సాక్షి, నల్గొండ: మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పని చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. తర్వాత ఆయన 2017 వరకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి తొలుత 2009లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి బూర నర్సయ్యగౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2016 నుంచి 2018 వరకు నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేశారు. ఎమ్మెల్సీ పదవీకాలం ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు.
చదవండి: రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment