కోదాడ: కేసీఆర్ ఫిబ్రవరిలోనే అసెంబ్లీని రద్దు చేస్తారని, కర్ణాటకతో పాటు మే నెలలోనే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో రానున్న ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్దం కావాలని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి కేసీఆర్‌ను గద్దె దించి ఫాంహౌజ్‌కు పంపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక నుంచి కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తానని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలి మళ్లీ తాను అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నారని, అయన కలలన్నీ పగటి కలలుగానే మిగిలే విధంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment