క్రియేటర్లకు అదనపు ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్‌స్ట్రీమ్స్‌కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్‌లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్‌లో అవి ప్రత్యక్షం అవుతాయి.
వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది.
అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment