bypoll
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. -
ఆపరేషన్ మిల్కీపూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మిల్కీపూర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పూర్తి బలాన్ని చాటుతున్నాయి. మిల్కీపూర్‌లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్‌సభ స్థానం ఓటమి నుంచి కోలుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, 2022లో తాను దక్కించుకున్న అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలవగా... ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 2024 జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) సీటును బీజేపీ కోల్పోయింది. ఇది లౌకికవాద విజయమని ఎస్పీ అప్పట్లో చాలా ప్రచారం చేసింది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా అవధేష్ ప్రసాద్ ఎన్నిక కావడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది. అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కాగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మ«ధ్య ప్రత్యక్ష పోటీగా మారింది. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో ఉన్న మిల్కీపూర్‌లో ఓటర్లను సమీకరించేందుకు ఐదారుగురు మంత్రులను బీజేపీ మొహరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కుందర్కిలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్, ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్‌లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు అయోద్య జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ శర్మ, గిరీష్ యాదవ్, మయాంకేశ్వర్ సింగ్‌లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్‌లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది. నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్ను మూడుసార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేగాక మిల్కీపూర్‌లో 5,500 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయడంతోపాటు 3,415 మంది యువకులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు. మరోవైపు, బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోగా, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్ధం ఊపందుకుంది. అక్రమాలకు కారణమయ్యే యూపీ డీజీపీని వెంటనే తొలగించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూపీ డీజీపీని పదవిలో కొనసాగిస్తే, అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారితీయవచ్చని ఎస్పీ ఆరోపిస్తోంది. డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీని ఏ శక్తీ ఓడించలేదని సమాజ్‌వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మూడు లక్షల ఆధిక్యం.. వయనాడ్‌లో భారీ లీడ్‌లో ప్రియాంక గాంధీ
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. ప్రియాంకా గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్లక్షకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారామె. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో.. ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మూడు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ.. తరువాత వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం. వయనాడ్‌లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్‌కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్‌గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
వయనాడ్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Updates వాయనాడ్‌లో సాయంత్రం 6 గంటల వరకు 64.27% ఓటింగ్ నమోదైంది. వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. వాయనాడ్ నియోజకవర్గంలో 64.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇది 72.92 శాతంగా ఉంది.కలపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 65.01%, సుల్తాన్ బతేరిలో 62.10%, మనంతవాడిలో 63.48%, తిరువంబాడిలో 66.05%, ఎర్నాడులో 68.97%, నిలంబూరులో 61.46%, వండూరులో 64.01% పోలింగ్ నమోదైంది. వయనాడ్‌లో పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.వాయనాడ్ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 1 గంటల వరకు 40% పైగా ఓటింగ్ నమోదైందివాయనాడ్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34.38 శాతం పోలింగ్ నమోదైంది#WayanadElection | Chanda, an 80-year-old woman of the Kallumala tribal settlement, after casting her vote at a booth at Meppadi in #Wayanad #Byelections2024 📸E.M. Manoj pic.twitter.com/PPDIf8unGL— The Hindu - Kerala (@THKerala) November 13, 2024 ఉదయం 11 గంటల వరకు వయనాడ్‌లో 27.04 శాతం పోలింగ్ నమోదైంది. #JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 కేరళ: వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు వాయనాడ్‌లో 13.04 శాతం ఓటింగ్ నమోదైంది.#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుషిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు#WATCH | | Karnataka | BJP leader and Former CM Basavaraj Bommai casts his vote at a polling booth in Shiggaon, as voting in bypoll to the assembly constituency is underwayHis son Bharath Bommai is the BJP candidate for bypoll to the Shiggaon assembly constituency pic.twitter.com/x2ta1ZaFDw— ANI (@ANI) November 13, 2024 కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను తిరిగి చెల్లించడానికి, వారి కోసం పని చేయడానికి తమ ప్రతినిధిగా ఉండటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నా #WATCH | Kerala: Congress candidate for Wayanad Lok Sabha by-elections Priyanka Gandhi Vadra says, "My expectation is that the people of Wayanad will give me the chance to repay the love and affection they have shown and to work for them and to be their representative. I hope… pic.twitter.com/LYg9Sgg4OE— ANI (@ANI) November 13, 2024 రాజస్థాన్: దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మురారీ లాల్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.దౌసా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి దీనదయాళ్ బైర్వా, బీజేపీ నుంచి జగ్మోహన్ మీనాను బరిలోకి దిగారు.#WATCH | Dausa, Rajasthan: Congress MP from Dausa Murari Lal Meena casts his vote for the Dausa Assembly by-election.Congress has filled Deendayal Bairwa from the Dausa assembaly seat. BJP has fielded Jagmohan Meena from this seat. pic.twitter.com/0qtmoLyimy— ANI (@ANI) November 13, 2024 కేరళవయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలకు అట్టడుగు స్థాయిలో పని చేయగల, పార్లమెంటులో తమ సమస్యలను పరిష్కరించగల నేత కావాలి. కిట్లు, డబ్బు, మద్యం, అన్నీ అందించి ఈసారి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయం కాంగ్రెస్‌కు ఉంది#WATCH | Kerala: BJP candidate from Kerala's Wayanad Lok Sabha constituency, Navya Haridas says, "... People of Wayanad need a person who can work with them at the grassroots level and who can address their issues in Parliament and find solutions. Congress is trying to influence… pic.twitter.com/2TjyrKKiVx— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్:బుద్ని ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.సెహోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికే చౌహాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Sehore: Kartikey Chouhan, son of Union Minister Shivraj Singh Chouhan shows his inked finger after casting his vote at a polling station in Sehore for Budhni by-elections. Kartikey Chouhan says "I would like to request everyone to come out and cast their votes. There… pic.twitter.com/FUrPIsYGur— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఓటు వేయడానికి కర్ణాటకలోని చన్నపట్నాలోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు.ఎన్డీయే తరఫున ఈ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ నేత నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీ యోగేశ్వర్ పోటీలో ఉన్నారు. #WATCH | Karnataka: People queue up at a polling station in Channapatna, Karnataka to vote for Channapatna Assembly by-electionsNDA has fielded JDS leader Nikhil Kumaraswamy from this seat; five-time MLA CP Yogeshwar is contesting against him on a Congress ticket pic.twitter.com/YO5DLC32Cp— ANI (@ANI) November 13, 2024 కేరళపాలక్కాడ్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్: పశ్చిమ్ మేదినీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శ్రీతికోన అరబింద హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లో ఉన్నారు. కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు. ఛత్తీస్‌గఢ్:రాయ్‌పూర్ సిటీ సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.బీజేపీ మాజీ ఎంపీ, మేయర్ సునీల్‌కుమార్ సోనీని, కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆకాశ్ శర్మను పోటీలో ఉన్నారు. #WATCH | Chhattisgarh: Voting underway for Raipur City South Assembly by-elections BJP has fielded Sunil Kumar Soni, a former MP and mayor, while Congress has fielded Akash Sharma, the president of the Youth Congress state unit. pic.twitter.com/KEDX8M4but— ANI (@ANI) November 13, 2024 అస్సాం:సమగురి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటు వేయడానికి ప్రజలు నాగాన్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Assam: People queue up at a polling station in Nagaon to vote for the Samaguri Assembly by-polls. pic.twitter.com/XH1fLEZPPu— ANI (@ANI) November 13, 2024 కేరళవాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు వాయనాడ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Kerala: People queue up at a polling station in Wayanad to vote for the Wayanad Lok Sabha by-polls pic.twitter.com/lBF0ykyJNn— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్: షియోపూర్ జిల్లాలోని బుద్ని అసెంబ్లీలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.పోలింగ్ స్టేషన్ నంబర్ 170 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల కొత్త భవనం (విజయపూర్) వద్ద పోలింగ్ ప్రారంభమైంది.#WATCH | Madhya Pradesh: Voting for the by-election to be held today in the Budhni assembly of Sheopur district. Preparations underway at polling station number 170 Government Higher Secondary School New Building Vijaypur. pic.twitter.com/SopzxUBWBH— ANI (@ANI) November 13, 2024 కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారుఇక్కడ 14 లక్షల మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఈ రోజు(బుధవారం) 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
బాబుకు టీడీపీ నేతల వార్నింగ్..
-
‘బీజేపీ ఆఫర్ చేస్తే.. కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తా’
ముంబై: కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ అన్నారు. ఆమె ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ కంచుకోట స్థానమైన బారామతిలో పోటీ చేసి ఆ పార్టీ నేత సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా సునేత్రా పవార్ రాజ్య సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థి లేకపోవటంతో సునేత్రా గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునేత్ర మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తాను. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుంటా. బారామతిలో మేం హోరంగా ఓడిపోయాం. ఓటమికిగల కారణాలుపై విశ్లేషణ చేస్తాం, తగిన క్షేత్రస్థాయి చర్యలు తీసుకుంటాం’’ అని ఆమె అన్నారు.మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ పార్టీకి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కలేదు. అయితే ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రఫూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. కాగా.. ఆయన గతంలోనే కేంద్ర కేబినెట్ మినిస్టర్‌గా పనిచేసి ఉండటంతో బీజేపీ ఇచ్చిన సహాయ మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించారు. -
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఇక నమ్మలేం! ఒంటరిగానే పోటీ చేస్తాం: మమత శపథం
పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్డిఘి ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్, సీపీఎంలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహా ప్రతి పక్ష కూటమి ఆశకు ఎదురు దెబ్బతగలడంతో ఒక్కసారి మమతా ఆయా పార్టీలపై ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్, సీపీఎంల అపవిత్ర పొత్తులను మరోసారి బహిర్గతం చేసిందంటూ మండిపడ్డారు. తమ పార్టీ మూడు ప్రత్యర్థి రాజకీయ శక్తులతో ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ శపథం చేశారు. అయినా బీజేపీతో ఉన్న కాంగ్రెస్, సీపీఎంలతో చేరితే మమ్మల్ని బీజేపి వ్యతిరేకి అని ఎలా పిలుచుకుంటారని ప్రశ్నించారు. వారంతా కమ్యూనల్ కార్డ్ ఆడుతున్నారు. సాగర్దిఘిలో ఓటమే మాకు గుణపాఠం ఇకపై కాంగ్రెస్‌ని సీపీఎంని నమ్మేదే లేదని తేల్చి చెప్పారు.అయినా బీజేపీతో ఉన్న పార్టీలతో వెళ్లలేం అన్నారు. మా పొత్తు ప్రజలతోనేనని కరాఖండీగా చెప్పారు. సాగర్దిఘి ఉప ఎన్నికల్లో టీఎంసీ ఓటమి గురించి మాట్లాడుతూ.."మేము ఎన్నికల్లో ఓడిపోయాం. ఎవరినీ నిందించను ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఐతే ఇందులో ఇద్దరి మద్ద జరిగిన అనైతిక పొత్తు కారణంగా ఓట్లన్నీ కాంగ్రెస్‌కి పడ్డాయి. అదీగాక మేఘాలయ ఎన్నికల్లో కొంత గందరగోళం కూడా నెలకొంది. రెండు పార్టీలకు కాంగ్రెస్ అనే పదం కామన్‌గా ఉండటంతో తాను కాంగ్రెస్‌తోనే ఉన్నానని ఓటర్లు భావించారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నందున, కాంగ్రెస్ రోజలు నుంచి నా చిత్రాన్ని వారితో చూడటంతో ఓటర్లు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయినప్పటికీ మేఘాలయలో టీఎంసీ ఐదు సీట్లు గెలిచేందుకు సాయం చేశారు. అందుకు అభినందనలు. టీఎంసీ ఆరు నెలల క్రితమే మేఘాలయలో ప్రచారం ప్రారంభించినప్పటికీ పోలైన మొత్తం ఓట్లలో 15శాతం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మరింత రాణిస్తాం." అని మమత ధీమాగా చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం..త్రిపురలో.. బీజేపీ మెజారిటీ మార్కును దాటి 32 సీట్లు గెలుచుకోగా.. కలిసి పోటీ చేసిన సీపీఎం, కాంగ్రెస్‌లు ఏకంగా 14 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) ఒక్క సీటును గెలుచుకుంది. అయితే, త్రిపురలో టీఎంసీ ఖాతా తెరవలేకపోయింది. (చదవండి: తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ) -
బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..
లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్‌పురి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది. ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్‌పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్‌పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్‌తో జతకట్టారు. కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. #WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022 -
ఉప ఎన్నికలో నోటాకి సెకండ్ ప్లేస్
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్‌కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్‌తో ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట. రుతుజా లాట్కే.. గతంలో బృహణ్‌ముంబై మున్సిపల కార్పొరేషన్లో క్లర్క్‌గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్‌ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం! -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్‌నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్‌గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్‌పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్‌ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్, హరియాణాలోని అదమ్‌పుర్, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్‌గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్‌నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్, బిహార్, ఛత్తీస్‌ఘడ్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ములాయం సింగ్ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, 8న కౌంటింగ్ ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..) -
మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి : హరీష్ రావు
-
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై దాడి
-
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే : బండి సంజయ్
-
ఆలోచించండి.. ఆగం కాకండి : కేటీఆర్
-
ఎన్నికలు వస్తే చాలు గాయ్.. గాయ్.. గత్తర్.. గత్తర్ లొల్లి నడుస్తోంది : కేసీఆర్
-
బీజేపీ పై కేసీఆర్ ఫైర్
-
సీఎం కాన్వాయ్ లో డబ్బులు తీసుకురాబోతున్నారు : బండి సంజయ్
-
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ కట్టుకథ : తరుణ్ చుగ్
-
మునుగోడులో కేఏ పాల్ వినూత్న ప్రచారం
-
పొలిటికల్ కారిడార్ : మూడు పార్టీల నేతల్లో మునుగోడు టెన్షన్
-
అవన్నీ ఫేక్ వీడియోలే : బండి సంజయ్
-
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
-
రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక : మంత్రి జగదీష్ రెడ్డి
-
మునుగోడు ఓటర్లకు పెద్ద ఎత్తున దావత్ లు
-
మునుగోడు ఉపఎన్నిక పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కెఎస్ఆర్ లైవ్ షో : వలసలపై కేసీఆర్ రివర్స్ అటాక్
-
మునుగోడు బరిలో కామారెడ్డి మహిళ
-
పొలిటికల్ కారిడార్ : మునుగోడు స్థాయే వేరు..
-
మునుగోడు లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
పొలిటికల్ కారిడార్ : గ్రేటర్ లో మునుగోడు ప్రచారం
-
మునుగోడులో గుర్తుల గోల...
-
మునుగోడులో పట్టుబడుతున్న నోట్ల కట్టలు...
-
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్‌శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్‌పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్‌ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్‌ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిగ్ రిలీఫ్.. ఉపఎన్నికల్లో ఆమె పోటీకి లైన్ క్లియర్
ముంబై: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 3న జరగే అంధేరీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. థాక్రేవర్గం తరఫున పోటీ చేయనున్న రుతుజా లాట్కే రాజీనామాను బృహన్ముంబై పురపాలక కమిషనర్ శుక్రవారం ఉదయం 11గంటల్లోగా ఆమోదించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే ఆమోదించడానికి ఇంత సమయం ఎందుకుపట్టిందని, ఇది కోర్టుకు రావాల్సిన విషయం కూడా కాదని ముంబై పురపాలక కమిషనర్ ఇక్బాల్ చాహల్‌ను ఉన్నత న్యాయస్థానం మందలించింది. అంధేరీ ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉద్దవ్ థాక్రే వర్గం తరఫున రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. అయితే ఆమె బృహన్ ముంబై కార్పొరేషన్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఉపఎన్నికకు నామినేషన్ వేయాలంటే ఆమె పదవికి రాజీనామా చేయాలి. సెప్టెంబర్ 2నే రాజీనామా సమర్పించినప్పటికీ దాన్ని కమిషనర్ ఆమోదించలేదు. నామినేషన్లకు శుక్రవారం(అక్టోబర్ 14) చివరి తేదీ కావడంతో రితిజా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కావాలనే రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకు తెలిపారు. షిండే ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రుతుజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం ఆమె నేరుగా వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిశారు. చివరిరోజైన శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. అంధేరీ ఉపఎన్నికలో థాక్రేవర్గం అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా ఉన్నాయి. మరోవైపు షిండే వర్గం మద్దతుతో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోంది. చదవండి: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! -
అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
సాక్షి, ముంబై: తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. మొన్నటివరకు అసలైన శివసేన పార్టీ తమదేనంటూ, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తు తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం పోటీ పడ్డాయి. చివరకు ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం వినియోగించరాదని ఉద్ధవ్‌కు, శిందేను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ టికెట్టుపై పోటీ చేయించాలనే ప్రయత్నాలు శిందే చేస్తున్నారు. భర్త మృతి.. అభ్యర్థిగా భార్య ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లిన తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక, ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. కాని మృతి చెందిన రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కేకు తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్ధిత్వం ఇచ్చారు. సానుభూతి ఓట్లతో రుతుజా సునాయాసంగా గెలుస్తుందనే ధీమాతో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. రుతుజా గెలవడంవల్ల తమ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య యథాతధంగా ఉంటుంది. ఏక్నాథ్ శిందే ఎత్తుగడలు రమేశ్ లట్కే కుటుంబంతో ఏక్నాథ్ శిందేకు సంత్సంబంధాలున్నాయి. దీంతో రుతుజాకు తమ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం ఇవ్వాలని శిందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శివసేన వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయి, తమ వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుందని శిందే భావిస్తున్నారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎవరిది..? విల్లు–బాణం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య ఏ వర్గానికి ఎక్కువ ఉందో ఆ వర్గానికి శివసేన పేరు, విల్లు–బాణం గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ఏక్నాథ్ శిందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నలిగి పోతున్న బీఎంసీ కమిషనర్ కాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపున రుతుజా లట్కే గురువారం భారీ బలప్రదర్శన చేస్తూ నామినేషన్ వేస్తారని ఇదివరకే పార్టీ వర్గాలు ప్రకటించాయి. రుతుజా లట్కేకు మహావికాస్ ఆఘాడి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రకటించాయి. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె బీఎంసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె బీఎంసీ కమిషనర్‌కు రాజీనామా సమర్పించారు. కానీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఫలితంగా గురువారం ఆమె నామినేషన్ వేయలేకపోయారు. దీంతో రాజీనామా ఆమోదించాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి, ఆమోదించవద్దని అటు ఏక్నాథ్ శిందే వర్గం నుంచి బీఎంసీ కమిషనర్‌పై ఒత్తిడి వస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్యలో బీఎంసీ కమిషనర్ నలిగి పోతున్నారు. నియమాలు ఏమంటున్నాయి.. బీఎంసీ 1989 నియమాల ప్రకారం స్వచ్చందంగా పదవీ విరమణ పొందేవారు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసే వారు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒకవేళ నెల రోజుల ముందు నోటీసు ఇవ్వని పక్షంలో ఒక నెల వేతనం బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కాని ఆమె ఈ నెల మూడో తేదీన నోటీసు ఇచ్చారు. నియమాల ప్రకారం రుతుజా లట్కే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వకపోవడంతో నెల రోజుల వేతనం రూ.67,590 నగదు బీఎంసీకి చెల్లించారు. సంబంధిత డిపార్టుమెంట్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా పొందారు. అయినప్పటికీ బీఎంసీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు శిందే వర్గం ఒత్తిళ్ల మధ్య బీఎంసీ కమిషనర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. రాజీనామ ఆమోదించే వరకు రుతుజాకు నామినేషన్ వేయడానికి వీలులేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బాంబే కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు రుతుజా రాజీనామాను ఆమోదించాలని ఉన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నుంచి మూర్జీ పటేల్ ? ఇదిలాఉండగా బీజేపీ నుంచి మూర్జీ పటేల్ పేరును దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి శుక్రవారం వరకు గడువుంది. ఆలోపు ఏదైన అద్భుతం జరగవచ్చు. గతంలో తనతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ తరఫున నామినేషన్ వేయించాలనే ప్రయత్నంలో శిందే ఉన్నారు. ఒకవేళ రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలుచేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం లేపడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. దీంతో రుతుజా తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆచి, తూచి ఆడుగేయాల్సి ఉంటుంది. ఒకవేళ శిందే ఒత్తిళ్లకు యపడి బీజేపీ తరఫున రుతుజా నామినేషన్ వేస్తే మూర్జీ పటేల్ పరిస్ధితి ఏంటనే అంశం తెరమీదకు రానుంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూర్జీ పటేల్‌కు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో బీజేపీపై తిరుగుబాటుచేసి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆ సమయంలో రమేశ్ లట్కే గెలుపొందగా మూర్జీ పటేల్ రెండో స్ధానంలో నిలిచారు. రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ వేస్తే ఇప్పుడు అదే పరిస్ధితి పునరావృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కొంత అయోమయ పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. (క్లిక్: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) -
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్‌కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి -
షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది. శివసేన ఈ ఏడాది జూన్‌లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది. చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! -
6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ స్టీరింగ్ కమిటీ నడుం బిగించింది. దసరా తర్వాత అక్కడ గడపగడపకూ బీజేపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదనే దానిపై చర్చించింది. మునుగోడులోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి, ఇద్దరు సహ ఇన్చార్జిల చొప్పున 24 మందిని నియమించింది. ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాన్ నారాయణపూర్‌కు ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, మునుగోడుకు చాడ సురేశ్‌రెడ్డి, మర్రిగుడెంకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కూన శ్రీశైలంగౌడ్, నాంపల్లికి ఏనుగు రవీందర్‌రెడ్డి, చండూర్‌కు నందీశ్వర్‌గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చండూర్ మున్సిపాలిటీకి ఎం.ధర్మారావులను నియమించింది. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి పార్టీపరంగా చార్జ్‌షీట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 27న చౌటుప్పల్ మండలంలో మండల ఇన్చార్జీల సమావేశం ఉంటుందన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్, యెండెల లక్ష్మీనారాయణ, గరికపాటి మోహన్‌రావు, డా.దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. హెచ్‌సీఏలో గందరగోళం ఇలా.. కల్వకుంట్ల కుటుంబం కారణంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ఆరోపించారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దని తనకు కేసీఆర్ సూచించారన్నారు. -
పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై ప్రత్యేక వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలా లను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితు ల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించిన అధికార పార్టీ, త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున ముఖ్య నేతలకు బాధ్యతలు అప్ప గించనుంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువ డిన తర్వాత చండూరు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాజగోపాల్ రాజీనామా వార్తలతోనే అప్రమత్తం వాస్తవానికి మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తా రనే సంకేతాలు వెలువడిన సమయంలోనే అధికార పార్టీ అప్రమత్తమై చేరికలపై దృష్టి పెట్టింది. రాజ్‌గోపాల్ రాజీనామా మొదలు కుని ఇప్పటివరకు, కాంగ్రెస్ సహా వివిధ పా ర్టీల నుంచి 30మందికి పైగా ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్ ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకా శముందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే రంగంలో మండల ఇన్చార్జీలు ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్య తలు అప్పగించారు. ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్ల గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమ న్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఇన్చార్జీలు గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల బలాబలాలు, సామాజికవర్గాల వారీ గా ఓటర్ల వివరాలు, గ్రామ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పార్టీ నేతల నడుమ విభేదాలు సరిదిద్దడం, ఇతర పార్టీల నుంచి చేరికలకు ప్రయత్నించడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో 90 యూనిట్లు.. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూని ట్లుగా విభజించి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప టికే ఏ యూనిట్‌కు ఎవరు ఇన్చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితాను రూపొందించారు. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహ రిస్తారు. ఇలావుండగా గత నెల 20న మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహి రంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్.. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత చండూ రులో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థిగా కూసుకుంట్ల ఖాయం? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయగా, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
గటు దిక్కు బోవద్దు గన్పతీ!
కైలాసం. శంకరుడు కండ్లు మూస్కోని తపస్సు జేస్తున్నడు. పార్వతి వొంట జేస్తున్నది. అదువరదాక ఎల్కలతోని దాగుడు మూతలాడుకొన్న గన్పతి గామె తాన్కి వొచ్చిండు. ‘‘అమ్మా’’ అని బిల్సిండు. ‘‘ఏంది బిడ్డా! ఆకలైతున్నదా? ఏమన్న బెట్టాల్నా?’’ అని పార్వతి అడిగింది. ‘‘ఏమొద్దమ్మా! చవ్తి పండ్గ దినాలు గదా. ఒకసారి పట్నం బోయొస్తనే.’’ ‘‘యాడికి బోవొద్దురా కొడ్కా! వొద్దు వొద్దంటె పోయిన యాడాది పట్నం బోయినవు. ఇగొస్తడు, అగొస్తడనుకుంట ఎంతగనం ఎందురుజూసినా నువ్వు రాలేదు. మేమంత పరేశానైతిమి. లెంకంగ లెంకంగ ఆకర్కి మూతదెర్సిన మ్యాన్హోల్ల బడ్డ నువ్వు గండ్లబడ్డవు.’’ ‘‘గీపారి గట్లగాదమ్మా.’’ ‘‘గిప్పుడు వానకాలం నడుస్తున్నది. వాన బడ్డదా అంటె పట్నం తొవ్వలల్ల యాడ ఏమున్నదో ఎర్కగాదు.’’ ‘‘వాన కాలం నడుస్తున్నా దినాం వానగొట్టదమ్మా!’’ ‘‘ఎంత జెప్పినా ఇనవైతివి. పోయిరా! జెర పైలం.’’ గన్పతి కైలాసంలకెల్లి ఎల్లిండు. మెల్లగ మబ్బుల పంటి నడ్సుకుంట పట్నం దిక్కు రాబట్టిండు. నడ్మల పట్నంకెల్లి వైకుంటం బోతున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు. ‘‘నారాయణ, నారాయణ, యాడ్‌కి బోతున్నవు గన్పతీ’’ అని నారదుడడిగిండు. ‘‘పట్నం బోతున్న. గాడ పతొక్క వాడ కట్టుల నా బొమ్మలు బెడ్తరు. గవన్ని ఒక్క తీర్గనే ఉండయి. తీరు తీర్లుంటయి. గంతేగాకుంట ఉండ్రాల్లు, పండ్లు, బచ్చాలు, పాసెం, పులిగొర అసుంటియి నాకు బెడ్తరు.’’ ‘‘తప్పి జారి గవి దినేవు!’’ ‘‘ఎందుకు దినొద్దు?’’ ‘‘ఎవలు జేసినయి ఎట్లుంటయో! మొన్న బాసర ఐఐటీ పోరగాల్లు హాస్టల్ల తిన్నంక కడ్పునొస్తున్నదని మొత్తుకున్నరు. కొంతమంది దవకాన్ల షరీకయ్యిండ్రు. పదేండ్ల కిందట రౌతుల్లెక్క ఉన్న ఉండ్రాల్లు దింటుంటె నీ రొండు దంతాలల్ల ఒకటిర్గలేదా? గదంత యాదిమర్సినవా? గింత జెప్పినా తినకుంటె బేచైనైత దనుకుంటే నీ ఇష్టం.’’ ‘‘నువ్వు గింతగనం జెప్పినంక ఎందుకు తింట నారదా?’’ ‘‘పట్నం బోతె బోయినవు గని తప్పి జారి మునుగోడు బోకు గన్పతీ.’’ ‘‘ఎందుకు బోవద్దు నారదా!’’ ‘‘గాడ్కి బోతివా అంటె కాంగ్రెస్ వినాయకునివా అని ఒకడు అడ్గుతడు. బీజేపీ వినాకునివా అని ఒకడు అడ్గితె, టీఆర్ఎస్ వినాయకునివా అని ఇంకొకడు అడ్గుతడు.’’ ‘‘చాక్ పీస్‌ల గన్పతి, గవ్వల గన్పతి, ముత్యాల గన్పతి అసువంటి తీరు తీర్ల గన్పతులను జూసిన. నువ్వు జెప్పిన గన్పతులేంది నారదా?’’ ‘‘మునుగోడుల బైఎలచ్చన్లొచ్చినై. మూడు పార్టీలు పైసలిచ్చి గన్పతులు బెట్టిపిచ్చినయి. కాంగ్రెస్ వినాయకుడు చెయ్యి సూబెడ్తడు. టీఆర్ఎస్ వినాయకుడు మోటర్ల గూసుంటె, బీజేపీ వినాయకుడు తామరపువ్వులుంటడు.’’ ‘‘మునుగోడుల బై ఎలచ్చన్లు ఎందుకొచ్చినయి నారదా?’’ ‘‘రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేసిండు. కాంగ్రెస్లకెల్లి బీజేపీలకు దుంకిండు.’’ ‘‘గాయిన రాజినామ ఎందుకు జేసిండు.’’ ‘‘అడిగితె నియోజక వర్గం అభివృద్ధి కోసమన్నడు.’’ ‘‘గాయిన జెప్పిన దాంట్ల నిజమేమన్న ఉన్నదా?’’ ‘‘ఉన్నది. ఎట్లంటవా ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేస్తే హుజూర్నగర్ల బై ఎలచ్చన్లు అయినయి. గప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఒక్క గా నియోజక వర్గంలనే గొర్లను పంచింది. కొత్తగ దలిత బందు పద్కం బెట్టి ఒకొక్క దలిత కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇచ్చింది.’’ ‘‘మునుగోడుల గుడ్క గట్లే జేస్తదా?’’ ‘‘చేస్తది. మా వూరుకు తొవ్వ లేదు. తొవ్వ ఏపిచ్చినోల్లకే ఓట్లేస్తం అని ఏ వూరోల్లన్న అంటే టీఆర్ఎస్ సర్కార్ తొవ్వ ఏపిస్తది. సూసిండ్రా నేను ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జెయ్యబట్కె మీ వూరికి తొవ్వ వొచ్చిందని రాజగోపాల్ రెడ్డి అంటడు.’’ ‘‘బై ఎలచ్చన్ల కర్సంత జెనం నెత్తిమీదనే బడ్తది గదా.’’ ‘‘అవ్. కొత్త పన్నులేస్తరు. మునుగోడుల కొత్త దుక్నాలు బడ్డయి. గవ్విట్ల సర్పంచులను, గల్లి లీడర్లను అమ్ముతున్నరు. పది వేల రూపాయల వొంతున ఓట్లు గొనెతందుకు పార్టీలు రడీగున్నయి.’’ ‘‘వామ్మో!’’ ‘‘యాడాది కొక్కపారి చవ్తి పండ్గొస్తది. గదే తీర్గ అయిదేండ్ల కొక్కపారి, ఒక్కోపారి అంతకన్న ముందుగాలే ఓట్ల పండ్గొస్తది. ‘జై గణేశ, జై గణేశ, జై గణేశ దేవా’ అన్కుంట జెనం నీకు పూజలు జేస్తరు. ఉండ్రాల్లు బెడ్తరు. మీరే మా దేవుల్లనుకుంట లీడర్లు జెనాలకు బిర్యాని బెడ్తరు. మందు తాపిస్తరు. తొమ్మిది దినాలైనంక నిన్ను నీల్లల్ల ముంచుతరు. ఎమ్మెల్యే కుర్సిలు దొర్కినంక లీడర్లు దినాం జెనాలను నిండ ముంచుతరు’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు గిదంత జెప్పినంక నాకు పట్నం పోబుద్ది అయితలేదు నారదా!’’ అన్కుంట గన్పతి కైలాసం దిక్కు బోయిండు. ‘‘నారాయణ, నారాయణ’’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడు ధర్మయుద్ధంలో విజయం నాదే: రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: మునుగోడులో జరిగే ధర్మ యుద్ధంలో తన విజయం తథ్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజాసేవకు తాను ఆస్తులు అమ్ముకుంటే.. మంత్రి జగదీశ్‌రెడ్డి పద విని అడ్డంపెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో తన అనుచరులు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జగదీశ్ రెడ్డికి విద్యుత్ శాఖకు బదులుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయిస్తే బాగుంటుందని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు నిధులు తీసుకెళ్తుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ జగదీశ్‌రెడ్డి అని దుయ్య బట్టారు. ఈనెల 21న మునుగోడులో జరిగే అమిత్‌షా సభలో తనతోపాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అనంతరం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు రూ.8 లక్షల ఆర్థికసాయం చేశారు. చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
Munugode Bypoll: పోటీయా? మద్దతా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కలో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు ముందుకు సాగనున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఇప్పటికే వేర్వేరుగా పార్టీ కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో అనేకసార్లు సీపీఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఆ పార్టీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎం కూడా కొంతమేరకు ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయం కూడా సీపీఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవ లేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ క్యాడర్‌తో జరుగుతున్న సమావేశాల్లో మాత్రం చాలామంది పోటీ చేయాలనే సూచిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో అనేకసార్లు గెలిచినా అది పొత్తుల వల్లే సాధ్యమైందని, పూర్తిగా సొంత బలమే కారణం కాదని సీపీఐ నాయకులు కొందరు చెబుతున్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్విభజన వల్ల గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత మేరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల పరోక్షంగా బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంటుందని, అదే ఖాయమైతే బరిలో ఉండకూడదని సీపీఐ భావిస్తున్నట్టు తెలిసింది. అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ సీపీఐ తన అభ్యర్థిని బరిలోకి దింపితే మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సిద్ధంగా ఉంది. రెండు పార్టీలు ఈ నెల 15 తర్వాత సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. (క్లిక్: మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్) టీఆర్ఎస్కా? కాంగ్రెస్‌కా? సీపీఐ పోటీ చేయని పక్షంలో బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీని ఓడించగలిగేది టీఆర్ఎస్సా? కాంగ్రెస్సా? అన్నది ఇప్పుడు కీలకమని సీపీఐ, సీపీఎం నేతలంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఉంటాయా? అలా వెళ్లడం వల్ల కాంగ్రెస్ బలహీన పడుతుందా? లేక కాంగ్రెస్ తన బలాన్ని చాటుకుంటుందా? టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఈ రెండు పార్టీల్లో ఎన్నికల నాటికి బీజేపీని ఓడించే సత్తా ఎవరికి ఉంటుందన్న దానిపై ఆధారపడి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. (క్లిక్: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు!.. ఆయనకు టికెట్ ఇస్తే..) -
మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు పిలుపునిచ్చారు. బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పదని అన్నారు. అభ్యర్థి ఎవరు? కేసీ వేణుగోపాల్‌తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతితోపాటు గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలించినట్టు సమాచారం. సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన రియల్టర్ కృష్ణారెడ్డిని బరిలో దింపే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఎవరు పోటీచేసినా గెలిపించే బాధ్యతను నల్లగొండ జిల్లా నాయకత్వమే చూసుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. ఉప ఎన్నిక కోసం కమిటీ రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యే నేపథ్యంలో.. ప్రత్యేక వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో.. నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, ఈరవత్రి అనిల్‌లను సభ్యులుగా నియమిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పారు. (క్లిక్: రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి) సస్పెండ్ చేస్తారనే..! రాజగోపాల్ రాజీనామా ప్రకటనపై కాంగ్రెస్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీకి విధేయుడైన నాయకుడిని కోల్పోయామని కొందరు అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతోనే రాజీనామా ప్రకటన చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా.. మంగళవారం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అధిష్టానం నుంచి సమాచారం అందిందని, ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. (క్లిక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?) -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఆత్మకూరు ఉపఎన్నిక.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్లైన్ అవకాశం’
సాక్షి, అమరావతి: ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం కొత్త అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫామ్, అఫిడవిట్లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు, నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నామినేషన్లను జూన్ 6వ తేదీలోగా దాఖలు చేసుకోవాలని, నామినేషన్ల పరిశీలన 7వ తేదీన జరుగుతుందని, ఉపసంహరణకు 9 చివరి తేదీ అని మీనా తెలిపారు. -
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్రలలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ నియోజకవర్గంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం, బాలీగుంగె అసెంబ్లీ స్థానాలకు ఉప నిర్వహించనున్నారు. కైరాగఢ్(ఛత్తీస్‌గఢ్), బొచ్చహాన్(బిహార్), కొల్హాపూర్ నార్త్(మహారాష్ట్ర) శాసనసభా స్థానాలకూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు ఏప్రిల్ 18లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకటించింది. (క్లిక్: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు) ► ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 17 ► నామినేషన్లకు దాఖలుకు చివరి తేదీ: మార్చి 24 ► నామినేషన్ల పరిశీలన: మార్చి 25 ► నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28 ► ఎన్నికల పోలింగ్ : ఏప్రిల్ 12 ► ఎన్నికల ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 16 -
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్
పోలింగ్ అప్డేట్స్: ► దాద్రానగర్ హావేలీలో సాయంత్రం 5 గంటల సమయానికి 66. 99శాతం పోలింగ్ నమోదు. ► బీహార్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 49.85 శాతం పోలింగ్ నమోదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్‌లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ► మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 63.02 శాతం పోలింగ్ నమోదు. మరోవైపు ఖాండ్వా లోక్ సభ నియోజకవర్గంలో 59.02 శాతం పోలింగ్ నమోదు. ► రాజస్థాన్‌లోని ధరియావాడ్, వల్లభనగర్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి సరాసరిగా 65 శాతం పోలింగ్ నమోదు. ► హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికలో జుబ్బల్-కోట్‌ఖాయ్‌లో సాయంత్రం 4 గంటల వరకు 65.88 శాతం, మండిలో 47.17 శాతం పోలింగ్ నమోదైంది. ►మేఘాలయాలో 78 శాతం మేర పోలింగ్ నమోదు. ► బెంగాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ ►రాజస్తాన్ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ ►దాద్రానగర్ హవేలీ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.71 శాతం పోలింగ్ ►మేఘాలయ బైపోల్స్‌లో రికార్డుస్థాయిలో పోలింగ్ జరుగుతోంది. 3 గంటల సమయానికి 64 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ►భారత మొదటి ఓటరు..104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి, శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని కల్పా మోడల్ పోలింగ్ స్టేషన్లో మండి పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఓటు వేశారు. ►హర్యానాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం పోలింగ్ ► బెంగాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్ ►రాజస్తాన్ మధ్యాహ్నం 1 గంట వరకు 40.64 శాతం పోలింగ్ ►అస్సాంలో ఉదయం 1 గంట వరకు 51 శాతం పోలింగ్ ►బిహార్‌లో 1 గంటకు 38 శాతం పోలింగ్ ► మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ స్ధానాలకు 45.67 శాతం పోలింగ్ ( మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్‌సభ స్థానాలకు 39.08 శాతం పోలింగ్( మధ్యాహ్నం 1 గంట వరకు) ►దాద్రానగర్ హవేలీ ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ ►రాజస్తాన్ 11 గంటల వరకు 25 శాతం పోలింగ్ ►కర్ణాటక 10.30 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ ►బిహార్‌లో ఉదయం 11 గంటలకు 21.79 శాతం ►హర్యానాలో ఉదయం 10 గంటల వరకు 10 శాతం ►అస్సాంలో ఉదయం 10 గంటల వరకు 12 శాతం ►మిజోరాంలో ఉదయం 10 గంటల వరకు 17 శాతం ►కర్ణాటకలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం ► బెంగాల్లో ఉదయం 9 గంటలకు 10 శాతానికి పైగా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేళి, డామన్ డయ్యూలో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటలకు కొనసాగుతుంది. ఎన్నికలు జరుగుతున్న స్థానాలు దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు జరగుతుండగా.. అసోంలో 5, బెంగాల్లో 4, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, బీహార్‌లో2, కర్ణాటకలో2, రాజస్థాన్‌లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలోని ఒక్కో స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. చదవండి: విశ్వాసం అంటే ఇదేరా ! -
భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం
కోల్‌కతా: భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం
సాక్షి, అమరావతి: పటిష్టమైన నిఘాతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి ► కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి. ► బహిరంగ సమావేశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఆ సమయంలో ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు. ► రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లుగా పెట్టుకోవాలి. ఇదే నిబంధన పోలింగ్ సిబ్బందికీ వర్తిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ సౌకర్యం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. నిరంతర పర్యవేక్షణ ► వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టుల ద్వారా నిశిత తనిఖీలు ఉంటాయి. ► ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకు 8 టాస్కు ఫోర్సు బృందాలు, 21 ప్లైయింగ్ స్క్వాడ్లు, 3 వీడియో వ్యూయింగ్ బృందాలు, 4 ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశాం. ► మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 చోట్లకు పైగా లైవ్ టెలికాస్టు ద్వారా ఎన్నిక నిశిత పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ► ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశాం. 1950కు ఫోన్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వికలాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12–ఈ ఫార్ములాలో దరఖాస్తు చేసుకోవాలి. బద్వేలు నియోజకవర్గంలో 80 ఏళ్లుపై బడిన వృద్ధులు 3,837 మంది, వికలాంగులు 3,902 మంది ఓటర్లుగా ఉన్నారు. ► 2,16,164 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు వేయొచ్చు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 30 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. -
బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక సమావేశం
-
West Bengal Bypolls: నామినేషన్ దాఖలు చేసిన దీదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల జోరు మొదలయ్యింది. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీదీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినప్పటికి.. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో మమత తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలో మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్‌దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి దీదీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. (చదవండి: మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ) పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌తో పాటు శంశేర్‌గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా.. 16వ తేదీ ఉపసంహరణ. అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. చదవండి: మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
Huzurabad Bypoll: ఉప ఎన్నికపై ఈసీకి నివేదిక పంపాలి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికను వెంటనే నిర్వహించేందుకు వీలుగా వాస్తవ నివేదికను ఈసీకి డీజీపీ, సీఎస్ల ద్వారా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వాయిదా వేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని సీనియర్ నేత ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో వాస్తవ విరుద్ధ నివేదికలను ప్రభుత్వం ఈసీకి పంపిందని వారు ముగ్గురు వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతోందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలతోనే కేసీఆర్ కుట్రకు దిగారని జితేందర్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం తప్పుడు నివేదికలతో ఎన్నికలను వాయిదా వేయించిందన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిపోయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిం దని, ఉపఎన్నికలకు మాత్రం కరోనా అడ్డుగా మారిందా అని ఎస్.కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు, బార్లు, రెస్టారెంట్లకు మినహాయింపులు ఇచి్చన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఉపఎన్నికలకు భయపడి కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. -
బెంగాల్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం!
కోల్‌కతా: టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ పోటీ చేయనున్న బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య కీలక పోరుకు తెరలేచింది. ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 6న జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. సెప్టెంబరు 30న పోలింగ్, అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. బెంగాల్ రాష్ట్ర ప్రత్యేక అభ్యర్థన, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. బెంగాల్లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్‌లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా అదే తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మిగిలిన నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా వేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నటు వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్-మే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 294 సీట్లలో 213 స్థానాలను కైవం చేసుకొని మమత నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే నందీగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2వేల ఓట్ల తేడాతో దీదీ ఓడిపోయినా, బెంగాల్ సీఎంగా మమత ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోరుకు సిద్ధమయ్యారు. చదవండి: యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్’ Huzurabad Bypoll: ఇప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నిక లేనట్టే! -
Huzurabad Bypoll: ఇప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నిక లేనట్టే!
-
దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడని, దమ్ముంటే యుద్ధానికి అనువుగా ఉన్న హుజూరాబాద్ వచ్చి డిపాజిట్ తెచ్చుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించామన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీలో నిలవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి సమావేశాలకు హాజరుకావడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. హుజూరాబాద్‌లో నిజమైన పొలిటికల్ యుద్ధం జరుగుతోందని, ఓ పక్క దళితులు, బడుగు బలహీన వర్గాల భూములను దోచుకుని ఈటల రాజేందర్ పువ్వుపార్టీ చాటున దాక్కున్నారని అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ అభ్యర్థి దొరకడం లేదని, భవిష్యత్‌లో ప్రజాప్రతినిధిగా రేవంత్‌రెడ్డిని ప్రజలు విశ్వసించరని, ప్రజా నాయకుడిగా కొనసాగాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి, మన్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల–శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మారుస్తాం -
Huzurabad : కాంగ్రెస్ నుంచి బరిలోకి మాజీమంత్రి కొండా సురేఖ..?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై పార్టీలన్నీ పట్టు బిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ– టీఆర్ఎస్ నువ్వానేనా అన్న స్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల శాలపల్లిలో జరిగిన సీఎం సభతో గులాబీ నేతల్లో జోష్ పెరగగా.. కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ నేతలు యాత్రలు షురూ చేశారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉండటంతో ధీటైన స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచనలో ఉంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రచారంలో ఎక్కడా తగ్గవద్దని, మరింత పట్టుబిగించాలని అధిష్టానాలు ఆదేశించాయి. అభివృద్ధి నినాదంతో గులాబీనేతలు.. ► దళితబంధు అమలు చేస్తోన్న నేపథ్యంలో కారుపార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. దీనికితోడు నోటిఫికేషన్ వచ్చేలోగా నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ► హుజూరాబాద్ మండలం మొత్తం మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. వీణవంక మండల బాధ్యతలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు భుజాలకెత్తుకున్నారు. జమ్మికుంట టౌన్ ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తలమునకలయ్యారు. జమ్మికుంట రూరల్ పనులు ఆరూరి రమేశ్ చూస్తున్నారు. ► కీలకమైన ఇల్లందకుంట మండలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యవేక్షిస్తున్నారు. కమలాపూర్ మండలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ► సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ తిరిగి వివరించాలని శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థి పార్టీల పేర్లను పెద్దగా ప్రస్తావించకుండానే.. నేతలు ప్రసంగిస్తుండటం గమనార్హం. యాత్రలతో కమలనాథుల ఉత్సాహం.. ► హుజూరాబాద్‌లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో చేసిన పర్యటన ఆ పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ► గతంలో ఈటల రాజేందర్ జన ఆశీర్వాద యాత్రకు మంచి స్పందనే వచ్చింది. ఇక త్వరలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికకు బాగా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. ► జమ్మికుంట పట్టణానికి ఫైర్‌బ్రాండ్ ఎంపీ అరవింద్‌ను నియమించారు. జమ్మికుంట మండలం బాధ్యతలు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుకు అప్పగించారు. హుజూరాబాద్ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హుజూరాబాద్ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కేటాయించారు. ► ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డిని, కమలాపూర్ మండలానికి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు చేస్తోన్న ప్రచారాలు, రోడ్‌షోలతోపాటు నాయకుల యాత్రలు తమకు కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారు. కొండా సురేఖ పేరు లాంఛనమే..! ► ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడ బలమైన నాయకులను బరిలోకి దింపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. స్థానికనేతలైన పత్తి క్రిష్ణారెడ్డిని, ఎన్ఆర్ఐ పాడి ఉదయానంద్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంప్రదించారని తెలిసింది. ► ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన బలమైన నేత, మాజీమంత్రి కొండా పేరును కొందరు ప్రతిపాదించారు. హుజూరా బాద్ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్‌కు భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉండటంతో కొండా సురేఖ సైతం పోటీకి సై అన్నారని తెలిసింది. ► అయితే, ఇక్కడ పోటీ చేయాలంటే ఆమె కొన్ని షరతులు విధించారని సమాచారం. 2023 ఎన్నికల సందర్భంగా తనకు ఉన్న డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ షరతులకు అంగీకరిస్తే పోటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న కొండా వర్గీయుల ప్రతిపాదనకు అధిష్టానం కూడా అంగీకరించిందని సమాచారం. ► వాస్తవానికి ఇటీవల రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోనే కొండా పేరును ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాఖీపౌర్ణమి అనంతరం సురేఖ పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. చదవండి: మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్ విజయవంతం -
Etela Rajender: పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారు!
ఇల్లందకుంట (హుజూరాబాద్): పదవుల కోసం టీఆర్ఎస్ నాయకులు పెదవులు మూసుకుంటున్నారని, ఆత్మవంచన చేసుకుని బతకడం తనకు ఇష్టం లేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణకాలనీకి చెందిన పలువురు నాయకులు మంగళవారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని ఈటల పేర్కొన్నారు. తాను పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనని, ఎవరికి ఆపద వచ్చినా తక్షణ సాయం అందిస్తానని చెప్పారు. పట్టణంలో ఇటీవల కాలంలో మరణించిన మృతుల కుటుంబాలను ఈటల పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాగా, ఈటలకు బీసీ కులాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది. -
హుజూరాబాద్‌లో వేయి మందితో నామినేషన్
హుజూరాబాద్: హుజూరాబాద్‌లో జరగబోయే ఉపఎన్నికలో వెయ్యి మందితో నామినేషన్ వేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పత్యం యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి తెలిపారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడే మకాం వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆదివారం హుజూరాబాద్‌లోని హైస్కూల్ క్రీడా మైదానంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో సర్క్యులర్ నెంబర్ 4779ని ప్రభుత్వం జారీ చేసిందని, ఆ జీవోను రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమిస్తే 2020 మార్చిలో విధుల నుంచి తొలగించారని తెలిపారు. 16 నెలలుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోకపోతే పోటీకి దిగుతామని చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షులు రమేశ్, శ్రీనివాస్, రవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
Huzurabad Bypoll: అలా చేస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం: హరీశ్‌రావు
-
అలా చేస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. యావత్ తెలంగాణ ఎన్నికగా మారింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మతకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి పార్టీలు. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ ఎలక్షన్‌గా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున రంగంలోకి దిగిన హరీశ్‌రావు.. బీజేపీపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్ విసిరారు హరీశ్‌రావు. దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తెస్తే.. మోదీ ఫోటోకు పాలాభిషేకం చేస్తానన్నారు హరీశ్‌రావు. శనివారం ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తాం. రైతుబంధుపై దుష్ప్రచారం చేసినట్లే.. దళితబంధుపై కూడా చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. దళితబంధు ఇచ్చి తీరుతాం. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలి.. దళితబంధుకు కేంద్రం నిధులు ఇస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం’’ అన్నారు మంత్రి హరీశ్‌రావు -
Huzurabad: కొత్త నేతలు తెరపైకి..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరులో ఆసక్తికర పరిణామం నెలకొంది. దేశంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియలో ఈసీ తీసుకున్న కీలక నిర్ణయమే ఇందుకు కారణం. కరోనా ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేసి వాటిపై ఈనెల 30లోగా అభిప్రాయాలు పంపాలని ఈసీ అన్ని పార్టీలను కోరింది. ఆయా పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించాక, ఈసీ తన నిర్ణయాన్ని వెలువరించడానికి మరో మూడు, నాలుగు వారాలు పట్టే అవకాశాలున్నాయి. ఈ లెక్కన సెప్టెంబరు ఆఖరువారంలో లేదా అక్టోబరు వరకు నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో రేపోమాపో హుజూరాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందనుకున్న పార్టీలంతా కాస్త నిరాశకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం.. డిసెంబరులోపు హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో ఐపీఎల్ లెవల్లో వేడి పెంచిన రాజకీయ పార్టీలు అనూహ్యంగా వచ్చిన ఆరేడు వారాల సమయాన్ని ఎవరికి వారు తమకు దక్కిన ‘సూపర్ ఓవర్’గానే భావిస్తున్నాయి. కొత్త నేతలు తెరపైకి..! హుజూరాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమను గెలిపిస్తారన్న ధీమా గులాబీ నేతల్లో ఇప్పటికే కనిపిస్తోంది. రైతుబంధు, రైతుబీమా, వృద్ధాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మికి తోడుగా దళితబంధుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాజాగా.. దళితుల అభ్యున్నతికి దళితబంధు పేరుతో రూ.ఐదు వందల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను 16వ తేదీన శాలపల్లి వేదికగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ పథకంతో నియోజకవర్గంలో దాదాపు 40 వేలకుపైగా దళితులను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. వీటికితోడు నియోజకవర్గంలో పెండింగ్ పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణాలను చేపడతామని, ప్రతీ గ్రామానికి మహిళా భవన్లు నిర్మిస్తామని హామీ ఇస్తోంది. ముగ్గురు కొత్త నేతలను ముందుపెట్టి.. ఈ ఉపపోరులో గెలిచే పావులు వేగంగా కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ పథకాలతోపాటు స్థానిక నేతలకు పదవుల పరంగా ఇచ్చిన అవకాశాలను కూడా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్, ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి, అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ విరామ సమయంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొనేలా గులాబీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇన్ని విస్తృత అవకాశాలు కల్పించామని, గెలిస్తే మరింత చేస్తామన్న సంకేతాలు పంపేలా చర్యలు చేపడుతున్నారు. ఆత్మగౌరవంతో ఈటల.. అన్నీ తానై! రాజీనామా చేసిన సమయం నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తాజాగా.. లభించిన విరామ సమయం తనకు కలిసి వస్తుందని ఆయన వర్గం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆత్మగౌరవ నినాదం, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి, రెండు దశాబ్దాలుగా తనకు స్థానికులతో ఉన్న అనుబంధం గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈసీ నోటిఫికేషన్ వెలువరించే వరకు తన ప్రచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఈటల చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్రకు బండి సంజయ్ వచ్చారు. అలాగే.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇన్చార్జి కావడంతో ఇక్కడే ఉంటున్నారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎంపీ వివేక్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కూడా ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇంకా స్పీడ్ పెంచాలని ఆ శిబిరం భావిస్తోంది. గులాబీ పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్కసుమన్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నోటిఫికేషన్ అనంతరం బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు సైతం హుజూరాబాద్‌లో విస్తృతంగా పర్యటిస్తారని కమలనాథులు చెబుతున్నారు. రెండుపార్టీల గుట్టు బయటపెడతాం.. ఇంతవరకూ అభ్యర్థిని ఖరారు చేయని కాంగ్రెస్‌కు ఈ విరామ సమయం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. బీజేపీ–టీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీల అసలు గుట్టును ప్రజలకు వివరించేందుకు ఇదే చక్కటి అవకాశమని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థి కూర్పుపై కసరత్తు ప్రారంభించిన హస్తం పార్టీ పలువురు సీనియర్ నాయకులతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు ఇతర నియోజకవర్గాల నేతలు ఆసక్తి చూపిస్తున్నా.. స్థానికులైతేనే మేలన్న ఆలోచనలో టీపీసీసీ ఉందని సమాచారం. గెలిచినా, ఓడినా.. కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఆ వెంటనే శాసన సభ ఎన్నికలు వస్తాయి. రెండుసార్లు పోటీ అంటే సీనియర్లు ఖర్చు భరించే స్థితిలో లేరు. దీంతో పొరుగునే ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా హుజూరాబాద్‌కే చెందిన ఓ కాంగ్రెస్ నేతతోపాటు, మరో ఎన్నారైతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈసీ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. అభ్యర్థిని ఖరారు చేసుకోవడంతోపాటు, బీజేపీ–టీఆర్ఎస్లు ప్రజల్ని మభ్యపెడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు చిక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా దళిత సంక్షేమం విషయంలో ఇరు పార్టీల కపట ప్రేమను బయటపెడతామని చెబుతున్నారు. -
హుజూరాబాద్ హీట్: గెలుపు కోసం ఎవ్వరూ తగ్గట్లే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ తన దూకుడు పెంచింది. మరోవైపు ఉపఎన్నికకు ముందు ఈసీ తాజాగా ఇచ్చిన సంకేతాలతో మిగిలిన పార్టీలు కూడా కదనరంగంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తమతమ అభిప్రాయాలు చెప్పాలంటూ అన్ని పార్టీలను ఎన్నికల కమిషన్ గురువారం కోరింది. దీంతో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈటల అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అయినట్లుగానే ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసిందని సమాచారం. కాంగ్రెస్ కసరత్తు ►అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించడం టీఆర్ఎస్కు కలిసొచ్చింది. గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తూ, నియోజవకవర్గంపై వరాల జల్లు ప్రకటిస్తూ.. ప్రత్యర్థి వర్గాలు కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ►రాజేందర్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. తాను సీఎంకు, ప్రగతి భవన్‌కు బానిసను కాదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే.. తన అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ►అదే సమయంలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో అసలు ఆ పార్టీ పోటీలోనే లేదని కారు పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. హుజూరాబాద్‌లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. ఈ స్థానం నుంచి స్థానికంగా గట్టి నేతలు అందుబాటులో లేకపోవడంతో బలమైన మహిళ లేదా దళిత నేతలను బరిలో నిలిపే యోచనలో రేవంత్ ఉన్నారు.ఇప్పటికే దీనిపై ఆయన పలువురు నేతలను సంప్రదిస్తున్నారు. ►మరో రెండున్నరేళ్లు మాత్రమే ఎమ్మెల్యే పదవీకాలం ఉండటం, ఒకవేళ ఇక్కడ పరాజయం పాలైతే సొంత నియోజకవర్గంలోనూ ఆ ప్రభా వం ఉంటుందన్న ఆందోళనలో కొందరు పోటీ కి సంశయిస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ వారాంతానికి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సమాచారం. ఈసీ అభిప్రాయాలు కోరడంతో..! కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించాల్సిన ఉప ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పాటించాల్సిన కోవిడ్ నిబంధనలకు సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆగస్టు 30లోగా పార్టీలు అభిప్రాయాలు తెలపాలని కోరింది. దీంతో ఉప ఎన్నికలు జరగాలి్సన చోట వేడి పెరిగింది. ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిత్వాలపై త్వరలోనే ఉత్కంఠ వీడనుంది. పేలుతున్న మాటల తూటాలు.. ఇంకా నోటిఫికేషన్ వెలువడకుండానే.. నియోజకవర్గంలో ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ దూకుడే ఆయుధంగా ముందుకు వెళ్తోంది. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ సైతం అదే తరహాలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆత్మగౌరవం నినాదంతో ఈటల మాటల తూటాలు పేలుస్తుంటే.. అభివృద్ధి బావుటాతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. బుధవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమనాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసి పోటీలో ముందే ఉన్నామని ప్రతిపక్షాలకు సంకేతాలు పంపారు. ఈ ఉప ఎన్నికకు ఇన్చార్జీ బాధ్యతలను హరీశ్‌రావు తీసుకున్నారు. తమకు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను, తమ పార్టీ అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మీ, వృద్ధాప్య పింఛన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగిస్తున్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందేలా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. -
తెలంగాణ లో హుజురాబాద్ రాజాకీయ వేడి
-
తెలంగాణ లో హుజురాబాద్ రాజాకీయ వేడి
-
Huzurabad Bypoll: వేడెక్కిన రాజకీయం.. సై అంటే సై
-
ఈటలను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్‌ను ‘రా’ అంటుండు
సాక్షి, కరీంనగర్: ‘‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను ఈటల రాజేందర్ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. ఓటమి భయంతోనే ఈటల మాట తూలుతున్నాడు’’ అంటూ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో.. ఈటల వ్యవహారం అలానే ఉందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్‌లో స్వాగతం చూస్తా ఉంటే.. శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని అర్థమవుతుంది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే ఈటెల రాజేందర్.. తనను చూసి ఓటు వేయమంటున్నడు. బీజేపీలో ఉంటు ఆత్మ వంచన చేసుకొని ఆత్మగౌరవం అంటున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదు. పోటీ ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీకే’’ అని తెలిపారు. ‘‘సిద్దిపేట నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో మహిళా భవనం ఉంది. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఎందుకు లేదు. గేల్లు శ్రీనివాస్ గెలిస్తే ప్రతి గ్రామంలో మహిళ భవనాలు కట్టిస్తం. ఈటల ఆత్మగౌరవం అంటూ.. గడియారాలు, కుట్టు మిషనులు, సెల్ ఫోన్లు, టీషర్ట్లు పంచుతున్నాడు. అందుకే గడియారాలు నేలకేసి కొడుతున్నారు. ఎకరం అమ్ముత.. ఎలక్షన్ గెలుస్త అన్నాడు.. అమ్మిండు పంచూతా ఉన్నాడు. హుజూరాబాద్‌లో రెండు గుంటల భూమికి.. రెండు వందల ఎకరాలకు మధ్య పోటీ. గేల్లు శ్రీనివాస్‌కు రాష్ట్ర కేబినెట్ ఆశీర్వాదం ఉంది. మీ ఆశీర్వాదం కూడా కావాలి’’ అని ప్రజలను అభ్యర్థించారు హరీశ్‌రావు. -
ఎమ్మెల్యే పదవికి గంగుల రాజీనామా చేయాలి
సాక్షి, కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, వెంటనే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇందిరా చౌక్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నగర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల అవుతాయని, 10 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళిత బంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. గొర్రెలు, బర్రెలు, దళిత బంధు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, నిధులు రావాలంటే ఉప ఎన్నిక రావాలన్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ ఇవన్నీ వస్తున్నాయని తెలిపారు. ఉపఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తారని, టీఆర్ఎస్ నాయకులకు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, ఎస్ఏ.మోసిన్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పరి రవి, చర్ల పద్మ, అబ్దుల్ రెహమాన్, మామిడి సత్యనారాయణరెడ్డి, కొమ్ము సునీల్, కమ్రుద్దీన్, కొరవి అరుణ్ కుమార్, కొలిపాక సందీప్, బోనాల శ్రీనివాస్, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ఇర్ఫాన్, సలీమొద్దీన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘దళితబంధు’ చట్టవిరుద్ధం.. హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు బి.సంగీత, కాసాని రత్నమాల, ఎ.ఆనంద్‌లు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే అమలు చేయాలి... రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని, అక్కడ దళిత బంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్‌లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కల సురేష్‌కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదే..
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల ఉన్న సమయంలో కరోనా కట్టడికి అలుపెరగని కృషి చేశారన్నారు. బీసీ నాయకుడిగా ఈటల ఆరుసార్లు గెలిచారంటే ప్రజాధరణ ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ ఓటర్లు నైతికవంతులని, అనూహ్యరీతిలో ఇంటలిజెన్స్‌కి అంతుపట్టకుండా ఉపఎన్నికల్లో తీర్పునిస్తారన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదేనని అన్నారు. -
హుజురాబాద్: ఉప ఎన్నిక బరిలో ప్రవీణ్‌కుమార్?!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ తరఫున ఆయన బరిలో దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కంచుకోటగా ఉన్న హుజురాబాద్‌లో గెలుపునకై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కడియం శ్రీహరి తదితర పేర్లు తెరమీదకు వచ్చినా ఎటువంటి ముందడుగు పడలేదు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాయడం, ఉప ఎన్నిక బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి గంగుల కమలాకర్ నేడు మాట్లాడుతూ.. ఉప ఎన్నిక అభ్యర్థి అంశం ఖరారైందన్నట్లు సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్.. అడిషనల్ డీజీపీ హోదాలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కరీంనగర్లో ఎస్పీగా పనిచేసిన ఆయనకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఇందుకుతోడు ప్రవీణ్‌కుమార్‌కు రాజకీయాలు అంటే ఆసక్తి అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక నేడు రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘కుట్రపూరితంగా నన్ను ఒక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆరేళ్లకు ముందే తప్పుకుంటున్నా. ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశా. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? ఇప్పుడే చెప్పలేను’’ అని వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు.. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, దళిత బంధు పథకం(హుజురాబాద్ పైలట్ ప్రాజెక్టు) ప్రకటన వంటి అంశాలతో అధికార పార్టీ ఓటర్లకు గాలం వేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో దింపేందుకే ప్రవీణ్‌కుమార్‌తో రాజీనామా చేయించారనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా సోమవారం నాటి పరిణామాలు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
హుజురాబాద్: కాంగ్రెస్ దూకుడు.. ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. అదే విధంగా... వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలు ►వీణవంక - ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్ ►జమ్మికుంట - విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ►జమ్మికుంట మున్సిపాలిటి - సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య ►హుజురాబాద్ - తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ►హుజురాబాద్ మున్సిపాలిటీ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు ►ఇల్లందకుంట - నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ►కమలాపూర్ - కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య -
బచ్చాగాళ్లు పెద్దనాయకులు కాలేరు: కాంగ్రెస్ నేతల ఫైర్
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్‌రెడ్డికి మాణికం ఠాకూర్, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను విమర్శించేస్థాయి లేదని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రగతిభవన్ నుంచి వచ్చే స్కిప్ట్‌ను చదివి, కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే బచ్చాగాళ్లు పెద్దనాయకులు కాలేరని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు వాడుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, జీహెచ్ఎంసీ టిక్కెట్లు, పీసీసీ పదవులు ఇప్పిస్తానని, హుజూరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన చరిత్ర కౌశిక్‌ది అని అన్నారు. దమ్ముంటే రాబోయే ఉప ఎన్నికల్లో స్వతంత్రగా పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, తదితరులు ఉన్నారు.రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీపై స్వలాభం కోసమే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. రేవంత్ రెడ్డి, పొన్నంలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
హుజురాబాద్.. సై అంటే సై: ఎంట్రీ ఇవ్వనున్న రేవంత్‌రెడ్డి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత లేదు. కానీ.. ముందస్తుగానే ఎన్ని కల వాతావరణం వచ్చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రధాన పక్షాలు బలగాలను మోహరించాయి. అధికార పార్టీ తరఫున మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు మండలాల వారీగా మకాం వేశారు. అటు ఈటలకు మద్దతుగా కాషా యదళం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల తరఫున ఇన్చార్జిలు, నాయకులు కార్యక్షేత్రంలో కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారు. స్థూలంగా ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఈటలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ టీఆర్ఎస్,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచి చరిత్ర సృష్టించాలని భా విస్తున్న ఈటల రాజేందర్‌ను అష్టదిక్కుల దిగ్బంధం చేసే పనిలో అధికార పార్టీ ఉంది. కొన్నేళ్లుగా ఈటల వెంట ఉన్న టీఆర్ఎస్ నాయకులను, స్థా నిక ప్రజాప్రతినిధులను దూరం చేసే క్రతువును ఇప్పటికే విజయవంతంగా ఆ పార్టీ నాయకులు పూర్తి చేశారు.మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ క్యాడర్‌ను పూర్తిస్థాయిలో ఈటల నుంచి లా క్కోవడంలో విజయం సాధించారు. తాజాగా.. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తు మ్మేటి సమ్మిరెడ్డి కూడా ఈటలకు గుడ్‌బై చెప్పారు.వార్డు మెంబర్ల నుంచి మొదలు కొని సర్పంచుల వరకు, ఎంపీటీసీల నుంచి ఎంపీపీలు, జె డ్పీటీసీల వరకు పార్టీతోనే ఉండేలా చక్రం తిప్పారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఈటలతో పాటు బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతున్నా, టీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి వెళితే కొనుగోలు చేసినట్లు తప్ప సొంతపార్టీలో ఉంటే కొనుగోలు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ టలను క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టేందుకు మంత్రులు హరీశ్‌రావు,కమలాకర్,ఈశ్వర్ ప్రణాళికలు చేస్తున్నారు. వీరికి వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సోషల్ మీడియా ప్రచారానికి బాల్క సుమన్ తోడయ్యారు. ఈటలతోపాటు గడపగడపకూ కమలదళం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తన వెంట క్లిష్ట సమయంలో కలిసి రావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈటల సతీమణి జమున గ్రామాల్లో పర్యటిస్తూ సానుభూతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. బీజేపీ ఇన్చార్జిగా నియమితులైన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ఇతర నాయకులు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ మండలాల వారీగా ఈటలకు మద్దతును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈటలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే పనిలో ఉన్నారు. రైతుబంధును వద్దన్నారని, కొన్ని కులాల ఓట్లు తనకు అక్కర్లేదన్నట్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఈటల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి బుధవారం ఖండించారు. మరోవైపు కరీంనగర్, వరంగల్ నుంచి దిగిన బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్, ఏబీవీ పీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో జనంలోకి చొచ్చుకొని పోతున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావ్ వంటి నేతలు పూర్తిస్థాయిలో హుజూరాబాద్‌లో మకాం వేసే పనిలో ఉన్నారు. త్వరలో రంగంలోకి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నిక అత్యంత కీలకం కానుంది. తనను తాను రుజువు చేసుకునేందుకు హుజూరాబాద్‌ను వేదికగా మలచుకుంటారని అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు ఆయన స్వయంగా హుజూరాబాద్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పార్టీ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంతవరకు కొనసాగిస్తారనే అంశం చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆయన అనుయాయులు పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా లేరు. కౌశిక్ ముఖ్య అనుచరులు ఇప్పటికే టీఆర్ఎస్లోకి వెళ్లారని, ఆయన కూడా కారెక్కడం ఖాయమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా ప్రగతిభవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌నే కౌశిక్ రెడ్డి చదివారని, కేటీఆర్‌ను కలిసి రహస్యంగా మాట్లాడడమే అందుకు నిదర్శనమని చెపుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కజిన్ అయిన కౌశిక్ రెడ్డిని రేవంత్‌రెడ్డి ఎంత మేర పరిగణనలోకి తీసుకుంటారనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ కౌశిక్‌ను కాదంటే ఎవరిని బరిలోకి దింపుతారనేది కూడా కాంగ్రెస్ ముందున్న సవాల్. రెండేళ్ల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరువాత రెండోస్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ కావడంతో ఆచితూచి వ్యవహరించాలని రేవంత్ భావిస్తున్నారు.