sravanthi
-
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
మాదాపూర్ : ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
సీరియల్ నటి స్రవంతితో సాయికిరణ్ పెళ్లి..ఫోటోలు వైరల్
-
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్
అప్పట్లో తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర ధారావాహికల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇతడు తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!)దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి సింగర్. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది.మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న సాయికిరణ్.. కొన్నాళ్ల క్రితం తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమకాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Sai Kiran Ram (@saikiran_official_23) -
సీరియల్స్‌లో కలిసి నటించి ఆపై ఏడడుగుల బంధంతో ఒక్కటి కానున్న జంట (ఫోటోలు)
-
నటుడు సుబ్బరాజు పెళ్లాడిన స్రవంతి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఇవే! (ఫొటోలు)
-
పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు
తెలుగులో ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి సాయి కిరణ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తున్న ఇతడు.. తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో యాక్ట్ చేస్తున్న స్రవంతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు నటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.దిగ్గజ గాయని పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు పాడారు. దీంతో సాయికిరణ్ సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా.. 'జగపతి', 'షిరిడి సాయి', 'నక్షత్రం', 'గోపి గోడమీద పిల్లి' సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)ఓవైపు సినిమాల్లో ఆడపాదడపా నటిస్తూనే సీరియల్ నటుడిగానూ సాయి కిరణ్ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం ఇలా తెలుగు క్రేజీ సీరియల్స్‌లో కీలక పాత్రలు చేస్తూ బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.2010లోనే సాయికిరణ్‌కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 46 ఏళ్ల సాయికిరణ్.. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) -
మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ
జగిత్యాల రూరల్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ యువతి పట్టుదలతో చదివి, మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన ముదుగంపల్లి భారత–చంద్రయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, రెండో కూతురు జయ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని, బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. అక్కడ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, గేట్లో మంచి ర్యాంక్ ద్వారా హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ, మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైంది. ఏఈఈ ఉద్యోగంలో చేరతానని తెలిపింది. -
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
పార్టీ మారితే.. ఫోర్జరీ కేసు కంచికేనా!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే కక్ష సాధింపు రాజకీయ క్రీడకు తెర తీశారు. నెల్లూరు మేయర్ దంపతులు వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరే విధంగా తెర వెనుక కుట్రలకు వ్యూహ రచన చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మార్ట్గేజ్ ఆస్తులను కమిషనర్ సంతకాలు ఫోర్జరీతో రిలీజ్ చేసిన వ్యవహారంలో మేయర్ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ పాత్రను తెరపైకి తెచ్చారు. మేయర్ దంపతులు పార్టీ మారకపోతే కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల భయంతో జయవర్ధన్ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మేయర్ స్రవంతి దంపతులు మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేశాం.. క్షమించి అక్కున చేర్చుకోండంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. దీన్ని బట్టి కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్ తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు (బారకాసు): వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మేయర్ దంపతులు టీడీపీ కండువా కప్పు కోవడం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి గిరిజన మహిళకు రిజర్వేషన్ అయింది. నెల్లూరులోని 54 డివిజన్లలో రెండు డివిజన్లు గిరిజనులకు కేటాయించారు. దీంతో అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న పోట్లూరి జయవర్ధన్ భార్య స్రవంతి గిరిజనులకు రిజర్వ్ అయిన 12వ డివిజన్ నుంచి బరిలోకి దింపారు. అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సహకారంతో ఏకగ్రీవంగా ఎంపిక చేసి, మేయర్ పదవిని సైతం కట్టబెట్టించారు. అయితే శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన క్రమంలో మేయర్ స్రవంతి దంపతులు సైతం ఆయన వెంట వెళ్లిపోయారు. అప్పట్లో శ్రీధర్‌రెడ్డితో ఉంటామని బహిరంగంగానే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థలో జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుకు. మేయర్‌కు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇలా కొన్ని నెలలుపాటు శ్రీధర్‌రెడ్డి వర్గంలోనే ఉన్నారు. ఆ తర్వాత అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆదాల బాధ్యతలు చేపట్టిన తర్వాత మేయర్ దంపతులు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. తాజాగా మరోసారి మేయర్ దంపతులు వైఎస్సార్సీపీ వీడారు. గతంలో ఒకసారి టీడీపీ కండువా కప్పుకున్న వీరు మరోమారు ఆ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా స్పష్టమవుతోంది.మేయర్ భర్తపై ఫోర్జరీ ఆరోపణలుతాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థలో ఫోర్జరీ వ్యవహారం సంచలనం రేపింది. ఈ ఫోర్జరీ వ్యవహారంలో మేయర్ స్రవంతి భర్త ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి నుంచి మేయర్ భర్త జయవర్ధన్ పరారీలో ఉన్నాడు. నెల్లూరు నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే దాదాపు 70 భవనాలకు సంబంధించిన మార్టిగేజ్ చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్ ఇచ్చినట్లుగా ఫోర్జరీ సంతకాలు చేసిన లేఖలతో విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం చేకూరింది. ఈ విషయంపై ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, దేవేందర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 72 గంటల్లో ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని పేర్కొన్నా రు. వీరిచ్చే వివరణతో తదుపరి చర్యలు ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఆ గడువు సోమవారం సాయంత్రంతో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ విషయంపై విచారణ మొదలు కానుంది. విచారణలో వాస్తవాలు బయటకు వస్తే జరిగిన ఫోర్జరీ వ్యవహారంతో తమకెక్కడ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతోనే మేయర్ దంపతులు యూటర్న్ తీసుకున్నారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. సోమవారం మేయర్ దంపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు పార్టీలు ముఖ్యం కాదని తమకు రాజకీయ భిక్ష పెట్టి ఇంతటి గౌరవప్రదమైన పదవిలో ఉండేలా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్యమన్నారు. తాము తప్పు చేసి వైఎస్సార్సీపీలో చేరామని తమని క్షమించి అక్కున చేర్చుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. ఫోర్జరీ వ్యవహారంపై విలేకర్లు ప్రశ్నించిన దానికి మేయర్ జవాబిస్తూ ఫోర్జరీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను తాను కోరుతున్నాని, అందు లో తన భర్తపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. ఈ క్రమంలోనే మేయర్ భర్త జయవర్ధన్ కూడా స్పందిస్తూ ఫోర్జరీ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ విషయంలో తన ప్రమేయం ఉన్నట్లుగా విచారణలో రుజువైతే ఏశిక్షకై నా తాను సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.రాజీనామాతో ఫోర్జరీ కేసు నీరుగారేనా...మేయర్ దంపతులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. వీరు టీడీపీలో చేరితో ఫోర్జరీ వ్యవహారం నుంచి తప్పించే అవకాశం ఉంటుందా?. ఈ కేసును కంచికే చేరుతుందా? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోర్జరీ వ్యవహారాన్ని అధికారులు నీరు గార్చినట్లే భావించాల్సి ఉంటుంది. లేకుంటే నిజంగా ఫోర్జరీ జరిగితే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మేయర్ భర్తకు సంబంధం ఉందని రుజువైతే అందుకు బాధ్యులైన ఆయనతో పాటు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఏదీ ఏమైనా మేయర్ దంపతులు వైఎస్సార్పీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నామనే విషయం నేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే కక్ష సాధింపు రాజకీయ క్రీడకు తెర తీశారు. నెల్లూరు మేయర్ దంపతులు వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరే విధంగా తెర వెనుక కుట్రలకు వ్యూహ రచన చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మార్ట్గేజ్ ఆస్తులను కమిషనర్ సంతకాలు ఫోర్జరీతో రిలీజ్ చేసిన వ్యవహారంలో మేయర్ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ పాత్రను తెరపైకి తెచ్చారు. మేయర్ దంపతులు పార్టీ మారకపోతే కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల భయంతో జయవర్ధన్ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మేయర్ స్రవంతి దంపతులు మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేశాం.. క్షమించి అక్కున చేర్చుకోండంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. దీన్ని బట్టి కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్ తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నాం నెల్లూరు మేయర్ దంపతులునెల్లూరు (బారకాసు): తాను తన భర్త వైఎస్సార్సీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పోట్లూరి స్రవంతి చెప్పారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ తన చాంబర్లో భర్తతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం అనంతరం మేయర్ పదవి కట్టబెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అని చెప్పారు. తన భర్త జయవర్థన్ 15 ఏళ్లుగా స్టూడెంట్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరుడిగా ఆయన అడుగు జాడల్లో కొనసాగుతూ వచ్చారన్నారు. తన భర్త మంచితనం, ఆయన చేసిన సేవలు గుర్తింపు కారణంగానే ఈ రోజు తాను మేయర్ పదవిలో ఉన్నానన్నారు. ఇదంతా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలువేనని తెలియజేశారు. శ్రీధర్‌రెడ్డి తమ దంపతులను ఆయన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడినప్పుడు కూడా తాము మాత్రం శ్రీధర్‌రెడ్డిని వీడేది లేదని ఆ నాడు మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమను బలవంతం చేయడం వల్లనే తప్పని పరిస్థితుల్లో తాము శ్రీధర్‌రెడ్డిని వీడి వైఎస్సార్సీపీలో చేరడం జరిగిందని తెలియజేశారు. తాము రాజకీయంగా శ్రీధర్‌రెడ్డిని వీడామే తప్ప మానసికంగా ఆయనతోనే ఉన్నామని స్పష్టం చేశారు. కాగా, మేయర్ దంపతులను పార్టీలో చేర్చుకునేది లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించడం కొసమెరుపు. -
Anchors Sankranti Celebrations Pics: బుల్లితెర యాంకర్లు సంబరాలు..ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారు ఒక్క లుక్ వేయండి
-
బీసీ ఆడబిడ్డకు బీజేపీ అన్యాయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా బీసీ ఆడబిడ్డను బీజేపీ అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ, బీసీ నేతలను అవమానాలకు గురి చేస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, బీజేపీ నాయకురాలు తుల ఉమ సోమవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం తుల ఉమతో పాటు ఆమె వెంట వచ్చిన నేతలను కేటీఆర్ పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమకు మరింత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని, వేములవాడ టికెట్ విషయంలో మరొకరికి దొంగదారిలో బీ ఫారం ఇచ్చారని తుల ఉమ అన్నారు. బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి కల అని, కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మాత్రమే ఆ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సుదగోని హరిశంకర్‌గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హరిశంకర్‌గౌడ్‌తో పాటు పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్, మేడబోయిన పరశురాములు, ఉదయకిరణ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులను కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వనించారు. నల్లగొండ డీసీసీబీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్లోకి పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి, తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో అర్ధంకాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్‌రెడ్డికి మునుగోడులో బుద్ధి చెప్పాలన్నారు. గౌరవం లేనిచోట ఉండకూడదనే తన తండ్రి మాటలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ను వీడినట్లు పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీని బేరం పెట్టారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ పంజగుట్ట (హైదరాబాద్): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ మేరకు శనివారం ఆమె సోనియాగాంధీ, రాహుల్ గాం«దీకి తన రాజీనామా లేఖను పంపించారు. తనపై ఉన్న ఒత్తిడి మేరకు బరువెక్కిన హృదయంతో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చి0దని ఆ లేఖలో పేర్కొన్నారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ...పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీని నిలువెత్తు బేరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా డబ్బుతో నడుస్తుందన్నారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్న నాయకులు రేపు గాందీభవన్‌ను కూడా అమ్మేస్తారని అందుకే ఇటువంటి పాvలో తాను కొనసాగలేనని చెప్పారు. 2014లో పొత్తులో భాగంగా సీపీఐకి టికెట్ ఇచ్చారని, 2018లో రాజ్‌గోపాల్‌రెడ్డికి ఇస్తే పార్టీ ఆదేశాలమేరకు ఆయన గెలుపుకోసం పనిచేశానని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని జెండా కిందపడేసిన రాజ్‌గోపాల్‌రెడ్డికి పాvలోకి వచ్చిన 24 గంటల్లో టికెట్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారాచూట్లకు స్థానంలేదన్న పార్టీలో 50 మంది పారాచూట్ అభ్యర్థులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న రీతిలో వ్యవహరిస్తున్న వారితో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌గోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, కె.తారకరామారావు తన గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని ఇటీవల ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. -
ఓ మంచి డాక్టరమ్మ -మిసెస్ తెలంగాణ
సేవకు అందమైన మాధ్యమం మిసెస్ తెలంగాణ తెచ్చిన సెలబ్రిటీ గుర్తింపుతో ఒక డాక్టర్‌గా, ఒక మహిళగా నా వంతు సామాజిక బాధ్యత అని నేను చేపట్టిన అనేక కార్యక్రమాలను ఇంకా వేగంగా తీసుకువెళ్లగలుగుతాను. వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తున్నాను. భ్రూణ హత్యలకు కారణం అమ్మాయంటే ఇష్టం లేక కాదు. సమాజంలో అఘాయిత్యాలు పెచ్చుమీరిన ఈ రోజుల్లో అమ్మాయిని భద్రంగా పెంచగలమా లేదా అనే భయమే ప్రధాన కారణమని అనేక మంది మహిళల మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎన్జీవోలతో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ఆడపిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం, అబ్బాయిలను సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇక ఇలాంటి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతాను. – డాక్టర్ స్రవంతి గాదిరాజు, అసోసియేట్ ప్రోఫెసర్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు... తెలంగాణ, నిజామాబాద్‌లో డాక్టర్. యూఎస్‌లో గైనిక్ ఆంకాలజీ చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ మహిళల్లో ఎదురవుతున్న సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ‘డాక్టర్ తన ఉద్యోగం హాస్పిటల్లోనే అనుకుంటే సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతం కాలేదు. పేషెంట్లను వెతుక్కుంటూ వైద్యులు వెళ్లగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. అందుకోసమే ఆదివాసీలు ఎక్కువగా నివసించే, ఆరోగ్యం పట్ల కనీస అవగాహన లేని వారి ఇళ్ల ముందుకు వెళ్తున్నాను. ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని తెలియచేస్తున్నాను. నాలోని ఈ గుణమే నన్ను మిసెస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిపింది. నేను బ్యూటీ కాంటెస్ట్‌ల వైపు అడుగులు వేయడం సెలబ్రిటీ గుర్తింపు కోసం కాదు. ఒకవేళ సెలబ్రిటీ గుర్తింపు వస్తే... ఆ గుర్తింపుతో సమాజంలో నేను కోరుకున్న మార్పు కోసం పని చేయడం సులువవుతుంది. బ్యూటీ పజంట్గా ఇప్పుడు నేను సమాజానికి చేస్తున్న వైద్యసేవలను మరింత త్వరగా విస్తరించగలుగుతాను’ అన్నారు ‘సాక్షి’తో డాక్టర్ స్రవంతి. పేషెంట్ల దగ్గరకు వెళ్లాలి! ఈ రోజు మీకు కనిపిస్తున్న ఈ విజేత గుర్తింపు అన్నది నేను సాధించిన ఘనత అని అనుకోను. మా అమ్మానాన్నలు తీర్చిదిద్దిన కూతుర్ని. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. నాన్న విజయ డైరీలో మేనేజర్. అమ్మ తన డ్యూటీ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదో, తన సలహా సూచనల కోసం వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో దగ్గరగా చూశాను. ప్రభావతక్క అని అందరూ ఆమెని సొంత అక్కలా అభిమానించేవారు. అమ్మతోపాటు హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు డాక్టర్ కనిపించగానే పేషెంట్లు సంతోషంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం చూసి అమ్మను అడిగితే, డాక్టర్‌ను దేవుడిలా చూస్తారని చెప్పింది. అంతే! ఇది అత్యుత్తమమైన వృత్తి అనే అభి్రపాయం స్థిరపడిపోయింది. అమ్మకు నైట్ షిఫ్ట్లుండేవి. అప్పుడు నాకు జడలు వేయడం నుంచి బాక్స్‌లు పెట్టడం వరకు మా నాన్నే చేశారు. మా అన్నయ్యను, నన్ను పెంచడం, చక్కగా తీర్చిదిద్దడం కోసమే వాళ్ల జీవితాలను అంకితం చేశారు. నేను సిక్త్స్ క్లాస్ వరకు విజయవాడలో చదివాను. ఉద్యోగాల్లో బదిలీలతో గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నీ చూశాం. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయం నాకు బాగా గుర్తున్న స్కూలు. ఎమ్సెట్ తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదు. అప్పుడు అమ్మ ‘మనది మధ్యతరగతి కుటుంబం. డొనేషన్ సీట్లతో చదివించలేం. బీఎస్సీలో చేరి మళ్లీ ప్రయత్నం చెయ్యి. అప్పుడూ రాకపోతే డిగ్రీ పూర్తి చెయ్యి’ అని కరాకండిగా చెప్పి డిగ్రీలో చేర్చింది. ఆ ఉక్రోషంతో చేసిన రెండవ ప్రయత్నంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో ఫ్రీ సీటు వచ్చింది. తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా రాకట్ల డిస్పెన్సరీలో. అప్పుడు కూడా మార్గదర్శనం చేసింది అమ్మే. ప్రైవేట్ డాక్టర్ క్రేజ్ ఉండేది నాకు. గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలుసుకోమని గట్టిగా చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టే ఉద్యోగం చేస్తూ మధ్యలో సెలవు పెట్టుకుని యూఎస్‌లో కోర్సులు చేయడం సాధ్యమైంది. అంతేకాదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మారుమూల ప్రదేశాలను దగ్గరగా చూడడం, అక్కడి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఉద్యోగ పరిధి దాటి బయటకు వచ్చి మరింత ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి పాప్‌స్మియర్ పరీక్షలు చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో బిజీ అయిపోయాను. నేను రోబోటిక్ గైనిక్ ఆంకాలజిస్ట్‌ని. సర్వైకల్ క్యాన్సర్‌ను రూపుమాపాలనేది నా లక్ష్యం. ఈ నెల బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా శిల్పకళావేదికలో బ్యూటీ పజంట్స్ అందరం అవేర్నెస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాం. సావిత్రినయ్యాను! ఇక బ్యూటీ పజంట్ విషయానికి వస్తే... నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజ్ పోటీల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. డాన్స్, పెయింటింగ్‌తోపాటు కాలేజ్‌లో ర్యాంప్ వాక్ కూడా చేశాను. మిసెస్ ఇండియా పోటీల గురించి చాలా ఏళ్లుగా పేపర్లో చూడడమే కానీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ మమతా త్రివేది నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి తెలిసి గత ఏడాది నవంబర్‌లో నా ఎంట్రీ పంపించాను. కొత్తతరం పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారు. మా పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. తను నన్ను ఈ పోటీలకు సిద్ధం చేసింది. మా హజ్బెండ్ నా క్లాస్మేట్, దూరపు బంధువు కూడా. ఎమ్ఎన్జేలో డాక్టర్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఇరవై రౌండ్లు కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్‌లైన్‌లో జరిగాయి. ఆహార్యం రౌండ్లో మహానటి సావిత్రిని తలపించాలని టాస్క్ ఇచ్చారు. సావిత్రి పాత్రలో మెప్పించడమే నన్ను విజేతను చేసింది. మా తోటి పీజంట్లు నన్ను సావిత్రి అనే పిలుస్తున్నారిప్పుడు. నా స్మైల్‌కి కూడా ఈ పోటీల్లో మంచి గుర్తింపు వచ్చింది. విజేతలను ప్రకటించేటప్పుడు మాత్రం నర్వస్ అయ్యాను. నా ముఖంలో నవ్వు విరిసే తీర్పు వచ్చింది’’ అని చక్కగా నవ్వారు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, మిసెస్ తెలంగాణ విజేత డాక్టర్ స్రవంతి. రాబోయే డిసెంబర్లో జరిగే ‘మిసెస్ ఇండియా’ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. ‘మిసెస్ ఇండియా’ కిరీటం ఆమె కోసం ఎదురు చూస్తోందేమో!. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
కోటంరెడ్డికి భారీ షాక్..
-
ఫిరాయింపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్
-
ప్రగతిభవన్ వద్ద ధర్నాకు సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో 33% మహిళలకు టికెట్ల కేటాయింపు కోసం ప్రగతిభవన్ వద్ద ధర్నా చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన తండ్రిపై పోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ మహిళా నేతలు కోరారు. ఒక పార్టీ అధినేతగా తన తండ్రి కేసీఆర్ చేతిలో ఉన్న టికెట్ల కేటాయింపు అవకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడో పార్లమెంటులో బిల్లులు గురించి కవిత మాట్లాడటం, జంతర్‌మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం సరికాదని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ...బీఆర్ఎస్ తరఫున మొత్తం 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు కేటాయించారని, ఆ పార్టీ మహిళాసాధికారిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ప్రధాని పదవితో సహా రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఏఐసీసీ అధ్యక్షురాలి పదవులను మహిళలకు ఇచి్చన ఘనత కాంగ్రెస్ పారీ్టదని గుర్తుంచుకోవాలని కోరారు. -
అతివల తెగువకు తలవంచిన కిలిమంజారో!
కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు. వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు. -
సీఎం జగన్ ఫోటోను పెట్టడాన్ని ప్రశ్నించిన మేయర్ పై ఆగ్రహం
-
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఫేక్ ప్రచారాల గోల..
-
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీదే విజయం : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
ఎనిమిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?
మర్రిగూడ: ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది తెలంగాణ వీరులు ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన ఎనిమిదేళ్ల నుంచి ఏం అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి, దామెరభీమనపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ, శివన్నగూడ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడులో 22వేల మెజారిటీతో గెలిపిస్తే రూ.22వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి బిడ్డకు మొదటిసారి పార్టీ నుంచి అవకాశం వచ్చిందని, గెలిపించుకొని మహిళాశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజల కోసం జీవితాంతం పోరాడుతానని ఓటర్లను కోరారు. డ్రామాలు మానుకుని గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా డ్రామాలు మానుకుని పరిపాలనపై టీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. ‘బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవు. ఆ రెండు పార్టీల చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైపోయింది’అని సోమవారం ట్విట్టర్లో రేవంత్ పోస్ట్ చేశారు. -
విజయవాడలో మోడళ్ల సందడి (ఫొటోలు)
-
పక్కా ప్లాన్‌తోనే! అభ్యర్థిగా స్రవంతి ఖరారు వెనుక కాంగ్రెస్ పెద్ద స్కెచ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడుపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్, బీజేపీల కంటే ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక అనేక కారణాలున్నాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలు కూడా టికెట్ ఆశించినప్పటికీ స్రవంతిని ఖరారు చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేసిందని అంటున్నారు. ప్రత్యర్థులకు షాక్..! మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనలో వ్యూహాన్ని మార్చింది. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ మొదట్లోనే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించి కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వేచి చూద్దామనే ధోరణిని ప్రదర్శించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇలాంటి సంకేతాలనే ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటిస్తూ శుక్రవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు బరిలో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే వ్యూహంతోనే అనూహ్యంగా అభ్యర్థి పేరు వెల్లడించిందని అంటున్నారు. ప్రచారంలో వెనుకబడకుండా.. ప్రచారంలో వెనుకబడకుండా ఉండటం, నియోజకవర్గంలోని కేడర్‌ను ముందుండి నడిపే సారథిని చూపించడం, అభ్యర్థిని త్వరగా ప్రకటించాలంటు న్న ఆశావహులు, స్థానిక కేడర్ ఒత్తిళ్లు.. ఇవన్నీ దృష్టి లో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ముందే అభ్యర్థిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు అధి కారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. కానీ కాంగ్రెస్ మా త్రం ప్రజాక్షేత్రంలో పెద్దగా సత్తా చూపించలేకపోతోంద నే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. మరో వై పు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం, అయినా వారితో కనీసం మాట్లాడేవారు లేకపోవడం, హైదరాబాద్ నుంచి వచ్చే రాష్ట్ర స్థాయి నాయకులు అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అ వుతుండడంతో పరిస్థితి చేయి జారుతోందనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్రవంతివైపే మొగ్గు అభ్యర్థి విషయంలో జరిపిన అభిప్రాయసేకరణలో ఎక్కువ మంది స్రవంతి పేరు సూచించినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతల్లో కొంత అభిప్రాయ భేదాలున్నప్పటికీ స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కొందరు చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారనే చర్చ జరిగినా, చివరకు రేవంత్ టీం కూడా పూర్తి అధికారాలు అధిష్టానానికే అప్పగించింది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇటీవల ప్రియాంకాగాంధీని కలిసిన సమయంలో స్రవంతి పేరునే సూచించినట్టు తెలిసింది. వెంకట్‌రెడ్డి కూడా సిఫారసు చేయడం, ప్రచారంలో వెనుకబడిపోతున్నామనే భావన నేపథ్యంలో.. ఇప్పుడే ప్రకటించడం మేలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందనే వార్తలు కూడా వస్తుండటంతో.. రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..
సాక్షి, కణేకల్లు (అనంతపురం): కాలేజీకని వెళ్లి కనిపించకుండాపోయిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి ఆత్మహత్యతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం మేరకు... గెనిగెర గ్రామానికి చెందిన స్రవంతి (17) కణేకల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. తన స్నేహితుడు ఇటీవల పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి స్రవంతి పూర్తి డిప్రెషన్లో ఉంది. స్నేహితుడు లేని జీవితం శూన్యంగా అనిపించింది. శుక్రవారం కాలేజీకని సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై కణేకల్లు–బళ్లారి రోడ్డు వద్దనున్న బస్టాప్ వరకు వెళ్లింది. అయితే అక్కడి నుంచి కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పుస్తకాలు బస్టాప్ వద్దనున్న ఆలయం ముందు కనిపించడంతో ఆమె కోసం గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు. స్రవంతి శుక్రవారం రోజే హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం యర్రగుంట వద్ద మృతదేహం బయటపడింది. తల్లిదండ్రులు తమ కూతురేనని గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి) -
Anchor Sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి చొక్కారపు ఫోటోస్
-
యాంకర్ స్రవంతి చొక్కారపు ఫోటోస్
-
ప్రేమ పేరుతో యువతి మోసం : పురుగుల మందు తాగిన యువకుడు
-
స్రవంతి ఇక లేదు..
సాక్షి, న్యూశాయంపేట: వరంగల్ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్‌లో తన గాండ్రింపులతో సందర్శకులను ఆకట్టుకున్న ఆడచిరుత స్రవంతి(17 సంవత్సరాల 11నెలలు) శనివారం మృతి చెందింది. కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న చిరుతకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం కానరాక కన్నుమూసింది. వయస్సు పైబడడానికి తోడు అవయవాల పనితీరు మందగించడంతో చికిత్స అందించినా కోలుకోలేదని అధికారులు ప్రకటించారు. చదవండి: (కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం) 2003లో జననం.. 2003 ఫిబ్రవరి 2న జన్మించిన ఆడ చిరుతను హైదరాబాద్ అత్తాపూర్‌లోని లాబోరేటరీ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్డెసార్డ్ ఆఫ్ థీసిస్‌లో పెంపకానికి ఉంచారు. ఆ తర్వాత 2017 జనవరి నెలలో వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్క్‌లో సందర్శకులకు కనువిందు చేయడానికి తీసుకొచ్చారు. దీనికి తోడుగా ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దేవా పేరుతో ఉన్న మగ చిరుతను ఉంచారు. అయితే, సాధారణంగా 12 నుంచి 17 ఏళ్ల వరకే చిరుతలు జీవించనుండగా, స్రవంతికి ఇప్పటికే 17 ఏళ్ల 11 నెలల వయస్సు వచ్చింది. చిరుత కళేబరం దీంతో జీవిత చరమాంకానికి చేరుకున్న చిరుత అవయవాల పనితీరు మందగించింది. ఈ మేరకు గత సంవత్సరం జూన్‌లోనే వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు లాబోరేటరీకీ పంపించినట్లు తెలిపారు. చిరుతకు కాలేయ సంబంధిత వ్యాధి, కిడ్నీలో లోపాలే కాకుండా హృదయ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు. అప్పటినుంచి చికిత్స అందిస్తుండగా, గత పదిహేను రోజులుగా ఆహారం తక్కువగా తీసుకుంటున్న స్రవంతి చివరికి ఆహారం తీసుకోలేని కారణంగా శనివారం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జీవిత చరమాంకంలో ఉంది.. మనుషుల్లో మాదిరి జంతువులకు కూడా జీవిత చరమాంకంలో ఉన్నపుడు కొన్ని అవయవాలు పనిచేయవని జూపార్క్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వంశీ తెలిపారు. అదే మాదిరి చిరుత స్రవంతికి కూడా 18 ఏళ్ల వయస్సు వస్తుండడంతో కిడ్నీ, కాలేయం, హృద్రోగ సంబంధిత వ్యాధుల బారిన పడిందని చెప్పారు. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి డిప్యూడీ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ హకీం నేతృత్వంలో ప్రత్యేక బృందం వచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. చిరుత కళేబరానికి జిల్లా అటవీశాఖాధికారి డాక్టర్ రామలింగం పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించి దహనం చేసినట్లు వారు వెల్లడించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో స్రవంతి (26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త రవి కిరణ్ కూడా సాప్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
స్రవంతిది హత్యా.. ఆత్మహత్యా..?
చందానగర్: మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన విశ్వనాథ్, పద్మజ కుమారుడు కంకణాల సంతోష్‌కు, శ్రీకాకుళం రాజాంకు చెందిన మోహన్‌రావు, విజయల రెండవ కూతురు స్రవంతి(31)లకు 2017 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వారికి రెండు సంవత్సరాల కుమారుడు శషాంక్ ఉన్నాడు.సంతోష్ తల్లితండ్రులు 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. వీరు శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని ముప్పా అపార్ట్మెంట్లోని 305 ప్లాట్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్లో సంతోష్ తల్లి వచ్చి వీరి వద్దే ఉంటోంది. కాగా స్రవంతి భర్త సంతోష్, అత్త, మామలు తనను వేధిస్తున్నారని 2018 ఆగస్టులో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ముడు నెలలకు వారి మధ్య రాజీ కుదిరింది. సోమవారం రాత్రి కూడా భర్త సంతోష్, అత్తతో గొడవ జరిగింది. ఈక్రమంలో అనుమానాస్పద స్థితిలో స్రవంతి మంగళవారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని వారు ఉంటున్న మూడవ అంతస్తు నుంచి లిఫ్ట్ ద్వారా సెల్లార్లో కిందకు వచ్చి లిఫ్ట్ డోర్ వద్ద పడిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు చూసి ఇంట్లో ఉన్న వారికి, పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లిన పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి చూసే సరికి ఆమె ఒంటిపై దుస్తులు కాలిపోయి మృతి చెంది ఉంది. సోమవారం సాయంత్రం బయటికి వెళ్లిందని అప్పుడు వెంట పెట్రోల్ తెచ్చుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి ఒంటికి నిప్పంటించుకొని మూడు అంతస్తుల నుంచి కిందకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్రవంతి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వాట్సాప్‌లో పెళ్లి ఫోటోలు.. మనస్తాపంతో..
రంగారెడ్డి ,దౌల్తాబాద్: ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని కుదురుమళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి(23) మహబూబ్‌నగర్‌లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఆమె, కుదురుమళ్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. లాక్డౌన్ నేపథ్యంలో స్రవంతి గ్రామానికి వచ్చింది. ఆమెకు రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. కుటుంబీకులు ఈనెల 30న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రేమ వివాహం.. బాలిక బలవన్మరణం ) ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య స్రవంతిని వివాహం చేసుకునే అబ్బాయి గ్రామానికి వెళ్లి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిపాడు. అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో స్రవంతిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అయితే, స్రవంతి, తిరుపతయ్య ప్రేమకు అదే గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య సహకరించాడు. మృతురాలి తండ్రి శైలేందర్ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, కోస్గి వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు. -
అమ్మ నటి.. నేను పెయింటర్
సినిమా కుటుంబాలు రెండు రకాలు. పిల్లలను తిరిగి సినిమాల్లోనే ప్రవేశపెట్టే కుటుంబాలు కొన్ని. సంతానాన్ని కొత్త దారుల్లో నడిపించే కుటుంబాలు కొన్ని. సినిమాల్లో కొనసాగుతున్నవారు ఎలాగూ తెలుస్తారు. పరిశ్రమకు దూరంగా ఉన్నవారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలనాటి సూపర్‌స్టార్ జమున పిల్లలు ఏం చేస్తున్నారు? కుమారుడు వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కుమార్తె స్రవంతి హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నారు. ఆమె తన జీవితం గురించి, తల్లితో అనుబంధం గురించి ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో... నా చిన్నప్పుడు అమ్మ నటిగా, ఎంపీగా, సోషల్ యాక్టివిస్ట్‌గా చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమె ఆ పనుల నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాకే ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఆమె నన్ను ఒక సెలబ్రిటీ కూతురులా కాకుండా సాధారణమైన అమ్మాయిగానే పెంచింది. టైమ్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, స్వేచ్ఛ అన్నీ అలవాటు చేసింది. నేను ఫలానా వాళ్ల అమ్మాయినని చెప్పుకుని ప్రయోజనాలు పొందకూడదు అనేది. తప్పు చేయొద్దని, పనులన్నీ సొంతంగా చేసుకోవాలని చెప్పేది. ప్రోగ్రెస్ కార్డు వచ్చిన రోజు దెబ్బలే... నా చిన్నప్పుడు సినిమా వాళ్ల పిల్లలు సినిమా తారలు అవుతారు అనుకునేదాన్ని. స్కూల్లో టీచర్లు కూడా ‘నువ్వు చదువుకోకపోయినా పరవాలేదు, మీ అమ్మగారు పెద్ద హీరోయిన్ కదా, నువ్వు కూడా హీరోయిన్‌వి అయిపోతావు’ అనేవారు. నేను అదే నిజం అనుకున్నాను. చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. కాని అమ్మ ఊరుకునేది కాదు. తక్కువ మార్కులు వస్తే బెత్తం అందుకునేది. అందుకని నా రిపోర్టు కార్డు నాన్న స్వయంగా తీసుకునేవారు. ఆ టైమ్‌లో అమ్మకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నించేదాన్ని. ఒక్కోసారి చెట్టు ఎక్కేసేదాన్ని. అమ్మ చేతికి చిక్కగానే రెండు దెబ్బలు పడేవి. నాకు ఇంగ్లీషు, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇష్టం. నెమ్మదిగా చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఏ. పూర్తి చేశాను. అమ్మ ఎంత బిజీగా ఉన్నా నేను స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి నా చేత సత్యభామ వేషం వేయించి, తనే కొత్త డ్రెస్ కుట్టించి, మేకప్ చేసి, పద్యాలు నేర్పించేది. మా స్కూల్‌కి వచ్చేది. అమ్మని ప్రత్యేక అతిథిగా వేదిక మీదకు ఆహ్వానించేవారు. తెలుగుతో సూర్యోదయం... తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే అమ్మ నిద్ర లేచి నాకు హిందీ, తెలుగు నేర్పించేది. ఎంత ఆధునికంగా ఉన్నా, సంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదని, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని అమ్మనాన్న ఇద్దరూ చెప్పేవారు. పూజ, మడి, ప్రసాదం తయారు చేయడం, నైవేద్యం పెట్టడం... అన్నీ నేర్పింది. అందరితో కలసిమెలసి ఉండాలని చెప్పేది, కలవనిచ్చేది. ఒత్తులు సరిగా పలక్కపోతే ఒప్పుకునేది కాదు. మా అబ్బాయికి కూడా అమ్మే తెలుగు నేర్పిస్తూ, తెలుగులో మాట్లాడాలని చెబుతుంది. మా చిన్నతనం నుంచి అమ్మానాన్నల్లో ఎవరో ఒకరు మా విషయాలు పట్టించుకునేవారు. పాటలు – పాత్రలు... అమ్మకి జ్ఞాపకం బాగా ఎక్కువ. ఏ సినిమా ఎప్పుడు ఎక్కడ షూటింగ్ జరిగిందీ, అక్కడ సెట్లో వాళ్లు ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారో అన్నీ నాకు చెప్పేది. నేను, నాన్న ‘మీరజాలగలనా’ పాటను పాడుతూ అమ్మను ఆట పట్టించేవాళ్లం. అమ్మ నటించిన ‘గుండమ్మ కథ’ నా ఫస్ట్ ఫేవరేట్. అందులో అమ్మ వేసిన సరోజ పాత్రలో నన్ను నేను చూసుకుంటాను. నేను కూడా ఆ సినిమాలోలాగే నిద్ర మంచం మీద నుంచే ‘అమ్మా! కాఫీ’ అనేదాన్ని. ‘కిందకి వచ్చి తాగు’ అని అమ్మ గట్టిగా అనేది. ఈ సినిమాలో రెండోభాగంలో ఒక సామాన్యుడి భార్యగా అమ్మని చూడటం నాకు నచ్చేది కాదు. ఒక సినిమాలో అంత వేరియేషన్ రావడం ఆ తరవాతి రోజుల్లో నాకు బాగా నచ్చింది. పరిశ్రమలో వేరెవ్వరికీ ఇటువంటి పాత్రలు లేవేమో అనుకుంటాను. అమ్మ వేసిన పాత్రలలో ‘మూగమనసులు’ చిత్రంలోని గౌరి కూడా నాకు ఇష్టం. ఆ చిత్రంలో అమ్మని ముసలిగా చూడలేకపోయేదాన్ని. చిన్నప్పుడు ఈ సినిమా అమ్మతో కూర్చుని చూశాను. అమ్మ నటించిన ‘మూగనోము’ చిత్రాన్ని చూస్తూ, నాన్న ఏడ్చేవారు. నేను ఆ సినిమా చూడలేదు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’లో మహిళాశక్తి, స్త్రీ త్యాగం చూపారు. హిందీలో ‘మిలన్’, ‘మిస్ మేరీ’ సినిమాల్లో అమ్మ బాగా చేసింది. ఆధ్యాత్మిక పాత్రలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పాత్రలు, పౌరాణికాలు... ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసినది బహుశ అమ్మ ఒక్కరేనేమో. అమ్మ సినిమా జీవితంలో పడిన కష్టాలు విని ఆశ్చర్యపోయాను. అమ్మను సినిమా షూటింగ్లో ఎప్పుడూ చూడలేదు. తీసుకెళ్లేది కాదు. దసరా బొమ్మల కొలువు... అమ్మ తన బాల్యం నుంచి ఇప్పటివరకు దసరాకు బొమ్మల కొలువు పెడుతూనే ఉంది. వందేళ్లనాటి మా అమ్మమ్మ ఆడుకున్న బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయి. అమ్మ పెట్టే బొమ్మల అమరికలో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అమ్మమ్మ... అమ్మ... నేను... మా అబ్బాయి... పరంపర కొనసాగుతోంది. ఆ సంవత్సరం గృహిణిగా... నాకు 16 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మని ఎన్నడూ కిచెన్‌లో చూడలేదు. ఒకసారి ఒక సంవత్సరం పాటు వంట మనిషి దొరకలేదు. దానితో ఏడాదిపాటు అమ్మ తన పనులన్నీ మానేసి, కెరీర్‌కి సెలవు పెట్టేసింది. వంటల పుస్తకాలు తెప్పించుకుని, చదివి, చేసేది. అమ్మ చేసిన వాటిలో క్యాలీఫ్లవర్ బజ్జీ, వెజిటబుల్ అగ్రెట్టా (ఇటాలియన్) నాకు బాగా ఇష్టం. ప్రతిరోజూ నా బాక్స్‌లో లంచ్ నా స్నేహితులు తీసుకుని తినేసేవారు. ఇంటికి వచ్చాక అమ్మ, ‘ఈ రోజు లంచ్ ఎలా ఉంది’ అని అడిగితే, నేను సమాధానం చెప్పలేకపోయేదాన్ని. ఆ ఏడాది అమ్మని అచ్చమైన గృహిణిగా చూశాను. వ్యక్తిత్వం నిలబెట్టుకుంది... సినిమా రంగంలో వ్యక్తిత్వం నిలబెట్టుకున్న అమ్మ దగ్గర ఎవ్వరూ వెకిలి జోకులు వేసేవారు కాదు. అలా నిలదొక్కుకోవడం చాలా కష్టమని చెప్పేది. మా అబ్బాయితో రెజ్లింగ్ చేస్తుంది. అమ్మ డైట్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఇప్పటికీ మాకు ఆహారపు అలవాట్ల గురించి క్లాసు పీకుతుంది. అమ్మ నుంచి జెనెటిక్‌గా నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. అమ్మకు కోపం ఎంత త్వరగా వస్తుందో, అంత త్వరగా పోతుంది. పర్ఫెక్షన్ కోసమే అమ్మకి కోపం వస్తుంది. అన్నయ్య, నేను సినిమాలలోకి వెళ్లకపోయినా, మనవడైనా సినిమాలలోకి ప్రవేశించి, తన పేరు నిలబెట్టాలని కోరుకుంటోంది అమ్మ. – సంభాషణ:డా. వైజయంతి పురాణపండ ఫొటోలు: శివ మల్లాల గ్లాస్ పెయింటర్ని... బి.ఏ. పూర్తయ్యాక కొంతకాలం శాన్ఫ్రాన్సిస్కోలో అన్నయ్య దగ్గరున్నాను. ఆ సమయంలోనే బర్కిలీలో గ్లాస్ ఆర్ట్ మీద కోర్సు చేశాను. ఇదే నా కెరీర్ అని అర్థం చేసుకుని, పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టాను. గ్లాస్ పెయింటింగ్ వర్క్ అర్ధరాత్రి వరకు చేస్తుండేదాన్ని. చేతులు కోసుకుపోతుండేవి. నా చేతులు చూసి, అమ్మ గోరుముద్దలు తినిపించేది. నవ రసాల మీద తొమ్మిది పెయింటింగులు వేసి, ‘త్వమేవాహమ్’ పేరు పెట్టాను. ‘నిత్య విద్యార్థి’లా ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంది. అమ్మ తనను తాను అలాగే అనుకుంటుంది. – స్రవంతి -
శివ స్రవంతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న రుద్ర స్రవంతి అనే శివభక్తురాలు కార్తీకమాసం ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 11 వేలకు పైగా శివలింగ ప్రతిమలను తయారు చేయడం శివభక్తులకు కనువిందైన ఒక విశేషం అయింది. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రుద్ర స్రవంతి.. భర్త వ్యాపారం రీత్యా నాయుడుపేటలో ఉంటున్నారు. ఆమె శివభక్తురాలు. ప్రత్యేకించి శివలింగ ప్రతిమలను తయారుచేయడం కోసమే ఆమె నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో బాలాజీ ఎనక్లేవ్లో నివాసం ఉంటూ గత ఐదేళ్లుగా ప్రతిమల తయారీతో శివారాధన చేస్తున్నారు. తండ్రి ప్రమాదంలో గాయపడి కోలుకున్న తరువాత ఆయన క్షేమం కోసం మరింత భక్తిభావంతో పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అష్టగంధంతో శివలింగ ప్రతిమలు ఈసారి కాశీకి చెందిన ఓ ఆశ్రమ పీఠాధిపతి ఇచ్చిన అష్టగంధంతో గత నెల రోజులుగా శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. గంధంతోపాటు పసుపు, విబూది, బంకమట్టి, పుట్టమట్టి మేళవింపుతో ప్రతిమలకు ఆమె రూపునిస్తున్నారు. ఎవరి సహాయమూ తీసుకోకుండా ఇంట్లోనే ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రోజుకు 300 నుంచి 350 శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నారు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉంటూ కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ రోజుకు 12 గంటలకు పైగా శ్రమించి ప్రతిమల్ని చేస్తున్నారు. దాంతో ఇంట్లో ఎక్కడ చూసినా శివలింగ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి ముఖద్వారం తెరుచుకున్న వెంటనే అనేక రుద్రాక్షలు ధరించి ఉన్న శివుడి ప్రతిమ కనిపిస్తుంది. ఆమె పూజ గదిలోనూ ఎక్కువగా శివుడు, శివలింగాల ప్రతిమలే ఉంటాయి. నేడు ప్రాణ ప్రతిష్ట ఇప్పటి వరకు పూర్తి చేసిన 11,111 శివలింగాల ప్రతిమలకు నేడు (కార్తీకమాసం చివరి సోమవారం) వేదపండితులతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. ఈ శివలింగాలను ఎవరికీ ఇచ్చేది ఉండదని, మొత్తం శివలింగాలను కలిపి మహా శివలింగం తయారు చేసి పూజలు చేసిన అనంతరం మూడు రోజుల తరువాత నవంబరు 28వ తేదీన నెల్లూరు జిల్లా పరిధిలోని మల్లాం గ్రామ సమీపంలో సముద్రతీరంలో నిమజ్జనం చేస్తామని ఆమె చెప్పారు. రుద్ర స్రవంతి తయారు చేస్తున్న ఈ శివలింగాలను రోజూ అనేక మంది భక్తులు ఇంటికి వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ఎస్.కె.రియాజ్బాబు, సాక్షి నాయుడుపేట -
చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి
నాగర్‌కర్నూల్: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్‌లో మృతి చెందింది. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్రవంతి భర్త 8 నెలల క్రితం నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు -
గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్/జడ్చర్ల టౌన్: పనిఒత్తిడి తట్టుకోలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి గ్రామ జూనియర్ కార్యదర్శి ప్రత్యూష ఉద్యోగానికి రాజీనామా చేయగా, గురువారం నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మా జిపేట మండలం గుమ్మకొండ జూని యర్ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు యత్నించింది. ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా గురువారం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బడ్జెట్‌పై గ్రామసభ నిర్వహించారు. సభ ముగిశాక స్రవంతి కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు స్రవంతిని తిమ్మాజిపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. స్రవంతి స్వస్థలం నాగర్‌కర్నూల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
హరీశ్‌రావు చొరవతో స్రవంతికి ఆర్థిక సహాయం
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని ఎస్సీ కాలనీకి చెందిన స్రవంతి వైద్యం కోసం అవసరమైన నిధుల మంజూరుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపారు. ఆమె వైద్యం కోసం అవసరమైన డబ్బులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. మంజూరైన సొమ్ముకు సబంధించిన ఎల్ఓసీని శుక్రవారం బాధితులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే.. న్యాల్కల్కు చెందిన కీర్తన, మాణిక్ దంపతుల కూతురు స్రవంతి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. కొంత కాలంగా ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది. కూతురుకు వచ్చిన వ్యాధికి చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యానికి రూ.14 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఇంత డబ్బు ఎక్కడ నుంచి తేవాలని తల్లిదండ్రులు మనో వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అదే కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు భాస్కర్, మండల టీఆర్ఎస్ నాయకుడు వెంకట్ ఈ విషయాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావు, ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారులతో మాట్లాడి స్రవంతి వైద్యం ఖర్చుల కోసం రూ.12 లక్షలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. స్రవంతి వైద్యం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి చొరవ చూపిన హరీశ్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు స్రవంతి, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
కొడుకిచ్చిన డాక్టరేట్
డాక్టర్ స్రవంతి సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిని. ఒక వైపు ఉద్యోగ నిర్వహణ, మరోవైపు తల్లిగా నిర్విరామ శ్రమ. రెండేళ్లకోసారి బదలీలు. ఉద్యోగరీత్యా తరచు క్షేత్రస్థాయిలో తిరగాల్సి రావడం. వీటన్నిటి ఒత్తిడిలో ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడ్ని చూసుకోవడం ఆమెకు శక్తికి మించిన బాధ్యత అయింది. అయినా కూడా ఆమె నిస్పృహ చెందలేదు. మానసిక ఎదుగుదల లేని తన బిడ్డను కంటికి రెప్పలా కాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, తనబిడ్డలా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ సమస్యకు పరిష్కారమేమిటి అనే అంశాలపై ఆమె పరిశోధన చేశారు. ఎస్వీయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ వివరాలు స్రవంతి మాటల్లో..‘‘మా స్వస్థలం అనంతపురం జిల్లా. ఉద్యోగ రీత్యా తిరుపతిలో స్థిరపడ్డాం. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే రవికుమార్‌తో 1996లో వివాహమైంది. 1999లో బిడ్డ పుట్టాడు. పేరు చందన్. అయితే ఏడాది వయస్సు వచ్చినా వాడిలో ఎలాంటి స్పందనలు లేవు. చాలాచోట్ల చూపించాం. ఫలితంలేదు. మూడు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు సికింద్రాబాద్‌లోని ఎన్ఐహెచ్ఎం సంస్థ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాం. ఆటిజం అని చెప్పారు! ఈ సమస్యతో బాదపడేవారు వారిలో మానసిక ఎదుగదల వుండదు. చూసేవాళ్లు ఎవరూ లేక చందన్‌ని వెంట పెట్టుకునే విధులకు హాజరయ్యేదాన్ని. ఓసారి చందన్ తనకు తెలియకుండా మా ఇంటికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. దాంతో శరీరమంతా షాక్‌కు గురై 16 సర్జరీలు జరిగాయి. ఆ సందర్భంలో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. నా బిడ్డకు ఇలా అవుతోందేమిటి అని మనోవేదనకు గురయ్యాను. సాధారణంగా తల్లిదండ్రులు ఈ సమస్యతో బాధపడే పిల్లలను కొంత నిర్లక్ష్యం చేస్తారు. బాగా వుండే పిల్లలపై చూపే శ్రద్ధ వీరిపై చూపరు. ఆ స్థితి నా బిడ్డకు రాకూడదనే లక్ష్యంతో ఇంకో బిడ్డను వద్దనుకున్నాను. ఇలాంటి సమస్య ఉన్న పేరెంట్స్‌కి పరిష్కారం చూపాలని అనుకుని పరిశోధనకు పూనుకున్నాను. ఈ పరిశోధనకు నా అనుభవమే గ్రంథాలయమైంది. ఇల్లే ప్రయోగశాలగా మారింది. నా బిడ్డే నా పరిశోధనకు కేంద్రబిందువయ్యాడు. పదకొండేళ్ల పరిశోధన నేను 1992లో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరాను. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చందన్‌ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాను. ఆటిజంపై పరిశోధన కోసం 2008లో ఎస్వీయూ సైకాలజీ విభాగంలో పిహెచ్‌డీకి చేరాను. ‘హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్ బిహేవియర్ ఆఫ్ ఆటిస్టిక్ మెంటల్లీ చాలెంజ్డ్ చిల్డ్రన్’ అనే అంశాన్ని తీసుకున్నాను. అలా పదకొండేళ్ల నా పరిశోధనలో అనేక విషయాలను తెలుసుకున్నాను. ఆటిజం ఉన్న పిల్లలు తమకు ఏం కావాలో చెప్పలేరు. కమ్యూనికేట్ చేయలేరు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని నియంత్రించలేం. ప్రతి చిన్నవిషయానికీ బాధపడుతుంటారు, భయపడుతుంటారు. వీళ్ల విషయంలో ఎక్కువ శ్రద్ద చూపాలి. ఆటిజం ఉన్నపిల్లలను త్వరగా గుర్తించలేం. అయితే తగినంత ప్రత్యేక పద్దతుల్లో రెండుమూడు వారాల్లోనే గుర్తించవచ్చు. ఇలా గుర్తించినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటేకొంత మేలు చేకూరుతుంది. రీహాబిలిటేషన్ కల్పించాలి ఆటిజంతో జన్మించిన పిల్లలు తమ తప్పులేకపోయినా తమ ప్రమేయం లేకుండానే భూమిపైకి వస్తారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకూడదు. బిడ్డలు లేని స్థితికన్నా ఎవరో ఒకరు ఉన్నారన్న సంతోషంతో వారిపట్ల ప్రేమానురాగాలు చూపిస్తూ పెంచాలి. వృద్ధులు, అనాథలకు ఆశ్రమాలు ఉన్నాయి. కాని ఇలాంటి వారికి ఆశ్రమాలు లేవు. ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు చొరవ చూపి రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు ఎలాంటి సమస్య వుండదు. అయితే వారు చనిపోయాక ఏమిటనేదే ప్రశ్నార్థకం. నా పరిశోధనలో గరిష్టంగా అరవై సంవత్సరాల వయస్సు వున్న మానసిక ఎదుగదల లేని వ్యక్తిని కూడా గుర్తించాను. మన రాష్ట్రంలో ఈ తరహా తొలి పరిశోధన బహుశా నేను చేసిందే కావచ్చు. సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డి.జమున పర్యవేక్షణలో నేను ఈ పరిశోధన చేశారు’’ అని తెలిపారు డాక్టర్ స్రవంతి. బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, సాక్షి, తిరుపతి ఫొటో: షేక్ మహమ్మద్ రఫీ సంగీతంతో చికిత్స నా బిడ్డ ఎలాంటి స్పందన లేకుండా వుండడం, మానసిక ఎదుగదల లేకపోవడంతో చిత్రవధ అనుభవించాను. పరిష్కారం దిశగా ప్రయత్నించాను. ఈ ప్రయాణంలో నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కొన్ని పాటలకు బిడ్డ స్పందించడం గుర్తించాను. ఐదు పాటలను ఎంచుకుని ఆకలి, బాధ, దుఃఖం, సంతోషం, కోపం వీటికి.. స్పందించేలా చేశాను. అప్పుడు చందన్ తనలోని భావాలను ఈ పాటలకు ప్రతిస్పందించడం ద్వారా నాకు అర్థమయ్యేలా చేసేవాడు. -
మోస్ట్ ఇన్స్పైరింగ్ మదర్ స్రవంతి ఐతరాజు
-
మోస్ట్ ఇన్స్పైరింగ్ మదర్ స్రవంతి ఐతరాజు
చిన్న కష్టం వస్తే మానసికంగా కుంగిపోయి.. ఆ కష్టంలోనే జీవితాంతం కూరుకుపోయే వాళ్లు ఎటు చూసినా కనిపిస్తారు. జీవితకాలానికి సరిపడేంత కష్టం బిడ్డ రూపంలో తన కడుపులోనే పుడితే.. ఆ తల్లి కుంగిపోలేదు.. ఆ బిడ్డనే ఓ బహుమతిగా స్వీకరించారు. తనను చుట్టుముట్టిన కష్టాలనే తన విజయాలకు సోపానాలుగా మలచుకున్నారు. ఆ మెట్లపై తన బిడ్డను వేలుపట్టి నడిపిస్తున్నారు. శరీరం ఎదుగుతున్నా మనసు ఎదగని ఆ పసిబిడ్డ చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తన విజయాలన్నీ ఆ బిడ్డ ఇచ్చినవే అని మురిపెంగా చెప్పే ఆ మాతృమూర్తిని ఈ మాతృదినోత్సవం రోజు పలకరించింది సాక్షి. డాక్టర్ ఐతరాజు స్రవంతి మదర్ ఆఫ్ చందన్.. అవును ఆమెకు ఇలా చెప్పుకోవడం ఇష్టం గర్వకారణం కూడా. తనను చందన్ తల్లిగా ఈ ప్రపంచం గుర్తిస్తే.. అది తన ద్వారా తన బిడ్డ సాధించిన గొప్ప విజయం అంటారు ఈ తల్లి. చందన్ ఆటిజంతో పుట్టిన బిడ్డ. 19 ఏళ్లొచ్చినా చంటిపిల్లాడే. బిడ్డతోపాటే కష్టాలూ పుట్టాయి. అద్దె ఇల్లు దొరికేది కాదు, దగ్గరి బంధువులు, స్నేహితులు శుభకార్యాలకు చందన్ వద్దని చెప్పేవారు. నా బిడ్డ ఏం తప్పు చేశాడు.. లోపం వీడిలో కాదు.. వీణ్ని చూస్తున్న సమాజంలోనే ఉందని చందన్ చిన్నప్పుడే గుర్తించారు స్రవంతి. అందుకే మరో మంచి బిడ్డను కనమని అంతా సలహా ఇస్తే.. ఇంత అద్భుతమైన కొడుకు నాకున్నప్పుడు మళ్లీ కనడమెందుకన్నారు. అప్పటికే ఆమె సైకాలజీ స్టూడెంట్.. చందన్ పుట్టాక, ఆ బిడ్డకు ఆటిజం అని తెలిశాక తన బిడ్డ మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఆటిజంలో పీహెచ్డీ చేశారు. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఆటిజంపై కొన్ని వేల పుస్తకాలు సేకరించి, చదివి రీసర్చ్ చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి స్రవంతి. బిడ్డ కోసం నేను ఎన్నో నేర్చుకున్నానే తప్ప ఏదీ త్యాగం చేయలేదంటారు ఆమె. చిన్నప్పుడే నేర్చుకున్న కర్నాటక సంగీతాన్ని తన బిడ్డ.. మనసులో మాటల్ని చెప్పడానికి ఆయుధాల్లా మలచిన తీరు ఆమె మాటల్లో వినాల్సిందే. గొప్ప కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులిద్దరూ సాహితీప్రియులు. తండ్రి ప్రొఫెసర్. శంకరంబాడి సుందరాచార్యుల వారికి స్వయానా మేనకోడలు. చిన్న వయసులోనే సంగీతం, సాహిత్యం అబ్బాయి. చదువు పూర్తయ్యాక సాంఘిక సంక్షేమ శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ చేతినిండా సంపాదిస్తున్నారు.. అయినా ఏ రోజూ నాకు ఇలాంటి బిడ్డ ఎందుకని కుంగిపోలేదు. పిల్లాడిలోని పిసితనాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటినే ఆటిజం ప్రయోగశాలగా మలచారు. అలాగని తన వ్యాపకాలను పక్కనపెట్టలేదు. రచయితగా, కవయిత్రిగా అనేక పుస్తకాలను, నవలలను రాశారు. సైకాలజిస్టుగా వందలాది టీవీ, రేడియో కార్యక్రమాలు నిర్వహించారు. సంగీత సృజనకారిణిగా ఎన్నో ప్రయోగాలు చేశారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత సైకాలజిస్టుల్లో ఒకరుగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్రపతి అవార్డు మొదలు.. ప్రఖ్యాత యూనిసెఫ్ ఇచ్చే ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు దాకా ఇంట్లో కొలువుదీరిన అవార్డులన్నీ ఆమె విజయాలకు దర్పణాలు. ఇవన్నీ.. బిడ్డకు అవసరమైనవి నేర్పుతూ.. తాను నేర్చుకుంటూ సాధించిన విజయాలుగా ఆమె చెప్తారు. సాధారణ మానసిక వికలాంగులపై ప్రభుత్వాలకు ఉండే శ్రద్ధ ఆటిజం చిన్నారుల విషయంలో ఉండదు. ప్రపంచంలోనే ఆటిజం బిడ్డలపై చెప్పలేనంత నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం ఉందంటారు స్రవంతి. అందుకే.. తన బిడ్డ తన ప్రయోగాలకు మూల వస్తువుగా ఉపయోగపడ్డాడని చెబుతారు. తన రీసెర్చ్ వర్క్ ఎంతోమంది ఆటిజం బిడ్డలకూ, వారి తల్లిదండ్రులకూ దిశానిర్దేశం చేసి వారికి మానసిక ప్రశాంతత ఇస్తుందంటారు స్రవంతి. గోల్డ్ మెడల్స్ సాధించి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డ బిడ్డల తల్లిదండ్రులు ఎంత తృప్తిగా ఉంటారో.. తాను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ చందన్ తల్లి. డాక్టర్ ఐతరాజు స్రవంతి వల్ల చందన్ మోస్ట్ హ్యాపియస్ట్ బోయ్‌గా జీవిస్తున్నాడు... చందన్ కోసం ఆమె సాగించిన రీసెర్చ్ ఆటిజంతో పుట్టిన తల్లిదండ్రులకు ఓ వరం. ఆటిజంతో పుట్టిన ప్రతి బిడ్డా చందన్ అంత హ్యాపీగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటున్న స్రవంతి.. మోస్ట్ ఇన్స్పైరింగ్ మదర్. -
ఇంజక్షన్ వికటించి గర్భిణీ మృతి
హైదరాబాద్: కూకట్పల్లి ఓమ్ని ఆసుపత్రిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంజక్షన్ వికటించి స్రవంతి(25) అనే గర్భిణీ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే స్రవంతి మృతికి కారణమని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో ఇంజక్షన్ ఇవ్వడంతో స్రవంతి కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమార్తె మృతికి కారణమైన డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని తండ్రి వీరేశం, అమ్మ సుజాతలు డిమాండ్ చేశారు. -
పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ కైవసం
మచిలీపట్నం: ఒక్క ఓటు తేడాతో పెడన మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. టీడీపీకి చెందిన కౌన్సిలర్ స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో చైర్మన్ పీఠం వైఎస్ఆర్ సీపీకి దక్కింది. పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీ, మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ తరపున ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. దీంతో టీడీపీదే చైర్మన్ పీఠం అనుకుంటున్న తరుణంలో... కౌన్సిలర్ స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ తరఫున గెలిచిన ఆమె ........ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్‌కు ఓటు వేశారు. దీంతో చైర్మన్ కుర్చి వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకి వెళ్లింది. పెడన మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతి చెందారు. దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అలాగే పెడన మండల పరిషత్ పీఠం కూడా వైఎస్ఆర్సీపీకే దక్కింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలలో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండగా, టీడీపీకి నలుగురే ఉన్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు. -
భర్త మందలించడంతో.. భార్య ఆత్మహత్యాత్నం
తనకు తెలియకుండా సెల్‌ఫోన్ ఎలా కోనుగోలు చేసావని భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన మహేందర్, స్రవంతి(23) దంపతులు. వీరు జీవనోపాధి కోసం ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చి బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలో ఓ అపార్ట్మెంటులో వాచ్‌మెన్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా స్రవంతి రెండు రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కోనుగోలు చేసింది. దానిని శనివారం భర్త గమనించి నాకు తెలియకుండా సెల్‌ఫోన్ ఏలా కోనుగోలు చేశావని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి గుర్తు తెలియని విషం సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తింటి వారే చంపేశారు..!
బాధిత కుటుంబసభ్యులు, బంధువుల ఆరోపణ జిల్లాలో ఇద్దరు వివాహితల అనుమానాస్పద మృతి మూడు‘ముళ్ల’ బంధం.. వారిని అనుబంధాలకు దూరం చేసింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అత్తావారి ఇల్లే నరకప్రాయంగా మారింది. కట్నం వేధింపులో.. కుటుంబ గొడవలో.. కారణమేదైతేనేం చివరికి ఇద్దరి వివాహితల ప్రాణాలు బలిగొంది. హత్యో.. ఆత్మహత్యో.. కూడా తెలియని అనుమానాస్పద స్థితిలో మృత్యువు వారిని కబళించింది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల ఈ హృదయ విదారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వేమనపల్లి మండలంలో ఒకరు.. వేమనపల్లి : మండలంలోని మారుమూల ముల్కలపేట గ్రామంలో బొల్లంపల్లి స్రవంతి(21) అనే వివాహిత గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె భర్త పోచాగౌడ్ స్రవంతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుందని తెలుపుతుండగా... తండ్రి రాజమల్లాగౌడ్ మాత్రం తన కూతురును అత్తింటి వారే కొట్టి చంపారని ఫిర్యాదు చేశాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొట్టి చంపారంటున్న మృతురాలి కుటుంబసభ్యులు ముల్కలపేటకు చెందిన బొల్లంపల్లి పోచాగౌడ్‌కు కోటపల్లి మండలం రాజారంకు చెందిన స్రవంతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. పోచాగౌడ్ త ండ్రి గతంలో చనిపోగా తల్లి బాయక్క ఉంది. వీరికి అప్పుడప్పుడు కుటుంబంలో స్వల్పంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి బాయక్క కొడుకుతో ఉండలేక నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టించింది. గురువారం ఉదయం ఇంట్లో స్వల్ప గొడవ జరిగింది. పోచాగౌడ్ పొలం పనులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య స్రవంతి అపస్మారక స్థితిలో మంచంపై పడుకుని ఉంది. వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో చెన్నూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కోటపల్లి చేరేసరికి మృతిచెందింది. కానీ.. మృతురాలి కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది. తన కూతురును అల్లుడు పోచాగౌడ్ అతని తల్లి బాయక్క కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. తండ్రి రాజమల్లాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇచ్చోడ మండలంలో మరొకరు.. ఇచ్చోడ : మండలంలోని గుండివాగు గ్రామంలో లక్కె సులోచన(25) అనే వివాహిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో బావిలో మృతిచెందింది. అదనపు వరకట్నం కోసం తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సులోచన బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అదనపు కట్నం కోసమే..? ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామానికి చెందిన భగ్నూరె తాతెరావు తన కూతురు సులోచోనను మూడేళ్ల కిత్రం గుండివాగు వాసి లక్కె సూర్యకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లి సమయంలో రూ.లక్షన్నర వరకట్నంగా ఇచ్చాడు. అరుుతే రెండేళ్లుగా సూర్యకాంత్ అదనపు వరకట్నం కోసం సులోచనను వేధిస్తున్నాడు. కట్నం విషయంలోనే బుధవారం ఉదయం సులోచనతో అత్తింటివారు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మధ్యాహ్నం తన కూతురును పొలంలోకి తీసుకెళ్లి హత్య చేసి బావిలో పడేసి, ఇంటికి తిరిగొచ్చి తన భార్య కనిపించడం లేదని అల్లుడు సూర్యకాంత్ నాటకమాడాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. రాత్రంతా వెతికినట్లు చేసి బావిలో మృత దేహంగా ఉన్నట్లు గుర్తించి కట్టుకథ అల్లుతున్నారని రోదించారు. ఈ మేరకు గురువారం ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బోథ్ సీఐ నాగేంద్రచారి, నేరడిగొండ ఎస్సై వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బావిలోంచి మృతదేహాన్ని వెలికి తీరుుంచారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి భర్త సూర్యకాంత్, అత్త శకుంతలను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతురాలికి 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. -
రాంపూర్‌లో యువతి ఆత్మహత్య
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామానికి చెందిన స్రవంతి(22) అనే యువతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం రాత్రి ఓ కేసు విషయమై తన అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్రవంతి అన్నను తీసుకెళ్లే సమయంలో అడ్డుపడటంతో వారు పక్కకు తోసేశారు. దీంతో మనస్తాపం చెంది సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. -
పోలీసుల గుటికి మరో ప్రేమజంట
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
యాచారం : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మండిగౌరెల్లి గ్రామంలో గురువారం ఉదయం స్రవంతి(16) అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసి ఒంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకుంది.ఒళ్లంతా కాలి కాసేపటికే మృతి చెందింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న స్రవంతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
వానరాల దాడి.. గర్భిణికి గాయాలు
మెదక్ రూరల్: కోతుల దాడితో భయపడిన ఓ గర్భిణి భవనం నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన సంఘటన మెదక్ మండలం బ్యాతోల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొనిగండ్ల స్రవంతి ఐదు నెలల గర్భిణి. సాయంత్రం వేళ తన భవనంపై ఆరబెట్టిన బట్టలను తెచ్చేందుకు పైకి ఎక్కింది. దీంతో కోతులు స్రవంతిపై దాడి చేశాయి. భయపడిన ఆమె వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో స్రవంతి రెండు చేతులు విరిగిపోయాయి. వెంటనే కుటుంబీకులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ధర్నా
నేరేడ్మెట్ : ప్రేమించాడు...పెళ్లి చేసుకుంటానన్నాడు....తీరా మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం....కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన పల్లె స్రవంతి (20), వాజ్‌పేయినగర్‌కు చెందిన కారు డ్రైవర్ దురిశెట్టి లక్ష్మణ్‌లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన లక్ష్మణ్, స్రవంతితో మూడు సంవత్సరాలుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఫోన్ చేయడం మానేశాడు. దీంతో స్రవంతి వారం రోజుల క్రితం వేరే ఫోన్‌తో లక్ష్మణ్‌కు ఫోన్ చేసింది. అప్పుడు లక్ష్మణ్ తండ్రి మల్లయ్య ఫోన్ తీయడంతో.. నాకు కారు డ్రైవర్ కావాలి.. లక్ష్మణ్‌కు ఎంత ఫోన్ చేసినా తీయడంలేదని చె ప్పింది. దానికి లక్ష్మణ్ తండ్రి లక్ష్మణ్ ఇప్పుడు రావడం కుదరదు. ఈనెల 14న అతని వివాహం జరగనుందని తెలిపాడు. ఇది విన్న స్రవంతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏంచేయాలో తోచక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. లక్ష్మణ్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఉంటాడని తెలుసుకున్న బాధితురాలు కరీంనగర్ నుంచి బయలుదేరి అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు నేరేడ్మెట్లోని వాజ్‌పేయినగర్‌లో లక్ష్మణ్ నివాసం ఉంటున్నాడని చెప్పడంతో.. స్రవంతి సోమవారం తెల్లవారు జామున వాజ్‌పేయినగర్‌లోని లక్ష్మణ్ ఇంటికి చేరుకుని ఇంటి ముందు నిరసనకు దిగింది. ఇది గమనించిన అతని కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఉడాయించారు. సమాచారం అందుకున్న నేరేడ్మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు స్రవంతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా..... లక్ష్మణ్ వివాహం 14వ తేదిన వాజ్‌పేయినగర్‌లో నివాసముండే మరో అమ్మాయితో నిశ్చయమయింది. బాధితురాలు ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో.. ఎలాగూ స్రవంతి వాజ్‌పేయినగర్‌కు కూడా వస్తుందని.. ఇప్పటికే అందరికి పెళ్లి శుభ పత్రికలు పంచడంతో వివాహం ఆగిపోయి నలుగురిలో పరువు పోతుందని భావించి.. ఆదివారమే పెద్దల సమక్షంలో మరో అమ్మాయితో గుళ్లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. -
అల్లరి రాక్షసి
మీ..స్రవంతి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్! ఇదిగో ఇలా చిలిపి నవ్వులు రువ్వుతూ.. సోగ కళ్లతో ఓ లుక్కేస్తున్న ఈ అల్లరి పిల్ల కూడా అంతే! గుడివాడలో పుట్టి..నెల్లూరులో చదివినా.. సిటీలో ‘కిర్రాక్’ పుట్టిస్తోంది. వరుస టీవీ షోలతో యాంకర్‌గా అదరగొట్టేస్తున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి పేరు స్రవంతి. మాటల మ్యాజిక్‌తో ఇంటింటికీచేరువైన అమ్మడు ‘సిటీప్లస్’తో కాసేపు ‘ప్లే బ్యాక్’కు వెళ్లింది. అది ఆమె మాటల్లోనే... - శిరిష చల్లపల్లి ఇంట్లో మగ పిల్లలు ఎవరూ లేరు. నేను.. చెల్లి! సో.. మనకు పూర్తి స్వేచ్ఛ. అమ్మాయినే అయినా.. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని అల్లరి. చిన్నప్పుడైతే డ్రెస్సులు కూడా ప్యాంటులు, షర్ట్లే! హెయిరూ షార్ట్ కటింగే. అమ్మానాన్నలూ నన్ను అబ్బాయిలానే చూసుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మా నానమ్మ గొడవ మొదలు పెట్టింది.. మగాడిలా ఆ గెటప్ ఏమిటని! తన పోరు భరించలేక చివరకు ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచాల్సి వచ్చింది. నేను పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. స్కూలింగ్ అంతా నెల్లూరులో. నాన్న ఆస్ట్రాలజర్. అమ్మ హౌస్‌వైఫ్. ఇంటర్లో సిటీకి షిఫ్ట్ అయ్యాం. నాటి నుంచి సనత్‌నగర్‌లోనే మకాం. ఇక్కడి హిందూ జూనియర్ అండ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ దగ్గరే ఇల్లు. ఒక్కోసారి లంచ్ బ్రేక్‌లో ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేవారు. అమ్మ అందరికీ వండి పెట్టేది. ప్లేసు మారినా... నా అల్లరి తగ్గలేదు. నన్ను భరించలేక ఇంటి నుంచి కాలేజీ వరకూ అందరూ ‘అల్లరి రాక్షసి’ అని పిలిచేవారు. మా కాలేజీ ఫంక్షన్‌కు ఓసారి ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ వచ్చారు. వివిధ అంశాల్లో నా పెర్ఫార్మెన్స్ నచ్చి.. యాంకరింగ్ చేస్తావా అన్నారు. అలా అనుకోకుండా యాంకర్నయ్యా. తరువాత హాబీగా, ఇప్పుడు ప్రొఫెషన్‌గా మారిపోయింది. నా తొలి ప్రోగ్రామ్ ‘హ్యాపీ డేస్ జాలీ డేస్’. ఇక అక్కడి నుంచి లైవ్ షోస్, సెలబ్రిటీలు, పొలిటికల్ పర్సనాల్టీలతో ఇంటర్వ్యూలు. వాటిల్లో మొదటిది కేసీఆర్ గారితో చేశాను. ‘కిర్రాక్ విత్ క్యాండీ’తో మంచి క్రేజ్ వచ్చింది. మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం, ఒక లైలా కోసం’ సినిమాల్లో చేశా. టెన్షన్స్ ఎన్ని ఉన్నా కెమెరా ముందుకెళ్లానంటే ప్రపంచాన్నే మర్చిపోతా. -
ఏకంగా మంగళ సూత్రమే కొట్టేశారు..
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ పరిధిలోని రాజనర్సింహకాలనీలో ఓ మహిళ మెడలో నుంచి ఏకంగా మంగళసూత్రమే కొట్టేశారు. వివరాలు.. రాజనర్సింహ కాలనీలో ఉంటున్న స్రవంతి, పిసల్‌బండలోని కోచ్‌వెల్ ఐడియా ఆఫ్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు టిఫిన్ బాక్సులిచ్చి తిరిగి వస్తుండగా పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు కాపు కాచి మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రాజనర్సింహకాలనీలోని నేషనల్ ఫంక్షన్ ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగింది. బైక్ నంబరు గమనించిన ప్రత్యక్షసాక్షి ఆటో డ్రైవర్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
ఈ ప్రేమ కథ విషాదాంతం
తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లయిన నెలరోజులకే బలవన్మరణం విజయనగరం : తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా ఒకటిగా ఉందామని కలలు ఉన్నారు. పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ వారి ప్రేమకథ నెల రోజుల్లోనే విషాదాంతమైంది. స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం మేరకు... నెల్లిమర్ల మండలం మొయిద గ్రామానికి చెందిన కాకర్ల గుణశేఖర్(30), బెరైడ్డి స్రవంతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గుణశేఖర్ మన్యపూరిపేటలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. స్రవంతి వైజాగ్‌లోని తన అక్క వద్ద ఉంటూ ఒక కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని జూన్ 20న విశాఖపట్నంలోని ఓ శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. పూల్‌బాగ్‌కాలనీలో గుణశేఖర్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. స్రవంతితో ఆమె తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు. దీంతో మనోవేదనకు గురైన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వచ్చి విషయం తెలుసుకున్న గుణశేఖర్ స్రవంతి లేని జీవితం తనకు వద్దంటూ అదే ఫ్యానుకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
'నా కూతురు నా మాట వినడం లేదు మహాప్రభో'
కరవ మంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవాలని పాల్వాయి ... తన కుమార్తె స్రవంతికి సూచించారు. అందుకు ఆమె ససేమిరా అంది. ఇంకే చేస్తాంమంటూ పాపం పాల్వాయి దగ్గరుండి తన కుమార్తె చేత శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. ఆ విషయం కాస్తా కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌కు తెలిసింది. అంతే పాల్వాయి గోవర్థన్పై జైరాం రమేష్ నిప్పులు తొక్కారు. నామినేషన్ ఉపసహంరింప చేయాలంటూ ఇంటికెళ్లి మరీ ఆదేశించారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ పాల్వాయి గోవర్ధన్ కన్నీటీ పర్యంతమైయ్యారు. దాంతో జైరాం తిక్క రేగింది. కాంగ్రెస్ పార్టీ నిన్ను రాజ్యసభకు పంపిస్తే ఇంత పని చేస్తావా అంటూ పాల్వాయికి జైరాం తలంటాడు. అంతేకాకుండా కన్న కూతురుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పాల్వాయిని జైరాం రమేష్ ఆదేశించారు. మునగొడు ఎమ్మెల్యే టికెట్ పాల్వాయి గోవర్థన్ రెడ్డి ... తన కుమార్తె స్రవంతికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయిస్తుందని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి ఆశలుపై నీళ్లు చల్లింది. ఇంకేముంది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని స్రవంతి తన తండ్రికి బల్లగుద్ది చెప్పింది. దాంతో పాల్వాయి తన కుమార్తె నామినేషన్ దగ్గరుండి మరీ వేయించారు. -
రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె
నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించటం లేదు. దాంతో మునుగోడులో రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ....కుటుంబానికి ఒకే సీటు అనే వాదన తెరపైకి రావడంతో ఆశావాహులకు నిరాశే ఎదురైంది. గతంలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు మునుగోడు టిక్కెట్ స్రవంతిదేనని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మునుగోడును అంటుపెట్టుకోని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపించారు. మరోవైపు దేవరకొండలో రెబల్ బరిలో ఎమ్మెల్యే బాలూ నాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఖరారైన గుడిపాటి నర్సయ్యను మార్చి ఆయన స్థానంలో అద్దంకి దయాకర్‌కు టికెట్ ఖరారు చేయటంతో పార్టీ నేతలు అలకబూనారు. -
మావారి ఆస్తిలో మాకు హక్కు ఉంటుందా?
నాకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. మూడేళ్ల బాబు ఉన్నాడు. వాడు పుట్టిన సంవత్సరానికి మావారికి అంతకుముందే పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. మోసగించారని బాధ కలిగినా, నన్ను కావాలనుకోవడానికి ఆయన చెప్పిన కొన్ని కారణాలు విన్నాక శాంతించాను. పైగా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నాకు, బాబుకి ఏ లోటూ రానివ్వకపోవడంతో ఆయనకు దూరం కాలేకపోయాను. దురదృష్టంకొద్దీ, ఇటీవలే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు నేను, నా బిడ్డ ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు. మేం ఉంటున్న ఇల్లు మావారి పేరు మీదే ఉంది. అది నా బిడ్డకిగానీ, నాకు గానీ వస్తుందా? అసలు ఆయన ఆస్తిలో మాకు హక్కు ఉంటుందా? - స్రవంతి (పేరు మార్చాం), పార్వతీపురం మీరు తెలిసి చేసుకున్నా, తెలియకుండా చేసుకున్నా రెండో పెళ్లి చేసేసుకున్నారు. మీకు బాధ అనిపించినా... మీ పెళ్లి చెల్లదని చెప్పక తప్పదు. ఒక వ్యక్తి తన మొదటిభార్య చనిపోతేనో, విడాకులు తీసుకుంటేనో తప్ప పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే, ఆ వచ్చే భార్యకు ఎటువంటి చట్టపరమైన హక్కులూ ఉండవు. అంటే... మీకు మీవారి ఆస్తుల మీద ఎలాంటి హక్కూ ఉండదు. నిజానికి ఇలాంటి కేసులు, సహజీవనం వంటి కేసులకు సంబంధించి ఆస్తి హక్కు కల్పిస్తూ కొన్ని చ ట్టాలైతే రూపొందాయిగానీ, ఇంకా అమలైతే కావడం లేదు. కాకపోతే మీ బిడ్డకి తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. మీరు తప్పక ప్రయత్నించవచ్చు. అయితే మీకో చిన్న సలహా. ముందే కోర్టుకు వెళ్లే బదులు, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. మీవారి మొదటి భార్య, పిల్లలను కలిసి మీ పెళ్లి విషయం చెప్పండి. సాధారణంగా నమ్మరు కాబట్టి, మీ పెళ్లికి సాక్ష్యాలేమైనా ఉంటే చూపించండి. మీ బిడ్డకు అన్యాయం జరక్కుండా చూడమని రిక్వెస్ట్ చేయండి. వారు మంచి మనసులో అర్థం చేసుకుంటే సమస్యే ఉండదు. అలా జరగకపోతే అప్పుడు చట్టాన్ని ఆశ్రయించండి. బిడ్డకు తండ్రిగా మీవారి పేరు ఎక్కడ నమోదై ఉన్నా (బర్త్ సర్టిఫికెట్, ఇతరత్రా రిజిస్టర్స్ వంటివి) ఆ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయండి. కాస్త ఆలస్యమైనా మీ బిడ్డకు తప్పక న్యాయం జరుగుతుంది. తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది. - నిశ్చల సిద్ధారెడ్డి, న్యాయవాది