హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్స్ పరిశ్రమలో రైడర్లకు సర్‌చార్జీ భారం తప్పనుంది. జీరో సర్‌చార్జీతో మార్కెట్లోకి ప్రైడో క్యాబ్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 14 వేల మంది డ్రైవర్లు నమోదయ్యారని, ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రైడో క్యాబ్స్ ఫౌండర్ అండ్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు గురువారం ఇక్కడ తెలిపారు. వచ్చే 6 నెలల్లో న్యూఢిల్లీ, బెంగళూరులకు, ఏడాదిలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ మూడు కేటగిరీల్లో వాహనాలు అందుబాటులో ఉంటాయని, 3నెలల్లో 10 లక్షల రైడ్స్‌ను లకి‡్ష్యంచామన్నారు. ప్రోత్సా హకాల పేరిట డ్రైవర్ల మీద ఒత్తిడి ఉండదని, బిల్లింగ్, ఇన్‌వాయిస్‌లలో పారదర్శకత ఉంటుం దని డైరెక్టర్ శ్రీకాంత్ చింతలపాటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment