Ramraj cotton
-
రామ్రాజ్ కాటన్ ప్రచారకర్తగా కాంతారా హీరో
కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిను రామ్రాజ్ కాటన్ కంపెనీ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించింది. ఇకపై రామ్రాజ్ కంపెనీ తయారుచేస్తున్న ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేయనున్నట్లు రామ్రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్ తెలిపారు. రామ్రాజ్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం పట్ల రిషబ్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రచారంతో రామ్రాజ్ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని సంస్థ ఎండీ అరుణ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..? 1983లో ప్రారంభమైన ఈ సంస్థ 2023 మార్చి లెక్కల ప్రకారం దాదాపు రూ.119 కోట్లు మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉందని అంచనా. సంస్థలో భాగంగా ఉన్న రామ్రాజ్ సర్జికల్ కాటన్ మిల్స్‌లో కాటన్యార్న్, ఫాబ్రిక్స్ తయారవుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
కేజీఎఫ్ యశ్.. ఆ రంగంలో సూపర్ జోష్..
కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా యశ్‌కు భారీ ఆదరణ రావడంతో ప్రముఖ కంపెనీలు తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు సిద్దమయ్యాయి. తాజాగా రాకీ ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ప్రముఖ దుస్తుల బ్రాండ్ రామ్రాజ్ కాటన్‌కు పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా యశ్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఫ్లీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, బియర్డో వంటి బ్రాండ్స్‌కు యశ్ ప్రచార కర్తగా ఉన్నాడు. ప్రచారకర్తగా యశ్ నియామకంతో ప్రజల్లో మరింత ఉత్సాహం నింపుతుందని కంపెనీ అభిప్రాయపడింది. కాటన్ వస్త్రాలను బ్రాండింగ్ చేయడంలో రామ్రాజ్ కాటన్ అత్యంత ఆదరణను పొందింది. ప్రస్తుతం 50 వేలకు పైగా నేత కుటుంబాలు రామ్రాజ్ కాటన్ బ్రాండ్‌తో కలిసి పనిచేస్తున్నాయి. దక్షిణాదిలో 10వేల కుటుంబాలకుపైగా ఉపాధి కల్పిస్తోంది. చదవండి: అదిరిపోయిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..! -
నకిలీ వ్యాపార ప్రకటనలను నమ్మొద్దు: రామ్రాజ్ కాటన్
హైదరాబాద్: తమ సంస్థ పేరుకు కళంకం తెచ్చే కళంకం దురుద్దేశంతో కొందరు గతవారం నుంచి ఆన్లైన్ ద్వారా నకిలీ వ్యాపార ప్రకటనలను చేస్తున్నారని రామ్రాజ్ కాటన్ సంస్థ ఆరోపించింది. అలాంటి మోసపూరిత నకిలీ వార్తలను నమ్మొద్దని కస్టమర్లను కంపెనీ కోరింది. ‘‘కొంతమంది రామ్రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో వాట్సప్ యాప్ ద్వారా కొన్ని లింకులను అందిస్తూ క్రిస్మస్, కొత్త ఏడాది ఆఫర్ బహుమతిగా రూ.20,000 లభిస్తాయనే అనే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. కస్టమర్లు ఈ మోసపూరిత లింకులను నమ్మి ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక పరమైన నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇటువంటి సమాచారాన్ని పంచుకోవద్దు. వ్యాప్తి చేయవద్దు’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మోసగాళ్లను వెదికి పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. -
నెల్లూరులో సినీనటుడు వెంకటేశ్ సందడి
-
రామ్రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రానా
దుస్తుల తయారీ సంస్థ రామ్రాజ్ కాటన్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు, నిర్మాత దగ్గుబాటి రానాను నియమించుకుంది. రామ్రాజ్ బనియన్లకు ఆయన ప్రచారకర్తగా ఉంటారు. పంచెల విక్రయాల్లో ఇప్పటికే నంబర్ వన్‌గా ఉన్నామని, బనియన్ల విపణిలో అగ్రస్థానానికి చేరుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు కె.ఆర్.నాగరాజన్ బుధవారమిక్కడ మీడియాకు తెలి పారు. ‘82 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, 6,000కు పైగా మల్టీ బ్రాండ్ ఔట్లెట్లతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాం. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఇటువంటి కేంద్రాలను నెలకొల్పనున్నాం. తమిళనాడులో మూడు తయారీ కేంద్రాలున్నాయి. ప్లాంటు పెట్టాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు ఆహ్వానించాయి. ఎక్కడ కొత్త ప్లాంటు పెట్టాలి అన్న విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. గతేడాది రూ.1,200 కోట్లు ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. టర్నోవరులో బనియన్ల వాటా 30 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేరుస్తాం’ అని వివరించారు. విదేశాలకు సొంత బ్రాండ్‌తో దుస్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీకి ప్రచారకర్తగా ఉండడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా రానా చెప్పారు. -
నాణ్యతకు మారుపేరు రామ్రాజ్ కాటన్
న్యూశాయంపేట : వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్న ఘనత ‘రామ్రాజ్ కాటన్’కు దక్కుతుందని కళా తపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. వేలాది మంది చేనేత కార్మికులకు ఆ సంస్థ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట ఏర్పాటుచేసిన రామ్రాజ్ కాటన్ షోరూమ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని తెలుపు రంగు దుస్తులను తయారుచేసి, విక్రయిస్తూ ఆ సంస్థ తేటతెలుపు విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. అనంతరం రామ్రాజ్ కాటన్ అధినేత కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థకు నిజాయతీ, అణకువలే మూలధనమన్నారు. జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యమన్నారు. షోరూం అధినేత కైలాసం, భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు కటకం పెంటయ్య, గజ్జల రమేష్‌బాబు, పాల్గొన్నారు. -
లినెన్ పై రామ్ రాజ్ కాటన్ దృష్టి
రూ. 25 కోట్లతో బెంగళూరులో లినెన్ షర్ట్ యూనిట్ ఏర్పాటు ♦ ఈ ఏడాది ఉత్తరాది మార్కెట్లోకి అడుగు ♦ డిసెంబర్ నాటికి 100 ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ♦ రామ్రాజ్ కాటన్ చైర్మన్ కె.ఆర్.నాగరాజన్ వెల్లడి... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లినెన్ దుస్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు రామ్రాజ్ కాటన్ ప్రకటించింది. రోజుకు 5,000 చొక్కాలను తయారు చేసే సామర్థ్యంతో కూడిన లినెన్ యూనిట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు రామ్రాజ్ కాటన్ చైర్మన్ కె.ఆర్.నాగరాజన్ తెలిపారు. సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ దసరా నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రామ్రాజ్ కాటన్ సొంత షోరూంను టాలీవుడ్ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాజన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బెంగళూరు యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బెల్జియం నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ రెడిమేడ్ దుస్తులను తయారు చేస్తామన్నారు. ఇప్పటికే తిరువూరు, మదురై, ఈరోడ్ల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని, నాల్గవది బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన తాము ఇప్పుడు ఉత్తరాది మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల్లోని మెట్రో పాలిటన్ నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేయనున్నామని, అక్కడి వస్త్రధారణకు అనుగుణంగా కుర్తా పైజామాలను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో రామ్రాజ్ కాటన్ అనగానే పంచెలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు తెల్లటి దుస్తులు గుర్తుకు వస్తున్నాయని, ఇక నుంచి సంప్రదాయ దుస్తులకు వేదికగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రామ్ రాజ్ కాటన్‌కి దేశవ్యాప్తంగా 60 సొంత షోరూంలు ఉండగా ఈ సంఖ్యను డిసెంబర్ నాటికి 100కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా డీలర్లు ఉన్నారని, వీటితో పాటు రిటైల్ బట్టల దుకాణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్ఎస్ బ్రదర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలోనే మరిన్ని రిటైల్ సంస్థలతో ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వెంకటేష్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల పంచెల అమ్మకాల్లో అయిదు రెట్ల వృద్ధి కనిపించిందన్నారు. వ్యాపారంలో ఏటా 30 శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ ద్వారా 10,000 మందికిపైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు నాగరాజన్ తెలిపారు.