Ola cab
-
క్యాబ్ బిల్లు చూసి షాకైన ప్యాసెంజర్..చివరికి ఏం చేశాడంటే..?
క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ విద్యార్థికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బుక్ చేసుకున్నపుడు ఉన్న ఫీజుకి, తీరా చెల్లించాల్సిన సొమ్ముకి ఉన్న తేడా చూసి కంగు తిన్నాడు. ఇదేం చోద్యం బాసూ అంటూ లబోదిబోమన్నాడు. చివరికి ఏమైందంటే..? కోల్‌కతా నుంచి బెంగళూరుకు వచ్చిన అనురాగ్ కుమార్ సింగ్ అనే కాలేజీ విద్యార్థి కెంపేగౌడ విమానాశ్రయంలో ఓలా 'మినీ' క్యాబ్‌ను చేసుకున్నాడు. ఓలా బుక్ చేసుకున్న మతికెరె ప్రాంతానికి సమయంలో ధర రూ.730 చూపించింది. తీరా రైడ్ ముగిసిన తరువాత రూ.5194 చెల్లించాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన అనురాగ్ వెంటనే తన ఫోన్లో చెక్ చేస్తే రైడ్ క్యాన్సిల్ అయినట్లు చూపించింది. క్యాన్సిల్ అయిన రైడ్‌కు అంత డబ్బులు ఎలా వసూలు చేస్తావంటూ డ్రైవర్ని నిలదీశాడు.దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం జరిగింది. ఓలా కస్టమర్‌కేర్‌ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. చివరికి అక్కడున్న తోటివారి సలహా మేరకు డ్రైవర్‌కు రూ. 1,600 చెల్లించాడు. తన ఫిర్యాదుకు ఓలా నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంపై అనురాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరు మొత్తం తిరిగినా ఇంత ఖర్చు కాదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, రైడ్ వివరాల స్క్రీన్షాట్లను తీసుకొని, ఏదైనా తేడా వస్తే కస్టమర్ సపోర్ట్ టీమ్‌లకు రిపోర్ట్ చేయాలని నెటిజన్లు సూచించారు. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్‌లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్‌కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్‌లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్‌వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్‌డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్‌లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్‌లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
ఆరు గంటలు.. ఇంట్లోనే మకాం వేసి.. 10 లక్షలు దోచేసి.. క్యాబ్‌లో చెక్కేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు. రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు. ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా క్యాబ్‌లో నిందితుడు షాద్‌నగర్ బస్టాప్‌లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. -
ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ, దూసుకుపోతున్న ఆ యాప్
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే ఓలా, ఉబెర్, ర్యాపిడో ఊహించని దెబ్బపడింది. అధిక చార్జీలు, వ్యవహార తీరుతో తీవ్ర విమర్శల పాలై, అక్కడి సర్కార్ ఆగ్రహానికి గురైన దిగ్గజాలకు అనూహ్యంగా మరో షాక్ తగిలింది. బెంగుళూరు ఆటో రిక్షా డ్రైవర్లు సొంతంగా ఒక యాప్‌ను రూపొందించుకున్నారు. లాంచింగ్‌కు ముందే 'నమ్మ యాత్రి' అప్లికేషన్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) నవంబర్ 1న తన నమ్మయాత్రి సేవలను షురూ చేయనుంది. అయితే ఈ యాప్ ఇప్పటికే 10,000 డౌన్లోడ్స్ సాధించింది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేలా చార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఫీజు ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. ప్రత్యర్థులకు సమానమైన ఇంటర్ఫేస్తో 'సరసమైన ధరల' వద్ద సేవలను అందిస్తుండటం విశేషం. దీంతో ఈ యాప్ చాల బావుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌పై సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి. పికప్, డ్రాప్ లొకేషన్లను సెట్ చేసిన తర్వాత, సమీపంలోని డ్రైవర్లు చార్జీని కోట్ చేస్తారు. సాధారణంగా పికప్ , డ్రాపింగ్ ప్లేస్ దూరాన్ని బట్టి అదనంగా 10-30 రూపాయల వరకు అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ వసూలు చేయనుంది చిన్మయ్ ధుమాల్ అనే దీనిపై ట్వీట్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై ఓలా, ఉబెర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.దీనిపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసిసి సంగతి తెలిసిందే. Bangalore Auto Rickshaw Drivers launched their own application called 'Namma Yatri' to tackle unfair comission charges of Ola/Uber. - ₹30 fixed platform fees - No cancellation charges - Currently, Cash Only The app is beautiful and responsive. Bangalore is built different! pic.twitter.com/8J7OZIXcA1 — Chinmay Dhumal (@ChinmayDhumal) October 27, 2022 -
దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్‌పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్‌పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్‌పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!
ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తుంటారు. ఓలా, ఉబెర్ ఉపయోగించే వ్యక్తులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య ఇది. రైడ్-హైలింగ్ కంపెనీల డ్రైవర్లు డ్రాప్ లొకేషన్ గురించి అడిగిన తర్వాత వెంటనే రైడ్లను రద్దు చేస్తారు అని ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు. ఒక నిర్ధిష్ట ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడనట్లయితే డ్రైవర్‌ను మనం నిందించలేం. అత్యవసర సమయాలలో ఇలాంటి సమస్య ఎదురైతే వినియోగదారులకు వచ్చే కోపం గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యాబ్ వినియోగదారుల ఎక్కువగా ఎదుర్కొనే ఈ సమస్య గురుంచి ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందించారు. ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపారు. ఇక నుంచి లొకేషన్, పేమెంట్ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు కనిపిస్తాయి. రైడ్ తనకు అంగీకారమైతే ప్రొసీడ్ కావొచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేర్పులపై క్యాబ్ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Addressing the 2nd most popular question I get - Why does my driver cancel my Ola ride?!! We're taking steps to fix this industry wide issue. Ola drivers will now see approx drop location & payment mode before accepting a ride. Enabling drivers is key to reducing cancelations. pic.twitter.com/MFaK1q0On8 — Bhavish Aggarwal (@bhash) December 21, 2021 (చదవండి: మీ మొబైల్‌తో నకిలీ పాన్-కార్డు గుర్తించండి ఇలా..?) -
ఓలా, ఉబెర్ సర్వీసులను నిలిపివేసిన డ్రైవర్లు..
-
ఓలా సరికొత్త బిజినెస్.. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ!
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ సేవలు భారీగా పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాయి కంపెనీలు. ఆన్లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలు అందించే ఓలా ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓలా కంపెనీ ఇప్పుడు కిరాణా సరుకుల డోర్ డెలివరీ సేవలు అందిస్తుంది. ఈ బిజినెస్‌లో భాగంగా ఓలా ముంబై, బెంగళూరు అంతటా ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. కంపెనీ రోజువారీగా సుమారు 10000 ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. బెంగళూరు, ముంబైలోని కొన్ని కీలక ప్రాంతాల్లో 'ఓలా స్టోర్'ను తెరిచింది. రాబోయే నెలల్లో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా యాప్ ద్వారా క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చు. దాదాపు 2,000 రకాల వస్తువులను ఓలా స్టోర్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. కిరాణా డెలివరీ వ్యాపారం కోసం ఓలా 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. జనవరి నాటికి కిరాణా సరుకుల ఫాస్ట్ డెలివరీ కోసం 300 ఓలా స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 55 క్లౌడ్ కిచెన్లను కలిగి ఉన్న ఈ సంస్థ, జనవరి నాటికి ఈ సంఖ్యను 150-160కు విస్తరించాలని యోచిస్తోంది. 2015 జూలైలో రైడ్-హైలింగ్ సంస్థ బెంగళూరులో ఒక స్టాండ్ ఎలోన్ ఆన్లైన్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే ఆ సేవలను మూసివేసింది. రెడ్ సీర్ ప్రకారం, ఈ డోర్ డెలివరీ వ్యాపారం రాబోయే ఐదేళ్లలో 10-15 రెట్లు పెరిగి 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. (చదవండి: మారుతి సుజుకీలో ఆ కారు ధర మరింత ప్రియం..!) -
మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఓలా!
ప్రముఖ క్యాబ్ సర్వీసు సంస్థ ఓలా మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన రంగంలో అదృష్టం పరీక్షించుకుంటున్న ఓలా, ఇప్పుడు సరకుల డెలివరీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడుతుంది. బెంగళూరులో కిరాణా, వ్యక్తిగత సంరక్షణ, పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తులు వంటి వస్తువుల డెలివరీ సేవలను అందించేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఓలా బెంగళూరులో తన 'ఓలా స్టోర్' పైలట్ ప్రాజెక్టును కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రారంభిస్తుందని, తర్వాత రాబోయే నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించనున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ సేవలను వేగంగా అందించడానికి 15 నిమిషాల డెలివరీ టైమ్ లైన్'ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంమై ఓలా సంప్రదించినప్పుడు దీనిపై మాట్లాడటానికి నిరాకరించింది. ఓలా యాప్‌లోనే ఓలా స్టోర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,000 సరకులు అందిస్తున్నట్లు సమాచారం. నగరంలోని కీలక ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న దుకాణాల నుంచి వీటిని పంపిణీ చేస్తామని ఆ వర్గాలు తెలిపాయి. సంప్రదాయ ఈ-కామర్స్ డెలివరీలకు ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. (చదవండి: ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..!) క్విక్ కామర్స్(క్యూ కామర్స్) కస్టమర్లకు తక్కువ వ్యవధిలో చిన్న మొత్తంలో వస్తువులను అందించాలని ఓలా ఆలోచిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో డుంజో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఓలా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో 0.3 బిలియన్ డాలర్లుగా ఉన్న క్యూ-కామర్స్ పరిశ్రమ విలువ 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందే అవకాశం ఉంది అని అంచనా. ఎఎన్ఐ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఓలాలో ఫుడ్ డెలివరీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వినియోగదారులు వాహనాలను కొనుగోలు చేయడానికి వీలుగా ఇటీవల ఓలా కార్స్అనే వాహన వాణిజ్య వేదికను కూడా ప్రారంభించింది. (చదవండి: సామాన్యులకు షాక్.. ఇక ఉచిత రేషన్ బంద్!) -
పొలికెపాడులో కరోనా పరీక్షలు
గోపాల్పేట (వనపర్తి): మండలంలోని పొలికెపాడు గ్రామానికి పోలీసులు, డాక్టర్లు, ఇతర అధికారులు చేరుకొని ఓ ఇంటివారిని ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 20వ తేదీన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓలా క్యాబ్ బుక్ చేసి ఆటోలో హోటల్ సితార (లాడ్జ్) నుంచి ఆస్పత్రికి వెళ్లాడు. లండన్ నుంచి వ్యచ్చిన వ్యక్తి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు, అధికారులు హైదరాబాద్‌లో అతడు ఎవరెవరిని కలిశాడు అనే విషయాలు తెలుసుకున్నారు. అందులో ఓలా క్యాబ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో వివరాలు పరిశీలించగా, అతను గోపాల్పేట మండలం పొలికెపాడు గ్రామస్తుడిగా గుర్తించి వనపర్తి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు ఆదివారం పొలికెపాడు గ్రామానికి చేరుకొని ఆటోడ్రైవరు, వారి కుటుంబాన్ని విచారించారు. ఆటో డ్రైవరు, అతని భార్య, తల్లి, కూతురును డాక్టర్ మంజుల, సీఐ సూర్యనాయక్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ అప్జలుద్దీన్ విచారించి నలుగురికి స్టాంపులు వేశారు. ప్రస్తుతం అతడికి ఎటువంటి జలుబు, ఇతర లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. మధ్యాహ్నం అనంతరం కలెక్టర్ యాస్మిన్ భాష ఆదేశాల మేరకు ఆటోడ్రైవర్‌ను నాగోరం ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అంతేకాకుండా వారి ఇంటి పక్కల ఉన్న దాదాపు 18 మందికి స్టాంపులు వేసినట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు. -
సర్‌చార్జీ లేకుండా ప్రైడో క్యాబ్స్‌లో ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్స్ పరిశ్రమలో రైడర్లకు సర్‌చార్జీ భారం తప్పనుంది. జీరో సర్‌చార్జీతో మార్కెట్లోకి ప్రైడో క్యాబ్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 14 వేల మంది డ్రైవర్లు నమోదయ్యారని, ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రైడో క్యాబ్స్ ఫౌండర్ అండ్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు గురువారం ఇక్కడ తెలిపారు. వచ్చే 6 నెలల్లో న్యూఢిల్లీ, బెంగళూరులకు, ఏడాదిలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవీ మూడు కేటగిరీల్లో వాహనాలు అందుబాటులో ఉంటాయని, 3నెలల్లో 10 లక్షల రైడ్స్‌ను లకి‡్ష్యంచామన్నారు. ప్రోత్సా హకాల పేరిట డ్రైవర్ల మీద ఒత్తిడి ఉండదని, బిల్లింగ్, ఇన్వాయిస్లలో పారదర్శకత ఉంటుం దని డైరెక్టర్ శ్రీకాంత్ చింతలపాటి తెలిపారు. -
నిర్మలా సీతారామన్‌కు మారుతి కౌంటర్
గువహటి: యువత (మిలీనియల్స్/20–40 మధ్యనున్నవారు) కార్లు కొనడానికి బదులు ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే ఆటోమొబైల్ వాహన విక్రయాలు పడిపోవడానికి కారణమన్న కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వాదనను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి అంగీకరించలేదు. వాహన విక్రయాల ప్రస్తుత మందగమనానికి ఇది బలమైన అంశం కానేకాదని, ఓ అభిప్రాయానికి రావడానికి ముందుగా పూర్తిస్థాయి అధ్యయనం అవసరమని పేర్కొంది. ప్రజలు ఇప్పటికీ కార్లను తమ ఆంకాక్ష మేరకు కొనుగోలు చేస్తున్నారని మారుతి సుజుకీ ఇండియా ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యువత కార్లను కొని, ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లించేందుకు ఇష్టపడడం లేదని, దీనికి బదులు వారు ట్యాక్సీ సేవల వైపు మొగ్గుతున్నారని మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం చేసిన ప్రకటన పెద్ద చర్చకే తావిచి్చంది. ఓలా, ఉబెర్ అంశం ప్రస్తు్తత మందగమనానికి పెద్ద కారకం కాదన్నారు శ్రీవాస్తవ. ‘‘ఓలా, ఉబెర్ గత ఆరు, ఏడేళ్లుగా మార్కెట్లో ఉన్నాయి. ఈ సమయంలో ఆటో పరిశ్రమ అత్యుత్తమ ప్రదర్శన చవిచూసింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా, ఉబెర్ వల్లేనని ఆలోచించకండి’’ అని శ్రీవాస్తవ అన్నారు. అమెరికాలో ఉబెర్ బలమైన ప్లేయర్‌గా ఉన్నప్పటికీ, అక్కడ కార్ల విక్రయాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆకాంక్ష మేరకే... ‘‘భారత్‌లో 46 శాతం మంది కార్లు కొనే వారు, మొదటి సారి కొనుగోలుదారులే. ఇది కారు కొనాలన్న వారి ఆకాంక్షల వల్లే. ప్రజలు ఓలా, ఉబెర్ ద్వారా వారం రోజులు ప్రయాణించినా కానీ, వారాంతంలో కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు’’ అని శ్రీవాస్తవ చెప్పారు. ఆటో మార్కెట్ మందగమనానికి ఎన్నో కారణాలున్నాయని శ్రీవాస్తవ అన్నారు. మార్కెట్లో లిక్విడిటీ (నిధులు/రుణాలు) కొరత, నియంత్రణపరమైన అంశాల వల్ల (భద్రతా ఫీచర్ల అమలు వంటి) ఉత్పత్తుల ధరలు పెరగడం, అధిక పన్నులు, బీమా ప్రీమియం రేట్లు పెరగడాన్ని కారణాలుగా పేర్కొన్నారు. గత నెల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలు దీర్ఘకాలానికి పరిశ్రమకు మేలు చేసేవని, ప్రస్తుత మందగమనానికి బ్రేక్ వేసేందుకు చాలవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న పండుగల అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాను ఆయన ప్రకటించారు. -
ఓలా క్యాబ్ అంటూ ప్రైవేటుకారులో...
శంషాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ప్రయాణికులను ఎక్కించుకుని అనుమానాస్పదంగా వెళ్లిన కారును కుటుంబసభ్యులు వెంబడించి అడ్డుకున్నారు. ముంబైకి చెందిన శ్రీనాథ్, అతని కుటుంబసభ్యులు నగరంలో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని కలవడానికి ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. రెండు ఓలా క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. ముందుగా వచ్చిన ఓలా క్యాబ్‌లో శ్రీనాథ్, అతడి భార్య, మరొకరు కూర్చున్నారు. వీరి కుటుంబంలోని యువతితోపాటు బాలిక, బాలుడు మరో ఓలా క్యాబ్ కోసం బస్టాప్ వద్ద వేచి ఉన్నారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు డ్రైవర్.. ఓలా క్యాబ్ అని చెప్పి వారిని ఎక్కించుకున్నాడు. క్యాబ్ ముందుకెళుతున్న సమయంలో ఓటీపీ చెబుతానని యువతి అనడంతో అక్కర్లేదని క్యాబ్ డ్రైవర్ తిరస్కరించాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులోకి అతడి స్నేహితుడు ఎక్కాడు. యువతి అనుమానించి కారును నెమ్మదిగా తీసుకెళ్లమని చెప్పినా డ్రైవర్ వినిపించుకోకుండా వేగం పెంచాడు. ఆమె వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి డ్రైవర్ తీరు అనుమానాస్పదంగా ఉందని అప్రమత్తం చేసింది. దీంతో వారు ఆ కారును వెంబడించి ఓవర్ టేక్ చేశారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద కారును ఆపి యువతితోపాటు బాలిక, బాలుడిని అందులో నుంచి దించారు. అయితే, డ్రైవర్ పరార్ కాగా కారులో ఉన్న అతడి స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌నకు యత్నించిన కారు డ్రైవర్ రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన కిషన్ అని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఆటో, క్యాబ్ ఎక్కితే ఇక అంతే... అడ్డంగా దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో : కొద్ది రోజుల క్రితం నాంపల్లి విజయనగర్ కాలనీకి చెందిన ఒక ప్రయాణికుడు తమ ఇంటి నుంచి 25.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంపల్లి జయభేరీ కాలనీ వరకు ఓలా క్యాబ్‌లో ప్రయాణం చేశారు. సాధారణంగా ఆ దూరానికి రూ.700 చార్జీ కంటే ఎక్కువ ఉండదు. కానీ సదరు క్యాబ్ సంస్థ రూ.936 చార్జీ విధించింది. దీనిపై అతడు ఓలా సంస్థకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక కిలోమీటర్‌కు రూ.36.85 చొప్పున అధిక చార్జీలు విధించడాన్ని ప్రశ్నించారు. దీంతో ఓలా సంస్థ వెంటనే దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులోంచి రూ.219 లు తిరిగి ఆయన ఖాతాలో జమ చేసింది. చార్జీలు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికుడు గమనించడం వల్ల ట్విట్టర్లో ప్రశ్నించగలిగారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే క్యాబ్ సంస్థల నిలువు దోపిడీకి గురవుతున్నారు. ♦ ఇటీవల లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి మెహదీపట్నం వరకు బయలుదేరిన ఒక ప్రయాణికుడు ఏకంగా రూ.1200 చార్జీ చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థల్లో చార్జీలు తరచుగా మారుతూ ఉంటాయి. రద్దీ వేళల్లో ఎక్కువగా, రద్దీ లేని సమయాల్లో తక్కువగా ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా రద్దీ ఉన్నా, లేకున్నా అన్ని వేళల్లోనూ అత్యధిక చార్జీలు నమోదవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము తక్కువ చార్జీలతో ప్రయాణించిన దూరంలోనూ అత్యధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ♦ క్యాబ్‌ల పరిస్థితి ఇలా ఉంటే వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆటోవాలాల నిలువు దోపిడీ కొనసాగుతోంది. కేవలం 1.5 కిలోమీటర్ల దూరానికి రూ.50 కనీస చార్జీ వసూలు చేస్తున్నారు. ఏ ఒక్క ఆటోలోనూ మీటర్ పని చేయడం లేదు. ఒక రకంగా ఆటోడ్రైవర్లు గత 3 ఏళ్లుగా మీటర్ల వ్యవస్థకు చరమగీతం పాడేశారు. పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూబ్లీబస్‌స్టేషన్ వరకు 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. రవాణాశాఖ నిర్ణయించిన చార్జీల ప్రకారం రూ.50 లోపే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ ఆటో ఎక్కినా రూ.200 డిమాండ్ చేస్తున్నారు. బేరమాడితే రూ.150 వరకు దిగొస్తున్నారు. నగరానికి కొత్తగా వచ్చే వాళ్లయితే రూ.200 పైనే సమర్పించుకోవలసి వస్తుంది. ఆ ఒక్క రూట్లోనే కాదు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రయాణికుడి జేబుకు కన్నం వేస్తున్నాయి. దూరంతో నిమిత్తం లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక చార్జీల్లో క్యాబ్‌లతో పోటీపడుతున్నాయి. క్యాబ్‌లకు కళ్లెంవేసేదెవరు... గతంలో ట్యాక్సీల చార్జీల నియంత్రణ ఆర్టీఏ పరిధిలో ఉండేది. కానీ ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థలు రవాణా రంగంలోకి ప్రవేశించిన తరువాత ఆర్టీఏ పరిధిలోంచి ఎగిరిపోయాయి. ఎంత దూరానికి ఎంత చార్జీ చెల్లించాలనేది క్యాబ్ సంస్థల ఖాతాలోకి చేరిపోయింది. మొదట్లో అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకున్న క్యాబ్‌లు క్రమంగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆర్టీఏ మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు గతంలో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున మీటర్ రీడింగ్‌పైన చెల్లించే వెసులుబాటు ఉండేది. మీటర్ ట్యాంపరింగ్ చేసి అధిక చార్జీలు వసూలు చేసే డ్రైవర్లపైన రవాణా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టేవారు. కానీ ఓలా, ఉబెర్ల రాకతో ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైగా ఆ సంస్థల కాల్‌సెంటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రయాణికులకు అందుబాటులో లేవు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 50 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నాయి. ఒక్క శంషాబాద్ విమానాశ్రయ మార్గంలోనే ప్రతి రోజు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 10 లక్షల మంది ప్రయాణికులు క్యాబ్‌ల సేవలను వినియోగిస్తున్నారు. ఇలాంటి క్యాబ్ సర్వీసులు రవాణాశాఖ పరిధిలో లేకపోవడంతో చార్జీలు అడ్డు,అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 5 ఏళ్ల నాటి ఆటో మీటర్లే .... గ్రేటర్లో సుమారు 1.3 లక్షల ఆటోలు ఉన్నాయి. వీటి చార్జీల నిర్ణయం పూర్తిగా ప్రభుత్వం పరిధిలోనే ఉంది. 5 ఏళ్ల క్రితం మొదటి 1.6 కిలోమీటర్ల దూరానికి రూ.20, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున చార్జీలు విధిస్తూ జీవో విడుదల చేశారు. కానీ ఇది ఎంతో కాలం కొనసాగలేదు. ఏడాది తిరగకుండానే ఆటోడ్రైవర్లు క్రమంగా మీటర్లకు స్వస్తిచెప్పి అడ్డగోలు వసూళ్లకు దిగారు. కొందరు మీటర్లను ట్యాంపర్ చేశారు. ఇప్పుడు మీటర్ ప్రస్తావన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆటోమీటర్లపైన, చార్జీలపైన ఆర్టీఏ నియంత్రణ కోల్పోవడం ఒక కారణమైతే ఈ ఐదేళ్లలో పెరిగిన డీజిల్, సీఎన్జీ ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీలను సవరించి గట్టి నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతిమంగా సామాన్య ప్రయాణికులే నిలువుదోపిడీ గురవుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు ఆటోచార్జీలపైన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం మానేశారు. గతంలో ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేవారు. ఇక ఆర్టీఏ కూడా ఆటోలపైన నియంత్రణ కోల్పోయింది. ఆటో ఎక్కాలంటేనే భయమేస్తుంది. చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు. – కృష్ణ, సికింద్రాబాద్ మీటర్ల వ్యవస్థను పునరుద్ధరించాలి క్యాబ్‌లలోనూ, ఆటోల్లోనూ మీటర్లను పునరుద్ధరించాలి. వీటి నిర్వహణ కోసం రవాణాశాఖలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.దీనివల్ల ఇటు డ్రైవర్లకు, అటు ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఉబెర్. ఓలా వంటి సంస్థల వల్ల డ్రైవర్లకు పెద్దగా ప్రయోజనం లేదు. ఆ సంస్థలు మాత్రమే దండుకుంటున్నాయి. డ్రైవర్లు అప్పులు చేసి చివరకు రోడ్డున పడాల్సి వస్తుంది. – షేక్ సలావుద్దీన్, అధ్యక్షులు, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసిసియేషన్ -
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఓలా క్యాబ్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం ఓలా కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి ముఖ్యమంత్రి రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గేటును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు స్వల్పంగా గాయలయ్యాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ప్రమాదానికి గురైన కారును తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళపై క్యాబ్ డ్రైవర్ అనుచిత ప్రవర్తన
సాక్షి బెంగళూరు: మహిళా ప్రయాణికురాలిపై అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను ‘ఓలా క్యాబ్స్’ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ముంబైకి చెందిన ఒక కంపెనీ సీఈవో ఆకాంక్ష పూజారి ఈ నెల 10న అర్ధరాత్రి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు నగరానికి ఓలా క్యాబ్ ద్వారా బయలుదేరారు. ఈ సమయంలో గూగుల్ మ్యాప్ సూచించిన రూట్లో కాకుండా వేరే దారిలో వెళ్లడాన్ని గమనించిన ఆకాంక్ష.. మ్యాప్ప్రకారమే వెళ్లాలని డ్రైవర్‌కు సూచించింది. అయితే ఆమె సూచనలను డ్రైవర్ బేఖాతరు చేస్తూ క్యాబ్‌ను మధ్యలోనే నిలిపేసి ‘వస్తే రండి... లేకపోతే దిగిపోండి’ అంటూ పరుషంగా మాట్లాడాడు. డ్రైవర్ ప్రవర్తనతో విస్తుపోయిన ఆకాంక్ష వెంటనే ఓలా సహాయవాణి బటన్‌ను నొక్కింది. ఆ వెంటనే ఓలా సహాయవాణి నుంచి ఫోన్ వచ్చింది. ఆకాంక్షతో మాట్లాడి ఆమె ఫిర్యాదును సహాయవాణి తీసుకుంది. అనంతరం హెల్ప్‌లైన సిబ్బంది ఒకరు డ్రైవర్‌తో మాట్లాడి మహిళకు కూడా ధైర్యం చెప్పారు. మిమ్మల్ని సురక్షితంగా తమ డ్రైవర్ గమ్యస్దానానికి చేరుస్తారని, కారు సంచరించే మార్గాన్ని కూడా ట్రాక్ చేస్తామని, ఒకవేళ రూట్ మారిస్తే మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తామని ఆకాంక్షకు సహాయవాణి సిబ్బంది ఒకరు తెలిపారు. వారి హామీతో సదరు మహిళ ప్రయాణం కొనసాగించింది. అయితే మరోసారి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ కారు నడుపుతుండడంపై ఆకాంక్ష అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో మరోసారి హెల్ప్‌లైన్ సెంటర్ ప్రతినిధి డ్రైవర్‌కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ప్రయాణికురాలు గమ్యం చేరే వరకు కాల్ కట్ చేయకుండా డ్రైవర్‌కు సూచనలు చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు సైతం ఆకాంక్ష ఫోన్ చేసి కారు నంబర్ తెలియజేసింది. ఈ విషయానంతా సదరు ప్రయాణికురాలు ట్వీటర్లో తెలిపారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. డ్రైవర్ ప్రవర్తనతో ప్రయాణికురాలు పడిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు ఓలా ప్రతినిధి తెలిపారు. ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వెంటనే డ్రైవర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు వెల్లడించారు. తమకు తమ ప్రయాణికుల భద్రతే తొలి ప్రాధాన్యమని తెలిపారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైన పరిష్కరించేందుకు అన్నివేళల తమ అత్యవసర సేవా సిబ్బంది సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది కలిగిన ఓలా యాప్‌లో అత్యవసర బటన్ నొక్కగానే తమ సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. -
లారీ ఢీ.. నుజ్జునుజ్జయిన ఓలా క్యాబ్
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌజ్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముందుగా వెళ్తున్న ఓలా క్యాబ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్పైన తెల్లవారు జాము మూడు గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. AP02U6023 నెంబరు గల లారీ ముందుగా వెళ్తున్న హ్యుండాయ్ కారు (TS10UB1830)ను వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుమన్నామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓలా.. ఉలాలా!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఓలా క్యాబ్‌లు పరుగులు తీస్తున్నాయి. ప్రధాన రవాణా కేంద్రాల నుంచి చివరి మైలు వరకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రవేశపెట్టిన క్యాబ్ సేవలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సుమారు 3 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు చివరి మైలు క్యాబ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లు అంచనా. ఇందుకోసం సుమారు 25 వేల క్యాబ్‌లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నగరంలో ప్రతిష్టాతక్మంగా ఏర్పాటు చేసిన మెట్రో రైలు సేవలను అన్ని వర్గాల ప్రయాణికులకు చేరువచేసేందుకు మెట్రో కారిడార్లకు రెండు వైపులా అన్ని కాలనీలకు, ప్రధాన ప్రాంతాలకు చివరి మైలు కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ఈ మేరకు సిటీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో చేరువకాలేకపోయాయి. ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు అవసరమైన లాస్ట్‌మైల్ కనెక్టివిటీని ఓలా సద్వినియోగం చేసుకుంది. దీంతో అదేస్థాయిలో ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నట్లు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. ఎలాంటి కాలయాపన లేకుండా క్యాబ్ బుక్ చేసుకొన్న రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికుడికి అందుబాటులోకి వచ్చే విధంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ హబ్‌లలో కియోస్క్‌లు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 8 వేలకుపైగా క్యాబ్‌లు, ట్రావెల్స్ వాహనాలు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. సుమారు 40 వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందుకోవడంలో ఓలా ప్రవేశపెట్టిన కియోస్క్‌లు, ఓలా జోన్లు సత్ఫలితాలనిచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. విమానం దిగిన ప్రయాణికుడు నేరుగా ఓలా కియోస్క్ వద్దకు వచ్చి తన మొబైల్ నంబర్, వెళ్లాల్సిన గమ్యస్థానం చెబితే చాలు కేవలం రెండు నిమిషాలలోపే క్యాబ్ వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ఓలా వైపు మొగ్గు చూపుతున్నారు. ఓలా జోన్లలో 24 గంటల పాటు క్యాబ్‌లు ఉండేలా జాగ్రత్తలు పాటించడంతో ప్రయాణికులకు ఏ సమయంలోనైనా కోరిన వెంటనే క్యాబ్ లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఇది తమ సంస్థను ప్రయాణికులకు బాగా చేరువ చేసిందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కియోస్క్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి ఎయిర్‌పోర్టు వర్గాలతో కుదుర్చుకున్న అవగాహన సైతం క్యాబ్ సర్వీసుల పెంపునకు దోహదం చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్‌ల వద్ద ఓలా సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తారు. తమ మొబైల్ ఫోన్లలో ఓలా యాప్ నుంచి బుక్ చేసుకోలేని ప్రయాణికులకు కియోస్క్‌లలో బుకింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే క్యాబ్ బుక్ చేసిన క్షణాల్లోనే వచ్చి వాలుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు లక్షా 80 వేల మంది రాకపోకలు సాగిస్తారు. కనీసం 25 వేల మంది వరకు ఓలా సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి కూడా ఓలా కియోస్క్ ఆధారిత క్యాబ్ సర్వీసులకు చక్కటి ఆదరణ లభిస్తోంది. వీటితో పాటు జూబ్లీ, మహాత్మాగాంధీ బస్స్టేషన్లు, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, లక్డీకాపూల్ వంటి ప్రధాన ప్రయాణ కూడళ్లు ఓలా సర్వీసులకు కేంద్రంగా మారాయి. ఎంజీబీఎస్‌లో కూడా ఓలా జోన్, ఓలా కియోస్క్ ఏర్పాటు చేశారు. త్వరలో మరిన్ని సర్వీసులు.. మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు, ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు ప్రస్తుత మెట్రో కారిడార్‌లో, ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మార్గంలోనూ లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి చేపట్టిన చర్యలు ఫలితాలలిస్తున్న నేపథ్యంలో తమ క్యాబ్ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు ఓలా కమ్యూనికేషన్స్ ప్రతినిధి అమోఘ్ తెలిపారు. ‘దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా హైదరాబాద్‌లో ఓలా క్యాబ్ పరుగులు తీస్తోంది. ఎప్పటికప్పుడు ప్రయాణికుల డిమాండ్, అభిరుచికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. మరికొద్ది నెలల్లో ఎలక్ట్రిక్ క్యాబ్‌లను కూడా హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. -
ఓలాలో బెంగళూరు-నార్త్‌కొరియా..
న్యూఢిల్లీ : ఎప్పుడైనా ఓలా క్యాబ్‌ను ఒక దేశం నుంచి మరో దేశానికి బుక్ చేసుకుని చూశారా? అసలు ఆ సర్వీసులను ఓలా క్యాబ్ ఆఫర్ చేస్తోందో లేదో తెలుసా? అదే పరీక్షించాలనుకున్నాడు బెంగళూరుకు చెందిన ఓ విద్యార్థి. ప్రపంచంలో అత్యంత రహస్యమైన, కఠిన నియంత్రిత దేశాలలో ఒకటిగా పేరున్న ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్‌ను బుక్ చేశాడు. అయితే ఎక్కడి నుంచి బుక్ చేశాడో తెలుసా? బెంగళూరులోని తన ఇంటి నుంచి ఉత్తర కొరియాకు తన ఓలా రైడ్‌ను బుక్ చేశాడు. ఈ డ్రైవ్‌ను ఓలా కూడా ఓకే చేసింది. అంచనా ఛార్జీగా లక్షా 49వేల రూపాయలను చూపించింది. ‘ఉత్తర కొరియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ట్రెండ్ అయ్యే దేశాల్లో ఒకటి. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు రోడ్ కనెక్టివిటీని గూగుల్ మ్యాప్స్‌లో చెక్ చేయకుండా డైరెక్ట్‌గా ఓలా యాప్‌ను ఓపెన్చేశా. అక్కడ క్యాబ్ బుకింగ్ ఆప్షన్ కనిపించింది. నిజంగా అది చూసి నేను చాలా షాక్ అయ్యా’ అని బెంగళూరు యువకుడు ప్రశాంత్ షాహి అన్నాడు. రైడ్ ఓకే చేయడంతో, క్యాబ్ కంపెనీ కూడా తాను చేసిన రైడ్‌ను ఓకే చేసి, డ్రైవర్ వివరాలను పంపిందని తెలిపాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ రోడ్డు ట్రిప్‌కు లక్షా 49వేల 88 రూపాయలుగా చూపించిందని చెప్పాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఎన్డీటీవీకి షేర్చేశాడు. అంతేకాక తన ట్విటర్ అకౌంట్లో ఈ ట్రిప్‌కు సంబంధించిన వివరాలను కూడా పోస్టు చేశాడు. నిమిషాల వ్యవధిలోనే ఈ ట్వీట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్‌లో ట్రిప్ ఎలా సాధ్యమవుతుంది? ఓలా మీ సిస్టమ్స్‌ను ఒక్కసారి చెక్ చేసుకోండంటూ స్పందనలు వస్తున్నాయి. ఈ ట్వీట్లకు స్పందించిన ఓలా క్యాబ్ కంపెనీ, తన సిస్టమ్‌లో టెక్నికల్ సమస్య ఏర్పడిందని, ఒక్కసారి యూజర్ తన ఫోన్‌ను రీస్ట్రాట్ చేసుకోవాలని సూచించింది. ఓలా క్యాబ్ సిస్టమ్‌లో ఇలా టెక్నికల్ సమస్య ఏర్పడటం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది కూడా ముంబైలో ఒక నిమిషం రైడ్‌కు ఓ వ్యక్తికి 149 కోట్ల బిల్లు వేసింది. -
ఐఆర్సీటీసీలో కొత్త సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్ ఓలాతో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐఆర్సీటీసీ వైబ్‌సైట్, యాప్ ద్వారా కూడా ఓలా క్యాబ్ సేవలను పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సోమవారం ప్రకటించింది. ఆరు నెలల పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించినట్టుగా తెలిపింది.. తాజా ఒప్పందం ప్రకారం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ లో ఓలా క్యాబ్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఓలా యాప్‌లో అందుబాటులో ఉన్న ధరల్లోనే ఓలా మైక్రో, ఓలా మినీ, ఓలా ఆటో, ఓలా షేర్ సేవలను నేరుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. అంతేకాదు ఏడు రోజుల ముందు వరకు ప్రీ బుకింగ్ అవకాశం కూడా. రైల్వే స్టేషన్లలోని ఐఆర్సీటీసీ ఔట్లెట్ల ద్వారా ఓలా స్వీయ సేవలందిస్తున్న కియోస్క్ క్యాబ్‌లను బుక్ చేసుకునేందుకు కూడా ప్రయాణీకులను అనుమతి ఉందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్ డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. అలాగే అవసరమైతే నిరవధిక సమ్మకు దిగుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
సిడ్నీలో ఓలా ట్యాక్సీ సేవలు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు విస్తరించింది. ఇది తాజాగా సిడ్నీలోనూ సేవలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఓలా గత నెల పెర్త్‌లో సర్వీసులు ప్రారంభించడం ద్వారా ఆస్ట్రేలియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. కాగా కంపెనీ ఆస్ట్రేలియా మార్కెట్లోకి ప్రవేశిస్తామని జనవరిలోనే ప్రకటించింది. ఓలా ఇప్పుడు సిడ్నీలో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి, డ్రైవర్ పార్ట్నర్స్కు సపోర్ట్ ఇవ్వడానికి స్థానికంగా టీమ్‌ను కూడా నియమించుకుంది. ‘డ్రైవర్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించాం. కొత్త టెక్నాలజీ, శిక్షణ ద్వారా వారికి మద్దతునిస్తాం. ఆదాయ పెంపునకు మార్గాలను అన్వేషిస్తాం’ అని సంస్థ తెలిపింది. కాగా ఆస్ట్రేలియా మార్కెట్లో ఓలాకు ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి. ఉబెర్ 2012లోనే ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించింది. -
ఓలా మాజీ డ్రైవర్ అరెస్ట్
సాక్షి, ముంబయి: థానే జిల్లాలో 32 ఏళ్ల యువతిపై దోపిడీ, అత్యాచారానికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ కషిమిరా నుంచి థానేకు ప్రయాణిస్తుండగా వీరు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.నిందితులిద్దరినీ పాండురంగ్ గొసావి, ఉమేష్ జస్వంత్‌లుగా గుర్తించారు. వీరిలో గొసావి ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. గొసావి గత వారం నుంచి డ్యూటీకి దూరంగా ఉన్నప్పటికీ కారుపై ఇప్పటికీ ఓలా స్టిక్కర్ ఉందని పోలీసులు తెలిపారు. కషిమిరా ప్రాంతం నుంచి థానే వెళ్లేందుకు ఈనెల 19 సాయంత్రం బాధితురాలు గొసావి క్యాబ్‌లో ఎక్కారు. క్యాబ్‌ను వజ్రేశ్వరి ప్రాంతానికి మళ్లించిన గొసావి అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమె నుంచి డబ్బు, మొబైల్ ఫోన్, పర్సును గుంజుకుని అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.క్యాబ్‌లో కూర్చున్న గొసావి స్నేహితుడు అతడికి సహకరించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.అనంతరం వారు బాధితురాలిని లాడ్జ్‌కు తీసుకురాని రాగా, తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆమె లాడ్జ్ మేనేజర్‌కు వివరించారని చెప్పారు. దీనిపై లాడ్జ్ మేనేజర్ నిందితులను నిలదీయగా వారు అక్కడినుంచి పరారయ్యారని తెలిపారు. మహిళ ఫిర్యాదుపై గొసావి, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అయితే సంఘటనతో తమకు సంబంధం లేదని ఓలా ఓ ప్రకటనలో పేర్కొంది.ఓలా ఫ్లాట్‌ఫాంపై ఈ నేరం జరగలేదని, విచారణ నిమిత్తం పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. -
రాత్రి 10.30కు ఎవ్వరు లేని చోట కారు ఆపి..
సాక్షి, బెంగళూరు : ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను బెంబేలెత్తించాడు. అసభ్యంగా తాకుతూ బెదిరిస్తూ ఆమెకు దాదాపు గుండె ఆగినంత పనిచేశాడు. అదృష్టవశాత్తు బయటపడిన బాధితురాలు ఆ రోజు రాత్రి తనకు కాలరాత్రి అంటూ తన భయానక అనుభవాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కంపెనీలో ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న 23 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి 10.30కు కంపెనీ రప్పించిన ఓలా కారులో ఎక్కింది. సరిగ్గా ఆగ్నేయ బెంగళూరు రింగ్ రోడ్డు వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో డ్రైవర్ కారును ఆపేశాడు. అప్పుడే ఆమె ఫోన్ బ్యాటరీ అయిపోవచ్చింది. అదే సమయంలో కారు ఆపిన డ్రైవర్ ఆమె కాళ్లను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ' ఆ రోజు రాత్రి రోడ్డుపై ఏ ఒక్కరూ లేరు. అతడు అనూహ్యంగా కారు ఆపగానే కారు అద్దంలో నుంచి బయటకు చూశా. అతడు నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. నేను అతడి బెదిరించాను. కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాను. వదిలేశాడు. ఓ ఆటో రిక్షా దొరికే వరకు నేను పరుగెత్తాను.అతడు నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టాను. నంబర్ బ్లాక్ చేశాను. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ఆమె వివరించింది. ఈ సంఘటనపై ఓలా సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేస్తామని హామీ ఇచ్చింది. -
క్యాబ్‌లో ప్రసవం...
పుణే: ఆసుపత్రికి వెళ్తుండగా ఓ మహిళ క్యాబ్‌లోనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసే వార్తను ఆ క్యాబ్ యాజమాన్యం ఓలా చెప్పింది. తన బిడ్డతో పాటు ఆమె తమ క్యాబ్‌లలో ఐదేళ్లపాటు ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రకటించింది. పుణేకు చెందిన 21 ఏళ్ల ఈశ్వరిసింగ్ విశ్వకర్మకు అక్టోబర్ 2న పురిటినొప్పులు ప్రారంభమవడంతో ఆమె భర్త ఓలా క్యాబ్‌ను బుక్ చేశారు. సోదరుడు, తల్లి ఆమె వెంట క్యాబ్‌లో ఉండగా వారి వెనకే ఈశ్వరిసింగ్ భర్త బైక్‌పై వెళ్లారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత క్యాబ్‌లోనే ఈశ్వరిసింగ్ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రికి వచ్చిన తరువాత వైద్యులు బిడ్డ బొడ్డతాడును తొలగించి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. తల్లీబిడ్డలు గురువారం డిశ్చార్జి అయ్యారు. -
300 మీటర్లకే.. రూ.149 కోట్ల క్యాబ్ బిల్లు
-
300 మీటర్లకే.. రూ.149 కోట్ల క్యాబ్ బిల్లు
న్యూఢిల్లీ: ముంబయికి చెందిన ఓ వ్యక్తికి క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గుండె ఆగిపోయేటంత పనిచేసింది. ఈ నెల (ఏప్రిల్) 1ని అతడి జీవితంలో మరిచిపోలేని రోజుగా మార్చేసింది. దాదాపు ఒక పెద్ద ఏప్రిల్ ఫూల్‌గా మార్చేసింది. అతడు క్యాబ్ ఎక్కకమునుపే ఏకంగా రూ.149 కోట్లను చెల్లించాలంటూ సమాచారం పంపించింది. దీంతో బిత్తరపోయిన ఆ వ్యక్తి వెంటనే సంస్థతో సంప్రదింపులు జరిపి సాంకేతిక పరిజ్ఞానలోపం అని తెలుసుకున్నాక కుదుటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సుశీల్ నర్సియాన్ అనే వ్యక్తి ఈ నెల (ఏప్రిల్) 1న ములుంద్ నుంచి వకోలా మార్కెట్‌కు వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే, అతడిని పికప్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ అడ్రెస్‌ను కనుక్కోలేకపోయాడు. ఎందుకంటే అతడి ఫోన్ ఆగిపోయింది. దాంతో నర్సియాన్ స్వయంగా క్యాబ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు. అయితే, ఒక 300 మీటర్లు ముందుకెళ్లాక డ్రైవర్ కారు ఆపేశాడు. తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో అతడు మరో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా రూ.1,49,10,51,648 బిల్లు ఇప్పటికే చెల్లించాల్సి ఉందని, ఆ కారణంగా క్యాబ్ బుక్ చేసుకోలేరని సందేశం వచ్చింది. అతడి ఓలా యాప్ వ్యాలెట్‌లో ఉన్న రూ.127ను కూడా డిడక్ట్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి వెంటనే సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేసి వివరాలు అడగగా అది టెక్నికల్ సమస్య అయ్యుంటుందని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో చర్చ జరిగింది. రూ.149కోట్లా.. ఓలా అతడిని ఎక్కడి తీసుకెళ్లింది.. నెప్ట్యూన్పైకా, ఫ్లూటో మీదకా అంటూ జోకులు విసిరారు. -
క్యాబ్ డ్రైవర్ల ఆందోళన: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించేందుకు క్యాబ్ డ్రైవర్లు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని.. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని, దానిని అడ్డుకోవడం సరికాదని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ తెలిపారు. -
నేటి నుంచి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష
-
నేటి నుంచి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. భారీ క్యాబ్ ర్యాలీతో ఇందిరా పార్కుకు చేరుకుంటామని, ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదన్నారు. రవాణా రంగంలోని ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగినప్పుడు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్పారు. ఈ రెండు సంస్థల్లోనే 80 వేల క్యాబ్‌లు నమోదై ఉన్నాయని, ఆ క్యాబ్‌లు నడిపే తామంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లమేనని అన్నారు. బతుకుదెరువు కోసం అప్పు చేసి కార్లు కొనుగోలు చేశామని, ఓలా, ఉబెర్ సంస్థల మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు ఆ సంస్థలు తమను నిలువుదోపిడీ చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపా లని కోరారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిరుద్యోగులు డ్రైవింగ్ నేర్చుకుని ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, ఉబెర్, ఓలా సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని క్యాబ్ డ్రైవర్లు కోరారు. ముంబై, బెంగళూరు తర హాలో క్యాబ్‌లకు డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేసి హేతుబద్ధమైన చార్జీల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు భద్రత కల్పించేలా ఎస్ఓఎస్ ఫోన్లను ఏర్పాటు చేయాలని, తద్వారా వెహికల్ ట్రాకింగ్‌కు అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడిన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సర్వేశ్వర్, సురేష్, రెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 4వ రోజూ ఆగిన క్యాబ్‌లు.. మంగళవారం నాలుగో రోజు కూడా ఉబెర్, ఓలా క్యాబ్‌లు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారు ఆటోలు, ఇతర సంస్థలకు చెందిన క్యాబ్‌లకు అధిక మొత్తంలో సమర్పించు కోవలసి వచ్చింది. -
శుక్రవారం అర్థరాత్రి నుంచి క్యాబ్‌లు బంద్...
-
క్యాబ్‌లను అడ్డుకుంటున్న ‘ఓలా’ డ్రైవర్లు
హైదరాబాద్: బంద్ పాటిస్తున్న ఓలా, ఉబర్ తదితర క్యాబ్‌ల డ్రైవర్లు ఇతర క్యాబ్‌లను కూడా అడ్డుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచి నగరంలో బంద్‌లో పాల్గొనని క్యాబ్‌లను ఇతర క్యాబ్‌ల డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా కిందికి దించేస్తున్నారు. నగరంలోని కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, సుచిత్ర తదితర అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. వీరి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
క్యాబ్‌లు బంద్...
- తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్– ఓనర్స్ అసోసియేషన్ పిలుపు - శుక్రవారం అర్థరాత్రి నుంచి నిలిచిపోయిన సేవలు హైదరాబాద్: తమ సమస్యలు వివరించేందుకు ఓలా క్యాబ్ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్‌ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కుందకోర్ తెలిపారు. అసోసియేషన్‌లో ఉన్న ఏడు వేల మందితో పాటు అన్ని సం ఘాల క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ కూడా బంద్ లో పాల్గొంటారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో శివ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఓలా, ఉబర్ కార్పొరేట్ సంస్థలు ప్రకటనలు చేసి నెలకు రూ.70 వేల నుండి రూ.లక్ష సంపాదించవచ్చని నమ్మబలికి ఈఎంఐ పద్ధతిలో కార్లు కొనేలా చేశారన్నారు. లక్ష మంది వరకు ఈ సంస్థల్లో డ్రైవర్లుగా కొనసాగుతున్నారని, తమకు సరి పడా వ్యాపారం ఇవ్వకుండా రోజుకో కొత్త స్కీం పెట్టి మానసిక వేదనకు గురిచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోలేక, ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు. ఎన్నోసార్లు ఆయా సంస్థల యాజమాన్యాల కు విన్నవించినా స్పందించలేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు సర్వేష్, రెడ్డి శ్యామ్, సురేష్, ప్రధాన కార్యదర్శి సత్య నారాయణ, పాల్గొన్నారు. -
మనసున్న డ్రైవర్..!
పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని ఎంతవరకూ అరికడుతుందో కానీ, సామాన్యులకు మాత్రం అంతులేని ఇక్కట్లు సృష్టిస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకూ అంతా డబ్బుతోనే.. అందులోనూ చిల్లరతోనే ముడిపడి ఉండటంతో కనీసం ఉదయాన్నే టీ కూడా తాగలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆఫీసులకు వెళ్లాలంటే..? అందులోకీ జేబులో ఐదువందలు, వెరుు్యనోట్లు తప్ప వేరే ఏమీ లేకపోతే.. ఢిల్లీకి చెందిన విప్లవ్ అరోరాకు ఎదురైన సమస్యలే మిమ్మల్నీ పలుకరిస్తారుు. కాకపోతే చిన్నతేడా.. విప్లవ్కు మనసున్న ‘విపిన్ కుమార్’ దొరికాడు. మరి మీకు..? మంగళవారం రాత్రి.. ట్రైన్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో కంగారుగా ఆఫీసు నుంచి వెలుపలికి వచ్చాడు ఆర్కిటెక్ట్ విప్లవ్. అప్పటికి కొన్ని గంటల క్రితమే ఐదువందలు, వెరుు్య రూపాయల నోట్లు ఎందుకూ పనికిరాని చిత్తుకాగితాలే అన్నారు ప్రధాని మోదీ. వ్యాలెట్ చెక్ చేసుకుంటే అన్నీ పెద్దనోట్లే కనిపించారుు విప్లవ్‌కి. ఇంటికి ఎలా వెళ్లాలో ఓ పట్టాన అర్థం కాలేదు. ఈ పెద్ద నోట్లు తీసుకునే సాహసం ఎవరూ చేయరు. మరి, ఎలా వెళ్లేది..? ఒకసారి ‘ఓలా మనీ’ చూసుకున్నాడు. ఓ రైడ్‌కు సరిపడా మనీ ఉంది అందులో. వెంటనే ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఓలా మనీతో పేమెంట్ చేస్తానని చెప్పి, క్యాబ్‌లో కూర్చున్నాడు. రైల్వే స్టేషన్ దిశగా కారును పోనిస్తున్నాడు డ్రైవర్ విపిన్ కుమార్. దారిలో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల్లో నల్లధనం, నోట్ల రద్దు కూడా వచ్చి చేరారుు. కొద్దిసేపటికి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది క్యాబ్. దిగబోతూ బిల్లు చూసుకున్నాడు విప్లవ్. మార్గమధ్యంలోనే ఓలా మనీ అరుుపోరుుందని గుర్తించారు విప్లవ్, విపిన్‌లు. తాను మిగతా మొత్తాన్ని డబ్బు రూపంలోనే చెల్లించాలి. కానీ, జేబులో ఒక్క వందనోటు కూడా లేదు. దీంతో విప్లవ్ ముఖంలో కంగారు మొదలైంది. అతడి పరిస్థితి గమనించిన ఓలా డ్రైవర్ విపిన్ కుమార్ చెప్పిన మాటలు ఈ రోజున ఫేస్బుక్లో అందరి గౌరవాన్నీ అందుకుంటున్నారుు. ‘‘మీ ట్రైన్ టైమ్ అవుతోంది వెళ్లిపోండి సార్. ఈ పనివల్ల నా కొచ్చేది తక్కువ మొత్తమే. కానీ, నేను దీన్ని నష్టపోవడానికి సిద్ధంగానే ఉన్నాను. దేశ అభివృద్ధి కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు కఠినమైనవైనా నేను గౌరవిస్తాను. మీరు కూడా సగటు మధ్యతరగతి మనిషే కదా.. వెళ్లిరండి’’ అన్నాడు. ఈ ఉదంతాన్ని ఓలా ఫేస్బుక్ పేజీలో విప్లవ్ కుమార్ రాసుకొచ్చాడు. ఇది చదివిన ఎందరో ఈ ఘటన నుంచి స్ఫూర్తి పొంది డ్రైవర్ విపిన్ మంచి మనసును కొనియాడారు. ఓలా యాజమాన్యం కూడా వెంటనే స్పందించి విపిన్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని, అతడు తమ భాగస్వామిగా ఉండటం గర్వకారణమని ప్రకటించింది. -
హైదరాబాద్-నిజమాబాద్ జర్నీ బిల్లు 9 లక్షలు
ఓలా క్యాబ్ లో జర్నీ చేసిన ప్యాసింజర్ బిల్లు చూసి అవాక్కయ్యాడు. వేలల్లో రావాల్సిన బిల్లు లక్షల్లో రావడంతో పేమెంట్ చేయనని తేల్చేశాడు. దీంతో దిగొచ్చిన ఓలా సిబ్బంది సవరించిన బిల్లును పే చేయాల్సి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రతీష్ శేఖర్ ప్రభుత్వ పనులపై ప్రైవేట్ కన్సల్టెంట్ గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఆగస్టు 24న హైదరాబాద్ నుంచి నిజమాబాద్ వెళ్లాడు. ఆ రోజు ఉదయం 8గంటలకు జూబ్లీహిల్స్ లో ఓలా క్యాబ్ లో బయలుదేరిన ఆయన నిజమాబాద్ లో పని ముగించుకుని తిరిగి అదేరోజు సాయంత్రం 5:15కి హైదరాబాద్ వచ్చేశాడు. బిల్లు ఎంత అని చూడగా మీటర్ రీడింగ్ రూ.9.15(9,15,887)లక్షల బిల్లు చూపించింది. బిల్లు చూసిన కస్టమర్ రతీష్ శేఖర్ తో పాటు క్యాబ్ డ్రైవర్ సునీల్ కుమార్ షాక్ తిన్నాడు. మొదటగా ఆయన ఎస్టిమేటెట్ బిల్లు చూడగా రూ.5వేలు అని వచ్చిందని, అయితే జర్నీ తర్వాత 9లక్షలు రావడంపై షాక్ తిన్నాడు. ఈ ధరతో రెండు ఇండికా కార్లు కొనుక్కోవచ్చునని తెలిపాడు. ప్రయాణించిన దూరం 450 కిలోమీటర్లు కాగా, మీటర్ రీడింగ్ మాత్రం 85,427కి.మీ అని చూపించింది. ఓలా క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించగా, దాదాపు అరగంట సమయం తీసుకున్న డ్రైవర్ అతడిని సముదాయించే యత్నం చేశాడు. మీటర్ రీడింగ్ లో డాట్(.) పడలేదని వాస్తవానికి బిల్లు 9157 వచ్చిందని, డాట్ లేకపోవడంతో 9,15,887 అని కంగారుపడ్డారని సర్దిచెప్పాడు. బిల్లు చెల్లించేందుకు శేఖర్ నిరాకరించగా, ఓలా సిబ్బందికి కాల్ చేశాడు. వారు ఫైనల్ గా బిల్లు రూ.4,812 రూపాయలు చెల్లించాలని సూచించారు. ఆ డబ్బులు చెల్లించి రతీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై ఓలా ప్రతినిధిని సౌమిత్ర చంద్ ను ప్రశ్నించగా, కంప్యూటర్ లో సాంకేతిక కారణంగా ఈ తప్పిదం జరిగిందని చెప్పి క్షమాపణ కోరారు. ఇక ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. -
మహిళా ప్యాసింజర్ని వీడియోలు తీసి..
న్యూఢిల్లీ: క్యాబ్ డ్రైవర్ల తీరు మారడం లేదు. పలు సంఘటనలు.. వాటి అనంతర పరిణామాలు ఇప్పటికే వెలుగుచూస్తున్నా కనీసం వాటిని చూసైనా తమ ఆలోచనలు మార్చుకోవడం లేదు. ఆఫీసుకు వెళ్తున్న ఓ మహిళ ఉద్యోగిని తన ఫోన్లో వీడియో తీస్తూ ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ తప్పిదానికి పాల్పడ్డాడు. అసభ్యంగా మాటలంటూ.. ఆమెను చూసి తప్పుడు సంకేతాలు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె చాణక్యపురిలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లేందుకు ఓ ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుంది. అయితే వాళ్లు వెళుతుండగా అతడు కార్లోని అద్దంలో చూస్తూ ఫోన్లో కెమెరా ఆన్ చేసి వీడియో తీయడం ఆమె గమనించింది. ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నిస్తే తాను ఫొటోలు తీయడం లేదని తన కూతురు ఫొటోలు చూస్తున్నానని అబద్ధం చెప్పాడు. దీంతో ఆమె అతడి చేతిలో నుంచి ఫోన్ లాక్కోని చూడగా అందులో ఆమె కొన్ని ఫొటోలు, వీడియోలు దర్శనం ఇచ్చాయి. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ పోలీసులకు చెప్పింది. అసలు ఇలాంటి డ్రైవర్లను ఎలా పెట్టుకుంటారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నైజీరియన్ యువతి అరెస్ట్
గత నెల 30న ఓలా క్యాబ్ డ్రైవర్‌పై ఆరుగురు ఆఫ్రిక న్లు దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి నైజీరియాకు చెందిన జానెట్(26) అనే యువతిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో రువాండాకు చెందిన కెఫా అనే మహిళను ఘటన జరిగిన రోజునే అరెస్టు చేశారు. వీరివురు నిందితులు తమ వీసా గడువు ముగిసినప్పటికే దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, కెఫా ఇదివరకే ఒకసారి బెంగళూరులో అరెస్టు అయ్యిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జానెట్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం...గత 30న ద్వారక వెళ్లేందుకు కెఫా, జానెట్లు ఓలా సర్వీసెస్‌కు చెందిన క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్ రాజ్పూర్ ఖుర్ద్ వచ్చేసరికి ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అతడి కోసం వేచిచూస్తున్నారు. వారందరూ మద్యం తాగి ఉన్నారని డ్రైవర్ ఆరోపించాడు. నలుగురి కంటే ఎక్కువ మంది క్యాబ్‌లో తీసుకెళ్లేందుకు కుదరదని అతడు చెప్పడంతో వారితో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఆఫ్రికన్లు తనని తీవ్రంగా కొట్టారని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ నలుగురు నిందితులను కూడా గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతికి 'ఓలా' డ్రైవర్ ఘోరమైన మెసేజ్!
బెంగళూరు: ఓ బెంగళూరు యువతి ఇటీవల 'ఓలా' క్యాబ్‌ను బుక్ చేసుకుంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కొంతసేపటికే ఆమె తన బుకింగ్‌ను రద్దు చేసుకుంది. దీంతో 'ఓలా' నుంచి ఈ మేరకు ఆమెకు ఓ మెసేజ్ కూడా వచ్చింది. కానీ, బుకింగ్ రద్దవ్వడంతో చికాకు పడ్డ 'ఓలా' క్యాబ్ డ్రైవర్ మాత్రం ఆమెకు ఫోన్‌కాల్ చేశాడు. ఆమె ఎత్తలేదు. దీంతో రెచ్చిపోయిన అతడు నీచంగా తిడుతూ మెసేజ్ చేశాడు. ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడిస్తూ 'ఓలా' కాబ్స్ సపోర్ట్ ఖాతాకు ట్యాగ్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన 'ఓలా' క్యాబ్ సంస్థ సదరు డ్రైవరుపై వెంటనే చర్యలు తీసుకుంది. సంస్థతో అతని కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ అసభ్యమైన చర్యకుగాను అతనిపై చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. అయితే బెంగళూరు యువతి చేసిన ఈ ట్వీట్ మాత్రం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. డ్రైవరు అసభ్య ప్రవర్తన ఎత్తిచూపడంలో ఆ యువతి చూపిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. Had to cancel my cab 2 mins after booking yesterday because of an issue.This is how @Olacabs drivers respond to you. pic.twitter.com/b5F2Beoqwy — Micheℒℒe (@Micha_Alvez) February 6, 2016 -
క్యాబ్‌లో మహిళపై అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో క్యాబ్ డ్రైవర్.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ.. ఈ నెల 29న ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను తీసుకుంది. డ్రైవర్ దీపక్ బమానె కొంతదూరం వెళ్లాక క్యాబ్‌ను ఆపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను హెచ్చరించి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. జనవరి 1న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే నివస్తున్నాడని, అతనికి ఆమె తెలుసని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.