సాక్షి,అమరావతి: ఎన్నికల ప్రచార హోర్డింగులపై ప్రింటర్ మరియు పబ్లిషర్‌ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను బుధవారం( ఏప్రిల్ 10) ఆదేశించింది. మున్సిపాలిటీల స్థలాల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్‌లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A, ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్‌లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది.
పార్టీ, అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది.
ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు
Comments
Please login to add a commentAdd a comment