యువతికి 'ఓలా' డ్రైవర్‌ ఘోరమైన మెసేజ్‌! | Woman cancels Ola cab, driver retaliates by text message | Sakshi
Sakshi News home page

యువతికి 'ఓలా' డ్రైవర్‌ ఘోరమైన మెసేజ్‌!

Published Mon, Feb 8 2016 7:31 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

యువతికి 'ఓలా' డ్రైవర్‌ ఘోరమైన మెసేజ్‌! - Sakshi

యువతికి 'ఓలా' డ్రైవర్‌ ఘోరమైన మెసేజ్‌!

బెంగళూరు: ఓ బెంగళూరు యువతి ఇటీవల 'ఓలా' క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కొంతసేపటికే ఆమె తన బుకింగ్‌ను రద్దు చేసుకుంది. దీంతో 'ఓలా' నుంచి ఈ మేరకు ఆమెకు ఓ మెసేజ్ కూడా వచ్చింది. కానీ, బుకింగ్ రద్దవ్వడంతో చికాకు పడ్డ 'ఓలా' క్యాబ్ డ్రైవర్ మాత్రం ఆమెకు ఫోన్‌కాల్ చేశాడు. ఆమె ఎత్తలేదు. దీంతో రెచ్చిపోయిన అతడు నీచంగా తిడుతూ మెసేజ్‌ చేశాడు.

ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడిస్తూ 'ఓలా' కాబ్స్ సపోర్ట్‌ ఖాతాకు ట్యాగ్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన 'ఓలా' క్యాబ్‌ సంస్థ సదరు డ్రైవరుపై వెంటనే చర్యలు తీసుకుంది. సంస్థతో అతని కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ అసభ్యమైన చర్యకుగాను అతనిపై చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. అయితే బెంగళూరు యువతి చేసిన ఈ ట్వీట్‌ మాత్రం ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. డ్రైవరు అసభ్య ప్రవర్తన ఎత్తిచూపడంలో ఆ యువతి చూపిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement