
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్‌లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment