
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ భారత విభాగం ఎండీగా గుంజన్ సోని నియమితులయ్యారు. ఆమె గతంలో జలోరా, స్టార్ ఇండియా, మింత్రా వంటి సంస్థల్లో కీలక హోదాల్లో సేవలు అందించారు. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ–కామర్స్ తదితర విభాగాల్లో రెండు దశాబ్దాలపైగా అనుభవం ఉంది. సింగపూర్‌కి చెందిన జలోరాలో గత ఆరేళ్లుగా ఆమె గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
కొత్త కేటగిరీలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. స్టార్ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంవోగా వ్యవహరించినందున ఆమెకు భారతీయ మీడియా, మార్కెటింగ్ రంగాల్లో కూడా గణనీయంగా అనుభవం ఉందని సంస్థ తెలిపింది. అంతక్రితం ఆమె మెకిన్సేలో పార్ట్‌నర్‌గా వ్యవహరించారు. ఫార్చూన్ 500 కంపెనీ అయిన సీబీఆర్‌ఈ గ్రూప్ బోర్డులో ఉన్నారు.