6 నుంచి దేశవ్యాప్త నిరసనలు: కాంగ్రెస్
జైపూర్/శ్రీనగర్: పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటినా ప్రజల కష్టాలు తొలగలేదని, దీనికి కారణమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయని మోదీ ప్రకటించినా ఎక్కడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ధ్వజమెత్తింది. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా జనవరి 6 నుంచి దేశమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గురువారం ఇక్కడ వెల్లడించారు.
నిరాధార ఆరోపణలు చేస్తే సహించం
న్యూఢిల్లీ: మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని కాంగ్రెస్ పార్టీని బీజేపీ హెచ్చరించింది. రూ.13,860 కోట్లు లెక్కల్లో చూపని ఆదాయానికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న గుజరాత్ వ్యాపారి మహేష్‌షాతో మోదీ, అమిత్‌షాకు సంబంధాలున్నాయంటున్న కాంగ్రెస్... అందుకు ఆధారాలు చూపాలని కేంద్ర మంత్రి రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు, అధికార ప్రతినిధులు పిల్లల్లా మాట్లాడారన్నారు.
జాతికి మోదీ క్షమాపణ చెప్పాలి
Published Fri, Dec 30 2016 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement