extra income
-
ఇక యూట్యూబ్‌లో షాపింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్స్ట్రీమ్స్కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్లో అవి ప్రత్యక్షం అవుతాయి. వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు. -
ఎక్స్ట్రా.. ఎఫెక్ట్
బోడుప్పల్లో నివసించే ప్రవీణ్..కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. అదే సమయంలో తమ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు కూడా ఫ్రీలాన్స్‌గా పనికి కుదిరాడు. హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని మూడు జాబ్లూ చేస్తూ ట్రిపుల్ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. పైగా ఎక్స్ట్రా జాబ్స్ విషయం ఇంట్లో వారికి తెలీదు కాబట్టి వాటి వల్ల వచ్చే ఆదాయం పూర్తిగా ప్రవీణ్ సొంతం. ఎలా ఖర్చుపెట్టుకున్నా అడిగేవారు లేరు... కట్ చేస్తే... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రవీణ్ కొండాపూర్‌లోని ఒక రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. నగరంలో మల్టిపుల్ జాబ్స్ కల్చర్ వల్ల దెబ్బతింటున్న యువతకు ప్రవీణ్ ఓ ఉదాహరణ మాత్రమే. ⇒వారానికి 60 పని గంటలకు మించితే అనర్థాలే⇒ఒత్తిడి హార్మోన్లతో ఆందోళన, డిప్రెషన్⇒నగరానికి చెందిన వైద్య నిపుణుల హెచ్చరికలు సాక్షి, హైదరాబాద్: నగరాల్లో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మల్టీ జాబ్ కల్చర్ పెరుగుతోంది.. ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూనే మరో సంస్థలో కూడా పనిచేసే మల్టీ జాబ్ కల్చర్ పేరే... ‘మూన్ లైటింగ్’... కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పుట్టుకొచి్చన ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ... నగరంలోనూ కనిపిస్తోంది. నాలుగు చేతులా సంపాదించడం ఎలా ఉన్నా... నానా రకాల అనారోగ్యాల పాలుకావడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రపరిణామాలు తప్పవు... తమ ఉద్యోగ పనివేళలు అయిపోయాక రెండో ఉద్యోగం చేయడం.. గత కొంత కాలంగా ఐటి సంబంధిత రంగాల్లో ఎక్కువగా, ఇతర రంగాల్లో కొద్దిగా కనిపిస్తోంది. ఈ మూన్‌లైటింగ్ సంస్కృతిపై... పలు బహుళజాతి కంపెనీలు విధానపరమైన ఆదేశాలనూ జారీ చేశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కంపెనీల వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. నైతికంగా ఇది తప్పా.. ఒప్పా అనేది పక్కన పెడితే న్యాయవ్యవస్థ దీని చట్టబద్ధతను త్వరలో తేల్చనుంది. మరోవైపు ఇప్పటికే ఇది వ్యవస్థలో వేళ్లూనుకుంటుండడంతో... దీని లాభనష్టాలను కూడా యువత చవిచూస్తోంది.వారానికి 60 గంటలు మించితే.. అనతికాలంలోనే విజృంభించిన మల్టిపుల్ జాబ్స్ ట్రెండ్ వల్ల కలిగే అదనపు ఆదాయాలను లెక్కించే పనిలోనే అందరూ మునిగిపోయారు. ఇప్పటి దాకా దు్రష్పభావాల గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, వారానికి 60 గంటలకు మించి పనిచేస్తే మెదడు, గుండె మీద తీవ్ర ప్రభావం పడుతుందని.. ఒక్కోసారి అవి శాశ్వతంగానూ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం, వాటిలో ఉండే పని ఒత్తిడి, పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి రావడం... ఇవన్నీ మెదడు, గుండెను దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న బాధితులు... లక్షలాది మంది టెక్నాలజీ నిపుణులకు నిలయమైన నగరంలోని ఆస్పత్రులకు ఇప్పుడు మూన్‌లైటింగ్ దు్రష్పభావాలతో వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనిని ఉచ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, రిహాబిలిటేషన్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ బత్తిన థృవీకరించారు, ‘బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురైన, లేదా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకుని మా పునరావాస కేంద్రానికి వస్తున్న వారిలో ఎక్కువమందిని ఈ మల్టిపుల్ జాబ్స్ బాధితుల్నే చూస్తున్నాం. వీరిలో ఐటీ నిపుణులు, అందులోనూ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నవారు, రాత్రుళ్లు సైతం నిద్ర లేకుండా, వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తూన్న వారే అధికంగా ఉన్నారు. ఈ కొత్త కల్చర్...ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని తెలుస్తోంది. అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంతీ అవసరమే... ఎక్కువ గంటలు పనిచేయడం దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇది నాడీ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మెదడులో ప్రి–ఫ్రంటల్ కార్టెక్స్లో వాల్యూమ్ తగ్గడం వంటి మార్పులకు కూడా కారణమవుతుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం, ప్రణాళిక, ప్రేరణ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా అమోర్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి మాట్లాడుతూ ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్, ఆడ్రినలిన్ హార్మోన్లు విడుదలవుతాయి. వీటివల్ల ఆందోళన, డిప్రెషన్ వస్తాయి. నిరంతర ఆందోళన లేదా నిరాశ వల్ల రక్తపోటు అధికమై గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీవితం–పని బ్యాలెన్స్ గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ గంటలు పనిచేసే ప్రొఫెషనల్స్ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. సూచనలు ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పనిచేస్తే, రోజువారీ ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, పునరుత్తేజం పొందడానికి అతనికి అంత ఎక్కువ విశ్రాంతి అవసరం. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసేటప్పుడు మన గురించి మనం పట్టించుకోవడం కూడా ఒక బాధ్యతగా గుర్తించాలి. పనికీ పనికీ మధ్య తగిన విరామం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేదా ధ్యానం వంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లను అనుసరించాలి. -
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆశపడితే మొదటికే మోసం! బ్యాంక్ మేనేజర్‌కి జరిగింది ఇదే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్, సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా బ్యాంక్ మేనేజర్ వంటి అవగాహన ఉన్న ఉన్నత ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. రూ.లక్షల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. పుణేలో ఓ బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఆన్లైన్ టాస్క్‌ల మోసానికి గురయ్యారు. మొదట ఫారమ్‌లను నింపడం, వీడియోలను చూడటం వంటి చిన్న చిన్న టాస్క్‌లను ఇచ్చిన మోసగాళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేశారు. బాధితుడు వారిని విశ్వసించడం ప్రారంభించిన తర్వాత "టాస్క్ యాక్టివేషన్ ఫీజు" అడగడం ప్రారంభించారు. ఇలా రూ. 15 లక్షలకు పైగా అతని నుంచి రాబట్టారు. బాధితుడు ఆన్లైన్ వారిచ్చిన 27 టాస్క్‌లను పూర్తి చేసినా వాటికి డబ్బు మాత్రం చెల్లించలేదు. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఎర టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో స్కామర్లు బ్యాంక్ మేనేజర్‌కు ఎర వేశారు. ఈ మేరకు బాధితుడి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బ్యాంక్ మేనేజర్ స్కామర్లను సంప్రదించాడు. ఖాళీ సమయంలో ఇంటి నుంచి పని చేయడం ద్వారా అద్భుతమైన రాబడి వస్తుందని వారు ఆయన్ను నమ్మించారు. తర్వాత ఒక గ్రూపులో నమోదు చేసుకోవాలని చెప్పి టాస్క్‌లు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో కొన్ని టాస్క్‌లు పూర్తి చేసిన కొంత డబ్బు వచ్చింది. ఆ తర్వాత టాస్క్‌లను యాక్టివ్ చేయడానికి బాధితుడి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు. మొదట్లో వెంటనే డబ్బు అలా ఒక టాస్క్‌లో భాగంగా అతన్ని 27 విమాన టిక్కెట్లు బుక్ చేయమని అడిగారు. ఈ టాస్క్‌ను యాక్టివేట్ చేయడానికి రూ. 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ డబ్బును డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసిన బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ. 16,321 జమయ్యాయి. దీని తరువాత టాస్క్‌ల యాక్టివేషన్ కోసం బ్యాంక్ మేనేజర్ వారికి డబ్బు పంపడం ప్రారంభించాడు. వారిచ్చిన 27 టాస్క్‌లు పూర్తి చేశాడు. వాటి మీద వచ్చిన సొమ్మును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మరో మూడు టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్కామర్లు అతనికి చెప్పారు. అంతే కాదు వాటిని యాక్టివేట్ చేసేందుకు మరో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. -
విజయానికి చేయూత
-
రాత్రికి రాత్రే డబ్బులు మాయం..
మార్గాలు వేరు.. గమ్యం ఒకటే! చదువుకుని ఆర్థికంగా స్థితిమంతులైనవారు కూడా ఇలాంటి మోసాల వలలో చిక్కుంటున్నారు. విలాసవంతమైన జీవనం కోసం కావచ్చు, కోవిడ్ వల్ల వచ్చిన నష్టాల వల్ల కావచ్చు. కారణమేదైనా అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తుంటారు. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ, కొత్త కొత్త మార్గాల ద్వారా యాప్ అప్లికేషన్స్‌ను సెండ్ చేస్తుంటారు. ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అయినవారు మోసపోతుంటారు. మార్గాలు వేరు కానీ, మోసగాళ్ల గమ్యం ఒకటే... జనం దగ్గర డబ్బులు లాగడం. రాధిక (పేరు మార్చడమైనది) గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. తనలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని తెలిపింది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరెవ్వరూ తమలా ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదని తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసింది... ‘‘రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తయ్యాక నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినిగా చేరాను. వచ్చే జీతంలో కొంత ఈఎమ్ఐలకు పోతుంది. మరికొంత అదనపు ఆదాయం కావాలనుకున్నాను. ఈ విషయం గురించి నా స్నేహితులతో మాట్లినప్పుడు ఓ గేమింగ్ యాప్ గురించి చెప్పారు. దాని ద్వారా వాళ్లు రోజూ డబ్బులు సంపాదిస్తున్న విధానం చూసి, నేను ఆ గేమింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాను. మన బదులుగా యాప్ వాళ్లే గేమ్ ఆడి, అందులో వచ్చిన పాయింట్స్ ఆధారంగా మనకు డబ్బులు ఇస్తారు. అందులో జాయిన్ అవాలంటే ఆ యాప్‌లోనే ముందు రూ. 10,000తో అకౌంట్ ప్రారంభించాలి. ఉదయం పెట్టుబడి పెడితే, రాత్రికి రిటన్స్ వచ్చేవి. రోజూ రూ.500 నుంచి రూ.700 వరకు లాభం వస్తుంది. ఏ రోజు డబ్బు ఆ రోజు అకౌంట్లో పడిపోతుంది. అలా వచ్చినప్పుడు 2 నుంచి 3 వేలు అదనంగా మరికొంత ఇన్వెస్ట్ చేయమనే సూచనలు యాప్‌లో కనిపించేవి. నేను నెల రోజులుగా ఆ యాప్ అకౌంట్లో మెంబర్‌గా ఉన్నాను. నా ఫ్రెండ్స్ రెండు నెలలుగా ఇందులో ఉన్నారు. వచ్చిన లాభంలో 40 శాతం ఆ యాప్ పోర్టల్ వారే కమిషన్ రూపేణా కట్ చేసుకుంటారు. కొత్తగా ఎవరినైనా పరిచయం చేస్తే ఆ పర్సంటేజ్ మనీ కూడా మనకే వస్తుంది. నేను అలా మరో ఇద్దరిని పరిచయం చేశాను. యాప్‌లో ఉన్నవారందరినీ టెలీగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ∙∙ రోజూ లాభం చూస్తున్నాను కాబట్టి తర్వాత రూ. 20,000 పెట్టుబడి పెట్టాను. రూ.10,000 కన్నా రూపాయి తక్కువ ఉన్నా ఎలాంటి లాభం రాదు. ఒకసారి ఉదయం నేను డబ్బు అకౌంట్ లో వేసే సమయానికి అమౌంట్ మైనస్‌లోకి వెళ్లింది. ప్లస్‌లోకి రావాలంటే అదనంగా డబ్బు కట్టాలన్నారు. అలా రూ.50,000 వరకు కట్టాను. కానీ, అకౌంట్ మైనస్ చూపిస్తోంది. ఇదే విషయాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా గ్రూప్‌లో ఉన్నవారితో మాట్లాడాను. మరికొందరికి కూడా ఇదే సమస్య వచ్చింది. అయితే, ఇదేదో మిస్టేక్ జరిగింది. కంపెనీ వాళ్లతో మాట్లాడి సెట్ చేస్తాం అన్నారు. మరో రూ.10,000 చెల్లిస్తే 20 శాతం, రూ.20,000 చెల్లిస్తే 50 శాతం, రూ.30,000 చెల్లిస్తే వంద శాతం అమౌంట్ తిరిగి మీ మీ అకౌంట్లలోకి వస్తుంది అని చెప్పారు. నేను దాదాపు అలా లక్షన్నరూపాయల వరకు నా క్రెడిట్ కార్డుల నుంచి యాప్ అకౌంట్లో వేశాను. నాతోపాటు మిగతా వాళ్లు కూడా డబ్బు అకౌంట్లో వేశారు. ముందు రూ.40,000 వేలు అకౌంట్లో చూపించింది, కానీ విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడంతో ‘రాత్రి మొత్తం బెట్టింగ్ జరుగుతుంది, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డబ్బును విత్‌డ్రా చేయడం కుదరదు’ అన్నారు. సరే అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం అకౌంట్ చూస్తే జీరో బ్యాలెన్స్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నుంచి యాప్ పోర్టల్ వాళ్లు ఎగ్జిట్ అయిపోయారు. దేశవ్యాప్తం గా దాదాపు 3 వేల మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం అనే విషయం అర్ధమైంది. రోజుకు రూ.500–రూ.700 వరకు వస్తాయనుకుంటే వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం. ఇలా ఎవరూ ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోకూడదని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని వివరించారు రాధిక. ఆశనే ఆసరా చేసుకొని క్రైమ్ సోషల్‌మీడియాలో బాగా పేరున్నవారిని ఆయుధంగా చేసుకొని, ఇలాంటి మనీ ఫ్రాడ్‌కి తెరలేపుతారు. వారి మాటలను మిగతా వాళ్లు నమ్ముతారనే ఆశే ఇలాంటి ఫ్రాడ్స్‌కి పెట్టుబడి. జనం ఆశను ఆసరా చేసుకొని క్రైమ్ చేస్తారు. సోషల్‌మీడియాలో ఎవరి ద్వారా అయినా సరే.. ► ఏదైనా లింక్ ద్వారా ఏ అప్లికేషన్ మనకు వచ్చినా వాటిని డౌన్లోడ్ చేసుకోకూడదు. ∙ ► యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆండ్రాయిడ్‌లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ ఎపికె ఫైల్స్ అంటారు. ఐఒఎస్లో వచ్చే ఫైల్స్ అన్నీ డిఎమ్‌జెడ్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్‌ని లింక్స్ ద్వారా పంపిస్తారు. సోషల్ మీడియాలో పేరున్నవాళ్లను ఎంచుకొని ఈ యాప్స్ గురించి గొప్పగా చెప్పి, వారిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తారు. పేరున్నవారు, తెలిసినవారు వీటిని చెప్పారు కదా అని నమ్మి ఆ దొంగ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్స్‌లలో డబ్బులు పెట్టించి, గెలిచినట్టుగా 4, 5 సార్లు చూపించి, తర్వాత మైనస్‌లో అకౌంట్ చూపిస్తారు. డబ్బులు మరిన్ని వేస్తే, మరింత మొత్తం వస్తుందని నమ్మబలుకుతారు. ఇలా రూ.5000 నుంచి 10 లక్షల వరకు పోగొట్టుకున్నవారున్నారు. ఈ ఫ్రాడ్స్ వాట్సప్ కన్నా టెలీగ్రామ్ గ్రూప్‌ని ఎంచుకుంటారు. దీనికి కారణం టెలీగ్రామ్‌లో ఎక్కువమందిని గ్రూప్‌గా యాడ్ చేయవచ్చు. ఎంతమంది ఎక్కువ మొత్తంలో చేరితే జనంలో అంత నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటే మోసమూ పెరుగుతుందని గ్రహించి, జాగ్రత్తపడాలి – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్ కరోనా ఫీజు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్ బాటిల్స్‌పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్డౌన్ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది. -
చిరునామా
ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాలను 16 ఏళ్ల కిత్రం నుంచే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాకుండా ప్రధాన ఆహారంగా తింటున్న విలక్షణ రైతు మౌలాలి. ఎడారీకరణ బారిన పడుతున్న అనంతపురం జిల్లా ముదిగుబ్బ పట్టణంలో రైతు కుటుంబంలో పుట్టారు. ఎమ్మే సోషియాలజీ చదివినప్పటికీ.. బతుకును పండించే చిరుధాన్య పంటల విశిష్టతను గుర్తెరిగారు. అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రల సాగులో ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో సామాన్య శాస్త్రంలో ఎమ్మే చదివిన మౌలాలి(53) స్వచ్ఛంద సంస్థల్లో కొంతకాలం పనిచేసి.. చివరకు చిరుధాన్యాల సాగుపైనే మనసును కేంద్రీకరించారు. అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు వంటి చిరుధాన్యాలను తన ఆరెకరాల పొలంలో సాగు చేయడంతో పాటు.. పొడులు, బిస్కెట్లు, బన్ను, కేక్, మిక్చర్, మురుకులు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పనుల వల్ల అదనపు ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ప్రకృతిలో మమేకమై వ్యవసాయం చేస్తున్నప్పుడు లభించే ఆనందం, ఆత్మసంతృప్తి మరెందులోనూ లేదంటారు మౌలాలి. ‘2002లో మొదటి పంటగాఎకరాకు 3 కిలోల కొర్రలు విత్తాను. ఆ ఏడాది విపరీతమైన కరువు, వర్షపు చుక్క లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎకరాకు 10 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. రూ. 12 వేల ఖర్చులు పోను రూ.12 వేల నికరాదాయం వచ్చింది. ఆదాయానికి తోడు, చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అవగతమయ్యే కొద్దీ.. వాటిని పండించడంపై మక్కువ అధికమవుతూ వచ్చింటారు మౌలాలి. పర్యావరణహిత వ్యవసాయం చిరుధాన్యాలు పండించే ముందు అనేక రాష్ట్రాల్లో పర్యటించి వివిధ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. ‘అనేక ప్రాంతాలు పర్యటించి ఒక అవగాహన వచ్చినకు తరువాత, చిరుధాన్య పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. కుటుంబానికి చెందిన 6 ఎకరాల మెట్ట భూమిని సాగుకు అనువుగా మార్చడం మొదలు పెట్టాను. బరువైన యంత్రాలు ఉపయోగించి చేసే యాంత్రిక వ్యవసాయం కాకుండా పశువుల సాయంతో పర్యావహణహితంగా వ్యవసాయం చేసి భూమి పైభాగంలో ఉండే సూక్ష్మ జీవులకు హాని కలుగకుండా చూసుకున్నాను. ఫలితం స్పష్టంగా కనిపించింది. భూసారం పెంచే రకరకాల క్రిములు, సూక్ష్మజీవులు వృద్ధి చెందాయి. కొన్ని సందర్భాల్లో కందిని అంతర్ పంటగా వేసి భూసారాన్ని పెంచుకున్నాను. జీవవైవిధ్యం పట్ల అవగాహనతో పర్యావరణహిత వ్యవసాయం చేస్తున్నప్పటికీ, కూలీల కొరత వల్ల ఈ పద్ధతులను పూర్తి స్థాయిలో పాటించలేకపోతున్నాను అన్నారాయన. ఈ ఏడాది జూలైలో అండుకొర్ర పంట వేశారు. అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వర్షం లేదు. అయినా పంట బాగానే ఉంది. కొన్నిరోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికే పంట పూర్తి స్థాయిలో పుంజుకుంది. ఇంత కరువు లోనూ 8–10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కట్టెల బూడిద.. భూమికి బలిమి తొలిసారిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లయితే కట్టెలు కాల్చి, బూడిదను భూమిలో చల్లితే 15 సంవత్సరాల వరకూ భూమికి సరిపడే కర్బన అవసరాల పోషకాలు లభిస్తాయి. మల్లి జాతి కలుపు ప్రతి చిరుధాన్యపు పంటకు ప్రమాదకారి. పంట వేసిన 30 రోజుల్లోగా ఈ కలుపు కనిపిస్తే వెంటనే నివారించకపోతే పూర్తి పంటను నష్టపోవాల్సి వస్తుంది. ఈ కలుపు బారిన పడకుండా ఉండేందుకు ఎకరాకు అర కిలో వాము రాత్రంతా నానబెట్టి, ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక గంట పాటు గాలికి ఆరబెట్టి చిరుధాన్యాల విత్తనాలతో కలిపి భూమిలో చల్లాలి. చిరుధాన్యాలకు ప్రధానంగా రెండు రకాలైన పురుగులు ఆశిస్తాయి. వర్షాభావం వల్ల ఆకు పీల్చే రసం పురుగు పంటను ఆశిస్తుంది. వెన్ను ఏర్పడే సమయంలో సుడి దోమ ఆశిస్తుంది. 1 లీటరు వేప నూనెను 10 లీటర్ల నీటిలో కిరోసిన్‌తో కలిపి చల్లుకొని నివారించుకోవచ్చు. అంగుళం నీటితో 4 ఎకరాల్లో పంట రసాయనిక ఎరువులు అవసరం లేకుండా వీటిని పండించే వీలున్నందున రైతు పెట్టుబడి చాలా తక్కువని చెప్పారు. కేవలం వర్షాధారంగా లేదా తక్కువ నీటితో చిరుధాన్య పంటలు పండించవచ్చంటారు మౌలాలి. ఒక అంగుళం నీరున్న బోరు ద్వారా 4 ఎకరాల్లో పంట పడించవచ్చని తెలిపారు. పరిమితమైన నీటి వనరులున్న ప్రాంతాలకు చిరుధాన్య పంటలు ఎంతో అనుకూలమని చెప్పారు. అంతర్ పంటగానూ.. పండ్ల తోటల్లో కూడా చిరుధాన్యాలను అంతర పంటగా వేసుకుని అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని, ఈ పంటల అవశేషాల ద్వారా భూమికి కావలసిన పోషకాలు అందుతాయన్నారు. తద్వారా బహుళప్రయోజనాలు పొందవచ్చన్నారు. చిరుధాన్యాల విత్తనాలు రకాన్ని బట్టి గరిష్టంగా ఏడు సంవత్సరాలు నిల్వ ఉంటాయన్నారు. పక్షులు, అడవిపందుల నుంచి రక్షణ అలాగే ఈ పంటలకు ప్రధాన శత్రువైన పక్షుల బెడద తప్పించుకోవడానికి స్థానికంగా లభించే వస్తువులతో తానే స్వయంగా తక్కువ ఖర్చుతో గాలిమర తయారు చేసి, అది చేసే చప్పుడు వల్ల పక్షులను తరిమి పంటను కాపాడుకుంటున్నారు. ఈ గాలిమర ఉపయోగించడం వల్ల 20 నుంచి 30 అడుగుల దూరం వరకూ పక్షులు వాలవని, రాత్రి వేళల్లో పంటను ఆశించే అడవి పందులను కూడా వీటివల్ల దూరం ఉంచవచ్చు అంటారు మౌలాలి. ఎకరాకు 8 గాలిమరలు అమరిస్తే ఫలితం బాగా ఉంటుందని చెప్పారు. ఆయుర్దాయాన్ని పెంచిన చిరుధాన్యాలు మధుమేహం, పక్షవాతంతోపాటు ఇతర వ్యాధుల వల్ల మౌలాలి∙భార్య కొన్ని సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె బతకడం కష్టమని చెప్పిన వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత.. చిరుధాన్యాలు ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టడంతో కొద్దిరోజుల్లోనే ఆమె కోలుకోవడంతోపాటు ఏడేళ్లు బతికారని మౌలాలి తెలిపారు. ‘అప్పటి నుంచి ఇంటిల్లిపాదీ ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్చుకుంటూ వచ్చాం. ప్రస్తుతం నేను వారానికి ఒకసారి మాత్రమే వరి అన్నం తింటాను. మిగిలిన రోజుల్లో చిరుధాన్యంతో చేసిన ఆహారం తీసుకుంటాను’ అన్నారు మౌలాలి. చిరుధాన్య పంటల్లో ఎర్ర నేలల్లో ఎకరాకు 8–10 క్వింటాళ్ళు, నల్ల రేగడి నేలల్లో 15–20 క్వింటాళ్ళ దిగుబడి తీయవచ్చని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో తాను చేసిన ప్రయోగాల ఫలితాలను రైతులు తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ప్రత్యక్షంగా చూడవచ్చని మౌలాలి(94905 62614) చెప్పారు. – ప్రసన్న కుమార్, బెంగళూరు -
బంగారు బాతు..రెండో ఇల్లు
♦ అద్దెకివ్వటంతో అదనపు ఆదాయం ♦ అమ్మకం కోసమైనా ఖాళీగా ఉంచొద్దు ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, సొంతిల్లు... ఈ మధ్యలో కారు!! ఇదీ... ఈ తరం యువత ఆలోచన. ఆదాయాలు పెరుగుతుండటంతో చాలామందికి ఇవన్నీ 30-40 ఏళ్లలోపే సాకారమైపోతున్నాయి. దాంతో చాలా మంది రెండో ఇంటిని కూడా కొనుక్కోగలుగుతున్నారు. మరి ఈ రెండో ఇంటి ద్వారా ♦ అధికాదాయం పొందటమెలా? అందుకూ మార్గాలున్నాయి. రియల్ ఎస్టేట్‌పై డబ్బులు సంపాదించటానికి చాలామంది రకరకాల మార్గాలు ఎంచుకుంటుంటారు. డబ్బులు తగినంతగా ఉంటే ఫ్లాటో, ప్లాటో(స్థలం) కొనేసి, మంచి రేటు వస్తే అమ్మేసి లాభపడాలనుకునే వారు కొందరు. ముందు ఒక ఇంటిని కొనుక్కున్నాక... అదనంగా ఉన్న డబ్బులతో రెండో ఇంటిని కొని, దానిని అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని భావించే వాళ్లు మరికొందరు. తక్కువలో ఏదైనా ఇల్లు అమ్మకానికొస్తే, దానిని ఠక్కున కొనేసి, మరికొంత లాభానికి అమ్మడం ద్వారా లాభాలు కళ్లజూడాలని ఆలోచించే వాళ్లు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఎప్పుడు మంచిరేటు వస్తే, అప్పుడు అమ్మేద్దామనే భావనతో ఇంటిని ఖాళీగా ఉంచుతారు. ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే లాభాలను వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత మందగించిన విషయం తెలిసిందే. ఈ మందగమన కాలంలో ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం ఇన్వెస్టర్‌కు ఒకింత ఊరటనిస్తుందనేది కాదనలేని వాస్తవం. ♦ఉదాహరణకు మీ దగ్గర కోటి రూపాయల విలువ చేసే ఇల్లు ఉందనుకుందాం. దీనిని నెలకు రూ.50,000 చొప్పున అద్దెకిచ్చారనుకుందాం. అంటే ఏడాదికి మీకు రూ.6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే మీ ఇంటి అద్దె ఆదాయం(వార్షిక) మీ మూలధన విలువలో 6 శాతం అన్నమాట. సాధారణంగా మన దేశంలో సగటు ఇంటద్దె ఆదాయం రేటు 2-4 శాతం రేంజ్లో ఉంటుంది. అంటే మూల విలువలో 2-4 శాతమన్న మాట. రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణుల ప్రకారమైతే, మీ ఇల్లు మూలధన విలువలో 2 నుంచి 3 శాతం వరకూ వార్షికంగా ఇంటద్దె రూపంలో లభిస్తుంది. మీరు అందించే సౌకర్యాలు, మీ ఇల్లు ఉండే ఏరియాను బట్టి అద్దె విలువ మారుతుంటుంది. ఢిల్లీ, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇంటి అద్దె ఆదాయం రేటు 6-7 శాతంగా ఉంటోంది. ♦ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీ ఇంటి ద్వారా మంచి అద్దెనూ పొందే అవకాశాలున్నాయి. ఇంటికి సరైన అద్దెను నిర్ణయించడం... మీ ఇంటిమీద మీకు నెలవారీ వచ్చే అద్దెను సరిగా నిర్ణయించడమనేది ప్రధానమైన విషయం. మీ ఇల్లు ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న పరిస్థితులు, మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి అద్దె వస్తుంది. మీ ఇల్లు హౌసింగ్ సొసైటీలో ఉందనుకుందాం. అక్కడ ఉండే ఇళ్లన్నిటికీ ఒకే రకమైన అద్దె లభిస్తుంది. కొంచెం ఎక్కువ అద్దె రావాలంటే, ఇంటీరియర్స్‌ను మార్చడమో, లేక ఫర్నిచర్‌తో సహా అద్దెకు ఇవ్వడమో చేయాలి. ఒకవేళ మీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉందనుకుందాం. ఈ తరహా ఇళ్లకైతే సరైన అద్దె నిర్ణయించడం కొంచెం కష్టమైన పని. అయితే ఆ ఏరియాలో ఉండే ఇండిపెండెంట్ ఇళ్లను ఆయా ఇళ్ల యజమానులు ఎంతెంత ధరలకు అద్దెకిచ్చారో వాకబు చేయవచ్చు. ఇక్కడ కూడా అదనపు సౌకర్యాలు కల్పించడం ద్వారా అదనపు అద్దె పొందవచ్చు. కొత్త తరం మార్కెటింగ్.. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నవారే. ఇంటర్నెట్ పుణ్యమాని మీ ఇంటిని మార్కెటింగ్ చేయడం ఇప్పుడు చాలా సులభం. మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్, కామన్‌ఫ్లోర్, హౌసింగ్‌డాట్‌కామ్, మకాన్‌డాట్‌కామ్ తదితర వెబ్సైట్లలో మీరు అద్దెకివ్వాలనుకున్న ఇంటిని గురించి ఉచితంగా అడ్వర్టయిజ్ చేయవచ్చు. ఇక ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్ల ద్వారా మీ రెండో ఇంటిని సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా, హాలిడే హోమ్‌గా అద్దెకు ఇవ్వడం ద్వారా ఒక్క రోజుకు రూ.3,000-రూ.5,000 వరకూ ఆదాయం పొందవచ్చు. అయితే ఇది అన్ని ఇళ్లకూ సాధ్యం కాకపోవచ్చు. దీనికి ఇల్లుండే ప్రాంతమనేది ప్రధానం. త్రీ-స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడం, మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తేవడం ద్వారా మరికొంత అదనంగా అద్దె ఆదాయం పొందే అవకాశమూ ఉంది. మీరు కనుక ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వంటమనిషి/కేర్ టేకర్, డ్రైవర్‌తో కూడిన కారు, స్విమ్మింగ్ ఫూల్, క్లబ్ ఏరియా, జిమ్ తదితర సౌకర్యాలను కూడా అందిస్తే రోజుకు రూ.7,000-10,000 వరకూ కూడా అద్దె పొందవచ్చు. ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్లు 3 శాతం వరకూ సర్వీస్ ఫీజును వసూలు చేస్తాయి. అయితే మీ ఇంటిని సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా అద్దెకు ఇవ్వాలంటే పలు రకాల అనుమతులు, ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. మీరు అద్దెకు ఇవ్వాలనుకుంటున్న ఇల్లు ఏ ప్రాంతంలో ఉందో, ఆ ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. సంబంధిత మునిసిపాలిటీ అధికారుల నుంచి అనుమతులు పాందాలి. పోలీసుల వెరిఫికేషన్ కూడా తప్పనిసరి. సరైన కిరాయిదారు... మీ ఇంటిని సరైన వ్యక్తికి అద్దెకివ్వటమనేది చాలా తెలివైన పని. అద్దెకు దిగే వ్యక్తి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు? జీతం ఎంత ? తదితర వివరాలను తెలుసుకోవాలి. వీలైతే ఆ వ్యక్తి పనిచేసే కంపెనీ నుంచి రికమండేషన్ లెటర్ తీసుకుంటే మరీ మంచిది. ఇక ఆహారపు అలవాట్లు గురించి మీకు ఏమైనా అభ్యంతరాలు, ఏమైనా షరతులు ఉంటే ముందుగానే వెల్లడించడం ఉత్తమం. ఆ తర్వాత గొడవ పడేకంటే ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే, మీకు, మీరు అద్దెకు ఇచ్చే వ్యక్తికి మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. అన్ని వివరాలు నచ్చితే, పూర్తి వివరాలతో కూడిన అగ్రిమెంట్‌ను రాసుకోవాలి. ఒక రకంగా మీ రెండో ఇల్లు మీకు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటింది. అయితే మీకు వచ్చే ఆదాయంలో కనీసం పదో వంతు సొమ్ములతో మీ ఇంటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించడం కానీ, అదనపు సౌకర్యాలు కల్పించడం కానీ చేస్తే మీకు వచ్చే అద్దె విలువ మరింతగా పెరుగుతుంది. పన్ను వివరాలు... మీరు మీ ఇంటిని ఎలా అద్దెకు ఇచ్చారనే విషయాన్ని బట్టి పన్ను వివరాలుంటాయి. ఉదాహరణకు మీరు మీ ఇంటిని ఎవరికైనా నివసించడానికి అద్దెకు ఇచ్చారనుకోండి. ఈ అద్దెను ఇంటి ఆద్దె ద్వారా ఆదాయంగా పరిగణిస్తారు. ఒకవేళ సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా మీరు మీ ఇంటిని అద్దెకిస్తే, దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అద్దె ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతారు. మీరు అద్దె ద్వారా పొందే ఆదాయం రూ. 1లక్ష మించినట్లయితే ఈ అద్దె ఆదాయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి.