డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం! | engineering colleges in confusing on notes cancelled | Sakshi
Sakshi News home page

డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!

Published Fri, Nov 11 2016 7:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!

డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!

తలలు పట్టుకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు
ఇప్పటిదాకా అడ్డగోలు డొనేషన్లు

ఎలాంటి రశీదులు లేకుండానే కోట్లలో వసూళ్లు
ఇప్పుడు ఆ డబ్బును ఎలా బయటకు తేవాలో అర్థంకాని స్థితి
లాసెట్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో డొనేషన్ల వసూలు కష్టమే 

సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో భాగంగా ఎలాంటి రశీదులు లేకుండా డొనేషన్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇప్పుడెలా చెలామణిలోకి తేవాలో అర్థం కాక యాజమన్యాలు తలపట్టుకున్నారుు. ఇటీవల చేపట్టిన మెడికల్, ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల సందర్భంగా వసూలు చేసిన డొనేషన్ల డబ్బులో కొంత మొత్తాన్ని కొన్ని యాజమాన్యాలు మాత్రమే బ్యాంకుల్లో వేసుకున్నారుు. కానీ అనేక యాజమాన్యాల వద్ద ఆ సొమ్ము బ్లాక్ మనీగానే ఉండిపోరుుంది. ఇప్పుడు వాటిని ఎలా చెలామణిలోకి తేవాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారుు. బ్యాంకుల్లో వేయని సొమ్ము మాత్రమే కాదు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు లెక్కలు అడిగే అవకాశం ఉండటంతో యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది.

 మెడికల్ కాలేజీలో భారీగా..
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా మెడికల్ సీటు ఫీజు ఐదేళ్లకు రూ.55 లక్షలు. కానీ వసూలు చేసింది మాత్రం గరిష్టంగా కోటి రూపాయలు! అంటే ఒక్కో సీటుపై రూ.45 లక్షలు అదనం. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ఒక్కో సీటుకు కనీసంగా రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు యాజమాన్యాలు డొనేషన్ల రూపంలో వసూళ్లు చేశారుు.. ఇక టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డొనేషన్ల రూపంలో రూ.5 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు.

ఆ డబ్బుకు రశీదుల్లేవ్.. లెక్కలు లేవు. అనేక యాజమాన్యాలు ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని మాత్రమే ఇప్పటివరకు బ్యాంకులకు చేర్చగా.. అనేక యాజమాన్యాల వద్ద అనధికారిక సొమ్ము అలాగే ఉండిపోరుుంది. ఒక్క తెలంగాణలోనే మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో 1,200 వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై యావరేజ్‌గా రూ.40 లక్షలు అదనంగా వసూలు చేసినట్లు అంచనా. అంటే లెక్కల్లోకి రాని దాదాపు రూ.480 కోట్ల డబ్బు యాజమాన్యాల వద్ద ఉండి పోరుుంది.

 ఏపీలోనూ బీపీ..
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ 2,300 మెడికల్ సీట్లలో 1,150 సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేశారు. ఒక్కో సీటుపై అదనంగా రూ.40 లక్షల దాకా వసూళ్లు చేశారు. ఈ లెక్కన అక్కడ రూ.450 కోట్లు లెక్కల్లోకి రాకుండా యాజమాన్యాల వద్ద ఉండిపోరుుంది. ఇవే కాదు తెలంగాణ, ఏపీలోని డెంటల్ కాలేజీల్లోనూ 1,300 వరకు సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై సగటున రూ.15 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఇలా బీడీఎస్‌లో అదనంగా వసూలు చేసిన దాదాపు రూ.200 కోట్లు లెక్కల్లోకి రానిదేనని అంచనా. ఇప్పుడు ఆ సొమ్మును ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది. అరుుతే ఒకట్రెండు కాలేజీలు కాలేజీ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రశీదు ఇచ్చి వసూలు చేసిన మొత్తానికి మాత్రం ఇబ్బంది ఉండదని యాజమాన్య వర్గాలు పేర్కొన్నారుు.

ఇంజనీరింగ్‌లోనూ అదే పరిస్థితి..
తెలంగాణలోని 20కి పైగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల రూపంలో ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల వరకు అదనంగా వసూలు చేశారుు. ఒక్కో కాలేజీలో సగటున 250 సీట్ల చొప్పున మేనేజ్‌మెంట్ కోటాలో 5 వేల వరకు భర్తీ చేశారుు. ఒక్కో సీటుపై అదనంగా రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ.250 కోట్లు లెక్కల్లేని డబ్బును వసూలు చేసినట్లు అంచనా. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళనలో టాప్ కాలేజీలు పడ్డారుు.

డొనేషన్లు తగ్గుతాయా?
ప్రస్తుతం లాసెట్ ప్రవేశాలు జరుగుతున్నందున.. మేనేజ్‌మెంట్ కోటా ప్రైవేటు కాలేజీలు పెద్దగా డొనేషన్లను వసూలు చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నారుు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద నగదు రూపంలో పెద్దగా డబ్బు అందుబాటులో లేనందువల్ల భారీ మొత్తంలో డొనేషన్లు చెల్లించి కాలేజీల్లో చేరే పరిస్థితి ఉండదు. దీంతో యాజమాన్యాలు డొనేషన్లు పెద్దగా తీసుకునే అవకాశం ఉండదన్న భావన నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement