Cab Services
-
చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ
క్యాబ్ సర్వీస్ అనగానే అందరికి ఓలా, ఉబర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. ఈ కంపెనీలకు ధీటుగా పోటీ ఇస్తున్న బ్లూస్మార్ట్.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో మంచి సక్సెస్ చవి చూస్తోంది. ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొని కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరు, కంపెనీ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బ్లూస్మార్ట్ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' బ్లూస్మార్ట్ ప్రారంభించడానికి ముందే సొంత వెంచర్లను ప్రారంభించి, ఒకదాంట్లో విజయం పొందలేకపోయినట్లు గతంలోనే వెల్లడించారు. ప్రారంభంలో గుజరాత్లో 20 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పి, దానిని సౌదీ ప్లేయర్‌కు 68 మిలియన్ డాలర్లకు, మహారాష్ట్రలోని మరో 70 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను 55 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు గోయల్ తెలిపారు. పునీత్ గోయల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ బిజినెస్ స్కూల్ నుంచి డబుల్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తరువాత గ్రీన్ ఎనర్జిలోకి ప్రవేశించారు. క్లీన్ ఎనర్జీ ఆలోచన తన జీవితాన్ని మార్చేసినట్లు గోయల్ ఒక సందర్భంలో వెల్లడించారు. బర్మింగ్‌హామ్‌లో చదువుకునే రోజుల్లో గోయల్ క్లీన్ ఎనర్జీ గురించి చదివినట్లు, ఇది తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి.. భారతదేశంలో సోలార్ ఫ్యానెల్ తయారీదారులను కలుసుకుని కొన్ని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో సోలార్ ఫ్యానెల్స్ తయారు చేసి, ఐరోపాకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. గోయల్ చదువు పూర్తయ్యే సమయానికి సోలార్ ఎనర్జీ అనేది అతి పెద్ద మార్కెట్. దీనిని అదనుగా తీసుకుని, సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. అతని తాత 'పురుషోత్తమ్ లాల్ గోయల్' పేరు మీదుగా PLG పవర్ ఏర్పాటు చేసాడు. 2008లో ప్రారంభమైన కంపెనీ 2012 వరకు సజావుగా ముందుకు సాగింది. ఆ తరువాత యూరప్‌లో సోలార్ ప్యానెల్ మార్కెట్ పడిపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో మొదటి వెంచర్ మూసివేయాల్సి వచ్చింది. మొదటి వెంచర్ మూసివేసిన తరువాత, గుజరాత్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడంతో మరో సువర్ణావకాశం లభించింది. ఆ సమయంలో 2 MW పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. దానిని రెండు సంవత్సరాలు నిర్వహించి, ఆ తరువాత ఒక పెద్ద సౌదీ కంపెనీకి విక్రయించేశారు. బ్లూస్మార్ట్ ఆలోచన.. రెండు వెంచర్లు ప్రారంభించి విక్రయించిన తరువాత.. హైపర్‌లూప్ వన్ సీఈఓ షెర్విన్ పిషెవార్.. వర్జిన్ హైపర్‌లూప్ సీఈఓ బ్రెంట్ కల్లినికోస్ను లాస్ వెగాస్‌లో కలిసిన తరువాత ఈ బ్లూస్మార్ట్ ఆలోచన వచ్చినట్లు గోయల్ తెలిపాడు. 2019లో ప్రారంభమైన బ్లూస్మార్ట్ భారతదేశంలోని మొదటి ఆల్ ఎలక్ట్రిక్ షేర్డ్ స్మార్ట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎంజి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా ఎలక్ట్రిక్ కాలు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను బ్లూస్మార్ట్‌లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌లో పునీత్ గోయల్ చేసిన కృషికి జనవరి 2023లో UK ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్, NISAU UK 'ఇండియా-UK 75 ఎట్ 75 అచీవర్స్' అవార్డును, జూలై 2022లో UKలోని ఆస్టన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందించింది. -
క్యాబ్‌లలో ఈ స్ట్రాటజీ గురించి తెలుసా? ఇలా చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు!
అదనపు ఆదాయం కోసం మన దేశంలో ఆయా రైడ్ హైరింగ్ సంస్థల్లో పార్ట్‌టైం, లేదంటే ఫుల్ టైం డ్రైవర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు ఎంత సంపాదిస్తుంటారు? ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? రైడ్ షేరింగ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ 2013 ఆగస్ట్ నెలలో భారత్‌లో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2023 ఆగస్ట్ నెలలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఉబర్ కంపెనీలో ఫుల్‌టైం, పార్ట్‌టైం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు 2013 ఆగస్ట్ నుంచి 2023 ఆగస్ట్ వరకు మొత్తం 3,300 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించి కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. ఫలితంగా ఈ పదేళ్ల కాలంలో దేశీయంగా ఉన్న ఉబర్ డ్రైవర్ల మొత్తం సంపాదన సుమారు రూ.50 వేలకోట్లు సంపాదించారు. ఆ మొత్తంలో కస్టమర్ల ఉబర్ డ్రైవర్లకు టిప్కింద ఇచ్చిన మొత్తం రూ.300 కోట్లు సంపాదించినట్లు ఉబర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పైన పేర్కొన్న డేటా అంతా ఉబర్ అధికారికంగా విడుదల చేస్తే.. రైడ్ హైరింగ్ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు కాస్త తెలివి తేటలు ఉపయోగించి ఏడాదిలో భారీ మొత్తంలో సంపాదించవచ్చని అంటున్నాడు అమెరికాకు చెందిన ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆ స్ట్రాటజీతో అమెరికాలో అంత సంపాదిస్తే.. దేశీయ ఉబర్ డ్రైవర్లు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందా? క్యాబ్ డ్రైవర్ సంపాదన రూ.23లక్షలు అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ‘బిల్’ అనే ఉబర్ డ్రైవర్ 2022లో ఏడాది మొత్తం సంపాదించింది అక్షరాల రూ.23లక్షలు ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఆరేళ్ల క్రితం రిటైరైన బిల్కి ప్రయాణాలు చేయడం అంటే మహా ఇష్టం. డబ్బుకు డబ్బుకు.. ప్రయాణం చేస్తున్నామన్న సంతృప్తితో ఉబర్‌లో పార్ట్‌టైం డ్రైవర్‌గా చేరాడు. వారానికి 40 గంటల పని చేస్తూ కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మొదలు పెట్టాడు. అదెలానో వివరించాడు. స్ట్రాటజీ ఇందుకోసం ఉబర్ డ్రైవర్ బిల్ ఈ కొత్త స్ట్రాటజీని అప్లయి చేశాడు. ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్ట్‌లు, శనివారం, ఆదివారం రెస్టారెంట్లు, బార్లను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కిటకిటలాడుతుంటాయి. పీక్ అవర్స్ కాబట్టి కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని లాంగ్ రైడ్లు కాకుండా, స్థానిక ఏరియాల్లో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు వెళతారో తెలుసుకుని తనకు ఏమాత్రం లాభం లేదనిపిస్తే ఆ రైడ్లను క్యాన్సిల్ చేస్తాడు. కస్టమర్ల డిమాండే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి రైడ్ ధరల్ని స్వయంగా తానే నిర్ణయించినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాధారణంగా 20 నిమిషాల రైడ్‌కి ఉబర్ 10 నుంచి 30 డాలర్లు వరకు ఉంటుంది. కానీ బిల్ మాత్రం కస్టమర్ల రైడ్లను క్యాన్సిల్ చేసి 50 నుంచి 60 డాలర్లు ఛార్జీలు విధించాడు. రైడ్ రిక్వెస్ట్‌లో 10 శాతం కంటే తక్కువ రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి..వాటిలో 30 శాతానికి పైగా రద్దు చేసి తద్వారా ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో చెల్లించే రైడ్లను పొందాడు. ఇలా గత ఏడాది సుమారు 1,500 ఉబర్ ట్రిప్‌ల నుంచి సుమారు 28,000 డాలర్ల (దాదాపు రూ.23 లక్షలు) మనీ సంపాదించినట్లు చెప్పాడు. ఇబ్బందులు తప్పవ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే సదరు డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిల్ చెప్పాడు. ఉబర్ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే అకౌంట్‌ను కోల్పోవడంతో పాటు 10 శాతం కంటే ఎక్కువ రైడ్లను క్యాన్సిల్ చేసిన డ్రైవర్లకు నిర్ధిష్ట పెట్రోల్ బంకుల్లో లభించే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు కోల్పోతారని అన్నాడు. అయినప్పటికీ, బిల్ ప్రస్తుతానికి తన బిల్ స్ట్రాటజీకి కట్టుబడి ఉన్నానని, అది లాభదాయకంగా ఉందని అంటూనే.. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని మనసుల మాటని బయట పెట్టాడు. చదవండి👉🏻 అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ -
వానొస్తే జనం గుండెల్లో గుబుల్.. హైదరాబాద్‌లో క్యాబ్ ధరలు డబుల్!
ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వాన! ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా! వర్షం సినిమాలో పాట మాదిరి వానపడినపుడు హాయిగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రాంతాల్లోని జనం మనసుల్లో గిలిగింతలుగొలిపే సన్నివేశం. కానీ, హైదరాబాదీలకు మాత్రం బాధలు పంచే సందర్భం. ఎలాగంటే, జీహెచ్ఎంసీ అధికారులు ఓవైపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వరద నియంత్రణకు చర్యలు చేపట్టాం అని చెప్తుంటారు. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించవు. చిన్నపాటి వర్షానికే భాగ్యనగరంలో రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక వాహనదారుల కష్టాలు మామూలే. మామూలుగానే మన నగరంలో ట్రాఫిక్ ఎక్కువ. వాన పడిందా రచ్చ రచ్చే! ఎడతెరిపి లేకుండా వాన పడిందా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు తప్పవు. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు. (చదవండి: వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!) అటు ఆకాశానికి, ఇటు జేబుకు చిల్లు! నగరంలో జోరు వాన. అరే! వానలో తడుస్తూ బైక్‌పై ఎలా? క్యాబ్‌లో వెళ్దామనే ఆలోచనే చేసే పరిస్థితిలో సామాన్య జనం లేరు. ఎందుకంటే ఇదే అవకాశంగా క్యాబ్ యజమానులు అమాంతం చార్జీలు పెంచేశారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండింతలు, మూడింతల సొమ్ము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 చార్జీ ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ధరలు డబుల్ అయ్యాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్తూ అనుజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. @AnujGurwara అనే ట్విటర్ యూజర్ వర్షం పడటంతో చార్జీలను ఎలా పెంచేశారో తన స్వీయ అనుభవాన్ని షేర్ చేశాడు. ఈక్రమంలోనే పలువురు నెటిజన్లు కూడా అధిక చార్జీల బాధలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ విభాగం హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్: ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే..) This is the @Olacabs fare from Begumpet to the airport at 7.30pm today. Normal fare 700-800rs. Two @Uber_India drivers cancelled on me after asking for the fare being displayed on the app. The #Hyderabad cab situation continues to be terrible. pic.twitter.com/tFaB6ln96e — Anuj Gurwara (@AnujGurwara) July 19, 2023 #Hyderabad #City #Traffic #RealEstate #KishanReddy @kishanreddybjp pic.twitter.com/6c54vSdXOa — Guru Kotha (@Newguru_Kotha) July 20, 2023 Heavy rains in Hyderabad. #HyderabadRains pic.twitter.com/t4wYsc2VS8 — Kiran Kumar (@chkirankumar) July 20, 2023 Funds have been allocated by GHMC to construct a Dam near secretariat.. 🤣🤣#HyderabadRains https://t.co/bYzwhur0cd — Chinnu Rao.. #ProudHindu 🇮🇳 (@bubblebuster26) July 20, 2023 -
ప్యూన్ ఉద్యోగం రాలేదు: ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడిలా!
పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం అనే మాటలు నిజ జీవితంలో అక్షర సత్యాలు. జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే 'దిల్ఖుష్ సింగ్' సక్సెస్ స్టోరీ. సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 'దిల్ఖుష్ సింగ్' ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ. 20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిల్ఖుష్ సింగ్ రాడ్బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్‌లో క్యాబ్‌లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. (ఇదీ చదవండి: వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!) రాడ్బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్‌లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ. 1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్‌గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్ఫామ్లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారని దిల్ఖుష్ చెప్పుకొచ్చారు. -
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్..15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు
ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్వుడ్లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్వుడ్గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ -
క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా?
సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారా....జేబులో డబ్బులు ఉంటేనే క్యాబ్ బుక్ చేసుకోండి. లేకుండా కష్టమే. చార్జీలు ఆన్లైన్లో చెల్లించవచ్చుననుకుంటే మీరు బుక్ చేసుకున్న క్యాబ్ మరో క్షణంలోనే రద్దయిపోవచ్చు. ఇది నిజమే. నగరంలో ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలకు అనుసంధానమై తిరుగుతున్న క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్లైన్, యూపీఐ చెల్లింపులకు నిరాకరిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్న మరుక్షణంలోనే డ్రైవర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. చార్జీలు నగదు రూపంలో చెల్లిస్తేనే వస్తామంటూ పేచీ పెడుతున్నారు. ఆన్లైన్లో చెల్లిస్తామంటే వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. దీంతో మరో క్యాబ్ కోసం, ఆటో కోసం తిరిగి మొబైల్ యాప్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. అలా గంటల తరబడి బుకింగ్‌ల కోసమే నిరీక్షించవలసి వస్తుందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాలనుకొంటే కష్టమే. తీరా గమ్యం చేరుకున్న తరువాత చార్జీల చెల్లించేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు.’అని సీతాఫల్‌మండికి చెందిన సురేష్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వరకు క్యాబ్ బుక్ చేసుకొనేందుకు గంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చినుకు పడితే బండి కష్టమే... ఒకవైపు ఆన్లైన్ చెల్లింపులపైనా రైడ్‌కు డ్రైవర్లు నిరాకరిస్తుండగా ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు క్యాబ్ సంస్థలు సైతం ఉన్నపళంగా చార్జీలను పెంచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా, ఏ కొంచెం వర్షం కురిసినా చాలు క్యాబ్ లభించడం కష్టంగా మారుతుంది. రద్దీ వేళల నెపంతో చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. సాధారణంగా గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వరకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటే వర్షాన్ని సాకుగా చేసుకొని కొన్ని సంస్థలు రూ.550 నుంచి రూ.750వరకు పెంచేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను పెంచుకొనేందుకు కొన్ని క్యాబ్ సంస్థలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని రెగ్యులర్ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచేస్తున్నారు. దీంతోపాటు సర్ చార్జీల రూపంలోనూ ప్రయాణకులపైన అదనపు వడ్డింపులకు పాల్పడడం గమనార్హం. ‘ప్రతికూలమైన వాతావరణం వల్ల త్వరగా ఇల్లు చేరాలంటే డిమాండ్ మేరకు చెల్లించక తప్పడం లేదు.’ అని అమీర్‌పేట్‌కు చెందిన నవీన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పారు. క్యాబ్ సంస్థల జాప్యం.. మరోవైపు నగదు చెల్లింపుల పైన డ్రైవర్ల వాదన మరో విధంగా ఉంది. క్యాబ్ సంస్థల ఖాతాలో పడే చార్జీలు తిరిగి తమ ఖాతాలోకి చేరేందుకు పడిగాపులు కాయవలసి వస్తుందని పేర్కొంటున్నారు. డ్రైవర్లు ప్రతి రోజు చేసే రైడ్‌లపైన క్యాబ్ సంస్థలు 30 శాతం వరకు కమిషన్ తీసుకొని మిగతా 70 శాతం వారి ఖాతాలో జమ చేయాలి. కానీ డ్రైవర్‌కు చెల్లించవలసిన డబ్బులు రెండు, మూడు రోజుల తరువాత మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో తమ రోజువారీ అవసరాలకు కష్టమవుతుందని అంబర్‌పేట్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు ఖాతాలో జమ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బంది వస్తున్నట్లు చెప్పారు. -
టాటా మోటార్స్ ‘ఈవీ’ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. క్యాబ్ సర్వీసుల్లో ఉన్న బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా బ్లూస్మార్ట్‌కు 10,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను టాటా మోటార్స్ సరఫరా చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగంలో దేశంలో ఇదే అతిపెద్ద ఆర్డర్ కావడం విశేషం. ఇప్పటికే టాటా మోటార్స్ 3,500 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఈవీల సరఫరాకై గతేడాది అక్టోబర్‌లో బ్లూస్మార్ట్ నుంచి ఆర్డర్ పొందింది. ‘ప్రయాణికుల రవాణా రంగంలో వేగవంతమైన విద్యుదీకరణ దిశగా టాటా మోటార్స్ చురుకైన అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత అగ్రిగేటర్లు మాతో పర్యావరణ అనుకూల మొబిలిటీ విభాగంలో చేరడం ఆనందంగా ఉంది. ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను దేశవ్యాప్తంగా బ్లూస్మార్ట్ ప్రవేశపెడుతుంది’ అని సంస్థ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర ఈ సందర్భంగా తెలిపారు. రూ.390 కోట్ల సిరీస్–ఏ ఫండ్ అందుకున్న తర్వాత ఢిల్లీ రాజధాని ప్రాంతంతోపాటు ఇతర మెట్రో నగరాల్లో వేగంగా విస్తరించేందుకు బలం చేకూరిందని బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కో–ఫౌండర్ అన్మోల్ సింగ్ జగ్గి వివరించారు. ఇప్పటికే తమ వాహనాలు 16 లక్షల రైడ్స్‌కుగాను 5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని చెప్పారు. ప్రయాణించే సామర్థ్యాన్నిబట్టి ఎక్స్‌ప్రెస్–టి రెండు ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఒకటి 213, మరొకటి 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సింగిల్ స్పీడ్ అటోమేటిక్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి హంగులు ఉన్నాయి. -
క్యాబ్.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్లైన్ పేమెంట్లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్‌లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్‌ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్లలో 3 నుంచి 4 రైడ్లను రద్దు చేయడం గమనార్హం. డ్రైరన్ల నెపంతో రద్దు.. మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్లు రైడ్లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్‌లు, ఆటోలు ఠంచన్‌గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్‌లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్‌లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్బీనగర్కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిట్టుబాటు కావడం లేదు డ్రై రన్లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ (చదవండి: నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ) -
ఇంటి నుంచి నేరుగా ప్రయాణించేలా ... బస్సు టు క్యాబ్
సాక్షి హైదరాబాద్: గ్రేటర్లో ప్రజా రవాణా సదుపాయాలు విరివిగా అందుబాటులో ఉన్నప్పటికీ ‘సీమ్‌లెస్’ జర్నీ ఒక కలగానే మారింది. నగరంలోని ప్రధాన రూట్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకొనే సదుపాయం లేదు. వందల కొద్దీ కాలనీలు, బస్తీలు, నగరంలోని అనేక ప్రాంతాలు మెట్రో రైలుకు దూరంగానే ఉన్నాయి. మరోవైపు కాలనీలకు మినీ బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఇక హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే వారికి కూడా లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. బస్సు దిగిన ప్రయాణికులు గమ్యం చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో అన్ని అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్ సేవలను ఏర్పాటు చేసి ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎదురు చూపులు లేకుండా... ప్రస్తుతం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ముందే ప్రయాణికులు క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. శంషాబాద్ విమాశ్రయంలోనూ ఈ తరహా క్యాబ్ సదుపాయం ఉంది. అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ,దిల్సుఖ్నగర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, తదితర బస్స్టేషన్లు, కోఠీ. కాచిగూడ, కూకట్పల్లి, హయత్‌నగర్ వంటి ప్రయాణ ప్రాంగణాల నుంచి క్యాబ్‌ల సేవలను ఏర్పాటు చేయడం వల్ల సిటీ బస్సులు వెళ్లలేని కాలనీలకు ప్రయాణికులు చేరుకోవచ్చు. బస్సు కోసం పడిగాపులు అవసరం లేకుండా లాస్ట్‌మైల్ వరకు ప్రయాణ సదుపాయం లభిస్తుంది. మరోవైపు ఆర్టీసీపైన ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ఇందుకనుగుణంగా క్యాబ్‌ల అనుసంధానంపైన దృష్టి సారించినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ‘బస్సు దిగిన వాళ్లు ఆటో, క్యాబ్ వంటి వాహనాల్లో తమకు నచ్చినది ఎంపిక చేసుకొని వెళ్లవచ్చు.కానీ ఆర్టీసీ అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్‌లు ఉంటాయనే భరోసా ముఖ్యం. అందుకోసమే ఈ అనుసంధాన ప్రక్రియ..’ అని వివరించారు. అలైటింగ్ పాయింట్ల గుర్తింపు త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో అలైటింగ్ పాయింట్లను గుర్తించనున్నారు. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కడికి బయలుదేరుతున్నారనే అంశం ప్రాతిపదికగా వీటి ఎంపిక ఉంటుంది. సిటీ బస్సులు చేరుకోలేని ప్రాంతాలకు క్యాబ్‌లు వెళ్లే విధంగా అలైటింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. మరోవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా క్యాబ్‌ల అనుసంధానం ఉంటుంది -
ఓలా, ఉబెర్ క్యాబ్‌లు సాగిస్తున్న నయా దందా!...భరోసా లేని ప్రయాణం!!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన రాజేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. మధ్యాహ్నం ఏ ఇబ్బంది లేకుండా క్షణాల్లోనే క్యాబ్ బుక్ అయింది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ నుంచి తిరిగి బయలు దేరేందుకు క్యాబ్ కోసం ప్రయత్నించాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్ బుకింగ్‌కు పది నిమిషాలు పట్టింది. ‘హమ్మయ్య ఏదో ఒక విధంగా క్యాబ్ బుక్ అయింది. ఇక వెళ్లిపోవచ్చు’ అనుకుంటుండగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. ఎక్కడెళ్లాలి అని అడిగాడు. హిమాయత్‌నగర్‌కు అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. గంట గడిచినా క్యాబ్ రాలేదు. బుకింగ్ రద్దు కాలేదు. మరో క్యాబ్ కోసం ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ రూ.1000 డిమాండ్ చేశాడు. బుకింగ్ రద్దు చేసుకొంటే వస్తానన్నాడు.మరో గత్యంతరం లేకపోవడంతో డ్రైవర్ డిమాండ్‌కు అంగీకరించవలసి వచ్చింది. ఇది ఒక్క రాజేశ్ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. ఓలా, ఉబెర్ క్యాబ్‌లు సా గిస్తున్న నయా దందా ఇది. ప్రయాణికులను ఠారెత్తిస్తున్నారు. చివరినిమిషంలో రైడ్లను రద్దు చేసుకొనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అడిగినంతా ఇస్తే ఓకే అంటున్నారు. దీంతో క్యాబ్ ఉందనే భరోసాతో భార్యా పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న వారు ఆ తరువాత తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఒక్క శంషాబాద్ రూట్లోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. భరోసాలేని క్యాబ్ జర్నీ... సాధారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ బుకింగ్‌లకు కొంత సమయం పట్టవచ్చు. ఏదో ఒకవిధంగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చని భావించే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రయాణికులకు ఇలా చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ‘క్యాబ్‌ల వల్ల ప్రయాణానికి భరోసా లభించడం లేదని, డ్రైవర్లకు గిట్టుబాటయితేనే వస్తారని’ అంబర్‌పేట్‌కు చెందిన రాజు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్లు తాము రావడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మరి కొందరు రైడ్ రద్దు చేసుకొని తాము అడిగినంతా నగదు రూపంలోనే చెల్లిస్తే వస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్లు డిమాండ్ చేసినంత చెల్లించవలసి వస్తుంది. ‘ఇలాంటి క్యాబ్ డ్రైవర్లపైన ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని’ మల్కాజిగిరికి చెందిన సతీష్ అభిప్రాయపడ్డారు. కమిషన్లు తగ్గినందుకే ఇలా... ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్లకు కమిషన్ల రూపంలో చెల్లిస్తాయి. ప్రతి కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు. కానీ ఇలా కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం చాలడం లేదంటూ డ్రైవర్లు నేరుగా ప్రయాణికులతో బేరాలకు దిగుతున్నారు. ఓలా, ఉబెర్ల నుంచి రైడ్ బుకింగ్‌లు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తరువాత ఈ తరహా బేరసారాలను కొనసాగిస్తున్నారు. డిజిటల్ అయితే నో... సదరు ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థలతో తమ కమిషన్లపైన ఒప్పందం చేసుకోవలసిన డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు. రద్దీ ఉండే రూట్ల లో క్యాబ్‌లు బుక్ కావడం లేదు. ఒకవేళ అయినా ‘డిజిటల్ పేమెంట్స్’ అనగానే నిరాకరిస్తున్నారు. ఓలా, ఉబెర్ యాప్‌లలో రెంటల్ బుకింగ్స్ సదుపాయం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో రెంటల్ బుకింగ్స్‌కు డ్రైవర్లు నిరాకరించడం గమనార్హం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను కూడా క్యాబ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చివరి నిమిషంలో రైడ్ల రద్దు వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ ఇబ్బందుల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. -
లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లు, ట్యాక్సీబైక్‌లు, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత సేవల చార్జీలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే సర్ చార్జీలు, పీక్ అవర్స్ పేరిట ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న క్యాబ్‌లు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని సైతం ప్రయాణికులపైనే మోపుతున్నాయి. అన్ని రకాల క్యాబ్‌లు, బైక్‌ల సేవలపై తాజాగా 15 శాతానికి పైగా చార్జీలను పెంచేశారు. దీంతో సిటీజనుల ప్రయాణం మరింత భారంగా పరిణమించింది. మరోవైపు యాప్ ఆధారంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువులను అందజేసే యాప్ ఆధారిత సేవలపై సైతం చార్జీలను పెంచేశారు. చదవండి: స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు! ప్రతి రోజు వేలాది మంది ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చే బిర్యానీలు, రకరకాల ఫుడ్ ఐటెమ్స్‌పై రవాణా సేవల రూపంలో ఇప్పుడు మరికొంత అదనంగా చెల్లించుకోవాల్సివస్తోంది. నిత్యావసర వస్తువులను, సేవలను అందజేసే యాప్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఇప్పుడు తమ రేట్ కార్డులను సవరించాయి. ‘గతంలో ఒకటిన్నర కిలోమీటర్ దూరానికి రూ.20 మాత్రమే సర్వీసు చార్జీ తీసుకుంటే ఇప్పుడు కొన్ని యాప్ ప్లాట్‌ఫామ్స్ రూ.25 నుంచి రూ.30 వరకు చార్జీలు వేస్తున్నాయి’ అని వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ చార్జీల పెంపుతోనే సర్వీస్ చార్జీలు పెరిగాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! బైక్ బెంబేలు... ► సింగిల్ ప్యాసింజర్‌కు ఎంతో అనుకూలంగా ఉన్న బైక్ ట్యాక్సీలకు కూడా ఇప్పుడు రెక్కలొచ్చేశాయి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి కొండాపూర్ వరకు గతంలో కేవలం రూ.21 నుంచి రూ.25 వరకు ఉన్న చార్జీ ఇప్పుడు రూ.35 దాటింది. పైగా రోజు రోజుకు ఈ చార్జీల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ► సికింద్రాబాద్ నుంచి హబ్సిగూడ వరకు గతంలో రూ.30 వరకు చార్జీ ఉండగా ఇప్పుడు కొన్ని బైక్ ట్యాక్సీల్లో రూ.50 వరకు పెరిగింది. మరోవైపు క్యాబ్‌లు, ఆటోలు సైతం ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ► ఉప్పల్ నుంచి బంజారాహిల్స్ వరకు గతంలో రూ.275 ఉన్న క్యాబ్ చార్జీ ఇప్పుడు రూ.350 దాటింది. పీక్ అవర్స్‌లో ఈ చార్జీలు మరింత పెరుగుతున్నాయి. ► దీంతో పాటు సర్‌చార్జీల రూపంలో క్యాబ్ సంస్థలు మరింత భారం మోపుతున్నాయి. ‘పెట్రోల్ మోతతో సొంత బండి పక్కన పెట్టి ట్యాక్సీ బైక్‌పై వెళ్దామనుకుంటే ఇప్పుడు ఆ చార్జీలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి’ అని మల్కాజిగిరికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. సగటు జీవి విలవిల... ► రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సగటు జీవిని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.27, లీటర్ డీజిల్ రూ.105.46. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.952 దాటింది. ► ఏ రోజుకా రోజు పెరుగుతున్న ధరలతో జనం విలవిల్లాడుతున్నారు. పెరిగిన ఇంధన ధరలతో కూరగాయలు, అన్ని రకాల కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ► కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ దృష్ట్యా గతంలో వివిధ రకాల వస్తుసేవల ధరలు పెరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టి, ఆంక్షల సంకెళ్లు తొలగిపోయి కొద్దిగా ఊరట పొందుతున్న తరుణంలో సామాన్యుడి ముంగిట పేలిన పెట్రో బాంబు ఊపిరి తీసుకొనేందుకు అవకాశం లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం.. త్వరలో హైదరాబాద్‌లో
సాక్క్షి, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు త్వరలో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఆటో ఛార్జీలకే కారు తరహా సౌకర్యాలను అనుభవిస్తూ ప్రయాణం చేయవచ్చు. బజాజ్ ఆటో, ఉబర్ సంస్థలు కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తేనున్నాయి. క్వాడ్రి సైకిల్ బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రిసైకిల్ని రూపొందించింది. పేరు క్వాడ్రి సైకిల్ అని పిలచుకున్నా ఇది సైకిల్లా కాదు చూడటానికి కారులా ఉంటుంది. నాలుగు చక్రాలతో ప్రయాణం చేస్తుంది. అయితే కారుతో పోల్చుకున్నప్పుడు ఇంజన్ సామర్థ్యం , ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అదే ఆటోతో పోల్చినప్పుడు భద్రతతో పాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఎక్కువగా ఇస్తుంది. క్యూట్ క్వాడ్రిసైకిల్ని బజాజ్ ఆటో క్యూట్ పేరుతో రూపొందించి చాలా కాలమే అయినా ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురాలేదు. కేరళా, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రయోగాత్మకంగా ఈ మోడళ్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉబర్‌తో జత కట్టి బెంగళకూరు నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సేవల్లోకి వచ్చింది. ఆటో ఛార్జీలకే కారు తరహా ప్రయాణం అందిస్తున్న ఈ బిజినెస్ మోడల్ బెంగళూరులో సక్సెస్ అయ్యింది. పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఈ కారులో ప్రయాణించిన కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి బజాజ్ ఆటో, ఉబర్లు. లక్ష మందికి పైగా ఈ క్యూట్ క్వాడ్రి సైకిల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. దీంతో మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు రెండు కంపెనీలు రెడీ అయ్యాయి. త్వరలో హైదరాబాద్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ రోడ్లపై క్యూట్ పరుగులు పెట్టనుంది. ఉబర్ సంస్థ ఆధ్వర్యంలో క్యూట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. దీనికి సంబంధించి క్యూట్ యూనిట్ల తయారీని పెంచే పనిలో ఉంది బజాజ్. -
గ్రేటర్ హైదరాబాద్‌లో క్యాబ్ డౌన్!
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో అన్ని వర్గాల ప్రయాణికులకు అందుబాటులో ఉన్న క్యాబ్‌లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణం. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ క్యాబ్‌ల మనుగడపైన భారీ దెబ్బ కొట్టింది. ఆ తరువాత నిబంధనల సడలింపుతో క్రమంగా వాహనాలు రోడ్డెక్కినప్పటికీ ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో భారీగా కురిసిన వర్షాలతో క్యాబ్ రంగం కుదేలైంది. సుమారు 5 వేల వాహనాలు నీటమునిగి వినియోగానికి పనికి రాకుండా పోయాయి. థర్డ్ పార్టీ ఇన్సూ్యరెన్స్ కలిగిన ఈ క్యాబ్‌లకు పరిహారం లభించలేదు. మరోవైపు ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించక చాలా మంది డ్రైవర్లు ఈఎంఐలు చెల్లించలేక వాహనాలను వదులుకున్నారు. ఓలా సంస్థ స్వయంగా 3 వేల లీజు వాహనాలను డ్రైవర్ల నుంచి జప్తు చేసినట్లు తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా క్యాబ్‌లపై జరిగిన ముప్పేట దాడి కారణంగా వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గ్రేటర్లో 40 వేల క్యాబ్లే... కోవిడ్‌కు ముందుకు సుమారు 1.2 లక్షలకు పైగా క్యాబ్‌లు నగరంలో తిరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకే ప్రతి రోజు 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో క్యాబ్‌లకు కూడా డిమాండ్ తగ్గింది. అలాగే ఐటీ సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఒకప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఐటీ రంగాన్ని నమమ్ముకొని వాహనాలు కొనుగోలు చేశారు. ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమయ్యారు. క్యాబ్ సంస్థలు కమీషన్లను తగ్గించినప్పటికీ క్యాబ్ డ్రైవర్లు రవాణా రంగాన్ని మాత్రం వదులుకోలేదు. కానీ ఏడాది కాలంగా ఐటీ కార్యకలాపాలు ఇంటి నుంచే సాగుతుండడంతో ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత తిరిగి 60 వేల క్యాబ్‌లు రోడ్డెక్కాయి. కానీ భారీ వర్షాలు దెబ్బతీసాయి. సుమారు 5 వేల క్యాబ్‌లు నీటమునిగి వినియోగానికి రాకుండా పాడయ్యాయి. ఇలా అనేక కారణాల వల్ల క్యాబ్లసంఖ్య సిటీలో సుమారు 40 వేలకు పడిపోయింది. చార్జీలు పెంచితేనే మనుగడ.. ఈ క్రమంలో కర్ణాటక తరహాలో కిలోమీటర్ ప్రాతిపదికన చార్జీలను పెంచాలని క్యాబ్ అసోసియేషన్లు కోరుతున్నాయి. ప్రస్తుతం నగరంలో కిలోమీటర్‌కు రూ.10 నుంచి రూ.12 మాత్రమే లభిస్తుంది. దీనిని కిలోమీటర్‌కు రూ.17 చొప్పున పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘ ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఓలా, ఉబెర్ సంస్థలు కమిషన్లలో భారీగా కోత విధించాయి. దీంతో మా మనుగడే ప్రశ్నార్ధకమైంది’ అని తెలంగాణ క్యాబ్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కన్వీనర్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లి బృందంతో బస్సు.. డ్రైవర్‌కి ఫిట్స్ -
పంజాగుట్ట పీఎస్‌లో ముమైత్ ఖాన్ ఫిర్యాదు
-
రాజు నన్ను వేధించాడు: ముమైత్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బిల్లు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న డ్రైవర్‌పై నటి ముమైత్ ఖాన్ గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నా మీద వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు.12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. నాకు క్యాబ్ డ్రైవర్ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ కి 23500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. డ్రైవర్ రాజు నన్ను వేధించాడు. ఫ్లయిట్స్‌లో పెట్స్‌ను అనుమతించకపోవడంతో క్యాబ్‌లో వెళ్లాను.’ అన్నారు ముమైత్. (చదవండి: థియేటర్లో తొలి సినిమా కరోనా వైరస్: ఆర్జీవీ) ఇక తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. -
ముమైత్ ఖాన్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్
-
ముమైత్ ఖాన్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటి ముమైత్ ఖాన్ డబ్బులు ఎగ్గొట్టిందని ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు తెలిపాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామొడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని అన్నాడు. ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. (చదవండి: నా బలం నాకు తెలుసు) -
పీక్ అవర్స్, సర్‌చార్జీల పేరిట బాదుడు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వరకు సాధారణ రోజుల్లో క్యాబ్ చార్జీ రూ.550 వరకు ఉంటుంది. కానీ రెండు రోజుల క్రితం ఒక ప్రయాణికుడు ఏకంగా రూ.923 చెల్లించాడు. కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణంగా అయితే రూ.250 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఇప్పుడు అది రూ.450 నుంచి రూ.500 దాటిపోయింది. ఈ ఒకటి, రెండు రూట్లలోనే కాదు. లాక్డౌన్ వేళ నగరంలో క్యాబ్ చార్జీల దోపిడీ ‘పీక్’ స్థాయికి చేరింది. లాక్డౌన్ నడలింపుల్లో భాగంగా కొద్ది రోజులుగా ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు రోడ్డెక్కాయి. ఆటోలు పూర్తిస్థాయిలో తిరుగుతున్నప్పటికీ క్యాబ్‌లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఓలా, ఊబెర్ వంటి బడా సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో సర్వీసులను ప్రారంభించలేదు. మరోవైపు సిటీబస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు వంటి ప్రజారవాణా సంస్థలపైన ఇంకా ఆంక్షలు కొనసాగుతూండడంతో క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. కానీ ఇందుకు తగినట్లుగా వాహనాలు అందుబాటులో ఉండడం లేదు.దీంతో ప్రయాణికుల అవసరాన్ని క్యాబ్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.నగరంలోని హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్,అమీర్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రయాణికుల రాకపోకలు, డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యాబ్ సంస్థలు రెట్టింపు చార్జీలకు పాల్పడుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబ్ ఎక్కాలంటే కనీసం రూ.వెయ్యి ఉండాల్సిందేనంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘పీక్’ అవర్స్‌పేరిట దోపిడీ.. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు. అంతా ఒకే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడం, తిరిగి సాయంత్రం ఒకే సమయంలో ఇళ్లకు వెళ్లడం వల్ల రోడ్లపై ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు. కానీ ఈ రద్దీ వేళల్లో చార్జీలు పెంచాలనే నిబంధన ఎక్కడా లేదు. పైగా మోటార్ వాహన చట్టం ప్రకారం పీక్ అవర్స్ (రద్దీ వేళలు), స్లాక్ అవర్స్ (రద్దీ లేని సమయాలు)గా విభజించి చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు.కానీ క్యాబ్ సంస్థలు మాత్రం రహదారులపైన రద్దీ ఉన్నా లేకున్నా పీక్ అవర్స్ పేరిట చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. మరోవైపు లాక్డౌన్ కారణంగా ఐటీ సంస్థల్లో కేవలం 30 శాతం ఉద్యోగులే కార్యాలయాలకు వెళ్తుండగా మిగతా వాళ్లు ఇంకా ఇళ్లల్లోంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా కొన్ని కార్యకలపాలపైన లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాహాల్స్, రెస్టారెంట్స్, హోటళ్లు, బార్లు వంటివి మూసే ఉన్నాయి. రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా సాయంత్రం 6 గంటలకు జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎలాంటి రద్దీ లేని ప్రస్తుత లాక్డౌన్ వేళలో పీక్ అవర్స్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడడం గమనార్హం. ఈ సమయంలో సర్‌చార్జీలా.. సాధారణంగా ప్రయాణికులు బుక్ చేసుకున్న సమయంలో స్థానికంగా క్యాబ్‌లు అందుబాటులో లేకపోతే సర్‌చార్జీ విధిస్తారు. దూరంగా ఉన్న వాహనాలను రప్పించేందుకు సర్‌చార్జీల రూపంలో వడ్డిస్తారు. రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఇలాంటి వడ్డింపులు ఉంటాయి. కానీ ఎలాంటి రద్దీ లేని ప్రస్తుత సమయంలో ఈ తరహా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు హుష్.. ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ఒకటి, రెండు క్యాబ్ సంస్థలకు చెందిన వాహనాలు మినహా నగరంలో తిరిగే క్యాబ్‌లలో కోవిడ్ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. వాహనాలను శానిటైజ్ చేయడం లేదు. ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ఫైబర్ షీట్ ఉండడం లేదు. బడా క్యాబ్ సంస్థలు తమ సర్వీసులను ఫ్రారంభించినప్పటికీ డ్రైవర్ భాగస్వాములకు ఎలాంటి మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం లేదని, వాహనాలను శానిటైజ్ చేసే సదుపాయం కల్పించడం లేదని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో క్యాబ్‌లు నడిపేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. -
లాక్డౌన్.. ఎలైట్ క్యాబ్స్ ఉచిత సేవలు
సాక్షి, సిట్యీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బందులుపడుతున్న వారి కోసం ఎలైట్ క్యాబ్స్ ఉచిత సేవలు అందిస్తోంది. మహేంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సర్వీస్‌ను సిటీ కొత్వాల్ అంజనీకుమార్ మంగళవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఈ క్యాబ్ సర్వీస్‌ను పొందాలకునేవారు 84339 58158కు ఫోన్ చేయాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5 క్యాబ్‌లు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 2 క్యాబ్‌లు ఉచిత సర్వీసును అందించనున్నాయి. ఎవరు వినియోగించుకోవచ్చు? ♦ సీనియర్ సిటిజన్స్, ఒంటరిగా ప్రయాణించే పసిబిడ్డల తల్లులు, ఫిజికల్లీ చాలెంజ్డ్ వ్యక్తులు.. నిత్యావసర వస్తువులు, ఔషధాలు తెచ్చుకోవడానికి, బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి వచ్చేందుకు.. ♦ అవసరార్థులకు నిత్యావసాలు, ఆహారం, ఔషధాలు పంపిణీ చేసే కార్యకర్తల రవాణా కోసం.. ♦ హృద్రోగులు, చిన్నారుల టీకాలు వేయించడానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లి రావడానికి.. ♦ ఆరోగ్య శాఖ సంబంధిత రంగాలకు చెందిన ఉద్యోగులు తమ విధులకు వెళ్లడానికి, రావడానికి.. వీరికి సేవలు అందించరు ♦ కోవిడ్ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నవారికి.. ♦ రక్తస్రావంతో కూడిన గాయాలున్నవారికి, హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి బాధితులు, నెలలు నిండిన గర్భిణులకు.. -
ప్రముఖ ఆటో కంపెనీ ఎంట్రీ : ఓలా, ఉబెర్‌కు చెక్?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ఎం) క్యాబ్ అగ్రిగేటర్, షేర్డ్ మొబిలిటీ సర్వీసుల రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ప్రధానంగా కార్పొరేట్ల కోసం ‘అలైట్’ అని పిలిచే క్యాబ్ అగ్రిగేటర్‌ను ప్రారంభించనుంది. రాబోయే రెండు-మూడు సంవత్సరాలలో అలైట్ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని ఆనంద్ మహీంద్ర నేతృత్వంలోని ఎం అండ్ ఎండ్ ప్లాన్ చేస్తోంది. తద్వారా ఇప్పటికే ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు ఓలా, ఉబర్‌లకు ప్రత్యక్షంగా గట్టి పోటీ ఇవ్వనుంది. క్యాబ్ సర్వీసుల నిర్ణయంతో పాటు, తన మొబిలిటీ వ్యాపారాలన్నింటినీ ఏకం చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఎం అండ్ ఎం. అలైట్ (ప్రస్తుతం మహీంద్రా లాజిస్టిక్స్), మేరూ క్యాబ్స్ (మెజారిటీ షేరు ఉన్న ఎం అండ్ ఎం) , గ్లైడ్ (ఎం అండ్ ఎం ఇ-వెహికల్ క్యాబ్ సర్వీస్), ఫస్ట్ ఛాయిస్ యూజ్డ్ కార్ల బిజినెస్) ఇలా అన్నీ మొబిలిటీ సర్వీసులను (అలైట్) ఒకే గొడుగు కిందికి తీసుకురానుంది. ఇందుకోసం ‘అలైట్’ పేరుతో ఒకయాప్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ త్రైమాసికం నుండి దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నామని మహీంద్రా లాజిస్టిక్స్ సీఈవో రాంప్రవీణ్ స్వామినాథన్ చెప్పారు. వివిధ సంస్థలతో ఒప్పంద ప్రాతిపదికన ఇది పని చేస్తుందని తెలిపారు. ప్రాథమికగా కంపెనీ ఉద్యోగులను ఆఫీసులనుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసులకు, లేదా వివిధ కాన్ఫరెన్సులు, సమావేశాలకు, విమానాశ్రయాలకు తీసుకెళ్లే సేవలు ఉంటాయి. క్రమంగా ఈ సేవలను కాల్-ఆన్ సేవలుగా విస్తరించనుంది. ఓలా కార్పొరేట్ ఫీచర్ ద్వారా కార్పొరేట్ టాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో సంస్థ ఉబెర్ కూడా ఉబెర్ ఫర్ బిజినెస్ ఫీచర్ ద్వారా ఈ విభాగంలోకి ఇటీవల ప్రవేశించింది. దాదాపు 10వేల కంపెనీలు ప్రస్తుతం ఓలా కార్పొరేట్ సేవలను వినియోగించుకుంటున్నాయి. అయితే ఓలా, ఉబెర్ బీటూ సీ సేవలతో పోలిస్తే కార్పొరేట్ భాగస్వామ్యాలతో బీ టూ బీ సేవలతో అలైట్ భిన్నంగా వుంటుందని కంపెనీ వెల్లడించింది. చదవండి: జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే! -
క్యాబ్‌ల్లో ఎస్‌వోఎస్ బటన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగర పోలీసులు గురువారం 15 క్యాబ్ నిర్వాహక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో కొత్వాల్ అంజనీకుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రతి క్యాబ్‌కు ట్రాకింగ్ డివైజ్‌లు, అత్యవసర సమ యంలో సాయం కోసం ఉపయోగపడే ఎస్‌వోఎస్ బటన్లు కచ్చితంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. తమ క్యాబ్‌లకు ట్రాకింగ్ డివైజ్‌లు ఉన్నాయని, ఇక ఎస్వోఎస్ను తమ యాప్‌ల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ క్యాబ్‌ల నిర్వాహకులు చెప్పగా.. మోటారు వాహనాల చట్టంలోని 125 (హెచ్) సెక్షన్ ప్రకారం వాహనంలోనే ఎస్‌వోఎస్ బటన్ ఉండాలని, దీన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. క్యాబ్ డ్రైవర్ల పూర్వాపరాలను అనునిత్యం పరిశీలించాలని, వారి గత చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియమించాలని కొత్వాల్ తెలిపారు. క్యాబ్‌ల్లో ప్రయాణించే వారి నుంచి ప్రతి సందర్భంలోనూ డ్రైవర్ల ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండాలన్నారు. మహిళల భద్రత అంశానికి సంబంధించి ఫిర్యాదు వస్తే వెంటనే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. ప్రతి క్యాబ్ యాప్‌ను హాక్–ఐతో అనుసంధానించాలని సూచించారు. సమావేశంలో ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
క్యాబ్ నిర్వహకులతో సమావేశమైన నగర సీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణపై గురువారం హైద్రాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. దిశ సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మహిళల భద్రత కోసం క్యాబ్ సర్వీస్ నిర్వహుకులతో సమావేశమయ్యారు. సమావేశంలో సిటీకి చెందిన 15 ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు పాల్గొన్నాయి. నగర సీపీ, ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేవంలో.. మహిళల భద్రతకు క్యాబ్ నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్యాబ్‌లలో మహిళా భద్రత కోసం ఉన్న యాప్‌లను డిస్ప్లే చేయడంతో పాటు డయల్ 100కు కాల్స్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా క్యాబ్ నిర్వహకులకు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి రెండు, మూడు రోజులకొసారి డ్రైవర్ల ప్రవర్తనపై కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. -
ఆర్టీసీ సమ్మె : క్యాబ్ దోపిడీ తారాస్థాయికి
క్యాబ్ సంస్థలు ఆర్టీసీ కార్మికుల సమ్మెను సొమ్ము చేసుకుంటున్నాయి. పీక్ అవర్స్ పేరుతో అధిక చార్జీలు వసూలుచేస్తున్నాయి. మరోవైపు నిబంధనలకువిరుద్ధంగా సర్‌చార్జీలు కూడా విధిస్తున్నాయి. దీంతో క్యాబ్ చార్జీలు దాదాపు రెండింతలయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లతో అరకొరగా నడుస్తున్న సిటీ బస్సులు సాయంత్రం 7గంటల లోపే డిపోలకుచేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ సంస్థలు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో క్యాబ్ దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. ఉబెర్, ఓలా, తదితర క్యాబ్ సంస్థలు ఆర్టీసీ సమ్మెను పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. సమ్మెను దృష్టిలో ఉంచుకొని సర్‌చార్జీలు విధించకూడదని, పీక్ అవర్స్ (రద్దీ వేళలు) నెపంతో చార్జీలు పెంచడానికి వీల్లేదని రవాణాశాఖ స్పష్టం చేసినా క్యాబ్‌ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండకపోగా, సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపే బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. అంతేగాక ఆర్టీసీ సైతం నైట్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో క్యాబ్‌లు, ఆటోలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. క్యాబ్‌లలో అన్ని వేళల్లోనూ పీక్ అవర్స్ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అంతేగాక ప్రయాణికులు కోరుకున్న ప్రాంతం నుంచి క్యాబ్‌లు అందుబాటులో లేవనే సాకుతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. దీంతో క్యాబ్ చార్జీలు రెండింతలయ్యాయి. దీంతో నగరంలో ప్రయాణం భారంగా మారింది. సాధారణ రోజుల్లోనే ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోవాలాలు సమ్మె పేరుతో మరింత అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సాయంత్రం బస్సులు లేకపోవడంతో ఈ దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కొరవడిన నియంత్రణ... క్యాబ్‌లు, ఆటోలపై రవాణాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేదు. గ్రేటర్ పరిధిలో 1.4 లక్షల ఆటోలు తిరుగుతుండగా 85 శాతం ఆటోల్లో మీటర్లను వినియోగించడం లేదు. ఆటోవాలాలు డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. ఇక క్యాబ్‌లలో బుకింగ్ సమయంలోనే చార్జీల భారం తెలిసిపోతుంది. పీక్అవర్స్ను సాకుగా చూపుతూ అమాంతంగా పెంచేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు క్యాబ్‌లను ఆశ్రయించవలసి వస్తుంది. దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణ రోజుల్లో క్యాబ్ చార్జీలు రూ.225 వరకు ఉండగా, గత పది రోజులుగా ఈ రూట్లో చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు పెరిగింది. తార్నాక నుంచి లాలాపేట్ వరకు సాధారణంగా రూ.350 వరకు చార్జీ అవుతుంది, ఇప్పుడు ఏకంగా రూ.650 కి పైగా నమోదవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘మణికొండ నుంచి లింగంపల్లి వరకు ఉబెర్ క్యాబ్‌లో మొదట రూ.120 చార్జీ నమోదైంది. ఫరవాలేదనుకొని బయలుదేరాను. తీరా దిగే సమయంలో అది రూ.220 అయింది.’’ అని సాయి అనే ప్రయాణికుడు తెలిపారు. పీక్ అవర్ నెపంతో అడ్డగోలుగా విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో ఓలా, ఉబెర్ క్యాబ్లే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కొత్త క్యాబ్ సంస్థలు వచ్చినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో ఓలా, ఉబెర్‌లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఐటీ ఉద్యోగులకు కష్టాలు... నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, తదితర ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే లక్షలాది మంది ఉద్యోగులు బస్సుల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఆయా మార్గాల్లో సుమారు 1500 ట్రిప్పులు తిరుగుతాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోగా, రాత్రి పూట పూర్తిగా సర్వీసులు నిలిచిపోవడంతో క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. విధులు ముగించుకొని ఆలస్యం గా ఇళ్లకు బయలుదేరేవారు పెద్ద మొత్తంలోనే సమర్పించుకోవలసి వస్తుంది. 10వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె... ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 10వ రోజుకు చేరుకుంది. నగరంలోని మహాత్మాగా>ంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, రాణీగంజ్, కంటోన్మెంట్, పికెట్, హెచ్‌సీయూ, తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు కుటుంబాలతో సహా బైఠాయించి నిరసన తెలిపారు. రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్‌గౌడ్ ఆత్మహత్య ఉదంతం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగానే మరోవైపు హెచ్‌సీయూ డిపో వద్ద మరో కార్మికుడు బ్లేడ్‌తో గాయపర్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అలాగే ప్రైవేట్ డ్రైవర్ల చేతిలో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదివారం హయత్‌నగర్ వద్ద ఓ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను, బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సోమవారం కూకట్పల్లి వద్ద ఒక బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ముందు బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు సమ్మెపై అనిశ్చితి కొనసాగుతున్న దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది నియామకాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం 1200 మంది డ్రైవర్లు, 1200 కండక్టర్లు తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్నారు. అశోక్లీలాండ్, టాటా ఐశ్చర్, తదితర కంపెనీలకు చెందిన సుమారు 20 మెకానిక్ బృందాలను డిపోల్లో ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, తదితర సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో 1133 అద్దె బస్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. అలాగే మరో 752 ప్రైవేట్ బస్సులను నడపాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నగర శివార్లలోని గ్రామాలకు తిరుగుతున్న ఆర్టీసీ మఫిషియల్ సర్వీసుల స్థానంలో ఈ ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. క్యాబ్‌లకు మీటర్లు బిగించాలి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్ధతునిస్తున్నాం. క్యాబ్‌లలో దోపిడీని అరికట్టేందుకు మీటర్ల విధానాన్ని అమలు చేయాలి. స్లాక్ అవర్స్, పీక్ అవర్స్‌తో నిమిత్తం లేకుండా కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చార్జీ విధించాలి. అప్పుడే ప్రయాణికులు, డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది. –షేక్ సలా ఉద్దీన్,( చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ ) -
చిన్నమెసేజ్‌తో శ్రీరామ రక్ష
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం పోలీసులు మరో వినూత్న ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్ వాహనాల తో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. నగరం విస్తరిస్తున్న దరిమిలా మ హిళా ఉద్యోగులు అన్ని వేళల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి భద్రత కలి్పంచడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎలా పని చేస్తుందంటే..? ఆపద ఎదురైనా, ప్రమాదాల్లో చిక్కుకున్నా.. ఓలా, టోరా, రైడో, ఎం–వాలెట్, హాక్ ఐ యాప్‌ల్లో ఉన్న ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ) బటన్‌ను నొక్కితే చాలు సమీపంలోని ప్యాట్రోల్ వాహనాలు, బ్లూకోల్ట్స్, స్థానిక ఏసీపీ, డీసీపీ, స్టేషన్ ఎస్హెచ్ఓ, మహిళ బంధువులకు సమాచారం అందుతుంది. ఫలితంగా సదరు క్యాబ్ డ్రైవర్ వివరాలు ఫోన్ నంబర్, బయోడేటా మొత్తం పోలీసులకు వచ్చేస్తుంది. సమీపంలో ఉన్న గస్తీ వాహనాలు, పోలీసులు జీపీఎస్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇందుకోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఓ ప్రత్యేకమైన బృందం 24 గంటలు పనిచేస్తుంది. ఈ ప్రక్రియంతా ముగిసిన తరువాత ఎవరు ఎలా పనిచేసారో తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే ప్రతినిధులు బాధితులకు ఫోన్ చేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం నగరానికే పరిమితమైనా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలియజేశారు. మిగిలిన క్యాబ్ సంస్థలూ ముందుకువచ్చి ఈ విధానంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు, పౌరుల్లో హాక్ ఐ మీద అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 22 లక్షల మంది హాక్ ఐని డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. -
హైదరాబాద్‌లో ప్రైడో క్యాబ్ సేవలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరవాసులకు నూతనంగా మరో క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ వెంకట ప్రణీత్ టెక్నాలజీస్.. ప్రైడో బ్రాండ్ పేరిట క్యాబ్స్ రంగంలోకి ప్రవేశించింది. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రైడో యాప్, లోగోలను తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా 2007లో రియల్టీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత్ గ్రూప్.. ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఫార్మా, కో–వర్కింగ్ రంగాల్లో కూడా సత్తా చూపిందని, తాజాగా ప్రైడో పేరిట క్యాబ్స్ సేవల్లోకి రావటం ఆనందంగా ఉందని తెలిపారు. అసంఘటిత రంగమైన క్యాబ్స్ పరిశ్రమలో డ్రైవర్లకు, రైడర్లకు విశ్వసనీయత కల్పించినప్పుడే నిలదొక్కుకుంటాం. డ్రైవర్లు బాగుంటేనే కస్టమర్లు బాగుంటారు. అప్పుడే కంపెనీ ముందుకెళుతుంది’’ అని పేర్కొన్నారు. కేవలం జంట నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆశించారు. అనంతరం ప్రైడో ఫౌండర్ అండ్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు మాట్లాడుతూ.. క్యాబ్స్ పరిశ్రమలో డ్రైవర్లను కేవలం లాభార్జన కోసం వినియోగించుకుంటున్న ఈ రోజుల్లో వారిని లాభాల్లో కూడా వారిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ప్రైడోను ప్రారంభించామని చెప్పారు. ఇప్పటివరకు డ్రైవర్ల నమోదు, టెక్నాలజీ అభివృద్ధి మీద దృష్టి సారించామని, ఇక నుంచి రైడర్లను ఆకర్షించడం మీద ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. సరికొత్త ఫీచర్లు, రాయితీలు, ఆఫర్లతో ఆకర్షిస్తామన్నారు. తొలి రెండు రైడ్లకు ఒక్కో రైడ్ మీద రూ.50 రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూర్మయ్యగారి నవీన్ రావు, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్లు నర్సింగరావు, ఆంజనేయ రాజు, నర్సిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి, సందీప్ రావు, ప్రైడో డైరెక్టర్ శ్రీకాంత్ చింతలపాటి తదితరులు పాల్గొన్నారు. -
సర్‌చార్జీ లేకుండా ప్రైడో క్యాబ్స్‌లో ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్స్ పరిశ్రమలో రైడర్లకు సర్‌చార్జీ భారం తప్పనుంది. జీరో సర్‌చార్జీతో మార్కెట్లోకి ప్రైడో క్యాబ్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 14 వేల మంది డ్రైవర్లు నమోదయ్యారని, ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రైడో క్యాబ్స్ ఫౌండర్ అండ్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు గురువారం ఇక్కడ తెలిపారు. వచ్చే 6 నెలల్లో న్యూఢిల్లీ, బెంగళూరులకు, ఏడాదిలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవీ మూడు కేటగిరీల్లో వాహనాలు అందుబాటులో ఉంటాయని, 3నెలల్లో 10 లక్షల రైడ్స్‌ను లకి‡్ష్యంచామన్నారు. ప్రోత్సా హకాల పేరిట డ్రైవర్ల మీద ఒత్తిడి ఉండదని, బిల్లింగ్, ఇన్వాయిస్లలో పారదర్శకత ఉంటుం దని డైరెక్టర్ శ్రీకాంత్ చింతలపాటి తెలిపారు. -
గ్రేటర్ క్యాబ్ సిటీ!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ క్యాబ్ సిటీగా మారుతోంది. సిటీజనులు తమ రోజువారీ పనులకు, కార్యాలయాలకు వెళ్లేందుకు క్యాబ్స్‌ను ఆశ్రయిస్తుండడంతో ఈ రంగంలో సరికొత్త సర్వీసులు వచ్చిచేరుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక్క మొబైల్ క్లిక్‌తో అద్దెకారును పొందే అవకాశాలు సిటీలో వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్యాబ్‌లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓలా, ఉబర్‌కు దీటుగా సరికొత్త క్యాబ్ సర్వీసులు నగర రహదారులపై దూసుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త క్యాబ్‌లు రోడ్డెక్కాయి. మరిన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి. మరోవైపు డ్రైవర్లకు సైతం సముచితమైన కమీషన్లు ప్రకటిస్తున్నాయి. ప్రయాణికులు కేవలం ఒకటి, రెండు క్యాబ్ అగ్రిగేటర్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా మరిన్ని సంస్థల సేవలను వినియోగించుకొనే అవకాశంలభించింది. అదే సమయంలో ఓలా, ఉబర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీగా స్థానిక క్యాబ్ అగ్రిగేటర్లు రావడం గమనార్హం. కొత్తగా అందుబాటులోకి వస్తున్న క్యాబ్‌ల వల్ల ప్రయాణికులకు స్థిరమైన చార్జీల్లో రవాణా సదుపాయం లభించనుంది. ఇప్పటికే ఆ దిశగా కొత్త క్యాబ్ సంస్థలు స్పష్టమైన హామీలతో ముందుకొచ్చాయి. రోడెక్కిన కొత్త క్యాబ్స్ మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటికీ క్యాబ్‌లకు ఆదరరణ మాత్రం తగ్గలేదు. సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ వర్గాల వరకు ఏ అవసరానికైనా క్యాబ్‌పైనే ఆధారపడుతున్నారు. గ్రేటర్లో సుమారు లక్షకు పైగా కార్లు క్యాబ్ అగ్రిగేటర్లతో అనుసంధానమై ఉన్నాయి. ఓలా స్వయంగా లీజు వాహనాలను నడుపుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతి రోజు 10 వేలకు పైగా సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు క్యాబ్ అందుబాటులో ఉంది. ప్రయాణికులలో ఉన్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త సంస్థలు ముందుకొస్తున్నాయి. రకరకాల ప్యాకేజీలతో ప్రయాణికులను, డ్రైవర్లను ఆకట్టుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లో తమ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో వచివాలిపోతామని.. ‘పీక్ అవర్స్’ చార్జీలు అంటూ ప్రత్యేంగా లేవంటూ ఆకర్షిస్తున్నాయి. ‘ఫిక్స్డ్’ చార్జీలతో ‘ఒఫు’ క్యాబ్స్ ఇప్పటికే రోడ్డెక్కాయి. ఎలాంటి సర్‌చార్జీలు, కమిషన్లు లేని సేవలతో ‘టోరా’ క్యాబ్‌లు వచ్చేశాయి. ఇలాంటి ప్యాకేజీలతోనే ‘ప్రైడ్ క్యాబ్స్’ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. టోరా ఇలా.. ప్రస్తుతం రద్దీ అధికంగా ఉండే సమయంలో కొన్ని ఆగ్రిగేటర్లు చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపుతూ సర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు డ్రైవర్లకు సరైన కమిషన్లు, ప్రోత్సాహకాలు లభించడం లేదని.. పనిగంటలతో నిమిత్తం లేని టార్గెట్లతో డ్రైవర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ‘నో సర్‌చార్జీ–నో కమీషన్’ నినాదంతో వచ్చింది ‘టోరా’. ప్రయాణికులు సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో డ్రైవర్లు ఎలాంటి కమీషన్ కూడా చెల్లించాల్సిన పనిలేదు. టోరా యాప్‌ను వినియోగించుకున్నందుకు డ్రైవర్లు రోజుకు రూ.199 చొప్పున యూజర్ చార్జీలు మాత్రమే చెల్లిస్తే చాలునని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ కవితా భాస్కరన్ తెలిపారు. గత వారం రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా ప్రయాణికులు తమ సేవలను వినియోగించుకున్నట్లు కవితా భాస్కరన్ వివరించారు. ఫిక్స్డ్ చార్జీలతో ‘ఒఫు’ హైదరాబాద్ కేంద్రంగా ఇటీవల రోడ్డెక్కిన మరో క్యాబ్ సర్వీసు ‘ఒఫు’. ఒఫు అంటే ఆఫ్రికాలోని ఎగ్బో భాషలో ‘స్థిరమైన’ అని అర్థం. ఆ పదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యాబ్స్‌ను ప్రారంభించినట్లు చెప్పారు ఆ సంస్థ వ్యవస్థాపకులు అరుణ్‌కుమార్. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం రద్దీ అధికంగా ఉండే వేళల్లో, వర్షం కురిసినప్పుడు క్యాబ్ చార్జీలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సాధారణ వేళల్లో 10 కిలోమీటర్ల దూరానికి రూ.200 ఉంటే రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో అది రూ.300 దాటిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు కిలోమీటర్‌కు రూ.19 చొప్పున 24 గంటల పాటు స్థిరమైన చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేస్తారు. అలాగే డ్రైవర్లకు కిలోమీటర్‌కు రూ.15 చొప్పున చెల్లిస్తారు. 29న ‘ప్రైడో’ క్యాబ్స్ ఆగమనం ప్రయాణికులపైన ఎలాంటి అదనపు భారం మోపకుండా, అదే సమయంలో డ్రైవర్లపై కమీషన్ల భారాన్ని తగ్గిస్తూ సిటీలో మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతో ‘ప్రైడో క్యాబ్స్’ దూసుకొస్తోంది. తమ సర్వీసులను ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు ప్రైడో వ్యవస్థాపకులు నరేంద్రకుమార్ తెలిపారు. ఈ సంస్థలో మహిళా డ్రైవర్లకు భాగస్వామ్యం కల్పించనున్నారు. డ్రైవర్లు తమ ఆదాయాన్ని పెంచుకొన్న కొద్దీ ప్రైడోకు చెల్లించవలసిన కమీషన్ తగ్గడం గమనార్హం. ఉదాహరణకు నెలకు రూ.50 వేలు సంపాదించే డ్రైవర్ 10 శాతం చొప్పున కమీషన్ చెల్లిస్తే, రూ.70 వేలు సంపాదించే వారు కేవలం 4 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అస్థిరమైన చార్జీలతో ప్రయాణికులను బెంబేలెత్తించకుండా తక్కువ చార్జీలతో ఎక్కువ రవాణా సదుపాయం కల్పిస్తారు. ‘ప్రయాణికులకు, డ్రైవర్ భాగస్వాములకు, మా సంస్థకు ప్రయోజనం ఉండే విధంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాం. మా సేవలు పూర్తి పారదర్శకంగా ఉంటాయి’ అని ఆయన వివరించారు. -
ప్రైడో క్యాబ్స్ వస్తున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ల మార్కెట్ వేడెక్కుతోంది. ఓలా, ఉబెర్‌కు పోటీగా హైదరాబాద్‌లో ఇటీవలే టోరా క్యాబ్స్ ఆరంభం కాగా... భారీ పెట్టుబడులు, టెక్నాలజీ మద్దతుతో మరో సంస్థ రంగంలోకి దిగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్.. వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ పేరిట ‘ప్రైడో’ యాప్‌తో ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. వచ్చే నెల 29న హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించుంది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని, సుమారు 20 వేల క్యాబ్స్‌తో ఆరంభించనున్నామని ఫౌండర్ అండ్ సీఈఓ నరేంద్రకుమార్ కామరాజు ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... డ్రైవర్లది అసంఘటిత రంగమే. వాహనం తనదే. నడిపేదీ తనే! కానీ, లాభాలు పొందేది అగ్రిగేటింగ్ కంపెనీలు. దీనికి చెక్ పెడుతూ... డ్రైవర్లకు తగిన గౌరవం, ప్రతిఫలం అందించాలనే లక్ష్యంతోనే ప్రైడోను ఏర్పాటు చేశాం. వారం రోజులుగా డ్రైవర్స్ పార్టనర్స్ నమోదు మొదలైంది. 4 వేల మంది రిజిస్టరయ్యారు. మహిళ డ్రైవర్లను కూడా పార్ట్‌నర్స్‌గా నమోదు చేస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. 100 మంది మహిళ పార్టనర్ డ్రైవర్స్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. తెలంగాణ పోలీస్ విభాగం ‘హ్యాక్ ఐ’ యాప్‌తో ఇది అనుసంధానమై ఉంటుంది. దీంతో కస్టమర్లకు భద్రత, రక్షణ ఉంటుంది. డ్రైవర్ కమీషన్ 10 శాతం.. ఇతర క్యాబ్ అగ్రిగేటర్లు 30–40 శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ప్రైడోలో ఇది 10 శాతమే. తొలి 15 రోజులూ డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతి రైడ్‌పై 10 శాతం కమీషన్ ఉంటుంది. నెలకు రూ.50 వేల పైన చేస్తే కమీషన్ తగ్గుతుంది కూడా. ప్రైడో బ్రేక్, జీరో ఆన్ బోర్డింగ్ చార్జెస్, పార్కింగ్ ఫెసిలిటీ వంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. యాప్‌లో ఫిమేల్ డ్రైవర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మహిళ డ్రైవర్ వస్తారు. అయితే ఈ ఆప్షన్ జియో ఫెన్సింగ్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రైవర్ల కోసం సంక్షేమ నిధి.. త్వరలోనే ప్రైడో పార్టనర్ వెల్ఫేర్ ఫండ్‌ను (పీపీడబ్ల్యూఎఫ్) ఏర్పాటు చేయనున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పందం.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ ప్రముఖ కార్ల తయారీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నాం. నవంబర్ నుంచి ఉద్యోగుల రవాణా సేవలు.. సెప్టెంబర్‌లో సేవలు ఆరంభించాక... నవంబర్ నుంచి బీ2బీ విభాగంలో ఉద్యోగుల ట్రాన్స్పోర్ట్ సేవల్ని ప్రారంభిస్తాం. -
నేటి నుంచే టోరా క్యాబ్స్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ టోరా క్యాబ్స్ తన సేవలను నేటి (సోమవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభిస్తోంది. 10,000లకు పైగా కార్లతో రంగంలోకి దిగుతున్నట్టు టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ సీఈవో శ్రీనివాస్ కృష్ణ వెల్లడించారు. మార్కెటింగ్ డైరెక్టర్ కవిత భాస్కరన్‌తో కలిసి ఆదివారమిక్కడ టోరా యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ‘కిలోమీటరుకు రూ.10 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న క్యాబ్ అగ్రిగేటర్లు డిమాండ్‌నుబట్టి సర్జ్ పేరుతో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. జీరో సర్జ్‌తో కస్టమర్లకు చేరువ అవుతాం. డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయబోము. డ్రైవర్లు రోజుకు రూ.199 చందా చెల్లిస్తే చాలు. దశలవారీగా ఇతర నగరాలకు కూడా సర్వీసులను విస్తరిస్తాం’ అని వివరించారు. వాహనం రకాన్నిబట్టి కిలోమీటరుకు రూ.20 వరకు చార్జీ ఉంటుంది. ట్రావెల్ టైమ్ చార్జీ కిలోమీటరుకు రూ.1.52 అదనం. రూ.45 బేస్ ఫేర్‌పై 3 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. కవిత భాస్కరన్, శ్రీనివాస్ కృష్ణ -
భద్రత.. భరోసా
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వారి కోసం ఇప్పటికే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ‘షీ షటిల్’ సర్వీసులు నడిపిస్తున్న పోలీసులు... రాత్రి సమయాల్లో వారికి మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ పేరుతో 2016 జూన్ 16న విడుదల చేసిన జీవో 51 ప్రకారం... రాత్రి సమయాల్లో మహిళలకు తప్పనిసరిగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఆ బాధ్యతలను ఆయా కంపెనీలు చూసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం ఆదేశించారు. ఏదైనా పని నిమిత్తం కంపెనీ ఏర్పాటు చేసే క్యాబ్‌లలో వెళ్లని పక్షంలో సదరు ఉద్యోగినులు కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చాలా సందర్భాల్లో కార్యాలయాలకు వెళ్లిన మహిళలు ఇంటికి తిరిగిరాని పక్షంలో కుటుంబసభ్యులు కంగారుపడి పోలీసులను ఆశ్రయిస్తున్న సంఘటనలు పెరుగుతుండడంతో సీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలకు ఐటీ కంపెనీలు సమ్మతించాయి. మహిళల కోసం క్యాబ్‌లు నడుపుతామంటూ తెలిపాయి. -
బైక్ భళా... క్యాబ్ దివాలా!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు రాకతో నగరంలో క్రమంగా రవాణా సదుపాయాల ముఖచిత్రం మారుతోంది. అతి పెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగొందే ఆర్టీసీ ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో ఏసీ సర్వీసులను తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ఈ రూట్లో ఆర్టీసీ ఆక్యుపెన్సీ తగ్గుముఖం పట్టింది. తాజాగా క్యాబ్‌లు సైతం సిటీ బస్సుల బాటలో నడుస్తున్నాయి. రాత్రింబవళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండే ఓలా, ఉబర్ తదితర సంస్థలకు చెందిన క్యాబ్ సర్వీసులకు ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో 30 శాతం వరకు డిమాండ్ పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ రూట్లో క్యాబ్ డ్రైవర్లు బుకింగ్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మెట్రో రైలునడిచే ఉప్పల్ –సికింద్రాబాద్–అమీర్‌పేట్ రూట్లో కొంతకాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్లు ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో దివాలా తీశారు. మరోవైపు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు క్యాబ్ డ్రైవర్లను మరింత కుంగదీశాయి. దీంతో ఎల్బీనగర్–మియాపూర్ రూట్ అంటేనే డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. భారీగా పెరిగిన డీజిల్ ధరల కారణంగా ప్రతి నెలా ఇంధనం వినియోగంపైన కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవైపు బుకింగ్‌లు లేక, మరోవైపు ఆదాయం బాగా పడిపోయి, ప్రయాణికుల ఆదరణ కొరవడుతూండడంతో క్యాబ్ డ్రైవర్లు సైతం రూట్ మారుస్తున్నారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్–కూకట్పల్లి–మియాపూర్ మార్గంలో క్యాబ్ బుకింగ్‌లు తగ్గిపోవడంతో డ్రైవర్లు నగర శివార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు ఓలా, ఉబెర్ భాగస్వామ్యం నుంచి వైదొలగి దూరప్రాంతాలకు సర్వీసులను నడుపుతున్నారు. నిజానికి ఎల్బీనగర్–మియాపూర్ ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న రూట్. ఆర్టీసీ బస్సులే కాకుండా ఆటోలు, క్యాబ్‌లకు ఎంతో డిమాండ్ ఉండేది. కానీ మెట్రో రాకతో ఈ రూట్లో దూరం బాగా తగ్గిపోయింది. పైగా ప్రయాణికులు ఎలాంటి అలసట, ఒత్తిడి లేకుండా నిమిషాల్లో గమ్యం చేరగలుగుతున్నారు.‘ గతంలో ఈ రూట్లో ప్రతి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలకు ఒక బుకింగ్ చొప్పున లభించేది. ఇప్పుడు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది’ అని విస్మయం వ్యక్తం చేశారు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్. చాలా మంది డ్రైవర్లు క్యాబ్‌లను వదిలేసి ప్రత్యామ్నాయం వెదుక్కుంటున్నట్లు తెలిపారు. క్యాబ్‌ల స్థానంలో బైక్‌లు... అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్పల్లి, తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు క్యాబ్‌లను ఆశ్రయించేవారు. ఎల్బీనగర్–మియాపూర్, ఉప్పల్–అమీర్‌పేట్ వంటి మెట్రో సమాంతర మార్గాల్లో క్యాబ్‌లకు డిమాండ్ తగ్గినప్పటికీ ఐటీ కారిడార్లకు మాత్రం బాగానే ఉండేది. కానీ మెట్రో స్టేషన్ల నుంచి క్యాబ్ తరహాలో ఇప్పుడు బైక్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఈ ట్రాన్స్‌పోర్టు బైక్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలను చేర్చే సదుపాయం బైక్‌ల వల్ల అందుబాటులోకి వచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన సుమారు 500 బైక్‌లు ప్రస్తుతం మెట్రో స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బైక్‌లు ప్రతి రోజు 2000 నుంచి 3000 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. 3 కిలోమీటర్ల కనీస దూరం నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా బైక్ రైడింగ్ సదుపాయం వచ్చింది. అలాగే మెట్రో స్టేషన్లలో ఉండే ‘ మై బైక్’లకు కూడా క్రమంగా డిమాండ్ ఏర్పడుతుంది. మియాపూర్, పంజగుట్ట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ స్టేషన్లలో 60 మై బైక్‌లను అందుబాటులో ఉంచారు. ఇదీ పరిస్థితి... ♦ ఉప్పల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ రూట్లో రాకపోకలు సాగిస్తున్న మెట్రో ప్రయాణికులు : 50 వేలు ♦ ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రో సేవలను వినియోగించుకుంటున్న వాళ్లు : 1.25 లక్షలు ♦ మెట్రో వల్ల రద్దయిన ఏసీ బస్సుల ట్రిప్పులు:100 నుంచి 120 ♦ మెట్రో ప్రభావం వల్ల తగ్గిన క్యాబ్‌లు 30 శాతం మెట్రో స్టేషన్ల నుంచి నడిచే బైక్‌ల ధరలు... ♦ మొదటి 3 కిలోమీటర్లకు రూ.20. ♦ 3 నుంచి 5 కిలోమీటర్లకు రూ.30 ♦ 5 నుంచి 8 కిలోమీటర్లకు రూ.50 చాలా కష్టంగా ఉంది చాలామంది డ్రైవర్లు క్యాబ్‌లు నడిపేందుకు భయపడుతున్నారు. మెట్రో వల్ల డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే, డీజిల్ ధరలు పెరగడం మరో కారణం. ఒకప్పుడు నెలకు రూ.9 వేల వరకు డీజిల్ కోసం ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు అది రూ.13 వేల వరకు పెరిగింది. బుకింగ్‌లు తగ్గిపోవడంతో ఆదాయం రావడం లేదు. పైగా ఇప్పుడు ఉన్న డ్రైవర్ల ఉపాధికి దిక్కులేదంటే ఓలా, ఉబెర్ సంస్థలు ఎడాపెడా కొత్త క్యాబ్‌లను చేర్చుకుంటున్నాయి. దీంతో మరింత నష్టపోవాల్సి వస్తోంది.– సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ -
క్యాబ్‌కు సెలవు
సాక్షి బెంగళూరు: ఐటీ సిటీలో ప్రయాణం చేయాల్సి వస్తే క్యాబ్‌ను యాప్‌లో బుక్ చేసుకోవడం క్రమంగా తగ్గుతోంది. రవాణా శాఖ ఇటీవల క్యాబ్ రేట్లను పెంచడంతో ప్రజలు క్యాబ్ ట్యాక్సీల సేవలకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఓలా, ఉబర్ తదితర క్యాబ్‌లను మొబైల్ యాప్ ద్వారా తొందరగా బుక్ చేసుకుని ప్రయాణించడం అందరికీ సులువుగానే ఉంటోంది. కానీ వాటి చార్జీలు భగ్గుమంటుండడంతో జనం పొదుపుగా ఉండే రవాణా సాధనాలపై దృష్టి సారిస్తున్నారు. సొంత వాహనాల్లోను, ఆటోలు, బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణాలకూ వెనుకాడడం లేదు. ఓలా, ఉబర్ క్యాబ్‌లు గతంలో తక్కువ రేట్లకే ప్రయాణం చేసేలా ఆఫర్లు ప్రకటించాయి. దీంతో ప్రజలు క్యాబ్‌ల్లో ప్రయాణించేందుకు అలవాటు పడ్డారు. ఒక్కరే వెళ్లడానికి కూడా తక్కువ ధరలు కావడంతో అందరు ఆసక్తి చూపారు. కొత్తగా రేట్లు పెరగడంతో వినియోగదారులు ఒకటికిరెండు సార్లు ఆలోచిస్తున్నారు. గత్యంతరం లేనిపక్షంలోనే క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. కొత్త చార్జీలు ఇలా ⇔ ఈ ఏడాది మార్చి 3న రేట్లను సవరిస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. క్యాబ్ వాహనాల ఖరీదు ఆధారంగా ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి చార్జీలను నిర్ధారించింది. ⇔ డి క్లాస్ వాహనాల్లో (వాహనం రేటు రూ.5 లక్షల వరకు) కనీస చార్జీ రూ.44 ఉంది. – కిలోమీటరుకు రూ.11– 22 ⇔ సి క్లాస్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు) వాహనాల్లో అయితే రూ.48. – కి.మీకి రూ.12–24 ⇔ బి క్లాస్ (రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు) వాహనాల్లో రూ.64. – కి.మీ.కి 16–34 ⇔ ఎ క్లాస్ (రూ.16 లక్షల పైగా) వాహనాల్లో కనీస చార్జీ రూ.80. –కి.మీ.కి 25 –45 ⇔ కొత్త నిబంధనల ప్రకారం క్యాబ్ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే వెయిటింగ్ చార్జీ కింద ప్రతి 15 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. కొన్నింటికే పరిమితం అయితే పెంచిన రేట్లు కొన్ని వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు మారుతూ వస్తుంటాయి. ఖరారు చేసిన ధరల కంటే ఒక్కోసారి ఎక్కువగా కూడా వసూలు చేస్తుంటారు. బెంగళూరు టూరిస్టు టాక్సి ఆపరేటర్స్ అసోసియేషన్ (బీటీటీఓఏ) మాత్రం పెంచిన రేట్లపై స్పందించలేదు. నగరంలో మొత్తంగా 1.25 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు రవాణా విభాగానికి అటాచ్ అయి ఉన్నాయి. -
ఓలా.. ఉలాలా!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఓలా క్యాబ్‌లు పరుగులు తీస్తున్నాయి. ప్రధాన రవాణా కేంద్రాల నుంచి చివరి మైలు వరకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రవేశపెట్టిన క్యాబ్ సేవలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సుమారు 3 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు చివరి మైలు క్యాబ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లు అంచనా. ఇందుకోసం సుమారు 25 వేల క్యాబ్‌లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నగరంలో ప్రతిష్టాతక్మంగా ఏర్పాటు చేసిన మెట్రో రైలు సేవలను అన్ని వర్గాల ప్రయాణికులకు చేరువచేసేందుకు మెట్రో కారిడార్లకు రెండు వైపులా అన్ని కాలనీలకు, ప్రధాన ప్రాంతాలకు చివరి మైలు కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ఈ మేరకు సిటీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో చేరువకాలేకపోయాయి. ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు అవసరమైన లాస్ట్‌మైల్ కనెక్టివిటీని ఓలా సద్వినియోగం చేసుకుంది. దీంతో అదేస్థాయిలో ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నట్లు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. ఎలాంటి కాలయాపన లేకుండా క్యాబ్ బుక్ చేసుకొన్న రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికుడికి అందుబాటులోకి వచ్చే విధంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ హబ్‌లలో కియోస్క్‌లు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 8 వేలకుపైగా క్యాబ్‌లు, ట్రావెల్స్ వాహనాలు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. సుమారు 40 వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందుకోవడంలో ఓలా ప్రవేశపెట్టిన కియోస్క్‌లు, ఓలా జోన్లు సత్ఫలితాలనిచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. విమానం దిగిన ప్రయాణికుడు నేరుగా ఓలా కియోస్క్ వద్దకు వచ్చి తన మొబైల్ నంబర్, వెళ్లాల్సిన గమ్యస్థానం చెబితే చాలు కేవలం రెండు నిమిషాలలోపే క్యాబ్ వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ఓలా వైపు మొగ్గు చూపుతున్నారు. ఓలా జోన్లలో 24 గంటల పాటు క్యాబ్‌లు ఉండేలా జాగ్రత్తలు పాటించడంతో ప్రయాణికులకు ఏ సమయంలోనైనా కోరిన వెంటనే క్యాబ్ లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఇది తమ సంస్థను ప్రయాణికులకు బాగా చేరువ చేసిందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కియోస్క్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి ఎయిర్‌పోర్టు వర్గాలతో కుదుర్చుకున్న అవగాహన సైతం క్యాబ్ సర్వీసుల పెంపునకు దోహదం చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్‌ల వద్ద ఓలా సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తారు. తమ మొబైల్ ఫోన్లలో ఓలా యాప్ నుంచి బుక్ చేసుకోలేని ప్రయాణికులకు కియోస్క్‌లలో బుకింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే క్యాబ్ బుక్ చేసిన క్షణాల్లోనే వచ్చి వాలుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు లక్షా 80 వేల మంది రాకపోకలు సాగిస్తారు. కనీసం 25 వేల మంది వరకు ఓలా సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి కూడా ఓలా కియోస్క్ ఆధారిత క్యాబ్ సర్వీసులకు చక్కటి ఆదరణ లభిస్తోంది. వీటితో పాటు జూబ్లీ, మహాత్మాగాంధీ బస్స్టేషన్లు, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, లక్డీకాపూల్ వంటి ప్రధాన ప్రయాణ కూడళ్లు ఓలా సర్వీసులకు కేంద్రంగా మారాయి. ఎంజీబీఎస్‌లో కూడా ఓలా జోన్, ఓలా కియోస్క్ ఏర్పాటు చేశారు. త్వరలో మరిన్ని సర్వీసులు.. మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు, ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు ప్రస్తుత మెట్రో కారిడార్‌లో, ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మార్గంలోనూ లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి చేపట్టిన చర్యలు ఫలితాలలిస్తున్న నేపథ్యంలో తమ క్యాబ్ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు ఓలా కమ్యూనికేషన్స్ ప్రతినిధి అమోఘ్ తెలిపారు. ‘దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా హైదరాబాద్‌లో ఓలా క్యాబ్ పరుగులు తీస్తోంది. ఎప్పటికప్పుడు ప్రయాణికుల డిమాండ్, అభిరుచికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. మరికొద్ది నెలల్లో ఎలక్ట్రిక్ క్యాబ్‌లను కూడా హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్లు మరోసారి రోడ్డెక్కారు. అంతర్జాతీయ క్యాబ్ సంస్థల వేధింపులను నిలిపివేయాలని, తమ శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఓలా కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జై డ్రైవరన్న అసోసియేషన్‌తో పాటు ఇతర సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. లీజు విధానాన్ని రద్దు చేయాలని, వాహనాల కేటగిరీలతో నిమిత్తం లేకుండా ప్రతి కిలోమీటర్‌కు రూ.23 చొప్పున డ్రైవర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధార్థగౌడ్ మాట్లాడుతూ.. వేలాది వాహనాలను లీజు రూపంలో దారుణంగా దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు లభించే ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రతి రోజు రూ.1150 చొప్పున వసూలు చేస్తున్నారని, రోజంతా కష్టపడినా డ్రైవర్‌కు ఏ మాత్రం ఆదాయం లభించడం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. డ్రైవర్లను జలగల్లాగా పీడించే లీజు పద్ధతిని రద్దు చేయాలన్నారు. క్యాబ్‌లకు మినీ, మైక్రో, షేర్, ప్రైమ్ వంటి పేర్లు పెట్టి అతి తక్కువ చార్జీలు చెల్లించడం పట్ల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్యాబ్ సంస్థల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వమే స్వయంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు. డ్రైవర్లకు ఈఎస్ఐ, పెన్షన్, తదితర సదుపాయాలతో పాటు ఎయిర్‌పోర్టు, బస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. క్యాబ్ సర్వీసులు నిలిపివేత ఇలా ఉండగా, తమ న్యాయమైన డిమాండ్ల సాధానకు ఓలా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాకపోవడంతో గురువారం నుంచి నగరంలో క్యాబ్ సర్వీసుల బంద్ చేపట్టనున్నట్లు సిద్ధార్థగౌడ్ తెలిపారు. ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఎక్కడికైనా క్యాబ్ రెడీ!
ఇంత వరకు సిటీకే పరిమితమైన క్యాబ్ సర్వీసులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా సరే పరుగుకు సిద్ధమంటున్నాయి. వీకెండ్లో టూర్‌కు వెళుతున్నా.. వారం రోజుల పాటు ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడినా సరే ఇప్పుడు క్యాబ్ అందుబాటులో ఉంది. బుక్ చేసిన గంటలోగా ఇంటికి వచ్చేస్తుంది. సొంత వాహనం అనుభూతితో ప్రయాణం చేయవచ్చు. నగరంలో క్యాబ్సేవలు అందిస్తున్న ‘ఓలా’ సంస్థ ఇప్పుడు ‘అవుట్ స్టేషన్ సర్వీస్’లను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకు, పర్యాటక ప్రాంతాలకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వేసవి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సుమారు 10 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అవుట్ స్టేషన్ క్యాబ్‌లను ఎంపిక చేసుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికుల అభిరుచికి అనుగుణమైన కార్లను ఇంటర్సిటీ సర్వీసులుగా నడుపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాలు, జిల్లా కేంద్రాలకు క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఓలా.. మరో 600 నగరాలకు వన్‌వే ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఏలూరు, చిత్తూరు, కడప, వరంగల్, శ్రీశైలం తదితర ప్రధాన కేంద్రాలకు వన్‌వే ట్రిప్పులను, వీకెండ్ క్యాబ్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఓలా యాప్ నుంచే ఈ అవుట్ స్టేషన్ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. ‘అవుట్ స్టేషన్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే అన్ని వివరాలు మొబైల్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలనే అంశాన్ని ఎంపిక చేసుకొంటే అందుకు చెల్లించవలసిన చార్జీలు కూడా తెలిసిపోతాయి. చార్జీల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవల నిర్వహణ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వన్‌వే ట్రిప్పులతో పాటు, 12 గంటల ట్రిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాబ్ బుక్ చేసుకున్న గంట వ్యవధిలోనే క్యాబ్ ఇంటికి ముందుకు వచ్చి వాలుతుంది. అంతేకాదు 7 రోజుల ముందే బుక్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య, కావలసిన సదుపాయాలకు అనుగుణంగా సెడాన్, ఎస్యూవీ, లగ్జరీ వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. దేని చార్జీలు దానికే విడిగా ఉంటాయి. పూర్తి ఏసీ సదుపాయంతో, వినోదభరితమైన ప్రయాణ సదుపాయాన్ని అందజేస్తారు. వన్‌వే ట్రిప్పులు, వీకెండ్ టూర్లు కూడా సిద్ధం చేశారు. అవుట్ స్టేషన్ సర్వీసులను గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాలకు వాటిని విస్తరించడంతో డిమాండ్ పెరిగినట్లు ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ప్రయాణికులకు పూర్తి భద్రత.. ఓలా యాప్ నుంచి బుక్ చేసుకొనే అవుట్ స్టేషన్ సర్వీసుల్లో అన్ని భద్రతా సదుపాయాలు ఉన్నాయి. డ్రైవర్ అనుభవం, డ్రైవింగ్ లైసెన్సు, వాహనం వివరాలతో పాటు ఏ క్షణంలోనైనా రక్షణ కోరేందుకు ప్యానిక్ బటన్ సైతం ఏర్పాటు చేశారు. జీపీఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల అవుట్ స్టేషన్ క్యాబ్‌ల్లో కూడా వెహికల్ ట్రాకింగ్ మూవ్మెంట్ తెలుస్తుంది. 24 గంటలూ భద్రతా సదుపాయం ఉంటుంది. -
క్యాబ్ సంస్థల గ‘లీజు’!
సాక్షి, హైదరాబాద్ : అదో క్యాబ్ సేవల సంస్థ.. ఏటా కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తోంది.. ఆ వ్యాపారంపై ప్రభుత్వానికి పన్ను ఎగవేసింది.. రిజిస్ట్రేషన్నే రద్దు చేసుకుని, పన్ను మాటెత్తకుండా పోయింది.. మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంది.. మళ్లీ కోట్లు ఎగవేసింది.. మళ్లీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని కొత్త అవతారం ఎత్తింది.. ఇలా ఒకటికాదు రెండు కాదు వందల సంఖ్యలో క్యాబ్ నిర్వహణ సంస్థలు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. ముడుపులకు మరిగిన పన్నుల శాఖ అధికారుల సహకారంతో రూ.వందల కోట్ల మేర ఖజానాకు తూట్లు పొడుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే ఈ తరహా ఉదంతం బయటపడినా, రూ.కోటి ముడుపులు తీసుకున్న అధికారి దొరికినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏళ్లుగా ఎగవేతలే.. హైదరాబాద్‌లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు తీసుకొచ్చేందుకు, ఇళ్ల వద్ద దింపేసేందుకు క్యాబ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఇలా సాఫ్ట్వేర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పదుల కోట్ల రూపాయల్లో టర్నోవర్ చేసే రిజిస్టర్డ్ క్యాబ్ సంస్థలుహైదరాబాద్లో 500కిపైగా ఉన్నట్లు అంచనా. వాటి ద్వారా కోట్ల రూపాయల పన్ను ప్రభుత్వానికి సమకూరాల్సి ఉంది. ఉద్యోగులను తరలించడం ద్వారా క్యాబ్ సంస్థలు ఆర్జించే మొత్తం ఏడాదికి రూ.40 లక్షలు దాటితే.. ఆ దాటిన మొత్తంలో 5 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ (సేవాపన్ను) కింద చెల్లించాలి. కానీ చాలా క్యాబ్ సంస్థలు ఏళ్లుగా ఈ పన్ను సొమ్మును ఎగ్గొడుతూనే వస్తున్నాయి. ఇందుకోసం కొత్తకొత్త మార్గాలనూ అనుసరించాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం చేకూరింది. ఆరేళ్ల పాటు ఆడిట్‌కు అవకాశమున్నా.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పన్నులన్నీ కలసి జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో క్యాబ్ సంస్థలు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా ఎగవేసిన వందల కోట్ల రూపాయల పన్నుల సంగతేమిటన్నది ఇప్పుడు తెరపైకి వస్తోంది. వ్యాట్ కింద కట్టాల్సిన ఆ పన్నుల సొమ్మును ఇప్పటికైనా వసూలు చేసే అధికారం పన్నుల శాఖ అధికారులకు ఉంది. ఏ సంస్థ టర్నోవర్నైనా ఆడిట్ చేసి పన్ను రాబట్టే అధికారం ఆరేళ్ల పాటు ఉంటుంది. అంటే గత ఆరేళ్లకు సంబంధించిన పన్ను ఎగవేతలను ఇప్పుడు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే.. జీఎస్టీ అమల్లోకి వచ్చిందే అదనుగా కొన్ని క్యాబ్ సంస్థలు, కొందరు పన్నుల శాఖ అధికారులు కలసి ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారు. ఇటీవల ఓ బడా క్యాబ్ సంస్థ తాను పదేళ్లుగా చేసిన వ్యాపారాన్ని పక్కకు పెట్టి కేవలం ఒకే ఒక్క ఏడాది వ్యాపారాన్ని మదింపు చేసి, ఆ మొత్తానికి పన్ను కట్టి చేతులు దులుపుకొంది. ఇందుకు సహకరించిన పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరికి రూ.కోటి ముడుపుగా సమర్పించుకుంది. కానీ ఈ విషయం బయటపడడంతో క్యాబ్ సంస్థల అక్రమాలు తెరపైకి వచ్చాయి. అయినా ఉన్నతాధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రిజిస్ట్రేషన్.. రద్దు.. ఎగవేత ఏటా కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే క్యాబ్ సంస్థలు పన్ను ఎగ్గొట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ముఖ్యంగా సంస్థ రిజిస్ట్రేషన్‌ను రెండు, మూడేళ్లు కొనసాగించి రద్దు చేసుకుంటున్నాయి. ఆ రెండు, మూడేళ్ల పన్నును తూతూమంత్రంగా చెల్లిస్తున్నాయి. మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి. దాంతో గతానికి సంబంధించిన పన్ను వ్యవహారం పక్కన పడిపోతోంది. ఈ కొత్త రిజిస్ట్రేషన్‌ను కూడా కొన్నాళ్లు కొనసాగించడం.. పన్ను ఎగ్గొట్టి రద్దు చేసుకోవడం.. మరోసారి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా పన్నుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదేమంటే.. తాము జీఎస్టీ పనిలో తీరికలేకుండా ఉన్నామని, తమకు పన్ను వసూలు ఆదేశాలేమీ రాలేదని చెబుతూ తప్పించుకుంటున్నారు. అసలు జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. గత ఆరేళ్లకు సంబంధించిన సంస్థల ఆదాయ, వ్యయాలపై ఆడిట్ చేసి పన్నులు రాబట్టే వెసులుబాటు ఉంది. అయినా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో వ్యాట్ కింద రావాల్సిన కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. క్యాబ్ సంస్థల అక్రమాల ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి.. పన్ను రాబడతారా, యథాతథంగా చూసీచూడనట్టు ఊరుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
సైకిళ్ల నగరంలో షి'కారు'
సిటీ ఆఫ్ బైస్కిల్స్.. అంటే సైకిళ్ల నగరమని అర్థం.. ఎటు చూసినా సైకిళ్లే కనిపించడంతో ఒకప్పుడు మన భాగ్యనగరాన్ని అలా పిలిచేవారు.. మరి ఇప్పుడో...? రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది! రోడ్డెక్కి ఆటో కోసం, సిటీ బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఆటోవాలాల ఆగడాలను భరించాల్సిన అవసరం లేదు. బెంబేలెత్తించే మీటర్ ట్యాంపరింగ్‌లు లేవు. అక్కడక్కడా ఒకట్రెండు ఘటనలు మినహా పూర్తిగా భద్రతతో కూడిన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదీ ఆటోరిక్షా కంటే చౌకగా!! మొబైల్లో బుక్ చేస్తే క్యాబ్‌లు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. సినిమాకు వెళ్లాలన్నా, షికారుకెళ్లాలన్నా, ఆసుపత్రికెళ్లాలన్నా, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనాన్ని తలపించే క్యాబ్ ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు మేరు, డాట్, గ్రీన్‌క్యాబ్స్, రేడియో క్యాబ్స్, షీ క్యాబ్స్ వంటి స్థానిక క్యాబ్ సంస్థలు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్నాయి. నగరంలో మారుతున్న రవాణా రంగ ముఖచిత్రంపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ నాటికి నేటికి ఎంత తేడా..? గుర్రపు బగ్గీలు, టాంగాలు, జట్కాలు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో సైకిల్ దూసుకొచ్చింది. అదీ కొందరు సంపన్నుల వద్దే కనిపించేది. కాలక్రమంలో నగరపు రహదారులను సైకిళ్లు ముంచెత్తాయి. వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా రకరకాల మోడళ్లలో సైకిళ్లను రూపొందించి వినియోగంలోకి తెచ్చారు. 1930 నుంచి మొదలైన సైకిల్ ప్రస్థానం నాలుగైదు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగింది. సంపన్నులతో మొదలై నిరుపేదల వరకు సైకిల్‌ను వాడేవారు. అలా ఇంటింటికీ సైకిల్ వచ్చేసింది. దీనికి సమాంతరంగా సైకిల్ రిక్షాలు పరుగులు తీశాయి. 1980 నాటికి హైదరాబాద్‌లో సైకిల్ రిక్షాయే అతి ముఖ్యమైన రవాణా సాధనమైంది. నిజాం కాలం నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉన్నా పరిమితమైన రూట్లలోనే తిరిగేవి. 80వ దశాబ్దం నాటికి సిటీ బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినా చిన్నచిన్న బస్తీలు, ఇరుకు గల్లీల్లోంచి గణగణ గంట మోగించుకొంటూ సైకిల్ రిక్షా దూసుకుపోయింది. ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్...రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిరా తిరిగితే మోటారు కారు బలాదూర్...’ అంటూ సైకిల్ రిక్షా హైదరాబాద్‌ను ఏలిన రోజులవి! ఎనభైల నాటికి సుమారు లక్ష వరకు సైకిల్ రిక్షాలు ఉండేవని అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలోనే సైకిళ్లు ఉండేవి. ఎనభయ్యో దశాబ్దం హైదరాబాద్ వాహనరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. జట్కాలు, టాంగాలు, సైకిల్ రిక్షాల కంటే వేగంగా గమ్యాన్ని చేర్చే ఆటోరిక్షాలు వచ్చాయి. 1990 నాటికి సిటీ బస్సుతో పాటు ఆటోరిక్షాలు ప్రజా రవాణా రంగంలో అగ్రభాగంలో నిలిచాయి. సహజంగానే మొదట్లో ఉన్నత వర్గాలే వీటిని వినియోగించినా క్రమంగా ప్రతి ఒక్కరు ఆటోను వినియోగించే స్థాయికి వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోటెత్తిన వ్యక్తిగత వాహనాలు నగరం విస్తరిస్తున్నట్లుగానే అందుకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 1970లో వ్యక్తిగత వాహనాలు కేవలం 9789. ప్రజా రవాణా వాహనాలు 5083 మాత్రమే ఉండేవి. 1980 నాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య 27,819కు, ప్రజా రవాణా వాహనాల సంఖ్య 10,437కు చేరింది. 1990లో సుమారు 2.22 లక్షల వాహనాలు నమోదయ్యాయి. ఆ తర్వాత వాహనాల వినియోగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. సైకిళ్లు, సైకిల్ రిక్షాలు, ఆటోలు తదితర వాహనాల కంటే బైక్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో కార్ల వినియోగం ఎక్కువైంది. ఈ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగింది. 2012 నాటికి అన్ని రకాల వాహనాలు కలిపి 36.72 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. అంటే సుమారు కోటి జనాభా ఉన్న నగరంలో అరకోటి వాహనాలు ఉన్నాయన్నమాట! ప్రతి మనిషికీ ఓ బైక్ అన్నట్టుగా వాహన రంగం విస్తరించింది. మధ్య తరగతి, వేతన జీవుల ఆదాయానికి అనుగుణంగా కార్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 35 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉంటే 10 లక్షలకు పైగా కార్లున్నాయి. మిగతావి రవాణా రంగానికి చెందినవి. క్యాబ్ వైపే మొగ్గు ఎందుకు? - సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఆటోరిక్షాలో కనీస చార్జీ రూ.20. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున కనీసం రూ.500 వరకు చార్జీ అవుతుంది. కానీ అంతే దూరానికి క్యాబ్‌లు రూ.300 నుంచి రూ.350 వరకే లభిస్తున్నాయి. - పైగా నేరుగా ఇంటి నుంచే బయలుదేరి గమ్యానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ప్రతి ఒక్కరు క్యాబ్ వైపు మొగ్గుతున్నారు. - మూడేళ్ల క్రితం వరకు నగరంలో సుమారు 1.3 లక్షల ఆటోరిక్షాల్లో ప్రతి రోజు 15 లక్షల మంది పయనించగా ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంది. - నగరంలో 3,550 సిటీ బస్సుల్లో రోజుకు 33 లక్షల మంది తిరుగుతున్నట్లు అంచనా. కానీ క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాల పోటీ కారణంగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు 72 శాతం ఉన్న సిటీ బస్సు ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు ఏకంగా 65 శాతానికి పడిపోయింది. - నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రోజుకు 1.4 లక్షల మంది పయనిస్తున్నారు. ట్రైన్ దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లను వినియోగిస్తుండటం గమనార్హం. క్షణాల్లో బుకింగ్‌లు.. నిమిషాల్లో పరుగులు.. శరవేగంగా దూసుకొచ్చిన క్యాబ్ సర్వీసులతో ఆటోరిక్షాలు, సిటీ బస్సుల గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. గ్రేటర్లో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతిరోజు సుమారు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉబెర్, ఓలా మొబైల్ యాప్‌ల నుంచి రోజూ సుమారు 15 లక్షల మంది తమ గమ్యస్థానాలను బుక్ చేసుకుంటున్నట్లు అంచనా. మరో 5 లక్షల మంది మిగతా క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. ఇందులో ఇండికా, ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ వంటి లగ్జరీ వాహనాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఓలా సంస్థ మరో అడుగు ముందుకేసి ఆటోరిక్షా సర్వీసులను కూడా అందజేస్తోంది. మరోవైపు మోటో పేరుతో ఉబెర్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులకు గురయ్యే ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు క్షణాల్లో కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్ బైక్‌లను వినియోగిస్తున్నారు. ఓలా క్యాబ్‌లలో కేవలం రూ.36ల కనీస చార్జీలతో మొదలై ఒక కిలోమీటర్‌కు రూ.6 చొప్పున రవాణా సదుపాయం అందజేసే మైక్రో, మినీ వాహనాల నుంచి రూ.80ల కనీస చార్జీలతో సేవలందజేసే ప్రైమ్ వాహనాలున్నాయి. ఉబెర్ పూల్, ఉబెర్ ఎక్స్, ఉబెర్ గో, కేటగిరీలలో ప్రయాణికులకు రవాణా సదుపాయాలు అందుతున్నాయి. ట్యాక్సీ గిరాకీ దెబ్బతిన్నది ఇరవై ఏళ్ల నుంచి ట్యాక్సీ నడుపుతున్నా. క్యాబ్ పోటీకి తట్టుకోలేకపోతు న్నారు. క్యా బ్లు వచ్చిన తర్వాత గిరాకీ మొత్తం పడిపోయింది. క్యాబ్ తరహాలో మేం ఎక్కడికంటే అక్కడకు వెళ్ల లేం. చార్జీలు కూడా ట్యాక్సీలో ఎక్కువగానే ఉంటాయి. సికింద్రా బాద్ నుంచి బేగంపేట్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ చార్జీ రూ.300 వరకు ఉంటుం ది. అదే క్యాబ్‌లో అయితే చాలా తక్కువ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. – సయ్యద్ అఫ్సర్, ట్యాక్సీ డ్రైవర్ ఆటో ఎక్కడమే మరిచాను ఒకప్పుడు ఆటో ఎక్కువగా వినియోగించే వాణ్ని. రెండేళ్ల నుంచి పూర్తిగా మానేశాను. నాలుగైదు కిలోమీటర్లయినా సరే క్యాబ్లే ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వస్తారు. బేరమాడాల్సిన పనిలేదు. పైగా ఆటో కంటే తక్కువ చార్జీ. ఏసీ సదుపాయం ఉంటుంది. అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఒక ప్రయాణికుడికి ఇంతకంటే ఏం కావాలి? – హరీష్, ప్రైవేట్ ఉద్యోగి ట్రైన్ దిగగానే క్యాబ్ రెడీగా ఉంది కొద్దిక్షణాల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగు తామనగా క్యాబ్ బుక్ చేసుకున్నాం. స్టేషన్ బయటకు వచ్చే వరకు క్యాబ్ రెడీగా ఉంది. ఎలాంటి బేరసారాలు లేవు. డ్రైవ ర్ ఫొటో, బండి నంబర్, ఫోన్ నంబర్, సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు అయ్యే రూ.135 చార్జీ వివరాలు అన్నీ ముందే ఫోన్లో నమోదయ్యాయి. నిశ్చిం తంగా బయలుదేరాం. క్యాబ్ సదుపాయం చాలా బాగుంది. – కుమారి మిగతా వాటి కన్నా క్యాబే బెటర్ బస్సు కోసం, ఆటో కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ప్రయాణానికి క్యాబ్ ఒక నిర్వచనంగా మారింది. మహిళలకు భద్రతాపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే కానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ కంటే ఇది బెటర్ కదా. – రవి, శరణ్య దంపతులు మాకు కష్టంగానే ఉంది ఆటోలకు గిరాకీ లేదు. గతంలో రోజుకు రూ.1,200 వస్తే ఇప్పుడు రూ.800 కూడా రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఆటో కిరాయి రూ.300, ఎల్పీజీ ఖర్చు రూ.250 మినహాయిస్తే ఒక రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు. క్యాబ్‌ల వల్ల పోటీ బాగా పెరిగింది. – మహ్మద్ అబ్దుల్లా, ఆటో డ్రైవర్ ఆదాయం అంతంతే ఓలా, ఉబెర్, క్యాబ్‌ల వల్ల ప్రయాణికులకు బాగానే ఉన్నా ఈ రంగంలో పెరిగిన పోటీ కారణంగా ఆదాయం బాగా పడిపోయింది. రోజుకు 18 గంటలు కష్టపడితే తప్ప రూ.1000 లభించడంలేదు. గతంలో వారానికి రూ.1,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. కమీషన్లు, ట్యాక్స్‌లు చెల్లిస్తే మాకు దక్కేది కూడా తక్కువే. – బాబర్, క్యాబ్ డ్రైవర్ -
స్తంభించిన క్యాబ్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసులు స్తంభించాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే సుమారు 60 వేల ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు సోమవారం ఒక రోజు స్వచ్ఛంద బంద్ పాటించాయి. ఫైనాన్షియర్ల వేధింపుల వల్ల ఇటీవల పలువురు డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడటం, ఓలా, ఉబర్ సంస్థల వైఖరి, ఈ రంగంలో పెరిగిన పోటీ వల్ల సరైన ఉపాధి లభించకపోవడం వంటి కారణాలతో వేలాది మంది డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయంలో ధర్నాకు దిగారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకూ క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు, నిరవధికంగా క్యాబ్‌ల నిలిపివేతతో నిరసన చేపట్టారు. అయినా క్యాబ్ డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం లభించలేదు. గడిచిన 2 నెలల్లో నలుగురు డ్రైవర్లు అప్పుల బాధతో చనిపోయారు. ఈ నేపథ్యంలో ‘ఓలా, ఉబర్ హఠావో, క్యాబ్ డ్రైవర్ బచావో’ నినాదంతో క్యాబ్ డ్రైవర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. భరోసా లేని ఉపాధి.. నగరంలో నాలుగేళ్ల క్రితం ఓలా, ఉబర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డ్రైవర్లకు మొదట్లో భారీగా ఆదాయం లభించింది. ప్రోత్సాహకాలు, కమిషన్లు తదితర రూపాల్లో నెలకు రూ.60 వేలకుపైగా ఆర్జించారు. అప్పట్లో ఉబర్‌లో 10 వేల వాహనాలు, ఓలాలో మరో 5 వేల వాహనాలు ఉండేవి. గత రెండేళ్లలో వాహనాల సంఖ్య సుమారు 1.5 లక్షలకు చేరింది. ఓలా, ఉబర్ క్రమంగా కమీషన్లు, రాయితీలు, ప్రోత్సాహకాల్లో కోత విధించాయి. ఏడాది క్రితం నెలకు కనీసం రూ.40 వేలు సంపాదించిన డ్రైవర్లు.. ఇప్పుడు రూ.25 వేలు కూడా సంపాదించలేకపోతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఆందోళన వ్యక్తం చేశారు. లీజు వాహనాలతో చిక్కులు.. ఓలా, ఉబర్ సంస్థలు స్వయంగా కొన్ని వాహనాలను లీజుకు తీసుకున్నాయి. ఇలా భారీ సంఖ్యలో వాహనాలు వచ్చి చేరడంతో తమ ఉపాధికి విఘాతం కలిగిందనేది డ్రైవర్ల మరో ఆరోపణ. ‘లీజు వాహనాలు తమ సంస్థకు చెందినవి కావడంతో ప్రోత్సాహకాలు, ట్రిప్పులు వాటికి ఎక్కువగా ఇచ్చి, మాకు తక్కువగా ఇస్తున్నారు. దీంతో టార్గెట్లు పూర్తి చేయలేకపోతున్నాయి’ అని డ్రైవర్ మహేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవీ డిమాండ్లు.. - ఓలా, ఉబర్ సంస్థల స్థానంలో డ్రైవర్ల అసోసియేషన్‌ను గుర్తించి వారే స్వయంగా నిర్వహించుకునేలా ఒక యాప్‌ను రూపొందించి ఇవ్వాలి. - అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు ప్రభుత్వానికి 5% కమీషన్ చెల్లిస్తుండగా తాము 10% చెల్లించేందుకు అను మతివ్వాలి. - ఫైనాన్షియర్ల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి. - ఆత్మహత్యలకు పాల్పడిన డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వమే పరిష్కరించాలి ఏడాది నుంచి మేము ఇదే డిమాండ్‌పై ఆందోళన చేస్తున్నాం. ప్రైవేట్ దోపిడీ సంస్థల స్థానంలో డ్రైవర్లకే యాప్‌ను అప్పగించాలి. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుండా అక్రమ కేసులతో వేధిస్తోంది. – శివ, అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ భద్రత కల్పించాలి క్యాబ్ డ్రైవర్లకు భద్రత లేకుండా పో యింది. క్యాబ్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పోలీసుల వేధింపులు కూడా భరించలేకపోతున్నాం. ఇది అన్యాయం. డ్రైవర్లకు భద్రత కల్పించాలి. – సిద్ధార్థగౌడ్, క్యాబ్ డ్రైవర్ ఫైనాన్షియర్ల వేధింపులతో ఆజ్యం ఇటీవల డ్రైవర్లపై ఫైనాన్షియర్ల వేధింపులు పెరిగాయి. నెల నెలా వాయిదాలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలు వాహనాలను జప్తు చేస్తున్నాయి. ఒక్క నెల బాకీ ఉన్నా వాహనాలను తీసుకెళ్తున్నారని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు భద్రత కల్పించడంతో పాటు, ఉపాధికి భరోసా లభించేలా ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందించి ఇవ్వాలని కోరుతున్నారు. -
ఆ ఊరికా.. మా క్యాబ్ రాదు!
మీరు ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లాలనుకుంటున్నారా? అందుకోసం ఓలా లేదా ఉబర్ క్యాబ్‌ల కోసం మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే, మీరు పిలిచినా అక్కడకు మాత్రం ఈ క్యాబ్‌లు వెళ్లడం లేదు. హరియాణా ప్రభుత్వం కొత్తగా విధించిన కొత్త మోటార్ పన్నే అందుకు కారణం. ప్రతిసారీ గుర్గావ్ వెళ్లినప్పుడల్లా వంద రూపాయల చొప్పున పన్నుచెల్లించాలని అక్కడి సర్కారు హుకుం జారీ చేయడంతో క్యాబ్‌ల వాళ్లు అక్కడకు వెళ్లడం మానుకున్నారు. దాంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. సర్వోదయ డ్రైవర్స్ అసోసియేషన్ ఈ కొత్త పన్నుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ రాష్త్రంలో ప్రవేశించే టాక్సీలన్నీ వంద రూపాయల పన్ను చెల్లించాలని హరియాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పన్ను మొత్తాన్ని సరిహద్దుల్లోనే చెల్లించాల్సి రావడంతో అక్కడ పొడవాటి క్యూలైన్లు ఉంటున్నాయి, దాంతో వాహనాల వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు మూడు నెలలకు గాను రూ. 950 చొప్పున ఆర్టీయే వర్గాలకు పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఎన్నిసార్లు వచ్చి, వెళ్లినా అదే పన్ను. ఇప్పుడు కొత్త పన్ను వల్ల నెలలో 20 రోజులు వెళ్లినా కనీసం 2వేలు అవుతుందని, ఇది తమకు చాలా భారమని సర్వోదయ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్జీత్ సింగ్ తెలిపారు. పన్ను చెల్లించడానికి కనీసం గంట పాటు వేచి ఉండాల్సి వస్తోందని, దీనిపై తాము వ్యతిరేకత వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు. -
రెండో రోజూ కదలని క్యాబ్‌లు
గ్రేటర్లో నిలిచిన 60 వేల క్యాబ్ సర్వీసులు సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ సంస్థలకు వ్యతి రేకంగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసి యేషన్ చేపట్టిన క్యాబ్‌ల బంద్ ప్రభావం రెండో రోజైన ఆదివారం కూడా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్క్యాబ్ సర్వీ సులు దాదాపు 60 వేల వరకు నిలిచిపోయాయి. దీంతో కొత్త సంవత్సర వేడుకలకు హాజరైనవారితో పాటు పర్యాటకులు, శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా మేరు, గ్రీన్ క్యాబ్స్, డాట్ తదితర క్యాబ్ సర్వీసులు చార్జీలు భారీగా పెంచి అందినకాడికి ప్రయాణికుడి జేబు గుల్ల చేశాయి. కాగా, అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఆదివారం ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఇతర క్యాబ్ సర్వీసులను అడ్డుకున్నారు. సమస్య పరిష్కారానికి ఓలా, ఉబెర్ సంస్థలు ఇంతవరకూ క్యాబ్ డ్రైవర్లతో ఎలాంటి చర్చ లూ జరపకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ అదనపు బస్సులు... క్యాబ్ సర్వీసుల రద్దు నేపథ్యంలో గ్రేటర్ ఆర్టీసీ శంషాబాద్‌తో పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రధాన కారిడార్లలో వెయ్యి ట్రిప్పులు అదనంగా నడిపింది. అవసరాన్ని బట్టి రద్దీ రూట్లలో మరిన్ని బస్సులు నడుపుతామని తెలిపింది. -
తాగండి.. వద్దండి..!
వంద కోట్ల లిక్కర్ అమ్మకాలపై ఆబ్కారీ శాఖ దృష్టి - మందుబాబుల కట్టడికి అడుగడుగునా తనిఖీలంటున్న పోలీసులు - గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గిన నయాసాల్ జోష్ - ఈవెంట్ల సంఖ్యా తగ్గుముఖం.. పార్టీలపై నోట్ల రద్దు ఎఫెక్ట్ సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ జోష్‌కు భాగ్యనగరం సిద్ధమైంది. విద్యుత్ దీపాల వెలుగులు, డీజే హోరుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగర యువత రెడీ అయింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో పరిమితికి మించిన శబ్దం చేసే డీజేలు తదితరాల వినియోగాన్ని నిషేధించారు. తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించే వారిపై దృష్టి పెట్టారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. న్యూఇయర్ ఈవెంట్స్‌పై పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టడంతో ఈవెంట్స్‌కు హాజరయ్యేవారికి ఇబ్బందులు తప్పేలా లేవు. గ్రేటర్లో 25 వేలకు పైగా క్యాబ్స్ సేవలు స్తంభించాయి. భారీగా తగ్గిన ఈవెంట్స్... పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఈసారి న్యూఇయర్ జోష్ కాస్త తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈవెంట్స్ కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. గ్రేటర్ పరిధిలో సుమారు వందకు పైగా పబ్స్, రిసార్ట్స్ ఉన్నాయి. వీటిల్లో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. గతేడాది 250 ఈవెంట్స్ జరగగా.. ఈసారి వంద లోపలే ఈవెంట్స్ నిర్వహణకు ఆబ్కారీ, పోలీసు శాఖలు అనుమతులివ్వడం గమనార్హం. డిసెంబర్ 31న జరిగే ఈవెంట్స్‌లో కానకష్టంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో మందుబాబులను ఆకర్షించేందుకు కొందరు ఈవెంట్స్ నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. క్యాబ్ సర్వీసులు సిద్ధంగా ఉంచుతామని ఒకరు ప్రకటిస్తే.. ఈవెంట్స్ జరిగే చోటనే తెల్లవార్లూ వసతి సౌకర్యం కల్పిస్తామని మరొకరు ఆఫర్ చేస్తున్నారు. తెల్లవార్లూ డ్రంకన్ డ్రైవ్.. సాధారణ రోజుల్లో వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు, బార్లు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి కోసం ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నారు. శనివారం ప్రత్యేక డ్రైవ్‌ను రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నిర్వహిం చాలని నిర్ణయించారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహిం చుకోవాలని, రాత్రి 2 గంటల తరవాత ఏ కార్యక్రమం ఉండరాదని పోలీసులు స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం జోష్‌ను పురస్క రించుకుని ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు. న్యూఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపారు. హైదరాబాద్ మహానగర పరిధి లో ని 400పైగా మద్యం దుకాణాలు.. 500 పైగా బార్లు.. వందకుపైగా పబ్బుల ద్వారా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రూ.100 కోట్ల అమ్మకాలు రాబడతాం.. – ఆబ్కారీ శాఖ అధికారుల లక్ష్యమిదీ.. గ్రేటర్లో మందుబాబుల కట్టడికి అడుగడుగునా తనిఖీలు చేస్తాం.. 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజా మున 5 గంటల వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాం. ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై దృష్టి పెడతాం. – నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ప్రకటన ఇదీ నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టు కోవాలని ఒకవైపు ఆబ్కారీ శాఖ సన్నా హాలు చేస్తుంటే.. మందుబాబుల కట్టడికి నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. -
యాత్రాజినీ బిజినెస్ క్లాస్ క్యాబ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాత్రాజినీ సర్వీసెస్ వైజీ ఎలైట్ పేరుతో బిజినెస్ క్లాస్ క్యాబ్ సర్వీసులను దక్షిణాదిన 60 నగరాల్లో ప్రారంభించింది. ఖరీదైన ప్రయాణ అనుభూతి కోరుకునే వినియోగదార్ల కోసం ఈ సేవలను పరిచయం చేసినట్టు కంపెనీ సీఈవో రెనిల్ కోమిట్ల ఈ సందర్భంగా తెలిపారు. డిసెంబరు చివరినాటికి మొత్తం 100 నగరాల్లో అడుగు పెట్టాలన్నది లక్ష్యమని చెప్పారు. కస్టమర్లు యాత్రాజినీ యాప్‌లో వైజీ ఎలైట్‌ను ఎంచుకోవడం ద్వారా ఇన్నోవాను బుక్ చేయవచ్చు. మొదటి 8 కిలోమీటర్లకుగాను రూ.200 చార్జీ చేస్తారు. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.20 చెల్లించాలి. బస్సు, హోటల్ గదుల బుకింగ్ సేవలను సైతం అందిస్తున్న ఈ కంపెనీ ఇటీవలే ఆటోరిక్షా సర్వీసులను ప్రారంభించింది. -
హైదరాబాద్‌లో జోరందుకున్న క్యాబ్స్
-
ఆన్లైన్ కిరాణా వ్యాపారంలోకి ఓలా..
బెంగళూరులో పరీక్షిస్తున్న కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న ఓలా (గతంలో ఓలా క్యాబ్స్) ఆన్లైన్ కిరాణా వ్యాపారంలోకి అడుగిడుతోంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు సరుకులు, నిత్యావసర వస్తువులను కస్టమర్ల ఇంటికే పంపనుంది. ప్రస్తుతం బెంగళూరులో ఈ కొత్త సర్వీసులను ‘ఓలా స్టోర్’ యాప్ ద్వారా పరీక్షిస్తోంది. నూతన యాప్‌ను ప్రయత్నించాల్సిందిగా కొద్ది మంది కస్టమర్లకు కంపెనీ ఈమెయిల్స్ పంపింది. ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులను కొనుక్కోవచ్చంటూ ఆహ్వానిస్తోంది. ఓలా స్టోర్ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ధ్రువీకరించారు. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు తొలి ఆర్డరులో 50 శాతం డిస్కౌంట్ కూడా ఉందని సమాచారం. రూ.300 లోపు బిల్లు అయ్యే ఆర్డర్లకు డెలివరీ చార్జీ రూ.50 చెల్లించాలి. ఇక ఓలా స్టోర్ ద్వారా కిరాణా సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మందులు, ఎలక్ట్రికల్ ఉపకరణాల వంటివి ఆర్డరు ఇవ్వొచ్చు. ఆహార పదార్థాలు కూడా.. ఇటీవలే ఓలా కేఫ్ సర్వీసులను సైతం కంపెనీ ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ నుంచి యాప్ ద్వారా నచ్చిన ఫుడ్ ఆర్డరు ఇవ్వడమే తరువాయి. 20 నిమిషాల్లోనే డెలివరీ ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అది కూడా నిర్దిష్ట సమయంలో ఎంపిక చేసిన ప్రాంతాలకే సర్వీసులు పరిమితం. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, కొండాపూర్లు ఇందులో ఉన్నాయి. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి ప్రత్యేక, విభిన్న ఆహార పదార్థాలను కొనుగోలు చేసి కస్టమర్లకు పంపిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. -
ట్యాక్సీ యాప్‌లకు త్వరలో కళ్లెం
దేశవ్యాప్తంగా అడ్డుకట్టపడే అవకాశం కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: యాప్ ఆధారిత ట్యాక్సీ రంగంలో ఉన్న ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి కంపెనీల సేవలకు దేశవ్యాప్తంగా కళ్లెం పడే అవకాశం ఉంది. ఇటువంటి కంపెనీల యాప్స్‌ను వినియోగించకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ(డైటీ) ఈ మేరకు రవాణా శాఖ అభిప్రాయం కోరింది. కేవలం ఒక రాష్ట్రంలోనే యాప్స్ వినియోగాన్ని కట్టడి చేయడం సాంకేతికంగా సాధ్యం కానందున.. దేశవ్యాప్తంగా బ్లాక్ చేయడం కోసం కేంద్ర రవాణా శాఖను డైటీ ఆశ్రయించింది. డైటీ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, అనధికార ట్యాక్సీ సర్వీసులతో భద్రత ప్రశ్నార్థకమంటూ వివిధ రాష్ట్రాల్లో రవాణా శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ట్యాక్సీ కంపెనీల యాప్‌ల ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయాల్సిందిగా టెలికం సంస్థలకు డైటీ నుంచి ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది. పెండింగులో దరఖాస్తులు.. ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళను గతేడాది డిసెంబరు 5న ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఉబర్తోసహా యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులపై అదే నెలలో ఢిల్లీలో నిషేధం విధించారు. లెసైన్సు పొందేవరకు సర్వీసులను నిలిపివేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ తదితర కంపెనీలు దేశ రాజధానిలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు రేడియో ట్యాక్సీ లెసైన్సు కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దరఖాస్తులను పరిశీలించాలంటే సర్వీసులను నిలిపివేయాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం పలు కంపెనీలకు మార్చి చివరివారంలో స్పష్టం చేసింది. నిషేధం అమలులోకి రావాలంటే యాప్స్‌ను బ్లాక్ చేయడం ఒక్కటే మార్గమన్నది అధికారుల ఆలోచన.