సచిన్ ‘గ్రామ్ యోజన’ | Sachin Tendulkar adopts village | Sakshi
Sakshi News home page

సచిన్ ‘గ్రామ్ యోజన’

Published Fri, Oct 17 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

సచిన్ ‘గ్రామ్ యోజన’

సచిన్ ‘గ్రామ్ యోజన’

ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మాస్టర్

న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్’ను దిగ్విజయంగా పూర్తి చేసిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని యోచిస్తున్నాడు. భార్య అంజలితో కలిసి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో తన మనసులోని ఆలోచనను మాస్టర్ బయటపెట్టాడు. మరికొంత మందిని ఆహ్వానించడం ద్వారా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు.

పాఠశాలలు, కాలేజిల్లో క్రీడల అభివృద్ధిపై దృష్టిపెడతానని తెలిపాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాభివృద్ధికి సచిన్ తన రాజ్యసభ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించాడు. ఈ గ్రామంలో జరుగుతున్న పనుల గురించి మోదీతో చర్చించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement