donation money
-
నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సూర్య, కార్తీ విరాళం
Suriya Karthi Donation To Nadigar Sangam Building Construction: దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం సంఘం ట్రస్టు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాతీయ ఉత్తమ అవార్డులను గెలుచుకున్న నటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా 'విరుమాన్' చిత్ర నిర్మాత సూర్య, కథానాయకుడు కార్తీ, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సంఘం నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి అందుకోసం మా అమ్మ జాబ్ వదిలేసింది: శృతిక సముద్రాల -
Jeff Bezos: పిల్లికి బిచ్చం పెట్టడని తిట్టారు కదా! ఇప్పుడేమో ఏకంగా..
Jeff Bezos donates Million Dollars to Obama Foundation: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్నప్పటికీ.. దాతృత్వం విషయంలో మాత్రం ఆ ఇద్దరి మీద ‘పిసినారులు’ అనే ట్యాగ్ వినిపిస్తుంటుంది. వాళ్లే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు. ఛారిటీ ఫండ్ పేరుతో స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంది ఒకరైతే.. అసలు పిల్లికి బిచ్చం వేయడంటూ రెండో ఆయనపై విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ తరుణంలో నెంబర్ టూ, అమెజాన్ బాస్ అయిన జెఫ్ బెజోస్ భారీ వితరణ ద్వారా తన పెద్ద మనసు చాటుకోవడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు. 57 ఏళ్ల ఈ అమెరికన్ వ్యాపార దిగ్గజం ఏకంగా 100 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు 750 కోట్ల రూపాయలు) డొనేషన్ ప్రకటించాడు. ఆ సొమ్మును అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా నడిపిస్తున్న ఫౌండేషన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. అమెరికా పొలిటీషియన్, పౌర హక్కుల నేత జాన్ లూయిస్(దివంగత) గౌరవార్థం ఈ భారీ దానం చేస్తున్నట్లు బెజోస్ ప్రకటించారు. అంతేకాదు ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ పేరును జాన్ లూయిస్ ప్లాజాగా పేరు మార్చాలని అమెజాన్ చీఫ్, ఒబామా ఫౌండేషన్‌ను రిక్వెస్ట్ చేశారు. జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఈ దానం చాలామందికి చిన్నదే అనిపించొచ్చు.. కానీ, సాయం అందుకునే ఎందరికో ఇది పెద్దదే అని Obama Foundation ప్రతినిధి కోర్ట్నీ విలియమ్స్ వెల్లడించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంటూ.. కనీస దానాలు కూడా చేయట్లేదని, భూమి మీద సమస్యలు పట్టించుకోకుండా స్పేస్ టూరిజం మీద ఫోకస్ పెడుతున్నారంటూ మస్క్, బెజోస్లపై విమర్శలు ఉన్నాయి. బిల్ గేట్స్ లాంటి వాళ్లు సైతం వీళ్లను విమర్శిస్తూ వస్తున్నారు. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. బెజోస్ దానాలు మాత్రం భారీగానే ఉంటున్నాయి. తాజాగా ఓవైపు ఒబామా ఫౌండేషన్‌తో పాటు మరోవైపు న్యూయార్క్ యూనివర్సిటీ ఆధర్వ్యంలోని ఓ ఆస్పత్రికి సైతం 166 మిలియన్ డాలర్ల డొనేషన్ ఇవ్వడంతో ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మాక్‌కెంజీ స్కాట్‌తో జెఫ్ బెజోస్ (పాత చిత్రం) ఇక అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నాక.. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 600 మిలియన్ డాలర్లు డొనేషన్లు ఇచ్చినట్లు పక్ మీడియా ఓ కథనం ప్రచురిచింది. ఇవిగాక క్లైమేట్ ఛేంజ్ పోరాటం కోసం ఎర్త్ ఫండ్ ప్రతిజ్ఞ, నిరాశ్రయులైన వాళ్ల కోసం 2 బిలియన్ల దాకా సాయం ప్రకటించారు. బెజోస్ మాత్రమే కాదు.. ఆయన మాజీ భార్య మాక్‌కెంజీ స్కాట్ విడాకుల భరణం రూపంలో దక్కిన 8.5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు దానం చేసి సంచలనం సృష్టించింది. చదవండి: మనిషి పుట్టుక ఇక అంతరిక్షంలోనే! కానీ.. -
జనంలో తిరగడమే ఇష్టం
సాక్షి, హైదరాబాద్: తనకు జనంలో తిరగడం, రాజకీయ నాయకుడిగా వారికి సేవ చేయడం ఎంతో ఇష్టమని.. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొన్ని పరిమితులకు లోబడి ఉండటంతో ప్రజల్లోకి వెళ్లలేకపోవడం ఇబ్బందిగా ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయాలు కూడా ఒకప్పటిలా ఆరోగ్యకరంగా లేవని.. సిద్ధాంతాలు మారిపోయాయని చెప్పారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యోధా లైఫ్‌లైన్ డయాగ్నొస్టిక్స్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వేదికపై ఉన్న కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ఆయన రాజకీయాల నుంచి బయటికొచ్చి మంచిపని చేశారని, మానసిక, శారీరక ప్రశాంతతకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రపతిగా అవకాశం వస్తే కచ్చితంగా చేపట్టి.. తెలుగువారి కీర్తిని మరింత పెంచాల’ని చిరంజీవి కోరగా.. వెంకయ్యనాయుడు తాను సిద్ధమే అన్నట్టుగా సంకేతం ఇచ్చారు. ‘ఉప రాష్ట్రపతిగా అడ్రస్ మారిందేగానీ నా డ్రస్ మారలేదు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడి నేలలో ఏదో మహిమ ఉందని, ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న సంస్థలకు మనవారే సీఈవోలుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు ఆరోగ్యకర జీవనానికి దోహాదపడతాయని.. ప్రజలు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మన దేశం ముందుందని.. పరిశోధకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అయితే కొందరి మోసపూరిత వ్యవహారాలతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని.. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల పెట్టాలని కేంద్ర ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. చిరంజీవి ట్రస్టుకు రూ.25లక్షలు విరాళం భవిష్యత్‌లో రాబోయే కొన్నిరకాల జబ్బులను జీనోమిక్ టెక్నాలజీతో ముందుగానే తెలుసుకోవచ్చని, అలాంటి వైద్యసేవలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటం సంతోషకరమని సినీ నటుడు చిరంజీవి అన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ బతికి ఉండేవాడన్నారు. ఈ సందర్భంగా నిరుపేద కళాకారులకు వైద్యపరీక్షల్లో రాయితీ కల్పించాలని చిరంజీవి కోరగా.. ‘మా’ అసోసియేషన్ (సినీ నటుల సంఘం) సభ్యులకు 50 శాతం రాయితీ ఇస్తామని డయగ్నొస్టిక్స్ నిర్వాహకుడు సుధాకర్ కంచికచర్ల ప్రకటించారు. అంతేకాకుండా చిరంజీవి ట్రస్టుకు విరాళంగా రూ.25 లక్షల చెక్కును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి తలసాని చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, చాముండేశ్వరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సోనూసూద్.. హైదరాబాద్‌లో కలుద్దామన్నారు: నాగలక్ష్మి
ఆమె ముఖంలోని రెండు కళ్లు సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి చేతనైన సహాయం చేయించగలదు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా చూసింది. తన ఐదు మాసాల పెన్షన్‌ను విరాళం ఇచ్చేలా ప్రోత్సహించింది. ‘‘కళ్లు లేకపోతేనేం, నా మనసుతో ప్రపంచాన్ని చూస్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. గెలుపు సాధించి, అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే తపనతో ఉన్నాను. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలి’’ అంటారు కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల నాలుగో సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే అంధురాలు. ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడి కన్ను కేవలం ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వస్తువును చాలా దగ్గరగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది.‘‘మా నాన్న కృష్ణారెడ్డి చిన్న రైతు. మాది అతి సాధారణమైన కుటుంబం. మమ్మలి కష్టపడి పెంచి పెద్ద చేశారు’’ అంటున్న నాగలక్ష్మికి చిన్నతనం నుంచి చిన్న అన్నయ్య ఆదిరెడ్డితో అనుబంధం ఎక్కువ. ఆ అన్నయ్య ప్రోత్సాహంతో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు నాగలక్ష్మి. ఏడు సంవత్సరాల క్రితం నాగలక్ష్మి తల్లి కాలం చేశారు. దానితో చిన్న అన్నయ్యకు నాగలక్ష్మి బాధ్యత రెట్టింపయింది. ఆమెను జాగ్రత్తగా, కన్నబిడ్డలా చూసుకోవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసిన నాగలక్ష్మికి, ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయటం అలవాటు. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చిన్న అన్నయ్య ఆదిరెడ్డికి ఎం.ఎస్సి. చదివిన కవితతో వివాహం నిశ్చయమైనప్పుడు, ‘మనతో పాటు అంధురాలైన నా చెల్లెలు కూడా ఉంటుంది’ అని చెప్పారట. అందుకు కవిత అంగీకరించారట. అలా వదినతో నాగలక్ష్మికి అనుబంధం ఏర్పడింది. ఇంట్లో ఏ పనీ లేకుండా ఉండటం నాగలక్ష్మికి నచ్చలేదు. కాని ఏదైనా పని చేయాలంటే చేయలేని పరిస్థితి. ‘‘మా వదినతో కలిసి ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. కుటుంబ బంధాలు, ఇంటి పనులు–వంటపనుల్లో మహిళలు పాటించవలసిన మెళకువలు, పిల్లల పెంపకం... ఇలా పలు అంశాలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాం. కేవలం ఆరు నెలల్లో 1.75 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరారు. కోటీ యాభై లక్షల మంది మా యూ ట్యూబ్ ఛానల్‌ను వీక్షించారు. నాకు, వదినకు ఎంతో సంబరంగా అనిపించింది’’ అంటారు నాగలక్ష్మి. ఇటీవలే అంటే సెకండ్ వేవ్‌లో నాగలక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ‘‘గదిలో ఒంటరిగా ఉండటం వల్ల బోర్‌గా అనిపించేది. కంటికి దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాను. అలా గమనిస్తూండగా, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా భాధితుల కోసం చేస్తున్న సహాయాలకు సంబంధించిన అంశాలను గమనించాను. నాకు ప్రభుత్వం ప్రతినెల మూడు వేల రూపాయలు పింఛన్‌గా అందిస్తోంది. నేను నా ఐదు నెలల పింఛన్‌ను దాచిపెట్టాను. అలా దాచిన పదిహేను వేల రూపాయలను సోనూసూద్ ట్రస్ట్‌కు అందచేశాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు నాగలక్ష్మి. నగదు పంపిన మూడు రోజులు తర్వాత సోనూసూద్.. నాగలక్ష్మికి నేరుగా ఫోన్ చేసి, మూడు నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. ఆయన మాటల్లో ‘యూ ఆర్ రియల్ హీరో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడతాను, హైదరాబాద్‌లో కలుద్దాం’ అన్న మాటలు మాత్రమే అర్థం అయ్యాయి’’ అంటూ తృప్తిగా తన సంభాషణ ముగించారు నాగలక్ష్మి. – కె.ఎస్, కావలి, సాక్షి నెల్లూరు జిల్లా -
చేసిన సాయం చెప్పుకోవాలా?: అమితాబ్
ముంబై: చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(78) స్పష్టం చేశారు. దేశమంతటా కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది బాధితులు ప్రాణాలు విడుస్తున్నా సినీ రంగం పెద్దలు, సెలబ్రిటీలు నిద్ర నటిస్తున్నారని, సాయం చేయడానికి వారికి మనసొప్పడం లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆయన సోమవారం స్పందించారు. కరోనా విపత్తు సమయంలో తాను చేపట్టిన కొన్ని దాతృత్వ కార్యక్రమాలను బయటపెట్టారు. రైతు ఆత్మహత్యలను నివారించా.. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం అందిస్తున్నానని బిగ్‌బీ పేర్కొన్నారు. చేసిన మేలు చెప్పుకోవడం ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుందన్నారు. చెప్పడం కంటే చేయడాన్నే తాను నమ్ముతానని తెలిపారు. తన వ్యక్తిగత నిధి నుంచి కరోనా ఫ్రంట్‌లైన్ యోధులకు మాస్కులు, పీపీఈ కిట్లు అందించానని చెప్పారు. విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తెప్పించి, ఢిల్లీ, ముంబైలో ఆసుపత్రులకు అందించానని తెలిపారు. ఢిల్లీ గురుద్వారాలో 250 నుంచి 450 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. తన తాత, నాన్నమ్మ, తల్లి పేరిట ఖరీదైన ఎంఆర్ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్ పరికరాలు అందజేశానన్నారు. 1,500 మందికి పైగా పేద రైతులకు ఆర్థిక సాయం చేశానని ఉద్ఘాటించారు. వారి బ్యాంకు రుణాలను తానే తీర్చేశానని వివరించారు. తద్వారా వారి ఆత్మహత్యలను ఆపగలిగానని అమితాబ్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకున్నానని చెప్పారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది దినసరి కూలీలకు నెల రోజులపాటు ఆహారం అందజేశానన్నారు. వలస కార్మికులు వారి సొంతూళ్లకు తిరిగి వెళ్లేందుకు సహకారం అందించానని వెల్లడించారు. కోవిడ్ కేర్ సెంటర్‌కు అమితాబ్ రూ. 2 కోట్ల విరాళం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ఉదారతను చాటుకున్నారు. కోవిడ్‌పై పోరుకు ఆయన రూ. 2 కోట్లు విరాళంగా అందజేశారు. ఢిల్లీలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్‌సెంటర్‌కు ఆయన ఈ డబ్బును అందించినట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మణ్జిందర్ సింగ్ శీర్షా సోమవారం తెలిపారు. కోవిడ్‌తో పోరాడే వారికి సిక్కులు ఎనలేని సేవలు అందిస్తున్నారని, అందుకే వారికి ఈ సాయం అందిస్తున్నట్లు అమితాబ్ పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. 300 పడకల ఈ కోవిడ్ కేర్ సెంటర్ సోమవారం మధ్యాహ్నం నుంచి రోగులకు సేవలు ప్రారంభించింది. విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి మరీ సాయం అందించారని కొనియాడారు. -
వారికి హీరో సూర్య భారీ విరాళం
సాక్షి, చెన్నై: కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినిమా ఆర్టిస్టులకు హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు. కరోనా కాలంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు 5 కోట్ల రూపాయలను శనివారం విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్ మీడియాలో ఆకాశమే హద్దురా సినిమాను విక్రయించామన్నారు. దీనిని అభిమానులతో సహా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య అన్నారు. (చదవండి: బాలీవుడ్‌కు సూర్య చిత్రం?) కాగా ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాను ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంకు విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్‌ను కమల్ హాసన్ నటించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ లోని ఆకాశమే నీ హద్దురా పాట నుంచి తీసుకున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ప్రముఖ పాత్రలో నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో అపర్ణ.. జాకీష్రాఫ్, పరేష్ రావల్ నటించిన విషయం తెలిసిందే. (చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు) -
ఐపీఎల్ నష్టం రూ.3800 కోట్లు!
న్యూఢిల్లీ: ఓ వైపు వింబుల్డన్ రద్దయినా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సంపూర్ణ బీమా గొడుగు కింద నష్టాల నుంచి గట్టెక్కగా... మరోవైపు ఐపీఎల్ రద్దయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం భారీగానే మూల్యం చెల్లించుకోనుంది. ఐపీఎల్–2020 సీజన్ జరగకపోతే బోర్డుకు భారీ నష్టం రానుంది. కోవిడ్–19 నుంచి రక్షణ పొందే కవరేజి లేకపోవడంతో సాధారణ బీమా వర్తించదు. దీంతో ఈ ఏడాది లీగ్ రద్దయితే రూ. 3800 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో సింహభాగం నష్టం బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కే వస్తుంది. ఏకంగా రూ. 3200 కోట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌కు వాటిల్లుతుంది. అయితే లీగ్ జరగలేదు కాబట్టి ప్రసారహక్కుల కోసం తాము చెల్లించాల్సిన భారీ మొత్తంనుంచి భారీ మినహాయింపు ఇవ్వాలని స్టార్ కచ్చితంగా బోర్డును కోరుతుంది. ఇరు పక్షాల ఒప్పందంలో ఇలాంటి నిబంధన ఉంటుందని క్రికెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగతా రూ. 600 కోట్లు స్టేక్హోల్డర్లకు వస్తుందని నివేదిక వెల్లడించింది. అంటే బోర్డుతో పాటు, ఫ్రాంచైజీలు, ఆతిథ్య వేదికల రాష్ట్ర క్రికెట్ సంఘాలు, లాజిస్టిక్స్, హోటల్స్, స్థానిక సంస్థలు, అలాగే పన్ను రూపేణా ఆయా ప్రభుత్వాలకు ఈ నష్టం ఎదురవుతుంది. ఇప్పటి వరకైతే ఈ సీజన్‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసిన బీసీసీఐ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ పొడిగింపు అనివార్యమైన ప్రస్తుత తరుణంలో ఇక 14 తర్వాత కూడా టోర్నీ జరిగే అవకాశమైతే లేదు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసే ఆలోచన లేదని సూచనప్రాయంగా చెప్పేసింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్రానికి ముందే ఈ నెలాఖరుదాకా లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో లాక్డౌన్ ఉంటే మ్యాచ్‌లకేం అవకాశముంటుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న బీసీసీఐకి కూడా ఏప్రిల్ 15 తర్వాత ఆటకు అవకాశం లేదని తెలుసు. అయితే రద్దా లేక ఈ ఏడాది ఆఖరుకల్లా నిర్వహించే ప్రత్యామ్నాయాల్ని బోర్డు పరిశీలిస్తుంది. అయితే సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాకే ప్రకటన చేస్తే బాగుంటుందని బోర్డు ఆఫీస్ బేరర్లు భావిస్తున్నారు. అందువల్లే బీసీసీఐ నుంచి ప్రకటన ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి. సన్‌రైజర్స్ సహాయం రూ. 10 కోట్లు కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుకు వచ్చింది. సన్‌రైజర్స్ టీమ్ (సన్ టీవీ గ్రూప్) తరఫున కరోనా సహాయ నిధికి రూ. 10 కోట్లు ఇస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దీనిపై హర్షం వ్యక్తం చేశాడు. ‘ఎంతో మంచి నిర్ణయం. వెల్డన్ సన్‌రైజర్స్’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. -
రూ. 8లక్షల విరాళం ఇచ్చిన బిచ్చగాడు
విజయవాడ: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ గుడి ముందు అయిన కూడా బిచ్చగాళ్లు ఉంటారు. ఎక్కువగా బయటే ఉండే బిచ్చగాళ్లు లోపలకు వెళ్లే సందర్బాలు అరుదు. ఇక ఆ బిచ్చగాళ్లు హుండీలో డబ్బులు వేయడం మరీ అరుదు. కానీ నల్లగొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి అనే 75 సంవత్సరాల వ్యక్తి ఏ గుడి ముందు అయితే బిచ్చం ఎత్తుకున్నాడో ఆ గుడికి భారీ విరాళం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చారు. విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నిజానికి అతను ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు. మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు. విజయవాడలో ఆలయాల ముందు కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నారు. మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పారు. కాలం గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం దెబ్బతింటోందని, తనకు వచ్చిన డబ్బంతా గుడికే ఇచ్చేస్తున్నానని తెలిపారు. తాను గుడికి డబ్బులివ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తుల్లో తనకు గుర్తింపు వచ్చిందని.. తనకు వచ్చే డబ్బులు మరింతగా పెరిగాయని యాదిరెడ్డి వెల్లడించారు. ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని చెప్పారు. తన జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానంటూ యాదిరెడ్డి చెప్పుకొచ్చారు. -
గోల్మాల్!
కర్నూలు, శ్రీశైలం: దేవస్థానంలోని డొనేషన్ కౌంటర్లో గోల్మాల్ జరిగినట్లు సమాచారం. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి డొనేషన్ కౌంటర్లో పనిచేస్తున్న ఒక ఔట్‌సోర్సింVŠŠ ఉద్యోగిని శ్రీశైలం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డొనేషన్ కౌంటర్లో పనిచేస్తున్న మరో ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బందితో పాటుçసంబంధిత విరాళాల కేంద్రం ఉన్నతాధికారులపై కూడా పోలీసులు అనుమానాలువ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. భక్తులు వివిధ పథకాలకు అందించే విరాళాలు ఈ కేంద్రంలో సేకరిస్తారు. అయితే గత ఏడాది 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు సుమారు రూ. 15 నుంచి 30 లక్షలకుపైగానే గోల్మాల్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో కంప్యూటర్ సర్వర్, హార్డ్ డిస్క్‌ల నుంచి సమాచారం సేకరిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయశాఖ, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇవ్వడానికి ఈఓ కేఎస్ రామారావు గురువారం విజయవాడకు వెళ్లారు. ఆయన శ్రీశైలం చేరుకున్నాక.. శుక్రవారం డొనేషన్ కౌంటర్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈఓ ఇచ్చిన ప్రాథమిక సమాచారం తోనే డొనేషన్‌కౌంటర్‌లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దేవస్థానం సిబ్బంది ద్వారా తెలిసింది. -
రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూశా..
సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : రైతులు పడుతున్న కష్టాలను దగ్గర్నించి చూశా..అందుకే వారికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకున్నా. తమిళనాడులో రైతులు వ్యవసాయం చేసేందుకు అవసరమైన నీటిని ఎలా నిల్వ ఉంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నాను.. అని సినీ నటుడు విశాల్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన అభిమన్యుడు చిత్ర విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి మెలోడీ థియేటర్‌కు దర్శకుడు మిత్రన్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో తను అనుభూతులు పంచుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చా. మా తాత వ్యవసాయదారుడు. చిన్నతనం నుంచి పొలం గట్లు..రైతుల కష్టాలూ చూశా. సకాలంలో రుణాలు మంజూరు కాక..పంటలు సరిగా పండక..తీసుకున్న రుణాన్ని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రాజకీయం అంటగట్టవద్దు రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతు అనేవాడు ప్రతి ఏటా కష్టాలు పడుతూనే ఉన్నాడు. వారి కష్టాలను తీర్చడం సమాజంలో వ్యక్తిగా బాధ్యతగా ప్రవర్తిస్తున్నానంతే. తమిళనాడులోని బోరు వేయించుకొనే స్తోమత ఏ రైతుకూ లేదు. సకాలంలో వర్షాలు పడక పంటలు నాశనం అవుతున్నాయి. ప్రతి టిక్కెట్ నుంచి ఓ రూపాయి రైతుకు.. అభిమన్యుడు చిత్రానికి సంబంధించి ప్రేక్షకులు కొనుగోలు చేసే ప్రతి టిక్కెట్ నుంచి ఒక రూపాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా. దీనికి డిస్ట్రిబ్యూటర్లూ అంగీకరించారు. పేదలకు ఏం చేస్తే బాగుంటుంది.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం అందక చాలా మంది పేదవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. నిపుణులైన వైద్యులను ప్రభుత్వ ఆస్పత్రులలో నియమించి పేదలకు మంచి వైద్యాన్ని అందించాలి. అప్పుడే మనం కోరుకున్న మంచి సమాజాన్ని చూడగలం. మీ తరువాత చిత్రం.. నా 25వ చిత్రంగా ‘పందెంకోడి–2’ ఈ ఏడాది దసరా రోజు (అక్టోబర్ 18)న విడుదల అవుతుంది. నేను కూడా టిక్కెట్ కొనుక్కుని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఉంది. ‘అభిమన్యుడు’ పార్ట్ 2ను వచ్చే ఏడాది చేసేందుకు ప్లాన్ చేశాం. నేనూ మోసపోయా స్మార్ట్ ఫోన్, ఫేస్బుక్, ఆధార్ సీడింగ్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ వంటి ఆధునిక సదుపాయాలు వచ్చిన తరువాత అనేక మంది మోసపోయి, ఆర్థికంగా నష్టపోయారు. అందులో నేనూ ఒకడ్ని. నాకు తెలియకుండా నా క్రెడిట్ కార్డు వినియోగించి రూ.30వేల దొంగలించారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, సినిమాకు వచ్చే ప్రేక్షకుల్లో అనేక మంది అనుభవం. దీని నుంచి ఎలా బయటపడాలన్నదే సందేశం. వైట్ డెవిల్‌గా అర్జున్ సూపర్ నా చిన్నతనంలో వంద రూపాయలు పెట్టి బ్యాట్ కొనిచ్చిన అర్జున్‌తో ఫైటింగ్ సీన్లో నటించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అభిమన్యుడు చిత్రం క్రైమాక్స్‌లో ఆయనతో చేసిన ఫైట్ మంచి అనుభవం. చిత్రంలో వైట్ డెవిల్‌గా ఆయన నటన చిత్రానికి పేరు తెచ్చింది. సత్తా ఉన్న దర్శకుడు మిత్రన్ అభిమన్యుడు చిత్ర దర్శకుడు మిత్రన్‌కు ఇది తొలి చిత్రం. అయినా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. ఇటువంటి మంచి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ఆభిమానం సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఇష్ట దైవం.. థియేటర్లు నా దేవాలయాలు అయితే..ప్రేక్షకులే నా దేవుళ్లు..ఎందుకంటే వారు నామీద చూపిస్తున్న అభిమానం ప్రేమ ఎన్నటికి మరువలేనిది. నా చిత్రాలను ఆదరించి నన్నింతటివాడిని చేసింది ప్రేక్షకులే. -
డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!
-
డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!
• తలలు పట్టుకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు • ఇప్పటిదాకా అడ్డగోలు డొనేషన్లు • ఎలాంటి రశీదులు లేకుండానే కోట్లలో వసూళ్లు • ఇప్పుడు ఆ డబ్బును ఎలా బయటకు తేవాలో అర్థంకాని స్థితి • లాసెట్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో డొనేషన్ల వసూలు కష్టమే సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో భాగంగా ఎలాంటి రశీదులు లేకుండా డొనేషన్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇప్పుడెలా చెలామణిలోకి తేవాలో అర్థం కాక యాజమన్యాలు తలపట్టుకున్నారుు. ఇటీవల చేపట్టిన మెడికల్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల సందర్భంగా వసూలు చేసిన డొనేషన్ల డబ్బులో కొంత మొత్తాన్ని కొన్ని యాజమాన్యాలు మాత్రమే బ్యాంకుల్లో వేసుకున్నారుు. కానీ అనేక యాజమాన్యాల వద్ద ఆ సొమ్ము బ్లాక్ మనీగానే ఉండిపోరుుంది. ఇప్పుడు వాటిని ఎలా చెలామణిలోకి తేవాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారుు. బ్యాంకుల్లో వేయని సొమ్ము మాత్రమే కాదు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు లెక్కలు అడిగే అవకాశం ఉండటంతో యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీలో భారీగా.. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీటు ఫీజు ఐదేళ్లకు రూ.55 లక్షలు. కానీ వసూలు చేసింది మాత్రం గరిష్టంగా కోటి రూపాయలు! అంటే ఒక్కో సీటుపై రూ.45 లక్షలు అదనం. మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఒక్కో సీటుకు కనీసంగా రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు యాజమాన్యాలు డొనేషన్ల రూపంలో వసూళ్లు చేశారుు.. ఇక టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డొనేషన్ల రూపంలో రూ.5 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఆ డబ్బుకు రశీదుల్లేవ్.. లెక్కలు లేవు. అనేక యాజమాన్యాలు ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని మాత్రమే ఇప్పటివరకు బ్యాంకులకు చేర్చగా.. అనేక యాజమాన్యాల వద్ద అనధికారిక సొమ్ము అలాగే ఉండిపోరుుంది. ఒక్క తెలంగాణలోనే మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో 1,200 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై యావరేజ్‌గా రూ.40 లక్షలు అదనంగా వసూలు చేసినట్లు అంచనా. అంటే లెక్కల్లోకి రాని దాదాపు రూ.480 కోట్ల డబ్బు యాజమాన్యాల వద్ద ఉండి పోరుుంది. ఏపీలోనూ బీపీ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ 2,300 మెడికల్ సీట్లలో 1,150 సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేశారు. ఒక్కో సీటుపై అదనంగా రూ.40 లక్షల దాకా వసూళ్లు చేశారు. ఈ లెక్కన అక్కడ రూ.450 కోట్లు లెక్కల్లోకి రాకుండా యాజమాన్యాల వద్ద ఉండిపోరుుంది. ఇవే కాదు తెలంగాణ, ఏపీలోని డెంటల్ కాలేజీల్లోనూ 1,300 వరకు సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై సగటున రూ.15 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఇలా బీడీఎస్‌లో అదనంగా వసూలు చేసిన దాదాపు రూ.200 కోట్లు లెక్కల్లోకి రానిదేనని అంచనా. ఇప్పుడు ఆ సొమ్మును ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది. అరుుతే ఒకట్రెండు కాలేజీలు కాలేజీ డెవలప్మెంట్ ఫండ్ కింద రశీదు ఇచ్చి వసూలు చేసిన మొత్తానికి మాత్రం ఇబ్బంది ఉండదని యాజమాన్య వర్గాలు పేర్కొన్నారుు. ఇంజనీరింగ్‌లోనూ అదే పరిస్థితి.. తెలంగాణలోని 20కి పైగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల రూపంలో ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల వరకు అదనంగా వసూలు చేశారుు. ఒక్కో కాలేజీలో సగటున 250 సీట్ల చొప్పున మేనేజ్మెంట్ కోటాలో 5 వేల వరకు భర్తీ చేశారుు. ఒక్కో సీటుపై అదనంగా రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ.250 కోట్లు లెక్కల్లేని డబ్బును వసూలు చేసినట్లు అంచనా. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళనలో టాప్ కాలేజీలు పడ్డారుు. డొనేషన్లు తగ్గుతాయా? ప్రస్తుతం లాసెట్ ప్రవేశాలు జరుగుతున్నందున.. మేనేజ్మెంట్ కోటా ప్రైవేటు కాలేజీలు పెద్దగా డొనేషన్లను వసూలు చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నారుు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద నగదు రూపంలో పెద్దగా డబ్బు అందుబాటులో లేనందువల్ల భారీ మొత్తంలో డొనేషన్లు చెల్లించి కాలేజీల్లో చేరే పరిస్థితి ఉండదు. దీంతో యాజమాన్యాలు డొనేషన్లు పెద్దగా తీసుకునే అవకాశం ఉండదన్న భావన నెలకొంది.