పిల్లలకు వచ్చే వ్యాధులను దూరం చేయడానికి.. వారి భవిష్యత్తకు మద్దతుగా నిలబడటానికి జీఎస్‌కే (GSK) 'అబ్ ఇండియా బనేగా 7-స్టార్' అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది.
అబ్ ఇండియా బనేగా 7-స్టార్ ద్వారా పోలియో, చికెన్‌పాక్స్, హెపటైటిస్ A, హెపటైటిస్ బి, మెనింజైటిస్, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, హైబి ఇన్‌ఫెక్షన్ వంటి 14 వ్యాధులకు వ్యతిరేఖంగా 7 టీకాలు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని జీఎస్‌కే వెల్లడించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ 7 టీకాలను వేయాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సిఫార్సు చేస్తోంది.
పిల్లల మొదటి పుట్టిన రోజు నుంచి.. కొన్ని వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా అవసరమని జీఎస్‌కే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ షాలినీ మీనన్ వెల్లడించారు. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని.. ఈ విషయాలను తల్లితండ్రులకు తెలియజేయడానికి ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జీఎస్‌కే ప్రారంభించిన ఈ కార్యక్రమం గురించి టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఓటీటీ వంటి మల్టిపుల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా షెడ్యూల్ గురించి తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి లేదా 'మైవ్యాక్సినేషన్ హబ్.ఇన్' వంటి సైట్లను సందర్సించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment