హైదరాబాద్: తమ సంస్థ పేరుకు కళంకం తెచ్చే కళంకం దురుద్దేశంతో కొందరు గతవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా నకిలీ వ్యాపార ప్రకటనలను చేస్తున్నారని రామ్‌రాజ్ కాటన్ సంస్థ ఆరోపించింది. అలాంటి మోసపూరిత నకిలీ వార్తలను నమ్మొద్దని కస్టమర్లను కంపెనీ కోరింది. ‘‘కొంతమంది రామ్‌రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో వాట్సప్ యాప్ ద్వారా కొన్ని లింకులను అందిస్తూ క్రిస్మస్, కొత్త ఏడాది ఆఫర్ బహుమతిగా రూ.20,000 లభిస్తాయనే అనే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు.
కస్టమర్లు ఈ మోసపూరిత లింకులను నమ్మి ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక పరమైన నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇటువంటి సమాచారాన్ని పంచుకోవద్దు. వ్యాప్తి చేయవద్దు’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మోసగాళ్లను వెదికి పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment