రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె | Palvai Govanrdhan reddy daughter Sravanthi Reddy files nomination from munugodu | Sakshi
Sakshi News home page

రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె

Published Wed, Apr 9 2014 1:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Palvai Govanrdhan reddy daughter Sravanthi Reddy files nomination from munugodu

నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించటం లేదు. దాంతో మునుగోడులో రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ....కుటుంబానికి ఒకే సీటు అనే వాదన తెరపైకి రావడంతో ఆశావాహులకు నిరాశే ఎదురైంది.  గతంలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు మునుగోడు టిక్కెట్ స్రవంతిదేనని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మునుగోడును అంటుపెట్టుకోని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపించారు.


మరోవైపు దేవరకొండలో రెబల్ బరిలో ఎమ్మెల్యే బాలూ నాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఖరారైన గుడిపాటి నర్సయ్యను మార్చి ఆయన స్థానంలో అద్దంకి దయాకర్కు టికెట్ ఖరారు చేయటంతో పార్టీ నేతలు అలకబూనారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement