నాణ్యతకు మారుపేరు రామ్‌రాజ్ కాటన్
న్యూశాయంపేట : వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్న ఘనత ‘రామ్‌రాజ్ కాటన్’కు దక్కుతుందని కళా తపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. వేలాది మంది చేనేత కార్మికులకు ఆ సంస్థ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట ఏర్పాటుచేసిన రామ్‌రాజ్ కాటన్ షోరూమ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని తెలుపు రంగు దుస్తులను తయారుచేసి, విక్రయిస్తూ ఆ సంస్థ తేటతెలుపు విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. అనంతరం రామ్‌రాజ్ కాటన్ అధినేత కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థకు నిజాయతీ, అణకువలే మూలధనమన్నారు. జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యమన్నారు. షోరూం అధినేత కైలాసం, భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు కటకం పెంటయ్య, గజ్జల రమేష్‌బాబు, పాల్గొన్నారు.