
మనసున్న డ్రైవర్..!
పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని ఎంతవరకూ అరికడుతుందో కానీ, సామాన్యులకు మాత్రం అంతులేని ఇక్కట్లు సృష్టిస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకూ అంతా డబ్బుతోనే.. అందులోనూ చిల్లరతోనే ముడిపడి ఉండటంతో కనీసం ఉదయాన్నే టీ కూడా తాగలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆఫీసులకు వెళ్లాలంటే..? అందులోకీ జేబులో ఐదువందలు, వెరుు్యనోట్లు తప్ప వేరే ఏమీ లేకపోతే.. ఢిల్లీకి చెందిన విప్లవ్ అరోరాకు ఎదురైన సమస్యలే మిమ్మల్నీ పలుకరిస్తారుు. కాకపోతే చిన్నతేడా.. విప్లవ్‌కు మనసున్న ‘విపిన్ కుమార్’ దొరికాడు. మరి మీకు..?
మంగళవారం రాత్రి.. ట్రైన్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో కంగారుగా ఆఫీసు నుంచి వెలుపలికి వచ్చాడు ఆర్కిటెక్ట్ విప్లవ్. అప్పటికి కొన్ని గంటల క్రితమే ఐదువందలు, వెరుు్య రూపాయల నోట్లు ఎందుకూ పనికిరాని చిత్తుకాగితాలే అన్నారు ప్రధాని మోదీ. వ్యాలెట్ చెక్ చేసుకుంటే అన్నీ పెద్దనోట్లే కనిపించారుు విప్లవ్‌కి. ఇంటికి ఎలా వెళ్లాలో ఓ పట్టాన అర్థం కాలేదు. ఈ పెద్ద నోట్లు తీసుకునే సాహసం ఎవరూ చేయరు. మరి, ఎలా వెళ్లేది..?
ఒకసారి ‘ఓలా మనీ’ చూసుకున్నాడు. ఓ రైడ్‌కు సరిపడా మనీ ఉంది అందులో. వెంటనే ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఓలా మనీతో పేమెంట్ చేస్తానని చెప్పి, క్యాబ్‌లో కూర్చున్నాడు. రైల్వే స్టేషన్ దిశగా కారును పోనిస్తున్నాడు డ్రైవర్ విపిన్ కుమార్. దారిలో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల్లో నల్లధనం, నోట్ల రద్దు కూడా వచ్చి చేరారుు. కొద్దిసేపటికి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది క్యాబ్. దిగబోతూ బిల్లు చూసుకున్నాడు విప్లవ్. మార్గమధ్యంలోనే ఓలా మనీ అరుుపోరుుందని గుర్తించారు విప్లవ్, విపిన్‌లు. తాను మిగతా మొత్తాన్ని డబ్బు రూపంలోనే చెల్లించాలి. కానీ, జేబులో ఒక్క వందనోటు కూడా లేదు. దీంతో విప్లవ్ ముఖంలో కంగారు మొదలైంది.
అతడి పరిస్థితి గమనించిన ఓలా డ్రైవర్ విపిన్ కుమార్ చెప్పిన మాటలు ఈ రోజున ఫేస్‌బుక్‌లో అందరి గౌరవాన్నీ అందుకుంటున్నారుు. ‘‘మీ ట్రైన్ టైమ్ అవుతోంది వెళ్లిపోండి సార్. ఈ పనివల్ల నా కొచ్చేది తక్కువ మొత్తమే. కానీ, నేను దీన్ని నష్టపోవడానికి సిద్ధంగానే ఉన్నాను. దేశ అభివృద్ధి కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు కఠినమైనవైనా నేను గౌరవిస్తాను. మీరు కూడా సగటు మధ్యతరగతి మనిషే కదా.. వెళ్లిరండి’’ అన్నాడు.
ఈ ఉదంతాన్ని ఓలా ఫేస్‌బుక్ పేజీలో విప్లవ్ కుమార్ రాసుకొచ్చాడు. ఇది చదివిన ఎందరో ఈ ఘటన నుంచి స్ఫూర్తి పొంది డ్రైవర్ విపిన్ మంచి మనసును కొనియాడారు. ఓలా యాజమాన్యం కూడా వెంటనే స్పందించి విపిన్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని, అతడు తమ భాగస్వామిగా ఉండటం గర్వకారణమని ప్రకటించింది.