campaign
-
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో తెలుగు నాయకులు, హామీల వర్షం
సాక్షి, ముంబై: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాత్రి వరకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, నాయకులు ఎన్నికల ప్రచారం చేయడంతోపాటు సోమవారం ఎన్నికల ప్రచారపర్వం ముగిసేంత వరకు స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నేతలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతోపాటు అనేక మంది మంత్రులు ప్రచారాల్లో పాల్గొన్నారు. 16, 17 తేదీల్లో పదుల సంఖ్యలో నిర్వహించిన సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సారి కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శనివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ప్రకటించినప్పటికీ ఆయన సోదరుడు మృతి చెందడంతో ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ముంబై, నాసిక్, పశ్చిమ మహారాష్ట్రలోని సోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలతోపాటు మరఠ్వాడాలో లాతూర్, జాల్నా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నాందేడ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, విదర్భలోని నాగ్‌పూర్‌తోపాటు తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్, గడ్చిరోలి తదితర ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ప్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలతోపాటు ముఖ్యంగా ఎన్నికల ప్రచార పాటల తెలుగు పాటలే కావడంతో అనేక మంది తెలుగు ఓటర్లను ఆకట్టుకునేలా చేశాయని చెప్పవచ్చు. హామీల వర్షం.. తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరూ హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం తోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. వీరి సభలకు తెలుగు ప్రజలు హాజరుకావడంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోపాటు మహారాష్ట్ర వికాస్ అఘాడీ అభ్యర్థులకు ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. ‘ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ అభ్యర్థి. హైదరాబాద్‌లో నేను..’ ఇలా ఒక్క ఓటుకు ఇద్దరు సేవలకులం అంటూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కాంగ్రెస్ తెలిపే అబద్ధపు మాటలను నమ్మొద్దంటూ బీజేపీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు. తెలుగు ప్రజలతోపాటు అందరికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు వారి సమస్యలు పరిష్కారమయ్యేనా? మహారాష్ట్ర లో నివసించే తెలుగు ప్రజలకు పలు సమస్యలున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు నాయకులు ఇచి్చన హామీలు ప్రతిసారి ఎన్నికల్లో ఇచ్చే హామీల్లాగే మిగిలిపోతాయా? లేదా తమ సమస్యలు ఈ ఎన్నికల తర్వాత పరిష్కారమవుతాయా? అనే విషయంపై తెలుగు ప్రజల్లో చర్చల్లో ప్రారంభమయ్యాయి. అయితే అనేక మంది ఈ సారి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు భవనం, తెలుగు పీఠం గురించి పెద్ద రాజకీయ నాయకులెవరూ ప్రచారంలో మాట్లాడకపోయినప్పటికీ మీ సమస్యలేమైనా సరే అన్ని తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఇక ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వర్లీ అసెంబ్లీ శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే మాత్రం ముంబై కరీంనగర్ల మధ్య రైళ్లు, తెలుగు భవనం గురించి ప్రస్తావించారు. రైళ్ల సమస్యలు తీరుస్తామని తెలుగు భవనం నిర్మాణం చేస్తామన్నారు. -
మైకులు బంద్.. ముగిసిన ‘మహా’ ఎన్నికల ప్రచారం
ముంబయి:మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం(నవంబర్18) సాయంత్రం ముగిసింది. ప్రచారం చివరి రోజు మరింత వేడెక్కి పార్టీల మధ్య యాడ్వార్ నడిచింది. ప్రత్యర్థుల వైఫల్యాలివే అంటూ అధికార, విపక్షాలు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలిచ్చాయి.కర్ణాటక పథకాలపై మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను కన్నడ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై బీజేపీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడులు మొదలుకొని కొవిడ్ కిట్ స్కామ్ వరకు అనేక అంశాలను ప్రకటనల్లో బీజేపీ ప్రస్తావించింది.పాల్గర్లో సాధువుల హత్య, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిలివేసిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి రైలు పేలుళ్లు, అంబానీ ఇంటికి బెదిరింపులతో పాటు ఎంవీఏ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. బుధవారం(నవంబర్20) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్‌కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్‌షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్‌సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్‌గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్‌లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాయం సున్నా.. ప్రచార ఆర్భాటం వంద!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విజయవాడను ముంచేసిన వరదల విషయంలో సాయం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వరద బాధితులు పడుతున్న కష్టాలు, నష్టాల తీవ్రతను తగ్గించడం సంగతి ఎలా ఉన్నా మూడు నాలుగు రోజుల నిష్క్రియాపరత్వంతో దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.వాస్తవానికి ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరు. కానీ.. ఆచంట మల్లన్న టైపు నేతలకు కూటమి ప్రభుత్వంలో లోటేమీ లేనట్టు స్పష్టమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంతి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్లు కూడా బాబును పొగడ్డమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ భజన కాస్తా వికటించి ఆయన పరువే తీసినట్టుగా కనిపిస్తోంది.ఐదు రోజుల క్రితం విజయవాడను వరద చుట్టేసిన తరువాత చంద్రబాబు చేయని విన్యాసమంటూ లేదు. రోజూ రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడటం, జేసీబీపై ఎక్కి ఒకసారి.. పడవలో వెళ్లి ఇంకోసారి, మోకాలి లోతు నీళ్లలో మరోసారి వెళ్లి తాను జనంలోనే ఉన్నట్లు.. వారి కోసమే పని చేస్తున్నట్లు గట్టి కృషే చేశారు. ఏదో ఒక పేరుతో వరద ప్రాంతాల్లో తిరుగుతూండటంతో అధికారులే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాబు గారు మాత్రం మీడియా కవరేజీ కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.భజన మీడియా కూడా తనవంతుగా బాబుగారి ప్రచారానికి పోటాపోటీలు పడుతున్నాయి. అదేదో సినిమాలో ఉన్నట్లు.. ‘‘అన్న నడిచొస్తే మాస్.. అన్న మడతేస్తే.. మాస్.. మ మ మాస్’’ అనేలా ఉంది వీరి రాతలు. వరదలొచ్చిన ఐదు రోజులకు ఈనాడు ఓ కథనంలో... బుడమేరు వరదకు చంద్రబాబు చలించిపోయారని, బాధితులు, రైతుల కష్టాలు విన్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయని, రాసుకొచ్చింది. విజయవాడలో వరదల కారణంగా ఇప్పటి వరకూ యాభై మంది మరణించారన్న సమాచారానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మొక్కుబడిగా కొన్ని వార్తలు రాసి చేతులు దులుపుకుంది.వరద సహాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకునే చర్యల గురించి రాయడం తప్పు కాదు. కానీ ప్రజల బాధల కన్నా చంద్రబాబు గురించే ఈనాడు, తదితర మీడియాలు కొన్ని తెగ దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతిగా చేసే ప్రచారం ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. కేంద్ర మంత్రి చౌహాన్ వరద బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శ చేశారో, లేదో కాని, టీడీపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేశారు. వరద సహాయ చర్యలు బాగానే చేసిందని తేల్చేశారు. మిత్రపక్షం కనుక మర్యాద కోసం ఒక మాట అంటే ఫర్వాలేదు కాని, డబ్బా కొట్టినట్లు మాట్లాడితే ప్రజలలో బీజేపీ నవ్వులపాలు కాదా? చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని చౌహాన్ కితాబు ఇచ్చారు. ఇల్లు మునిగిపోయి చంద్రబాబు తన బస కలెక్టరేట్‌కు మార్చిన విషయాన్ని చెప్పకుండా చెప్పకుండా, ఆయన సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని చేస్తోందని వ్యాఖ్యానించడం విశేషం.వరదల వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినా ప్రాణ నష్టం మాత్రం స్వల్పంగా ఉందని కేంద్ర మంత్రి స్వయంగా చెబితే ఏమని అనుకోవాలి? వరదల కారణంగా యాభై మంది మరణిస్తే అది తక్కువ సంఖ్య అవుతుందా? మృతులు ఎందరో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంటే... చౌహాన్ మాత్రం ఇలా విడ్డూరంగా మాట్లాడారు. పైగా తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించారన్న చౌహాన్ మెచ్చుకోలు కూడా ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఉత్తరాఖండ్, కేరళల్లోనూ వరద సహాయక చర్యలకు డ్రోన్లను వాడిన విషయం కేంద్ర మంత్రికి తెలియదా? అని నెటిజన్లు ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వరద నీటిలో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తే వారి బాధలు తెలుస్తాయి.పైపైన తిరిగి, ఎగ్జిబిషన్ పోటోలు చూసి, చంద్రబాబును పొగిడి, తన బాధ్యత తీరిపోయిందని అయిందని అనుకున్నట్లుగా ఉంది చౌహాన్ వ్యవహారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఈయనతై బాధితులను స్వయంగా చూడలేదు కానీ చంద్రబాబును మాత్రం ఆకాశానికి ఎత్తుతూ పొగిడేస్తున్నారు. పవన్ ఈ స్థాయిలో బాబుకు లొంగిపోతారని ఊహించ లేదు. గతంలో నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం ఎమ్మెల్యే ఒకరు ఉండేవారు. పవన్ కళ్యాణ్‌లా లొంగిపోయే వారిపై సామెతలు కొన్ని చెబుతుండేవారు.. ‘‘పొగడరా, పొగడరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత’’ అని చెప్పాడని ఎద్దేవ చేసేవారు. పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సృష్టించిన ఫోటోలను ఎక్స్‌లో పవన్ పెట్టి చంద్రబాబుకు బాకా ఊది ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.ఒక వృద్దురాలు డ్రోన్ ద్వారా నడుం లోతు నీళ్లలో ఆహారపొట్లం అందుకున్నట్లు ఉన్న పోటోను పోస్టు చేశారు. ఇది తనకు సంతృప్తి ఇచ్చిందని, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కానీ అది కృత్రిమ ఫోటో కావడంతో ఆయన నవ్వుల పాలవయ్యారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో పవన్ తన వ్యాఖ్యను మార్చేశారు. చంద్రబాబుతోపాటు తిరగకుండా ఈయన ఏమి నేర్చుకున్నారో అర్ధం కాదు. చంద్రబాబే అధికార యంత్రాంగం విఫలం అయిందని ఒప్పుకుంటే ఈయన మాత్రం ప్రభుత్వం బాగా పనిచేసిందని గొప్పలు చెబుతున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చి.. అవి అమలయ్యాక జనం వద్దకు వెళ్లడాన్ని కూడా పవన్ తప్పుపట్టిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వరదపీడిత ప్రాంతాలకు వెళితే అధికారుల విధులకు ఆటంకం అవుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు పదే,పదే తిరుగుతూ అధికారులకు ఇబ్బంది కలిగించడం లేదా అని అంటే మాత్రం బాజా వాయిస్తారు.మీడియా తలచుకుంటే ఎలా ప్రచారం చేయవచ్చనడానికి ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు బుడమేరు వంతెనపై నిలబడి ఉంటే ,ఆ పక్కగుండా రైలు వెళ్లింది. దానికి ఏమని ప్రచారం చేశారో తెలుసా! చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. అదేమిటా అని పరిశీలిస్తే ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు వెళ్లింది. ఆ టైమ్ లో ఆయన చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన రైలు వస్తున్న విషయం గమనించి ,అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డారు. మరి ఇందులో ప్రమాదం ఏమిటో అర్థం కాదు. ఇలా రాయమని చంద్రబాబు చెప్పి ఉండకపోవచ్చు.అయినా అతి భక్తి కల మీడియా ఇలా ప్రచారం చేసిందన్నమాట. ఈ నేపధ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం మీడియాలో ప్రచారం కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది లేదని వ్యాఖ్యానించారు. పత్రికలు చేతిలో ఉండడంతో ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నాయని ఎద్దేవ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ బుడమేరు ఆక్రమణల గురించి మాట్లాడడాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో మాట్లాడి కృష్ణా కరకట్టే మీద ఉన్న అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలని రాంబాబు సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ ధైర్యంగా ఆ విషయం మాట్లాడగలరా? ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అది అయ్యే పని కాదనిపిస్తుంది.తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా పోటీపడి చంద్రబాబును పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. వరద ప్రాంతాలవారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలోను, వరద బాధితులను ఆదుకోవడంలోను విఫలం అవడంతో నాలుగైదు రోజులపాటు ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లలోని సామానంతా పాడైపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారుంటే చంద్రబాబు, ప్రభుత్వ నేతలు తమ జబ్బలు తామే చరుచుకుని మురిసిపోతున్నారు.వరద బాధితులు అందరికి రేషన్ ఇవ్వలేకపోయామని అంటారు. వారి ఇళ్లకు రేషన్ చేర్చకుండా రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం మాత్రం శోచనీయం. ఇది పెద్ద వైఫల్యం కాదా! అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నేతలు ఒకరినొకరు పొగుడుకుని ఆత్మవంచన చేసుకుంటున్నారు. అనుకూల మీడియా ప్రచారం ద్వారా బాధితుల కష్టాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. జనం ఈ ప్రచారానికే అన్నీ బాధలు మర్చిపోతారా!- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Chandrababu: రెడీ.. లైట్స్ ఆన్ స్టార్ట్ యాక్షన్!
సాక్షి, అమరావతి: టీవీల్లో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఓ ఫొటో..! ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఓ వీడియో క్లిప్..! మీడియా ప్రతినిధులను పిలిచి చేతులు అటూ ఇటూ ఊపుతూ ఏదో వివరిస్తుంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్..! ఎవరక్కడ? అనడమే ఆలస్యం.. ‘సిద్ధం దొరా..!’ అంటూ సదా అందుబాటులో ఉంటున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం...!!ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు! కానే కాదు.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రెండు రోజులుగా సాగుతున్న సీను ఇదీ! ఓవైపు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది ‘అన్నమో రామచంద్రా’ అని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు యావత్ యంత్రాంగాన్ని తన చుట్టూ మోహరించి కలెక్టరేట్లో పండిస్తున్న ప్రచార సీన్ ఇదీ..!!నా ఫొటోలూ.. నా వీడియోలూ.. అంతా నేనేపీక్స్కు చేరిన చంద్రబాబు ప్రచార పిచ్చిస్పైడర్ సినిమాలో విలన్ ఎస్జే సూర్య ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలు వింటూ పైశాచిక ఆనందంతో పరవశించిపోతుంటాడు. సినిమాలో అది ఊహాజనిత పాత్ర కావచ్చుగానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి అందుకే మాత్రం భిన్నంగా లేదన్న విమర్శలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.వరద బాధితులు ఎలా పోతేనేం..! కరకట్టలు తెగి ఊళ్లు, చేలూ కొట్టుకుపోతేనేం... పేపర్లలో నా ఫొటోలు రావాలి..! టీవీ చానళ్ల తెర నిండా నేనే కనిపించాలి..! సోషల్ మీడియాలో నేనే వైరల్ కావాలి!! అనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం ఆయన ప్రచార కండూతికి నిదర్శనం. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనో ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తన క్యాంప్ ఆఫీసు నుంచో నిరభ్యంతరంగా సమీక్షించవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబు ఫొటోలు, వీడియోలు మీడియాలో పెద్దగా రావు కదా!! ఇక టెక్నాలజీకి తాను బ్రాండ్ అంబాసిడర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు విజయవాడకు భారీ వరద ఐఎండీ రెండు రోజులు ముందు నుంచే హెచ్చరిస్తున్నా ముప్పును అంచనా వేయడంలో ఘోర వైఫల్యం చెందారు. కూటమి సర్కారు వైఫల్యం విజయవాడ ప్రజల పాలిట శాపంగా మారింది. దాంతో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చేందుకు దీంతో చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. విజయవాడ కలెక్టరేట్‌కు మకాం మార్చి తానేదో ఒంటి చేత్తో వరదను అడ్డుకుంటున్నట్లు ‘బిల్డప్ బాబాయ్’ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు.టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతోపాటు అప్పటికప్పుడు జాతీయ మీడియాను కూడా పిలిపించుకుని చుట్టూ కూర్చొబెట్టుకుని మరీ ప్రచార సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బోటులో తిరుగుతున్న చంద్రబాబు... బుల్ డోజర్పై ఎక్కి చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు... లైఫ్ జాకెట్ వేసుకుని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు... డ్రోన్లను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఇలా సాగుతోంది ఈ ప్రహసనం. ముఖ్యమంత్రి వస్తున్నారంటే సహాయక చర్యలు వేగంగా చేపట్టి ఆర్థిక సహాయం చేస్తారని, వైద్య సేవలు అందేలా చూస్తారని బాధితులు ఆశిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజులిస్తూ వెళ్లిపోయారు. దీంతో బాధితులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు లేక.. ఆహారం అందక, తాగునీరు లేక అల్లాడుతున్నారు.బాబు సేవలో యంత్రాంగం ముఖ్యమంత్రే వచ్చి కలెక్టరేట్లో తిష్ట వేయడంతో అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి వరద బాధితులను గాలికి వదిలేసింది. ఇక ఓ వందమందితో కూడిన చంద్రదండు అనే ప్రైవేట్ సైన్యం అక్కడే మోహరించి చంద్రబాబు ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో వందల సంఖ్యలో చంద్రబాబు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం. సీఎం ఆఫీసు మునక... కరకట్ట ఇంట్లోకి వరదఅమరావతిని వరదలు ముంచెత్తడంతో అక్కడ రాజధాని నిర్మాణంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు సచివాలయం ఇటు కరకట్ట నివాసం రెండూ చంద్రబాబు అవినీతి, వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుండటంతో విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి హైడ్రామాకు తెరతీశారు. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్న విషయం మరోసారి అందరికీ గుర్తుకొస్తోంది. ఇప్పుడు కూడా దాదాపు అదే రీతిలో ప్రచార కండూతితో వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.తన ప్రచారానికే సీఎం ప్రాధాన్యంసీఎం చంద్రబాబు చేసేది తక్కువ.. ప్రచారం చేసుకునేది ఎక్కువ అని చెప్పేందుకు తాజా వరద ప్రత్యక్ష సాక్ష్యం. విజయవాడలో బుడమేరు వరద ధాటికి సింగ్నగర్తో పాటు పలు ప్రాంతాలు ముంపునకుగురై ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారికి అందించే సహాయ చర్యలను పర్యవేక్షించడానికంటూ చంద్రబాబు అవసరం లేకపోయినా అతిగా పర్యటనలు చేస్తున్నారు. కానీ అదంతా కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కోసమేనని అర్థమైంది. టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పెడుతున్న ఫొటోలు, వీడియోలే ఇందుకు సాక్ష్యం.టీడీపీ అధికారిక ‘ఎక్స్’ లో 225 టీడీపీ ఫేస్బుక్ గ్రూపులో 245ఐటీడీపీ ఫేస్బుక్లో 52సీఎంఓ అధికారిక ‘ఎక్స్’లో 30రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వాట్సప్ గ్రూపులో వందలాది ఫొటోలు, వీడియోలు పోస్ట్ -
వంధ్యత్వం కాదు.. అంధత్వం!
ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్‌పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్‌గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్‌ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్‌పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది. :::సరస్వతి రమ -
పిల్లల భవిష్యత్ కోసం.. అబ్ ఇండియా బనేగా 7-స్టార్
పిల్లలకు వచ్చే వ్యాధులను దూరం చేయడానికి.. వారి భవిష్యత్తకు మద్దతుగా నిలబడటానికి జీఎస్కే (GSK) 'అబ్ ఇండియా బనేగా 7-స్టార్' అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది.అబ్ ఇండియా బనేగా 7-స్టార్ ద్వారా పోలియో, చికెన్‌పాక్స్, హెపటైటిస్ A, హెపటైటిస్ బి, మెనింజైటిస్, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, హైబి ఇన్ఫెక్షన్ వంటి 14 వ్యాధులకు వ్యతిరేఖంగా 7 టీకాలు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని జీఎస్కే వెల్లడించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ 7 టీకాలను వేయాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సిఫార్సు చేస్తోంది.పిల్లల మొదటి పుట్టిన రోజు నుంచి.. కొన్ని వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా అవసరమని జీఎస్కే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ షాలినీ మీనన్ వెల్లడించారు. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని.. ఈ విషయాలను తల్లితండ్రులకు తెలియజేయడానికి ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.జీఎస్కే ప్రారంభించిన ఈ కార్యక్రమం గురించి టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఓటీటీ వంటి మల్టిపుల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా షెడ్యూల్ గురించి తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి లేదా 'మైవ్యాక్సినేషన్ హబ్.ఇన్' వంటి సైట్లను సందర్సించాల్సి ఉంటుంది. -
ట్రంప్‌పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ట్రంప్‌పై కాల్పులు జరపగా.. ఆయన చెవిని తాకుతూ బుట్లెట్ పక్కకు దూసుకువెళ్లింది. వెంటనే ఆప్రమత్తమైన సిక్రెట్ సర్వీస్ ఎజెంట్లు ఆయన ఆస్పత్రి తీసుకెళ్లారు. అనంతరం వారి జరిపిన కాల్పుల్లో నిందితుడు క్రూక్స్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా క్రూక్స్‌కు సంబంధించిన ఓ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో సందేశం ద్వారా కాల్పులు జరపనున్నట్లు సంకేతం ఇచ్చినట్లు తెలిపారు. ‘జూలై 13 నాకు చాలా ముఖ్యమైంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి’అని క్రూక్స్ సోషల్‌మీడియా పోస్ట్ చేశాడని తెలిపారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు అతడు షూట్ చేడానికి వాడిన గన్ టెక్నాలజీ, వాడిన మొబైల్, లాప్‌టాప్‌పై పరిశీలిస్తున్నారు.క్రూక్స్ మొబైల్లో డొనాల్డ్ ట్రంప్, ప్రెజిడెంట్ బైడెన్ ఫోటోలు, డొమెక్రటిక్ నేషనల్ కన్వేషన్ షెడ్యూల్, ట్రంప్ పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీకి సంబంధించి సమాచారం ఉన్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. క్రూక్స్ రెండు మొబైల్స్ కలిగి ఉన్నాడని ఒకటి కాల్పుల ఘటనాస్థలిలో స్వాధీనం చేసుకోగా.. మరోఫోన్ అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు తెలిపారు. అందులో కేవలం 27 కాంటక్ట్ నెంబర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. -
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
-
TG: ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ బూత్‌లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి, కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ మధ్య పోరు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో కాలుమోపిన కన్హయ్య ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.కన్హయ్య కుమార్ తన ప్రచార ఖర్చుల కోసం గడచిన ఏడు రోజుల్లో రూ. 52 లక్షలను క్రౌడ్ ఫండింగ్ రూపంలో సేకరించారు. ఆయన మే 15 నుంచి ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా చందాలను స్వీకరించడం ప్రారంభించారు. బుధవారం రాత్రి నాటికి కన్హయ్య కుమార్‌కు మొత్తం 2,250 మంది రూ. 52 లక్షలను చందాల రూపంలో అందించారు. కన్హయ్యకు చందాలు ఇచ్చిన వారిలో హాస్య కళాకారుడు కుణాల్ కుమార్, సినీ నిర్మాత విశాల్ భరద్వాజ్, అతని భార్య, గాయని రేఖా భరద్వాజ్, జెఎన్యూ మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్, మాజీ ప్రొఫెసర్ మోహన్‌రావు తదతరులు ఉన్నారు.కన్హయ్య కుమార్ ‘క్రౌడ్ ఫండింగ్’ రూపంలో మొత్తం రూ. 75 లక్షలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఫండ్ సేకరణకు ముందు కన్హయ్య కుమార్ ఒక వీడియో విడుదల చేస్తూ తాను శాంతి, ప్రగతి, న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా తాను చందాలు సేకరిస్తున్నానని, అలాగే గూగుల్ పే నంబర్ ద్వారా కూడా చందాలు సేకరిస్తున్నానని తెలియజేశారు. -
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు నెరవేరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భువనగిరిలో ఆదివారం(మే19) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘మోదీ గుడి కట్టినం అని ఓట్లు అడుగుతుండు. మేం కూడా గుడి నిర్మించాం. గుడి పేరుతో ఓట్లు అడగలేదు. మేము ప్రాజెక్టులు కట్టాం. అవికూడా దేవుళ్ళ పేరు మీద కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు మాత్రమే రైతులకు రైతు బంధు వేస్తున్నారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి నేనిచ్చా అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. ఒక వైపు బిట్స్ బిలాని చదువుకున్న అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు బ్లాక్ మెలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులు తేల్చుకోవాలి’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
మోదీ నుంచి నడ్డా వరకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ హైవోల్టేజీ ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పర్యటనలతో ప్రచారపర్వాన్ని దూకుడుగా పూర్తి చేసింది. బహిరంగసభలు, వివిధ సామాజికవర్గాల వారీగా సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమాలతో హోరెత్తించింది. ముఖ్యంగా మోదీ, అమిత్‌షా, నడ్డా వంటి అగ్రనేతలు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవ ర్గాలను ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టివచ్చేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాల రూపకల్పన ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు, ఇంకా కొంచెం కష్టపడితే గెలవగలిగే స్థానాలు, పోటీలో ఉన్న స్థానాలు...ఇలా వర్గీకరించుకుని తప్పకుండా విజయం సాధిస్తామనే చోట్ల అధిక దృష్టిని కేంద్రీకరించారు. ఇందుకు అనుగుణంగానే.. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు బీజేపీ నేతలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం పూర్తయ్యే ముందురోజు అంటే...శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో ఐదు ఎంపీ సీట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. అదేరోజు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక ప్రచారం ముగిసిన శనివారం చేవేళ్ల ఎంపీ సీటు పరిధిలోని వికారాబాద్‌లో, నాగర్‌కర్నూల్‌లోని వనపర్తిలో నిర్వహించిన సభల్లో అమిత్‌షా పాల్గొన్నారు.ప్రచారంలో దూకుడుగానేప్రధానపార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడేలోగానే తొలివిడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన బీజేపీ.. మొత్తంగా రాష్ట్రంలో ప్రచార విషయంలో మాత్రం బీజేపీ‘అడ్వాంటేజ్ పొజిషన్’లోకి ప్రవేశించిందనే చెప్పాలి. పదేళ్లపాటు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, తెలంగాణకు వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు వెరసి మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తేలా చేసింది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆరోపించిన రిజర్వేషన్ల రద్దు అంశం, మళ్లీ బీజేపీ వస్తే హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేస్తారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలపై ఏకంగా మోదీ, అమిత్‌షా సహా రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. -
Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. -
సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఇలా...
