
నలుగుతున్న జనం
►రద్దయిన నోట్లు యథేచ్ఛగా మార్చేసుకుంటున్న పెద్దలు
►వేతనదారులు, కూలీలు, రైతులు ఖాతాల్లోకి భారీగా నగదు
► చిక్కుల్లో పడుతున్నది సామాన్యజనాలే
► కొత్త పెద్దనోట్లతో అదనపు చిక్కులు
నల్లధనం తెల్లగా మారిపోతోంది. ఉన్న నోట్లు వదిలించుకునేందుకు వారిదగ్గరునన్న కట్టలన్నీ... కూలీలు, రైతులు, దినసరి వేతనదారుల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నారుు. ఇక ఇక్కట్లన్నీ... సామాన్యులకే. బ్యాంకులో ఇచ్చిన రెండువేలు మార్చుకునేందుకు తొక్కని గడపలేదు... తిరగని దుకాణం లేదు. వందనోటు కనిపిస్తే అదే బంగారమైపోతోంది. దానికోసం ఏటీఎంలకెళ్తే అక్కడ ఔట్ ఆఫ్‌ఆర్డర్ బోర్డు వెక్కిరిస్తోంది.
జిల్లాలో డబ్బు మార్పు వ్యాపారంగా మారింది. ఇదే అదనుగా సొమ్ము మార్చుకునే వారు... సొమ్ము మారిస్తే ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావించే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదింపులతో కాలం గడుపుతున్నారు. డబ్బులు ఎంతైనా ఫర్వాలేదు... మార్చేస్తాం... అరుుతే ఇందుకు కమీషన్ రూపంలో తమకు కొంత ఇవ్వాలని కొందరు బేరాలకు దిగుతున్నారు. డబ్బులున్నవారిని గుర్తించి వారిని సంప్రదిస్తున్నారు. లక్షరూపాయలకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు కమీషన్‌కింద ఇస్తున్నట్టు బాగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఒప్పందాలు చురుగ్గా జరుగుతున్నారుు. జనం వద్ద ఉన్న అంతో ఇంతో సొమ్ము మార్చుకునే పనిలో నిన్నటి వరకూ గడిపేశారు. ఇప్పుడు పెద్దవారి నగదు మార్పిడిపై దృష్టి పెట్టారు.
విజయనగరం గంటస్తంభం:
విజయనగరంలో ఒక విద్యాసంస్థ యజమాని తమ వద్ద పని చేసే ఉద్యోగులకు భారీగా అడ్బాన్సులు ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి రూ. 2లక్షల నుంచి రూ.8లక్షలు అడ్వాన్సుగా ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఇది నెలవారీ జీతాల రూపంలో కోత వేసి తన వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు పథకం వేసినట్లు ప్రచారం ఉంది.
అటవీశాఖ నర్సరీల్లో కూలీలకు పని చేసే వారి పేరున కొంత సొమ్ము జమ చేసేందుకు వారి పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు కొంతమంది అధికారులు తీసుకున్నారంట.
విజయనగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీగా నల్లధనం కలిగి ఉన్న వ్యాపారులు తమవద్ద పని చేసే సిబ్బంది పేరున రూ.2.5లక్షల లోపు మొత్తాలు జమ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఖాతాల్లోకి ఇలా నగదు చేరినట్లు చర్చ జరుగుతోంది.
తాజాగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వ్యాపారులు, మిల్లర్లు చర్యలు మొదలు పెట్టారు. చీపురుపల్లి ప్రాంతంలో కొంతమంది రైతుల పేరిట సొమ్ము వేశారు. ధాన్యం కొనుగోలు తొందరలోనే ప్రారంభం కానున్న నేపధ్యంలో అడ్వాన్సుగా
తీసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది.
జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఒక యజమానికో... ఒక వ్యాపారికో... ఒక ఉద్యోగికో పరిమితం కాదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో లెక్కకు మించి సొమ్మున్న వారు ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఉన్నదాంట్లో ఎంతోకొంత సొమ్మును నల్లధనంగా మార్చుకోవచ్చునన్న ఆలోచనతో అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంత సొమ్ము తెల్లగా మారినట్లు జనాల్లో నలుగుతున్న మాట.
సామాన్యులకు వెతలే...
లెక్కకు మించి సొమ్మున్న పెద్దలు ఏదో ఒక రకంగా తమ సొమ్మును లెక్కల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటుండగా పెద్దనోట్లు రద్దుతో సామాన్యులు మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గురువారం కూడా బ్యాంకులు కొంత ఖాళీగా కనిపించగా ఏటీఎంల వద్ద మాత్రం జనం రద్దీ ఉంది. విజయనగరంతోపాటు ఇతర ప్రాంతాల్లో సగానికిపైగా ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో జనం నిరాశ చెందారు. కొన్ని ఏటీఎంల్లో సొమ్ము ఉన్నా తొందరగా అరుుపోవడంతో సొమ్ము కావాల్సిన వారు ఒకటికి నాలుగు ఏటీఎంలు తిరిగారు. దాదాపు అన్ని వ్యాపారాలు ఇంకా మందకొడిగానే సాగారుు. బ్యాంకుల్లో రూ.2వేలు నోట్లు అధికంగా ఇస్తుండడంతో చిల్లర కోసం జనం నోట్లు పట్టుకుని తిరగడం జిల్లా వ్యాప్తంగా ఉంది. రూ.100నోట్లు వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదు.