tomorrow
-
రేపటి నుంచి అలెక్సా పనిచేయదు! కానీ..
ఆధునిక కాలంలో అమెజాన్ అలెక్సా, యాపిల్ హే సిరి వంటి వాయిస్ అసిస్ట్ సర్వీకులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. అయితే అలెక్సా త్వరలో కొన్ని డివైజ్‌లలో పనిచేయదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ అలెక్సా సర్వీసుకు సంబంధించి సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇది గూగుల్ నెస్ట్ కిట్‌పై పనిచేయదని సమాచారం. రేపటి నుంచి (2023 సెప్టెంబర్ 29) గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే కొత్త Google Nest స్కిల్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లోని అలెక్సా యాప్ ఓపెన్ చేసి, ట్యాప్ మరి మీద క్లిక్ చేయాలి. తరువాత స్కిల్ అండ్ గేమ్స్ సెలక్ట్ చేసుకుని, ఫైండ్ యువర్ స్కిల్స్ ఎంచుకోవాలి. ఫైండ్ నెస్ట్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసి డిసేబుల్ చేయాలి. * అలెక్సా యాప్‌లో ఉన్న నెస్ట్ డివైజెస్ అన్నీ రిమూవ్ చేయాలి. గూగుల్ హోమ్ యాప్‌లో న్యూ గూగుల్ నెస్ట్ అలెక్సా స్కిల్ ప్రారంభించడానికి, ముందుగా యాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి + గుర్తు మీద ట్యాప్ చేయాలి. అందులో సర్వీస్ ఎంచుకుని అందులో అమెజాన్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అలెక్సా యాప్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. అమెజాన్ ఎకో స్పీకర్ లేదా డిస్ప్లేను కలిగి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. రిషి సునాక్.. బ్రిటన్‌కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్‌కు బస ఏర్పాట్లు చేశారు. జో బైడెన్.. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్‌కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్‌కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్‌కు రానున్నారు. జస్టిన్ ట్రూడో.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్‌కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్‌కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్‌కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. -
రేపు నితిన్ గడ్కరీ ప్రారంభించనున్న కొత్త ప్రోగ్రామ్ ఇదే..
Bharat NCAP: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (భారత్ ఎన్సీఏపీ) రేపు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్ ఎన్సీఏపీ భారతీయ ఆటోమొబైల్స్ భద్రతా ప్రమాణాలను పెంచడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రతిష్టతను పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా రానున్న కొత్త ఉత్పత్తులు (కార్లు) మరింత పటిష్టమైన భద్రతను కలిగి ఉంటాయి. దీనికింద కార్లను క్రాష్ టెస్ట్ చేసి వాటికి సేఫ్టీ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది. సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కారు భద్రతను నిర్థారిస్తారు. ఇది కార్ల కొనుగోలుదారులకు, భారత ఆర్థిక వ్యవస్థ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశంలో తయారయ్యే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యత లేని కార్లుగా పరిగణించబడుతున్నాయి. దీనికి చెప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతోంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతయ్యే కార్ల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా? క్రాష్ టెస్టులో కారు పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ పరీక్షించి రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే కారు యువకులకు, పిల్లలకు ఏ విధమైన రక్షణ అందిస్తాయనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం భారత్‌లో సేఫ్టీ సెన్సిటివ్ కార్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. భారత్ ఎన్సీఏపీ కార్యక్రమానికి మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టయోటా వంటి వాహన తయారీ దారులు ఇప్పటికే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పకుండా కార్లు మరింత భద్రతా ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రమాదంలో మరణించే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని చెబుతున్నారు. -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్‌కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
TS: పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడిందని... దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
నిన్న నేడు రేపు
నేడులో ఉన్న మనం నిన్నను దాటుకుని వచ్చాం. నేడునూ దాటుకుని మనం రేపులోకి వెళ్లాల్సి ఉంది. నిన్న, నేడులకన్నా మనకు రేపు ఎంతో ముఖ్యం. నిన్న, నేడుల్లో లాభం, నష్టం, సుఖం, శోకం, ప్రగతి, పతనం మనకు వచ్చి ఉంటాయి. వీటి ప్రాతిపదికన మనం రేపులోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా మనం తప్పకుండా రేపు వైపు కదలాలి; కదులుదాం. నిన్నవైపు కాదు మన చూపు రేపు వైపు ఉండాలి. నేడులో ఉండిపోవడం కాదు మనం రేపువైపు నడవాలి. రేపువైపు చూపు వేసి మనం కదులుతూ ఉండాలి. మన చూపు నిండా, మన కదలిక నిండా చేవను మనం నింపుకోవాలి. మనలో నీరసం ఉంటుంది. దాన్ని నిన్న మరిచిపోయినా నేడు నేల రాసేసుకోవాలి. మనలో చెడ్డతనం ఉంటుంది. అది నిన్నటి నుంచి నేడులోకి వచ్చేసినా రేపులోకి రాకుండా దాన్ని కూలదోసుకోవాలి. మనలోని మూర్ఖత్వాన్ని నేడు తప్పకుండా విడిచి పెట్టెయ్యాలి. మన జాడ్యాలు మన రేపులోకి రాకుండా నేడు మనమే వాటిని మట్టు పెట్టుకోవాలి. నిన్న మనకు మనమే వేసుకున్న కుత్సితాల సంకెలల్ని నేడైనా తెంచేసుకోవాలి. నిన్న మనలోకి వచ్చి చేరి నిలిచి ఉన్న మత్సరభావాల విషాన్ని నేడు పూర్తిగా ఒంపేసుకోవాలి. నిన్నకు నేడు కొనసాగింపు కాకూడదు. నిన్నకు నేడు కొనసాగింపు అయి ఉంటే అది తప్పు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తప్పు కొనసాగకుండా నేడు మనం జాగ్రత్తపడాలి. జాగరూకతతో మనం రేపును స్పృశించాలి. నిలిచి ఉండే చెలిమితోనూ, నిజమైన నైజంతోనూ, నిర్మలమైన హదయంతోనూ, చల్లటి ఆశయాలతోనూ, చక్కని ఆలోచనలతోనూ సత్ప్రవర్తనతోనూ మనం రేపులోకి వెళ్లాలి. మన నిన్నలో, నిన్న మనలో అవి లేకపోయినా రేపు అవి మనకు ఎంతో అవసరం అని నేడైనా గ్రహించి మనం రేపులోకి వెళ్లాలి. నిన్న మనం ఎలా ఉన్నా, నేడు మనం ఎలా ఉంటున్నా రేపు మాత్రం మనం గొప్పగా ఉండాలి; అధమపక్షం రేపు మనం బావుండాలి. అందుకు నేడు మనం సిద్ధపడాలి. రేపులో మనం మెరుగ్గానూ, మేలుగానూ ఉండేందుకు మనం నేడు తయారుగా ఉండాలి; మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలవాటుపడ్డ సోమరితనానికి, అభిప్రాయాలకూ నేటితో స్వస్తి పలికి, ఉండాల్సిన ఉత్సాహానికి, అవగాహనకూ నేడైనా నాంది పలికి అభ్యున్నతికి ప్రస్తావన కలిగేందుకు, కల్పించుకునేందుకు రేపులోకి వెళ్లాలి మనం. పనిచేస్తూ ప్రయోజనాన్ని పొందే చేతులతో, మెరిసే తలపులు కలిగే మస్తిష్కంతో భేషజాల పరదాలు తొలగించుకుని, వేషాలు పోయే గుణాన్ని మరచిపోయి మనం రేపులోకి చేరాలి. పరుల బాధను పట్టించుకోవడం పాపం కాదు; తోటి వాడికి మంచి చెయ్యడం నేరం కాదు; సాటివాడికి చేయూతను ఇవ్వడం దోషం కాదు కాబట్టి వాటిని చేపట్టడానికి కూడా మనం రేపును వేదిక చేసుకోవాలి. రేపైనా మనల్ని మనం నరులం అని నిరూపించుకోవాలి. మన కోసం, మన రాక కోసం వేచి ఉన్నది సుమా రేపు అన్నది; లేచి వెళ్లి అందుకోవడానికే మనం ఉన్నది. మనంత మనంగా, మనం మనంగా నిజమైన మనుషులంగా జీవం ఉన్నవాళ్లంగా జీవించేందుకుగా మనం రేపును అందుకోవాలి. మన రాగం, మన యాగం, మన త్యాగాలతో గణనీయమైన మనుగడను సాధించేందుకు, ఆపై మన గానం, మన ధ్యానం, మన జ్ఞానాలతో స్మరణీయమైన మనుషులం అయ్యేందుకు మనం రేపును ఆవాహన చేసుకోవాలి. ‘బెదురు లేకుండా కదులుతూ ఎదురు వెళ్లి రేపులోకి ప్రవేశిద్దాం; ఏ మాత్రమూ చెదిరిపోకుండా ఎదిగేందుకు విఫలం అవకుండా రేపుకు ప్రయుక్తం అవుదాం‘. – రోచిష్మాన్ -
ఏపీ: రేపు రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ
-
రేపు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ..
-
సభా పర్వం : రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
-
Cabinet Meeting: రేపు కేంద్ర కేబినెట్ భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం రోజున కొత్త కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, కేంద్ర మంత్రుల పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. వీరంతా బుధవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. -
రేపు విశాఖ నగరానికి సీఎం జగన్ రాక
సాక్షి, ప్రతినిధి, విశాఖపట్నం: పాకిస్థాన్‌పై విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతి«థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. విశాఖ రామకృష్ణా బీచ్‌లో ఈసారి సీఎం సమక్షంలో నేవీ డే విన్యాసాలు నిర్వహించనున్నారు. తూర్పు నౌకాదళ(ఈఎన్సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఖరారైంది. ఆ మేరకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం నాటి పర్యటన షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. విమానంలో మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 3.40 గంటలకు సర్క్యూట్ హౌస్‌కు విచ్చేస్తారు. సాయంత్రం 4 గంటలకు సర్క్యూట్ హౌస్ నుంచి నేవీ విన్యాసాలు జరిగే ఆర్కే బీచ్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ జరిగే నేవీ డే విన్యాసాలు, ప్రదర్శనలను తిలకిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్ హౌస్‌కు చేరుకుంటారు. 6.10 గంటలకు నేవీ హౌస్‌కు బయలుదేరతారు. 6.20 నుంచి 7 గంటల వరకు అక్కడ జరిగే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడు గంటలకు నేవీ హౌస్ నుంచి నేరుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు విమానంలో బయలుదేరి 8.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8.40గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు సీఎం దంపతులకు ఆహ్వానం నేవీ డే ఉత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈఎన్సీ చీఫ్ జైన్ కోరారు. ఇటీవల అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలకు సీఎం దంపతులు విచ్చేయాలని ఈఎన్సీ చీఫ్ అభిలషించారు. -
రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం నగరానికి రానున్నారు. ఉదయం 9.50 గంట లకు విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎన్ఎస్టీఎల్ చేరుకొని అక్కడ నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొం టారు. అక్కడి నుంచి 12 గంటలకు బయలు దేరి సాగరనగర్‌లోని తన స్నేహితుడు ఇంటికి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు కిర్లంపూడి లే అవుట్‌లోని ఆయన నివాసానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9 గంటలకు నివాసం నుం చి బయలదేరి రోడ్డు మార్గం ద్వారా గంభీ రం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి 12 గంట లకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరితారు.. -
రేపు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
-
ఇడుపులపాయలో జోరందుకున్న ఏర్పాట్లు
-
రేపు వైఎస్ఆర్ ఎనిమిదో వర్ధంతి
-
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
-
రేపటి నుంచి నాటికల పోటీలు
కాకినాడ కల్చరల్ : కళాకారులను ప్రోత్సహిస్తూ, నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి బాబ్జి, పంపన దయానంద బాబు తెలిపారు. స్థానిక యంగ్మెన్స్ క్లబ్ సమావేశపు మందిరంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థల సౌజన్యంతో ఈ నెల 4 నుంచి 6 వరకూ స్థానిక సూర్యకళామందిర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కరప గ్రామంలోని శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 4న గోవాడ క్రియేషన్స్ వారి ‘రచ్చబండ’ నాటిక, ఎస్ఎన్ఎం క్లబ్ వారి ‘గడి’ నాటిక, 5న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక రూపకల్పన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’ నాటిక, మూర్తి కల్చరల్ అసోసియేషన్ వారి ‘అంతిమ తీర్పు’ నాటిక, 6న ఉషోదయ కళానికేతన్ వారి ‘గోవు మాలచ్చిమి’ నాటిక, శ్రీసాయి ఆర్ట్స్ వారి ‘చాలు–ఇకచాలు’ నాటిక, అభినయ ఆర్ట్స్ వారి ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నట్టు వారు తెలిపారు. శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్ర నాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్య బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులకు ‘సాహితీ కళాభిజ్ఞ’ పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు ‘సేవారత్న’ ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో బాజిబోయిన వెంకటేష్ నాయుడు, భీమశంకర్, తురగా సూర్యారావు, టి.ఎల్.ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
బిగుస్తున్న బడుగు పిడికిళ్లు
-శ్రామికుల బతుకులతో బాబు సర్కారు చెలగాటం -వివిధ పథకాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్ట విధానాలు -నిరసనగా పోరుపథంలో కదం తొక్కుతున్న కార్మికులు -రేపు కలెక్టరేట్ ముట్టడి మానవ మనుగడకు, పురోగతికి మూలం శ్రమ. సమాజ పరిణామ క్రమంలో మనుషుల మధ్య అంతరాలకు ప్రధాన కారణం సంపద కొంత మంది వద్దే పోగుబడుతుండడంతో అత్యధికులు పేద, మధ్య తరగతులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వర్గాలకు ఎంతోకొంత ఊతంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే సంక్షేమ పథకాలు. ఆ కోవలోవే అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆశా వర్కర్ల వ్యవస్థ. అయితే..ఆ కనీస శ్రేయస్సుకు శ్రమించే వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి, ఆ వ్యవస్థల్లో పని చేసే శ్రామికుల జీవితాలను చీకటిలోకి నెట్టజూస్తోంది చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం. అలాగే ఎంవీ యాక్ట్‌లో సవరణల పేరుతో లక్షలాదిమంది ట్రాన్స్పోర్ట్ కార్మికులను వేధింపులకు గురిచేసే దిశగా అడుగులు వేస్తోంది. నిధుల మళ్లింపుతో భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు భంగం కలిగిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలనూ ఊబిలోకి నెడుతోంది. సర్కారు కర్కశ వైఖరికి నిరసనగా బడుగుజనం పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏకమవుతున్న శ్రామిక శక్తి ఈ నెల మూడున చలో కలెక్టరేట్ పేరుతో ముట్టడికి పూనుకుంటోంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలు, వేదనలు, డిమాండ్లపై ప్రత్యేక కథనం.. -కపిలేశ్వరపురం (మండపేట) వేలాదిమంది స్కీం వర్కర్లు.. జిల్లాలో ఆశ వర్కర్లు 4,000 మంది, సెకండ్ ఏఎన్ఎంలు 700 మంది, టీబీ కంట్రోల్ ప్రోగ్రాం సిబ్బంది 150 మంది, 24 గంటల పీహెచ్‌సీల్లో స్టాఫ్ నర్సులు, కంటింజెంట్ వర్కర్లు 140 మంది, హెచ్ఐవీ రోగులకు సేవలందించే ఏపీ సాక్స్‌లో కౌన్సిలర్లు, స్టాఫ్‌నర్సులుగా 100 మంది, అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ నిమిత్తం కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరంలలోని ఎస్ఎన్ కేర్ యూనిట్స్, ఎన్ఆర్సీలలో స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ గార్డులుగా 100 మంది, ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య సేవలందించే ఆయుష్ విభాగంలో 100 మంది, ఆర్బీఎస్కే పథకం వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫిజియో థెరపిస్టులుగా 200 మంది, హెల్త్ మిషన్ కార్యాలయాల్లో ఉద్యోగులుగా పది మంది, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో 150 మంది, వైద్యాధికారులుగా 200 మంది, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులుగా 8,000 మంది, 5,200 అంగన్వాడీ కేంద్రాలున్న ఐసీడీఎస్‌లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలుగా 10,500 మంది, మినీ వర్కర్లుగా 200 మంది సేవలందిస్తున్నారు. ప్రీ స్కూల్స్ పేరుతో అంగన్వాడీ కేంద్రాల మూసివేత దిశగా.. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. జిల్లాలోని కేంద్రాల్లో సుమారు 10,500 మంది కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో కార్యకర్తకు రూ.10 వేలు, ఆయాకు రూ.8 వేలు ఇస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కార్యకర్తకు రూ.7 వేలు, ఆయాకు రూ.4 వేలు వేతనంగా ఇస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు, ఐదు నెలలుగా కేంద్రాల అద్దె బిల్లు, ఏడాదిగా పుల్లల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ఎత్తేసి ప్రీ స్కూల్స్‌గా మార్చి కార్యకర్తలు, ఆయాలను క్రమ క్రమంగా తొలగించాలనే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలను మూసేశారు. రూ.4 వందలతో నెట్టుకొస్తున్న ఆశ వర్కర్లు జిల్లాలో సుమారు నాలుగు వేల మంది వరకూ ఉన్న ఆశ వర్కర్లను గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య, వైద్య సదుపాయాలను దగ్గర చేసేందుకు ఉనికిలోకి తీసుకొచ్చారు. తీరా వీరికి ప్రభుత్వం ఏ విధమైన వేతనాన్నీ ఇవ్వడంలేదు. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడల్లా కొంత సొమ్ము ముట్ట చెబుతుండటంతో నెలంతా కష్టపడినా వీరికి రూ.నాలుగు వందల నుంచి రూ. వెయ్యి వరకూ కూడా రాని దుస్థితి. తెలంగాణలో వీరికి రూ.ఆరువేల వేతనాన్ని చెల్లిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల మెడపై వేలాడుతున్న కత్తి ప్రభుత్వం ఇచ్చేది అరకొరే అయినా అప్పు చేసో, అరువు తెచ్చో బడి పిల్లలకు అన్నంపెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల మెడపై ఏజెన్సీ ఎత్తివేత కత్తి వేలాడుతోంది. పాఠశాలల్లో వంట చేసి వడ్డించే పద్ధతికి బదులు 25,000 మంది పిల్లలకు ఒక కేంద్రంగా డివిజన్ స్థాయిలో వంటశాల ఏర్పాటు చేసి అక్కడే అన్నం వండి పాఠశాలలకు తీసుకెళ్లి వడ్డించే పద్ధతికి చంద్రబాబు తెరతీశారు. అలా చేస్తే జిల్లాలో ఏజెన్సీలను నిర్వహిస్తున్న సుమారు ఎనిమిది వేల మంది ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి తమిళనాడులో రూ.ఐదు వేల వేతనాన్ని ఇస్తుండగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రూ.750, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 వెరసి రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. నిధుల మళ్ళింపుతో సంక్షేమం కుదింపు భవన నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ 33 రకాల పనులు చేసేవారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు. 318/2011 నంబరుగల కేసులో 2013 నవంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పినా చంద్రబాబు తన పేరుమీద పథకాలను ప్రవేశపెట్టి, వాటి నిర్వహణ కోసం ఈ నిధులను మళ్ళిస్తున్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్ర జాప్యమవుతోంది. మలినం ఎత్తిపోసే వారిపైనా కొరవడ్డ కనికరం.. జిల్లాలో 1100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్వాచర్, బిల్ కలెక్టరు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు రూ.వెయ్యి నుంచి రూ.ఏడు వేల లోపే జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో :151 ప్రకారం స్వీపర్లకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17 వేల వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలలు తరబడి »బకాయిలు పెడుతున్నారు. ఆదాయం ప్రభుత్వానికి.. శిక్షలు డ్రైవర్లకి.. కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికల్ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు డ్రైవర్ల పాలిట సమ్మెటలుగా మారాయి. ట్రాన్స్‌పోర్టు రంగం ద్వారా సమకూరే రూ. కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లనే బాధ్యుల్ని చేస్తూ శిక్షలను తీవ్రతరం చేయడం ఈ సవరణల్లో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లాలోని వేలాది మంది డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. శ్రామికుల డిమాండ్లు ఇవే.. -వివిధ పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి. -ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్చార్జ్,డ్ పార్ట్ టైం పద్ధతుల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ, పింఛను సౌకర్యాలన్నీ కల్పించాలి. -పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలి. -మోటారు వెహికల్ చట్టంలోని ప్రమాదకర సవరణలను ఉపసంహరించుకోవాలి. -చంద్రన్న బీమా పథకానికి మళ్ళించిన రూ.241 కోట్లను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. -భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి. -అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ఎత్తివేత ఆలోచనను మానుకోవాలి. -పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన సదుపాయాలు కల్పించి, శ్రమకు తగిన వేతనం చెల్లించాలి. చాకిరీ ఎక్కువ, జీతం తక్కువ.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. అందుకే చలో కలెక్టరేట్ ఉద్యమం పేరిట కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నాం. -జి.బేబిరాణి, శ్రామిక మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు, కాకినాడ చంద్రన్న పథకానికి మా నిధులు.. చంద్రబాబు తన సొంత పేరుతో రూపొందించిన చంద్రన్న బీమా పథకానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన నిధులను మళ్ళిస్తున్నారు. ఈన్ని ఆందోళనల ద్వారా ప్రజల్లోకెళ్ళి ప్రభుత్వ విధానాలను ఎండగడతాం. -చెక్కల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ -
రేపు నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్న ప్రిన్సిపాల్ పెద్దాపురం : జవహార్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశానికి ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాదుతూ జిల్లాలోని సుమారు 272 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దాపురం నవోదయ విద్యాలయలోనే పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు విద్యార్థులందరికీ పోస్టు ద్వారా పంపామని, ఏ కారణం చేతనైనా అందని విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రానికి ఒక అటెస్టెడ్ పాస్‌పోర్టు సైజు ఫోటో తీసుకుని 23 సాయంత్రం లోగా నవోదయ విద్యాలయలో సంప్రదించి డూప్లికేట్ హాల్ టికెట్ పొందాలని సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రవేశ పరీక్షపై ఎటువంటి సమాచారం కోసమైనా 08852–241354 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : జిల్లా వ్యాప్తంగా సబ్‌డివిజనల్ ఇంజనీర్ పరిధిలోని అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీ బుధవారం నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ రోడ్‌షో మేళా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చల్లా శివభాస్కర్ సోమవారం తెలిపారు. ఈ మేళా 24వ తేదీవరకు నిర్వహిస్తామన్నారు. ఈ మేళాలో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ కనెక్షన్లు కూడా ఇస్తామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన వెబ్‌కౌన్సెలింగ్, పర్ఫార్మెన్స్ పాయింట్లు, రేషలైజేషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఫ్యాప్టో, జాక్టో పిలుపుమేరకు ఈ బుధవారం తలపెట్టిన డీఈఓ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలని నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. పర్ఫార్మెన్స్ పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదని, ఇప్పటిదాకా ఖాళీల సంఖ్య, వివరాలపై ఉపాధ్యాయులకు అవగాహన రాలేదని పేర్కొన్నారు. ప్ర భుత్వ తీరుకు నిరసనగా బుధవారం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని దిగ్భందిస్తామని వివరించారు. -
రేపు ఒంగోలులో YSRCP జిల్లా ప్లీనరీ
-
రేపు ఒంగోలులో YSRCP జిల్లా ప్లీనరీ
-
ఫైనల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి