సాక్షి, చెన్నై: కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినిమా ఆర్టిస్టులకు హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు. కరోనా కాలంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు 5 కోట్ల రూపాయలను శనివారం విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్ మీడియాలో ఆకాశమే హద్దురా సినిమాను విక్రయించామన్నారు. దీనిని అభిమానులతో సహా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య అన్నారు. (చదవండి: బాలీవుడ్‌కు సూర్య చిత్రం?)
కాగా ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాను ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంకు విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్‌ను కమల్ హాసన్ నటించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ లోని ఆకాశమే నీ హద్దురా పాట నుంచి తీసుకున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ప్రముఖ పాత్రలో నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో అపర్ణ.. జాకీష్రాఫ్, పరేష్ రావల్ నటించిన విషయం తెలిసిందే. (చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment