
కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిను రామ్‌రాజ్ కాటన్ కంపెనీ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించింది. ఇకపై రామ్‌రాజ్ కంపెనీ తయారుచేస్తున్న ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేయనున్నట్లు రామ్‌రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్ తెలిపారు.
రామ్‌రాజ్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం పట్ల రిషబ్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రచారంతో రామ్‌రాజ్ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని సంస్థ ఎండీ అరుణ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..?
1983లో ప్రారంభమైన ఈ సంస్థ 2023 మార్చి లెక్కల ప్రకారం దాదాపు రూ.119 కోట్లు మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉందని అంచనా. సంస్థలో భాగంగా ఉన్న రామ్‌రాజ్ సర్జికల్ కాటన్ మిల్స్‌లో కాటన్‌యార్న్, ఫాబ్రిక్స్ తయారవుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment