Komatireddy Raj Gopal Reddy
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
-
ఉత్తమ్ కచ్చితంగా సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి,యాదాద్రిజిల్లా: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు.తన నాలుక మీద మచ్చలున్నాయని, తాను ఏదైనా అంటే నిజమవుతుందని చెప్పారు. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి మిస్ అయిందని, ఆయన భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతారని రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు.శుక్రవారం(ఆగస్టు30) భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అని సంబోధించడం ఇటు కాంగ్రెస్ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
కాంగ్రెస్ Vs జగదీష్ రెడ్డి.. అసెంబ్లీలో ‘పవర్’ వార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ విద్యుత్ రంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు వర్సెస్ జగదీష్ రెడ్డి అనే విధంగా చర్చ నడుస్తోంది. నేతల మధ్య పవర్ వార్ జరుగుతోంది.విద్యుత్ రంగంపై చర్చను మొదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది.రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది.యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది.కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు.మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు.చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్‌లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. అనంతరం, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదు.దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదుచర్చించడానికి సమయం లేదంటున్నారు.పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.ఉదయ్ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు విద్యుత్ అందించామన్నారు.అంతకుముందు మధ్యలో..డిమాండ్ బుక్స్ నిన్నే రాత్రే పంపించామని స్పీకర్ చెప్పారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిమాండ్ బుక్స్ ఇప్పటికే పంపించాం.పదేళ్లలో రేపు చర్చ ఉండే ఈరోజు రాత్రి 10 గంటలకు వచ్చి మాకు బుక్స్ ఇచ్చేవారు. ఇదే సమయంలో హరీష్ రావు మాట్లాడటంతో శ్రీధర్ బాబు ఫైర్.హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు.ఇది మానుకోవాలి. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం అంటూ కౌంటర్.. -
నా టార్గెట్ నెరవేరింది.. కానీ, కేసీఆర్ మాత్రం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన ఏకైక లక్ష్యం నెరవేరిందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణలో జైలుకు వెళ్లే నేతలను తాము కాంగ్రెస్‌లో పార్టీలో చేర్చుకోము అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, నేడు(శుక్రవారం) కాంగ్రెస్ నేతలు కురియన్ కమిటీని కలిశారు. అనంతరం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘కురియన్ కమిటీని కలిశాను. పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని అడిగారు. భువనగిరి ఇంఛార్జ్‌గా భారీ మెజార్టీతో గెలిపించానని చెప్పాను. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందనే టాక్ ఉంది. కానీ, నేను ఇంఛార్జ్‌గా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ విజయం సాధించింది. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి అందరం కలిసికట్టుగా పనిచేశాము. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని చెప్పాను అని అన్నారు.ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. తెలంగాణలో నా ఏకైక లక్ష్యం నెరవేరింది. నాకు ఇంకో లక్ష్యం ఉంది.. కేసీఆర్‌ను జైలుకు పంపడమే. బీఆర్ఎస్ సమాధి అయ్యింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్చ ఉంటుంది. బీఆర్ఎస్లో ఎవ్వరూ ఉండరు. హరీష్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాడు. జగదీష్ రెడ్డిని మేము కాంగ్రెస్‌లో చేర్చుకోము. ఆయన జైలుకు వెళ్లే వ్యక్తి. జైలుకు వెళ్లే వారిని ఎవరిని మేము కాంగ్రెస్‌లో చేర్చుకోము’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
సాక్షి, తిరుమల: ముగుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలు తమ వైపే ఉన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి బలంగా పుంజుకుంటుందని, బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదన్నారు. ఏ సర్వేల్లోనూ ప్రజా నాడి బయటకు రాలేదన్నారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్‌గా కొనసాగుతుందని తెలిపారు . -
ఏం చేసినా మీకు ఫలితం లేదు.. X పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: ‘మీ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్‌కే ప్రాధాన్యం.. మీరెంత కష్టపడ్డా ఫలితం లేదు’... అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘మీ పార్టీ మాదిరి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు’అంటూ బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరిపై ఒకరు చేసుకున్న రాజకీయ విమర్శలు బుధవారం శాసనసభలో దుమారం రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా వాతావరణం కొద్ది సేపు వేడెక్కింది. గత బీఆర్ఎస్ పాలనపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై సభ చర్చ చేపట్టింది. హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇది శ్వేతపత్రం కాదు.. కోత పత్రమంటూ ఎద్దేవా చేశారు. ఈ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘హరీశ్‌రావు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటారు. మిమ్మల్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు’అని వ్యాఖ్యానించారు. హరీశ్‌కు మేనమామ పోలికలు.. అందుకే అబద్ధాలు: రాజగోపాల్‌రెడ్డి ఇదే క్రమంలో ‘ఆయనకు మేనమామ పోలికలు వ చ్చాయి. కేసీఆర్ చెప్పినట్టే అబద్ధాలు చెబుతున్నా రు’అని కోమటిరెడ్డి అనడంతో బీఆర్ఎస్ పక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గలేదు. సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడికి దిగడం సరికాదు... స్పీకర్‌ను బెదిరించడం ఏమిటి?’అని ఆక్షేపించారు. ‘పదేళ్లు విపక్షంలో కూర్చున్నాం... రెండు రోజులకే మీకు అసహనం వస్తే ఎలా’అంటూ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చె ప్పేందుకు హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. రూ. 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ పట్టలేదు: హరీశ్ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించిన హరీశ్‌రావు ‘పీసీసీ పదవిని రూ. 50 కోట్లకు కొనుక్కునే ఖర్మ మాకు పట్టలేదు. పదవి కొనుక్కున్నారనే మాట అన్నది కోమటి రెడ్డి బ్రదర్సే’అనడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఇరుపక్షాల వాగ్వాదంతో సభ మరింత వేడేక్కింది. హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టారు. లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తాను విత్‌డ్రా చేసుకుంటానని హరీశ్‌రా వు అన్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతున్న తరుణంలోనే హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బావ.. బామ్మర్దుల గురించి చెప్పాలా?: మంత్రి కోమటిరెడ్డి హరీశ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా పార్టీ ముందుకెళ్తోంది. మీకేం పనిలేదా? మీ పదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా మాపై విమర్శలేంటి?’అంటూ మండిపడ్డారు. హరీశ్‌ను ఉద్దేశిస్తూ ’మీ బావ... బామ్మర్దులు ఎంత కొట్టుకున్నారో చెప్పాలా...?’అంటూ ప్రశ్నించారు. ఇన్నేళ్లు దోచుకున్న విషయాలు బయటికొస్తున్నాయనే భయంతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు. ‘‘కుటుంబ పాలనను అంతం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి శ్రీ మానిక్ రావ్ ఠాక్రే గారు, టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు. ఈ కార్యక్రమంలో… pic.twitter.com/JsNDl3HUfB — Telangana Congress (@INCTelangana) October 27, 2023 కాగా, తెలంగాణ మలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంగా సాగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన శుక్రవారం ఉదయం గంటన్నర పాటు సమావేశమైన సీఈసీ 53 స్థానాల అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్ మలి జాబితా ప్రకటనలో ట్విస్ట్ -
కేసీఆర్ పైనే నా పోరాటం
-
కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌లు పాల్గొన్నారు. వాస్తవానికి ఇవాళ(శుక్రవారం) కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం నడిచింది. అయితే.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికే ముందే పార్టీ సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావిడిగా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. 𝐑𝐚𝐣𝐠𝐨𝐩𝐚𝐥𝐑𝐞𝐝𝐝𝐲 𝐦𝐞𝐞𝐭𝐬 𝐁𝐡𝐚𝐭𝐭𝐢, 𝐔𝐭𝐭𝐚𝐦 Komati Reddy Rajagopal Reddy, who is joining the Congress, had a courtesy meeting with CLP leader Bhatti Vikramarka and MP Uttam Kumar Reddy in Delhi on Thursday night.#KomatireddyRajGopalReddy pic.twitter.com/ZRfsVPuYDu — Team Congress (@TeamCongressINC) October 26, 2023 మరోవైపు ఈ ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా చేరునున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, పైగా కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎండగట్టడంలో విఫలమైందని చెబుతూ.. అందుకే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. తాను మునుగోడు నుంచే బరిలోకి దిగుతానని.. అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీ చేస్తానంటూ ఆయన అంటున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్
-
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతారనుకున్నా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను గద్దె దించాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్‌నే ఎంచుకుందని.. అందుకే బీజేపీని వీడి తాను సొంతగూటికి వెళ్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై స్పందించారు. రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం దృష్టి సారించకపోవడమే తాను పార్టీ మారేందుకు ప్రధాన కారణమని అన్నారాయన. ‘‘తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ రెండుసార్లు ఓడింది. కాంగ్రెస్ నాయకత్వ తప్పుడు నిర్ణయాలతో రెండుసార్లు ఓడాం. కానీ, తెలంగాణ సమాజం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌ను ఎంచుకుంది. ప్రజల అభీష్టం మేరకే నేను పార్టీ మారుతున్నా’’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. డబ్బుతో నన్ను ఓడించారు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలనే నా పోరాటం మొదలుపెట్టాను.తెలంగాణ ఉధ్యమం లో ఎంపీ గా నేను ఎంతో కృషి చేశా. కానీ,తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపిక లో జరిగిన కొన్ని తప్పుల వల్ల పార్టీ కి నష్టం జరిగింది. 12 మంది కాంగ్రెస్ సభ్యుల్ని లాక్కుని ప్రతిపక్షం గొంతు లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడ్డ తర్వాత కేసీఆర్ ను గద్దె దీంచేది బీజేపీ అని నేను నమ్మి బీజేపీ లో చేరా. మునుగోడు లో నన్ను ప్రజలు గెలిపించాలనుకున్నా. కానీ, కేసీఆర్ డబ్బుతో, అధికార దుర్వినియోగంతో నన్ను ఓడించారు అని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ బలహీనపడడమే కాదు.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ అధిష్టాన నిర్ణయాలతో పార్టీ బలహీనపడింది. బీజేపీ నాయకత్వానికి పలు సూచనలు కూడా చేశా. దేశంలోనే అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ అవినీతి పై విచారణ చేస్తారని నమ్మి బీజేపీ లో చేరాను. కానీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కేసీఆర్‌ను గద్దె దించి.. ఆయన కుటుంబాన్ని జైలుకు పంపుతారని భావించా. కానీ, అలా జరగలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన వచ్చింది. మోదీ, అమిత్ షా అంటే నాకు గౌరవం ఉంది. తుదిశ్వాస వరకు బీజేపీ లో ఉండాలనుకున్నా.. కానీ కుదరడం లేదు. తెలంగాణ లో కేసీఆర్ ను గద్దెదించేందుకు ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ లో పరిస్థితులు మారాయి. అందుకే పార్టీ మార్పు పై నేను స్పష్టమైన ప్రకటన చేశాను. డబ్బులు, కాంట్రాక్టుల కోసం నేను చూడను. అమ్ముడుపోయే వ్యక్తిని అయితే.. మళ్లీ పార్టీ ఎందుకు మారతాను? అని విమర్శలకు కౌంటర్ ఇచ్చారాయన. నాకు ఎల్బీనగర్, మునుగోడు టిక్కెట్ ఇస్తామని బీజేపీ చెప్పింది. కానీ, నేను బీజేపీ లో ఉన్నా పోరాడుతా కానీ పోటీ చేయ అని చెప్పా. ఇంతకు ముందు.. నేను పార్టీ మారే సమయంలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత.. రాజగోపాల్ రెడ్డి వస్తా అంటే ఓక మెట్టు దిగుతా బహిరంగంగా ప్రకటించారాయన. రాబోయే ఎన్నికల్లో మనుగోడు నుంచే పోటీ చేస్తా. ప్రాణం ఉన్నంతవరకు మునుగోడులోనే ఉంటా. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే.. కేసీఆర్‌పైనా పోటీచేస్తా. బీఆర్ఎస్ను ఓడించడం కాంగ్రెస్‌కే సాధ్యం అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
‘రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఊహించిందే!’
సాక్షి, హైదరాబాద్: ఏడాది తర్వాత.. సరిగ్గా ఎన్నికల వేళ బీజేపీకి ఝలక్ ఇస్తూ కాంగ్రెస్‌లో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిద్ధమయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని గుర్తించానని, కాంగ్రెస్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా స్పందించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. ‘‘ఎవరి ఊహలు వారివి. ఎవరి ఇష్టం వారిది. బీజేపీ పోటీలో లేదని వారు(రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..) అనుకుంటే సరిపోతుందా?’’ అని అన్నారు. ‘‘రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా చదవలేదు. మొన్ననే బీఆర్ఎస్కు.. బీజేపీనే ప్రత్యామ్నాయమన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఎలా మాట మార్చారు?’’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అలాగే.. బీఆర్ఎస్ డబ్బు సంచుల్ని నమ్ముకుందని ఆరోపించిన ఈటల.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని.. హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బూర నర్సయ్య గౌడ్ స్పందన.. ‘‘రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉంది. ఆత్మ మాత్రం కాంగ్రెస్లోలోనే ఉండిపోయింది. ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు అందరూ ఊహించినదే. రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన... బీజేపీ బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ కాకుండా పోదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరు.కేసీఆర్ ని ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నయం కేవలం బీజేపీనే. నేను పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాను. నాకు భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఉంది. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా శిరసా వహిస్తాను. వివేక్ వెంకటస్వామి కామెంట్స్.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నాకు తెలియదు. కానీ, నేను పార్టీ మారుతానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదంతా తప్పు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీచేస్తా. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందన.. రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్. . కానీ, పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది. నేను మాత్రం ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నా. లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ తో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారు.అటువంటి బిజెపిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదు. రాజగోపాల్ రెడ్డి కి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది. ఆయన్ని గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించింది. అలాంటిది.. వ్యక్తిగతంగా ఇటువంటి ఆరోపణలు చేయటం సరైనది కాదు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. మా సోదరుడు చేరిక విషయం నాతో మాట్లాడలేదు.. అధిష్టానంతో మాట్లాడారు’’ అని పేర్కొన్నారు. ‘‘కర్ణాటకలో హామీలిచ్చిన పథకాలన్నీ అమలవుతున్నాయి. మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సెకండ్ లిస్ట్ ఈ రోజు పూర్తవుతుంది. రేపు విడుదలవుతుంది. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయ్.. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం 119 సీట్లపై రేపు ఉదయం ప్రకటన ఉంటుంది. కాంగ్రెస్‌కు 70-80 సీట్లు వస్తాయి. పొత్తులపై సాయంత్రం క్లారిటీ వస్తుంది. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం’’ అని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘గతంలోనే కాళేశ్వరంపై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాశా. రాహుల్ గాంధీ పేరు చెప్పే అర్హత కేటీఆర్‌కు లేదు. రాహుల్ కుటుంబానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్’’ అంటూ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. చదవండి: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా -
కాంగ్రెస్ లో చేరనున్న రాజగోపాల్ రెడ్డి
-
బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై
-
రెండో జాబితాపై కసరత్తు ప్రారంభం
-
బీజేపీకి దెబ్బ మీద దెబ్బ..!
-
బీజేపీలో మరో బిగ్ ట్విస్ట్.. కోమటిరెడ్డికి జాతీయ పదవి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీజేపీలో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి ఇచ్చింది. కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, ఇకపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించున్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను వీడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ హస్తం గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపించాయి. దీనిపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా, రాజగోపాల్ కూడా కొంత కాలంగా బీజేపీ హైకమాండ్‌పై సీరియస్‌గా వ్యవహరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటి చేయడంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోకుండా ఇలా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. అంతకుమందు.. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలో పార్టీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను తొలగించి.. స్టేట్ చీఫ్ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. అంతేకాకుండా, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఢిల్లీలో నడ్డాతో ముగిసిన ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీ
-
రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గత చరిత్ర ప్రజలందరికీ తెలుసని. పబ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిలర్ అనే పేరుందని ఘాటుగా వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్నారని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.ఇప్పుడేమో భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణాలు అంటే నమ్మెదెవరని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏమన్నారంటే.. ►రేవంత్ గత చరిత్ర ప్రజలందరికీ తెల్సిందే. పబ్లిక్ లో రేవంత్ కు బ్లాక్ మెయిలర్ అనే పేరుంది. రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ..... ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణాలంటే నమ్మేదెవరు. ►లెక్కలేనన్ని తప్పుడు పనులు చేస్తున్న రేవంత్ భాగ్యలక్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాలయం అపవిత్రం అవుతుందనేది భక్తుల భావన. రాజకీయ వ్యభిచారం చేసే వ్యక్తి రేవంత్, తన స్వార్ధం కోసం భాగ్యలక్షి గుడిని కూడా వాడుకోవడం భావ్యం కాదు. ►టిడిపి ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన రాజకీయ వ్యభిచారివి నువ్వు కాదా రేవంత్. ఈటెల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేయలేదు. ►కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవడం ద్వారా రాజకీయ వ్యభిచారానికి పాల్పడింది నువ్వు కాదా రేవంత్. ►కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్తవం కాదా, ఆమెతో నీకు వ్యాపార భాగస్వామ్యం లేదా, ►ఓటుకు నోటు కేసులో లక్షల రూపాయల నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్ గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర రాజకీయ వ్యభిచారం కాదా ►మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి 25 కోట్లు కాంగ్రెస్ కు ముట్టాయని, అయితే అందులో పది కోట్లు రేవంత్ నొక్కేసాడని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విషయం వాస్తవం కాదా. ►మునుగోడులో బిజెపి గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పతనమవుతుందని, అందుకే నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీని గెలిపించడం రాజకీయ వ్యభిచారం కాదా రేవంత్. ►నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, మునుగోడులో నన్ను ఓడించేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేసి, 18 వేల కోట్లకు అమ్ముడు పోయానంటూ టిఆర్ ఎస్ తో కలిసి దుష్ప్రచారం చేయడం రాజకీయ వ్యభిచారం కాదా రేవంత్ . ►పారదర్శకంగా జరిగిన గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ లో టెండర్ దక్కితే, ఆ వాస్తవాన్ని దాచి అమ్ముడు పోయానంటూ తప్పుడు ఆరోపణ చేసిన దగుల్బాజీ రేవంత్ , మరి నీ దగ్గర ఆధారాలుంటే ఎందుకు రుజువు చేయడం లేదు. ►నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయకపోతే రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. రాజకీయంగా రేవంత్ ను వేటాడుతా, కోర్టు ద్వారా కూడా రేవంత్ సంగతి తేలుస్తా. నేను దాఖలు చేయనున్న పరువు నష్టం కేసులో ఎప్పటికైనా రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం. ►రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ కవితతో వ్యాపార సంబంధాలు ఉన్న మాట వాస్తవమా ? కాదా? ►బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం లో ప్రమాణం చేస్తే ఎవరు నమ్ముతారు ? ►రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయంలో అడుగుపెడితే అపవిత్రం అవుతుందని భక్తులు భావిస్తున్నారు ► బీఆర్ఎస్ ఇచ్చిన 25 కోట్లలో రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు ►రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో దొరికింది నిజమా ? కాదా? ►కాంగ్రెస్ హై కమాండ్ కి డబ్బులు ఇచ్చి పిసిసి పదవి కొన్నవా ? లేదా ? ►నేను, ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరింది రేవంత్ రెడ్డి కాదా! -
మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్..
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వర్సెస్ బీజేపీ నేతలు అన్నట్టుగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇది పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఉప ఎన్నికల అనంతరం, కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు.. తాజాగా మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీలో చేరినందుకు కాంట్రాక్ట్ తీసుకున్ననని నాపై ఆరోపణలు చేశారు. ఆ 18వేల కోట్ల కాంట్రాక్ట్ నిరూపించండి. గోబెల్స్ ప్రచారం నాపై పనిచేస్తుందని భావించకండి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అయితే, మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 18వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని హైలైట్ చేశారు. ఈ క్రమంలో దీనిపై కోమటిరెడ్డి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. KTR if you have an iota of credibility and honesty, once again I challenge you to prove that I got the 18000 cr contract for joining BJP and don’t think Goebbels propaganda will work in my case. — Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) March 10, 2023 -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయం.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ తప్పదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. కాగా, కోమటిరెడ్డి తిరమల పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు ఉప ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉందని గులాబీ నేతలకు తెలిసొచ్చింది. టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికే బీఆర్ఎస్గా పేరు మార్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నేను యుద్ధం చేశాను. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఉప ఎన్నికల సమయంలో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా జీవితంలో నేను ఎప్పుడూ డబ్బుకి లొంగలేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డికి దమ్ముంటే నేను ఎక్కడ అవినీతి చేశానో నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయం. అవినీతి సొమ్ముతో కవిత ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టారు’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దవుతుంది.. ఎన్నికలకు సిద్ధం కండి
కోదాడ: కేసీఆర్ ఫిబ్రవరిలోనే అసెంబ్లీని రద్దు చేస్తారని, కర్ణాటకతో పాటు మే నెలలోనే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో రానున్న ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్దం కావాలని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందపెట్టి కేసీఆర్‌ను గద్దె దించి ఫాంహౌజ్‌కు పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక నుంచి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తానని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలి మళ్లీ తాను అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నారని, అయన కలలన్నీ పగటి కలలుగానే మిగిలే విధంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చండూరు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఇప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి చెబుతున్నారని, ఇదే విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం మంచిదని, ప్రజా సమస్యలపై కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డికి లేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని తాను ఆరోజే చెప్పానని, నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే బీజేపీకే సాధ్యమని చెబుతూ వచ్చానని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం మంచిదా లేక మోదీ నాయకత్వంలో పనిచేయడం బాగుంటుందో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుండెమీద చేయి వేసుకుని చెప్పాలని కోరారు. మునుగోడును దత్తత తీసుకుంటానని చండూరు పట్టణంలో మంత్రి కేటీఆర్ చెప్పారని, అవేమాటలు నమ్మి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారు కానీ నెలన్నర కావొస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మొదలు కాలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల లోపు మీరు ఇచ్చిన హామీలకు సంబంధించిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో బందీ అయిందని, ఆ కుటుంబ పాలనకువ్యతిరేకంగా పోరాడి మోదీ నాయకత్వంలో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. -
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు: రాజగోపాల్‌రెడ్డి
-
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, నిర్మల్: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భారీ ప్లాన్స్‌తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే వివిధ పార్టీల్లోనే ఉన్న నేతలకు గాలం వేస్తూనే, ప్రతీ నియోజకవర్గంలో కీలక నేతలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర కోసం నిర్మల్ వెళ్లిన కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకతో పాటు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారు. ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. అలాగే, ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు. -
రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ హైకమాండ్ పిలుపు
హైదరాబాద్: బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని రాజగోపాల్‌రెడ్డికి పిలుపు రావడంతో ఆయన బయల్దేరి వెళ్లారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పిలుపు రావడంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మంగళవారం వీరివురూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇటీవల మునుగోడులో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి వీరితో అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ ఓటమికి గల కారణాలను అమిత్ షా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబుడుతున్నాయి. రాబోవు శాసనసభ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకోసం ఇప్పట్నుంచీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈటల, రాజగోపాల్‌రెడ్డిలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. -
బీజేపీకి భంగపాటు.. మునుగోడు ఓటమిపై సీరియస్ యాక్షన్ ప్లాన్ షురూ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ భంగపాటుకు గురైంది. మొదటి నుంచి మునుగోడులో గెలుపు తమదే అనుకున్న కాషాయ పార్టీకి ఓటర్లు ఊహించని విధంగా షాకిచ్చారు. బీజేపీ అభ్యర్థిని రెండో స్థానానికి పరిమితం చేశారు. ఇక, అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. 10వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా, మునుగోడులో ఓటమిని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పోస్టుమార్టంకు దిగింది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన మునుగోడు ఓటమిపై సమీక్షించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాత్రి ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఇక, పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ విఫలమైనట్టు ముఖ్య నేతలు గుర్తించారు. మరోవైపు.. మునుగోడులో ఓటు బ్యాంకు పెరిగిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తపరుస్తున్నాయి. కాగా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో భారీగా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల వరకు నియోజకవర్గాల బలోపేతంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. దీంతో, కొత్త రోడ్ మ్యాప్‌పై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: మునుగోడు ఫలితాలపై బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్ -
ఎన్నికల్లో ఓడినా బీజేపీకి బిగ్ ప్లస్.. ఎలాగో తెలుసా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది. 2018 ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం భారీగా ఓట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చితే 73,972 ఓట్లు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో ప్రత్యామ్నాయం బీజేపీ అనే అంశం ప్రజల్లోకి వెళ్లినట్లయింది. ఉప ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం చేసిన బీజేపీ తమ బలాన్ని పెంచుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో సహా పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్‌రెడ్డి దగ్గరుండీ ప్రచారాన్ని పర్యవేక్షించారు. అన్ని మండలాలకు ఇన్‌ఛారీ్జలను నియమించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభతో పాటు, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైనా నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టింది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. భారీ మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్ భావించినా మెజారిటీని తగ్గించగలిగింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయినప్పటికీ మునుగోడులో ఆ పార్టీ మరింత పుంజుకుంది. వచ్చే అసెంబ్లీ అన్నికల్లో మరింతగా దూసుకెళ్లవచ్చన్న అంచనాకు వచ్చింది. -
3 నెలలు.. హోరాహోరీ!
సాక్షి, హైదరాబాద్: పేరుకు ఒక ఉప ఎన్నిక.. కానీ 2023 ఎన్నికలకు సెమీఫైనల్‌గా ప్రచారం.. హోరాహోరీ తలపడిన ప్రధాన రాజకీయపక్షాలు.. అన్ని అస్త్రశస్త్రాల ప్రయోగం.. దాదాపు మూడు నెలలు సందడి.. ఫలితం తేలేదాకా ఎడతెగని ఉత్కంఠ.. ఒక్క మాటలో చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో విపరీతమైన సెగ పుట్టించింది. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, పార్టీ జంపింగ్‌లు, వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, వెల్లువెత్తిన డబ్బు, మద్యం ప్రలోభాలు.. రాజకీయ పార్టీల నుంచి సామాన్య ప్రజల దాకా ఎక్కడ చూసినా అదే చర్చ. రాజగోపాల్‌రెడ్డి వీడినరోజు నుంచే.. మునుగోడులో కాంగ్రెస్ నుంచి గెలిచినా బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలను కలవడంతోనే ఉప ఎన్నిక ఎపిసోడ్ మొదలైనట్టు చెప్పుకోవచ్చు. ఆ ఘటనతో కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేయడం, ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవకుండానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా వేడి పెరిగింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన క్షణం నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. బహిరంగ సభలతో ప్రచారం మొదలుపెట్టాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక పోరు రసవత్తరంగా మారింది. తార స్థాయికి ప్రచారం ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందరికంటే ముందు కాంగ్రెస్ ఇక్కడ బహిరంగసభ నిర్వహించగా.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ భారీ సభ చేపట్టింది. వెంటనే రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. తర్వాత మరోమారు సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల అగ్రనేతలతో ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ అయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ రంగంలోకి దింపింది. బీజేపీ తరఫున పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కె.లక్ష్మణ్ వంటి సీనియర్లు ప్రచారం చేశారు. మరోవైపు ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఇతర సీనియర్లు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రచారానికి చివరి రోజున మహిళా గర్జన సభ నిర్వహించింది. అన్ని పార్టీల నుంచి నేతలు పోలింగ్ బూత్‌స్థాయి నుంచీ గ్రామాలు, మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ తరఫున ఒక గ్రామానికి ఇన్చార్జిగా వ్యవహరించడం గమనార్హం. దుమ్ము రేపుతూ.. దుమ్మెత్తి పోసుకుంటూ.. మునుగోడు ప్రచారంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ బలాన్ని చాటేందుకు భారీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇదే సమయంలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. పార్టీల వారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు తోడు నేతల వ్యక్తిగత విమర్శలూ పరిధి దాటాయి. రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో పలుచోట్ల అడ్డగింతలతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఒకచోట టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి కూడా. మరోవైపు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర అంశం, అందులో బీజేపీ పాత్ర ఉందనే ఆరోపణలు, ఆడియోలు లీకవడం కలకలం రేపింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడం.. మరోవైపు టీఆర్ఎస్ బహిరంగసభకు కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని రావడం మరింత వేడి పుట్టించాయి. ఆకర్ష్‌లు.. ప్రలోభాలు.. ఈ ఉప ఎన్నిక సమయంలో స్థానిక నేతల నుంచి సీనియర్ల దాకా పార్టీలు మారడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ‘ఆకర్‡్ష’కు తెరతీయడంతో పలువురు నేతలు అటూ ఇటూ మారడం, వెళ్లినవారు వెనక్కి రావడం, కొందరైతే మూడు పార్టీలు మారడం వంటివి జరిగాయి. మరోవైపు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ కేంద్రంగా పలుమార్లు నగదు దొరకడంతోపాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నగదు, మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపోటములపై వందల కోట్లలో బెట్టింగ్‌లు జరిగాయనే వార్తలు రావడమూ గమనార్హం. -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్‌కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్‌లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్‌నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం -
అంత అహంకారమెందుకు.. టీఆర్ఎస్ గెలుపుపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పార్టీ ఓటమిని చవిచూసింది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ మునుగోడు ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఇక, బీజేపీ ఓటమి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఓడిపోతే కుంగిపోమని స్పష్టం చేశారు. కాగా, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా తీర్పును గౌరవిస్తాము. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో యుద్ధం చేశారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బీజేపీ కార్యకర్తలు తలొగ్గకుండా పనిచేశారు. గెలిచిన ఆనందంలో టీఆర్ఎస్ నేతలు హామీలు నెరవేర్చుతామని చెప్పకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు. మునుగోడు గెలుపు.. తండ్రి గెలుపా? కొడుకు గెలుపా?. అల్లుడి గెలుపా?. బీజేపీకి భయపడి.. మా పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు (టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, పరోక్షంగా కాంగ్రెస్) కలిసి పనిచేశాయి. దమ్ముంటే టీఆర్ఎస్లో చేరిన 12 మందితో రాజీనామా చేయించండి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రచారం చేస్తే 10వేల మెజార్టీ వచ్చింది. ఈ గెలుపు.. గెలుపే కాదు. మునుగోడు గెలుపు ఎన్నికల కమిషనర్ గెలుపు. టీఆర్ఎస్ వాళ్లు డబ్బులు పంచారు.. కానీ ఎక్కడా దొరకలేదు. టీఆర్ఎస్ను అడ్డుకునే దమ్మున్న పార్టీ బీజేపీనే. తెలంగాణ అంతటా బీజేపీ ఉంది. ముందు ముందు మరింత కమిట్మెంట్తో పనిచేస్తాము. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాము’ అని వెల్లడించారు. -
ఓటమి తట్టుకోలేక కౌంటింగ్‌పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌పై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈసీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై సీరియస్ అయ్యింది. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చిరించింది. అయితే బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. ఓటమి తట్టుకోలేకే కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అధికారులను భయపెట్టడం సరికాదని విమర్శించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగంవారిగుడెంలో టీఆర్ఎస్ 340 ఓట్లు లీడ్ సాధించింది. మీడియా ఆందోళన మునుగోడు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చదవండి: Munugode Bypoll 2022 Result: ఆధిక్యంలో టీఆర్ఎస్ -
Munugode Bypoll: చౌటుప్పల్‌లో తక్కువ ఓట్లు.. నిరాశలో రాజగోపాల్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. రౌండ్ రౌండ్ ముగిసే సమయానికి పార్టీల మధ్య ఆధిక్యం తారుమారవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ అఫ్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద రాజగోపాల్‌రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. సొంత మండలం చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన చెందారు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చివరి వరకు హోరాహోరి తప్పకపోవచ్చని, బాజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాగా చౌటుప్పల్ మండలంలో 55,678 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 21,209...బీజేపీకి 21,174...కాంగ్రెస్‌కు 5,164 ఓట్లు పడ్డాయి. ఇక మునుగోడు కౌంటింగ్‌లో ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. 4 రౌండ్లు ముగిసే సరికి 714 స్వల్ప ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 4,854 ఓట్లు రాగా, బీజేపీకి 4,555 ఓట్లు పోలయ్యాయి. చదవండి: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు -
Munugode By Election Results: టెన్షన్.. టెన్షన్
సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఉప ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారోనన్న ఉత్కంఠ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎవరికి అనుకూలంగా, మరెవరికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న టెన్షన్ ప్రధాన పార్టీలకు తప్పడం లేదు. బరిలో ఉన్న 47 మంది అభ్యర్థులు, ఆయా పార్టీలు తీర్పు కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఆదివారం మధ్యాçహ్నం వరకు ఈ టెన్షన్ తప్పదు. ఏ పార్టీకి పట్టం కడతారో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మునుగుతుందో, ఏ పార్టీ తేలుతుందో ఆదివా రం వెల్లడికానుంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానం కావడంతో జోరుగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ ప్రచారం కొనసాగింది. మొదట్లో జోరుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కొంత నెమ్మదించింది. పోలింగ్ తేదీ దగ్గర పడిన సమయంలో మాత్రం మళ్లీ ప్రచార జోరును పెంచింది. అయితే టీఆర్ఎస్, బీజేపీ చేసినంత భారీ ఎత్తున ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) మార్పు చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో దిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీఆర్ఎస్ పేరుతో ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఈ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు తమ పాత స్థానాన్ని కచ్చితంగా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఉప ఎన్నికల్లో ఇన్చార్జులుగా నియమించింది. వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గంలో జరిగిన రెండు సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు పెద్ద ఎత్తున రోడ్‌షోలు నిర్వహించారు. మంత్రులు ఆయా మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారం పని చేసింది. దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ దక్షిణ తెలంగాణలో పాగా వేసే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డినే బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆయన గెలుపు ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. ఈ రెండు పార్టీల మధ్యే హోరా హోరీగా పోరు జరిగింది. సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మొదట్లో సీరియస్‌గా తీసుకుంది. మొదట దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. తర్వాత మధ్యలో నెమ్మదించింది. భారత్ జోడో యాత్రకు రాష్ట్ర నాయకత్వం అంతా వెళ్లడంతో కొంత వెనుకబడింది. చివరలో మళ్లీ ప్రచార జోరును పెంచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కౌటింగ్ ఇలా ► ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రాంరంభం ► 298 పోలింగ్ స్టేషన్లు ► 21 టేబుళ్లు, 15 రౌండ్లలో లెక్కింపు ► 294 పోలింగ్ స్టేషన్ల ఓట్లు 14 రౌండ్లలో లెక్కింపు ► 15వ రౌండ్లో 4 టేబుళ్లపై మిగిలిన ► 4 పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ► 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం ► చివరి ఫలితం ఒంటిగంట వరకు వచ్చే అవకాశం ► విధుల్లో పాల్గొనే మొత్తం సిబ్బంది 250 మంది ► అందులో కౌంటింగ్ కోసం 100 మంది, ఇతర కార్యకలాపాలకు 150 మంది ► ఒక్కో టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పోలింగ్ సూపర్వైజర్, ఒక పోలింగ్ అసిస్టెంట్ ఉంటారు. ► అభ్యర్థుల ఏజెంట్లు ఉండేలా ఏర్పాట్లు పోలైన ఓట్లు ఇలా.. ► నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855. ఇందులో 50 సర్వీసు ఓటర్లు. ► ఈవీఎంలలో పోలైనవి 225192 ఓట్లు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు 739 మంది పోస్టల్ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలో మొత్తంగా 2,25,878 ఓట్లు పోలయ్యాయి. 93.41 శాతం పోలింగ్ నమోదైంది. ► నవంబరు 4వ తేదీ నాటికి నాటికి సాయుధ బలగాలకు (సర్వీస్ ఓటర్స్) సంబంధించిన ఓట్లు 50 అందాయి. 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అవసరమైన సిబ్బందిని నియమించాం. మొదటి రౌండ్లో చౌటుప్పల్, చివరి రౌండ్లో నాంపల్లి మండలాల కౌంటింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తి కావచ్చు. ఈవీఎంల లెక్కింపు తరువాత డ్రా పద్ధతిన 5 పోలింగ్ స్టేషన్ల వీవీ ప్యాట్లను లెక్కిస్తాం. – జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డి పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం ఆర్జాలబావిలోని గోదాముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. 470 మంది పోలీసులు, 3 కంపెనీల కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా చర్యలు చేపట్టాం. – ఎస్పీ రెమా రాజేశ్వరి -
Munugode: లెక్కల్లో నిమగ్నమైన బీజేపీ..2, 3వేల మెజారిటీతో విజయఢంకా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక లెక్కలు, విశ్లేషణల్లో కమలదళం తలమునకలైంది. ఈ నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ముఖ్యనేతలు బీజేపీకి పడిన ఓట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి రెండు, మూడు వేల మెజారిటీతో విజయఢంకా మోగిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ బీసీ వర్గాల ఓట్లతో పాటు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు కమలానికే పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు సూచికగా భావిస్తున్నారు. గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఆయా వర్గాల ఓటింగ్ తీరుపై పోలింగ్ బూత్‌స్థాయి నుంచి ఎన్నికల ప్రకియలో నిమగ్నమైన పార్టీ యంత్రాంగం నుంచి సమాచారాన్ని సరి చూసుకుంటున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా రాళ్ల దాడితో పాటు భౌతికదాడులకు ప్రయత్నించడం వంటి పరిణామాలు టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేశాయంటున్నారు. అయితే టీఆర్ఎస్కు వామపక్ష అనుకూల ఓటింగ్‌తో పాటు మైనారిటీల ఓట్లు, ఎస్సీలో కొంతశాతం ఓట్లు పడ్డాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా.. చౌటుప్పల్, చండూర్ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి)లో బీజేపీ హవా బాగా కనిపించి, ఇక్కడి నుంచే అధిక శాతం ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. మునుగోడు మండలంలోనూ బీజేపీకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్‌లో బీజేపీ, టీఆర్ఎస్కు దాదాపు సమానంగా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మర్రిగూడ, నాంపల్లిలో బీజేపీ కంటే టీఆర్ఎస్ స్వల్పంగా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిగతా చోట్ల కూడా బీజేపీకే మొగ్గు ఉంటుందనే విశ్వాసంలో బీజేపీ నేతలున్నారు. పొద్దున పోలింగ్ మొదలయ్యాక టీఆర్ఎస్కు మద్దతుదారులుగా ఉన్న ఆసరా, ఇతర రూపాల్లో పింఛన్లు పొందుతున్న వృద్ధులు, ఇతర వర్గాల వారు ఎక్కువగా ఓటింగ్ రావడంతో భిన్నమైన అంచనాలు వచ్చాయంటున్నారు. మధ్యాహ్నం తర్వాత యువత అధికంగా పోలింగ్ బూత్‌లకు రావడం, హైదరాబాద్ శివార్లలోని ఓటర్లు బూత్‌లకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఓటింగ్ శాతం పెరుగుదలతో మొత్తం వ్యవహారంలో మార్పులు చోటుచేసుకుని బీజేపీ వైపు మొగ్గు స్పష్టమైందని చెబుతున్నారు. -
‘మునుగోడు ఫలితం రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేస్తుందని, తమ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. డబ్బు, మద్యం ఏరులుగా పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమే నన్నారు. తమ విజయంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ల ‘ఖేల్‌ఖతం’కానుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారని ధ్వజ మెత్తారు. పోలింగ్ ప్రకియను సక్రమంగా జరపకుండా ఈసీ కూడా తప్పుచేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రధానాధికారి పూర్తిగా కేసీఆర్ జేబు మని షిగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాచకొండ కమిషనర్, నల్లగొండ జిల్లా ఎస్పీ టీఆర్ఎస్కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ కొనసాగించి అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించినందుకు పోలీస్ కమిషనర్ తోపాటు జిల్లా ఎస్పీ కేసీఆర్‌కు గులాంగిరీ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రలోభాలపై తాము పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డబ్బు పంపిణీ చేసిన వారిలో 42 మందే దొరికారని అధికారులు పేర్కొనడం విడ్డూ రంగా ఉందన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసు ల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తామన్నారు. పోలింగ్‌పై టీఆర్ఎస్ ఫేక్ సర్వేలను ప్రచారంలోకి తెచ్చిందని మండిపడ్డారు. చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? వెయ్యికోట్లు ఖర్చుచేశారు.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదోనన్న భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా మునుగోడులో రూ.వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేశారని సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నెల రోజులుగా మునుగోడు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర రూపాల్లో ప్రలోభాలకు గురిచేసిందన్నారు. టీఆర్ఎస్ నేతలు అంబులెన్స్‌లు, పోలీసు వాహ నాల్లో పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తే పోలీసులు సహకరించారన్నారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీనే గెలిపించబోతున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలమైన పోలీసు అధికారుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలు, కార్యకర్తలను కొట్టించారని, చండూరులో విచక్షణారహితంగా కొట్టారని ధ్వజమెత్తారు. ఓటుకు రూ.50 వేలు ఇచ్చిండు ‘ఒక గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఓటుకు రూ.50 వేలిచ్చిండు. ఒక్క గ్రామానికే రూ.20 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్నారంటే.. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్థమవుతోంది. పోలింగ్ జరుగు తున్న టైంలోనే ట్విట్టర్ టిల్లు.. రంగంతండా, హాజినా తండా ప్రజలకు ఫోన్ చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్ని కల నిబంధనలను ఉల్లంఘించారు’ అని సంజయ్ మండిపడ్డారు. -
ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు: రాజగోపాల్‌రెడ్డి
మర్రిగూడ: ‘టీఆర్ఎస్ ముసుగులో ఉన్న గూండాలు, కౌరవులు వంద మంది వచ్చినా ఏమీ చేయ లేరని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం శివన్న గూడలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న ఆయనపై కొందరు కార్య కర్తలు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకుని చెదరగొట్టారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని రౌడీయిజం, గుండాయిజం నడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గద్దె దించి, టీఆర్ఎస్ను బొందపెట్టే వరకు ప్రాణం పోయినా భయపడేది లేదన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ గేటును పగులగొట్టి లోపలికి వెళ్లే రోజులు రానున్నాయని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి: సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం మర్రిగూడ ఓటర్లను ప్రలోభా నికి గురిచేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగా రు. దీంతో బీజేపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ విష యం తెలుసుకుని పోలీసుల తీరుపై రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. -
మునుగోడులో పోలీసుల లాఠీచార్జ్.. కోట్ల రూపాయల బెట్టింగ్‌లు!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, చండూరు, కొరిటికల్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇక, మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మునుగోడులో పోలింగ్ జోరందుకుంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, తండావాసులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మునుగోడులో 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. క్యూలైన్లలో ఓటర్లు బారులుతీరడంతో భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక, 2018లో మునుగోడు నియోజకవర్గంలో 91.3 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో రకంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
Munugode: ఉప ఎన్నికకు కారణం స్వార్థమే!.. ఈ రెండు అంశాలే కీలకం..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాల పరిమితి ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఇలాంటి స్థితిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరైంది కాదు. తన నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. రాజీనామా చేయడం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే తప్పుడు సంకేతం ప్రజలకు ఇవ్వడం ఒకటి కాగా, రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి ఆయన తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్ని కల్లో పోటీ చేయటం వింతైన రెండో అంశం. మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తుందని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరక్కపోతే శాసనసభ్యుడిగా ఆయన చట్టసభలో ప్రభు పై ప్రజా వాణి గట్టిగా వినిపించి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలి లేదా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కృషి చేయాలి. ఆ పని చేయకుండా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం సరికాదు. వాస్తవంగా తన సొంత ప్రయోజనాల కొరకే ఈ ఎన్నిక తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు దేశంలో గుర్తించబడిన కాంట్రాక్టర్ల లిస్టులో వీరి కుటుంబం ఒకటి. కేంద్ర బీజేపీ పాలకులు తనకు 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పని కట్టపెట్టారని ఆయన స్వయంగా ప్రకటించడం గమనార్హం. తన స్వప్రయోజనాలకు అభివృద్ధి కార్యక్రమాలకి ముడివేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంతో... ఆయనకు భయం పట్టుకుంది. మునుగోడు నియోజక వర్గంలో తమ ఓటమి ఖాయమని తెలిసిన రాజగోపాల్ రెడ్డి, ఆయనకి బడా కాంట్రాక్టు అప్పగించడంతో పాటు, రాజకీయ ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు కమ్యూనిస్టుల మీద విమర్శలకు దిగటం తగదు. బీజేపీ దక్షిణ తెలంగాణలో కృత్రిమ ఊపును... ఒక్క మాటలో చెప్పాలంటే వాపును సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డిని ఒక ఎరగా ప్రయోగించి బలపడడానికి ప్రయత్నిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి వారికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా, అప్రజాస్వామికంగా కూల్చి తమకు అనూకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నామ రూపాలు లేకుండా చేయడానికి పూనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ టీఆర్ఎస్ శాసన సభ్యులను వందల కోట్ల రూపాయలతో కొనడానికి చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే. వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీ పాలకులు ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అంటూ ప్రజలను చీలుస్తూ మత సామరస్యాన్ని సమాధి చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఉప ఎన్నిక ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని, బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకుంది. అందుకు రాజగోపాల్ రెడ్డి కుటుంబం, బీజేపీకి బలమైన ఎరగా కనబడింది. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకి సంబంధించి భారతీయ జనతాపార్టీ అంతర్గత ఎజెండాను స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మతతత్త్వ విచ్ఛిన్న కర, ఫాసిస్ట్ విధానాల్ని తిప్పికొట్టేందుకు, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. రానున్న ప్రజా తీర్పు దేశ ప్రజలకు ఆదర్శం కాబోతోంది. వ్యాసకర్త సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు- జూలకంటి రంగారెడ్డి -
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈజ్ బ్యాక్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. గత నెల 21న విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వెంకట్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తాన్నది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కానీ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు రావడం ఆసక్తికరంగా మారింది. ఆడియో లీక్ నేపథ్యంలో.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్తతో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో కొద్దిరోజుల కింద లీకవడం కలకలం రేపింది. దీనిపై ఏఐసీసీ గత నెల 23నే ఆయనకు నోటీసిచ్చింది. పది రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. ఆ గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటరెడ్డి జోడో యాత్రలో పాల్గొంటారా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మునుగోడు విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని, తన ఆలోచనను అధిష్టానానికి చెప్పానని వెంకట్‌రెడ్డి సన్నిహితులతో పేర్కొన్నట్టు తెలిసింది. కొందరు ఫేక్ ఆడియోలు సృష్టించి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. దీనిపై తనకు క్లీన్చిట్ వచ్చేంత వరకు అధిష్టానం పెద్దలను కానీ, పార్టీ నేతలనుగానీ కలవబోనని వెంకట్‌రెడ్డి అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఏఐసీసీ నోటీసుకు వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారు? గడువు ముగిసేలోపు సమాధానమిస్తారా లేదా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
‘మునుగోడు’ ముంగిటకు సర్కార్‌ను తెచ్చాం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వల్ల ప్రజలకు, పార్టీకి అంతా మంచే జరుగుతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొనే క్రమంలో ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడం ద్వారా ప్రస్తుతం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్నే నియోజకవర్గానికి రప్పించగలిగామని.. ఇది తమ ఘనత అని చెబుతున్నారు. మూడున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదన్న వాదనతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా ఆయన చేసిన రాజీనామా వల్ల మునుగోడు ప్రజలకు ఒరిగేదేమీ ఉండదంటూ అధికార టీఆర్ఎస్ చేసిన విమర్శలను గత 2–3 నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇస్తున్న హామీల ద్వారానే తిప్పికొట్టగలిగామనే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మినహా మిగతా అసెంబ్లీ స్థానాలను ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం ఇప్పటిదాకా చూపిన వివక్షను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవీ... రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాక మునుగోడులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్, చండూరును దత్తత తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి ప్రకటన. కొత్తగా గట్టుప్పుల్ మండలం ఏర్పాటు. దండుమల్కాపురం బాధితులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని మంత్రి కేటీఆర్ హామీ కొత్తగా అర్హులైన వేలాది మందికి ఆసరా పింఛన్లు, భారీ స్థాయిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పథకం కింద గొల్ల కురుమలకు నిధులు. ఒక్కొక్కరికీ రూ. 1.53 లక్షల నగదు విడుదల. ఒక్క మునుగోడులోనే రూ. 7,600 మంది గొల్ల కురుమలకు బ్యాంకు ఖాతాల్లో రూ. 93 కోట్లు జమ. చౌటుప్పల్–నారాయణపూర్ రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి. చర్లగూడెం, లక్ష్మణాపురం బాధితులకు నష్టపరిహారం చెల్లింపు (చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర) -
డబ్బుల బదిలీ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రాజగోపాల్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని.. ఆ నగదుకు సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటలలోగా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఉప ఎన్నిక పోలింగ్ సమీస్తున్న సమయంలో ఈసీ నిర్ణయం సంచలనంగా మారింది. మునుగోడులోని ఖాతాలను నగదుతో.. మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నగదు పంచడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఈ నెల 29న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29 తేదీల్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన 23 వేర్వేరు వ్యక్తులు/కంపెనీల ఖాతాలకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయని.. ఆ ఖాతాలను సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రూ.5.24 కోట్లు పొందిన మునుగోడు వ్యాపారులు, ఇతర వ్యక్తులకు సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌తో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నగదును దేనికి బదిలీ చేశారు? టీఆర్ఎస్ ఆరోపించిన విధంగా రాజగోపాల్‌రెడ్డి ద్వారాగానీ, ఆయన ఆదేశానుసారం కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారాగానీ 23 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన రూ.5.24 కోట్లను ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగించట్లేదని నిర్ధారించాల్సిన బాధ్యత రాజగోపాల్‌రెడ్డిపై ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు బదిలీ చేయడం అవినీతి పద్ధతి అని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సోమవారం సాయంత్రం 4 గంటలలోపు పూర్తి వివరణ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణతో సంతృప్తి చెందని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ నోటీసులో పేర్కొన్నారు. -
'బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏడ్వబోతున్నారు'
సాక్షి, నల్లగొండ: మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన సవాల్‌పై సీఎం కేసీఆర్ స్పందించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో బండి సంజయ్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దుకాణం మూతపడే ప్రమాదం ఉందని కేసీఆర్ బయపడుతున్నారు. చండూరు మీటింగ్ ఒక టైమ్ పాస్ మీటింగ్. బహిరంగ సభను చూసి ప్రజలు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని నిధులు ఇచ్చారు అనేది సభా వేదిక ద్వారా తెలపాలి. అభివృద్ధిపై చర్చ జరగాలి. నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అభివృద్ధిపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏం అమలు చేశావో చెప్పాలి. నీ అభ్యర్థిని పార్టీ ప్రచారానికి తీసుకెళ్లాలంటే అవమానంగా ఎందుకు భావిస్తున్నారు. ఇవాళ బహిరంగ సభ వేదికపై కేసీఆర్ ఏడ్వబోతున్నారు. ఏడ్చి సింపథీని పొందాలని చూస్తున్నాడు. కేసీఆర్ నటించేవాడు కాదు జీవించేవాడు. ఇవాళ జరిగే బహిరంగ సభే సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
ముదురుతున్న మునుగోడు పాలిటిక్స్.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్!
సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు కూడా దారి తీస్తోంది. మూడు పార్టీల నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బండి సంజయ్ తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మునుగోడులో దొడ్దిదారిన గెలవాలని టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోంది. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. టీఆర్ఎస్ వైఖరిని మునుగోడు ప్రజలు గమినిస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నిక. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. కేసీఆర్ అహం దిగాలంటే టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం జైకేసారం మండలంలో ఆదివారం బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు కూడా.. నాంపల్లి మండలంలో తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కేసీఆర్ సర్కార్ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో తాను గెలిచిన పదిహేను రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. నవంబర్ 3న జరిగే ఉపఎన్నికలో తాను గెలుస్తానని ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన 10 సర్వే టీంమ్‌లు తేల్చి చెప్పడంతో సీఎం కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే తన వంద మంది కౌరవ సైన్యాన్ని గ్రామాలకు పంపించి ఇతర పార్టీల నాయకులని బెదిరిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. అంతేగాక, సీఎం కేసీఆర్ లెంకలపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడే వారం రోజుల పాటు మకాం వేసి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక అప్రజాస్వామిక చర్యలు పాల్పడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏకంగా రిటర్నింగ్ అధికారిని అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఓ పార్టీ అభ్యర్థికి వచ్చిన రోడ్‌రోలర్ గుర్తును రాత్రి 3.25 గంటలకు సంతకం చేయించి మార్పించారన్నారు. అందులో ఆర్వో తప్పు ఏమీలేదని, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అతనిపై ఒత్తిడిచేసి చేయించారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక ఫలితం రాగానే రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని భావించిన పలు పార్టీల నాయకులు తన గెలుపునకు పరోక్షంగా మద్దతిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రోజే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని కేవలం తనను ఓడించేందుకు మాత్రమే పాల్వాయి స్రవంతితో పోటీ చేయించారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు అభివృద్ధికి కేంద్రమంత్రి అమిత్‌షా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, మునుగోడు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. -
'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా'
సాక్షి, సంస్థాన్ నారాయణపురం: బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితో కలిసి సంస్థాన్ నారాయణపురంలో రోడ్ షో నిర్వ హించారు. రోడ్‌షోలో పాల్గొన్న జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే... ’’‘నేను ప్రగతిభవన్‌లో ఉన్నానట.. ‘నన్ను నీవా కొనేది.. నాకా మెసేజ్‌లు పంపించేది. (జుట్టును చూపిస్తూ) నా వెంట్రుక కూడా కొనలేవు. బీజేపీ ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు, లుచ్చా మనుషులే బయటకు పోతారు. జితేందర్‌రెడ్డి లాంటి వారు పోరు’.... ‘గుర్తుపెట్టుకో హుజూరాబాద్‌లో ఎన్నికలో పెద్దిరెడ్డిని తీసుకొని పోయావు. మోత్కుపల్లి నర్సింహులును, కాంగ్రెస్ నుంచి ఓ లీడర్‌ను తీసుకుపోయావు. ఏమైనా పీకగలిగినవా, ఏమైనా చేశావా.. ప్రజలు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఎవడిని తీసుకొని పోయినా రాజగోపాల్‌రెడ్డి 50వేల మెజారిటీతో గెలుస్తాడు. బీజేపీని వదిలేది లేదు. మా తమ్ముడు సంజయ్‌ను సీఎంను చేస్తా అప్పుడు ఏమైనా ఆలోచిస్తా’ అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాయిస్‌కాల్ ఆడియో లీక్
-
Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ కలకలం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆడియో ప్రకారం.. ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్ చేశారు కోమటిరెడ్డి. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు. అప్పుడు పార్టీకి సాయం చేయాలని కోరారు. కానీ వ్యక్తిగతంగా ఈ ఒక్కసారికి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని తెలిపారు. పార్టీలు చూడవద్దని, ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వెంకట్ రెడ్డి అన్నారు. మనవాళ్లు వచ్చి కలుస్తారని, 25 ఏళ్ల వీళ్లంతా నుంచి తమ ఫ్యామిలీ మెంబర్స్ అని పార్టీ నేతతో సంభాషించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై స్పందించేందుకు వెంకటరెడ్డి అందుబాటులో లేరు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి ప్రచారానికి రాకపోగా.. కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల హాలీడే ట్రిప్ కోసం గురువారం రాత్రి ఆస్ట్రేలియా వెళ్లారు. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు -
నడ్డా అనే అడ్డమైన వాడు ఆరేళ్ల కిందట హామీ ఇచ్చాడు.. ఏమైంది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పద్దతుల్లో గెలవలేక రాజ్యంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నిక అని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో బూడిద బిక్షమయ్య గౌడ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ధనమదంతో మునుగోడులో గెలవాలని కుటిల ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పి మునుగోడులో ఓటు అడగాలని సవాల్ విసిరారు. నడ్డా అనే అడ్డమైన వాడు 300 పడకల ఆస్పత్రి కట్టిస్తామని ఆరేళ్ల కిందట హామీ ఇచ్చాడని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ, ఇంకో బోడీ ఇక్కడికి వచ్చి పీకేదేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్టు సమాధానం చెబుతారన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోదీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని మండిపడ్డారు. ‘భారతీయ జనతా పార్టీ ఒక నీతి జాతి లేని పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించే అర్హత ఏమాత్రం లేదు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి. రాజగోపాల్‌రెడ్డి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు.. దాని వెనకున్న పెద్దలెవరు. ఇందులో దాగిన ఆ గుజరాత్ రహస్యమేంటి. 3 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి, కోవర్ట్ రాజకీయం చేసి, బేరం కుదిరాకే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు. బీజేపీ ఉన్మాద ప్రవర్తనను ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. బీజేపీ విష సంస్కృతికి తెరతీసింది. బీజేపీ వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో స్పష్టంగా కనిపిస్తోందని’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా? -
స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు: పాల్వాయి స్రవంతి
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ కార్యకర్తలను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బెదిరించడంపై మనుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి సహనాన్ని కోల్పోయి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడకతప్పదని హెచ్చరించారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డా అని ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని విమర్షిస్తున్న వారికి ఆయన పేరు ఉచ్చరించే అర్హత లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. తాను స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తి కాదని, ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికలకు పోదామని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వద్ద ప్రమాణం చేద్దామా అని టీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. చదవండి: Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు -
ఒక్కడి కోసం టీఆర్ఎస్ మొత్తం కదిలింది.. బీజేపీ అంటే అది: బండి సంజయ్
సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. అధికార టీఆర్ఎస్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ మొత్తం కదిలింది. బీజేపీ ఓడించేందుకు మునుగోడుకు ఏకంగా 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు వచ్చారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మునుగోడుకు ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదని సంజయ్ ప్రశ్నించారు. కూర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తానన్న చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులేమయ్యాయి. 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ హామీ ఏమైందో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఇస్తానని చెప్పి.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రానివారు, దళితబంధు రానివారు, నిరుద్యోగ భృతి పొందనివారు బీజేపీకి ఓటు వేసి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయే తప్ప.. కేసీఆర్ మీద ఉద్యమ కేసులు లేవని అన్నారు. -
మునుగోడులో బెట్టింగ్‌ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల జయాపజయాలపై అప్పుడే బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో పందేలు కాస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు. రంగంలోకి దిగిన బెట్టింగ్ మాఫియా రూ.కోట్లలో లావాదేవీలు సాగిస్తున్నట్టు సమాచారం. నగదు వసూలు కోసం చౌటుప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించినట్లు తెలిసింది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతరత్రా ఆన్లైన్ మార్గాల్లో దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డిపై రూ.50 వేలు, కూసుకుంట్లపై రూ.30 వేలు, స్రవంతి గెలుపుపై రూ.20 వేల చొప్పున కాస్తున్నట్లు తెలిసింది. గెలుపు కోసం ఎన్ని వేలు బెట్టింగ్‌లో కట్టినా అంతకు రెట్టింపు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మేరకు అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ మాఫియాను గుర్తించే పనిలో పడింది. రూ.16 కోట్లు పట్టివేత? మునుగోడు ఉప ఎన్నికల ఖర్చు కోసం తరలిస్తున్న రూ.16 కోట్ల నగదును పోలీసు అధికారులు పట్టుకున్నారని తెలిసింది. హైదరాబాద్ నుంచి ఓ ప్రధాన పార్టీకి చెందిన డబ్బు వాహనంలో మునుగోడు ప్రాంతానికి రవాణా అవుతుండగా మార్గంమధ్యలో పట్టుబడినట్లు తెలుస్తోంది. -
అంకుల్.. ఎన్నికల ఖర్చుకిది ఉంచండి!
సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం సాగిస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. రాజగోపాల్‌రెడ్డి సంస్థాన్ నారా యణపురం మండలం చిమిర్యాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన దండుగుల నాగేష్ కుమారుడు రామ్‌తేజ్ (12) తాను దాచుకున్న రూ. 2,450 ఎన్నికల ఖర్చుల కోసం రాజగోపాల్‌కు అందజేశాడు. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ డబ్బు తీసుకున్నారు. అవినీతి పాలన అంతానికి ముందుకు రావాలి: రాజగోపాల్ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానంగా యువత నడుం బిగించాలని కోరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి గుండెబోయిన రవికుమార్‌యాదవ్‌తో పాటు మరికొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. తన రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అభివృద్ధి చేస్తోందని, పలు సంక్షేమ పథకాలు ప్రకటించిందని గుర్తుచేశారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవానికి అండగా నిలవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తే గ్రామాల్లోకి టీఆర్ఎస్ మిడతల దండు ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. చేసిన అభివృద్ది చూపించే పరిస్థితి లేకనే టీఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యం, బెదిరింపులను నమ్ముకుందన్నారు. -
మును'గోడదూకుడు'.. కొద్దిరోజుల్లోనే మూడు పార్టీలు మారి...
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికతో పార్టీల్లో గోడ దూకుళ్లు పెరిగాయి. నోటిఫికేషన్ కూడా వెలువడకముందే మొదలైన పార్టీ జంపింగ్‌లు.. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మరింతగా ఊపందుకున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్నట్టుగా పార్టీలు మారిపోతున్నారు. సాధారణ కార్యకర్త మొదలు కీలకనేతల దాకా కండువాలు మార్చేస్తున్నారు. ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ వీలైనంత మేర ‘ఆకర్ష్’ మంత్రం పఠిస్తున్నాయి. ఉన్నవాళ్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లినవారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహా లను అమలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ, టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం కాస్త వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డితో మొదలు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచే పార్టీల్లో జంపింగ్‌లు మొదలయ్యాయి. ఏ రోజున ఏ నాయకుడు పార్టీ మారుతాడో తెలియనంతగా పరిస్థితి మారిపోయింది. ఇందులో కీలక నేతలూ ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై, టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తానని చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. రెండు రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేడో రేపో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్‌లో విభేదాల్లేవని, కలిసికట్టుగా విజయానికి కృషి చేస్తామన్న పల్లె రవికుమార్‌గౌడ్, ఆయన సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి శనివారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన శనివారం పల్లె రవి దంపతులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్‌తోపాటే ఉండటం గమనార్హం. అనుచరులు, కార్యకర్తలు కూడా.. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరినప్పుడే ఆయన వర్గీయుడిగా ఉన్న చౌటుప్పల్ జెడ్పీటీసీ తాడూరి వెంకటేశ్వర్లు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. చండూరు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు దోటి వెంకటేశ్వర్లు, తన సతీమణి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సుజాతతో కలిసి బీజేపీలో చేరారు. రాజగోపాల్‌రెడ్డి అనుచరులుగా ఉన్న కాంగ్రెస్ మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులూ బీజేపీ గూటికి చేరారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, నేతలను ఆకర్షించే పనిని టీఆర్ఎస్ ముమ్మరం చేసింది. మండల కేంద్రంగా మారిన గట్టుపల్లిలో బీజేపీ నుంచి గెలిచిన మహిళా సర్పంచ్, మునుగోడు మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి నర్సింహగౌడ్, సోలిపురం సర్పంచ్, మునుగోడు సీనియర్ నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వర్రావు తదితరులు తాజాగా టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు మండలం ఊకొండి ఎంపీటీసీ పొలగోని సైదులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారారు. ఒకరికొకరు పోటాపోటీగా.. మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామాలు, మండలాల వారీగా ప్రతి ఓటు విలువైనదిగానే అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రభావితం చేసే సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ఊరిపెద్దలను కూడా తమవైపు తిప్పుకునేందుకే అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికార టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోందని.. మండలాలు, గ్రామాల వారీగా మోహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నాయకులను గులాబీ గూటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక స్థానిక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తనకు నియోజకవర్గంలో ఉన్న సంబంధాలతో.. గ్రామాల్లోని యువతను, ఇతర పార్టీల నాయకులను బీజేపీ వైపు తీసుకువస్తున్నారు. అయితే.. ఈ ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వెనుకబడిన పరిస్థితి ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి.. మండలాల వారీగా ముఖ్య నాయకులను తన వెంట తీసుకెళ్లారని.. మిగిలిన వారికి టీఆర్ఎస్ గాలం వేస్తోందని చెబుతున్నారు. అయితే పరిస్థితి పోటాపోటీగా ఉండటంతో.. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ జంపింగ్‌లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్థాయిని బట్టి ప్యాకేజీలు? రాజకీయ పార్టీలు మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, స్థానికంగా పట్టు ఉన్న నాయకులకు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నజరానా ఇచ్చి వలసలను ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మళ్లీ మళ్లీ జంపింగ్‌లు చండూరు జెడ్పీటీసీగా కాంగ్రెస్ నుంచి గెలిచిన కర్నాటి వెంకటేశం నాటి నుంచి మూడు పార్టీలు మారారు. జెడ్పీటీసీగా గెలిచాక టీఆర్ఎస్లోకి వెళ్లిన ఆయన.. ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల్లోనే బీజేపీకి గుడ్‌బై చెప్పి మళ్లీ టీఆర్ఎస్లోకి వచ్చారు. గట్టుప్పల్ ఎంపీటీసీ సైతం చండూరు జెడ్పీటీసీతో కలిసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. -
కేసీఆర్ టార్గెట్‌పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కంటి మీద కునుకులేదు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న సీఎం కేసీఆర్ ఎలాగైనా గెలిచి తీరాలనే ఆలోచనలో ఉన్నారు. మునుగోడులో 51శాతం ఓట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు మునుగోడు సెగ్మెంట్‌ను 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఇన్చార్జ్ని నియమించారు. ఇందులో సీఎం కేసీఆర్‌తో సహా 16మంది మంత్రులు, 70మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. వీరిని ఇన్చార్జ్గా నియమించిన వార్డు లేదా ఎంపీటీసీ పరిధిలోని ఓట్లలో 51శాతం సాధించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. ఓట్ల సాధనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుకు గీటురాయిగా నిర్దేశించారు. ఓటేయాలంటే అసలు మీకేం కావాలి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్‌చార్జ్‌లు తమకు కేటాయించిన స్థానాల్లో గ్రౌండ్ వర్క్‌ను మొదలు పెట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లాంటి వ్యక్తులు రానిచోట వారి మనుషులు వారం క్రితమే రంగంలోకి దిగారు. యూనిట్ పరిధిని, పరిధిలోని గ్రామాలను వార్డులుగా విభజించి ఇన్‌చార్జ్‌ల సొంత సైన్యం, స్థానిక టీఆర్ఎస్ లీడర్లతో సంయుక్తంగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఓటర్ల వివరాలను కులాల వారీగా, పార్టీల వారీగా వేరుచేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వానికి సానుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలను కూడా గుర్తించారు. ఎందుకు సానుకూలంగా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారన్న దానిపై కూడా ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకనా, ఇంకేదైనా కారణమా అన్నదానిపై కూడా లోతుగా వెళ్లారు. చివరకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే మీకేం కావాలి. ఆసరా పింఛనా, రేషన్ కార్డా, దళిత బంధా, డబుల్ బెడ్రూం ఇల్లా, జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సాయమా, ఏంటి.. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా అని నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైతే ఉప ఎన్నికలు ముగిశాక ఇప్పిస్తామని భరోసానిస్తున్నారు. ఇన్‌చార్‌్జలు స్థానిక లీడర్లతో గ్రామ సమస్యలను కూడా గుర్తించి ఏమేం అభివృద్ధి పనులు చేయాలి అనేది కూడా గుర్తించి ఎన్నికలయ్యాక నిధులొస్తాయని చెబుతున్నారు. సొంతంగా ఖర్చులు పోలింగ్ దగ్గరికి వచ్చే దాకా ఆయా గ్రామాల్లో ఇన్‌చార్జ్‌లే సొంతంగా ఖర్చులు భరించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పినట్టు ఓట్లను రాబట్టేందుకు అప్పుడే ఖర్చులు మొదలయ్యాయి. ఊరికో ఫంక్షన్ హాల్, అది లేనిచోట ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో యూనిట్ పరిధిలో రోజుకు రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు ఖర్చవుతున్నాయి. మరోవైపు ఇతర పార్టీల్లోని వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇన్‌చార్జ్‌ల్లో టెన్షన్.. టెన్షన్ కేసీఆర్, కేటీఆర్ మినహా మిగతా ఇన్‌చార్జ్‌లంతా తమకు కేటాయించిన గ్రామాలకు వచ్చిపోతున్నారు. కొన్ని గ్రామాలు ఇంకా గాడిన పడలేదు. స్థానికంగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూపులు, వ్యతిరేకతను చూసి మంత్రులే జంకుతున్నారు. కొంత మంది ఇన్‌చార్జ్‌లు పార్టీ గిట్లుంటే 51 శాతం ఎట్ల వస్తాయని మదనపడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ చెపిన ఓట్లే రాకపోతే ఎటొచ్చి ఏమైతదో, భవిష్యత్‌లో ఏం ఇబ్బందులు ఎదుర్కోవాలో, అత్యధిక ఓట్లను ఏట్లా సాధించాలోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో పట్టున్న లీడర్ల వద్ద ‘ఎక్కువ ఓట్లు రాకపోతే మాకు ఎమ్మెల్యే టికెట్లు రావు’ ఏం చేయాలో చెప్పండని వేడుకుంటున్నారు. -
బీజేపీ దీపావళి ధమాకా..!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మోత మోగించేందుకు బీజేపీ సిద్ధమైంది. దీపావళి దాకా వచ్చే 7, 8 రోజులు గ్రామస్థాయిలో, ఆ తర్వాత చివరి వారంరోజులు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించనుంది. ఇప్పటిదాకా ఒక మోస్తరుగా సాగిన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నుంచి 10 మంది స్టార్ క్యాంపెయినర్లు వేడెక్కించనున్నారు. వెయ్యిమంది చొప్పున జనం పాల్గొనేలా 200 గ్రామసభలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1, 13, 17 వార్డుల్లో, జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం, పీపల్‌పహాడ్, తూప్రాన్‌పేటలో, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో, సినీనటుడు బాబూమోహన్ నాంపల్లి మండలంలోని గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాంపల్లి మండలంలోని మహ్మదాపురం, దామెర, బీటీపురం, దేవత్పల్లిలో, కిషన్‌రెడ్డి మునుగోడు మండలంలోని మునుగోడు, చీకటి మామిడిలో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొంటారు. 6 మండలాల్లో సంజయ్ రోడ్ షో ఈ నెల 18 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 12 రోజులు మునుగోడులోనే బస చేయనున్నారు. 6 మండలాల్లో ఆరురోజులు వరుసగా రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వీరితోపాటు స్టార్ క్యాంపెయినర్లు మురళీధర్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, విజయశాంతి ఐదారు రోజులపాటు తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్‌బూత్ స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్ర బీజేపీ మహిళ, ఎస్సీ, యువ, ఇతర మోర్చాల ద్వారా ప్రచారానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 20 మహిళా మోర్చా బృందాలు పోలింగ్‌బూత్ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఆడవారికి బొట్టుపెట్టి కరపత్రమిచ్చి పార్టీ గుర్తు, అభ్యర్థి పేరును ప్రచారం చేస్తాయి. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితవాడల్లో సమావేశాలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేస్తారు. దీపావళి తర్వాత తుదిదశ ప్రచారంలో భాగంగా 7 మండల కేంద్రాలు, 2 మున్సిపాలిటీలలో రెండేసీ చొప్పున నిర్వహించే పెద్ద బహిరంగసభల్లో సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలతోపాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. నెలాఖరులో నిర్వహించే ప్రచార ముగింపు బహిరంగసభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్గానీ పాల్గొననున్నట్టు సమాచారం. ఢిల్లీ బృందాల ప్రత్యక్ష పర్యవేక్షణ మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారా లేదా అన్నదానిపై ఢిల్లీ బృందాలు గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మోహరించిన ఈ బృందాలను ఢిల్లీ నుంచి జాతీయ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్రనాయకులు టెలీ కాన్ఫరెన్స్‌లు, ఇతరత్రా రూపాల్లో ఆరా తీస్తున్నారు. -
రాజగోపాల్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య పోటీ: కేటీఆర్
సాక్షి, నల్లగొండ: ‘మునుగోడును నేనే దత్తత తీసుకుంటా.. అభివృద్ధి చేస్తా.. ఎన్నికల ముందో మాట, తర్వాతో మాట కాదు. నేను చెప్పే ప్రతి మాటకు కట్టుబడి ఉంటా.. మూడు నెలలకోసారి వస్తా.. స్వయంగా అభివృద్ధి పనులను పరిశీలిస్తా. నా మీద నమ్మకం ఉంచండి...’అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, తాను కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు. కారు గుర్తుకు ఓటు వేయండి ‘మునుగోడు అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటా. నాపై విశ్వాసం ఉంచి కారు గుర్తుకు ఓటువేసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి. కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదానికి, అహంకారానికి.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోటీ ఇది. మోదీ ఇచ్చిన డబ్బుతో మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొనేయాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ సమస్యను పోగొట్టింది కేసీఆరే. మునుగోడులో 1.13 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నాం. యాదవులకు 5,765 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. వారి అకౌంట్లలో డబ్బులు కూడా జమయ్యాయి. అయితే ఉప ఎన్నిక వచ్చినందున డబ్బులు ఫ్రీజింగ్ (స్తంభన)లో ఉన్నాయి. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. ఎన్నికల తర్వాత అధికారులే యూనిట్లను అందిస్తారు..’అని కేటీఆర్ చెప్పారు. నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిన మోదీ ‘చేనేత వస్త్రాలపై మోదీ 5 శాతం జీఎస్టీ వేశారు. ఆయనకు ఓటు వేస్తారో లేక చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు, నేతన్న బీమా, చేనేత మిత్ర అమలు చేస్తున్న, 40 శాతం సబ్సిడీ అందిస్తున్న కేసీఆర్‌కు ఓటేస్తారో ఆలోచించాలి. మోదీ హిందువునని చెప్పుకుంటున్నారు. తిరుపతికి దీటుగా యాదాద్రి దేవాలయాన్ని కట్టిన కేసీఆర్ కంటే పెద్ద హిందువా? యాదాద్రి దేవాలయానికి రూ.100 కోట్లు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో గిరిజనులను పట్టించుకున్నదీ కేసీఆరే. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. దాంతో రాష్ట్రంలో 21 వేల మంది గిరిజనులు ప్రజా ప్రతినిధులు కాగలిగారు. మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాంతో 16 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి..’అని మంత్రి తెలిపారు. రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు కొన్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను చూసి మోదీ ప్రభుత్వం ఈర్ష్య పడుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు కొన్నారో, ఉప ఎన్నికలు ఎందుకు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రభాకర్‌రెడ్డి గెలిచేలా కమ్యూనిస్టులుగా తామంతా అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అంశలస్వామికి అండగా ఉంటా: కేటీఆర్ మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని శివన్నగూడకు చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశలస్వామికి అండగా ఉంటానని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం చండూరు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అంశలస్వామి ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్వామితో కలిసి భోజనం చేశారు. -
రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయిస్తా
మునుగోడు: కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మునుగోడు నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీనిచ్చారు. గొల్ల కురుమలకు గొర్రెల కోసం ఇచ్చిన నగదు బ్యాంకుల్లో ఫ్రీజింగ్ చేయించి తమకు ఓట్లు వేస్తేనే ఇస్తామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఎన్నికలు అయిన తరువాత కేంద్ర మంత్రులతో మాట్లాడి నగదు ఇప్పిస్తానని, ఒకవేళ బ్యాంక్ అధికారులు ఇవ్వకపోతే హైదరాబాద్‌లోని తన 90 కోట్ల ఆస్తిని అమ్మి ఇస్తానని ప్రకటించారు. ఆయన గురువారం మునుగోడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని మూడున్నరేళ్లుగా తాను అసెంబ్లీలో గొంతుచించుకొని అడిగినా కేసీఆర్ పభ్రుత్వం నయాపైసా ఇవ్వలేదన్నారు. తనను నమ్ముకున్న ప్రజలకు ఏమీచేయలేకపోయానని, రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావించి.. ఏడాది సమయం ఉన్నప్పటికీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నాడని, అది నిజ జీవితంలో జరిగే పని కాదన్నారు. ఏదైనా సినిమాలో నటించి సీఎం పాత్ర పోషించుకోవాలని హితవు పలికారు. -
దశలవారీగా బీజేపీ ప్రచార జోరు.. ఆ సభకు అమిత్ షా లేదా నడ్డా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ, రాష్ట్రనేతలు హోరెత్తించనున్నారు. దశలవారీగా ప్రచార వేగం పెంచాలనే వ్యూహంతో పార్టీ నాయకత్వముంది. ఈ నెల 14న ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే దాకా ఒక మోస్తరుగా, 17న ఉపసంహరణల పర్వం ముగిశాక మరోస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చివరి వారం రోజులు పూర్తిస్థాయి ప్రచారంతోపాటు మొత్తం 298 పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ఎన్నికల మేనేజ్మెంట్పై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా మోహరించిన వివిధ స్థాయిల్లోని నాయకులపై, వారి కార్యక్షేత్రాలపై పార్టీకి ఓ స్పష్టత వచ్చింది. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలు, మునుగోడులో అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలోభాగంగా ఓటర్ల జాబితాపైనా కమల దళం దృష్టి కేంద్రీకరించింది. ఈ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలోనే 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 6, 7 నెలల్లో వెయ్యిదాకా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఉప ఎన్నిక తేదీ ప్రకటించాక 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలో భాగంగానే కొత్తగా ఓటర్లను చేర్చిందని ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. ముగింపు సభకు అమిత్ షా లేదా నడ్డా! ఈ నెల 15 నుంచి మునుగోడులో ముఖ్యనేతలు పూర్తిస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు వారం పదిరోజుల పాటు అక్కడే బసచేయనున్నట్టు సమాచారం. 18 నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శి అర్వింద్ మీనన్ ఇతర నేతలు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచార ముగింపు సభలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు. -
Munugode Bypoll: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఆ ఇద్దరు..
సాక్షి, నల్గొండ: మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పని చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. తర్వాత ఆయన 2017 వరకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి తొలుత 2009లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి బూర నర్సయ్యగౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2016 నుంచి 2018 వరకు నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేశారు. ఎమ్మెల్సీ పదవీకాలం ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు. చదవండి: రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం -
నల్లపిల్లి పేరుతో బండి సంజయ్ డ్రామాలాడుతున్నారు: కేటీఆర్
-
మునుగోడు బైపోల్: రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరులో నామినేషన్ దాఖలు చేసిన నాడే.. ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం గమనార్హం. ఫోన్ పే తరహాలో.. కాంట్రాక్ట్ పే అంటూ వేల పోస్టర్లను రాత్రికి రాత్రే అంటించారు ప్రత్యర్థులు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన ఆస్తులు, అప్పులు, పోలీసు కేసులు.. ఇతరత్ర వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సోమవారం అందజేసి.. నామినేషన్ వేశారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా పోస్టర్లు ప్రచురించి.. గోడలకు అంటించారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఏర్పాట్లు చేసిన పోస్టర్లు దుమారం రేపుతోన్నాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ దర్శనమిస్తున్న పోస్టర్లు స్థానికుల్ని చర్చించుకునేలా చేస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. పైగా 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ పోస్టర్లో పొందుపర్చారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతోన్నాయి. ఈ పోస్టర్ల వ్యహారంపై బీజేపీ మండిపడుతోంది. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, ఇలా పోస్టర్లతో ఆయనను ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. -
Munugode Bypoll: బహుముఖ వ్యూహాలతో బీజేపీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓ వైపు టీఆర్ఎస్ను గట్టిగా ప్రతిఘటిస్తూనే.. మరోవైపు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పోలింగ్‌కు సమయం తగ్గిపోతుండటంతో ‘యాక్షన్ ప్లాన్’అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఓటరును మూడు, నాలుగు సార్లు కలిసి బీజేపీ ఓటేసేలా ఒప్పించడం.. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించడం.. బీజేపీ గెలుపుతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను వివరించడం.. ఇలా బహుముఖ వ్యూహాలను సిద్ధం చేసింది. ప్రచార పర్వం ముగింపు నాటికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో గానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోగానీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అప్పటిదాకా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే మునుగోడులో 16 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీని నియమించడంతోపాటు.. 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు కలిపి 27 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అన్ని మార్గాల్లో టీఆర్ఎస్ను ప్రతిఘటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీని అన్ని మార్గాల నుంచి ప్రతిఘటించాలని బీజేపీ నిర్ణయించింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రయోజనం కలిగేలా వ్యవహరించే ప్రభుత్వ అధికారులు, పోలీసులను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోయేలా ఉందని, అందుకే ఓటుకు రూ.40 వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అంశాన్ని టీఆర్ఎస్కు ప్రతికూల ప్రచారంగా వాడుకోవాలని, టీఆర్ఎస్ నేతల అవినీతిని ఓటర్లకు వివరించాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇంటింటికీ వెళుతూ.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఓటర్ను 3, 4 సార్లు కలిసి బీజేపీకి మద్దతు కోరేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వివిధ కులాలు, సామాజికవర్గాల వారిని కలిసి మద్దతు కోరాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే మునుగోడుకు చేరుకోగా.. వారం, పదిరోజుల్లో రెండో విడత బృందాలు చేరుకుని ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. -
Munugode Bypoll: సెమీస్ జోష్.. ఏ ఒక్కరూ తగ్గట్లే!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోరు ముమ్మరమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచి తీరడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. అభ్యర్థులు ఖరారవడం, నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చావో రేవో తేల్చుకునే క్రమంలో ఆ రెండు పార్టీలకు దీటుగా తలపడుతోంది. మరోవైపు బీఎస్పీ కూడా రంగంలోకి దిగింది. ఎప్పుడో మొదలైన ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఊరూ వాడల్లో హోరెత్తుతోంది. ఎవరూ తగ్గేదేలే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మొదలైన ఉప ఎన్నిక పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు గెలుపే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారం టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లెంకలపల్లి గ్రామ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని పర్యవేక్షిస్తుండటం ఇందుకు నిదర్శనం. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికలో అలసత్వం వద్దని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమకు కేటాయించిన గ్రామాలు, యూనిట్లలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఆయన మరోసారి బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి స్వయంగా లేఖలు కూడా రాయనున్నారు. టీఆర్ఎస్ను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఇక బీజేపీ బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. టీఆర్ఎస్ పార్టీ కదలికలపై నిఘా వేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు వీలున్నన్ని ఎక్కువసార్లు ఓటర్లను కలిసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కూడా కష్టపడుతోంది. టీపీసీసీకి చెందిన ముఖ్య నాయకులందరూ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పాటు స్వతంత్రులు కూడా ప్రచారంలో మునిగి తేలుతుండగా.. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో ప్రధాన పార్టీలన్నీ సామాజిక అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
ఎనిమిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?
మర్రిగూడ: ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది తెలంగాణ వీరులు ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన ఎనిమిదేళ్ల నుంచి ఏం అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి, దామెరభీమనపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ, శివన్నగూడ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడులో 22వేల మెజారిటీతో గెలిపిస్తే రూ.22వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి బిడ్డకు మొదటిసారి పార్టీ నుంచి అవకాశం వచ్చిందని, గెలిపించుకొని మహిళాశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజల కోసం జీవితాంతం పోరాడుతానని ఓటర్లను కోరారు. డ్రామాలు మానుకుని గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా డ్రామాలు మానుకుని పరిపాలనపై టీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. ‘బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవు. ఆ రెండు పార్టీల చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైపోయింది’అని సోమవారం ట్విట్టర్లో రేవంత్ పోస్ట్ చేశారు. -
తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. నిబంధనల ప్రకారం, పారదర్శకంగా తన కంపెనీకి జాతీయ స్థాయి లో ఓ కాంట్రాక్టు టెండర్ లభిస్తే టీఆర్ఎస్ నేతలు మాత్రం కాంట్రాక్టు పొందేందుకే బీజేపీలో చేరినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను యాదాద్రి ఆలయం గర్భగుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని, టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడకు రావాలన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై న్యాయపోరాటం సైతం చేస్తా నని హెచ్చరించారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి సోమవారం చండూరులో నామినేషన్ దాఖలు చేశారు. బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాస్వా మ్యా న్ని ఖూనీ చేసిన టీఆర్ఎస్ను బొంద బెట్టే సమ యం వచ్చిందన్నారు. ఫాంహౌస్‌కు, ప్రగతి భవన్ కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ధర్మయుద్ధంలో ఓటర్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిషత్తు తరాల బాగు కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. -
రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్
సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరేనని, ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారని ప్రస్తావించారు. ముందుగా రాజగోపాల్‌రెడ్డి కుటుంబం గురించి తెలుసుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్కు సిగ్గుండాలని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఫాంహౌజ్ నుంచి మారుమూల లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిదేనని అన్నారు. కేసీఆర్‌కు సొంత విమానం కొనేంత డబ్బు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే గట్టుప్పల్ మండలం వచ్చిందన్న బండి సంజయ్.. ఆయన రాజీనామా తర్వాతే మునుగోడు అభివృద్ధి జరుగుతోందన్నారు. టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ‘కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాం లో ఇరుక్కుంది నిజం కాదా? దమ్ముంటే కేసీఆర్ చర్చకు సిద్ధమా. ఓటుకు నలభై వేలు ఖర్చు చేసి కొనుగోలు కార్యక్రమానికి టీఆర్ఎస్ తెరలేపింది. టీఆర్ఎస్ పంచుతున్న డబ్బులు మనవే. అవి తీసుకుని బీజేపీకి ఓటు వేయండి. చండూరు రావాలంటే రెండు గంటలు పట్టింది. అందరి చేతుల్లో జెండా కనిపిస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో మాత్రం మందు గ్లాసులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నారు. సింహం ఒక్కడే పోటీ చేస్తున్నాడు. గుంపులుగా ఎన్ని కలిసి వచ్చిన గెలిచేది బీజేపీనే. హుజూర్నగర్, నాగార్జున సాగర్ లలో ఇచ్చిన హామీలు ఒక్కటన్నా అమలు చేశారా. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు -
మునుగోడు: బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ దాఖలు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా చండూర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వెంట వివేక్ వెంకటస్వామి, కపిలవాయి దిలీప్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. -
రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రిగా జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించగా.. తన కుటుంబ స్వార్థం కోసం రాజగోపాల్‌రెడ్డి రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్‌కు అమ్ముడుపోయారని జగదీష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. కాంట్రాక్టులు తీసుకున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ఒప్పుకున్నారని ప్రస్తావించారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు. మూడేళ్ళుగా బీజేపీతో టచ్‌లో ఉన్నానని చెప్పి బీజేపీలో చేరాడని విమర్శించారు. దొరికిన దొంగ రాజగోపాల్ రెడ్డి అని, అతని వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. త్యాగాలు చేసినం అని చెప్పటం అంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఆయా కారణాల వల్ల వచ్చాయని, కానీ ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చిందని నిలదీశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశాను అంటున్న రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరితే ఏ అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘పెద్ద పార్టీ వదిలి చిన్న పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు అని మునుగోడు ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ ఎదుగుతుంటే ఓర్వలేక, బాగుపడుతున్న తెలంగాణాను చూసి తట్టుకోలేక బీజేపీ ఓ వ్యక్తిని కొనుక్కొని తెచ్చుకున్న ఉపఎన్నిక. రాజగోపాల్ చేసింది నీచమైన, నికృష్టమైన పని. మూడేళ్ళుగా కాంగ్రెస్ లో ఉండి, మోసం చేసి బీజేపీ లో చేరాడు. రాజగోపాల్‌ను ప్రజలు క్షమించరు. బీజేపీకి ఓటేస్తే బావుల దగ్గర మీటర్లు వస్తాయి. బీజేపీకి ఓటేస్తే కరెంట్ సంస్కరణలు, గ్యాస్ ధర ఇంకో వంద పెరుగుతుంది’ అని మంత్రి జగదీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా.. ఫోన్ చేసి ధన్యవాదాలు -
పవర్ లేని పవర్ మంత్రి ఉరికించి కొడతా అంటుండు.. ఆయనకు సోయి లేదా?
సాక్షి, నల్గొండ: టీఆర్ఎస్ శ్రేణులు రైతులను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మీటర్లు పెట్టినా రైతుల దగ్గర బిల్లు వసూలు చేయబోమని ఏపీ సీఎం జగన్ కూడా క్లారిటీ ఇచ్చారని తెలిపారు. ఏ రైతు ఎన్ని యూనిట్లు వాడారో తెలుసుకునేందుకు మాత్రమే మీటర్లు పెట్టాలనే ఉద్దేశ్యమని అన్నారు. ఈ విధానం వల్ల ఏ ఒక్క రైతు నష్టపోరని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఏనాడు బీజేపీ అధికారికంగా మోటార్లకు మీటర్లు అనే ప్రకటన చేయలేదు. ఏ రాష్ట్రంలో అన్నా మీటర్లు పెట్టారా?. డిస్కంలు నష్టపోతున్నాయి, కొత్త విద్యుత్ సంస్కరణలు తేవడం అనేది కేంద్రం ఆలోచన. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే గిరిజన బంధు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. మోదీ మచ్చలేని నాయకుడు. అవినీతిరహిత పాలన అందిస్తున్న వ్యక్తి మోదీ. అవినీతి పాలన చేసేది కేసీఆర్ కుటుంబమే. 2014 కంటే ముందు కేసీఆర్ ఆస్తి ఎంత?. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు. చదవండి: (అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!) కేసీఆర్ ఏనాడన్నా మునుగోడు సమస్యలపై మాట్లాడారా? ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మునుగోడు గురించే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్లో చేరితేనే గొర్రెలు ఇస్తామని, పింఛన్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుంది. మంత్రి జగదీష్ రెడ్డికి సోయి లేదు. పవర్ లేని పవర్ మంత్రి జగదీష్ రెడ్డి. రోడ్లు వేయాలని మంత్రికి సోయి లేదా?. ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం ఇది. ప్రగతి భవన్, కేసీఆర్ ఫాం హౌస్ చుట్టే రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (అదే బావి.. నాడు భర్త, నేడు భార్య) 'జగదీష్ రెడ్డి ఉరికించి కొడతా అంటోండు. ఎవరినికొడతావ్. టీఆర్ఎస్కి క్యాండిడేట్ని ప్రకటించే దమ్ము లేదు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఇరవై, ముప్పై లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు రెండు ఊర్లకు ఒక ఎమ్మెల్యే ఇంచార్జా. అవినీతి సొమ్ము, డబ్బు మూటలు తీసుకొచ్చి కొనుగోలు చేస్తారా' అని ప్రశ్నించారు. మీరెన్ని చేసినా ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. -
ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం
సాక్షి, యాదాద్రి: హుజూరాబాద్ మాదిరిగా, మునుగోడులోనూ టీఆర్ఎస్ నేతలు డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. దొడ్డిదారిలో గెలవాలని ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజరాబాద్లో ఏ తీర్పు వచ్చిందో మునుగోడులో అదే తీర్పు రిపీట్ అవుతుందని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్‌కు ఉపఎన్నిక వస్తేనే ప్రజలు, కార్యకర్తలు గుర్తుకొస్తారని అన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ఆరంభమవుతుందని హెచ్చరించారు. చదవండి: (జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్) -
‘రాజగోపాల్‌రెడ్డి చేసింది ద్రోహం.. బీజేపీలో చేరి ఏం లాభం!’
సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం మునుగోడులో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ అనంతరం.. టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. అనంతరం ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమేనని ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం లాభం?. ఆయన గతంలో టీఆర్ఎస్తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు ఉత్తమ్. అయితే..తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుని. ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలని మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో.. ఉద్యోగులకు జీతాలు లేవు అని విమర్శించారు. ఇక టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతివ్వడంపై స్పందిస్తూ.. అది చాలా బాధకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతును తెలంగాణ సమాజం అంగీకరించదని ఆయన చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు దోచిపెడుతూ.. రైతులను రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో ఏం అభివృద్ది చేశాయని టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 8 ఏళ్లుగా రాష్ట్రాని దోచుకుంటుందని.. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం -
మోసాలను మర్చిపోవద్దు... మోసగాళ్లను విడిచిపెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ‘చార్జిషీట్’ వేసింది. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ వైఫల్యాలతోపాటు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎండగడుతూ 2 పేజీల కరపత్రాన్ని రూపొందించింది. మునుగోడులో పరిష్కారంకాని సమ స్యలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ హామీల వైఫల్యం, బీజేపీ, రాజగోపాల్‌రెడ్డి చేసిన మోసాలంటూ అనేక అంశాలను ప్రస్తావించింది. ఈ కరపత్రంలో రాజ గోపాల్‌రెడ్డితోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి ఫొటోలను కూడా ప్రచురించింది. మన మును గోడు–మన కాంగ్రెస్ పేరుతో ‘ఈ మోసాలను మర్చిపోవద్దు... ఈ మోసగాళ్లను విడిచి పెట్టొద్దు’ అంటూ ముద్రించింది. కేంద్రంలో, రాష్ట్రంలో కుమ్మ క్కయి ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, మోదీ మోసాల్లో మచ్చుకు కొన్ని అంటూ కరపత్రంలో కాంగ్రెస్ పేర్కొన్న అంశాలివే... స్థానిక సమస్యలు ► అసంపూర్తిగా డిండి, చర్లగూడెం, కిష్టరాయిని పల్లి, బ్రాహ్మణవెల్లెంల, రాచకొండ ఎత్తిపోతలు ► ప్రాజెక్టుల పేరుతో గుంజుకున్న భూములకు పరిహారం ఇవ్వని కేసీఆర్ ► చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్, మునుగోడులో జూనియర్ కాలేజీ ఏర్పాటు ► నారాయణపురంలో పోడు భూములకు పట్టాలు ► నియోజకవర్గంలోని పేదలు, విలేకరులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. చండూరు–నాంపల్లి రోడ్‌ను డబుల్‌రోడ్డుగా మార్చే హామీ ► ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ రాష్ట్ర స్థాయి సమస్యలు ► దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ► ప్రతి రైతు కుటుంబంపై రూ.1.52 లక్షల అప్పు భారం.. 8వేల మందికిపైగా రైతుల ఆత్మహత్య ► అమ్మహస్తం రద్దు, రేషన్ బియ్యంతో సరిపెడు తున్న కేసీఆర్.. విద్యుత్, బస్సు చార్జీల పెంపు రాజగోపాల్‌రెడ్డి మోసాలు... ► బీజేపీతో రూ. 22 వేల కోట్ల మైనింగ్ డీల్ కుదు ర్చుకొని నియోజకవర్గ ప్రజలకు వంచన ► టీఆర్ఎస్తో దోస్తీ చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టులు తెచ్చుకున్న స్వార్థపరుడు ► పింఛన్ రాని వాళ్లకు సుశీల ఫౌండేషన్ నుంచి పింఛన్ ఇస్తానన్న హామీ అమల్లో విఫలం ► ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల, కళాశాల ఏర్పాటు హామీ బుట్టదాఖలు ► నియోజకవర్గంలోని 10 వేల మంది యువతకు ఉపాధి అంటూ మోసం.. చర్లగూడెం రిజర్వా యర్ ముంపు బాధితులకు గెలిచిన 100 రోజుల్లో పరిహారం ఇప్పించకపోతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమన్న ప్రకటన మోసమే ► గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత చదువులు పూర్తి చేయిస్తానన్న హామీ కంచికి. బీజేపీ మోసాలు.. ► చేనేత కార్మికులపై 5 శాతం జీఎస్టీ బండ ► ఫ్లోరోసిస్ నివారణ కోసం చౌటుప్పల్‌లో కాంగ్రెస్ మంజూరు చేసిన రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో వైఫల్యం ► లీటర్ పెట్రోల్ రూ. 71.41 నుంచి రూ.109కి, డీజిల్ రూ. 55.49 నుంచి రూ. 97.82కు, వంట గ్యాస్ సిలిండర్ రూ.410 నుంచి రూ.1,055కి పెంపు ► పన్నులతో సామాన్యుడిపై భారం మో పి కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ ► ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే యత్నం. 16 కోట్ల ఉద్యోగాలకుగాను 7 లక్షల ఉద్యోగా లిచ్చి నిరుద్యోగులను మోసం చేయడం ► గిరిజన వర్సిటీ, ఐఐఐటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బీబీ నగర్ ఎయిమ్స్ లాంటి విభజన హామీల అమల్లో విఫలం చదవండి: మునుగోడు వరకే టీఆర్ఎస్కు మద్దతు -
Munugode: మునుగోడులో బీజేపీకి బూస్ట్
Munugode Politics.. సాక్షి, యాద్రాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో గులాబీ నేతలు ప్లాన్స్ రచిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ సైతం మునుగోడులో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ గెలుపు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీలోకి చేరికలపై దృష్టిసారించారు. కాగా, బుధవారం చౌటుప్పల్ మండలం, తుఫ్రాన్‌పేట్‌లో కార్యకర్తలు.. రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి.. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘నా రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ బూటకపు మాటలపైన ప్రజలకు నమ్మకం పోయింది. నా పదవి త్యాగంతో ప్రజలు నా వైపు ఉన్నారు. ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు వైపు మొగ్గుచూపుతున్నారు. మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ముగ్గురు మినహా మంత్రులంతా జీరోలే -
మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్ఎస్.. మరి కాంగ్రెస్?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా, తాము వెనుకబడ్డామనే భావన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగతా రెండు పార్టీలు నియోజకవర్గం, మండల స్థాయిల నుంచి గ్రామ స్థాయి వరకు వెళుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారనే చర్చ నియోజకవర్గ స్థాయిలో కూడా జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీలు తమ బలాలను ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునే పనిలో నిమగ్నమై ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు నియోజకవర్గంలోని గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పాటు టికెట్ ఎక్కువ మంది ఆశిస్తుండడం, ఇప్పుడే ఎందుకులే అనే భావన, రాష్ట్ర స్థాయి నుంచి సరైన పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడం కారణమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వేధిస్తున్న వలసలు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నడుమే పోరు సాగనుంది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పాటు ఆ పార్టీకి కేడర్ కూడా బాగానే ఉంది. కానీ ఇతర పార్టీలు దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో ఉన్న కేడర్ నిస్తేజంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు గాలం వేసి తమ శిబిరాల్లో చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్ వార్డు సభ్యుల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పరిధిలోని నాయకులు టీఆర్ఎస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదనే భావన స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తుండడంతో ప్రతిరోజూ వలసల పర్వం కొనసాగుతోంది. దూసుకుపోతున్న కారు టీఆర్ఎస్ పక్షాన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే పార్టీ సింబల్, కేసీఆర్ బొమ్మలున్న గోడ గడియారాలు, గొడుగులు నియోజకవర్గానికి చేరిపోయాయి. వీలున్నంత మేరకు ఇతర పార్టీల నేతలను చేర్చుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి నిధుల ఖర్చుపై దృష్టి పెట్టింది. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులు రానున్న నేపథ్యంలో గ్రామపంచాయతీల చేత తీర్మానాలు చేయించి ప్రతిపాదనలు కూడా పంపించారు. 2, 3 రోజుల్లో నిధులు వస్తాయని, పనులు కూడా ప్రారంభం అవుతాయనే చర్చ జరుగుతోంది. చదవండి: (మరింత కష్టపడాలి.. బీజేపీ నేతలతో జేపీ నడ్డా) రోజుకో గ్రామానికి రాజగోపాల్ బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తనదైన శైలిలో నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. పాత కాంగ్రెస్ కేడర్‌తో పాటు తనకున్న వ్యక్తిగత చరిష్మాను ఉపయోగించుకుంటూ.. పార్టీలో చేర్చుకున్న నేతలతో కలిసి రోజుకో గ్రామానికి వెళుతున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గంలో బహిరంగసభలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు గ్రామాలు, మండలాల్లో ఉత్తేజంగా తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో చురుకుదనం లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయికి చేరని కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిలో వీలైనంత త్వరగా మార్పు వస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలితే కానీ ప్రచారం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిల్లో ఎవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇప్పటినుంచే గ్రామాలకు వెళ్లి అంతా రెడీ చేసుకున్న తర్వాత టికెట్ రాకపోతే ఇబ్బంది అవుతుందనే భావనలో ఉన్న ఆశావహులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా అభ్యర్థి ఖరారు చేసే యోచనలో టీపీసీసీ నాయకత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కసరత్తు పూర్తి కాగా, ఆశావహుల జాబితా ఢిల్లీకి చేరింది. వినాయకచవితి తర్వాత ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. చదవండి: (‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’) -
Munugodu: అన్నీ పార్టీల నేతలంతా ఇక్కడే.. దూసుకుపోతున్న రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ: ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు మునుగోడులో మకాం వేశాయి. ఆయా పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న నివాస గృహాలను అద్దెకు తీసుకొని అక్కడి నుంచే నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజీపీ బహిరంగ సభకు ముందే స్థా«నికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పార్టీ కార్యాలయం ప్రత్యేకంగా ఉన్నా.. దీనిని అదనంగా తీసుకున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ చేరికలను వేగంగా కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న ఉప ఎన్నికల వేడి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. అమిత్‌షా సభ జరిగిన మరుసటి రోజు నుంచే రాజగోపాల్‌రెడ్డి రోజుకో మండలంలో తిరుగుతూ బీజేపీలోకి చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డే కావడంతో ఆయనే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో మంత్రి జగదీష్‌రెడ్డి అన్నీ తానై నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వెంట పెట్టుకొని సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించిన మండలాల్లోని గ్రామాల్లో రెండు రోజులకు ఒకసారి సమావేశాలు జరిగేలా చూస్తున్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. పోటాపోటీగా సమావేశాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీష్‌రెడ్డి పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సమావేశం నిర్వహించారు. దీనికి స్థానిక నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి. దీంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఆగమేఘాల మీద మునుగోడులోనే శనివారం సాయంత్రం స్థానిక నేతలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి జగదీష్‌రెడ్డి గ్రామాల వారీగా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఏ గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. మహిళలు, పురుషులు ఎంత మంది? అందులో కులాల వారీ ఓట్లు ఎన్ని.. ఎక్కువ ఓట్లు ఏ గ్రామంలో ఏ కులం వారికి ఉన్నాయి.. వాటిల్లో టీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా ఓట్లు టీఆర్ఎస్కు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై సమీక్షించారు. -
ప్రాణం పోయినా తప్పు చేయను: రాజగోపాల్‌రెడ్డి
-
ప్రాణం పోయినా తప్పు చేయను: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ ఉప ఎన్నిక వ్యక్తి కోసం స్వార్థం కోసం రాలేదని.. తెలంగాణ భవిష్యత్ కోసం, రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవం వచ్చిందని తెలిపారు. ఈ మేరకు నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు న్యాయం వైపే నిలుస్తారు. ధర్మాన్ని కాపాడతారు. ప్రాణం పోయినా తప్పు చేయను. నాపై అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ధర్మం వైపు ఉంటారని నమ్మకం ఉంది. నాపై ఆరోపణలు చేసేవారికి ఆధారాలు చూపాలని అడుగుతున్నా. సభకు వచ్చే వేలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాణంపోయినా ప్రజలకు ఇబ్బంది కలిగే పనిచేయను ‘ఎంతోమంది నన్ను అమ్ముడుపోతుండు అంటున్నారు.. రాజీనామా ఎందుకు చేశానో, పార్టీ ఎందుకు మారానో మీకు తెలుసు, మీ అందరి ఆశీర్వాదం , నమ్మకం, విశ్వాసంతోనే రాజీనామా చేశాను’ అని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాణం పోయినా మునుగోడు ప్రజలకు ఇబ్బంది కలిగే పనిచేయనని చెప్పారు. తాను రాజీనామా చేస్తే ఫాం హౌజ్‌లో పండుకున్న కేసీఆర్ మునుగోడుకు వస్తాడని తాను ముందే చెప్పానని ఇప్పుడు అనుకున్నట్లుగానే కేసీఆర్ మునుగోడుకు వచ్చాడని తెలిపారు. మునుగోడులో ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయని, గట్టుప్పల్ మండలం వచ్చిందని వివరించారు. తనకు పదవులు ముఖ్యంకాదని, స్వార్థం కోసం రాజీనామా చేసినవాడిని అయితే ఇంట్లోనే ఉండేవాణ్ని ఉప ఎన్నికలకు ఎందుకు వస్తానని ప్రశ్నించారు. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, తెలంగాణ భవిష్యత్ కోసం పోరాడుతున్నానని చెప్పారు. బీజేపీ ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితి కేసీఆర్‌ది అని విమర్శించారు. కేసీఆర్ మూటలు పంపితే ఆయన మనుషులు నాయకులను కొనుగోలు చేస్తున్నారని, కానీ, ప్రజలంతా తమవెంటే ఉన్నారని తెలిపారు. ఈడీ , సీబీఐ అంటూ మాట్లాడుతున్నాడని, తప్పు చేయనప్పుడు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని పేర్కొన్నారు. తప్పు చేశావ్ కాబట్టే భయపడుతున్నావ్ అని అన్నారు. చదవండి: (మునుగోడులో భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్.. ప్రియాంక గాంధీ హాజరు!) -
కుటుంబ పాలనకు చరమగీతం
మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలుపు ద్వారా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పతనానికి నాంది పడుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడమంటే.. కేవలం ఒక్క నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం కాదని, ఇది కేసీఆర్ అవినీతి ప్రభుత్వ అంతానికి మార్గం వేయడమని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఆదివారం మునుగోడు పట్టణంలో బీజేపీ ‘మునుగోడు సమరభేరి’బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ప్రసంగం అమిత్‌షా మాటల్లోనే.. కేసీఆర్ సర్కారును కూకటివేళ్లతో పెకలిస్తాం.. ‘‘మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం పతనానికి నాంది పడుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి గంగానది ప్రవాహంలా ముందుకు సాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. కేసీఆర్ మజ్లిస్‌కు భయపడుతున్నారు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కారణంగా రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్న కేసీఆర్ మాట తప్పారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఈ హామీ అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తాం. నిరుద్యోగ భృతి.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి? కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు. నల్లగొండలో నిర్మించారా? పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇళ్లు ఇవ్వకపోగా.. కేంద్ర ప్రభుత్వం నిర్మించే మరుగుదొడ్ల పథకాన్ని కూడా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌ను సీఎం చేస్తారే తప్ప దళితుడిని చేయరు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళిత బంధు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఎందరికి ఇచ్చారు? ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? గిరిజనులకు భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? యువతకు ఉద్యోగాలు ఇస్తామని 2014 నుంచీ చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, ఇతర బంధువులకు మాత్రమే ఉపాధి కల్పించుకున్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు. కానీ ఆ కుటుంబ అరాచక పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి, ఎందుకు నష్టపోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించరేం? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను రెండు సార్లు తగ్గించినా కేసీఆర్ సర్కారు తగ్గించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. మోదీ సర్కారు రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా.. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకు ఉంది? టీఆర్ఎస్ సర్కారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉంది..’’అని అమిత్‌షా పిలుపునిచ్చారు. కాగా సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేయాలని.. మునుగోడు ఉప ఎన్నికలే ఇందుకు నాంది పలకాలని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు గొంగిడి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మునుగోడు సభలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, నేతలు విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమిత్‌షా సభలో నేతలు కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుందని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్తు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరానని.. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగేది కాదని.. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని, తాను మాత్రం పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ ప్రతి ఎన్నిక సమయంలో బెదిరిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ‘హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ గెలిచింది, మరి ఏ ఒక్క మోటార్కైనా మీటరు పెట్టారా?’అని ప్రశ్నించారు. తెలంగాణలోని వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు కేంద్రమే రూ.750 కోట్లు నిధులు ఇచ్చిందని.. అదేదో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను పరిష్కరించినట్టు చెప్పుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను అంతం చేయడానికే అమిత్‌షా మునుగోడుకు వచ్చారన్నారు. తాము రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు తాము సభ పెట్టామని, మరి టీఆర్ఎస్ మునుగోడులో సభ ఎందుకు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. ‘కేసీఆర్ నీకు దురద పెడితే నువ్వే గోక్కో.. మమ్మల్ని గోకమనకు. కేసీఆర్‌కు సమాధానం చెప్పే సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉంది’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్ల సబ్సిడీ, ఫసల్ బీమా పథకంతో ప్రధాని మోదీ రైతులను ఆదుకుంటుంటే.. సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేయడం ఏమిటని ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత, గౌడ, ముదిరాజ్ తదితర అన్ని కులాల ప్రజలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మునుగోడు సభ జనం లేక వెలవెల బోయిందన్నారు. కేసీఆర్‌కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటని.. కమ్యూనిస్టుల గొంతు నొక్కి ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌కు మద్దతు ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిలదీశారు. ‘‘సీపీఐ, సీపీఎం నేతలు ఎనిమిదేళ్లుగా ఏనాడైనా ప్రగతిభవన్‌లో అడుగు పెట్టారా? మీ కార్మిక సంఘాలు సమ్మెలు చేసినప్పుడు మిమ్మల్ని చర్చలకు పిలిచి మాట్లాడారా? కమ్యూనిస్టు పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు అడ్డా ఇందిరా పార్కు. అలాంటి చోట ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి.. చైతన్యం ఉండకూడదని, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదని చెప్పి నిషేధించిన కేసీఆర్ ఈ రోజు ప్రగతికాముకుడిగా కనబడుతున్నారా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని కేసీఆర్ బెదిరించి.. అనేక మంది డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలకు కారణమైనది మర్చిపోయారా? చివరికి ట్రేడ్ యూనియన్లు పెట్టుకోబోమని దండం పెట్టించుకున్న చరిత్రను మరిచిపోయారా?’’అని ఈటల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు మద్దతిచ్చేవారిని, కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించబోరని వ్యాఖ్యానించారు. చదవండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ -
గ్యారంటీ ఇస్తున్నా.. కేసీఆర్ సర్కార్ మాయమవుతుంది: అమిత్‌షా
సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్ సర్కార్.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: రైతులతో అమిత్ షా భేటీ.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు మజ్లిస్ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపట్లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ‘‘పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేసీఆర్ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3వేలు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా’’ అంటూ అమిత్ షా ప్రశ్నించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అందిందా?. గిరిజనులకు భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇచ్చారా?. ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబాలకు తప్ప ఎవరికీ దక్కలేదు’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారంటూ’’ అమిత్‌షా ధ్వజమెత్తారు. బీజేపీలోకి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి అమిత్‌షా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయనని’’ ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు. కేసీఆర్ పాలనకు అంతం పలుకుతాం: విజయశాంతి రైతుల్ని, దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. మునుగోడు నుంచే కేసీఆర్ పాలనకు అంతం పలుకుతామన్నారు. కేసీఆర్‌కు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయిందన్నారు. తప్పు చేసిన వారే భయపడతారన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ నాయకుల్ని వేరు చేయలేదరని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా?: ఈటల రాజేందర్ ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎనిమిదేళ్లుగా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్లో అడుగుపెట్టారా? ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్ పార్టీ మద్దతా అంటూ ఈటల మండిపడ్డారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లను రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు?. కేసీఆర్ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా? అని ఈటల ప్రశ్నలు సంధించారు. -
Munugode Politics: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: మునుగోడు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడిగినా కేసీఆర్ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్ధాలేని.. మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ దిగిపోవడం ఖాయమన్నారు. ఆయన ఎప్పుడైతే ప్రతిపక్షం లేకుండా చేశారో అప్పుడే ఆయన పతనం మొదలైందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేసీఆర్ అహంకారం వల్లే ఈ ఉప ఎన్నిక. ఎమ్మెల్యేలకు అపాయింట్ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్ అహంకారం కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయని అన్న కేసీఆర్ మాటలు అసత్యాలని అన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు రావని స్పష్టం చేశారు. కేసీఆర్ తన ప్రాభవం కోసం ఎప్పటికప్పుడు బీజేపీపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటేస్తే బాయికాడ మీటరొస్తది అన్న సీఎం కేసీఆర్.. ఆ పార్టీని తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని కేసీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని నిలదీశారు. చదవండి: (ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో: సీఎం కేసీఆర్) -
తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం
సాక్షి, ఆదిలాబాద్: మునుగోడు కేంద్రంగా జిల్లా బీజేపీలోనూ కొత్త సమీకరణాలకు బీజం పడుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిప్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కమలం తీర్థం పుచ్చుకుంటుండగా, జిల్లా నుంచి కూడా ఆ పార్టీలో చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓ ఎన్ఆర్ఐ చకచకా చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. చూచాయగా సమాచారం.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ ఇప్పటికే బీజేపీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఈక్రమంలోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు కదులుతున్నారు. మొదటి నుంచి బీజేపీలో చేరిక ఖాయమంటూ సంకేతాలిస్తూ వచ్చారు. తాజాగా ఆయన మునుగోడులో అమిత్‌షా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. శుక్రవారం పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులకు ఆయన ఫోన్ చేసి తాను పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఆయన చేరికకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా జోరుగా ప్రయత్నాలు సాగుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌కు మొదట ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రయత్నలు ఓ కొలిక్కి రావడంతో జిల్లా అధ్యక్షుడికి చూచాయగా తాను పార్టీలో చేరుతున్నట్లు తెలియజేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. చదవండి: (అక్కడ ‘కారు’ జోరు పెరుగుతుందా?.. ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి?) ఆసక్తికరంగా పరిణామాలు.. కమలం పార్టీలో చేరికకు సంబంధించి ఆసక్తికరంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడులో చేరిక తర్వాత మరుసటి రోజే సోమవారం ఆదిలాబాద్ నియోజకవర్గానికి పార్టీ అదిష్టానం ద్వారా ఇన్‌చార్జీగా నియమితులైన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం ఖోడబాయి రూపాల ఆదిలాబాద్‌కు రానున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆయన ఆదిలాబాద్‌లో వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం కానున్నారు. దీంతో ఈ వేదిక నుంచే ఆదిలాబాద్ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశిస్తున్న ముఖ్య నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు వర్గాలుగా కొనసాగుతుండగా, తాజాగా పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. సైద్ధాంతిక పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కొంతమంది పాత నేతల్లో కొత్త చేరికపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయోననేది ఆసక్తి కలిగిస్తోంది. -
అమిత్ షా సభను అడ్డుకునేందుకు కుట్ర
మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మునుగోడులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 21న కేంద్ర హోంమంత్రి సభ నిర్వహిస్తున్నట్లు నెల రోజుల క్రితమే తాము ప్రకటించామని, అయితే సీఎం కేసీఆర్ కావాలనే ఒకరోజు ముందు ‘మునుగోడు ప్రజా దీవెన’పేరిట సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని సీఎం కేసీఆర్, మునుగోడు సభకు వచ్చే ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు సమస్యలని సీఎం దృష్టికి తీసుకొస్తే.. ఏ ఒక్క రోజూ పట్టించుకోలేదన్నారు. ఎక్కడై నా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతోనే తాను పదవీ త్యాగం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. అందుకే తాను 21న అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఆ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక హామీలు గుప్పించి ఈ తర్వాత విస్మరించడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు రమేశ్ కుమార్ నాయక్, రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో ముసలం: ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. ‘నేర చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌తో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేను.. ఆయనతో కలిసి వేదికను పంచుకోలేను’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు గురువారం జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాయడం కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం.. దీటుగా ఆయన స్పందించడం.. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా అసమ్మతి సెగలు రాజుకోవడం వంటి తదితర పరిణామాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి విధేయుడిగా ఉన్న అనిరుధ్‌రెడ్డి లేఖ సంధించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏడాదికిపైగా అనిశ్చితి.. మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ గతేడాది జూలైలో బీజేపీని వీడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన క్రమంలో ఆయనను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు గుప్పుమన్నాయి. నేరచరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీకి ఎలా చేర్చుకుంటారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి అప్పట్లో లేఖ రాయడంతో దుమారం చెలరేగింది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గతేడాది అక్టోబర్ 12న జరిగిన బహిరంగసభలో రేవంత్ సమక్షంలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. చదవండి: (మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్) అనంతర కాలంలో శేఖర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో రేవంత్‌రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత అటు అనిరుధ్‌రెడ్డి, ఇటు ఎర్రశేఖర్ వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపట్టిన దీక్షలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క గత నెల 22న మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు ఆ ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా సుమారు ఏడాదికి పైగా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. సయోధ్య కుదిరినట్లేనని భావించినా.. తొలి నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు కోమటిరెడ్డి ద్వారా ఎర్రశేఖర్ రాకను అనిరుధ్‌రెడ్డి అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు నెలల క్రితం అమెరికాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సభలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో పాటు అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరిగాయని.. సయోధ్య కుదిరినట్లేనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. చదవండి: (కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?) టీడీపీ వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ.. ‘పార్టీకి ఎవరూ అండగా లేని రోజుల్లో తాను శ్రమించానని.. కాంగ్రెస్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించానని.. కానీ తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎర్రశేఖర్‌ను పార్టీలోకి తీసుకున్నారు.’ అని లేఖలో అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చే వాళ్లకు ప్రాభవం లేకున్నా ప్రాధాన్యం ఇస్తున్నారని.. సీత దయాకర్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. మొదటి నుంచి ఉన్న మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సమంజసం కాదని.. తాను స్థానికుడిని అని ఏదిఏమైనా కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడుతానని, పార్టీ టికెట్ రాకున్నా పోటీలో ఉంటానని’ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి నడుస్తారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనిరుధ్‌రెడ్డి లేఖపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి బంగ్ల రవి, ఎంపీటీసీల సంఘం నాయకుడు రాంచంద్రయ్య, నాయకులు రాజేశ్ తదితరులు నవాబ్‌పేటలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తీరును ఖండించారు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడంతోనే జీర్ణించుకోక ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆనాడు ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని?.. మొత్తం బయటకు తీస్తా: కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: అసెంబ్లీలో మూడు సంవత్సరాలు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడినా స్పందించని సీఎం కేసీఆర్ నేడు ఉప ఎన్నికల భయంతో మునుగోడులో అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న లక్ష మందితో మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అమిత్ షా మీటింగ్‌కు భయపడే, కేసీఆర్ 20వ తేదీన బహిరంగ సభ పెట్టుకున్నాడు. నా పదవీ త్యాగంతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి నేను అమ్ముడుపోయిన అని మాట్లాడుతున్నాడు. అది ఆయన రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. లేకపోతే నీవు మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. మంత్రి జగదీష్ రెడ్డి నాగారం, తుంగతుర్తి మర్డర్ కేసులలో A1, A2 నిందితుడిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన మనిషి ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ రాక ముందు జగదీష్ రెడ్డి ఆస్తులు ఎన్ని? ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని?. మొత్తం బయటకు తీస్తా. త్వరలోనే అక్రమాస్తుల చిట్టా బయటపెడతా. మునుగోడులో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉంటుంది' అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చదవండి: (లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
'అందుకోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది'
సాక్షి, నల్గొండ: స్వార్ధ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా?. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం. రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్‌ల చేతికి రాష్ట్రం పోయిన తెలంగాణకు నష్టమే. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రేవంత్‌రెడ్డిపై దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయి' అని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌరవుల పక్షాన చేరిన కర్ణుడని ఆయన అభివర్ణించారు. పాండవుల వెంట ఉంటే రాజ్యం ఇస్తామని చెప్పినా అనాడు కర్ణుడు విననట్లు.. ఇప్పుడు రాజగోపాల్ కూడా అలాగే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానీతనమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. హుజురాబాద్‌కు, మునుగోడుకు సంబంధమే లేదని, రాజగోపాల్‌రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టడని జోస్యం చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. గత మూడేళ్లలో రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి ఫైట్ చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందా అని నిలదీశారు. చదవండి: కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో టీ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని జీవన్ రెడ్డి వెల్లడించారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అర్జునుడిగా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడితో పోల్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మీటింగ్‌లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చదవండి: జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్ -
కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో అధికారంగా బీజేపీలో చేరనున్నారు. అదే రోజు కోమటిరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది. సంబంధిత వార్త: స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు -
తెలంగాణలో అరాచక పాలన సాగుతోంది : రాజగోపాల్ రెడ్డి
-
నేడు స్పీకర్ ను కలవనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని అన్నారు. కేసీఆర్ చేతిలో ఆత్మగౌరవం బంధీ అయ్యిందని కోమటిరెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. కుటంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని, రాజీనామా అనంతరమే మునుగోడు ఉప ఎన్నికపై ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు. రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ యుద్దం తన కోసం కాదని, మునుగోడు ప్రజల కోసం అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నో ఆశలతో తెలంగాణ వచ్చిందని, తన రాజీనామాతోనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని హితవు పలికారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి.. కేసీఆర్ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలని కోరారు. చదవండి: చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా -
మునుగోడులో సర్వేల జోరు.. ఎవరైతే బెటర్!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో ఆశావహుల సర్వేలు జోరందుకున్నాయి. బరిలో నిలవాలనుకునే వారు ఎవరికివారే సర్వేలు చేయించుకుంటుండగా.. రాజకీయ పార్టీలు కూడా ప్రజల నాడి తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాలతోపాటు ఎవరి టికెట్ ఇవ్వొచ్చు.. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలను ఆయా రాజకీయ పార్టీలు రాబడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వేల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంపైనా ప్రత్యేక సర్వే చేయించగా, ప్రశాంత్ కిషోర్(పీకే) బృందం ఇప్పటికే నియోజవకర్గంలో మూడుసార్లు సర్వే చేసింది. దీనికితోడు మరో ఆరేడు సంస్థలు కూడా తమ సర్వేలను కొనసాగిస్తున్నాయి. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను ఆధారంగా సర్వే చేస్తున్నారు. ఒక్కో మండలంలో ఐదు వేల నుంచి 15 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో సామాజిక వర్గం ప్రధానం కాబోతుందా? పార్టీల వారీగా సంప్రదాయ ఓటింగ్‌కే మొగ్గు చూపుతారా? అన్న వివరాలను తెలుసుకుంటున్నారు. వారికి ఫాలోయింగ్ ఉందా? చండూరులోనూ పీకే టీంతోపాటు, పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల నుంచి ఫలానా వారు అభ్యర్థులు అనుకుంటే అందులో ఒక్కొక్కరి పరిస్థితిపైనా ఆరా తీస్తున్నాయి. వారికి ఫాలోయింగ్ ఉందా? టికెట్ ఇస్తే గెలుస్తారా? అసలు అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదికన గెలుస్తారని భావిస్తున్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలి.. పాల్వాయి స్రవంతికి ఇవ్వాలా? టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేతకు ఇవ్వాలా? లేదంటే కొత్తగా తెరపైకి వస్తున్న వారికి ఇవ్వాలా? అందులో ఎవరికి టికెట్ ఇస్తే గెలిపిస్తారు? లేదంటే అధికార పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారా? అన్న వివరాలను అడుగుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేస్తారా? ఆయన్ని మళ్లీ గెలిపిస్తారా? కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరు బెటర్ అనే వివరాలను సేకరిస్తున్నారు. చదవండి: మునుగోడు తీర్పు దేశమంతా వినిపించాలి పార్టీల పనితీరేంటి.. జరిగిన అభివృద్ధి ఎంత? ఈ సర్వేల్లో పార్టీల పనితీరును కూడా అడిగి తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ బెస్టా.. బీజేపీని గెలిపిస్తారా? కాంగ్రెస్‌కు పట్టం కడతారా? అన్న వివరాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. ఎన్నికలు జరిగితే పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరైతే మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నారు.. గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఎంత.. ఆగిపోయిన పనులు ఏంటి? అందుకు ఎవరు కారణం.. అభివృద్ధి జరగకపోతే ఎందుకు జరగలేదనుకుంటున్నారు.. ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి పనులు కొనసాగుతాయని అనుకుంటున్నారా? అన్న సమగ్ర వివరాలను తీసుకొని క్రోడీకరిస్తున్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధి జరుగుతుందనుకుంటున్నారా?. రాష్ట్రమే అభివృద్ధి చేస్తుందనకుంటున్నారా?. ఎన్నికల్లో ఏయే పార్టీల నడుమ పోటీ ఉంటుంది.. ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఓటు వేసేందుకు రాజకీయ పార్టీలను చూస్తారా, వ్యక్తులను చూస్తారా, సాంప్రదాయ బద్ధంగా ఓటు వేస్తారా, సరి కొత్తగా మార్పు కోరుకుంటున్నారా అన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆశావహుల సొంత సర్వేలు.. టికెట్‌కు ప్రయత్నిస్తున్న ఆశావహులు కూడా సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా రెండు సర్వేలు సాగుతున్నాయి. బీజేపీ కూడా ఒక సర్వే చేయిస్తోంది. చౌటుప్పల్ మండలంలో సర్వేలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులతోపాటు మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి తరఫున కూడా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. -
తెలంగాణలో ఉన్నది.. ‘పసుపు కాంగ్రెస్’!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కాంగ్రెస్ కాదు. అది పసుపు కాంగ్రెస్. రేవంత్‌రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్‌ను కొనుక్కొని కబ్జా చేసుకు న్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారం వెనుక ఉన్నారు. రేవంత్‌రెడ్డి అనుచరులతో పిలిపించుకొనే ‘సీఎం’ అంటే చంద్రబాబు ముద్దుబిడ్డ రేవంత్‌రెడ్డి అనే అర్థం. చంద్రబాబు డైరెక్షన్లోనే హైదరాబాద్‌లోని సీమాంధ్ర పెట్టుబడిదారులు రేవంత్‌ను ముందుపెట్టుకుని.. తెలంగాణను వశం చేసుకోవాలని చూస్తున్నారు’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గుర్తించాలన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామితో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణభవన్‌లో మీడి యాతో మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోతాయి ఎమ్మెల్యేగా తాను ప్రజాసమస్యలపై అసెంబ్లీలో, బయటా పోరాటం చేశానని రాజగో పాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక అవసరం లేదన్న ఆలోచనతోనే ఇన్ని రోజులు పార్టీ మారలేదని.. కానీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొ న్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నిక సునామీలో కొట్టుకుపోతాయ న్నారు. ఈనెల 8వ తేదీ తర్వాత స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని.. అవసరమైతే ఆయన ఇంటి ముందు కూర్చొని అయినా రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని చెప్పారు. రేవంత్‌తో కాంగ్రెస్ మునుగుతోంది.. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని.. రేవంత్‌రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మునుగుతోందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ‘టీడీపీలో చెడ్డ పనులు చేసినందుకే రేవంత్‌ను జైలుకు పంపించారు. రేవంత్ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటు న్నారు’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చదవండి: నోరు జారా.. క్షమించండి: అద్దంకి -
‘మునుగోడు ఉప ఎన్నికపై స్పందించిన కేటీఆర్.. మారేదేమీ లేదు..!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్కు సవాలేమీ కాదని, అన్నింటిలా అది మరో ఉప ఎన్నిక మాత్రమేనని, దానితో మారేదేమీ లేదని మంత్రి కేటీ రామా రావు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో తెలంగాణకు టీఆర్ఎస్ సేవ చేస్తోందన్నారు. శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట రెండు గంటల పాటు నిర్వహించిన ప్రశ్న, జవాబుల కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాదానాలు ఇచ్చారు. విపక్ష పార్టీ మతం, జాతీయతను కలగలిపి ఎన్నికల వ్యూహంగా వాడుతుంటే.. తాము మాత్రం అభివృద్ధితో కూడిన జాతీయవాదం (డెవలప్మెంటల్ నేషనలిజం) మీద దృష్టి పెట్టామన్నారు. ‘ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయనే సామెతను తెలంగాణ బీజేపీ నాయ కులు గుర్తు తెస్తున్నారు. మరికొన్ని నియోజ కవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పగటి కలలు. అసత్యాలను వ్యాప్తి చేయడమే బీజేపీ నేతల పని’ అని కేటీఆర్ మండిపడ్డారు. చదవండి: బీజేపీలోకి చేరుతున్నా.. డేట్ ఫిక్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. హిందీని రుద్దడాన్ని అంగీకరించబోం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాము ఒప్పుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ప్రధానిని తెలంగాణ ప్రభుత్వం అగౌరవపరుస్తోందనే విమర్శలు అర్థ రహితం. అనధికారిక, ప్రైవేట్ పర్యటనలకు వచ్చే మోదీ సీఎం స్వాగతం పలకాలని ప్రొటోకాల్ నిబంధనల్లో లేదు. భారత్ వంటి భారీ ఆర్థిక అసమానతలు ఉన్నచోట ఉచిత పథకాలను విమర్శిస్తున్న మోదీ.. కార్పొరేట్లకు సంబంధించిన రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. నుపుర్‌శర్మ దేశానికి తలవంపులు తేవడంతోపాటు ప్రపంచం దృష్టిలో మన దేశం పలుచనయ్యేలా చేసిందన్నారు. జాతీయ జెండాను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెడితే దేశ జీడీపీ పురోగతి సాధిస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. విపక్షాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాలను కూల్చడంపై కాకుండా పడిపోతున్న రూపాయి విలువపై ప్రధాని మోదీ దృష్టి సారించాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో విపక్షాల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పాటించకుండా తనకున్న మందబలంతో బీజేపీ నెట్టుకుపోతోందని మండిపడ్డారు’ అని కేటీఆర్ బదులిచ్చారు. పలు అంశాల్లో ప్రశ్నల వర్షం! బాసర ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీల విద్యార్థుల సమస్యలు, హైదరాబాద్‌లో మురుగు, వరద నీటి సమస్య తదితర అంశాలపై చాలా మంది నెటిజన్లు ‘ఆస్క్ కేటీఆర్’లో ప్రశ్నలు సంధించారు. -
రాజగోపాల్‌రెడ్డి నయవంచకుడు.. రేవంత్‌రెడ్డి ఫైర్
సాక్షి, నల్లగొండ: పార్టీకి ద్రోహం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలని.. మునుగోడు గడ్డ కాంగ్రెస్ పక్కన నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. జిల్లాలోని చండూరులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తాజా మాజీ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సింది. కానీ, ఆ టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ త్యాగం గుర్తులేదా? అని రాజగోపాల్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మునుగోడులో చరిత్ర హీనుడైన రాజగోపాల్ రెడ్డి.. నమ్మిన కార్యకర్తలను మోసం చేసి అమిత్ షా పంచన చేరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి. అలాంటి సోనియాను హింసిస్తే ఊరుకుంటామా? అని రేవంత్ ఆగ్రహం వెల్లగక్కారు. కలిసి పోరాడేందుకు కాంగ్రెస్‌తో రాలేదని, కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్ షాను కలిశాడు. ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా ఊడిందా?. 2018 తర్వాత నాలుగు ఉప ఎన్నికల్లో రెండు టీఆర్ఎస్, రెండు బీజేపీలు గెలిచాయ్. ఒక ఎమ్మెల్యే పదవి పోయినా కాంగ్రెస్‌కు పోయేది ఏమీ లేదు. అందులో నొప్పేంటి? కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోదీ.. ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించారు రేవంత్. నేను కాంగ్రెస్ తరపున పోరాడుతున్నా కాబట్టే నాపై కేసులు పెడుతున్నారు. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి కింద ఏం పని చేయాలని రాజగోపాల్‌రెడ్డి అంటున్నాడు. నేను 30 రోజులు జైల్లో ఉంటే.. అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్‌షా పక్కన ఉన్నప్పుడు.. నా పక్కన నిలబడటానికి నీకేం నొప్పి వచ్చింది. అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయా?. ఉప ఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే ..కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్. ఎన్నో పదవులు ఇచ్చిన కాంగ్రెస్‌నే రాజగోపాల్‌రెడ్డి మోసం చేశాడు. ఇవాళ కాంగ్రెస్‌ను మోసం చేసినవాడు.. రేపు మళ్లీ మోసం చేయడా?. తెలంగాణ సంస్కృతి అమ్ముడుపోయే సంస్కృతి కాదు.. సాయం చేసే సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల పైనే ఉంది. ప్రజలంతా కాంగ్రెస్ పక్కన నిలబడండి. నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెడతాం అంటూ ఆగ్రహం వెల్లగక్కారు రేవంత్‌రెడ్డి. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, జానా రెడ్డి, దామోదర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సీతక్క తదితరులు మనుగోడులో కాంగ్రెస్‌ను గెలిపించాలని, పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. చదవండి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మా కుటుంబసభ్యుడు-రేవంత్‌రెడ్డి ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడను-కోమటిరెడ్డి వెంకటరెడ్డి -
అమిత్ షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్
సాక్షి, ఢిల్లీ: నల్లగొండ రాజకీయ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో ఇవాళ తెలంగాణ రాజకీయాలను వేడి పుట్టించారు. శుక్రవారం మధ్యాహ్నాం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. అయితే విడివిడిగానే.. ముందుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అమిత్ షాను కలిశారు. బీజేపీలో చేరిక, మునుగోడు బహిరంగ సభపై చర్చించినట్లు తెలుస్తోంది. అధికారికంగా మునుగోడు సభలోనే చేరతారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్‌లోనే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణ వరద సహాయం కోసమే హోం మంత్రిని కలిశానని, వరద కష్టాలపై షాతో చర్చించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వరదలతో రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను ఈ భేటీకి వెళ్లకపోయి ఉంటే.. రాష్ట్రానికి నష్టం జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పదవీత్యాగం చేసిన వ్యక్తిని తానని, పదవుల కోసం వెంటపడే వ్యక్తిని కాదని, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే బరాబర్ చెప్పి పోతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
Munugode Politics: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేసిన వ్యాఖ్యలపట్ల వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రేవంత్ పెద్ద తప్పు చేశారు తాజాగా జరిగిన పరిణామాలు సైతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అసహనం కలిగించాయి. చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్‌రెడ్డి అన్నారు. (చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?) పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడు వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో శుక్రవారం ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. (చదవండి: పావులు కదుపుతున్న హస్తం నేతలు.. రేవంత్‌పై ఢిల్లీ పెద్దలు సీరియస్!) -
కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు దారి తీసిన పరిణామాలను లేఖలో వివరించారు. తీవ్రంగా బాధించింది: కోమటిరెడ్డి గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా సోనియా గాంధీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా, ఎక్కడా రాజీపడకుండా కష్టపడ్డానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ప్రస్తావించారు. కానీ పార్టీకి విధేయులైన వారిని గత కొంతకాలంగా పదేపదే అవమానిస్తున్నారని అన్నారు. పార్టీ ద్రోహులు, మీ పైనే(సోనియా గాంధీ) వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వారు ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని విమర్శించారు. చదవండి: కాంగ్రెస్‌లో టెన్షన్.. టెన్షన్.. తెలంగాణలో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? ‘ఇప్పటికే అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా’నని లేఖలో పేర్కొన్నారు. 8న రాజీనామా ఈనెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో 8వ తేదీన రాజీనామా చేసిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Hyderabad: వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ -
రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల మాటల దాడి
-
రేవంత్ ఎవరి ఏజెంటో అందరికీ తెలుసు.. బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి 2017లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఏ వ్యాపారం కోసం, ఎవరి ఏజెంట్‌గా పనిచేయడం కోసం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడికి రేవంత్‌రెడ్డి ఏజెంట్ అని, ఆయన వ్యాపారాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరారన్న ఆరోపణలు నిజమని ప్రజలు అనుకోవాలా? అని వ్యాఖ్యానించారు. 14 నెలలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి విలువలకు కట్టుబడని రేవంత్‌రెడ్డి, ఇప్పుడు విలువలు, వ్యాపారాలు, ఇతర శాసనసభ్యుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. బుధవారం ఢిల్లీలో రఘునందన్ మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి విలువలున్న వ్యక్తి కాబట్టే కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారని తెలిపారు. -
రేవంత్‌రెడ్డిగారూ.. రెచ్చగొట్టకండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి,ఢిల్లీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై తొలిసారి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అయితే.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై తాను ఏం మాట్లాడనని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు. పనిలో పనిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన ‘కోమటిరెడ్డి బ్రాండ్’ కామెంట్లపైనా ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై నో కామెంట్స్. ఆయన తన ఇష్టమున్న పార్టీలోకి వెళ్తారు. ఏది ఉన్నా రాజగోపాల్‌రెడ్డినే అడగండి. చాలా కుటుంబాల్లో వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారనే విషయం గుర్తించాలి. రాజగోపాల్ వ్యవహారంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం తనతో ఎలాంటి చర్చలు జరపలేదు అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ మారతారా? అనే ప్రశ్నకు.. తాను మాత్రం కరడుగట్టిన కాంగ్రెస్ వాదినేనని.. ఉమ్మడి కుటుంబంగా పార్టీ ఆదేశాలానుసారం పని చేస్తానని చెప్పారు. రేవంత్‌పై ఫైర్ ‘‘కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే.. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు అని సంభోదించడం ఏంటి? కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్ తప్పుగా మాట్లాడారు. మేం చాలా నిజాయితీగా ఉన్నాం. మమ్మల్ని అవమానించాలని చూస్తున్నారా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్‌రెడ్డికి చురకలంటించారు. బ్రాందీషాపులు పెట్టుకునేవాళ్లమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని రేవంత్‌రెడ్డి కామెంట్లను తప్పుబట్టారు. ‘మీరు..’ అని రేవంత్‌రెడ్డిగారు వాగడం బాధించింది. ఆయన మాపై దారుణంగా మాట్లాడారు. నేను పార్టీలో పని చేసే టైంకి ఆయనసలు పుట్టలేదు. 34 ఏళ్లు కాంగ్రెస్ కోసం నా రక్తం ధార పోశా. రేవంత్గారూ అనవసరంగా నన్ను రెచ్చగొట్టవద్దు. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అయితే చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తానని, అలాగని అధిష్టానానికి ఫిర్యాదు చేయబోనని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారా?. ఇద్దరు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాలో నేను తప్ప ఎవరూ పాల్గొనలేదు. అసలు పీసీసీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఫలితం ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు.. నో కామెంట్స్ అని సమాధానం ఇచ్చారాయ. -
కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్
-
పీసీసీ పదవిని రేవంత్ డబ్బుతో కొన్నాడు
-
రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
-
‘బీజేపీ ఎంగిలి మెతుకులు కోసమే పార్టీ మార్పు’
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి.. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులు కోసమే పార్టీ మారారని రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంట్రాక్టుల కోసం, ఆర్థిక అవసరాల కోసమే పార్టీ మార్పు. ఏనుగులు తినే వాడు పోయి, పీనిగులు తినే వాడు వచ్చాడు. ఇతర పార్టీల నుంచి వ్యక్తులను తీసుకుంటున్నారు. నరేంద్ర మోదీని తెలంగాణ సమాజం బహిష్కరించాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది.. అయినా సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈడీ ద్వారా కేసులు పేట్టి వేదింపులు చేస్తున్నారు. సోనియా మీద గౌరవం ఉందని తియ్యని మాటలు మాట్లాడారు.సోనియాను ఈడి ప్రశ్నిస్తే , రాజగోపాల్ మాత్రం అమిత్ షా విసిరి కుక్క బిస్కెట్లు కోసం వెళ్లారు’ అని రేవంత్ విమర్శించారు. -
కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే ఇదంతా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదని.. అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సరిగా పోరాటం చేయడం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేకపోయానని, కాంగ్రెస్‌ను బాధతోనే వీడుతున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు. మంగళవారం సాయంత్రం మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని సైతం వీడుతున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై కాంగ్రెస్ సరిగా పోరాటం చేయడం లేదు కాబట్టే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోంది. అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. నా రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా. నా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ భవిష్యత్ కోసమే. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తార’’ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉద్ఘాటించారు. అసలు కాంగ్రెస్ నా మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది? నేను ఏ తప్పు చేశా?. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న మేం పని చేయాలా?. నా జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్లు ఉన్నారు. 20 ఏళ్లపాటు సోనియాను తిట్టిన ఓ వ్యక్తిని పీసీసీ చేశారు. ఆయన కింద మమ్మల్ని పని చేయమంటున్నారు. కమిటీలు వేసేటప్పుడు కూడా కనీసం మాట్లాడలేదు. ఇంతకన్నా అవమానం ఉందా?. సోనియా మీద ఉన్న గౌరవంతో తాను ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించదల్చుకోలేదని చెప్పారాయన. కాంట్రాక్టుల కోసం నేను రాజీనామా చేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నేతగా నా పలుకుబడిని ఏనాడూ వ్యాపారానికి ఉపయోగించుకోలేదు. నా వ్యాపారానికి, రాజకీయ జీవితానికి సంబంధం లేదు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఈ పదవీ త్యాగంతో ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని పేర్కొన్నారు. బీజేపీలో చేరతారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడే పార్టీతో ఉంటానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై తన కార్యకర్తలు, అనుచరులతో చర్చిస్తానని చెప్పారు. ఆ తర్వాతే ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని చెప్తానని ఆయన స్పష్టత ఇచ్చారు. తన ఆవేదనను మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. -
మునుగోడు కోసమే నా రాజీనామా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశం నాకు లేదు. మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్ బుక్‌లు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తోంది.. చేస్తోందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థినే తాను గెలిపిస్తానని టీఆర్ఎస్కు చెప్పానని, అయినా ఎటువంటి పురోగతి లేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారాయన. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అని.. పదవులు, కాంట్రాక్టులు కావాలనుకుంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్‌ను తీసుకుని బాగుపడేవాళ్లమని ఆయన అన్నారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రెస్మీట్లో ఏం చెప్పబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: అన్ని సమస్యలకు తన రాజీనామానే పరిష్కారం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత, మునుగోడు(నల్లగొండ) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం సాయంత్రం మీడియా ముందుకు రానున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ మీడియా సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అసలు ప్రెస్మీట్లో ఏం చెప్పబోతున్నానే దానిపై ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్లు మంతనాలు జరిపినా లాభం లేదు. చివరికి పెద్దలతో ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పంపిన రాయబారానికి సైతం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించలేదు. ఈ తరుణంలో.. పార్టీ వ్యతిరేక మంతనాలు సాగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆయనపై గుర్రుగా ఉంది. అయితే ఏ క్షణమైనా కాంగ్రెస్ వేటు వేసే అవకాశం ఉండడంతో.. తానే పార్టీని వీడాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన రాజీనామానే అన్ని సమస్యలకు పరిష్కారం అని వ్యాఖ్యానించినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ను వీడి కాషాయపు పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఈ వారంలోనే ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు-బండి సంజయ్ -
మునుగోడుకు బయల్దేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
-
మునుగోడు ఉపఎన్నిక ఖాయం: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉపఎన్నిక వస్తుంది. మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలి. ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. నేను కేసీఆర్‌పై ధర్మ యుద్ధం చేస్తున్నా. పదిహేనురోజుల్లో నా నిర్ణయం ఉంటుంది. అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఉత్తమ్, వంశీచంద్‌రెడ్డిలతో ఢిల్లీ రావాలంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కబురు పంపినట్లు సమాచారం. అయితే.. కోమటిరెడ్డి మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు ఆదివారం నుంచి ఆయన తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజయోకవర్గంలో పర్యటించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. -
రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్.. కాంగ్రెస్ బుజ్జగింపులు కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. గత కొన్నిరోజులుగా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని, బీజేపీకి వెళ్తారని.. విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ మారే విషయంపై ఆయన నేరుగా స్పందించకుండానే రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ఇంటికే క్యూ కడుతున్నారు. తాజాగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ముగిసింది. రాజగోపాల్‌రెడ్డి ఇంట్లో గంటపాటు ఈ ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడకుండా ఆపే బాధ్యతను ఉత్తమ్‌కు అప్పగించింది ఏఐసీసీ. అదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సైతం రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీళ్ల భేటీ తాలుకా సారాంశం మాత్రం బయటకు రాలేదు. మునుగోడులో పర్యటన ఇదిలా ఉండగా.. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ(శనివారం) చౌటుప్పల్, సంస్థాన్ నారాయణ పురం, మునుగోడు మండలాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తారన్న ప్రచారం తర్వాత తొలిసారిగా మునుగోడుకు వస్తున్న ఆయన.. మధ్యాహ్నాం మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. -
డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు మరో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమని, సమరశంఖం పూరిస్తామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. వందిమాగధులు, వందల కోట్ల డబ్బు సంచులతో వచ్చే కేసీఆర్.. ఆయన కౌరవసేనను ఎదిరించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రాన్ని సొంత కుటుంబ ఆస్తిగా మార్చుకుని ప్రజాకంఠక పాలన చేస్తున్న కేసీఆర్‌పై అతి త్వరలో యుద్ధప్రకటన చేయబోతున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి– సంక్షేమ పథకాలను అమలు చేసే సీఎం.. మునుగోడుపై కక్షగట్టి మూడున్నరేళ్లుగా నిధులు మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు 90శాతం పనులు 2014 కంటే ముందే పూర్తయినా... తనను గెలిపించారన్న అక్కసుతో దాన్ని పక్కకుపెట్టారని ఆరోపించారు. హుజూరాబాద్ మాదిరిగా అన్ని పథకాలు అమలు చేస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఇంతకుముందే చెప్పానని గుర్తుచేశారు. సొంత ఆస్తులు పెంచుకుంటూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాలకు కేసీఆర్ తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. డైలమా, వెనకడుగు తన రక్తంలోనే లేదని.. సొంత అవసరాల కోసమో, పదవుల కోసమో చేస్తున్న పోరాటం తనది కాదన్నారు. ఇప్పటికే సన్నిహితులు, ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించే కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు. -
రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒకౖవెపు ఆయన పార్టీని విడిచి వెళ్లకుండా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది అనుచరులు కూడా పార్టీని వీడొద్దని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. అయితే ఆయన పార్టీ మారడానికే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆయన పార్టీ మారడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తథ్యమని తెలుస్తోంది. దిగ్విజయ్ ఫోన్ పార్టీ వీడే అంశంపై నియోజకవర్గ అనుచరగణంతో రాజగోపాల్‌రెడ్డి వరుస సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా.. పార్టీ వీడొద్దని కొంతమంది అనుచరులు చెప్పినట్లు తెలిసింది. ఆయన మాత్రం నాలుగైదేళ్లుగా పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించిందన్న విషయాన్నే వివరించినట్లు సమాచారం. కాగా బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన రాష్ట్ర నేతలు.. రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తద్వారా అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేయడం హైకమాండ్ ఆలోచనను స్పష్టం చేసింది. పార్టీ మారవద్దని సూచించడంతో పాటు ఏదైనా ఉంటే రెండురోజుల తర్వాత ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేపు రాజగోపాల్‌తో భేటీ! మరోవైపు ఉదయం ఢిల్లీలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై రెండు గంటల పాటు చర్చించారు. ఆయన పార్టీలోనే ఉండేలా చూడాలని అధిష్టానం వీరికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా శనివారం సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెంచుతున్న బీజేపీ! మరోవైపు పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వైపు నుంచి రాజగోపాల్‌పై ఒత్తిడి పెరిగి నట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, శుక్రవారం బండి సంజయ్, ఈటల, కిషన్‌రెడ్డి తదితర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన్ను ఎలాగైనా ఢిల్లీ తీసుకెళ్లాలని సంజయ్, ఈటల తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ అధిష్టానం బుజ్జగింపులతో రాజగోపాల్ రెడ్డి శాంతిస్తారా? పార్టీని వీడే విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతారా? అనే విషయమై కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి తాజా పరిణామాలకు ముందే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాజాగా అధిష్టానం రంగంలోకి దిగడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. శనివారం నాటి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అధిష్టానం బుజ్జగింపులు, అనుచరుల అభిప్రాయంతో రాజగోపాల్‌రెడ్డి కొంత సందిగ్ధంలో పడినా, ఏఐసీసీ దూతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా.. బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
సాక్షి కార్టూన్ 29-07-2022
-
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ ఫోన్
-
టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. కీలకంగా మారనున్న ఫోన్‌కాల్!
Komatireddy Raj Gopal Reddy.. తెలంగాణలో పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. పొలిటికల్ లీడర్లు పార్టీలు మారుతుండటం రాజకీయంగా ప్రాధానత్యను సంతరించుకుంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. తాజాగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం పార్టీ నేతల కదిలికలపై ఫోకస్ పెంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలోపడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోమటిరెడ్డితో చర్చలు జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజగోపాల్ రెడ్డితో చర్చించేందుకు మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని దూతగా పంపాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. రాజగోపాల్‌ను ఒప్పించే బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించింది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ శనివారం చర్చలు జరుపనున్నారు. మరోవైపు.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు. కాగా, గురువారం ఉదయం రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రోజుల్లో ఢిల్లీకి రావాలని కోరారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: గ్రేటర్‌లోనూ కమలం వల! ఆకర్ష ఆపరేషన్ -
Komatireddy: కఠిన చర్యలకు సిద్ధం.. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు బీజేపీయే ప్రత్యామ్నాయం అంటూ పదే పదే వ్యాఖ్యానించడం, సోనియాను ఈడీ విచారించడం సరైనదే అన్నట్టుగా.. చట్టం తనపని తాను చేసుకుని పోతుందంటూ మాట్లాడటాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. లాభనష్టాలపై నేతల తర్జనభర్జనలు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతారనే అంశంపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు చర్చించారు. ఆయనపై వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినా.. దానివల్ల లాభమా..? నష్టమా..? అన్న అంశంపై తర్జన భర్జనలు పడినట్లు తెలిసింది. తొలుత షోకాజ్ నోటీసు ఇచ్చి తర్వాత సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా చర్చించినట్లు చెబుతున్నారు. అయితే ఆయన వ్యవహారం పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తోందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడినట్లు తెలిసింది. చర్య తీసుకోకపోతే ఇంత జరుగుతున్నా అధిష్టానం మౌనంగా ఉందన్న సంకేతాలు వెళ్తాయని, ఒకవేళ వెంటనే చర్య తీసుకుంటే ఆయన వెళ్లడానికి మార్గం సుగమం చేసినట్లు అవుతుందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. మొత్తం మీద సస్పెండ్ చేయడానికే మొగ్గు చూపే అకాశాలున్నాయని సమాచారం. ఈ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించినా.. ఆరోగ్యం బాగాలేక రాలేదని తెలిసింది. కాగా ఇటీవలి కాలంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన ప్రతి వీడియోను ఏఐసీసీ వర్గాలు పరిశీలించినట్లు తెలిసింది. తాజా పరిణామాలపై బుధవారం విచారణ అనంతరం మాణిక్యం ఠాగూర్.. కేసీ వేణుగోపాల్‌కు నివేదిక సమర్పించినట్టు సమాచారం. అనుచరులతో రాజగోపాల్ వరుస భేటీలు మరోవైపు రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ తమకు ఏ విధంగా అన్యాయం చేసిందో వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, పార్టీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ కోసం పోరాడిన వారికి విలువ, గౌరవం లేదని అన్నట్టు సమాచారం. తాను బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పారని తెలుస్తోంది. ఉప ఎన్నిక రావడంతో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందంటే అందుకు ఏడాదిన్నర ముందు పదవీ త్యాగానికి సిద్ధమని ఆయన అనుచరులతో స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌తో కలిసి ఢిల్లీ వెళ్తున్నట్టుగా చెప్పారని సమాచారం. ఇంకోవైపు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికను బండి సంజయ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. కాగా బుధవారం రాత్రి ఆయనతో రాజగోపాల్‌రెడ్డి ఓ ఫామ్‌హౌస్‌లో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీలో చేరడానికి ముందు రాజగోపాల్ సర్వే చేయించుకుంటున్నారని తెలిసింది. స్పీకర్‌కు స్వయంగా రాజీనామా లేఖ? ఢిల్లీ వెళ్తున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి అమిత్‌షాను మరోసారి కలిసే అవకాశమున్నట్టు తెలిసింది. పార్టీ మారడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. తానే స్వయంగా స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదించాలని కోరతారని వారు చెబుతున్నారు. ఆయన రాజీనామా గనుక ఆమోదం పొందితే ఉప ఎన్నిక తప్పదని బీజేపీ నేతలంటున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో లాగే మునుగోడుపైనా కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బ్రదర్స్ మధ్యే పోటీయా? కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే, అది ఆమోదం పొందితే, ఉప ఎన్నిక జరిగితే.. దాని ఎఫెక్ట్ వెంకట్‌రెడ్డిపై ఉంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. మునుగోడులో వెంకట్‌రెడ్డినే అభ్యర్థిగా పెట్టాలన్న చర్చ కూడా ఏఐసీసీలో జరిగినట్టు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు కూడా ఒకటి కావడం వెంకట్‌రెడ్డికి కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఇందుకు వెంకటరెడ్డి అంగీకరించాల్సి ఉండగా.. అన్నదమ్ములు కనుక పోటీ పడితే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. -
రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అంశం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. రాజగోపాల్ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. బీజేపీ కండువా కప్పుకోకముందే అతనిపై వేటువేసే అవకాశం కనిపిస్తోంది. షాకాజ్ నోటీసులు జారీ చేయాలా.. వేటు వేయాలా అనే దానిపై ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై పీసీసీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయగా.. వీడియో క్లిప్పింగ్‌లు, పత్రిక ప్రకటనలతో నివేదిక అందించింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల, వివేక్లతో రాజగోపాల్‌రెడ్డి చర్చలు జరిపారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనుండటంతో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. చదవండి: రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు: బండి సంజయ్ -
Komatireddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మూడు ప్రధాన పార్టీలు దీనిపై దృష్టి సారించాయి. హస్తం పార్టీకి రాజగోపాల్‌రెడ్డి కొరకరాని కొయ్యగా మారితే.. ఇదే అవకాశంగా ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నికకు వెళ్లడం ద్వారా హుజూరాబాద్, దుబ్బాక తరహాలోనే మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుండగా.. ఉప ఎన్నిక అనివార్యమైతే వచ్చే సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం ద్వారా కారు చెక్కు చెదరలేదని నిరూపించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. రెండు, మూడేళ్లుగా ఇదే వరస కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్‌రెడ్డి గడిచిన రెండు మూడేళ్లుగా పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న, పిలుపునిస్తున్న ఏ కార్యక్రమంలోనూ ఆయన పాలుపంచుకోవడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్నియమితులైన తరువాత ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ అగ్ర నాయకుల్లో ఒకరైన అమిత్‌షాతో టచ్‌లో ఉంటూ కాంగ్రెస్‌పై విమర్శలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి.. మూడు నాలుగురోజుల క్రితం ఢిల్లీలో అమిత్ షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అప్పుల వ్యవహారం తదితర అంశాలతోపాటు బీజేపీలో చేరే అంశంపై కూడా చర్చించారనే వార్తలు వెలువడ్డాయి. తద్వారా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మునుగోడు నియోజకవర్గం వైపు మళ్లాయి. కాంగ్రెస్‌లో కలకలం బీజేపీలోకి వెళ్లడం ఖాయమంటూ వచ్చిన వార్తలకు సోమవారం వివరణ ఇచ్చే సమయంలో.. సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే రాష్ట్రంలో కేసీఆర్‌ను మట్టి కరిపించే సత్తా ఉంది..’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన తరువాత కూడా ఆయన మాటల్లో ఏమాత్రం మార్పులేక పోవడం గమనార్హం. చర్యల్లేవు..ఖండనల్లేవు! రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తునట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోక పోవడం, రాష్ట్ర నాయకులెవ్వరూ కనీసం రాజగోపాల్ వ్యాఖ్యలను ఖండించకపోవడం, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయకపోవడం గమనార్హం. దీనిని పార్టీ నాయకులు కొందరు తప్పుపడుతున్నారు. అదే బీసీ వర్గాలకు చెందిన నాయకులకైతే వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని, కానీ రాజగోపాల్‌రెడ్డిపై చర్యకు ఎందుకు వెనకాడుతున్నారని రాజ్యసభ మాజీ ఎంపీ ఒకరు ప్రశ్నించడం గమనార్హం. అయితే అధిష్టానం ఆదేశిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమని రాష్ట్ర క్రమ శిక్షణా కమిటీ నాయకులు చెప్పడం విశేషం. ఉప ఎన్నిక కసరత్తు మొదలు? రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, ఉప ఎన్నిక అనివార్యమైతే.. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతారనే వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి, దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెండురోజుల కిందట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పద్మశాలీలు, గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ నాయకుడు ఎవరైనా ఉంటే.. వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. అదే పనిలో కమలనాథులు ఉప ఎన్నిక జరిగితే సత్తా చాటేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. నియోజకవర్గంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, తదితర అంశాలపై ఒక స్వతంత్ర సంస్థ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. మునుగోడు ప్రజలేమనుకుంటున్నారు, రాజ్‌గోపాల్‌రెడ్డి వైఖరిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది, అధికార టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? అక్కడ ప్రధానంగా ఏయే సమస్యలున్నాయి, రాజకీయ సమీకరణలు, బీజేపీకి ఏ మేరకు మొగ్గు ఉండబోతోందన్న అంశాలపై లోతైన అధ్యయనం చేయిస్తోంది. కారు జోరు తగ్గకుండా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు జిల్లా ముఖ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. మునుగోడు పరిస్థితిపై లోతుగా ఆరా తీశారు. హుజూరాబాద్‌లో పరాజయంతో ఎదుర్కొంటున్న విమర్శలకు దీటుగా జవాబివ్వాలనే యోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే క్రమంలో ఎంతో కాలంగా గట్టుప్పల్ మండల కేంద్రం కావాలన్న అక్కడి ప్రజల డిమాండ్‌ను నెరవేరుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేలా పావులు కదిపారు. ఇతర ఉప ఎన్నికలకు భిన్నం... 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు జరిగిన వివిధ ఉప ఎన్నికలకు ఏదో ప్రాధాన్యత ఉండగా మునుగోడు పరిస్థితి భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఎంపీగా గెలిచాక ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో హుజుర్నగర్ ఉప ఎన్నిక జరిగింది. నాగార్జునసాగర్, దుబ్బాకలలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో, టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ తొలగింపు, రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఇందుకు భిన్నమైన కారణాలు మునుగోడుకు ఉన్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికను కోరుకుంటున్న దాఖలాలు లేవు. అందువల్ల కేవలం రాజకీయ బలాబలాలు నిరూపించుకునేందుకు ఉప ఎన్నిక జరిగితే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్‌కు రాజీనామాపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ.. ఉహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బీజేపీలోకి చేరుతున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోంది. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నేను బహిరంగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాను. అమిత్ షాతో రాజకీయాల గురించి మాట్లాడలేదు. నేను అమిత్ షాను కలిసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నట్టు టీఆర్ఎస్ అనుకూల పేపర్లలో రాయిస్తున్నారు. రాజీనామా చేస్తున్నానని, ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చెప్పే పార్టీ మారుతాను. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధమే’’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! -
కోమటిరెడ్డి బీజేపీలో చేరిక?!.. టీఆర్ఎస్ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరే పక్షంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తదితరాలపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితి, నేతల పనితీరుకు సంబంధించిన ప్రాథమిక నివేదికలు ఇప్పటికే కేసీఆర్‌కు చేరగా, మరింత లోతుగా వివరాల సేకరణకు సర్వే సంస్థలను పురమాయించినట్లు తెలిసింది. సుదీర్ఘ చర్చ..సూచనలు పార్టీ మారతానంటూ రాజగోపాల్‌రెడ్డి చాలా కాలంగా సంకేతాలు ఇస్తున్నా ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచడం, పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం వంటి పరిణామాలతో ఆయన బీజేపీలో చేరవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడు అసెంబ్లీ స్థానంపై ఇప్పటినుంచే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు స్థానికంగా పార్టీ నాయకుల నడుమ సమన్వయ సాధనతో పాటు, నియోజకవర్గంలో పర్యటనలు పెంచాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ కూడా ఉండటం గమనార్హం. మునుగోడుపై పీకే బృందం నివేదిక! మునుగోడు నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కూసుకుంట్లప్రభాకర్రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబ నేపథ్యం, ఆర్థిక సంపత్తి, వ్యాపార లావాదేవీలు, బలాలు, బలహీనతలు, గెలుపు అవకాశాలు తదితరాలపై గతంలోనే పీకే బృందం నివేదిక అందజేసినట్లు సమాచారం. ఇక్కడ గెలుపోటములకు సంబంధించి ఇద్దరి పరిస్థితి సమానంగానే ఉన్నట్టుగా నివేదిక వెల్లడించినట్లు తెలిసింది. వీరితో పాటు కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవికుమార్ ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వీరిలో ఎవరికి టికెట్ దక్కినా ఇతరుల విజయావకాశాలను దెబ్బతీస్తారని ఆ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. ఎవరి ప్రభావం ఎంత? రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే పక్షంలో ఆ పార్టీలో పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్ నేత, పల్లె రవికుమార్, బీజేపీలో రాజగోపాల్‌రెడ్డితో పాటు గొంగిడి మోహన్‌రెడ్డి, డోనూరు వీరారెడ్డి, ఎరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, బీఎస్పీలో పెండెం ధనుంజయ వంటి నేతలు ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపగలరనే కోణంలోనూ టీఆర్ఎస్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా మరింత విస్తృత సర్వేలు, నివేదికల కోసం టీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. -
Komatireddy Rajagopal Reddy: ‘హ్యాండ్’ ఇచ్చిన రాజగోపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీలోకి వెళ్తానని చాలారోజుల క్రితమే బహిరంగంగా ప్రకటించిన ఆయన ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరిక అంశాన్ని తన అనుయాయులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న కాంగ్రెస్‌పై రాజగోపాల్ రెడ్డి పెద్ద పిడుగు వేశారని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని... ఏడాదిన్నర క్రితం ఒక రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని, తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని కార్యకర్తతో మాట్లాడిన ఆడియో రాజకీయంగా సంచలనం రేపింది. అప్పుడే బీజేపీలోకి వెళ్తారని భావించినా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వద్దని వారించినట్టు రాజగోపాల్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే తాజాగా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైన ఆయన.. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే బీజేపీయే కరెక్ట్‌అని, కాంగ్రెస్‌లో ఆ శక్తి కనిపించడంలేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలంటే బీజేపీయే సరైన పార్టీ అని భావిస్తున్నట్టు ఆయన తన అనుచరులకు చెప్పినట్టు తెలిసింది. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని, తన నియోజకవర్గ బాగోగుల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని చెప్పినట్టు సమాచారం. అకస్మాత్తుగా యూటర్న్! పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు పార్టీ అధిష్టానంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌కు రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. అలా చెప్పిన ఆయన ఇంత అకస్మాత్తుగా యూటర్న్ తీసుకొని బీజేపీలోకి వెళ్లడం వెనుకున్న ఆంతర్యం ఏంటన్న దానిపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీ మారేందుకు శుక్రవారం మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో విందు భేటీ పెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు దాన్ని రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కీలక నేతలంతా రాజగోపాల్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాగా, ఆయన సోదరుడు, ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటానని, తాను చనిపోయినా.. తన మృతదేహంపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని చెప్పిన సంగతి విదితమే. ►కేసీఆర్‌ను ఓడించే గట్టి పార్టీలో ఉంటా. బీజేపీలో చేరే విషయంపై గతంలోనే చెప్పా. పార్లమెంట్ ఆవరణలో అమిత్ షాతో భేటీ జరిగింది. పార్టీలో చేరే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పా. – రాజగోపాల్ రెడ్డి -
తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్
సాక్షి, నల్గగొండ: తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. ‘‘బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం ఖాయం. కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతా. నేను ఏం చేయబోతున్నానో త్వరలోనే ప్రకటిస్తా’’ అని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే.. జ్వర లక్షణాలు కనిపించడంతో వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండ మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌రెడ్డి.. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే సీనియర్ల హామీతో ఆయన కొంతకాలం ఓపిక పట్టారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆయన కాషాయపు కండువా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ తరపున భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డితో కలిపి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన వాళ్లూ ఉన్నారు. -
బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుంది : రాజగోపాల్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వీహెచ్ భేటీ.. బుజ్జగింపులు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ మారతారనే ప్రచారం టీ కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని ఒక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ప్రకటనతో.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని, అవమానం జరిగే చోట ఉండలేనని కోమటిరెడ్డి, వీహెచ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే.. పాత కాంగ్రెస్ నేతలంతా బయటకు వెళ్తే పార్టీ దెబ్బ తింటుందని వీహెచ్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరి వాళ్లతో ఈ అంశంపై చర్చిస్తానని వీహెచ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం 11 గంటలకు జరగబోయే సీనియర్ల భేటీకి రావాలంటూ రాజగోపాల్‌రెడ్డిని వీహెచ్ కోరినట్లు సమాచారం. ఈ భేటీలో అసంతృప్త సీనియర్లంతా హాజరై.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆహ్వానంపై రాజగోపాల్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఈమధ్య జరిగిన ఓ ఘటన ఆయన అసంతృప్తికి కారణమైంది. మంత్రి తలసానితో జరిగిన వ్యక్తిగత వ్యాఖ్యలు.. మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు అండగా నిలబడలేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గౌరవం లేని చోట ఉండలేనని, తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానని, నమ్మి తన వెంట వచ్చేవాళ్లు రావొచ్చంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. -
కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కాక.. టీకప్పులో తుపానా? పార్టీ మారడం పక్కానా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం మరోమారు చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి వరకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశం కాంగ్రెస్ పార్టీలో రక్తి కట్టించగా, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఆయన అవే సమావేశాల వేదికగా సీఎల్పీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక ఎత్తయితే, కేసీఆర్‌తో కొట్లాడే వేదికనే తాను ఎంచుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలున్నారని, ఆయనపై కాంగ్రెస్ గట్టిగా బాధ్యత తీసుకుని కొట్లాడితే కాంగ్రెస్‌లోనే ఉంటానని, పార్టీ పక్షాన 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, కేడర్ ఇప్పటికీ ఉందని, కలిసికట్టుగా పని చేస్తే అధికారంలోకి వస్తామని కూడా చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన ఆయన తాను పార్టీ మారలేదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తన పదవులకు రాజీనామా చేసి వెళ్తానని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ కేసీఆర్‌పై కొట్లాడే వాళ్లతోనే తాను ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. సోదరుల తీరుపై చర్చ మరోవైపు అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, అదే రోజున భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలవడంతో బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలను అధికారికంగా, అనధికారికంగా ఎక్కడా సోదరులు కానీ ఆయన అనుచరులు కానీ ఖండించడం లేదు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ విలక్షణ రాజకీయం ఎటువైపు వెళుతుంది? కాంగ్రెస్‌లోనే ఉంటారా? పార్టీని వీడతారా? లేదంటే ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ఈ వ్యవహారం టీకప్పులో తుపానులా మారుతుందా? అన్నది కాంగ్రెస్ సహా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
‘మునుగోడుకు రూ.2వేల కోట్లిస్తే రాజకీయ సన్యాసం చేస్తా’
చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్లు ఇస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో ఉన్న 20 వేల దళిత కుటుంబాలున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయలబ్ధి కోసం హుజూరాబాద్‌లో అమలు చేస్తోన్న దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
గందరగోళంగా మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక
-
‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’
సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్న కారణంగానే బీజేపీలోకి చేరకుండా ఆగుతున్నానని, ఆ పార్టీలోకి ఎప్పుడు చేరేదీ త్వరలోనే చెబుతానని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని అందుకే తనకు జారీ చేసిన షోకాజ్‌కు సమాధానం ఇచ్చానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రజలు 19 మందిని గెలిపించినా కేవలం నాయకత్వలోపం వల్లే 12 మంది పార్టీ ని వీడారని ఆరోపించారు. టీపీసీసీ నాయకత్వ లోపాలను తాను మీడియా ముందు ఎత్తిచూపినందుకు, పార్టీకి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ప్రస్తావించినందుకు తనకు షోకాజ్ నోటీసులు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీని, మోదీ పాలనను పొగిడిన విషయం వాస్తవమేనన్నారు. తనకు బీజేపీలో తలుపులు మూసుకుపోలేదన్నారు. తనకు కాంగ్రెస్‌లో పదవులు ముఖ్యం కాదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్న టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. మాతో రండి.. మీడియా పాయింట్లో రాజగోపాల్‌రెడ్డికి శ్రీధర్‌బాబు ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. సభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్లో రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతున్న సమయంలోనే కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పోదెం వీరయ్యలు అక్కడకు చేరుకున్నారు. రాజగోపాల్ మాట్లాడేంతవరకు వేచి చూసిన తర్వాత ‘కాంగ్రెస్ తరఫున విలేకరులతో మాట్లాడేందుకు వెళ్తున్నాం.. నువ్వు కూడా కాంగ్రెస్ సభ్యుడివే కదా మాతోపాటు రండి’అంటూ శ్రీధర్‌బాబు ఆయనను ఆహ్వానించారు. అందుకు రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘రావాల్నా..సరే వస్తున్నా మీరు వెళ్లండి’అంటూ వారికి బదులిచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే విలేకరులతో మాట్లాడిన రాజగోపాల్ కాంగ్రెస్ సభ్యుల వద్దకు వెళ్లకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. -
కచ్చితంగా పార్టీ మారతా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మునిగిపోయే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, తాను కచ్చితంగా ఆ పార్టీని వీడతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో మిగిలిన సభ్యులను ఎలా పరిగణిస్తారన్న విషయంలో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనలాంటి యువత, దేశ యావత్ ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని, రాష్ట్రంలో కూడా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఒక్క బీజేపీకే అవకాశముందని చెప్పారు. అందుకే ఆ పార్టీకి దగ్గరవుతున్నట్లు ఆయన తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీకి దగ్గరవుతున్నట్టు చెప్పారు. -
అందుకే సీఎం అని మాట్లాడాను : రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపేందుకే తాను పార్టీ మారుతున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నయం అని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా ఎవరిని తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. తన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సీఎం అని మాట్లాడినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్న రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను బీజేపీలోకి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరినట్టు వెల్లడించారు. ఈ విషయంపై రాం మాధవ్‌ను కలిసి చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లిన టీపీసీసీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. తనకు షోకాజ్ ఇచ్చే నైతిక అధికారం టీపీసీసీకి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావ అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగా లేదని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ను కొనసాగించడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. బీజేపీలో ఎలా చేరాలనే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. రానున్న జమిలి ఎన్నికలతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చదవండి : బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి -
‘పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి’
సాక్షి, హైదరాబాద్ : రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మంచి ఫైటర్ అనే విషయం మొన్నటి ఎన్నికల్లో తెలిసిందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగుతారని కుంతియా స్పష్టం చేశారు. ఉత్తమ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తోన్న డిమాండ్‌ను ఆయన తోసి పుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కుంతియా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం.. టికెట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా అని కుంతియా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 29 నాగార్జున సాగర్‌లో రాష్ట్రకార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహ రచన కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్ర స్థాయి నివేదిక తెప్పించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. -
రాజగోపాల్‌రెడ్డికి ఊహించని పరిణామం..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని వీడనున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు రాజగోపాల్‌రెడ్డి అంబర్‌పేటలోని కళ్లెం బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభం కాగానే మెజారిటీ కార్యకర్తలు జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినవారిలో ఒకరైన చౌటుప్పల్ ఎంపీపీ వెంట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. కొంత మంది నాయకులు రాజగోపాల్‌రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని గుర్తుచేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాలని చూస్తున్నారని విమర్శించారు. మరోవైపు కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం లేదు. మీరు వచ్చిన రాకపోయిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను పదవుల కోసం పార్టీ మారడం లేదు. కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం. రాజకీయంగా నన్ను ఏమీ చేయలేక.. నా సుశీ కంపెనీని భూ స్థాపితం చేశారు. నా కుటుంబ సభ్యుడు చిరుమర్తి లింగయ్యను టీఆర్ఎస్లో చేర్పించుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నియంతలాగా పాలిస్తున్నారు.. నా నిర్ణయం చరిత్రను మారుస్తుంది. భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆత్మ విశ్వాసం కల్పించలేకపోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటే.. మళ్లీ మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని జనాలు అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర పెడదమా.. పోరాటం చేద్దామా మీరే నిర్ణయం తీసుకోండి’ అని అన్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నయామని వ్యాఖ్యనించిన రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడనున్న రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చదవండి : ‘ప్రజలే కాంగ్రెస్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తారు’ -
‘ప్రజలే కాంగ్రెస్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తారు’
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కాదని.. ప్రజలే ఆ పార్టీకి షోకాజ్ నోటీసులు ఇస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడంతో పాటు.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నయం అని వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం నల్లగొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ నేతలు గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తను నిజాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు జీర్ణం కావడం లేదన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో తప్పుచేశారని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణలో కాంగ్రెస్ కోలుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ క్యాడర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై మాట్లాడితే.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. తాము గాంధీ భవన్ నేతలం కాదని.. ప్రజల మునుషులమని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్, మై హోమ్ రామేశ్వరరావులతో కేసీఆర్ నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ పార్టీ నుంచి తప్పుకుంటేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. -
రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలపై ఆరా తీసిన అధిష్టానం పెద్దలు... ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ సహా నేతలందరిపై విమ ర్శలు చేసిన రాజగోపాల్రెడ్డిపట్ల ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని టీపీసీసీ భావిస్తున్నట్టు సమాచారం. రాజగోపాల్‌పై చర్యలు తీసుకుంటే పార్టీ మారేందుకు ఆయనకు అవకాశం ఇచ్చిన వారవుతామనే భావనలో ఉన్న గాంధీ భవన్ వర్గాలు ఇప్పుడు ఏం చేస్తాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. నేడు కమిటీ భేటీ... వాస్తవానికి ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ కొందరిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు సోమవారం భేటీ కావాలని పార్టీ క్రమశిక్షణా సంఘం గతంలోనే నిర్ణయించింది. ఈలోగా రాజగోపాల్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చినందున సోమవారం జరగనున్న భేటీలో ఈ అంశం కూడా చర్చకు రానుంది. రాజగోపాల్ వ్యాఖ్యలను సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవసరమనుకుంటేనే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్ జారీ చేసి రాజగోపాల్‌పై చర్యలకు ఉపక్రమిస్తే ఆయనకు పార్టీ మారే స్వేచ్ఛను తామే ఇచ్చినట్టు అవుతుందని, ఆ వ్యూహంతోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారని, రాజగోపాల్ ట్రాప్‌లో తాము ఎలా పడతామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. తమపై ఆరోపణలు చేసే ముందు రాజగోపాల్ ఆత్మవిమర్శ చేసుకోవాలని, సొంత మండలంలో తన సోదరుడిని జెడ్పీటీసీగా గెలిపించుకోలేకపోవడంలో బాధ్యులెవరని ఆ నేత ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి 19 వేల మెజారిటీ వస్తే ఎంపీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వెంకట్‌రెడ్డికి కేవలం 4 వేల మెజారిటీయే వచ్చిందని, దీనికి బాధ్యులెవరో రాజగోపాల్‌రెడ్డి తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. రాజగోపాల్ వ్యూహాన్ని తిప్పికొడతామని, పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని, అప్పుడు స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ వ్యవహారంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై టీపీసీసీ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. రాజగోపాల్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన పని లేదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లోనే ఉంటా... తన సోదరుడు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. రాజగోపాల్ వ్యాఖ్యలతో తనకేం సంబంధం లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మొదటి నుంచీ చెబుతున్నానని, దానికే కట్టుబడి ఉంటానని వెంకట్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ చెరో బాట పడతారా? కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్‌పై చర్యలు తీసుకుంటుందా.. కనీసం షోకాజ్ నోటీసు అయినా ఇస్తుందా లేక రాజగోపాల్ వ్యూహాన్ని తిప్పికొట్టేలా వ్యవహరించి ఆయన పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేçస్తుందా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ముఖ్యులతో రాజగోపాల్ సంప్రదింపులు... పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదివారం పలువురు కాంగ్రెస్ ముఖ్యులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తనతో సన్నిహిత సంబంధాలున్న నేతలతో ఆయన మాట్లాడినట్టు సమాచారం. పార్టీపై తాను ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది వారికి వివరిస్తూనే భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలకు అండగా ఉండాలని ఆయన కాంగ్రెస్ ముఖ్యులను కోరుతున్నట్టు తెలుస్తోంది. -
టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకొనే అవకాశం కనిపించడం లేదని, అది మునిగిపోయే పడవని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబ నియంతృత్వ ధోరణులను అడ్డుకోవాలంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ తప్ప మరొక పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో డిండి ప్రాజెక్టు నిర్వాసితులతో జరిగిన సమీక్ష సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. కుంతియా, ఉత్తమ్ ఫెయిల్... అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకొని ఉండాల్సిందని రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా పార్టీని సమన్వయపరచలేక పోయారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయిందని, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే నాథుడే లేరని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా ఉత్తమ్ మాత్రం అలా ఆలోచించలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదు... రాష్ట్రంలో టీఆర్ఎస్ను, నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదని, కేసీఆర్‌ను, ఆయన కుటుంబ పాలనను ఢీకొట్టాలంటే ప్రధాని మోదీ వంటి నేతకే సాధ్యమని పేర్కొన్నారు. పీసీసీ సారథ్యాన్ని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అంతా అయిపోయింది’అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న అంశంపై మాట్లాడుతూ భువనగిరిలో కేవలం తమ కుటుంబ బ్రాండ్ ఇమేజ్ వల్లే గెలిచామని, కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు. నల్లగొండలో తామంతా కష్టపడ్డామని, అందుకే ఉత్తమ్ గెలిచారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పోటీలో ఉన్నామని, పార్టీ నాయకులు ఉత్తమ్, జానారెడ్డి వంటి వారు ఆ ఎన్నికను సీరియస్‌గా తీసుకోలేదని, అందుకే ఓడిపోయామన్నారు. కార్యకర్తలు, కుటుంబంతో మాట్లాడాకే పార్టీ మార్పుపై నిర్ణయం... బీజేపీలో చేరాలని తాను ఇంకా నిర్ణయించుకోలేదని, భవిష్యత్తులో ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే తమకు కృతజ్ఞత ఉందని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో బలపడటంలో మాత్రం కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిపై నాయకత్వం ఆలోచన చేయాలని, డీకే అరుణ వంటి నాయకులు బీజేపీలోకి ఎందుకు వెళ్లిపోయారో సమీక్షించుకోవాలని సూచించారు. -
‘నాయకత్వాన్ని మార్చాలని కోరుతున్నా’
హైదరాబాద్: బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రాజగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చెప్పా..ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి వరకు అభ్యర్థులనే ప్రకటించక పోవడం వల్ల చాలా నష్టం జరిగిందని వాపోయారు. మాలాంటి వాళ్లకు కూడా ఆఖరి వరకు కూడా టిక్కెట్లు ఇవ్వలేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలలో కనీసం 8 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ మార్పు అవసరమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్తుంటే జోష్ రావడం లేదని వ్యాక్యానించారు. నాయకత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్లు చెప్పారు. -
‘ఆ మంత్రులు మా సర్పంచ్‌తో సమానం’
సాక్షి, నల్గొండ : టీఆర్ఎస్లోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలు తమ పార్టీలోని సర్పంచ్‌తో సమానమని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి సోమవారం ఘన స్వాగతం లభించింది. ఆయన సమక్షంలో టీఆర్ఎస్కి చెందిన 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. రాజగోపాల్ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను పట్టుకొని కేసీఆర్ అమ్మ, బోమ్మ అంటూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. రెండువేల రూపాయల పెన్షన్‌పై మొదటి సంతకం చేసేటట్లు, ఇళ్లు కట్టుకున్న వాళ్లకి రూ.5లక్షలు తక్షణమే ఇచ్చేటట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని రాజగోపాల్ పేర్కొన్నారు. -
ఏదో ఆవేశంలో అలా మాట్లాడా: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ : ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలను పట్టుకొని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. క్రమశిక్షణ సంఘం, పార్టీ హైకమాండ్లు ఏ చర్య తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను రాష్ట్ర నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, ఇటువంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్నోకేసులు పెట్టి వేధించారని, అయినా పార్టీ కోసం కార్యకర్తలు.. తను కష్టపడుతున్నామని పేర్కొన్నారు. మునుగోడు నుంచి పోటీచేయమని అక్కడి ప్రజలు కోరుతున్నారని, ఇక్కడ సీటిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతానన్నారు. ప్రతి ఎమ్మెల్యే సీటు ముఖ్యమేనని, గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలన్నారు. తొలి షోకాజ్ నోటీసుకే సమాధానం ఇచ్చానని, రెండోసారి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని ఆయనకు ఈ నెల 21న షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసుకు రాజగోపాల్ ఇచ్చిన సమాధానంపై కమిటీ సంతృప్తి చెందలేదు. దీంతో మరో షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన ఈ నోటీసుకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సమాధానం కోసం వేచి చూడాలని క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆ తర్వాతే చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొంది. -
కేసీఆర్‌ను తిడితేనే పదవులు ఇస్తారా: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడితేనే పదువులు ఇస్తారా అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆయన శుక్రవారం మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. సీనియర్లను పట్టించుకోకుండా కమిటీ వేశారనేది తన ఆవేదనని, ఇది అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడినవారిని పక్కన పెట్టారని, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని, తన సూచనలను సానుకూలంగా తీసుకోవాలన్నారు. కార్యకర్తల ఆవేదనను వ్యక్తం చేశానని.. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తమలాంటి నేతలను ఉపయోగించుకోవాలన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎందుకు పుంజుకోలేదో టీపీసీసీ సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కమిటీల విషయంలో తమ అధినేత రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారన్నారు. పార్టీ మారిన సురేశ్ రెడ్డి పేరు కూడా కమిటీలో ఉండటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. 70 ఏళ్లు నిండిన వాళ్లు కూడా పోటీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీని గెలిపించే ఆలోచన చేయాలని కోరుతున్నానని, గాంధీభవన్‌లో కూర్చుని పార్టీ పోస్టులు అమ్ముకునేవారు కూడా తనకు షోకాజ్ నోటీసులు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. తను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని, తనలాంటి వ్యక్తిని కోల్పోతే పార్టీకే నష్టమన్నారు. -
కోమటిరెడ్డి, వీహెచ్‌పై అధిష్టానం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా ఉంది. ఎన్నికల కమిటీల కూర్పును విమర్శిస్తూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కోమటిరెడ్డి, వీహెచ్ వ్యవహారంపై కమిటీ చర్చించింది. కోమటిరెడ్డికి నోటీసులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కుంతియా, కమిటీల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఏఐసీసీ ఇంఛార్జ్, కమిటీల కూర్పు, కమిటీ సభ్యులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు గుర్తించామని పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మీడియా ముందు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించినా పట్టించుకోకుండా పార్టీకి నష్టం జరిగేలా చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిటీ తెలిపింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. స్పందించిన కుంతియా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా తెలిపారు. వీరిద్దరి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చ జరుగుతుందన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. కాగా, కుంతియా శనిలా దాపురించారంటూ కోమటిరెడ్డి గురువారం తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు. -
2019లో కాంగ్రెస్‌దే అధికారం
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నడింబావిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా చేసుకున్నాడని విమర్శించారు. అనేక ఉద్యమాలతో గద్దెనెక్కిన కేసీఆర్ నేడు పనిగట్టుకుని ఉద్యమకారులను అవమానపర్చేలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలపమైన క్యాడర్ ఉందని, నాయకులు అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. నల్లగొండ పార్లమెంట్‌కు ఉప ఎన్నికలు నిర్వహిస్తే 2లక్షల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు గడిపల్లిలోని కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్‌లాల్‌నాయక్, గుంజ రేణుకానారాయణ, వడ్త్యా రమేశ్, కొర్ర కిషన్, వడ్లపల్లి చంద్రారెడ్డి, రవికుమార్, దామోదర్‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సైదులు, గోలి వెంకన్న, రాంరెడ్డి, నర్సిరెడ్డి తదితరులున్నారు. -
రాజుకుంటున్న ఎమ్మెల్సీ అగ్గి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లానుంచి ఇద్దరు శాసనమండలి సభ్యులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమవుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చాపకింద నీరులా ఉన్న ఈ రాజకీయ ‘అగ్గి’.. అన్ని పార్టీల ఆశావహులకు చలికాలంలోనూ వేడి పుట్టిస్తోంది. ముఖ్యంగా తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే తాను బరిలో ఉంటానని మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే చెప్పడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో తాము ‘రింగ్’లో ఉంటామనే సంకేతాలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, అదే పార్టీలో మరికొందరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆశిస్తుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు, టీఆర్ఎస్ పక్షాన ఈ ఎన్నికలలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ బరిలో ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండడంతో, కోమటిరెడ్డి కాంగ్రెస్ పక్షాన బరిలో ఉంటే జిల్లా రాజకీయం రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారనుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బలం... చెరిసగం వాస్తవానికి జిల్లాలో స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచిన ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం 210 వార్డులకు గాను కాంగ్రెస్ 104 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ 42, బీజేపీ 19, టీఆర్ఎస్ 11, సీపీఎం7, సీపీఐ 4, ఎంఐఎం 3, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ 3, ఇతరులు 17 స్థానాల్లో గెలుపొందారు. ఇక, జిల్లాలోని 835 ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ 397, టీడీపీ 148, టీఆర్ఎస్ 114, సీపీఎం 54, సీపీఐ 19, బీజేపీ 16, వైఎస్సార్సీపీ 9, ఇతరులు 78 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 59 జెడ్పీటీసీలకు గాను 43 కాంగ్రెస్, టీఆర్ఎస్ 13, టీడీపీ 2, సీపీఐ1 స్థానంలో గెలుపొందాయి. ఇప్పుడు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున టీఆర్ఎస్లోకి వెళ్లడంతో పార్టీల బలాబలాల్లో చాలా మార్పులు వచ్చాయి. అయినా 50శాతం కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పక్షానే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య ఉన్న వ్యత్యాసం వందలోపే ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక చాలా హాట్‌హాట్‌గా జరగనుంది. ఈలోపే విజయానికి తగినంతమందిని పార్టీలో చేర్చుకునే ఆలోచనలో టీఆర్ఎస్ ఉండగా, తమ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన వారిలో చాలా మంది తమకే ఓటేస్తారని, ఇతర పార్టీల మద్దతు కూడా అధికార పార్టీకి కాకుండా తమకే లభిస్తుందని కాంగ్రెస్ నేతలు లెక్కలు కడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ స్థానానికి ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున పోటీ కూడా మొదలైంది. ఆశావహులు అడుగుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అయినా, ముందు వరుసలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారని, ఆయన అభ్యర్థిత్వం ఖరారయితే పోటీ రసకందాయంగా ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. కోమటిరెడ్డితో పాటు పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, సుంకరి మల్లేశ్‌గౌడ్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను చేసిన సేవలను గుర్తించి టికెట్ ఇవ్వాలని తూడి అడుగుతుండగా, గతంలో నేతి విద్యాసాగర్‌కు ఇచ్చిన టికెట్ తనకు రావాల్సిందని, ఇప్పుడయినా అవకాశం ఇవ్వాలని మల్లేశ్‌గౌడ్ అడుగుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అధిష్టానం ముందు తన వాదనలు వినిపిస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరికొందరు నాయకులు లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఏమవుతుందో? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కన్నా ముందు ఖాళీ అయ్యే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు ఖరారు చేయలేదు. ఈ విషయంలో ముందున్న బీజేపీ తమ అభ్యర్థిగా ఎర్రబెల్లి రామ్మోహనరావును ఖరారు చేసి చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళుతోంది. ఇక, అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డికి టికెట్ వచ్చినట్టేనని, ఈ మేరకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ లభించిందని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇక, వామపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థి ఎవరనే దానిపై ప్రాథమిక కసరత్తులోనే ఉన్నాయి. వామపక్షాల తరఫున తెలంగాణ మొత్తానికి తెలిసిన ఒక ప్రముఖుడిని నిలపాలా లేక పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న ప్రొఫెసర్లను బరిలో దించాలా అనేది తేల్చుకోలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం తాము అభ్యర్థులను నిలిపే ఆలోచన లేదని, అన్ని పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక ఏదో అభ్యర్థికి మద్దతిస్తామని అంటోంది. మొత్తం మీద శాసనమండలి రాజకీయం రానున్న రోజుల్లో జిల్లాలో మరింత వేడిని పుట్టించనుంది.