మాట్లాడుతున్న ప్రకాశ్‌రావు
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల ఉన్న సమయంలో కరోనా కట్టడికి అలుపెరగని కృషి చేశారన్నారు.
బీసీ నాయకుడిగా ఈటల ఆరుసార్లు గెలిచారంటే ప్రజాధరణ ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ ఓటర్లు నైతికవంతులని, అనూహ్యరీతిలో ఇంటలిజెన్స్‌కి అంతుపట్టకుండా ఉపఎన్నికల్లో తీర్పునిస్తారన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment