ranadip surjevala
-
ఏపీ ప్రజలకు మోదీ ద్రోహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(ఏపీ)కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదాపై కృతనిశ్చయంతో పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఉమ్మడి ఏపీకి చెందిన మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అదేనని సుర్జేవాలా అన్నారు. గత ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన ఆ హామీని అమలు చేయకపోవడం ద్వారా రాజ్యాంగ విధానాలను మోదీ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసే ముందు జైట్లీసహా ఇతర బీజేపీ సీనియర్ నేతలతో చర్చిస్తే వారు సమ్మతించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం అసలు పరిశీలనలోనే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులోనే చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇది కోట్లాదిమంది ఏపీ ప్రజలకు బీజేపీ చేసిన సిగ్గుమాలిన నమ్మక ద్రోహమేనని సుర్జేవాలా అన్నారు. మోదీ తమ మాటనిలబెట్టుకుంటారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు వేచిచూస్తున్నారనీ, మాట నిలుపుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని సుర్జేవాలా పేర్కొన్నారు. -
ప్రధాని క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లలో 99.3 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ అవకాశంగా మలుచుకుని కేంద్రంపై విమర్శలకు దిగింది. డీమోనిటైజేషన్ కోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందని, ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రూ.3 లక్షల కోట్ల మేర అక్రమ నగదు వ్యవస్థలోకి వస్తుందని 2017 స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారని, అబద్ధం చెప్పినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఇతిహాస లెక్కల ఆధారంగా మోదీ సృష్టించిన విపత్తు డీమోనిటైజేషన్ అని ఆర్బీఐ నివేదిక మరోసారి నిరూపించిందన్నారు. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సైతం స్పందించారు. డీమోనిటైజేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, పరిశ్రమల మూతపడటం, వృద్ధి రేటు తగ్గడం వంటి సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొందని చిదంబరం అన్నారు. కేవలం రూ.13,000 కోట్ల మేరే డీమోనిటైజేషన్ జరిగినట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయని, ఇందుకోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందన్నారు. ‘వృద్ధి రేటు పరంగా దేశ జీడీపీ 1.5 శాతం మేర నష్టపోయింది. దీనివల్లే రూ.2.25 లక్షల కోట్ల నష్టం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది రోజువారీ వేతన జీవులు కొన్ని వారాల పాటు తమ ఉపాధి కోల్పోయారు. వేలాది ఎస్ఎంఈ యూనిట్లు మూతపడ్డా యి’అని చిదంబరం ట్వీట్ చేశారు. రాఫెల్‌పై వాగ్యుద్ధం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో..రాహుల్ బదులు కోరుతూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 15 ప్రశ్నలను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కన్నా 20 శాతం తక్కువ ధరలకే రాఫెల్ విమానాలను కొనుగోలుచేస్తున్నామని తెలిపారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. రాఫెల్ ఒప్పందాన్ని ఘరానా దోపిడీగా అభివర్ణించారు. వ్యాపారవేత్త అయిన స్నేహితుడిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
జాతికి మోదీ క్షమాపణ చెప్పాలి
6 నుంచి దేశవ్యాప్త నిరసనలు: కాంగ్రెస్ జైపూర్/శ్రీనగర్: పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటినా ప్రజల కష్టాలు తొలగలేదని, దీనికి కారణమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయని మోదీ ప్రకటించినా ఎక్కడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ధ్వజమెత్తింది. ప్రధాని నిర్ణయానికి వ్యతిరేకంగా జనవరి 6 నుంచి దేశమంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గురువారం ఇక్కడ వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించం న్యూఢిల్లీ: మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని కాంగ్రెస్ పార్టీని బీజేపీ హెచ్చరించింది. రూ.13,860 కోట్లు లెక్కల్లో చూపని ఆదాయానికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న గుజరాత్ వ్యాపారి మహేష్షాతో మోదీ, అమిత్‌షాకు సంబంధాలున్నాయంటున్న కాంగ్రెస్... అందుకు ఆధారాలు చూపాలని కేంద్ర మంత్రి రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు, అధికార ప్రతినిధులు పిల్లల్లా మాట్లాడారన్నారు.