![KCR Responds to MLA Defections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/kcr.jpg.webp?itok=tnLm9d0M)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment