
మోదీతో కేసీఆర్ బేరసారాలు: చాడ
న్యూశాయంపేట: నోట్ల రద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న సీఎం కేసీఆర్.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో లాలూచీ పడి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని మార్చు కునేందుకు బేరసారాలు జరిపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా జనజీవనం అల్లాడి పోతోందన్నారు. సోమవారం నుంచి మూడురోజుల పాటు ఓరుగల్లులో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు జరగను న్నాయన్నారు. 28న ఉదయం రాష్ట్ర నిర్మాణ మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 30న హన్మకొండ కేడీసీ మైదానంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.