రోజురోజుకు ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే బిఎస్4 పోయి బిఎస్6 ప్రమాణాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ పరిశ్రమ బిఎస్7 ఉద్గార నిబంధనలకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీని గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండకూడదని అన్నారు.
బీఎస్7 వాహనాల తయారీకి సంబంధించి సన్నాహాలు తప్పకుండా వేగవంతం చేయాలని గడ్కరీ అన్నారు. యూరోపియన్ మార్కెట్లో యూరో 7 ప్రమాణాలు 2025 నుంచి అమలులోకి రానున్నాయి. కాబట్టి భారతదేశంలో తయారయ్యే కార్లు కూడా వాటికి ధీటుగా ఉండాలని, దీనికోసం తప్పకుండా బిఎస్7 రూల్స్ పాటించాలని అన్నారు. 2027 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
వాహన తయారీ సంస్థలు తమ వాహనాలలోని ఇంజిన్‌లను రీట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఇవి యూరో7 ప్రమాణాలను దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ హవా దూసుకెళ్తుంది. బిఎస్7 రూల్స్ అన్నీ కూడా బిఎస్6 కంటే మరింత కఠినంగా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు.
బిఎస్7 ప్రమాణాలతో వాహనాలు తయారైన తరువాత వెహికల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంజిన్‌లను రీచున్ చేసినప్పుడు సంస్థలు కూడా కొంతమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే.. డీజిల్ వాహనాల ధరలు పెరిగే సూచలను ఉన్నాయి. మార్కెట్లో డీజిల్ వాహనాల డిమాండ్ తగ్గిదే.. భవిష్యత్తులో ఈ వాహనాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment