీ: ఒకసారి మా ఊరిలో జరిగే పైడితల్లి జాతరకు వెళ్లినపుడు చాలా ఇబ్బంది పడ్డాను. నన్నెవరూ గుర్తుపట్టరనే ధీమాతో ఒంటరిగా వెళ్లాను. అంతే ఎక్కడి నుంచి వచ్చారో కానీ అభిమానులు సముద్రంలా నన్ను చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకుని గుడిలోకి వెళ్లి దాక్కున్నాను. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి వారి సహాయంతో ఇంటికి చేరాల్సి వచ్చింది. చిన్నతనం తీపి గురుతులు: వేసవి సెలవులకు విజయనగరం, శ్రీకాకు ళం వచ్చి రెండు నెలలు ఎంజాయ్ చేసేవాడిని నా ఏడేళ్ల వయస్సులో కొబ్బరిబొండాలు, మామి డి తాండ్ర దొంగతనం చేయడం, షాపు అతనికి దొరక్కుడా పరుగులు తీయడం సరదాగా అని పించేది. 14 ఏళ్ల వయస్సులో విజయనగరం హోటల్లోని ఇడ్లీ సాంబార్, ప్యూర్ ఫిల్టర్ కాఫీ నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు ఊరికి వస్తే చాలు సినిమాలే సినిమాలు ఒంటరిగా ఒకే రోజు మూడు ఆటలు చూసేవాడిని. సినిమా హాల్లో నేల టికెట్టులో కూ ర్చుని ఇంటర్వెల్లో కుర్చీలో కూర్చుని ఫోజు కొ ట్టేవాడిని. నా 17 ఏళ్ల వయసులో ఊరికి వెళ్లడానికి నాన్న రైలు టికెట్‌కు డబ్బు ఇస్తే నేనే మో టికెట్ కొనకుండా దేశంబండి (దొంగలబండి) అనే పేరుతో పిలుచుకునే రైల్లో విజయనగరం రావడం ఆ డబ్బులతో సినిమాలు చూడ డం, షికార్లు తిరగడం వంటివి చేసేవాడిని. నేనొ క సినిమా పిచ్చాడిని. నాకు సినిమాలంటే తెగ పిచ్చి. మెగా స్టార్, బాలయ్య నాకు రెండు కళ్లు. ఆ సమయంలో అనుకోలేదు నేను వాళ్లతో విలన్ పాత్రలో నటిస్తానని, అలా నటించడం నాకు ఊహకందని విషయం. రూర్కేలాలోని ఇస్పాట్ కాలేజిలో డిగ్రీ పూర్తి చేసుకుని, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత అలహాబాద్ బ్యాంక్‌లో ఐదేళ్లు ఆఫీసర్ గ్రేడ్‌లో పని చేస్తున్న సమయంలో మనసంతా సినిమాలపైనే ఉండేది. ఎలాగైనా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక పెరిగింది. నా స్నేహితులందరూ ఒరేయ్ నువ్వు అచ్చు హిందీ హీరోలా ఉన్నావు. బాలీవుడ్లో చేరు అని సలహా ఇచ్చారు. ఇక అంతే వెంటనే బాంబే వెళ్లి ప్రయత్నాలు సాగించాను. ఒకసారి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెలుగు సినిమా షూటింగ్ బాంబేలో జరుగుతున్నట్లు తెలిసింది. వెంటనే వెళ్లి ఆయన ను కలిశాను. ఆయన ఒకే మాట అన్నారు. తెలుగు వాడివై ఉండి బాంబేలో ఉంటే పది మందిలో ఒకడివిగా ఉంటావు. అదే చెన్నైలో ఉంటే పది మందిలో నువ్వు ప్రత్యేకంగా కనిపిస్తావు. అందువలన చెన్నైకు వెళ్లు అవకాశాలు వస్తాయని సలహా ఇచ్చారు. -
పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు
-
నటుడి విడాకులపై క్లారిటీ వచ్చింది!
సాక్షి, బెంగళూరు : ఈగ, బాహుబలి చిత్రాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితమైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్. ఆయన తన భార్య ప్రియ రాధాకృష్ణన్‌తో 14 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు కోరుతూ 2015లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఈ దంపతులు మనసు మార్చుకున్నారు. కుటుంబ కలహాలతో ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కిన ఈ సుదీప్, ప్రియలు తమ కూతురు శాన్వి కోసం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ దంపతుల లాయర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుదీప్, ప్రియలు తమ వైవాహిక బంధాన్ని కొనసాగించాలనుకున్నట్లు తెలిపారు. కోర్టులో కేసు వేసినప్పటి నుంచీ సుదీప్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని చెప్పారు. భార్య ప్రియకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సిద్ధమైన సుదీప్ కూతురు శాన్వి కోసం మనసు మార్చుకున్నారని వివరించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి జీవించాలనుకున్నట్లు రాతపూర్వకంగా తెలపగా బెంగుళూరు ఫ్యామిలీ కోర్టు వారి నిర్ణయాన్ని అంగీకరించింది. వారికి మరో అవకాశం ఇచ్చనట్లు పేర్కొన్నారు. 2001లో నటుడు సుదీప్, ప్రియలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప శాన్వి ఉంది. అయితే కుటుంబ కలహాల కారణంగా 2015లో ఈ దంపతులు విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే శాన్వి కోసం తమ నిర్ణయాన్ని మార్చుకుని కలిసుండటానికి సిద్ధం కావడంతో సుదీప్ అభిమానులతో పాటు ప్రియ కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. -
యువనటుడు, క్రికెటర్ ఆకస్మిక మృతి
కన్నడ నటుడు, యువ క్రికెటర్ ధృవ్ శర్మ (35) ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మంగళవారం తెల్లవారుఝామున మృతి చెందారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు పరిశ్రమను వెంటాడుతుండటంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి గుండెపోటుతో రావడంతో వెంటనే బెంగళూరులోని కొలంబియా ఆసియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధృవ్ శర్మ తుది శ్వాస విడిచారు.. ధృవ్ శర్మ అకాల మరణంపై అనేకమంది పరిశ్రమ పెద్దలు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్, టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి, కన్నడ నటీనటులు, తదితరులు ట్విట్టర్‌ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు. వినికిడి, మాట బలహీనత ఉన్నప్పటికీ అటు కన్నడ చలనచిత్ర పరిశ్రమకులో ఇటు క్రికెట్ క్రీడలోనూ ధృవ్ విజయం సాధించారు. 2006 లో విడుదలైన స్నేహాంజలి కన్నడ చిత్రం ద్వారా చలనచిత్ర పరిశ్రమలో అరగేంట్రం చేశారు. ఆ తరువాత లిమ్కా బుక్ రికార్డ్స్ లో ప్రత్యేక నటుడిగా చోటు సంపాదించారు. బెంగుళూరు 560023, నీనండ్రే ఇష్త కానో, టిప్పాజీ లాంటి హిట్ చిత్రాలలో కూడా నటించారు. 2005 లో డెఫ్ క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించినప్పటికీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఆడుతూ ఎక్కువ ప్రజాదరణ పొందారు. Am so heart broken, shaken beyond words. My dearest Dhruv Sharma you will be missed forever brother. Thank you for ur warm hugs & love. #RIP pic.twitter.com/lILWZPG0wM — Riteish Deshmukh (@Riteishd) August 1, 2017 -
ఒక నిర్ణయం తీసుకుంటే నేనే సీఎం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కూలదోస్తాం.. ప్రజా స్వామ్య దేశంలో ఎవరూ శాశ్వత రాజులు కారు.. త్వరలో నా నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అంటూ ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ ట్విటర్లో పోస్టులు చేశారు. తనపై విమర్శలు చేసిన తమిళనాడు మంత్రులను కమల్ కవితా త్మక ధోరణిలో హెచ్చరించారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి తాండవిస్తోందని ఇటీవల కమల్ చేసిన విమర్శలపై మంత్రులు స్పందిస్తూ.. ఆయనను అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. మంత్రుల తీరును విపక్షాలు కూడా తప్పుపట్టగా, బుధవారం కమల్ ట్విటర్లో స్పందించారు. ‘నేను ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రిని.. ఓరీ సహచరుడా నావెంట రా.. మూర్ఖుడిని అడ్డుకునేవాడే నేత’ అని తన అభిమానులకు పిలుపు నిచ్చారు. అలాగే ‘నిరాశలో తల్లడిల్లుతున్నవారికి, ఆశతో ఉన్న నా అభిమానులకు త్వరలో ఓ మార్గం దొరుకుతుంది. కొన్నాళ్లు ప్రశాంతతను కాపాడండి’ అని పేర్కొన్నారు. -
'డ్రగ్స్‌కు బానిసై చాలా దెబ్బతిన్నా'
-
ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన నటుడు
-
ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన నటుడు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్ధమాన నటుడు నందు శుక్రవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే, అక్కడ అధికారులు లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తనకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ ఎవరో తనకు తెలియదని, అయితే మీడియాలో వస్తున్న కథనాలను స్పందించి అవి తప్పని రుజువు చేసుకోవడానికే వచ్చినట్లు వివరించాడు. తాను ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకోలేదన్నాడు. ఇంకా అనుమానం ఉంటే రక్త పరీక్షలకు సైతం తాను సిద్ధమని చెప్పాడు. తన కుటుంబ సభ్యులకు తనను తాను రుజువు చేసుకోవడానికి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చానన్నాడు. ఒక వేళ తనకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు వస్తే కచ్చితంగా హాజరవుతానన్నాడు. -
నటుడి ఆత్మహత్యాయత్నం.. అనూహ్య మలుపు!
సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న 23 ఏళ్ల ఓ వర్ధమాన నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ, అతని తల్లి చివరినిమిషంలో పోలీసులకు ఫోన్ చేయడంతో అతని ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు. అనూహ్య మలుపులు తిరిగిన ఈ ఘటన ముంబై గోరేగావ్ ఈస్ట్‌లోని వన్రాయి కాలనీలో జరిగింది. వన్రాయి కాలనీలోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్న సదరు యువనటుడు శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన నిస్సహాయురాలైన తల్లి పూజ శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో స్థానిక పోలీసులకు ఫోన్ చేసింది. తన కొడుకు పరిస్థితి వివరించి సాయం చేయాలని వేడుకుంది. అప్పుడు డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రజీత్ పాటిల్ వెంటనే తన సిబ్బందిని తీసుకొని ఆమె ఇచ్చిన చిరునామాకు వెళ్లాడు. ఫ్లాట్ తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు నటుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. చేతి మణికట్టు, గొంతు కోసుకున్న అతను బాత్రూమ్లో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి పోలీసులు విచారించగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సదరు నటుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు వాట్సాప్‌లో తన స్నేహితులకు నోట్ పంపించాడు. దీంతో పలువురు స్నేహితులు అతన్ని కలిసేందుకు ప్రయత్నించారు. అయినా వీలుపడకపోవడంతో అతని పిన్ని రాజశ్రీకి సమాచారమిచ్చారు. ఆమె అతని తల్లి పూజకు ఫోన్ చేసి చెప్పింది. కొడుకు ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకున్న ఆ తల్లి ఇంటర్నెట్ ద్వారా స్థానిక పోలీసు స్టేషన్ ఫోన్‌నెంబర్‌ను కనుక్కొని.. ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. -
హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం
ఓఆర్ఆర్పై కొత్వాల్‌గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై కొత్వాల్‌గూడ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్(50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో చనిపోయిన భరత్.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డులోని మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నోవాటెల్ నుంచి వస్తుండగా ప్రమాదం వివాహితుడైన భరత్‌రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా.. ఆయన ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి 9.20 గంటల సమయంలో భరత్ హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారు(టీఎస్09ఈసీ0799)లో ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టి.. ఓఆర్ఆర్పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలివైపు లోడ్‌తో వెళ్తున్న లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం లారీ(ఏపీ16టీవై3167) బ్రేక్‌డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ వాహనం క్రోన్స్‌ను గుద్దుకుంటూ ముందుకెళ్లి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది. రవితేజ సోదరుడిగా ఆదివారం గుర్తింపు.. ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భరత్ రాజ్‌గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్లోని కొన్ని నంబర్లకు పోలీసులు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నంబర్‌కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా.. ‘ఆస్పత్రికి తీసుకువెళ్లండి’అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు దీనిపై రెండు ఈ–చలాన్లు(రూ.370) జారీ అయి పెండింగ్‌లో ఉన్నాయి. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడే.. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి. సోదరుడు రవితేజ నటించిన కొన్ని సినిమాలతో పాటు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా.. ప్రతినాయకునిగా భరత్ నటించాడు. దూకుడు, ఆగడు, అతడే ఒక సైన్యం, పెదబాబు, 143, నేనింతే తదితర చిత్రాల్లో పాత్రలు పోషించాడు. అతివేగమే ప్రాణం తీసిందా..? కారు ముందు టైరు.. లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. ఆ సమయంలో కారు గంటకు 145 కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచు కున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకు పోవడంతో అవి భరత్ ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో కారులో వస్తున్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ భరత్ అంత్యక్రియలను రవితేజ మరో సోదరుడు రఘు, బాబాయ్ మూర్తి రాజు పూర్తి చేశారు. రవితేజతో పాటు కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే ప్రమాదంలో నుజ్జునుజ్జయిన తమ్ముడి మృత దేహాన్ని తాను చూసి తట్టుకోలేనని, అందుకే అంత్యక్రియలకు వెళ్లలేనని, తమ కుటుంబ సభ్యుల పరిస్థితి అర్థం చేసుకోవాలని రవితేజ తన సన్నిహిత వర్గాల వద్ద వాపోయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగు తోంది. కాగా, భరత్ అంత్యక్రియలకు జీవితా రాజ శేఖర్, అలీ, ఉత్తేజ్, రఘుబాబు హాజరయ్యారు. -
స్పీడ్..కిల్స్
∙ రాజధాని రోడ్లపై పరిమితికి మించి దూకుడు ∙ నిన్న నిశిత్ నారాయణ, నేడు భరత్ రాజ్ ఉదంతాలు ∙ ఓ స్థాయి దాటితే ఎయిర్బెలూన్లూ కాపాడలేవు సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదం... ఓఆర్ఆర్పై శనివారం రాత్రి జరిగిన సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజ్ ఉదంతం... ఈ రెండింటికీ ప్రధాన కారణం మితిమీరిన వేగమే. కేవలం ఈ రెండే కాదు... ఏటా నగరంలో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం వేగం కారణంగానే జరుగుతున్నాయని అధికారులు పేర్కొం టున్నారు. ఎంత ఖరీదైన కారైనా.. దాని వేగం శృతి మించితే ఎయిర్బెలూన్లు సైతం కాపాడలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధానిలోని రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువని, 65 కిమీ వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ రెంటికీ సంబంధం లేదు రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 18 కిమీ మించట్లేదు. రహదారులు దుస్థితి, నిర్మాణంలో ఉన్న మెట్రోరైల్ పనులు, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు ఇందుకు కారణం. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవికాగా, కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాల స్థాయి అంతకంటే ఎక్కువే. రహదారులు స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంత లేకపోయినా వీటిని నియంత్రించే అవకాశం లేదని, ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం, నియమ నిబంధనలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లోనే ఎక్కువ.. వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు. కేవలం ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. గత నెలలో చోటు చేసుకున్న నిశిత్ నారాయణ ప్రమాదం, సోమవారం తెల్లవారుజామున జరిగిన చింతలకుంట ఘటన రాత్రి జరిగినవే.. ఎయిర్బ్యాగ్సూ ఏం చేయలేవు హైఎండ్ కార్లకు అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటున్నాయి. వాటిలో ఎయిర్‌బ్యాగ్స్ ప్రధానమైనవి. మొన్నటి నిశిత్ నారాయణ ప్రమాదం, తాజాగా భరత్ రాజ్ ఉదంతం రెండింటిలోనూ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయినా వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయం లోపే డ్రైవర్ స్టీరింగ్‌కు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్‌కు బలంగా ఢీ కొట్టుకోవడం జరిగిపోతుంది. ప్రమాదం జరిగే సమయానికి నిశిత్ నారాయణ వాహనం గంటకు 146 కిమీ వేగంతో, భరత్ వాహనం 145 కిమీ వేగంతో ఉన్నాయి. ప్రమాదంతో వాహనం చిద్రమైపోయిన సందర్భాల్లోనూ ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. రెస్పాన్డ్ కావడానికి కొంత సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో యాదృచ్ఛికంగానే ముందు వస్తున్న ప్రమాదాలను గమనిస్తూనే ఉంటాడు. ఎదుటి వాహనం, గుంత... ఇలాంటి ఏవైనా ముప్పులు కనిపించినప్పుడు వెంటనే స్పందించి బ్రేక్ వేయడానికో, పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇలా ముప్పును గుర్తించిన తర్వాత, బ్రేక్ వేయడం వంటి స్పందనకు మధ్య కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి కొంత సమయం పడుతుంది.. ఈ నేపథ్యంలో నిర్ణీత దూరంలోనే ముప్పును గుర్తించి, అవసరమైన ముందే బ్రేక్ వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -
రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం.. పూర్తివివరాలు
- ఔటర్ ప్రమాదంలో స్పాట్‌డెడ్.. మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఆలస్యం - ఉస్మానియా మార్చురీ నుంచి నేరుగా అంత్యక్రియలకు - అమెరికాలో భరత్ సతీమణి.. పిల్లలు లేరు - పోస్ట్‌మార్టం రిపోర్టులు వస్తే మిగతా విషయాలు తేలతాయన్న డీసీపీ సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్ఆర్) కొత్వాల్‌గూడ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్ రాజ్ (50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన భరత్ సినీ హీరో రవితేజ సోదరుడని గుర్తించడానికీ చాలా సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ... పోస్టుమార్టం పరీక్షల రిపోర్ట్ వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. వివాహితుడైన భరత్ రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా... ఆయన ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్ళారు. ఈ మేరకు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చాలా సేపటి వరకు అక్కడి గదిలో ఉన్న భరత్ రాత్రి 9.20 గంటల సమయంలో హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారులో (టీఎస్ 09 ఈసీ 0799) ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. భరత్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. రిఫ్లెక్టివ్ క్రోన్స్‌ను దాటి లారీని ఢీ కొట్టి... ఓఆర్ఆర్పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న లోడ్‌తో కూడిన లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ లారీ (ఏపీ 16 టీవై 3167) బ్రేక్‌డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ రాజ్ వాహనం క్రోన్స్‌ను గుద్దుకుంటూ ముందుకు వెళ్ళి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదం ధాటికి కారు దాదాపు సగం వరకు లారీ కిందికి చొచ్చుకుపోయి నజ్జునుజ్జయింది. కారు ముందు టైరు... లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో కారు గంటకు 145 కిమీ వేగంతో దూసుకువచ్చినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకుకోవడంతో అవి ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండని సమాధానం! ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి వచ్చారు. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న భరత్ మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భూపతి భరత్ రాజ్‌గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు కొన్ని నెంబర్లకు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నెంబర్‌కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా... ‘ఆస్పత్రికి తీసుకువెళ్ళండి’ అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో దీనిపై రెండు ఈ–చలాన్లు (రూ.370) జారీ అయి పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్ సొసైటీ, అన్నపూర్ణ చౌరస్తాల్లోని క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు బంజారాహిల్స్, శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీటిని జారీ చేశారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. అతడు మంచి బౌలర్ అయి పలువురు చెప్తున్నారు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి. -
జూ.ఆర్టిస్టుతో భరత్ అంత్యక్రియలు?
హైదరాబాద్: సినీనటుడు భరత్ అంత్యక్రియలకు ఆయన సోదరుడు రవితేజ సహా చాలా మంది కుటుంబీకులు హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రమాదంలో భరత్ ముఖం పూర్తిగా ఛిద్రమైపోయినందున అది చూసి మేం తట్టుకోలేమని, అందుకే అంత్యక్రియలకు రాలేనని రవితేజ ప్రకటించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం భరత్ పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి తీసుకెళ్లారు. జూనియర్ ఆర్టిస్టుతో తలకొరివి..? కుటుంబ సభ్యులెవరూ రాలేని(!) పరిస్థితిలో భరత్ భౌతిక కాయానికి ఓ జూనియర్ ఆర్టిస్టుచేత అంత్యక్రియలు జరిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అతనికి రూ.1500 ఇచ్చినట్లు, పిల్లల స్కూలు ఫీజుల కోసమే అతనా పని చేయడానికి ముందుకొచ్చినట్లు, ఈ విషయం జూనియర్ ఆర్టిస్టే స్వయంగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. డ్రగ్స్, మద్యానికి బానిసై, కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే.. అందరూ ఉండికూడా భరత్ అనాధలా పోవాల్సివచ్చిందనే చర్చకూడా నడుస్తోంది. రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకు నటులు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, నటులు ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, కొద్ది మంది మిత్రులు, పరిచయస్తులు మాత్రమే హాజరయ్యారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, ఔటర్ రింగ్ రోడ్డుపై భరత్ ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. -
బాలీవుడ్ నటుడి బంగ్లా కూల్చివేత
ముంబయి: బాలీవుడ్ నటుడికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) భారీ షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణ ఆరోపణలతో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఫేం అర్షద్ వార్సీ బంగ్లాను కూల్చి వేసింది. అక్రమంగా అదనపు నిర్మాణాలను చేపట్టినందుకుగాను బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్పొరేషన్ నోటీసులు స్పందించకపోవడంతో వెర్సోవాలోని ఆయన ఇంటిలోని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ కేసు బీఎంసీ దృష్టిలో ఉంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకూ వాయిదాపడింది. ఇటీవల అర్షద్ వార్సీ తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఎయిర్ ఇండియా కో-ఆపరేటివ్ సొసైటీ (శాంతినికేతన్) లో బంగళా నెంబరు 10 ను కూల్చి వేస్తామంటూ కార్పొరేషన్ శనివారంనోటీసులు జారీ చేసింది. రెండవ అంతస్తులో (1,300 చదరపు అడుగుల) అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరించింది. దీనికి వార్సీకి 24 గంటల సమయం కూడా ఇచ్చింది. అయితే నటుడు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం, ఇంటికి తాళం వేసివుండటంతో సోమవారం పాక్షిక కూల్చివేతను చేపట్టినట్టు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. దీనిపై అర్షద్‌కు, ఆయన భార్యకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. మున్సిపల్ అధికారుల అనుమతికి సంబంధించిన పత్రాలకోసం తిరిగి నోటీసులు పంపిన అనంతరం అక్రమ అంతస్తును తొలగిస్తామని వార్డ్ అధికారి ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు. అటు ఈ పరిణామాలను నటుడు అర్షద్ దృవీకరించారు. కాగా 2012లో ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగినుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు అర్షద్. అక్రమ నిర్మాణాలు చేపట్టాడని ఆరోపిస్తూ సొసైటీ సభ్యులు బీఎంసీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది. దీంతో 2013లో బీఎంసీ ఈనిర్మాణాన్ని తొలగించాలని భావించినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంతో నిలిపివేశారు. ఇటీవల స్టే ఎత్తివేయడంతో రంగంలోకి దిగిన బీఎంసీ ఈ చర్య చేపట్టింది. ఇతరులు అనేకమంది ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారన్న ఆరోపణ నేపథ్యంలో ఇతర బంగళాలను కూడా బీఎంసీ పరిశీలించింది. -
అనుమానాస్పదంగా యువనటి ఆత్మహత్య!
ముంబై: సినీ నటులు విషాదాంతాలు కొనసాగుతున్నాయి. 29 ఏళ్ల యువనటి అంజనీ శ్రీవాస్తవ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ముంబై పశ్చిమ అంధేరిలోని తన నివాసంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. అంజనీ శ్రీవాస్తవ పలు భోజ్‌పూరి సినిమాల్లో నటించింది. గత కొన్నాళ్లుగా ముంబైలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె ఆదివారం నుంచి ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యాజమానిని కాల్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని డుప్లికేట్ తాళంచెవితో ఆమె ఇంటిని తెరిచిచూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంజనీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ ఇంకా తెలియరాలేదు. ఆమె ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని తెలుస్తోంది. -
నటుడు ఆత్మహత్యాయత్నం
► ఫినాయిల్ తాగి స్నేహితులకు సమాచారం బనశంకరి : ప్రేమ విఫలం కావడంతో కన్నడ నటుడు హుచ్చ వెంకట్ తన నివాసంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్నేహితుల సహాయంతో ఆస్పత్రిలో చేరిన హుచ్చ వెంకట్ అక్కడ రచ్చ రచ్చ చేశారు. డాక్టర్లతో సహా అందరిపై విరుచుకుపడ్డారు. వివరాలు... కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటిని హుచ్చ వెంకట్ ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమించిందని, కానీ సదరు యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో హుచ్చ ఆదివారం ఫినాయిల్ తాగి మీడియాకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతని స్నేహితులు హుటాహుటిన అక్కడకి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో హుచ్చ వెంకట్ అందరిపై విరుచుకుపడ్డారు. డాక్టర్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతమైన ప్రచారం యావ కలిగిన హుచ్చ వెంకట్ ఈ ఘటనను ఇలా ప్రచారం చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే హుచ్చ వెంకట్ నటించిన పోకిరీ చిత్రం శాండిల్‌వుడ్‌లో అట్టర్‌ప్లాప్ కావడంతో నెల రోజులుగా సైలెంట్‌గా ఉన్న హుచ్చ వెంకట్ ఆదివారం ఒక్కసారిగా ఫినాయిల్ తాగి మీడియాతో పాటు స్నేహితులకు సమాచారం ఇవ్వడం సంచలనం కల్గిస్తోంది. -
చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్
చంచల్‌గూడ: చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్న బుల్లి తెర నటుడు ప్రదీప్‌ని నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఎర్ర మంజిల్ కోర్టు ప్రదీప్‌పై వారెంట్ జారీ చేయగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైల్‌కు తరలించారు. అనంతరం అదే రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో గంటల వ్యవధిలో ప్రదీప్ జైలు నుంచి విడుదలయ్యాడు. -
నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యే
♦ పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడి ♦ బంధుమిత్రుల నివాళి అనంతరం అంత్యక్రియలు పూర్తి ♦ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన భార్య పావని ♦ ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల ఆరా హైదరాబాద్: బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్‌ది ఆత్మహత్యేనని, అతను ఉరి వేసుకుని చనిపోయాడని పోస్టు మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అయితే ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవడంపై నార్సింగ్ పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం రాత్రి పది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరిగిన విషయాలు తెలుసుకునేందుకు నెక్నాంపూర్‌లోని ప్రదీప్ ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకు న్నారు. దీంతో పాటు ప్రదీప్ ఇంట్లో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తే అసలేం జరిగిందనేది తెలు స్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగం గా వారందరినీ శుక్ర, శనివారాల్లో ఠాణాకు పిలిపించి విచారించనున్నట్టు తెలిసింది. ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు.. బుధవారం రాత్రి పోస్టుమార్టం పూర్తికావ డంతో ప్రదీప్ మృతదేహాన్ని నెక్నాంపూర్ లోని నివాసానికి తీసుకువచ్చారు. బుధ వారం ఉదయం ప్రదీప్ భౌతిక కాయానికి బంధుమిత్రులు, బుల్లితెర నటులు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం ఇంటి నుంచి రాయదుర్గంలోని మహా ప్రస్థానానికి తరలించారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ప్రదీప్ సోదరుడు చైతన్య రామకృష్ణ బ్రహ్మణ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్య క్రియల సందర్భంగా ప్రదీప్ తల్లితో పాటు భార్య పావనిరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. వారిని బంధువులు, బుల్లితెర నటులు ఓదార్చారు. నిన్నమొన్నటి వరకు తమతో ఎంతో అప్యాయంగా ఉండే ప్రదీప్ ఇక లేడంటే నమ్మబుద్ధి కావటం లేదని బంధువులు, తోటి నటీనటులు భోరున విలపించారు. కాగా, ప్రదీప్ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు అతని భార్య పావనిరెడ్డి నిరాకరించారు. కనిపించని శ్రావణ్.. పావనిరెడ్డికి సోదరునిగా చెప్పుకోవటం తో పాటు ప్రదీప్ మరణించే సమయం లోనూ ఫ్లాట్‌లోనే ఉన్న శ్రావణ్ గురువా రం అంత్యక్రియల్లో కనిపించలేదు. ప్రదీప్ బంధుమిత్రులు అంత్యక్రియల కార్యక్రమానికి వస్తారు కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే అతను దూరంగా ఉన్నట్టు తెలిసింది. కర్ణాటకలోని బెల్గాం నుంచి వచ్చిన పావ నిరెడ్డి బంధువులే అంత్యక్రియల్లో ఎక్కువ గా పాల్గొన్నారు. ప్రదీప్ ఇంటి వద్ద జరిగే కార్యక్రమాలతోపాటు అంతిమయాత్రను చిత్రీకరించన్వికుండా మీడియాను వీరు అడ్డుకోవటం చర్చానీయాంశమైంది. -
నటుడు కారుకు ప్రమాదం, మోడల్ మృతి
కోల్‌కతా: టాప్ మోడల్, యాంకర్, నటి సోనికా చౌహాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్ ఛటోపాధ్యాయతో కలిసి కారులో వెళుతుండగా శనివారం ఉదయం లాకేమాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అనంతరం పేవ్మెంట్ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న బిక్రమ్, సోనికాను హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్రంగా గాయమైన బిక్రమ్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన టయోటా కారు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు బిక్రమ్ కారును అత్యంత వేగంగా నడుపుతున్నట్లు సమాచారం. అలాగే కారులో ఎయిర్ బ్యాగ్స్ కూడా పని చేయలేదని తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆధారాల కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సోనికా చౌహాన్ మృతి పట్ల పలువురు బెంగాలీ నటులు సంతాపం తెలిపారు. కాగా బిక్రమ్ బెడ్రూమ్, మిస్టేక్, అమీ ఔర్ అమర్ గాళ్‌ఫ్రెండ్స్‌తో పాటు పలు బెంగాలీ చిత్రాల్లో హీరోగా నటించాడు. -
జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
–హాస్య నటుడు గౌతంరాజు రాయవరం(మండపేట): ‘గోదావరి జిల్లాలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నా. జిల్లావాసిగా కళామతల్లి రుణం తీర్చుకునేందుకు తగిన కృషి చేస్తున్నా’నన్నారు ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు. ఆత్మీయత, అనుబంధానికి జిల్లా పెట్టింది పేరని, మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉందని చెప్పారు. రాయవరం సాయితేజా 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాల దశ నుంచే నాటకాలు రాజోలులో పుట్టిన నేను కాకినాడ కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగం చేశాను. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. పాఠశాల దశ నుంచి నాటకాలు వేశాను. కాకినాడలో చదువుతుండగా 42 ప్రదర్శనలు ఇచ్చాను. ‘పశ్చాత్తాపం, లాభం, ఏక్ దిన్ కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి’ తదితర నాటకాల్లో నటించాను. అలా వచ్చింది అవకాశం.. సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వసంతగీతం’ సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ‘ఘరానామొగుడు, కూలీ నెం1, ప్రేమకు వేళాయెరా, ఉగాది’ తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. ‘జై శ్రీరామ్’ సినిమాలో తొలిసారి విలన్ వేషం వేశాను. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.ఎందరో మహానటులు నాటక రంగం నుంచి వచ్చిన వారే. జిల్లాలో త్వరలో బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియో నిర్మాణం చేపడుతున్నాను. ఎక్కడ నిర్మించేది త్వరలోనే వెల్లడిస్తాను. తమిళ డైరెక్టర్ సాగా దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందిస్తున్నాం. ఆ సినిమాలో జిల్లాలో ఉన్న నటీనటులకు ప్రాధాన్యం ఇస్తాను. మే నెలాఖరుకు షూటింగ్ ప్రారంభిస్తాను. నా కొడుకు కృష్ణకు గుర్తింపు వచ్చింది... నా కుమారుడు కృష్ణంరాజును కృష్ణ పేరుతో సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ‘లక్ష్మీదేవి సమర్పించు..నేడే చూడండి’ ఈ నెల ఏడున విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాతో కృష్ణకు నటుడిగా మంచి మార్కులు వచ్చాయి. కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో హీరో అవకాశం వచ్చింది. -
జయం రవి మరో సాహసం..
చెన్నై: తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటించిన 'వనమగన్' చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రయోగాలకు పెట్టింది పేరైన రవి ఈ సినిమాలో మరో సాహసం చేశాడట. వనమగన్(అడవిపుత్రుడు) సినిమాలో టార్జన్ గెటప్‌లో అలరించనున్న రవిప్రాత్రకు అస్సలు డైలాగులే వుండవట. గిరిజన యువకుడి ప్రాతలో డిఫరెంట్ జానర్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడని సమాచారం. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకపాత్ర పోషలించిన హాస్య నటుడు తంబి రామయ్య రవి పాత్రకు అస్సలు మాటలు వుండవన్న విషయాన్ని రివీల్ చేశారు. రవి నటనపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి డైలాగులు లేకుండా పూర్తిగా హావ భావాల ద్వారా నటనను పండించడం అంత సులువైంది కాదని, కానీ రవి అద్భుతంగా కనిపించారని చెప్పారు. శనివారం జరిగిన ఈ చిత్రం ఆడియో లాంచ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన పాత్రను అంగీకరించింనందుకు రవికి హాట్స్ ఆఫ్ అని వ్యాఖ్యానించారు. అలాగే హీరోయిన్ సయేషా సైల్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. నటనలో ఆమె నిబద్ధత తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే రిలీజైన్ ‘వనమగన్' ఫస్ట్‌లుక్ బాగానే ఆకట్టుకుంది. కారెక్టర్ అనుగుణంగా ట్రైబల్ యువకుడిగా ఊడలను పట్టుకుని వేలాడుతున్న పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. హారీస్ జయరాజ్ సంగీత సారధ్యం వహించిన ఈ మూవీ మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్‌ప్లాన్ చేస్తోంది. -
కొడుకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటుడు
నటుడు బ్రహ్మాజీ తన కుమారుడి వివాహ బంధంపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు ఆయన తన ట్విట్టర్లో తెలిపారు. గత అయిదు నెలలుగా తన కొడుకు, కోడలు విడిగా ఉంటున్నారని, త్వరలోనే డైవర్స్ తీసుకుంటున్నట్లు బ్రహ్మాజీ వెల్లడించారు. ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని, వారి భవిష్యత్ ఆనందంగా సాగిపోయేలా ఆశీర్వదించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మెరైన్ అధికారిగా పనిచేస్తున్న బ్రహ్మాజీ కుమారుడు సంజయ్.. బెంగాలీ ఫ్యాషన్ డిజైనర్ ఇంద్రాక్షిని 2013లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక బ్రహ్మాజీది కూడా ప్రేమ వివాహమే. Sad to inform that my son Sanjay and his wife Indrakshi now separated fr 5 months are getting divorced .wish them happiness and better luck — BRAHMAJI (@actorbrahmaji) 21 April 2017 -
వైజాగ్‌లో ఒక్క సీన్ తీసినా సినిమా హిట్టే!
నిర్మాతలకు విశాఖ ఓ సెంటిమెంట్ - నటుడు బాలాజీ ప్రకృతి గీసిన చిత్రంలా ఉండే విశాఖ నిర్మాతలకు సెంటిమెంట్ అని, ఇక్కడ ఒక్క సీన్ తీసినా ఆ సినిమా హిట్ అనే భావన వారిలో నాటుకుపోయిందని అన్నారు విలక్షణ నటుడు బాలాజీ. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన్ను సాక్షి పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) ‘మగమహారాజు’ మేలి మలుపు నేను సినీరంగంలో 1983లో అడుగుపెట్టాను. ఇప్పటివరకు వంద సినిమాలు చేశాను. మగమహారాజు సినిమా నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ప్రస్తుతం బిచ్చగాడా మజాకా, భ్రమ, గోలీ సోడా సినిమాలతో పాటు, బాలకృష్ణతో ఓ సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. పక్కింటి అమ్మాయి, కుంకుమపువ్వు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాను. ఉత్తరాది కళాకారులతో ‘అల్లూరి’ అల్లూరి సీతారామరాజు సీరియల్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఉత్తరాంధ్ర కళాకారులతోనే పూర్తిగా సీరియల్ నిర్మాణం జరుగుతుంది. షూటింగ్‌కు విశాఖ అనుకూలం చలనచిత్రాలు, సీరియల్స్ నిర్మాణానికి విశాఖ అనుకూలమైంది. ఇక్కడ సహజ సిద్ధమైన అందాలు ఉన్నాయి. చిత్ర నిర్మాతలకు విశాఖ ఒక వరం. ఇక్కడ చిత్రాలు నిర్మిస్తే అవి నూటికి నూరు శాతం విజయాన్ని సాధిస్తాయి. నిర్మాతలకు విశాఖ సెంటిమెంట్. ఇక్కడ ఒక్క సీను తీసినా చాలు ఆ సినిమా హిట్ అనే భావన నిర్మాతల్లో బాగా ఉంది. స్టూడియో ఉంటే మరింత అభివృద్ధి విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడిగా నా శాయశక్తులా కృషి చేస్తాను. ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు. ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక్కడే అన్నిరకాల సౌకర్యాలు ఉంటే తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా తయారవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి, ఇక్కడ ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలతో ఒక స్టూడియో నిర్మిస్తే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. -
ఐటీ శాఖ విచారణకు హాజరైన శరత్ కుమార్
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, నటుడు శరత్ కుమార్ మరోసారి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గురువారం ఆయన చెన్నైలోని ఐటీ శాఖ ఆఫీసుకు వెళ్లి వివరణ ఇచ్చారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్న అన్నా డీఎంకే శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచారని సమాచారం రావడంతో తమిళనాడు వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. రాధిక, శరత్‌కుమార్‌కు చెందిన రాడన్ గ్రూప్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. శరత్‌కుమార్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా ఐటీ శాఖ అధికారులు శరత్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. -
రాధిక, శరత్ కుమార్ చుట్టూ బిగుస్తున్నఉచ్చు
చెన్నై : ప్రముఖ నటులు రాధిక, శరత్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాధికా, శరత్‌కుమార్‌కు చెందిన రాడన్ గ్రూప్ కార్యాలయంలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇప్పటికే శరత్‌కుమార్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం వరకూ శరత్‌కుమార్‌ను విచారించిన ఐటీ అధికారులు.. మంగళవారం రాడాన్‌లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ అధికారులు శరత్‌కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఐటీ శాఖ విచారణకు శరత్ కుమార్‌తో పాటు రాధిక కూడా హాజరు కానున్నారు. అంతేకాకుండా శరత్‌కుమార్, మంత్రి విజయ్‌భాస్కర్ సంభాషణలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. రాడన్ కంపెనీ నుంచి డబ్బు మరల్చినట్టుగా అనుమానిస్తున్నారు. నటిగా సినిమాలు, టీవీ సీరియల్ చేస్తున్న రాధిక, తన సొంతం నిర్మాణ సంస్థ రాడన్ ద్వారా పలు సీరియల్లను సినిమాలను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే తమిళనాడులోని ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ డాక్టర్ గీతా లక్ష్మీ ఇవాళ ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. కాగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో రేగిన అధికార చిచ్చు... పళనిస్వామి సీఎం కావడంతో చల్లారగా... ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదాతో మళ్లీ వేడి రాజుకుంది. శశికళ వర్గీయులపై ఆదాయపన్నుశాఖ నిఘా కొనసాగుతోంది. అయితే అధికార పార్టీనే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బరిలో ఉన్న దినకరన్‌కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆర్కేనగర్ ఉపఎన్నిక వాయిద పడిన నేపథ్యంలో ఇవాళ డీఎంకే నేతలు ముంబైలో ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దుచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్కేనగర్లో కోట్లు కుమ్మరించిన అన్నాడీఎంకే నేతలపై జీవితకాలం నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, ఐటీ దాడుల్లో మంత్రుల ఇంట్లో నగదు దొరికిన విషయాన్ని వారు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. -
వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ హీరోపై దాడి కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మోడల్ గా కెరీర్ ఆరంభించి ఆపై కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన రాంపాల్ 2000 దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. నిర్మాతగానూ రాంపాల్ కొన్ని సినిమాలను రూపొందించాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలతో బిజీగా ఉన్న అర్జున్ రాంపాల్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ ఫొటోగ్రాఫర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ వివాదం ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈవెంట్లో ఓ ఫొటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చాడు. నటుడు వద్దని ఎంత వారిస్తున్నా ఫొటోగ్రాఫర్ కెమెరాకు పని చెబుతూ.. ఫొటోలు తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాంపాల్ మొదట ఫొటోగ్రాఫర్ చేతిలో కెమెరాను తీసుకుని విసిరికొట్టడంతో అది పాడయింది. దీంతో వెంటనే రాంపాల్ ను ప్రశ్నించగా.. తనపై దాడికి పాల్పడి గాయపరిచాడని బాధిత ఫొటోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ నటుడు రాంపాల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఆ సీనియర్ నటుడికి క్యాన్సర్ సొకిందా?
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అమితాబ్ బచ్చన్‌కు గట్టి పోటీనిచ్చిన డ్యాషింగ్ స్టార్ వినోద్ ఖన్నా. ప్రస్తుతం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు క్యాన్సర్ సొకినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. డీహైడ్రేషన్ కారణంగా గత నెల 31న వినోద్ ఖన్నాను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని వారు చెప్పారు. అయితే, గురువారం వెలుగులోకి ఆయన ఫొటోలు అభిమానులను షాక్ గురిచేశాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలలో బలహీనంగా కనిపిస్తున్న వినోద్ ఖన్నాకు క్యాన్సర్ సోకిందేమోనంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీ కూడా అయిన వినోద్ ఖన్నా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలిపేందుకు సదరు ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం వినోద్ ఖన్నా కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నామని వైద్యులు చెప్తున్నారు. #VinodKhanna Get well soon Vinod ji....we will pray for you...Definitely you will win against this war...Love u — Venky aDIGA (@Anchor_Venky) 6 April 2017 -
కోలుకున్న సీనియర్ నటుడు!
బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్‌కు గురైన ఆయనను గత నెల 31న కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే వినోద్ ఖన్నాను ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని వారు చెప్పారు. -
సదుర అడి–3500 షూటింగ్ పూర్తి
సదుర అడి–3500 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ధృవంగళ్–16 వంటి ఘనవిజయం సాధించిన చిత్రం తరువాత నటుడు రఘుమాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం సదుర అడి–3500. కన్నడ నటుడు అకాశ్, నిఖిల్, ఇనియ, కోవైసరళ, ఎంఎస్.భాస్కర్, మనోబాల, తలైవాసల్ విజయ్, ప్రతాప్‌పోతన్, పరవై మునియమ్మ, దర్శకుడు శరవణసుబ్బయ్య, స్వాతిదీక్షిత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రైట్ వ్యూ సినిమాస్ పతాకంపై జైసన్ జోసఫ్, ఎన్ఆర్ఎంలు నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దర్శకత్వం వహిస్తున్న దీనికి గణేశ్‌రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే కొన్ని యాథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం సదుర అడి–3500 అని తెలిపారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? మనిషి మరణించిన తరువాత అతని ఆత్మ ఎటు పయనిస్తుంది? లాంటి విషయాలను క్షణ్ణంగా పరిశోధించి విభిన్న కథ, కథనాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని అన్నారు. హారర్, కామెడీ, లవ్, యాక్షన్ అంటూ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బెంగళూర్, సాలకుడి, చెన్నై చివారు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
భయపెట్టడానికి రెడీ అవుతున్న నమిత
నటి నమితను ఇప్పటివరకూ కలల రాణిగానే భావిస్తారు అభిమానులు. అలా తనకే సొంతమైన అందాలతో యువతను గిలిగింతలు పెట్టిన ఈ సూరజ్ బ్యూటీ ఇప్పుడు తెరపై బీభత్సం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత నమిత నాయకిగా నటిస్తున్న చిత్రం పొట్టు. నటుడు భరత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఇనియ, సృష్టిడాంగే ఇతర కథానాయికలుగా నటిస్తున్నారు. తంబిరామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని షాలోమ్ స్టూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్, జాన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం పొట్టు. వడివుడైయాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నటి నమిత ఆహార్యం, అభినయం విభిన్నంగా ఉంటాయి. అటు మృగం, ఇటు మనిషి కలిసిన ఒక వింత గెటప్‌లో కనిపించే నమిత వెండితెరపై బీభత్సం సృష్టిస్తారంటున్నారు చిత్ర దర్శకుడు విడివుడైయాన్. దీని గురించి ఆయన తెలుపుతూ పొట్టు పూర్తి హారర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటుడు భరత్ తొలిసారిగా అమ్మాయి వేషంలో కనిపిస్తారన్నారు. ఇక నమిత ఇప్పటి వరకూ నటించనటువంటి విభిన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఇందులోని అడి పోడీ సంఢాలి అనే పాటను ఇటీవల కేరళలోని అధిరంబిలి ప్రాంతంలో నదిలో చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తమిళంలో పొట్టు, తెలుగులో బొట్టు, హిందీలో బింది పేర్లతో త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
పెరంబూర్: జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రయివేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. జల్లికట్టు క్రీడ కోసం యువత చాలా ప్రశాంతంగా, కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్నారన్నారు. తాము వారికి మద్దతు పలికామన్నారు. అలాంటి జల్లికట్టు పోరాటంలో పోలీసుల హింసాత్మక చర్యలు అనవసరంగా పేర్కొన్నారు. జయలలిత మరణానంతం అందరికీ మాట్లాదే ధైర్యం వచ్చిందని ప్రకాశ్ రాజ్ అన్నారు. జయలలిత మరణం తరువాత బాధ్యతాయుతమైన నాయకుడు లేడని, తమిళ ప్రభుత్వం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వ పాలనే ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు. అనూహ్యంగా నాయకుడిని ఎంచుకోరాదన్నారు. వారి కోసం ప్రజలు ఓట్లు వేయలేదని, శాసనసభ్యుల మద్దతు ఉన్నా వారిని ఆ నాయకురాలి కోసమే ప్రజలు ఎన్నుకున్నారన్నది మరచిపోరాదన్నారు. అయినా రాజ్యాంగ చట్టప్రకారం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఐదేళ్లు పారిపాలించాల్సిందేనన్నారు. ఏ ప్రభుత్వం అయినా నిర్మాతల మండలి కోసం వారిని తాము కలిసి మాట్లాడతామని నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఈయన నటుడు విశాల్‌తో కలిసి తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారన్నది గమనార్హం. అదే విధంగా రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేస్తున్న తమిళ రైతులను కలిసి వారికి మద్దతు తెలిపిన ఈ జట్టు బృందం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని, కేంద్ర మంత్రులను కలిసి రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వారి దీన స్థితిని వివరిస్తూ వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
చించినాడలో సినిమా షూటింగ్
చించినాడ (యలమంచిలి) : చంద్రబాలాజీ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శుక్రవారం చించినాడలో జరిగింది. చిత్రంలో హీరో తల్లిదండ్రులుగా నటిస్తున్న సుమన్, పార్వతిలపై సన్నివేశాలను దర్శకుడు సాయికృష్ణ కేవీ చిత్రీకరించారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. సినిమాలో అశోక్‌వర్మ, ప్రియాంక శర్మ అనే నూతన నటులు హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నిర్మాత కె.చంద్రరావు మాట్లాడుతూ తమ బ్యానర్లో గతంలో టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అనే సినిమా నిర్మించామని, ఇది రెండో సినిమా అన్నారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతుందని, సినిమాను జూన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. షూటింగ్ అంతా చించినాడ, అంతర్వేది, కడలి, రాజోలు, శివకోడు గ్రామాల్లో చేస్తున్నట్టు వివరించారు. దర్శకుడు సాయికృష్ణ కేవీ ఎస్ఎస్ రాజమౌళి వద్ద విక్రమార్కుడు, ఈగ, మర్యాదరామన్న, మగధీర తదితర చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేశారన్నారు. ఈ సినిమాకు ఎస్.రాజశేఖర్ కెమెరామెన్‌గా పనిచేస్తుండగా వినోద్ సంగీతం అందిస్తున్నారు. -
ఇప్పటికి పదివేల మంది ఈ ప్రశ్న అడిగారు!
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ – కొందరు సినిమా స్టార్స్ తరచూ చెప్పే డైలాగ్ ఇది. కానీ, భరత్‌రెడ్డికి ఈ డైలాగ్ అవసరం లేదు. ఎందుకంటే... ఈయన డాక్టర్ కమ్ యాక్టర్. కార్డియాలజిస్ట్‌గా ప్రజల్లో ఎంత మంచి పేరుందో... నటుడిగా ప్రేక్షకుల్లో అంతే మంచి గుర్తింపు ఉంది. ఇటీవల విడుదలైన ‘ఘాజీ’లో భరత్ చేసిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా భరత్‌రెడ్డి చెప్పిన విశేషాలు.... ‘డాక్టర్ అండ్ యాక్టర్‌గా చేస్తున్నారు. రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?’ – నన్ను ఎవరు కలిసినా మొదట అడిగే ప్రశ్న ఇదే. సుమారు ఓ పదివేల మందికి పైగా ఈ ప్రశ్న అడిగారు. డాక్టర్, యాక్టర్.. రెండూ విభిన్నమైన ప్రొఫెషన్స్. రెండిటినీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మా అమ్మగారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వర్రీ అయ్యారు. నాన్నగారు ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ‘సినిమాల్లోకి వెళుతున్నాడు. వీడి లైఫ్ ఏమౌతుంది? కార్డియాలజీ ప్రాక్టీస్ ఏమౌతుంది?’ అని అమ్మ భయపడ్డారు. పదేళ్లుగా రెండు ప్రొఫెషన్లనూ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నా. మంచి సినిమాల్లో నటించడంతో పాటు డాక్టర్‌గా ప్రజలకు మంచి చేయాలనే ఆశయమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ∙నటుడిగా ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే... ‘సిద్ధం’, ‘ఈనాడు’, ‘గగనం’, ‘ఘాజీ’ వంటి పలు స్ఫూర్తివంతమైన సినిమాల్లో నటించాను. నాకు పెద్దగా టార్గెట్స్ లేవు. చరిత్రలో నిలిచే ఇలాంటి సినిమాలు చేయాలని కోరిక. గతేడాది ‘భయం ఒరు పయనం’ అనే తమిళ సినిమాలో హీరోగా చేశా. అది ‘భయమే ఒక ప్రయాణం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఛాన్స్ వస్తే హీరోగా చేయడానికి రెడీ. అలాగే, మంచి పాత్రలు వస్తే ‘ఘాజీ’ వంటివీ చేస్తా. ‘ఘాజీ’లో పాత్ర నటుడిగా ఓ ఛాలెంజ్. సినిమాలో లైవ్ ఫైర్‌తో ఓ సీన్ చేశాను. అందులో గ్రాఫిక్స్ ఏం లేవు. సీన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే... నా కనుబొమలు, జుత్తు కాలిపోయి ఉన్నాయి. షాకయ్యా. లక్కీగా స్కిన్‌కి ఏం కాలేదు. జుత్తు కాలినా తిరిగి పెరుగుతుంది. డాక్టర్‌ను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. ∙జ్యోతిక, జీవీ ప్రకాశ్‌కుమార్ ముఖ్య తారలుగా దర్శకుడు బాల తీస్తోన్న ‘నాచియార్’లో కీలక పాత్ర చేస్తున్నా. బాలాగారి సినిమాలు నటీనటులకు ఎంత పేరు తెస్తాయో తెలిసిందే. అందుకే రెమ్యునరేషన్ గురించి అడగలేదు. వెంటనే ఓకే చెప్పేశాను. ఓ కమర్షియల్ తెలుగు సినిమాలో మంచి అమౌంట్ ఆఫర్ చేసినా... రొటీన్ క్యారెక్టర్, అదీ చిన్నది కావడంతో అంగీకరించ లేదు. నాకు మనీ ముఖ్యం కాదు, ఆర్టిస్ట్‌గా ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నా. -
అను మాలిక్ ఇంట్లో సెలబ్రిటీల సందడి
-
బాలయ్య ఇలాఖాలో భూ దందా..
రూ.20 కోట్ల విలువైన స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బెదిరింపులు ఖాళీ చేసి వెళ్లకపోతే చంపుతామంటున్నారన్న వ్యాపారులు హిందూపురం అర్బన్ : నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ దందాకు తెరలేపారు. వివాదాస్పదమైన, రూ.20 కోట్లు విలువ చేసే భూమిపై వారి కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కైవసం చేసుకునేందుకు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరిస్తున్నారు. మాట వినని వారిని చంపుతామంటూ భయపెడుతున్నారు. వివరాల్లోకెళితే.. పట్టణంలోని వీడీ రోడ్డులో మిషన్ కాంపౌండ్ (చిన్నరాజు కాంపౌండ్)గా పిలిచే సర్వే నంబరు 79-బీలో 1.36 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం రూ.20 కోట్ల విలువ చేస్తుంది. ఇక్కడ పలువురు 50 ఏళ్లుగా బీరువాల తయారీ, మోటార్ మెకానిక్ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ స్థలం వివాదంలో ఉంది. హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. అయినప్పటికీ దీనిపై కన్నేసిన కొందరు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. స్థలంలో ఉంటున్న ఎనిమిది మందితో లోపాయికారిగా ఒప్పందం చేసుకుని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మిగిలిన నలుగురు ససేమిరా అంటుండటంతో బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాపరిషత్ చైర్మన చమన్‌సాబ్, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథిల పేర్లు చెప్పుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఖాళీ చేసి వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రక్షణ కల్పించండి చిన్నరాజు కాంపౌండ్ స్థలంలో బీరువాలు తయారు చేస్తూ 30మందికి ఉపాధి కల్పిస్తున్న తనను స్థలం ఖాళీ చేయకపోతే చంపుతామని కొందరు బెదరిస్తున్నారని జవహర్ సేఫ్కో కంపెనీ నిర్వాహకుడు అన్వర్‌సాబ్ ఆరోపించాడు. మంగళవారం హిందూపురం ప్రెస్‌క్లబ్‌లో ఎస్‌ఎల్‌వీటీ ట్రాన్స్‌పోర్టు అశ్వర్థనారాయణ, ఫయాజ్, ముస్తఫాతో కలిసి మాట్లాడాడు. ఆ స్థలం తమదేనని సిరాజ్, మునిసిపల్ చైర్పర్సన్ భర్త నాగరాజు, లాయర్ అజ్మతుల్లాలు అనుచరులతో వచ్చి షాపులు ఖాళీ చేసి వెళ్లకపోతే జేసీబీలతో కూల్చేస్తామని జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసార«థిల పేర్లు చెప్పి బెదిస్తున్నారని చెప్పారు. వారినుంచి ప్రాణçహాని, ఆస్తినష్టం కలిగే ప్రమాదం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఎస్పీతోపాటు టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. -
భరత్‌కు అండగా ఉంటా
నటుడు భరత్‌కు అండగా ఉంటానని నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. భరత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింబ. సినీరమ స్టూడియోస్ శవనేశ్వరన్, యశోద పిక్చర్స్ గోల్డ్ మనోజ్ నిర్మిస్తున్న ఇందులో భాను మెహ్రా, స్వాతి దీక్షిత్ కథానాయికలుగా నటించారు. నటుడు ప్రేమ్‌జీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా అరవింద్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాల్, దర్శకుడు మిష్కన్, వెంకట్‌ప్రభు, జయంరవి, ఉదయ, స్నేహా, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చిత్ర ఆడియోను విశాల్ ఆవిష్కరించగా వెంకట్‌ప్రభు, ప్రసన్న, స్నేహ తొలి సీడీ అందుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ భరత్ తనకు మంచి మిత్రుడన్నారు. కోలీవుడ్‌లో విజయ్ తరువాత అంత మంచి డ్యాన్సర్ భరత్ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి చిన్న టైటిల్ సమస్య వచ్చినప్పుడు నడిగర్ సంఘం తరఫున తాము అండగా నిలిచామని తెలిపారు. ఇకపై కూడా నటుడు భరత్‌కు అండగా ఉంటానని అన్నారు. సింబ చిత్రం ఒక కొత్త ప్రయోగం అని పేర్కొన్నారు. ఇది మంచి విజయం సాధించి భరత్‌తో పాటు చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మంచి బాణీలను అందించారని, ఆయనతో కలిసి చిత్రం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ముందుగా భరత్ భార్య, సంగీత దర్శకుడి భార్య, దర్శకుడి తల్లి, నిర్మాతల కుటుంబ సభ్యులు మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేయడం విశేషం. -
'మా' అధ్యక్షుడిగా శివాజీరాజా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన 'మా' ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొత్త కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నికయ్యారు. సినిమా పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు కృషితో ఈసారి పోటీ లేకుండా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని నరేశ్ ఇంతకుముందు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్త కమిటీ అధ్యక్షుడిగా శివాజీరాజా పేరును 'మా' కమిటీ, ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీనికి 'మా' సభ్యులు, సలహాదారులు అంగీకరించారు. శివాజీరాజా మాట్లాడుతూ ఎన్నికల్లో మేము 10శాతం హామీలిచ్చాం. కానీ కళాకారుల శ్రేయస్సు కోసం 100శాతం కృషి చేశామన్నారు. గత ఎన్నికల్లో 'మా' రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై జయసుధ పోటీకి దిగడంతో 'మా' ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. చివరకు రాజేంద్రప్రసాద్ ప్యానల్ విజయం సాధించింది. -
ఎగిరిన ఈగ
గత ఐదేళ్లుగా ప్రకటించకుండా జాప్యంలో ఉంచిన నంది అవార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ‘నంది అవార్డు’లను ప్రకటించింది. 2012కు సీనియర్ నటి జయసుధ, 2013కు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రెండు కమిటీలు ఎంట్రీలను పరిశీలించి, విజేతలను నిర్ణయించాయి. జనరంజక సినిమాలుగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ‘ఈగ’, ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం గమనార్హం. 2012లో ఉత్తమ జాతీయ సమైక్యత, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ బాలల చిత్రాల విభాగాల్లో ఎవరికీ అవార్డు దక్కకపోవడం బాధాకరం. 2013లో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో మినహా అన్ని విభాగాల్లోనూ విజేతలను ఎంపిక చేశారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో అవార్డులు గెలుచుకొని ‘ఈగ’ 2012 సంవత్సరానికి మేటిగా నిలిచింది. ఒక ఈగను హీరోగా చేసి సినిమాను రక్తి కట్టించడం సామాన్యమైన విషయం కాదు. అందువల్ల కూడా కమిటీకి ఈగ నచ్చి ఉండవచ్చు. ఈగ ఎత్తు ఆయన ఊహించారు ‘ఈగ’ సినిమాకు నంది అవార్డులు రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం యూనిట్‌కు మంచి మైలేజ్ ఇస్తుందని నిర్మాత సాయి కొర్రపాటి అప్పుడే చెప్పారు. అది నిజమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా చిత్రాన్ని గుర్తించి అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కమిటీకి రుణపడి ఉంటాం. నాతో పాటు ఈ చిత్రానికి నంది అవార్డులు గెలుచుకున్న సుదీప్, సెంథిల్‌కుమార్, కడియాల దేవికృష్ణ, కోటగిరి వెంకటేశ్వరరావు, కీరవాణి, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’కి గానూ నంది అవార్డులు గెలుచుకున్న సమంత, నాని తదితరులకు శుభాకాంక్షలు. – దర్శకుడు రాజమౌళి వాళ్లతో ప్రయాణం ఎంతో ఇష్టం ‘ఈగ’ అనేది రాజమౌళి మాయ. ఆ సినిమాకి ముందు ఆయన సినిమాలు రెండిటిని డిస్ట్రిబ్యూట్ చేశా. రాజమౌళికి తెలియని విద్య లేదు. ‘ఈగ’కు రమా రాజమౌళిగారు కాస్ట్యూమ్స్, వల్లీగారు లైన్ ప్రొడక్షన్ చూసుకున్నారు. కార్తికేయ కూడా పనిచేశాడు. సినిమాలు తీశామా? డబ్బులు వచ్చాయా? అవార్డులు వచ్చాయా? అనేవి పక్కన పెడితే... దేవుడు నాకు కల్పించిన అదృష్టం రాజమౌళి, కీరవాణిలతో పరిచయం. లైఫ్‌లో వీళ్లిద్దర్నీ కలవకపోయుంటే చాలా మిస్ అయ్యేవాణ్ణి. వాళ్లతో ప్రయాణం నాకు ఇష్టం. – ‘వారాహి’ చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి వెరీ..వెరీ..వెరీ స్పెషల్ ఏ వెరీ స్పెషల్ అవార్డు, ఏ వెరీ స్పెషల్ ఫీల్మ్, ఏ వెరీ స్పెషల్ టీమ్. నంది అవార్డు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ నటి విభాగంలో నంది సొంతం చేసుకున్న సమంతకు శుభాకాంక్షలు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రానికి అత్యద్భుతంగా దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్‌గారికి ధన్యవాదాలు. అవార్డు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – నటుడు నాని ప్రతి లైన్ ప్రయోగమే ఎంతో లోతుగా ఆలోచించి రాసిన పాట ‘కోటి కోటి తారల్లోన..’ (‘ఎటో వెళ్లిపోయింది మనసు’) ఇందులోని ప్రతి లైన్ ఓ ప్రయోగమే. అరిథ్‌మెటిక్స్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ... ప్రతి సబ్జెక్ట్ ప్రస్తావన తీసుకొస్తూ, ప్రేమకు సంబంధించిన భావమే అనిపించేలా రాశాను. ప్రయోగాత్మకంగా రాసిన పాటను ప్రభుత్వంవారు గుర్తించడమంటే.. అంతకు మించిన సంతృప్తి ఏదీ ఉండదు. – పాటల రచయిత అనంత్ శ్రీరామ్ చాలా హ్యాపీ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రానికి ఉత్తమ నటి కేటగిరీలో నాకు నంది అవార్డు రావడం చాలా సంతోషం. అవార్డు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఉత్తమ నటునిగా నంది అవార్డు గెలుచుకున్న నానికి శుభాకాంక్షలు. – కథానాయిక సమంత కొత్త థ్రిల్ నా ఆనందం... ఆశ్చర్యం ఏంటంటే... సుమారు యాభై చిత్రాలకు నేను మాటలు రాశాను. అప్పుడెప్పుడూ నంది అవార్డు రాలేదు. ఉత్తమ మాటల రచయితగా నంది అందుకోవడం ఇదే మొదటిసారి. అల్మోస్ట్ నేను రచన మానేసి, దర్శకత్వం వహించిన ‘మిథునం’కి మాటలు రాసుకున్నప్పుడు అవార్డు రావడం ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొత్త థ్రిల్. తృతీయ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ఎస్పీ బాలుగారు, లక్ష్మీగారికి కూడా స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చాయి. మా చిత్రం విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా చిత్ర బృందమంతా తమ సొంత చిత్రంలా భావించి పనిచేశారు. నా సంతోషాన్ని వాళ్లందరితో పంచుకుంటున్నాను. – దర్శక–రచయిత–నటుడు తనికెళ్ల భరణి ఆ ఆశయం నెరవేరింది మా ‘మిథునం’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైంది. మన తెలుగువాళ్లందరూ ఆనందపడే రీతిలో అవార్డులు ప్రకటించడం సంతోషంగా ఉంది. నేను ఏ ఆశయంతో అయితే చిత్రాన్ని నిర్మించానో.. ఆ ఆశయం పూర్తిగా సక్సెస్ అయింది. ఆనందంగా ఉంది. ‘ఆనంద్రావుగారూ.. మీకు మంచి కీర్తి వస్తుందని ఆ రోజే చెప్పాను. నాకెన్నో అవార్డులు వచ్చాయి. వాటన్నిటి కంటే ఈ అవార్డును గొప్పగా ఫీలవుతున్నాను’’ అని బాలుగారు ఫోన్ చేసి చెప్పారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి – నిర్మాత ఆనంద్ ముయిద రావు. తెలుగు సినిమా ప్రస్థానం తెలుగు సినిమా ఎనభై ఏళ్ల చారిత్రక ప్రస్థానంపై సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర వెలువరించిన ‘ప్రస్థానం’ గ్రంధానికి నంది అవార్డు వరించింది. 1931– 2011 వరకు తెలుగు సినిమాకు సంబంధించి అన్ని ప్రధాన ఘట్టాల్ని చిత్రాలతో సహా పొందుపరిచారు. సినీ ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు ఆయా కాలాల సినిమా విశేషాలను ఇందులో ప్రస్తావించా రు. సంవత్సరాల వారీగా తెలుగు సినిమాలు, ఫాల్కె అవార్డు గ్రహీతల వివరాలు, నంది అవార్డుల వివరాలు ఇందులో ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన పొన్నం రవిచంద్ర మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. రాజకీయ, సాహిత్య, కళారంగాలకు చెందిన అంశాలపై పలు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం కరీంనగర్ ఫిల్మ్ సొసైటి కార్యదర్శిగా ఉన్నారు. - పొన్నం రవిచంద్ర అమ్మ గుర్తొచ్చారు నేను డబ్బింగ్ థియేటర్ లో ఉన్నప్పుడు నటి రజితగారు ఫోన్ చేసి ‘ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు వచ్చింది’ అని చెప్పారు. నమ్మలేదు. తర్వాత హ్యాపీగా ఫీలయ్యా. ‘ఓనమాలు’ దర్శకుడు క్రాంతి మాధవ్‌కి, సంభాషణల రచయిత ఖదీర్‌గారికి కృతజ్ఞతలు. స్టేజి ఆర్టిస్టుగా 2005లో నంది అవార్డు అందుకున్నా. సినిమా రంగంలో ఇదే తొలి నంది. ఈ అవార్డు వచ్చిందనగానే మా అమ్మగారు గుర్తుకొచ్చారు. ఆమె ఉండి ఉంటే సంతోషించేవారు. నాన్నగారు ఫుల్ హ్యాపీ. – నటుడు రఘుబాబు ఇన్నేళ్ల కష్టానికి గుర్తింపు ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్లో ఉన్నా. ఓ స్నేహితుడు ఫోన్ చేసి, నంది అవార్డు వచ్చిందని చెప్పాడు. ‘ఇష్క్’ రిలీజై ఐదేళ్లవుతోంది.. ఇప్పుడు అవార్డు రావడమేంటి? అని ఆశ్చర్యం వేసింది. నటుడిగా ఇన్నేళ్ల నా కష్టానికి ‘నంది’ అవార్డు ఓ గుర్తింపుగా నిలిచింది. తొలిసారి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని ‘ఇష్క్’ టీమ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటా. ఇకపైనా మంచి పాత్రలు ఎంచుకుని వాటికి న్యాయం చేస్తా. నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్, నిర్మాతలు పి.సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్లకు కృతజ్ఞతలు. - నటుడు అజయ్ -
హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు బిల్ పాక్స్టన్(61) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ది టర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్ వంటి ప్రముఖ చిత్రాల ద్వారా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిల్ కు డాక్టర్లు సర్జరీ చేస్తుండగానే మృతిచెందారని ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. ఓ మంచి భర్తగా, తండ్రిగానూ ఆయనకు మంచి పేరుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బిల్ పాక్స్టన్ ఆపై నటుడిగా, ఫిల్మ్ మేకర్‌గా రాణించారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు హాలీవుడ్ ఇండస్ట్రీకి విశేష సేవ చేశారని, నేడు ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
జీవితాంతం నటిస్తూనే ఉంటా
‘సాక్షి’తో సినీ నటుడు కోట శంకరరావు ఒంగోలు కల్చరల్: నాటకరంగంతో ప్రస్థానం ప్రారంభించి సినీ, టీవీ రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రతిభావంతులైన వెండితెర వేల్పులలో కోట శంకరరావు ఒకరు. కృష్ణా జిల్లా కంకి పాడుకు చెందిన శంకరరావు కళారంగంపై మక్కువతో ఎస్బిఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి పూర్తిస్థాయి కళాకారుడిగా, నటుడిగా సినీనాటకరంగాలతోపాటు టెలివిజన్ రంగంలో రాణిస్తూ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. నిర్మాతలు డబ్బు కోసమే అశ్లీలతతోకూడిన , హింసను ప్రేరేపించే విధంగా సినిమాలు, సీరియల్స్ తీస్తున్నారని అది కళాసేవ ఎంత మాత్రం కాదని ఆయన అన్నారు. ఇందుకు రచయితలను తప్పు పట్టడం సరికాదనేది ఆయన అభిప్రాయం. ఎన్టీఆర్ కళాపరిషత్ కళార్చన కార్యక్రమాలలో భాగంగా మినిస్టర్ నాటక ప్రదర్శనకు దర్శకత్వం వహించేందుకు కోట శంకరరావు సోమవారం ఒంగోలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 35 ఏళ్ల కిందటే నటనకు శ్రీకారం కంకిపాడుకు చెందిన కోట శంకరరావు ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావుకు సోదరుడు. కంకిపాడులో గౌరీశంకర ఆర్ట్ థియేటర్ పక్షాన శంకరరావు, శ్రీనివాసరావు తదితరులు నాటకాలు ఆడేవారు. ప్రస్తుతం మీడియా క్రియేషన్స్ అనే సంస్థ«ను స్థాపించి దాని తరఫున నాటక ప్రదర్శనలిస్తున్నారు శంకరరావు . కళాభిమానంతో ఉద్యోగానికి స్వస్తి నాటకాలతోపాటు టీవీ, సినిమాలలో శంకరరావుకు వచ్చే అవకాశాలు పెరగడంతో ఆయన ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఉద్యోగం మానేస్తే బతుకు బండి నడిచేదెలా అని చాలా కాలం ఆలోచించి చివరకు ఆ ఉద్యోగం మానేసినా తనకు నష్టం ఏమీలేదనే నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టారు. ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటా ‘కళారంగం నా ఊపిరి. ఊపిరి ఉన్నంత వరకు సినిమాలలో, నాటకాలలో నటిస్తూనే ఉంటా’ అంటూ తన జీవితాశయాన్ని కోట శంకరరావు వ్యక్తీకరించారు. ప్రోత్సాహం.. శంకరరావుకు గుంటూరు శాస్త్రి వంటి కళా సహృదయుల ప్రోత్సాహం లభించింది. ఉషశ్రీ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వంటి వారి సహకారం తోడైంది. రేడియో నాటికలు, నాటకాలలో కూడా ఆయన పాల్గొన్నారు. వంద సినిమాలు శంకరరావు సినిమాలలో సెంచరీ పూర్తి చేశారు. సూత్రధారులు, పల్నాటి పౌరుషం, అంకురం, చీమల దండు వంటి పలు సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. హిందీలో ఏక్తా సినిమాలో నటించారు. తమిళంలో కూడా ఆయనకు అవకాశాలు వచ్చాయి. నాటకరంగంలో గత 35 సంవత్సరాలుగా నాటకరంగంతో తన అనుబంధాన్ని శంకరరావు కొనసాగిస్తూనే ఉన్నారు. 1981లో నాగులు తిరిగే కోన నాటకంలో ఆయన నటించారు. ఆ నాటకంతోపాటు రసరాజ్యం నాటకం నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని ఆయనకు కల్పించింది. టీవీ సీరియల్స్‌లో పలు టీవీ ఛానెల్స్‌లో 64 మెగా సీరియల్స్‌లో కోట శంకరరావు వైవి«ధ్యభరితమైన పాత్రలు పోషించారు. శ్రీమతి, గంగోత్రి, గాయత్రి, సప్తపది, అమ్మ, అక్కాచెల్లెళ్లు, కలిసుందాం, విశ్వామిత్ర, యోగి వేమన వంటి సీరియళ్లు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆకాశవాణి, టెలివిజన్ సంస్థలు గ్రేడ్–1 కళాకారునిగా ఆయనకు గుర్తింపునిచ్చాయి. పొందిన పురస్కారాలు.. శంకరరావు మూడు సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. దీనితోపాటు 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిల్ గ్లోబల్ పీస్ పురస్కారాన్ని బెంగళూరులో అందుకున్నారు. పలు సినీనాటకరంగ కళా సంస్థలు శంకరరావును ఘనంగా సన్మానించాయి. పరభాషా నటులకే ప్రోత్సాహం.. నేడు తెలుగులో ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోకుండా బయటి ప్రాంతాల నుంచి విలన్లను, ఇతర నటులను నిర్మాతలు తెస్తుండడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇంటిల్లిపాది కూర్చుని చూసే సినిమాలేవీ..? నేడు కుటుంబ సభ్యులతో కూర్చుని చూడగలిగే సినిమాలు, సీరియళ్లు తక్కువ. నేడు అశ్లీలంతో, హింసతో, ద్వంద్వార్థాలతో కూడిన సినిమాల ను, సీరియళ్లను తీసే నిర్మాత, దర్శకులు ముందు కుటుంబ సభ్యులతో, సంతానంతో వాటిని కలసి చూడగలరేమో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. విలువలను కాపాడేందుకు కృషి చేయాలి. -
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?
-
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?
- వెలుగులోకి వాస్తవాలు - దాడికి నిరసనగా డీఎంకే దీక్షలు - రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న స్టాలిన్ సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందా? ఈ ప్రశ్నకు డీఎంకే నాయకులు అవుననే అంటున్నారు. మార్షల్స్ ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఇందుకు బలమైన రుజువని చెబుతున్నారు. సభా నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్‌లను రంగంలోకి దించి, పథకం ప్రకారం ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌పై దాడి చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు దొరికినట్టు సమాచారం. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో ఆ తొమ్మిది మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయమై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సభలో స్పీకర్ కూడా లేని సమయంలో చొరబడ్డ ఆ అధికారులు బలవంతంగా స్టాలిన్‌ను బయటకు ఎత్తుకెళ్లినట్టు ఆధారాలు బయట పడ్డాయి. శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్ కుమార్, ఆర్ సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్ అనే ఐపీఎస్‌లు సభలోకి వచ్చినట్టు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమంలో సాగిన అల్లర్ల వ్యవహారంలో వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. సభలో సాగుతున్న గందరగోళం మేరకు ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే, హఠాత్తుగా ఐపీఎస్‌లకు మార్షల్స్ యూనిఫారాలు ఎక్కడి నుంచి వచ్చాయని, సభలో స్పీకర్ లేని సమయంలో ఎలా మార్షల్స్ ముసుగులో ఆ అధికారులు ప్రవేశించారని డీఎంకే ప్రశ్నించింది. దీంతో ఈ తొమ్మిది మంది మెడకు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22న డీఎంకే దీక్షలు స్టాలిన్‌కు జరిగిన అవమానంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తనను బలవంతంగా ఎత్తుకు వచ్చి, దాడి చేశారని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై పోరాటానికి డీఎంకే శ్రేణులు సిద్ధమయ్యాయి. దూకుడు ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్టాలిన్ నిర్ణయించారు. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. దాడికి నిరసనగా ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు కూడా అనుమతి కోరనున్నామని స్టాలిన్ తెలిపారు. దీక్షకు డీఎంకే సిద్ధం అవుతోంటే, మెరీనా తీరంలో నిషేదాజ్ఞల్ని ఉల్లంఘించి ఆందోళన నిర్వహించారని పేర్కొంటూ, స్టాలిన్, ఇద్దరు ఎంపీలు, 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. గవర్నర్ వద్ద పంచాయితీ - అసెంబ్లీని రద్దు చేయాలన్న డీఎంకే - సభలో పరిస్థితులను వివరించిన స్వామి చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మ రొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరి శీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శాసనసభలో శనివారం జరిగిన కార్యకలాపాలను రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని సభలో విపక్ష నాయకుడు కూడా అయిన ఆయన పేర్కొన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూ ర్తి చేశారు. ఇదిలా ఉంటే స్వామిని బలపర్చినందుకు తనకు బెది రింపులు వస్తున్నాయని కోయంబత్తూరు ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్ ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి దుర్భాషలాడారని చెప్పారు. వికీపిడియాలో 'పళనిస్వామి: శశికళ బానిస' ప్రజా మద్దతుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేరు వికీపీడియాలో మారిపోయింది. పళనిస్వామి పేరును కొట్టేసి ఆ స్థానంలో ‘శశికళ బానిస’ అని రాశారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం గళమెత్తడంతో అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరులో చివరికి చివరికి నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి గద్దెనెక్కారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలుకు వెళ్లారు. అయితే శశికళ మద్దతుదారుడైన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడాన్ని జీర్ణించుకోలేని కొందరు వికీపీడియాలో ఆయన పేరును శశికళ బానిస అని మార్చేసి తమ కోపాన్ని చల్లార్చుకున్నారు. ఫిబ్రవరి 16నే దీనిని ఎడిట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ పేరును సరిచేశారు. ఇది మాఫియా సర్కార్: కమల్ హాసన్ పళనిస్వామి ప్రభుత్వంపై ప్రముఖ హీరో కమల్‌హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏర్పాటైన ప్రభుత్వానికి, నేరగాళ్ల గ్యాంగ్‌నకు పెద్ద తేడా ఏమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, సభ జరిగిన తీరును తనతో సహా ప్రజలు ఎవరూ అంగీకరించడం లేదన్నారు. జైలులో ఉన్న శశికళ ఎంచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. తమిళ అసెంబ్లీని శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దానిని మనమే శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై మరోమారు స్పందించిన కమల్ తాను రాజకీయాలకు పనికిరానని స్పష్టం చేశారు. -
పన్నీరుకు సీనియర్ నటుడి మద్దతు
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తమిళ దర్శకుడు, నిర్మాత, నటుడు మనోబాల.. పన్నీరు సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. పన్నీరు సెల్వంతో కలసి తాను పనిచేశానని, ఆయన చాలా మంచి వ్యక్తని మనోబాల ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. పన్నీర్ సెల్వంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, అరవింద స్వామి, శరత్ కుమార్, ఆర్య, ఖుష్బూ, గౌతమి తదితరులు ఆయనకు మద్దతుగా మాట్లాడారు. ఇదే సమయంలో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు గళమెత్తారు. కాగా విజయశాంతి, కొందరు సినీ ప్రముఖులు.. శశికళకు మద్దతు ప్రకటించారు. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
నాతోనే గేమ్సా?!
నన్నే మోసం చేస్తావారా? బొమ్మ పడితే వదిలేస్తా బొరుసు పడితే నరికేస్తా ఇటీవలి కాలంలో దక్షిణాది చలనచిత్రరంగంలో చెడ్డ ‘విలన్’ పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంటున్న నటుడు ఆదిత్య మీనన్. ‘సింహ’ సినిమాలో గోపి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు ఆదిత్య. ఆ సినిమాలో అతనికి చాంతాడు పొడుగు, బీభత్సమైన డైలాగులేమీ ఉండవు. ‘ఎవడ్రా కొట్టింది?’ ‘వాడి పేరు తెలుసా?’ ‘మనం వచ్చిన పనేమిటి? ఈ గొడవేమిటి?’ ‘చేతికి దొరికిన వాడ్ని వదిలేశానురా’..... ఇలా పొడి పొడి డైలాగులతోనే వీర లెవెల్లో విలనిజాన్ని పండించాడు ఆదిత్య. తక్కువ మాటలతో ఎక్కువ నటనను ప్రదర్శించే ఆదిత్య నటనను గమనిస్తే, విలన్ల గురించి ప్రముఖ మాట ఒకటి చప్పున గుర్తుకొస్తుంది. ‘మా దగ్గర ప్లాన్లు తప్ప డైలాగులు లేవు. మా దగ్గర ప్రాబ్లమ్స్ తప్ప సొల్యూషన్స్ లేవు’ బాడీ అంతగా లేకపోయిన...డైలాగులు, హావభావాలతోనే భయపెట్టడం ఒక రకం. ఉదాహరణకు... రఘువరన్‌లాంటి వాళ్లు. నటనలో పస లేకపోయినా...ఒడ్డూ పొడుగుతోనే భయపెట్టడం రెండో రకం. రెండో రకం విలన్లు పెద్దగా కాలానికి నిలవరు. విలన్‌కు ఒడ్డూ పొడుగు, మంచి శరీరసౌష్ఠవం అవసరమేగానీ అవి మాత్రమే ఉత్తమ విలన్‌కు ప్రామాణికాలు కాలేవు. అందుకే...విలన్ జిమ్‌లోనే కాదు ‘మైండ్ జిమ్’లో కూడా గడపాలి. మానసిక కసరత్తు ఎంత బాగా జరిగితే నటన అంతగా మెరుస్తుంది. ఆదిత్య మీనన్ మంచి ఒడ్డూ, పొడుగు ఉన్న నటుడు. దీనికి తనలోని నటన కూడా తోడుకావడంతో విలన్ పాత్రలను సునాయాసంగా పోషించగలుగుతున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఉత్తమ విలన్’గా రాణించగలుగుతున్నాడు. ముంబాయిలో జన్మించాడు ఆదిత్య మీనన్. కొంత కాలం తరువాత అతడి కుటుంబం దుబాయికి వలస వెళ్లింది. దుబాయిలోని ‘అవర్ ఓన్ ఇంగ్లీష్ హైస్కూల్’లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఆదిత్య. పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు దుబాయిలోనే ఉన్నాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో పాటు బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరులోని ‘యం.ఎస్.రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చేశాడు. కాలేజీలో ‘రేడియో మిడ్డే’లో రేడియో హోస్ట్‌గా మీడియా రంగంలోకి ప్రవేశించాడు. ప్రాడక్ట్ లాంచ్, ఫ్యాషన్ షోలాంటి లైవ్ ఈవెంట్స్‌కు హోస్టింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఈవెంట్ మేనేజర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఈ సమయంలోనే ఒక థియేటర్ గ్రూపులో చేరి కొన్ని నాటకాల్లో నటించాడు. ఒకసారి ఆదిత్య నటన ప్రకాష్ బేలవాడి కంటపడింది. బెంగళూరుకు చెందిన ప్రకాష్ బేలవాడి జర్నలిస్ట్ మాత్రమే కాదు... నాటకాలు, సినిమా, టీవీలలో నటుడిగా మంచి పేరు ఉంది. సామాజిక, కళారంగాలకు సుపరిచితమైన పేరు ప్రకాష్ బేలవాడి. ఆదిత్య నటనను చూసి ‘‘ఈ కుర్రాడిలో స్పార్క్ ఉంది’’ అనుకున్నారు ప్రకాష్. అలా ప్రకాష్ తీసిన ఒక టీవి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఆదిత్యకు. ఇదే సమయంలో ప్రముఖ కమెడియన్ యస్.కె.చంద్రు దర్శకత్వం వహించిన ‘సూర్య శిఖరీ’ టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. నాటకాల్లో నటించాడు. టీవిలో నటించాడు. ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2001లో చెన్నైకు వెళ్లాడు ఆదిత్య. అవకాశాలు రాకో, మరే కారణమో తెలియదుగానీ చెన్నైకి వెళ్లిన తరువాత మళ్లీ బుల్లితెర మీద కనిపించాల్సి వచ్చింది. అలా రాడాన్ మీడియా వర్క్ నిర్మించిన ‘తంతిర భూమి’ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సన్ టీవీలో ప్రసారమైంది. ఆ సమయంలోనే ప్రఖ్యాత దర్శడుకు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ ‘అన్నీ’లో నటించే అవకాశం వచ్చింది. ‘ఆంజనేయ’ ‘జేజే’ సినిమాల్లో నటించే అవకాశం రావడం, ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నలుగురి దృష్టిలో పడే ఛాన్స్ దొరికింది. సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.‘సింహ’ ‘బిల్లా’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘మిర్చి’ ‘బలుపు’ ‘పవర్’ ‘లయన్’ ‘రుద్రమదేవి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆదిత్యమీనన్ మరిన్ని చెడ్డ పాత్రలతో ‘మంచి’ నటనను ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’గా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
బీజేపీ గూటికి అంబరీష్!
సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అంబరీష్.. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య ఎమ్మెల్యే అయిన అంబరీష్ సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో కొంతకాలం మంత్రిగా పనిచేశారు. వివిధ కారణాలతో కొద్దినెలలకే ఉద్వాసనకు గురయ్యారు. అప్పటినుంచి పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న ఆయన దుబాయ్ పర్యటనలో ఉండగా, కర్ణాటక బీజేపీ నాయకులు అశోక్, సతీష్‌రెడ్డిలు సమావేశమై బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీలో మంచి స్థానంతో పాటు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
మనోధైర్యమే మహాబలం
ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ కాకినాడ/సామర్లకోట : కేన్సర్ బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు యువత ముందుకు రావాలని, ఏ రోగాన్ని జయించడానికైనా ముందుగా కావల్సింది ఆత్మస్థైర్యమని సినీనటి కాజల్ అగర్వాల్ అన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు అవగాహన ర్యాలీలు, సదస్సుల ద్వారా పల్లె ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరిచేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం ఉదయం కాకినాడ సమీపంలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రి ఆ««దl్వర్యంలో ప్రపంచ కేన్సర్ దినోత్సవ సందర్భంగా కాకినాడ భానుగుడి జంక్ష¯ŒS నుంచి నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ (2 కె ర¯ŒS), ఎగ్జిబిష¯ŒS గ్రౌండ్లో జరిగిన కేన్సర్ అవగాహన సదస్సు కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆసుపత్రి చైర్మ¯ŒS డాక్టర్ బీహెచ్పీఎస్ వీర్రాజు మాట్లాడుతూ కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకునేలా అధునాతన చికిత్స తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి కేన్సర్ కేసులను 25 శాతానికి తగ్గించేలా లక్ష్యాన్ని నిర్ధారించినట్లు వివరించారు. కేన్సర్ అవగాహనపై ప్రత్యేక బ్రోచర్‌ను సదస్సులో ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు మాట్లాడుతూ కేన్సర్ నివారణ కోసం ఉద్యమంలా సమైక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేన్సర్ రోగులకు పండ్లను కాజల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వై.ప్రశాంత్, కె.ప్రశాంత్, డాక్టర్ రాజేంద్ర, రాజా తదితరులు పాల్గొన్నారు.