అనంతపురం టౌన్ : ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు లేదా బుక్కపట్నం మండలాల్లో ఏర్పాటు చేసే సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. సీఎం పాల్గొనే గ్రామాన్ని మంగళవారం ఖరారు చేయనున్నారు.