
సాధారణ ప్రక్రియలో విచారణకు రానివ్వండి
• విచారణకు వస్తే తప్పక వాదనలు వింటాం
• రూ.1000, 500 నోట్ల రద్దు వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: వెరుు్య, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైనట్లు తెలిసిందని, ఇక్కడ దాఖలైన వ్యాజ్యం విచారణకు వస్తే తప్పక వాదనలు వింటామని ఉమ్మడి హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, అందుకు అవకాశం కల్పిస్తున్న ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)ను కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య కోరగా హైకోర్టు అందుకు నిరాకరించింది.
శుక్రవారం విచారణకు వచ్చినప్పుడు తప్పకుండా విచారిస్తామని పేర్కొంది. గురువారం ఈ వ్యాజ్యం కేసుల విచారణ జాబితాలో ఐటమ్ నంబర్ 65గా ఉండటంతో విచారణకు నోచుకునే విషయంలో అనుమానం ఉండటంతో ఉదయమే కృష్ణయ్య తన వ్యాజ్యం గురించి ప్రస్తావించారు. సాయంత్రం 4 గంటలకన్నా విచారించాలని కోరారు. అరుుతే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం విచారణకు వచ్చినప్పుడు వాదనలు వింటామంది.
అరుుతే కేసు విచారణకు నోచుకోకపోవడంతో కృష్ణయ్య మరోసారి ప్రస్తావించి శుక్రవారం విచారించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైనట్లు తెలిసిందని, శుక్రవారం సాధారణ ప్రక్రియలో భాగంగా ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు తప్పకుండా వాదనలు వింటామని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కృష్ణయ్యకు ధర్మాసనం స్పష్టం చేసింది.