canceled notes
-
జోరుగా వాహన విక్రయాలు
⇒ డిమాండ్ పుంజుకుంటోంది.. ⇒ రానున్న నెలల్లో మరింతగా అమ్మకాలు: కంపెనీలు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఇబ్బందుల నుంచి వాహన కంపెనీలు గట్టెక్కినట్లే. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉండటమే దీనికి కారణం. ప్రధాన వాహన కంపెనీలు–మారుతీ సుజుకీ, ఫోర్డ్ ఇండియా, టయోటా, టాటా మోటార్స్ దేశీయ విక్రయాలు జోరుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి వాహన రంగం కోలుకుంటోందని నిపుణులంటున్నారు. కార్ల అమ్మకాలు బాగా ఉండగా, టూవీలర్ల విక్రయాలు మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి పరిశ్రమ కోలుకుంటోందని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్, సర్వీస్) అనురాగ్ మెహరోత్ర చెప్పారు. బిజినెస్ సెంటిమెంట్స్‌కు సానుకూలంగా ఈ ఏడాది బడ్జెట్ ఉందని, దీంతో వినియోగదారుల విశ్వాసం మెరుగుపడిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గత రెండు నెలల్లో వాహన పరిశ్రమలో సానుకూల పోకడలు చోటు చేసుకున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(వాహన విభాగం) ప్రవీణ్ షా పేర్కొన్నారు. గ్రామీణ సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో డిమాండ్ మరింతగా పుంజుకోగలదని ఆయన అంచనా వేస్తున్నారు. గత నెలలో సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో తమ అమ్మకాలు పెరిగాయని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునో చెప్పారు. టాటా టియాగోకు డిమాండ్ బాగా ఉండటంతో మంచి అమ్మకాలు సాధించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. స్విఫ్ట్, ఎస్టిలో, డిజైన్, బాలెనో కార్ల అమ్మకాలు బాగా ఉండటంతో మారుతీ సుజుకీ 12% వృద్ది సాధించింది. జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్–క్రాస్‌లతో కూడిన యుటిలిటీ, ఎస్యూవీ విటారా బ్రెజా కార్ల విక్రయాలు 111% పెరిగాయి. ఆల్టో, వేగన్ ఆర్వంటి చిన్న కార్ల అమ్మకాలు 7% తగ్గాయి. -
వొడాఫోన్‌పై నోట్ల రద్దు, జియో ఎఫెక్ట్
లండన్: పెద్ద నోట్ల రద్దు, రిలయన్స్ జియో ఉచిత సేవలతో డిసెంబర్ త్రైమాసికంలో భారత కార్యకలాపాలకు సంబంధించి సేవల ఆదాయానికి గండిపడినట్లు టెలికం దిగ్గజం వొడాఫోన్ వెల్లడించింది. ‘కొత్తగా ప్రవేశించిన టెలికం సంస్థ ఉచిత సర్వీసులు అందించడంతో భారత్‌లో టెలికం రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. మా పరంగా దక్షిణాఫ్రికా, టర్కీలో మెరుగైన పనితీరు కనపర్చినప్పటికీ.. భారత్‌లో పరిణామాలతో ఆ ప్రయోజనాలు దక్కలేదు’ అని పేర్కొంది. ఆదాయాలను మెరుగుపర్చుకోవడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో బాగంగా 17 ప్రధాన సర్కిల్స్‌లో 4జీ సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, ఐడియా, వొడాఫోన్ ఇండియా విలీన ప్రతిపాదనపై ఆదిత్య బిర్లా గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నాయని కంపెనీ పేర్కొంది. మూడో త్రైమాసికంలో వొడాఫోన్ భారత కార్యకలాపాలకు సంబంధించి ఆదాయం 1.9% తగ్గింది. మరోవైపు, ధరలపరమైన పోటీ కారణంగా బ్రిటన్‌లో కూడా ఆదాయాలు తగ్గినట్లు వొడాఫోన్ పేర్కొంది. గ్రూప్ మొత్తం ఆదాయం 3.9 శాతం తగ్గి 13.7 బిలియన్ యూరోలుగా నమోదు కాగా, సేవల విభాగం ఆదాయం 12.3 బిలియన్ యూరోలుగా నమోదైంది. -
భయోత్పాతమే మోదీ సిద్ధాంతం
పేదలను కొట్టి పెద్దలకు పెట్టడానికే నోట్ల రద్దు • నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ • నోట్ల రద్దు ప్రధానిని చూసి ప్రపంచం నవ్వుతోందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని, అధికార బీజేపీ, ఆరెస్సెస్‌లపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాడిని తీవ్రం చేశారు. ప్రజలను భయపెట్టడమే మోదీ సిద్ధాంతమని నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి తప్పిస్తామని, అప్పడే అసలైన మంచిరోజులు వస్తాయన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని టాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘జన వేదన సమ్మేళన్’ సమావేశానికి రాహుల్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మాది అభయహస్తం ‘కాంగ్రెస్ గుర్తు హస్తం. శివుడు, బుద్ధుడు, గురునానక్, హజ్రత్ అలీ.. ఇలా ఏ మహనీయుల చిత్రాల్లో చూసినా అది కనిపిస్తుంది. దీని విశేషమేంటని ఒక నేతను అడిగాను. ‘దాని అర్థం అభయ హస్తం.. భయపడొద్దు. నిజాయతీగా ఉండు’ అని చెప్పారు. గాంధీ, నెహ్రూల ఉత్తరాలను చూస్తే.. ఆంగ్లేయులను చూసి భయపడొద్దనే సారాంశం కనిపిస్తుంది. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, ఉపాధి హామీ, ఆహార భద్రత.. మరెన్నో అంశాల్లో పేదలకు అండగా ఉంటామనే భావన ఉంది. బీజేపీ భయోత్పాతంతో దేశాన్ని పాలించాలనుకుంటోంది. ఉగ్రవాదులకు, నోట్ల రద్దుకు, మావోయిస్టులకు భయపడండి అంటోంది.. ఉపాధి హామీ కూలీల పైసలను, రైతుల హక్కులను మోదీ లాక్కున్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు. నోట్ల రద్దు లక్ష్యం కూడా ఇదే. ప్రజలారా.. భయపడొద్దు అన్నది మా సిద్ధాంతం, ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం బీజేపీ సిద్ధాంతం. ఆర్బీఐ, ఈసీల అధికారాలకు దెబ్బ నోట్ల రద్దు గురించి కేవలం ఒకరోజు ముందు మాత్రమే ఆర్బీఐ చెప్పారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థలను దెబ్బతీస్తూ వాటిని హాస్యాస్పదం చేస్తున్నారు. మోదీ అంతా తానే చేశానని చెబుతున్నారు. యోగా గురించి ఊదరగొట్టే ఆయన కనీసం పద్మాసం కూడా వేయలేరు.. నల్ల ధన నిరోధానికే నోట్ల రద్దు అని చెప్పి తర్వాత నగదు లావాదేవీలకు ప్రోత్సాహం అని అన్నారు. దురుద్దేశపూర్వక నోట్ల రద్దుతో మోదీ ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. దేశ ప్రధాని నవ్వులపాలు కావడం ఇదే తొలిసారి. నోట్ల రద్దుతో చాలా అక్రమాలు జరిగాయి. గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లి కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. పేదలను, నీతిమంతులను లైన్లలో నిలబెట్టి, అవినీతిపరులను బ్యాంకు వెనక నుంచి లోపలికి పంపారు. పేదల నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. వాటిని ధనవంతుల రుణాల మాఫీకి వాడతారు. నోట్ల రద్దు మృతులకు సంతాపం 29 మంది నోట్ల రద్దు’ కష్టాల మృతులకు సంతాపం తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. కాగా, పెద్ద నోట్ట రద్దు వల్ల భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుపై నవంబర్8న కేబినెట్æ సమావేశమైనట్లు అసలు ఎలాంటి రికార్డులు లేవని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. -
సేమ్ సీన్
► ఆఖరి రోజున అదే తీరు ►బ్యాంకుల్లో అదే రద్దీ ►మెజారిటీ ఏటీఎంల్లో డబ్బుల్లేవు.. సాక్షి, పెద్దపల్లి : పాత పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటింది. రూ.500, 1000లను జమ చేసేందుకు శుక్రవారం ఆఖరు దినమైనా బ్యాంకుల్లో అవే బారులు కనిపించాయి. కరెన్సీ కోసం అదే జనం రద్దీ ఉంది. డబ్బులున్న ఏటీఎంల్లో ఎప్పటిలాగే క్యూలైన్లు కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను నవంబరు 8న రద్దు చేసింది. వాటిని బ్యాంకుల్లో జమచేసుకునేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. నెలాఖరు నాటికి ప్రజల కరెన్సీ కష్టాలు తీరుతాయని కేంద్రం చెప్పినా మార్పు లేదు. పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరిఖని, మంథని, ధర్మారం మండలాల్లోని బ్యాంకుల్లో అదే రద్దీ నెలకొంది. నగదుకోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కరెన్సీకొరతతో బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వకపోవడంతో రోజు పనిమాని తిరుగుతున్నారు. ఏటీఎంల వద్ద అదే పరిస్థితి. ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఇండియన్ బ్యాంకు ఏటీఎంల్లో మాత్రమే డబ్బులు పెడుతున్నారు. మిగతా బ్యాంకులకు చెందిన ఏటీఎంల్లో నేటికీ డబ్బులు పెట్టడం లేదు. చాలా ఏటీఎంల్లో నోట్లరద్దు నాటి నుంచి ఇంతవరకు డబ్బులే పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. -
జాతికి మోదీ క్షమాపణ చెప్పాలి
6 నుంచి దేశవ్యాప్త నిరసనలు: కాంగ్రెస్ జైపూర్/శ్రీనగర్: పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటినా ప్రజల కష్టాలు తొలగలేదని, దీనికి కారణమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయని మోదీ ప్రకటించినా ఎక్కడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ధ్వజమెత్తింది. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా జనవరి 6 నుంచి దేశమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గురువారం ఇక్కడ వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించం న్యూఢిల్లీ: మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని కాంగ్రెస్ పార్టీని బీజేపీ హెచ్చరించింది. రూ.13,860 కోట్లు లెక్కల్లో చూపని ఆదాయానికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న గుజరాత్ వ్యాపారి మహేష్షాతో మోదీ, అమిత్‌షాకు సంబంధాలున్నాయంటున్న కాంగ్రెస్... అందుకు ఆధారాలు చూపాలని కేంద్ర మంత్రి రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు, అధికార ప్రతినిధులు పిల్లల్లా మాట్లాడారన్నారు. -
కరెన్సీ కష్టాలను తొలగిస్తాం
• బ్యాంకుల వద్ద పరిస్థితులు మెరుగుపడ్డారుు • సామర్థ్యం మేరకు కొత్త నోట్ల ముద్రణ • పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు • ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడి • ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేయాలని సూచన ముంబై: నోట్ల రద్దు అనంతరం సామాన్యులు పడుతున్న కరెన్సీ కష్టాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తొలిసారిగా స్పందించారు. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సామా న్యుల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు. డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా పటేల్ పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రెస్‌లు పూర్తి స్థారుులో పనిచేస్తున్నారుు ‘‘ప్రింటింగ్ ప్రెస్‌లు కొత్తగా రూ.100, రూ.500 నోట్లను ముద్రించే పనిలో ఉన్నారుు. డిమాండ్‌ను చేరుకునేందుకు వీలుగా ప్రెస్‌లు పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తున్నారుు. ఈ సమయంలో ప్రజలు నగదుకు బదులు డెబిట్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లను ఉపయోగించుకోవడం ప్రారంభించాలి. వీటితో లావాదేవీలు చౌకగా, తేలిగ్గా మారతారుు. దీర్ఘకాలంలో ఇది దేశానికి మేలు చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల స్థారుులో తక్కువ నగదు వినియోగం ఉన్న దేశంగా భారత్ మారుతుంది. వ్యాపారుల వద్ద పీవోఎస్ మెషిన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరుతున్నాం. దీంతో డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతుంది. బ్యాంకు శాఖల్లో, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గారుు. మార్కెట్లు తిరిగి యథావిధిగా పనిచేస్తున్నారుు. నిత్యావసరాల కొరత ఉన్న ట్టు ఎటువంటి సమాచారం లేదు. ఏటీఎంల్లో మార్పుల కోసం 50వేల మందిని రంగంలోకి దింపాం. నగదు లభ్యత తగినంత ఉంది. బ్యాంకులు నగదును శాఖలకు, ఏటీఎంలకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థారుులో పనిచేస్తున్నారుు. బ్యాంకుల సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి సేవలకు కృతజ్ఞతలు’’ అని ఉర్జిత్ పటేల్ అన్నా రు. నకిలీకి వీలుకాని నోట్లు.. ‘‘కొత్త నోట్ల సైజు, మందాన్ని ఎందుకు మార్చారని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఈ స్థారుులో మార్పులు చేయాలనుకున్నప్పుడు ఉత్తమ ప్రమాణాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుం ది. నకిలీకి వీలుకాని రీతిలో రూ. 2000, రూ. 500 నోట్లను డిజైన్ చేశాం’’ అని ఉర్జిత్ వివరించారు. నగదు రహితంవైపు మళ్లేందుకు... నకిలీ కరెన్సీ నోట్లపై కూడా ఇది ఒకరకమైన దాడే. వ్యాపారులు, ప్రజలను నగదు రహితం వైపు మళ్లించేందుకు ప్రోత్సహిస్తుంది. బ్యాంకులు సైతం డెబిట్ కార్డుల చెల్లింపులపై చార్జీలను ఎత్తివేశారుు. లెక్కల్లోకి రాని ధనాన్ని కొందరు పెద్ద నోట్ల రూపంలో కలిగి ఉన్నారు. రియల్ ఎస్టే ట్ వంటి రంగాలను పన్ను ఎగవేతలకు ఉపయోగించుకుంటున్నారు’’ అని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఒక్క రోజులో అయ్యేది కాదు.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు, వ్యాపారం తగ్గుదలపై ప్రశ్నకు ఉర్జిత్ స్పందించారు. ‘‘ఇది జీవిత కాలంలో ఒక్కసారి చోటుచోసుకునే ఘటన వంటిది. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. నోట్ల రద్దు విషయంలో పూర్తి గోప్యత అవసరం. ఈ రకమైన ఆపరేషన్ చాలా పెద్దది. ఇలాంటి సమయంలో బ్యాంకు లు అన్నింటినీ పూర్తి సర్వ సన్నద్ధం చేయడం 24 గంటల్లో సాధ్యమయ్యేది కాదు. అరుుతే, దీని వల్ల కొంత అసౌకర్యం ఉంటుందన్నది నిజమే. అందుకే పన్ను ఎగవేత, నల్లధనంపై పోరాటం కోసం ప్రజల సహకారాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు. ఎప్పుడు సాధారణ పరిస్థితి...? పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు ఉర్జిత్ పటేల్ బదులిస్తూ... ‘‘పరిస్థితి మెరుగుపడిందని బ్యాంకులు అంటున్నారుు. మెట్రో నగరాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత ఇబ్బంది ఉన్నట్టు అవి చెబుతున్నారుు. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత పెరిగింది. రుణాలు మరింత సులభంగా లభిస్తారుు. సాధ్యమైనంత త్వరలో పరిస్థితులను సాధారణీకరించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం’’అని చెప్పారు. ఇంక్రిమెంట్ సీఆర్ఆర్ పెంచాం... ఆర్బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను (క్యాష్ రిజర్వ్ రేషి యో) 100 శాతం పెంచినట్టు ఉర్జిత్ పటేల్ వెల్లడిం చారు. ‘‘రద్దరుున రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో బ్యాంకు ల్లో భారీగా డిపాజిట్లు పెరిగిపోయారుు. నగదు లభ్యత పెరిగినందువల్ల తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) కింద బాండ్లను తగినంత విడుదల చేసిన వెంటనే సీఆర్ఆర్ పరిస్థితిని సమీక్షిస్తాం’’ అని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్‌పై జైరామ్ వ్యాఖ్యలు సరికాదు: జైట్లీ న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఆర్బీఐ గవర్నర్‌పై జైరామ్ రమేశ్ వ్యాఖ్యలు అన్యాయమని పేర్కొన్నారు. ఎవరైతే తమకు తాము మద్దతుగా అదే స్వరంతో స్పందించలేకుండా ఉంటారో... అటువంటి వారిపై వ్యాఖ్యలకు రాజకీయనేతలు దూరంగా ఉండాలని సూచిస్తూ జైట్లీ ట్విటర్లో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఓ ఆర్టికల్‌లో జైరామ్ రమేశ్ ఆర్బీఐను లక్ష్యంగా చేసుకున్న విష యం తెలిసిందే. ‘‘పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం అనూహ్య నిర్ణ యం తీసుకోవడం ద్వారా ఆర్బీఐని చీకట్లోకి నెట్టేసింది. నోట్ల రద్దు విషయమై ఆర్బీఐ సన్నద్ధత గురించి జాతిని తప్పుదోవ పట్టించడంలో ఉర్జిత్ పటేల్ అపరాధి అరుు ఉండవచ్చు లేదా ఆర్బీఐ స్వతంత్రను పణంగా పెట్టి ఉండవచ్చు. ఏదైనప్పటికీ ఆయన రాజీనామా చేయాలి’’ అని జైరామ్ రమేశ్ డిమాండ్ చేశా రు. దేశంలో ఆర్బీఐ మానిటరీ సంస్థ అని, అందరికీ బ్యాంకు నోట్లు అందుబాటులో ఉంచే బాధ్యత దానిపై ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
మోదీతో కేసీఆర్ బేరసారాలు: చాడ
న్యూశాయంపేట: నోట్ల రద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న సీఎం కేసీఆర్.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో లాలూచీ పడి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని మార్చు కునేందుకు బేరసారాలు జరిపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా జనజీవనం అల్లాడి పోతోందన్నారు. సోమవారం నుంచి మూడురోజుల పాటు ఓరుగల్లులో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు జరగను న్నాయన్నారు. 28న ఉదయం రాష్ట్ర నిర్మాణ మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 30న హన్మకొండ కేడీసీ మైదానంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. -
బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు
వ్యవస్థలోకి రూ.3 లక్షల కోట్ల కొత్త నోట్లు : కేంద్రం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ తెలిపారు. వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో మొత్తం రూ.14.5 కోట్లు చెలామణిలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల విలువ మేర కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో రద్దరుున నోట్లు, కొత్త నోట్ల మధ్య అంతరం ఉందన్నారు. ప్రతి రోజూ రూ.25వేల కోట్ల విలువ మేర కొత్త నోట్లను బ్యాంకుల ద్వారా వ్యవస్థలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి శనివారం ఇక్కడ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడిందని, దేశవ్యాప్తంగా తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత నెలకొందన్నారు. ప్రజలు రూ.2,000 వేల నోటుకు చిల్లర పొందలేని పరిస్థితి ఉందని అంగీకరించారు. రూ.500 నోట్లను మరింత సంఖ్యలో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కొన్ని వారాల్లో సమస్య పరిష్కారం అవుతుందని గంగ్వార్ చెప్పారు. రూ.1,000 నోటును ఏ రూపంలో విడుదల చేయాలన్నది భవిష్యత్తులో నిర్ణరుుస్తామన్నారు. నల్ల ధనం నియంత్రణ దిశగా పెద్ద నోట్ల రద్దు తొలి నిర్ణయమని... ఈ విషయంలో భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కష్టాలు నల్లధనం కలిగిన వారికే గానీ సామాన్యులు ఆందోళన చెందక్కర్లేదన్నారు. -
నోట్ల రద్దు నిబంధనలకు విరుద్ధం
• సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ • తదుపరి విచారణ నేటికి వారుుదా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు, తదనుగుణంగా కేంద్రం తీసుకున్న చర్యలు ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ‘‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26 (2) కింద పెద్ద నోట్లను రద్దు చేశారు. కానీ ఇలా రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదు. ఈ సెక్షన్ కింద ఓ సిరీస్, డినామినేషన్ నోట్లను మాత్రమే రద్దు చేయడానికి వీలుంటుంది. కేంద్రం అన్ని సిరీస్ నోట్లనూ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధం. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ఉన్న ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి’’ అని కోర్టును కోరారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులన్నీ మానుకుని ఉదయం నుంచి క్యూలలో నిలబడుతున్నారు. అరుునా వారికి నగదు అందడం లేదు. ప్రతి చోటా కొత్తగా రూ.2 వేల నోటే ఇస్తున్నారు. రూ.1000, రూ.500 నోట్లు లేక, చిల్లర దొరక్క అంతా ఇబ్బందుల పాలవుతున్నారు. వ్యాపారులు దారుణంగా నష్టపోతున్నారు. రద్దు చేసిన నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు మాత్రమే కేంద్రం గడువిచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.1000 నోట్లను రద్దు చేశామన్న కేంద్రం, రూ.2 వేల నోటును ఎందుకు తేవాల్సి వచ్చిందో చెప్పడం లేదు. పౌరులకున్న సొమ్మును పొదుపు చేసుకునే, దాచుకునే హక్కును కేంద్రం హరించింది’’ అని వాదించారు. అనంతరం విచారణ శుక్రవారానికి వారుుదా పడింది. -
పేదోళ్ల చుట్టూ బడాబాబుల చక్కర్లు
• కూలీ ఇచ్చి క్యూలో నిలబెడుతున్న బడాబాబులు • అటవీ గ్రామాల్లో జోరుగా కమీషన్ దందా • నోట్ల మార్పిడికి కాంట్రాక్టర్లు, స్మగ్లర్లపై మావోయిస్టుల ఒత్తిడి మహదేవపూర్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అక్రమంగా సంపాదించి దాచుకున్న రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి కోసం బడా బాబులు పేదోళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రూ.300 కూలీ ఇచ్చి మరీ బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద క్యూలైన్న్లలో నిలబెడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అటవీ గ్రామాల ప్రజలతో పెద్దనోట్లు మార్పిడి చేరుుంచడానికి కలప స్మగ్లర్లు, గుడుంబా వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న రూ.500, 1000 నోట్లను అటవీ గ్రామాల్లోని పేదలకు ఇచ్చి మహారాష్ట్రలో, తెలంగాణలోని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మార్పిడి చేరుుస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఒక్కొక్కరికి రూ.300 కూలీ కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దళారులు అటవీ గ్రామాల్లోని ఆదివాసీ, గిరిజనులు, దళితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రూ.500లకు రూ.450, రూ.1000 నోటుకు రూ.900లు ఇస్తున్నారు. కొందరు వ్యాపారులు 10 శాతం కమీషన్న్కు పెద్ద నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇదే అదనుగా మావోరుుస్టులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు స్మగ్లర్లు, ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మావోరుుస్టులకు తిప్పలే! పెద్దనోట్లు రద్దుతో డంపుల కోసం అన్వేషించే ముఠాల సంచారం తగ్గిపోరుుందని చర్చ జరుగుతోంది. కలప స్మగ్లింగ్, గుడుంబా తయారీ, మహారాష్ట్రకు రవాణా చేసేందుకు సహకరించే నిరుపేదలు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో తాత్కాలికంగా అక్రమ రవాణాకు బ్రేకు పడింది. పెద్దనోట్లు మార్చుకురావాలని సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను మండల కేంద్రాలకు, పట్టణ ప్రాంతాలకు పంపుతున్నట్లు సమాచారం. పలిమెల మండలానికి చెందిన ఒక యువకుడు సుమారు రూ.40లక్షల పెద్ద నోట్లు మార్పిడి చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు పుకార్లు షికారు చేస్తున్నారుు. అధికార పార్టీ నాయకులు పెద్దనోట్ల మార్పిడికి బ్యాంక్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. పెళ్లికీ నిబంధనలా..? నిజామాబాద్ పట్టణంలో ఆర్యనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన మోహన్ ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన కుమార్తె గాయత్రిదేవికి డిసెంబర్ 3న పెళ్లి జరగాల్సి ఉంది. ఆయనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బును ఇక్కడి గోదాం రోడ్డులోని ఎస్బీఐ ఖాతాలో ఈ నెల 8వ తేదీ తర్వాత జమ చేసుకున్నారు. కుమార్తె వివాహం కోసం ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు గురువారం శుభలేఖ, ఇతర ఆధారాలు తీసుకుని బ్యాంకుకు వచ్చారు. అరుుతే ఈ నెల 8 కంటే ముందు ఖాతాలో ఉన్న డబ్బులు మాత్రమే వివాహాల కోసం ఇవ్వాలన్న ఆర్బీఐ నిబంధనలు అడ్డంకిగా మారారుు. దాంతో ఖాతాలోని డబ్బు ఇవ్వలేమని బ్యాంకు మేనేజర్ స్పష్టం చేశారు. ఎలాగైనా డబ్బు ఇప్పించాలని వేడుకున్నా ఫలితం లేకపోరుుంది. దీంతో గత్యంతరం లేక రూ.24 వేలు డ్రా చేసుకుని కన్నీటితో తిరిగి వెళ్లిపోయారు. -
పెద్ద నోట్ల రద్దుకు 90 శాతం వ్యతిరేకమే: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దుచేయడాన్ని దేశంలోని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాటా ్లడుతూ రోగులు చేతిలో డబ్బులున్నా వైద్యం చేరుుంచుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే భూములు అమ్మిన వారు ఆ డబ్బుతో వివాహాలకు ఖర్చు చేయ లేని దుస్థితి ఉందన్నారు. కూలీలు, రైతులు, చిన్నవ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు. అవినీతిని, నల్ల ్లధనాన్ని, కార్పొరేట్లను నియంత్రించడం చేత కాని ప్రధానమంత్రి మోదీ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని జూలకంటి విమర్శించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
పార్లమెంటు అంటే ప్రధానికి భయమా?
• సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్న • పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం • 28 నుంచి 30 దాకా సీపీఐ మహాసభలు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో గురువారం జరిగింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషాలతో కలసి సురవరం విలేకరు లతో మాట్లాడారు. దేశంలోని 92 శాతం మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ప్రధానమంత్రి యాప్ సర్వేలో 93 శాతం ప్రజలు నోట్ల రద్దుపై మోదీకి మద్దతు తెలిపినట్టు అసత్య ప్రచారం చేస్తు న్నారని మండి పడ్డారు. చిన్న వ్యాపారులు, వృత్తి దారులు, పేదలు, కూలీలు కష్టాలు పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుని ఛిన్నాభిన్నై మైందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిపు ణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో జీడీపీ వృద్ధి 3.5 శాతానికి తగ్గిపోతుందని సురవరం పేర్కొన్నారు. పాత కరెన్సీని కొంతకాలం చెలామణిలో పెడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. నల్లధనం 6.5 శాతమే కరెన్సీ రూపంలో ఉందని, మిగిలిన దంతా బంగారం, భూమి రూపంలోకి మారి పోరుునట్టుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తు న్నారన్నారు. ఇది నల్లకుబేరులపై సర్జికల్ దాడి కాదని, దేశంపై కార్పొరేట్ దాడి అన్నారు. రెండు పార్టీల నల్లధనాన్ని నాశనం చేసేందుకే ఉత్తరప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న నల్లధనాన్ని నాశనం చేయడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని సురవరం ఆరోపించారు. ఎన్నికల్లో ఆదానీ, అంబానీల ఖర్చుతోనే మోదీ ప్రచారం చేశారని, ప్రతిఫలంగా వారికి రూ.70 వేల కోట్ల లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో షైనింగ్ ఇండియా అంటూ తప్పుడు ప్రచారాలతో ఎన్డీయేను ముంచిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు కూడా మరోసారి దెబ్బతీయడానికి తప్పుదోవ పట్టిస్తున్నాడని హెచ్చరించారు. నోట్లరద్దుపై ఈ నెల 28న దేశంలోని అన్ని వామపక్షపార్టీలతో కలసి ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్టుగా వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ఆందోళనలకు దిగుతామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త ఇంటిలో చేరిన తర్వాతనైనా వైఖరిలో మార్పురావాలని ఆకాంక్షించారు. -
విపక్షాల విమర్శలు తిప్పికొట్టే వ్యూహం
పెద్ద నోట్ల రద్దుపై బీజేపీ అవగాహనా కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా తిప్పి కొట్టాలని బీజేపీ నిర్ణరుుంచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చర్చాగోష్టుల ద్వారా ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికం గా కొంత ఇబ్బంది కలిగినా దేశానికి, ప్రజల కు కలగనున్న దీర్ఘకాలిక ప్రయోజనాలను వివరించేందుకు వివిధ రూపాల్లో కార్యక్ర మాలను రూపొందిస్తోంది. పెద్దనోట్ల రద్దు తో నల్లధనం బయటకు వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు మరింతగా అందడంతో పాటు, ఈ డబ్బు దేశాభివృద్ధికి, ఆర్థికాభి వృద్ధికి దోహదపడుతుందనే విషయాన్ని వివి ధవర్గాల ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఈ సమావేశాలపై పార్టీ ముద్ర పడకుండా వివిధ రంగాల ప్రముఖులు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను దూరం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఇటీ వల హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పాట్నా పూర్వ చీఫ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ డీజీపీ అరవిందరావు, బ్యాంకింగ్, ఆర్థిక రంగ ప్రముఖులతో చర్చాగోష్టి ద్వారా ఈ కార్యక్రమాలను మొదలుపెట్టింది. కరీం నగర్లో న్యాయవాదులు, ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించి ఆయా అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. వీలైనంత త్వరలో ఇదే విధంగా అన్ని జిల్లాల్లోనూ గోష్టులు, సదస్సులు నిర్వహించాలని నిర్ణరుుంచింది. దీంతో పాటు... కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పార్టీ నాయకులు, కేడర్‌కు కూడా సూచనలు, సలహాలతో స్పష్టతనిస్తున్నారు. అవగాహనకు చర్యలు పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీపరంగా ప్రచార కార్య క్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదనే విషయాన్ని తాజా ఉపఎన్నికల ఫలితాలు స్పష్టం చేశారుు. అస్సాం, ఎంపీలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నల్లధనం రాజకీయా లను శాసిస్తోంది. అవినీతి వ్యవస్థీకృతమైంది. వీటి ప్రక్షాళన జరగాల్సి ఉంది. నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉంటే అందులో కనీసం ఒక్కశాతం కూడా బ్యాంకులు, ఏటీఎంల ముందు కనిపించడం లేదు. - కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు
• 15 రోజులకోసారి వారి బ్యాంకు ఖాతాల్లోకే సొమ్ము • పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ నిర్ణయం • భవిష్యత్తులోనూ ఆన్లైన్ చెల్లింపులే... సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించాలని విజయ డెరుురీ నిర్ణరుుంచింది. వచ్చే పదిహేను రోజులకు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు రైతులకు 15 రోజులకోసారి నగదు రూపంలో నేరుగా చెల్లించే పద్ధతి ఉంది. పెద్ద నోట్ల రద్దు... చిల్లర సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆన్లైన్లో రైతు ఖాతాలకు చెల్లింపు పద్దతిని కొనసాగిస్తామని... దీనివల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండబోవని పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ‘సాక్షి’కి చెప్పారు. 63 వేల మంది రైతులకు ప్రయోజనం.. తెలంగాణలో విజయ డెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు పాలు పోస్తుంటారు. దాదాపు 5 లక్షల లీటర్ల పాలు వారి నుంచి సేకరిస్తున్నారు. ఇందుకోసం విజయ డెరుురీ ఏడాదికి రూ. 350 కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు చేస్తుంది. దీంతోపాటు విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ ప్రకారం ఏడాదికి రూ. 72 కోట్లు ఇస్తున్నారు. ప్రోత్సాహక సొమ్మును ఇప్పటికే రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. దీంతోపాటు పాలకు ఇచ్చే సేకరణ సొమ్మును కూడా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణరుుంచారు. ఇదిలావుంటే పాడి రైతులకు ఇచ్చే ప్రోత్సాహక సొమ్ము రూ. 50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పినా.. అవి ఇంకా రైతులకు చేరలేదని తెలిసింది. ఎన్సీడీసీ సభ్యునిగా సురేశ్ చందా... జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సభ్యుడిగా సురేశ్ చందా నియమితులయ్యారు. జాతీయ స్థారుులో సభ్యుడిగా నియమితులవడం వల్ల పశు సంవర్థక, పాడి శాఖలకు పెద్ద ఎత్తున ఎన్సీడీసీ నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనేక రాష్ట్రాలకు దక్కని అవకాశం తెలంగాణకు దక్కడంపై సురేశ్ చందాకు పలువురు అభినందనలు తెలిపారు. -
నలుగుతున్న జనం
►రద్దయిన నోట్లు యథేచ్ఛగా మార్చేసుకుంటున్న పెద్దలు ►వేతనదారులు, కూలీలు, రైతులు ఖాతాల్లోకి భారీగా నగదు ► చిక్కుల్లో పడుతున్నది సామాన్యజనాలే ► కొత్త పెద్దనోట్లతో అదనపు చిక్కులు నల్లధనం తెల్లగా మారిపోతోంది. ఉన్న నోట్లు వదిలించుకునేందుకు వారిదగ్గరునన్న కట్టలన్నీ... కూలీలు, రైతులు, దినసరి వేతనదారుల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నారుు. ఇక ఇక్కట్లన్నీ... సామాన్యులకే. బ్యాంకులో ఇచ్చిన రెండువేలు మార్చుకునేందుకు తొక్కని గడపలేదు... తిరగని దుకాణం లేదు. వందనోటు కనిపిస్తే అదే బంగారమైపోతోంది. దానికోసం ఏటీఎంలకెళ్తే అక్కడ ఔట్ ఆఫ్ఆర్డర్ బోర్డు వెక్కిరిస్తోంది. జిల్లాలో డబ్బు మార్పు వ్యాపారంగా మారింది. ఇదే అదనుగా సొమ్ము మార్చుకునే వారు... సొమ్ము మారిస్తే ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావించే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదింపులతో కాలం గడుపుతున్నారు. డబ్బులు ఎంతైనా ఫర్వాలేదు... మార్చేస్తాం... అరుుతే ఇందుకు కమీషన్ రూపంలో తమకు కొంత ఇవ్వాలని కొందరు బేరాలకు దిగుతున్నారు. డబ్బులున్నవారిని గుర్తించి వారిని సంప్రదిస్తున్నారు. లక్షరూపాయలకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు కమీషన్కింద ఇస్తున్నట్టు బాగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఒప్పందాలు చురుగ్గా జరుగుతున్నారుు. జనం వద్ద ఉన్న అంతో ఇంతో సొమ్ము మార్చుకునే పనిలో నిన్నటి వరకూ గడిపేశారు. ఇప్పుడు పెద్దవారి నగదు మార్పిడిపై దృష్టి పెట్టారు. విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఒక విద్యాసంస్థ యజమాని తమ వద్ద పని చేసే ఉద్యోగులకు భారీగా అడ్బాన్సులు ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి రూ. 2లక్షల నుంచి రూ.8లక్షలు అడ్వాన్సుగా ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఇది నెలవారీ జీతాల రూపంలో కోత వేసి తన వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు పథకం వేసినట్లు ప్రచారం ఉంది. అటవీశాఖ నర్సరీల్లో కూలీలకు పని చేసే వారి పేరున కొంత సొమ్ము జమ చేసేందుకు వారి పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు కొంతమంది అధికారులు తీసుకున్నారంట. విజయనగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీగా నల్లధనం కలిగి ఉన్న వ్యాపారులు తమవద్ద పని చేసే సిబ్బంది పేరున రూ.2.5లక్షల లోపు మొత్తాలు జమ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఖాతాల్లోకి ఇలా నగదు చేరినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వ్యాపారులు, మిల్లర్లు చర్యలు మొదలు పెట్టారు. చీపురుపల్లి ప్రాంతంలో కొంతమంది రైతుల పేరిట సొమ్ము వేశారు. ధాన్యం కొనుగోలు తొందరలోనే ప్రారంభం కానున్న నేపధ్యంలో అడ్వాన్సుగా తీసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఒక యజమానికో... ఒక వ్యాపారికో... ఒక ఉద్యోగికో పరిమితం కాదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో లెక్కకు మించి సొమ్మున్న వారు ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఉన్నదాంట్లో ఎంతోకొంత సొమ్మును నల్లధనంగా మార్చుకోవచ్చునన్న ఆలోచనతో అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంత సొమ్ము తెల్లగా మారినట్లు జనాల్లో నలుగుతున్న మాట. సామాన్యులకు వెతలే... లెక్కకు మించి సొమ్మున్న పెద్దలు ఏదో ఒక రకంగా తమ సొమ్మును లెక్కల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటుండగా పెద్దనోట్లు రద్దుతో సామాన్యులు మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గురువారం కూడా బ్యాంకులు కొంత ఖాళీగా కనిపించగా ఏటీఎంల వద్ద మాత్రం జనం రద్దీ ఉంది. విజయనగరంతోపాటు ఇతర ప్రాంతాల్లో సగానికిపైగా ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో జనం నిరాశ చెందారు. కొన్ని ఏటీఎంల్లో సొమ్ము ఉన్నా తొందరగా అరుుపోవడంతో సొమ్ము కావాల్సిన వారు ఒకటికి నాలుగు ఏటీఎంలు తిరిగారు. దాదాపు అన్ని వ్యాపారాలు ఇంకా మందకొడిగానే సాగారుు. బ్యాంకుల్లో రూ.2వేలు నోట్లు అధికంగా ఇస్తుండడంతో చిల్లర కోసం జనం నోట్లు పట్టుకుని తిరగడం జిల్లా వ్యాప్తంగా ఉంది. రూ.100నోట్లు వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదు. -
క్యాష్.. రష్!
పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని వారం రోజులు దాటినా సామాన్యులు కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కలేదు. నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి కోసం మంగళవారం కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. చంటిబిడ్డలతో వచ్చిన తల్లులు, నిరక్షరాస్యులైన వృద్ధులు గంటలకొద్దీ క్యూలో నిలబడలేక నరక యూతన అనుభవించారు. ఒక్క నోటు ఎసట్లో బియ్యం ఉడికిస్తుంది ఒక్క నోటు కాలే కడుపులో పప్పు చారు పోస్తుంది ఒకే ఒక్క నోటు స్కూల్లో పిల్లాడికి చాక్లేటు ఇచ్చి ఉబికి వస్తున్న కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తుంది ఒక్క వంద ఓ పేద కుటుంబానికి అండగా.. నీడగా..ఆనందంగా మారుతుంది ఇప్పుడు అదే నోటు సామాన్యులను రోడ్ల వెంట పిచ్చివాళ్లలా తిప్పుతోంది కష్టపడి.. చెమటోడ్చి.. రక్తాన్ని పెట్టుబడిగా పెడితే వచ్చిన పెద్దనోటే వాళ్ల కడుపు మీద కొడతానంటూ బెదిరిస్తోంది 1..2..3..4..5..6..7 ఇలా రోజులు దొర్లిపోతూనే ఉన్నారుు కష్టజీవులకు పని పోరుుంది.. ఉద్యోగులకు సెలవు పోరుుంది రోజంతా బ్యాంకులవద్ద ఆపపోపాలు పడటమే మిగిలింది! కరెన్సీ కష్టాలు జిల్లాలో రోజురోజుకూ ఎక్కువవుతున్నారుు! - ఒంగోలు ఒంగోలు: కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల్లో సరిపడినంత నూతన కరెన్సీ నిల్వలు లేక పోవడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరూ క్యూల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగులు అయితే డ్యూటీలకు వెళ్లాలో లేక క్యూలో నిలబడాలో అర్థంకాక సతమతం అవుతున్నారు. రూ. 24వేల వరకు ఒకేసారి నగదు డ్రాచేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు సడలించినా అందులో ఎక్కువ మొత్తంలో రూ. 2వేల నోట్లే ఇస్తున్నారు. అయితే అవి మార్చుకునే సౌలభ్యం లేకపోవడంతో మరింత టెన్షన్ కొనసాగుతోంది. ఇదీ పరిస్థితి బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో పాత కరెన్సీనోట్లు పోగవుతున్నారుు. అరుుతే ప్రజల దైనందిన కార్యక్రమాలకు సమస్యలు వచ్చి పడ్డాయి. వ్యాపారులు అయితే రోజువారీ లావాదేవీలకు చిక్కులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు బ్యాంకర్లు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బ్యాంకుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. భారీ డిపాజిట్ల దెబ్బకు వాటికి సంబంధించిన వివరాలను సరిచూసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇదే క్రమంలో కొంతమంది వ్యక్తులు బ్యాంకర్లకు ఫోన్లు చేసి తమ వద్ద ఉన్న నగదును మార్చి పెట్టాలని.. లేదంటే భవిష్యత్తులో డిపాజిట్లు విత్‌డ్రా చేసుకుంటామని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఏటీఎంల వద్ద పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించడంలేదు. ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు సీఈవో కుంభా రాఘవయ్య స్టేట్‌బ్యాంక్ అధికారులను, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించి తమ పరిస్థితిని వివరించారు. తమకు దాదాపు రూ. 80 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, ఖాతాదారులకు నగదు ఇచ్చేందుకు మాత్రం సమస్యగా ఉందని పేర్కొన్నారు. కనీసం రూ. 5కోట్లు అత్యవసరంగా అందించి.. రోజుకు రూ. 2కోట్లు చొప్పున నూతన కరెన్సీ ఇస్తే తప్ప ఖాతాదారులకు సేవలు అందించలేమని చెప్పారు. అయినా ఎటువంటి హామీ రాకపోవడంతో బుధవారం నేరుగా ఎస్బీఐ గుంటూరు డీజీఎంను కలుసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరనున్నారు. ఆర్టీసీకి భారీగా తగ్గిన ఆదాయం ఒక వైపు దైనందిన అవసరాలకే నగదు లేకపోవడంతో ప్రజలు ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. పాత నోట్లను చిన్న , మధ్య తరగతి వర్గాలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నాయి. దీంతో మార్కెట్లో కరెన్సీ అత్యవసర పరిస్థితి నెలకొంది. కొత్త నోట్లు వచ్చాయనుకున్నా అవి రూ. 2వేల నోట్లు కావడంతో దేనికీ పనికి రావడంలేదు. జిల్లావ్యాప్తంగా సరాసరిన ఆరు రోజుల్లో ఆర్టీసీ రూ. 1.20 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అంచనా. ఒంగోలు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లోనే రోజుకు లక్ష రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. జనరల్ టిక్కెట్ల వద్ద పదిరూపాయల టికెట్‌కు సైతం రూ. 500 ఇస్తుండడంతో సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది. పోలీసుల సాయంతో టికెట్ల పంపిణీ కార్యక్రమం నడుస్తోంది. రూ. 500 నోట్లకు మరో 2 రోజులు రూ. 500 నోట్లు మంగళవారం రాత్రికి జిల్లాకు చేరుతాయని అధికారులు భావించినా మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నోట్లు వస్తే చిల్లర సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆంధ్రాబ్యాంకు డీజీఎం కె.ఎస్.పి.వి. రమణ మూర్తి తమ సిబ్బందిని మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గంటలపాటు అదనంగా సేవలు అందించాలని ఆదేశించడంతో స్థానిక కోర్టు స్ట్రీట్ బ్రాంచి ఉదయం ఒక గంట, సాయంత్రం మరో గంట అదనంగా సేవలు అందించాయి. -
మనసున్న డ్రైవర్..!
పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని ఎంతవరకూ అరికడుతుందో కానీ, సామాన్యులకు మాత్రం అంతులేని ఇక్కట్లు సృష్టిస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకూ అంతా డబ్బుతోనే.. అందులోనూ చిల్లరతోనే ముడిపడి ఉండటంతో కనీసం ఉదయాన్నే టీ కూడా తాగలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆఫీసులకు వెళ్లాలంటే..? అందులోకీ జేబులో ఐదువందలు, వెరుు్యనోట్లు తప్ప వేరే ఏమీ లేకపోతే.. ఢిల్లీకి చెందిన విప్లవ్ అరోరాకు ఎదురైన సమస్యలే మిమ్మల్నీ పలుకరిస్తారుు. కాకపోతే చిన్నతేడా.. విప్లవ్కు మనసున్న ‘విపిన్ కుమార్’ దొరికాడు. మరి మీకు..? మంగళవారం రాత్రి.. ట్రైన్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో కంగారుగా ఆఫీసు నుంచి వెలుపలికి వచ్చాడు ఆర్కిటెక్ట్ విప్లవ్. అప్పటికి కొన్ని గంటల క్రితమే ఐదువందలు, వెరుు్య రూపాయల నోట్లు ఎందుకూ పనికిరాని చిత్తుకాగితాలే అన్నారు ప్రధాని మోదీ. వ్యాలెట్ చెక్ చేసుకుంటే అన్నీ పెద్దనోట్లే కనిపించారుు విప్లవ్‌కి. ఇంటికి ఎలా వెళ్లాలో ఓ పట్టాన అర్థం కాలేదు. ఈ పెద్ద నోట్లు తీసుకునే సాహసం ఎవరూ చేయరు. మరి, ఎలా వెళ్లేది..? ఒకసారి ‘ఓలా మనీ’ చూసుకున్నాడు. ఓ రైడ్‌కు సరిపడా మనీ ఉంది అందులో. వెంటనే ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఓలా మనీతో పేమెంట్ చేస్తానని చెప్పి, క్యాబ్‌లో కూర్చున్నాడు. రైల్వే స్టేషన్ దిశగా కారును పోనిస్తున్నాడు డ్రైవర్ విపిన్ కుమార్. దారిలో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల్లో నల్లధనం, నోట్ల రద్దు కూడా వచ్చి చేరారుు. కొద్దిసేపటికి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది క్యాబ్. దిగబోతూ బిల్లు చూసుకున్నాడు విప్లవ్. మార్గమధ్యంలోనే ఓలా మనీ అరుుపోరుుందని గుర్తించారు విప్లవ్, విపిన్‌లు. తాను మిగతా మొత్తాన్ని డబ్బు రూపంలోనే చెల్లించాలి. కానీ, జేబులో ఒక్క వందనోటు కూడా లేదు. దీంతో విప్లవ్ ముఖంలో కంగారు మొదలైంది. అతడి పరిస్థితి గమనించిన ఓలా డ్రైవర్ విపిన్ కుమార్ చెప్పిన మాటలు ఈ రోజున ఫేస్బుక్లో అందరి గౌరవాన్నీ అందుకుంటున్నారుు. ‘‘మీ ట్రైన్ టైమ్ అవుతోంది వెళ్లిపోండి సార్. ఈ పనివల్ల నా కొచ్చేది తక్కువ మొత్తమే. కానీ, నేను దీన్ని నష్టపోవడానికి సిద్ధంగానే ఉన్నాను. దేశ అభివృద్ధి కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు కఠినమైనవైనా నేను గౌరవిస్తాను. మీరు కూడా సగటు మధ్యతరగతి మనిషే కదా.. వెళ్లిరండి’’ అన్నాడు. ఈ ఉదంతాన్ని ఓలా ఫేస్బుక్ పేజీలో విప్లవ్ కుమార్ రాసుకొచ్చాడు. ఇది చదివిన ఎందరో ఈ ఘటన నుంచి స్ఫూర్తి పొంది డ్రైవర్ విపిన్ మంచి మనసును కొనియాడారు. ఓలా యాజమాన్యం కూడా వెంటనే స్పందించి విపిన్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని, అతడు తమ భాగస్వామిగా ఉండటం గర్వకారణమని ప్రకటించింది. -
డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!
-
డొనేషన్ల డబ్బు ఏం చేద్దాం!
• తలలు పట్టుకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు • ఇప్పటిదాకా అడ్డగోలు డొనేషన్లు • ఎలాంటి రశీదులు లేకుండానే కోట్లలో వసూళ్లు • ఇప్పుడు ఆ డబ్బును ఎలా బయటకు తేవాలో అర్థంకాని స్థితి • లాసెట్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో డొనేషన్ల వసూలు కష్టమే సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో భాగంగా ఎలాంటి రశీదులు లేకుండా డొనేషన్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇప్పుడెలా చెలామణిలోకి తేవాలో అర్థం కాక యాజమన్యాలు తలపట్టుకున్నారుు. ఇటీవల చేపట్టిన మెడికల్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల సందర్భంగా వసూలు చేసిన డొనేషన్ల డబ్బులో కొంత మొత్తాన్ని కొన్ని యాజమాన్యాలు మాత్రమే బ్యాంకుల్లో వేసుకున్నారుు. కానీ అనేక యాజమాన్యాల వద్ద ఆ సొమ్ము బ్లాక్ మనీగానే ఉండిపోరుుంది. ఇప్పుడు వాటిని ఎలా చెలామణిలోకి తేవాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారుు. బ్యాంకుల్లో వేయని సొమ్ము మాత్రమే కాదు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు లెక్కలు అడిగే అవకాశం ఉండటంతో యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీలో భారీగా.. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీటు ఫీజు ఐదేళ్లకు రూ.55 లక్షలు. కానీ వసూలు చేసింది మాత్రం గరిష్టంగా కోటి రూపాయలు! అంటే ఒక్కో సీటుపై రూ.45 లక్షలు అదనం. మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఒక్కో సీటుకు కనీసంగా రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు యాజమాన్యాలు డొనేషన్ల రూపంలో వసూళ్లు చేశారుు.. ఇక టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డొనేషన్ల రూపంలో రూ.5 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఆ డబ్బుకు రశీదుల్లేవ్.. లెక్కలు లేవు. అనేక యాజమాన్యాలు ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని మాత్రమే ఇప్పటివరకు బ్యాంకులకు చేర్చగా.. అనేక యాజమాన్యాల వద్ద అనధికారిక సొమ్ము అలాగే ఉండిపోరుుంది. ఒక్క తెలంగాణలోనే మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో 1,200 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై యావరేజ్‌గా రూ.40 లక్షలు అదనంగా వసూలు చేసినట్లు అంచనా. అంటే లెక్కల్లోకి రాని దాదాపు రూ.480 కోట్ల డబ్బు యాజమాన్యాల వద్ద ఉండి పోరుుంది. ఏపీలోనూ బీపీ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ 2,300 మెడికల్ సీట్లలో 1,150 సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేశారు. ఒక్కో సీటుపై అదనంగా రూ.40 లక్షల దాకా వసూళ్లు చేశారు. ఈ లెక్కన అక్కడ రూ.450 కోట్లు లెక్కల్లోకి రాకుండా యాజమాన్యాల వద్ద ఉండిపోరుుంది. ఇవే కాదు తెలంగాణ, ఏపీలోని డెంటల్ కాలేజీల్లోనూ 1,300 వరకు సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేశారుు. అందులో ఒక్కో సీటుపై సగటున రూ.15 లక్షల వరకు అదనంగా వసూళ్లు చేశారుు. ఇలా బీడీఎస్‌లో అదనంగా వసూలు చేసిన దాదాపు రూ.200 కోట్లు లెక్కల్లోకి రానిదేనని అంచనా. ఇప్పుడు ఆ సొమ్మును ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది. అరుుతే ఒకట్రెండు కాలేజీలు కాలేజీ డెవలప్మెంట్ ఫండ్ కింద రశీదు ఇచ్చి వసూలు చేసిన మొత్తానికి మాత్రం ఇబ్బంది ఉండదని యాజమాన్య వర్గాలు పేర్కొన్నారుు. ఇంజనీరింగ్‌లోనూ అదే పరిస్థితి.. తెలంగాణలోని 20కి పైగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ల రూపంలో ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల వరకు అదనంగా వసూలు చేశారుు. ఒక్కో కాలేజీలో సగటున 250 సీట్ల చొప్పున మేనేజ్మెంట్ కోటాలో 5 వేల వరకు భర్తీ చేశారుు. ఒక్కో సీటుపై అదనంగా రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ.250 కోట్లు లెక్కల్లేని డబ్బును వసూలు చేసినట్లు అంచనా. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ఎలా చెలామణిలోకి తేవాలన్న ఆందోళనలో టాప్ కాలేజీలు పడ్డారుు. డొనేషన్లు తగ్గుతాయా? ప్రస్తుతం లాసెట్ ప్రవేశాలు జరుగుతున్నందున.. మేనేజ్మెంట్ కోటా ప్రైవేటు కాలేజీలు పెద్దగా డొనేషన్లను వసూలు చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నారుు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద నగదు రూపంలో పెద్దగా డబ్బు అందుబాటులో లేనందువల్ల భారీ మొత్తంలో డొనేషన్లు చెల్లించి కాలేజీల్లో చేరే పరిస్థితి ఉండదు. దీంతో యాజమాన్యాలు డొనేషన్లు పెద్దగా తీసుకునే అవకాశం ఉండదన్న భావన నెలకొంది. -
సాధారణ ప్రక్రియలో విచారణకు రానివ్వండి
• విచారణకు వస్తే తప్పక వాదనలు వింటాం • రూ.1000, 500 నోట్ల రద్దు వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: వెరుు్య, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైనట్లు తెలిసిందని, ఇక్కడ దాఖలైన వ్యాజ్యం విచారణకు వస్తే తప్పక వాదనలు వింటామని ఉమ్మడి హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, అందుకు అవకాశం కల్పిస్తున్న ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)ను కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య కోరగా హైకోర్టు అందుకు నిరాకరించింది. శుక్రవారం విచారణకు వచ్చినప్పుడు తప్పకుండా విచారిస్తామని పేర్కొంది. గురువారం ఈ వ్యాజ్యం కేసుల విచారణ జాబితాలో ఐటమ్ నంబర్ 65గా ఉండటంతో విచారణకు నోచుకునే విషయంలో అనుమానం ఉండటంతో ఉదయమే కృష్ణయ్య తన వ్యాజ్యం గురించి ప్రస్తావించారు. సాయంత్రం 4 గంటలకన్నా విచారించాలని కోరారు. అరుుతే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం విచారణకు వచ్చినప్పుడు వాదనలు వింటామంది. అరుుతే కేసు విచారణకు నోచుకోకపోవడంతో కృష్ణయ్య మరోసారి ప్రస్తావించి శుక్రవారం విచారించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైనట్లు తెలిసిందని, శుక్రవారం సాధారణ ప్రక్రియలో భాగంగా ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు తప్పకుండా వాదనలు వింటామని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కృష్ణయ్యకు ధర్మాసనం స్పష్టం చేసింది.