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం( మే11) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్‌స్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. -
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
టీడీపీ కార్యకర్త దాష్టీకం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
నేడు తెలంగాణకు అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టనున్నారు. మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.అమిత్ షా షెడ్యూల్ ఇలా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీలోని శ్రీసత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ వెళ్లనున్నారు. అక్కడి ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కాగజ్‌నగర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు అక్కడి గిరిరాజ్ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 6:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 6:45 గంటలనుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7:55 నిమిషాలకు బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయలుదేరనున్నారు.నేడు తెలంగాణకు రాహుల్.. రెండు సభలకు హాజరులోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్‌కు రానున్న రాహుల్.. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా అలంపూర్ వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ చేరుకొని పార్టీ నేతలతో కాసేపు భేటీ కానున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్తారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
బీజేపీ అగ్రనేతలతో ప్రచార దూకుడు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా.. బీజేపీ అధినాయకత్వం దూకుడు పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతుండటంతో.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఒకే రోజున రెండు మూడు సభలతో.. 1వ తేదీన హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మళ్లీ ఈ నెల 5న రాష్ట్రానికి వస్తున్నారు. ఒకేరోజు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్‌లో, సాయంత్రం 4 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం ఒంటి గంటకు భువనగిరిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు నల్లగొండలో జరిగే సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. మూడు నెలల్లో ఎనిమిది సార్లు మోదీ.. ప్రధాని మోదీ ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనతో కలిపితే.. మూడు నెలల్లోనే ఎనిమిది సార్లు ఆయన రాష్ట్ర పర్యటన చేసినట్టు అవుతుంది. మోదీ ఇంతకుముందే.. ఫిబ్రవరి మొదటివారంలో రెండు సార్లు, మార్చిలో మూడుసార్లు, ఏప్రిల్ చివరిలో ఒకసారి రాష్ట్రానికి వచ్చారు. ఇక ఈ నెల 8న వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.10న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను కవర్ చేసేలా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. అదేరోజున నారాయణపేటలో ప్రచారసభలోనూ మోదీ పాల్గొననున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే వారికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పోలింగ్‌కు ముందు మరోసారి ఇంటింటి ప్రచారం పార్టీ అగ్రనేతలు హాజరయ్యే సభలను మాత్రమే భారీగా నిర్వహించి.. మిగతా అంతా కూడా ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల పాటు ‘హర్‌ఘర్ బీజేపీ’కార్యక్రమాన్ని పూర్తి చేసిన బీజేపీ నేతలు.. పోలింగ్‌కు ముందు 9, 10, 11 తేదీల్లో తుది విడత ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల భేటీలో.. పోలింగ్ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ సార్లు ఓటర్లను కలుసుకోవడంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు. -
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్‌తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్‌లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
గాంధీ మార్గంలో ప్రచారం.. భేష్ అంటున్న జనం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరగని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నాయకులు వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే గుజరాత్‌లోని పోర్బందర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేక రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. పోర్బందర్.. జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలం. అందుకే మన్సుఖ్ మాండవియా.. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.మన్సుఖ్ మాండవియా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ రోడ్ షోలకు దూరంగా ఉంటున్నారు. ఈ పాత విధానంలో ప్రచారానికి కారణమేమిటని విలేకరులు అడగగా, ఆయన తాను పోర్బందర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందుకే మహాత్మాగాంధీ పాదయాత్రలు చేపట్టిన మాదిరిగా ప్రచారం కొనసాగిస్తున్నానని అన్నారు.తన ఎన్నికల పాదయాత్ర ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని ఆయన తెలిపారు. కాలినడకన ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులు తగ్గించాలని అన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తే, వేడి వాతావరణంలో జనం కూర్చోలేరని, అందుకే ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కాగా పోర్బందర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై మాండవ్య పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.