New program
-
ఇక యూట్యూబ్‌లో షాపింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్స్ట్రీమ్స్కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్లో అవి ప్రత్యక్షం అవుతాయి. వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు. -
మహిళల కోసం కోర్టెవా అగ్రిసైన్స్ కొత్త ప్రోగ్రామ్
భారతదేశాన్ని వ్యవసాయ దేశంగా పిలుస్తారు. వ్యవసాయం అంటే ప్రధానంగా పురుషులే కనిపిస్తారు. ఈ రంగంలో మహిళలను కూడా ప్రోత్సహించదానికి కోర్టెవా అగ్రిసైన్స్ ఓ కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని ద్వారా 20230 నాటికి దేశంలో 20 లక్షలమంది మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.కోర్టెవా అగ్రిసైన్స్ ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా.. రైతులను, పరిశోధకులను, వ్యవస్థాపకులను తయారు చేయనుంది. ఇది కేవలం కార్పొరేట్ రంగం అభివృద్ధి చెందడానికి మాత్రమే కాకుండా.. లింగ సమానత్వం, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.గ్రామీణ జీవితానికి, వ్యవసాయానికి మహిళలు వెన్నెముక. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, విద్య, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పొందడం ద్వారా మహిళలు జీవితాలను మెరుగు పరుస్తుందని.. కోర్టెవా అగ్రిసైన్స్ ప్రెసిడెంట్ 'సుబ్రొటో గీడ్' పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి కూడా సహాయపడుతుంది, వికసిత భారత్ వైవు అడుగుల వేస్తూ ఈ సామాజిక బాధ్యతను స్వీకరించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. -
రేపు నితిన్ గడ్కరీ ప్రారంభించనున్న కొత్త ప్రోగ్రామ్ ఇదే..
Bharat NCAP: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (భారత్ ఎన్సీఏపీ) రేపు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్ ఎన్సీఏపీ భారతీయ ఆటోమొబైల్స్ భద్రతా ప్రమాణాలను పెంచడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రతిష్టతను పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా రానున్న కొత్త ఉత్పత్తులు (కార్లు) మరింత పటిష్టమైన భద్రతను కలిగి ఉంటాయి. దీనికింద కార్లను క్రాష్ టెస్ట్ చేసి వాటికి సేఫ్టీ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది. సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కారు భద్రతను నిర్థారిస్తారు. ఇది కార్ల కొనుగోలుదారులకు, భారత ఆర్థిక వ్యవస్థ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశంలో తయారయ్యే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యత లేని కార్లుగా పరిగణించబడుతున్నాయి. దీనికి చెప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతోంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతయ్యే కార్ల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా? క్రాష్ టెస్టులో కారు పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ పరీక్షించి రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే కారు యువకులకు, పిల్లలకు ఏ విధమైన రక్షణ అందిస్తాయనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం భారత్‌లో సేఫ్టీ సెన్సిటివ్ కార్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. భారత్ ఎన్సీఏపీ కార్యక్రమానికి మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టయోటా వంటి వాహన తయారీ దారులు ఇప్పటికే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పకుండా కార్లు మరింత భద్రతా ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రమాదంలో మరణించే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని చెబుతున్నారు. -
అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువల ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేస్తోంది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే అందిస్తారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ భావిస్తోంది. అలాగే మన రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సిఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు కోరుతున్నారు. ఇదీ చదవండి: ఒక్కరోజే 50 లక్షలు?.. అదీ క్రేజ్ మరి! -
సైబర్ దాడుల సన్నద్ధతపై ‘అరెటే’ ఫోకస్
హైదరాబాద్: సైబర్ రిస్క్ నిర్వహణ కంపెనీ ‘అరెటే’.. సైబర్ దాడుల నిరోధానికి, ఒకవేళ సైబర్ దాడులు తలెత్తితే ఆ సమయంలో సన్నద్ధతకు సంబంధించి కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం దీన్ని రూపొందించామని, సహజంగా ఈ సంస్థలే ఎక్కువగా దాడులకు గురవుతుంటాయని, పూర్తి స్థాయిలో వ్యవస్థల పునరుద్ధరణకు 6–8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు అరెటే తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల సిస్టమ్స్‌లో అప్పటికే హానికాక సాఫ్ట్వేర్లు ఏవైనా ఉన్నాయా? కస్టమర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్ అయిందా గుర్తించడంతోపాటు.. పరిశ్రమలోనే అత్యుత్తమ విధానాలు, రిస్క్ నిర్వహణతో ఇది ఉంటుందని వివరించింది. సంస్థలకు మరింత రక్షణ కలి్పంచి, సైబర్ దాడుల రిస్క్‌ను తగ్గించడమే తమ లక్ష్యమని అరెటే ప్రకటించింది. -
ఏపీ విద్యాశాఖ మరో సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన
-
‘పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో స్వచ్చతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న స్వచ్చ సంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఆయా గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ సీఇఓ, డీపీఓ, డ్వామా పీడీ, ఎంపీడీఓ, పంచాయతీ ఇఓ, గ్రామ సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లి సీపీఆర్ కార్యాలయం నుంచి పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్చాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూలై 8 స్వర్గీయ వైఎస్సార్ జయంతి నాడు 'జగనన్న స్వచ్ఛసంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు. కోవిడ్ మన గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చూసే బాధ్యత సర్పంచులదేనని, వాళ్ల సారథ్యంలో స్వచ్ఛమైన పల్లెలను సృష్టించుకోవాలని తెలిపారు. ప్రజలు సర్పంచులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే సమయం ఇదేనంటూ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ( చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు ) -
మున్సిపాలిటీల్లో ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు అన్ని మున్సిపాలిటీల్లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో పచ్చదనాన్ని పెంచే అత్యుత్తమ పురపాలికలకు ఏటా అవార్డులు ఇస్తామని, తద్వారా పోటీతత్వం పెంచుతామని వెల్లడించారు. గ్రీన్ స్పేస్ ఇండెక్స్‌లో భాగంగా వినూత్న డిజైన్లు, రోడ్ల పక్కన పచ్చదనం, ఇంటి మొక్కల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ప్రకటించారు. మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న గ్రీన్ కవర్‌ను మదించేందుకు జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), ఉపగ్రహ చిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ పద్ధతుల ద్వారా రికార్డు చేస్తామని వెల్లడించారు. ఈ డేటా ఆధారంగా వచ్చే ఏడాది ఆయా పట్టణాల్లో గ్రీన్ కవర్ ఎంత మేర పెరిగిందనే అంశాన్ని తిరిగి మదింపు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ఆయా పట్టణాల్లో గ్రీన్ కవరేజీకి 85 శాతం, గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు 5 శాతం, ఆకట్టుకునే డిజైన్లతో చేపట్టే ప్లాంటేషన్‌కు మరో 10 శాతం వెయిటేజీ ఇచ్చి ఉత్తమ పురపాలికలను ఎంపిక చేస్తామన్నారు. అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిట, రోడ్ల పక్కన మొక్కల పెంపకం వంటి కేటగిరీల్లో అవార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
సైబర్ వల.. తప్పించుకోవడం ఎలా..!
సాక్షి, హైదరాబాద్: మహిళా రక్షణ విభాగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా విస్తరిస్తోన్న వేళ మనిషి జీవనవిధానం మారిపోయింది. నిత్యావసరాలు, అత్యవసరా లు, విద్య, ఉద్యోగం అన్నీ ఆన్‌లైన్‌కి మారాయి. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులకు సైబర్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. కోవిడ్ తరువాత కూడా ఆన్లైన్ వినియోగం, దానిపై ఆ ధారపడే అవకాశాలు ఏమాత్రం తగ్గేలా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు ఆన్లైన్లో పొంచిన ఉన్న ప్రమాదాలు, ముప్పును ఎలా తప్పిం చాలి? సురక్షిత, ఆరోగ్యకరమైన ఆన్లై న్ వాతావరణం ఎలా పొందాలి? అన్న విషయాలపై విస్తృత చర్చ జరగాలని తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయిం చింది. తెలంగాణ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జూలై 15 నుంచి ఆన్లైన్లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి యూని సెఫ్ (ఐక్యరాజ్యసమితి చిన్నారుల అత్యవసర నిధి) సహకారం అందించేందుకు ముందుకు రావడం విశేషం. ఆన్లైన్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఇంతటి విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఉద్దేశం ఏమిటి?: ఆన్లైన్లో పాటించాల్సిన భద్ర త ప్రమాణాలు, పిల్లలకు ఎలాంటి సైబర్ వేధింపు లు, ఎరలు, సవాళ్లు ఉంటాయి? వాటి ని ఎలా అధిగమించాలి? అన్న సందేహాలకు శాశ్వత పరిష్కారాలు సూచిం చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో పలువురు మహిళా ఐపీఎస్, ఐఏఎస్, డీఎస్పీలు, ఎన్జీవో ప్రతినిధులు, లా యర్లు, సైబర్ నిపుణులు, విద్యార్థులు, మహిళా ఉద్యోగినులు, సైకాలజిస్టు లు, కౌన్సెలర్లు పాల్గొంటారు. రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలు, సీబీఎస్ ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. దీని పై విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తోనూ విమెన్‌సేఫ్టీ వింగ్ వారు చర్చలు జరిపారు. ప్రతీ రోజూ వినూత్నంగా.. జూలై 15 నుంచి ఆన్లైన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఒక్కోరోజూ ఒక్కో అం శంపై చర్చలు, విశ్లేషణలు సాగుతా యి. విద్యార్థులు, మహిళా ఉద్యోగుల సందేహాలకు సమాధానాలిస్తారు. పా ల్గొనేవారిలో అధికశాతం విద్యార్థులే ఉంటారు కాబట్టి, వారు విసుగు చెందకుండా..వారిని పూర్తిగా భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించా రు. ఆన్‌లైన్‌భద్రత, సైబర్‌సేఫ్టీపై క్విజ్, వ్యాసాలు, కథల వంటి వాటితో అవగాహన కలిగిస్తారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
చెల్లీ.. నేనున్నా!
నల్లగొండ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా చేరే విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఆత్మీయ బంధం’ పేరుతో కస్తూరిబా పాఠశాల ప్రాజెక్టు డైరెక్టర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో చేరే బాలికలను సీనియర్లు చెల్లీ.. నేనున్నా.. అంటూ అక్కున చేర్చుకోవడడంతో.. నూతన విద్యార్థినుల్లో భయం తొలగి.. ధైరంగా ఉండనున్నారు. భయాందోళన పోగొట్టేలా.. జిల్లా వ్యాప్తంగా 27 కస్తూరిబా పాఠశాలలు ఉన్నాయి. వాటితోపాటు కళాశాలలు కూడా ఉన్నాయి. పాఠశాలల్లో దాదాపు 7 వేల నుంచి 8వేల వరకు విద్యార్థినులు ఉండగా, కళాశాలల్లో 600 నుంచి 700 మంది వరకు విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా విద్యార్థినులు చేరుతారు. అప్పటి వరకు తల్లిదండ్రులు, బంధువుల వద్ద ఉంటూ ఒకేసారి హాస్టల్‌కు వచ్చేసరికి కొత్త వాతావరణం అనిపిస్తుంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారు మారకపోవడం, సీనియర్ల నుంచి సహకారం లభించకపోవడంతో చాలామంది పిల్లలు మధ్యలోనే పాఠశాలలు వదిలి వెళ్తుంటారు. అయితే కొందరిని తిరిగి పాఠశాలలకు రప్పించినా కొందరిని రప్పించలేని పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు ఈ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి కేజీబీవీలో ‘ఆత్మీయ బంధం’ ప్రతి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆత్మీయ బంధం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉపాధ్యాయినులతో పాటు కస్తూరిబా అధికారులు, కొత్త, పాత విద్యార్థినులచేత ఈ ఆత్మీయ బంధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా చేరిన విద్యార్థినులను సీనియర్లకు దత్తత ఇస్తున్నారు. సీనియర్లు వారితో ఎప్పుడూ కలిసి ఉంటారు. చదువుకునేటప్పుడు, భోజనం చేసే సందర్భంలో, ఆటలు ఆడుకునే సమయంలో వారితో నిత్యం మాట్లాడడం, వారిలో ఉన్నటువంటి భయాందోళనలు తొలగిస్తూ చెల్లీ నేను ఉన్నానంటూ భరోసానివ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆత్మీయ బంధం ఎంతో మేలు ఆత్మీయ బంధం కార్యక్రమం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కొత్తగా పాఠశాలలు, కళాశాలల్లో చేరిన విద్యార్థినుల్లో భయాందోళనలు పోగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇద్దరు సీనియర్లు, జూనియర్లు కలిసి ఉండడం వల్ల కొత్తదనం అనేది పోయి అక్కా చెల్లెళ్ల మాదిరిగా ఉండనున్నారు. – అరుణ శ్రీ, సెక్టోరియల్‌అధికారి -
ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మాస్టర్
-
సచిన్ ‘గ్రామ్ యోజన’
ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మాస్టర్ న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్’ను దిగ్విజయంగా పూర్తి చేసిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని యోచిస్తున్నాడు. భార్య అంజలితో కలిసి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో తన మనసులోని ఆలోచనను మాస్టర్ బయటపెట్టాడు. మరికొంత మందిని ఆహ్వానించడం ద్వారా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు. పాఠశాలలు, కాలేజిల్లో క్రీడల అభివృద్ధిపై దృష్టిపెడతానని తెలిపాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాభివృద్ధికి సచిన్ తన రాజ్యసభ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించాడు. ఈ గ్రామంలో జరుగుతున్న పనుల గురించి మోదీతో చర్చించినట్లు సమాచారం.