
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ టోరా క్యాబ్స్ తన సేవలను నేటి (సోమవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభిస్తోంది. 10,000లకు పైగా కార్లతో రంగంలోకి దిగుతున్నట్టు టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ సీఈవో శ్రీనివాస్ కృష్ణ వెల్లడించారు. మార్కెటింగ్ డైరెక్టర్ కవిత భాస్కరన్‌తో కలిసి ఆదివారమిక్కడ టోరా యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ‘కిలోమీటరుకు రూ.10 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న క్యాబ్ అగ్రిగేటర్లు డిమాండ్‌నుబట్టి సర్జ్ పేరుతో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. జీరో సర్జ్‌తో కస్టమర్లకు చేరువ అవుతాం. డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయబోము. డ్రైవర్లు రోజుకు రూ.199 చందా చెల్లిస్తే చాలు. దశలవారీగా ఇతర నగరాలకు కూడా సర్వీసులను విస్తరిస్తాం’ అని వివరించారు. వాహనం రకాన్నిబట్టి కిలోమీటరుకు రూ.20 వరకు చార్జీ ఉంటుంది. ట్రావెల్ టైమ్ చార్జీ కిలోమీటరుకు రూ.1.52 అదనం. రూ.45 బేస్ ఫేర్‌పై 3 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
కవిత భాస్కరన్, శ్రీనివాస్ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment