Bharat NCAP: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (భారత్ ఎన్‌సీఏపీ) రేపు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్ ఎన్‌సీఏపీ భారతీయ ఆటోమొబైల్స్ భద్రతా ప్రమాణాలను పెంచడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రతిష్టతను పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా రానున్న కొత్త ఉత్పత్తులు (కార్లు) మరింత పటిష్టమైన భద్రతను కలిగి ఉంటాయి. దీనికింద కార్లను క్రాష్ టెస్ట్ చేసి వాటికి సేఫ్టీ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది.
సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కారు భద్రతను నిర్థారిస్తారు. ఇది కార్ల కొనుగోలుదారులకు, భారత ఆర్థిక వ్యవస్థ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశంలో తయారయ్యే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యత లేని కార్లుగా పరిగణించబడుతున్నాయి. దీనికి చెప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతోంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతయ్యే కార్ల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా?
క్రాష్ టెస్టులో కారు పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ పరీక్షించి రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే కారు యువకులకు, పిల్లలకు ఏ విధమైన రక్షణ అందిస్తాయనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం భారత్‌లో సేఫ్టీ సెన్సిటివ్ కార్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.
భారత్ ఎన్‌సీఏపీ కార్యక్రమానికి మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టయోటా వంటి వాహన తయారీ దారులు ఇప్పటికే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పకుండా కార్లు మరింత భద్రతా ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రమాదంలో మరణించే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment